SERVICE RULES

ఉద్యోగ,ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సర్వీసు అంశాలు:

♨ లీను: ఒక పోస్టుపై ప్రభుత్వ ఉద్యోగి కి ఒక నియమిత కాలం వరకు గల హక్కు.ఇది శాశ్వత పోస్టు లేదా టెన్యూర్ పోస్టు అయినా ఉంటుంది. FR-9(13)

♨ ఫారిన్ సర్వీసు: ఒక ఉద్యోగి ప్రభుత్వ అనుమతితో సంచిత నిధి నుండి కాక,ఇతర వనరుల ద్వారా భత్యo పొందుతూ చేయు సేవ. FR-110-127

♨ 45 సం॥ నిండిన వారు కనీసం సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొని వారికి ప్రమోషన్ కల్పించవచ్చు.

(G.O.Ms.No.225 GAD Dt:!18-05-1999)

♨ ఉద్యోగిని సరైన కారణాలు లేకుండా సస్పెండ్ చేస్తే,దానికి బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టవచ్చు.

(Memo.No.2213/Ser.C/93-6 GAD Dt:30-11-1996)

♨ ఉద్యోగిని సస్పెన్షన్ లో గరిష్ఠంగా 2 సం॥ మించి ఉంచరాదు.

(U.O.Note.No.2776/SCE/98-1 GAD Dt:03-12-1998)

♨ సస్పెన్షన్ మూలంగా ఏర్పడిన ఖాళీని వేరే వారితో భర్తీచేయరాదు.

(G.O.Ms.No.189 GAD Dt:20-04-1999)

♨ వికలాంగ ఉద్యోగులకు కన్వేయన్స్ అలవేన్స్ ను CL మినహా ఏ రకమైన సెలవులో ఉన్నా లేదా దసరా,సంక్రాంతి,వేసవి సెలవుల కాలంలోనూ కాన్వేయన్స్ అలవెన్స్ చెల్లించరాదు.

(G.O.Ms.No.226 Dt:05-09-1981)

👉సరెండర్ లీవు (Surrender Leave) కాలానికి పూర్తివేతనం,ఇతర అలవెన్సులు మంజూరు చేయబడతాయి.IR చెల్లించబడదు. తెలంగాణ ఇంక్రిమెంట్ చెల్లించబడుతుంది.

(Memo No.31948 F&P తేది:12-08-1998)

(Memo No.3572/107/A1/Admn.I/2014 Dt:15-12-2014)

👉మృత శిశువు జన్మించినా,జన్మించిన తరువాత శిశువు మరణించినా ప్రసూతి సెలవు (Maternity Leave) కు అర్హులు.

(L.Dis.No.1941 Dt:11-06-1990)

👉ప్రసూతి సెలవులో (Maternity Leave) ఉండి బదిలీ,పదోన్నతి పొందిన సందర్భంలో లీవ్ పూర్తయిన అనంతరం నూతన పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.

(Rc.No.29 Dt:25-01-2003)

(Rc.No.3750 Dt:13-08-2009)

👉LTC లో ప్రతి 4 సం॥ కాలం బ్లాకు పీరియడ్ గా నిర్ణయించబడుతుంది.మొదటి 2 సం॥ స్వస్థలం (Home Town) పోవుటకు ,తదుపరి 2 సం॥ కాలం రాష్ట్రంలో ఏ ప్రదేశమునకు గాని లేదా స్వస్థలం (Home Town) నకు గాని,సర్వీసు మొత్తంలో ఒకసారి దేశంలో ఏ ప్రదేశానికైనా LTC సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును. 3,500 కి.మీ లు మించకుండా ప్రయాణం చేయాలి.రూ.18,750 చెల్లిస్తారు.బ్లాకు పీరియడ్ ను ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా విడుదల చేయాలి.

(G.O.Ms.No.76 Dt:13-05-2015)

👉కారుణ్య నియామకాలలో భాగంగా 18 సం॥ కన్నా తక్కువ వయస్సున్న వారిని ఉద్యోగంలో నియమించుటకు అలాగే 34 సం॥ మించియున్న వయస్సు వారిని ఉద్యోగంలో నియమించుటకు అవకాశం లేదు.అయితే భార్య/భర్త లకు ఉద్యోగం ఇచ్చు సందర్భంలో వారి గరిష్ట వయస్సు 45 సం॥ గా నిర్ణయించడం జరిగింది.

(G.O.Ms.No.759 GAD Dt:06-10-2007)

(G.O.Ms.No.144 GAD Dt:15-06-2004)

👉సస్పెండ్ అయిన ఉద్యోగికి జీవనాధార భత్యము (Subsistence Allowance) తిరస్కరించరాదు.అట్టి చెల్లింపులు తిరస్కరించడం శిక్షించదగ్గ నేరం.

(Govt.Memo.No.29370/A/458/FR-II/96 F&P Dt:14-10-1996)

*FUNDAMENTAL RULES*

F.R. 12(a)1 : శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూ, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.

F. R. 12(బి) : ఒక govt employee ని ఒకే సారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్ట్ లలో నియమించరాదు.

F. R. 12(c) : ఉద్యోగి లీవ్ లో ఉంటే ఆ పోస్ట్ లో మరొకరిని appoint చేయకూడదు.

F. R. 15(b) : ఉద్యోగి 1 డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.

F. R. 18 : govt appoint చేస్తే తప్ప, ఏ employee కి ఒకే సారి 5y కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయకూడదు.

F. R.18(a) : 1year కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవు లో ఉంటే, అతను రాజీనామా చేసినట్లు లెక్క.

F.R.18(బి) : పర్మిషన్ ఉన్నా /పర్మిషన్ లేకుండా 5y కంటే ఎక్కువ కాలం లీవ్ లో ఉంటే అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

F. R.18(c) : 5year కంటే ఎక్కువ కాలం ఫారిన్ సర్వీస్ లో ఉన్నపుడు అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు ల

F. R.22(a) : ప్రస్తుత పోస్ట్ విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులు గల పోస్ట్ లోకి నియమించబడినప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన స్కేలు లో ఫై స్టేజి వద్ద స్థిరీకరి0చబడుతుంది.

F. R.22(a)(iv) : ఒక ఉద్యోగి APPSC ద్వారా మరొక పోస్ట్ కి సెలెక్ట్ అయినపుడు పాత పోస్ట్ లోని వేతనాన్కి తక్కువ కాకుండా కొత్తగా ఎంపిక ఐన పోస్ట్ లో వేతనం స్తిరీకరి0చబడును.కొత్త ఉద్యోగం లో చేరిన తేదీ నుంచి 1y తరువాత మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వబడును.ఇక పాత పోస్ట్ లోని ఇంక్రిమెంట్ డేట్ పోతుంది.

F. R.22(B) : ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్ కి పదోన్నతి పొందినప్పుడు, కింది పోస్ట్ లో పొందుతున్న వేతనానికి ఒక notional increment కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో ఫై స్టేజి వద్ద నిర్ణఇ0చాలి.పదోన్నతి వచ్చిన ఉద్యోగి 2 రకాల వేతన స్తిరీకరణ కై ఆప్షన్ కలిగి ఉంటాడు.అవి (a)పదోన్నతి వచ్చిన తేదీ (b)కింది పోస్ట్ లో ఇంక్రిమెంట్ తేదీ కి ఆప్షన్ ఇచ్చుకోవటం.

F. R.24 : వార్షిక ఇంక్రిమెంట్ యధాలాపంగా వస్తుంది. ఉద్యోగి ప్రవర్తన సంతృప్తి కరంగా లేకపొతే ఆతని ఇంక్రిమెంట్ అపి వేయవచ్చు.ఇలా అపి వేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు,అలా ఎంతకాలం అపి వేస్తున్నారో అలాగే with cumulative లేదా with out cumulative effect అన్న విషయం ఉత్తర్వుల లో తెలుపవలెను.

Ex ఒక ఉద్యోగి 1.6.10న ఇంక్రిమెంట్ తీసుకున్న తరువాత పనిష్మెంట్ గా 2 ఇంక్రిమెంట్ లు ఆపారు అనుకుందాం.

(a)with cumulative effectఈ విధంగా చేస్తే 1.6.13 నకు ఒకే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది.

(b)with out cumulative effectఈ విధంగా చేస్తే 1.6.13 నకు 3 వార్షిక increment లు వస్తాయి.అంటే 2 వార్షిక increments arrears కోల్పోయినట్లు.

F. R.26 : ఇంక్రిమెంట్ కి పరిగణింపబడే సర్వీస్ కి సంబందించిన షరతులు ఉన్నాయి.

ఒక టైం స్కేల్ లో పని చేసిన కాలం ఇంక్రిమెంట్ కి లెక్కించబడుతుంది.

ఐతే జీత నష్టపు సెలవు పెట్టి ఉంటే అంతకాలం వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది.

180 రోజుల వరకు వైద్య కారణాల తో జీత నష్టపు సెలవు వాడు కొన్నపుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారము Head of department లకు ఇవ్వబడినది.

F.R.26(a) : ఏదయినా పరీక్ష పాస్ అయిన0దు వల్ల ఉద్యోగికి ఏదయినా హక్కు లేదా మినహాఇ0పు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుండి మంజూరు అయినట్లు గా భావించాలి.

కొత్తగా ఉద్యోగం లో చేరిన లేదా ప్రమోషన్ పోస్ట్ లో చేరిన ఉద్యోగికి ఆతని వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలల కాలం పూర్తి కాకుండానే మంజూరు అవుతుంది.

ex: 19.12.73 నాడు ఉద్యోగం లో చేరిన ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 1.12.74 నకే మంజూరు అవుతుంది.

ఒక ఉద్యోగి రిటైర్ ఐన తేదీ మరుసటి రోజు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉన్నపుడు pentionery benifits కోసం notional మంజూరు అయినట్లు భావించి లెక్కించాలి.

ఐతే లీవ్ encashment వంటి వాటికి ఇది వర్తించదు.

F. R.44 : ఉద్యోగి లీవ్ లో ఉన్నపుడు 4 నెలల వరకు HRA పూర్తి గా మంజూరు చేయవచ్చును.అర్ద లేదా పూర్తి వేతన సెలవు మీద వున్న ఉద్యోగి HRA, అతడు సెలవు మీద వెళ్ళేటప్పటి వేతనం మీద లెక్కించబడుతుంది.

F.R.49 : govt ఒక ఉద్యోగి ని temporary గా 2 పోస్ట్ లకి నియమించవచ్చును.

F.R.49(a) : ఈ విధంగా 2 పోస్టులు చూస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో, ఆ వేతనం మంజూరు చేయవచ్చు.

ఉద్యోగిని అదనపు పోస్ట్ ను కూడా నిర్వహించమన్నపుడు మొదటి 3 నెలల వేతనం లో 1/5 భాగం ,next 3 నెలలు 1/10 భాగం అలవెన్సు చెల్లించబడుతుంది.

*************************

@ సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000 చెల్లిస్తారు.

(G.O.Ms.No122 తేది:11-04-2016)

@ మరణించిన ఫామిలీ మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs.20,000 చెల్లిస్తారు.పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు కూడా మొత్తాన్ని చెల్లిస్తారు.

(G.O.Ms101 తేది:21-04-2015)

@ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం Rs.10,000 చెల్లిస్తారు.

(G.O.Ms.No.38 తేది:28-05-2013)

@ ఫామిలీ పెన్షనర్ చనిపోతే కుటుంబంలో ఎవరూ లేనిచే వారసులకు చెల్లిస్తారు.

(G.O.Ms.No.136 తేది:29-06-2011)

@ నాన్ గజిటెడ్ ఉద్యోగులు,ఉపాధ్యాయుల పిల్లలకు LKG నుండి ఇంటర్ వరకు Rs.2500 ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారు.

(G.O.Ms.No.27 తేది:24-09-2015)

@ ప్రాధమిక,ప్రాధమికోన్నత,ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవేన్స్ చెల్లిస్తారు.

(G.O.Ms.No.56 తేది:02-05-2015)

@ ఉద్యోగులుగా పనిచేయు భార్య,భర్తల ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే Rs.7500 వడ్డీలేని ఫేస్టివల్ అడ్వాన్స్ మంజూరు చేస్తారు.

(G.O.Ms.No.39 తేది:15-04-2015)

@ PHC Allowance బేసిక్ పే పై 10% లేదా max Rs.2000 మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.103 తేది:24-07-2015)

@ అంధ ఉపాధ్యాయులకు రీడర్ అలవెన్స్ మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.04 తేది:19-03-2016)

సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్

# FR-55 ప్రకారం సస్పెండు అయిన ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదు.

# సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూన్నట్లయితే అతనికి పదోన్నతి(Promotion) కల్పించటకు అవకాశము లేదని ప్రభుత్వం G.O.Ms.No.257 తేది:10-06-1999 ద్వారా తెలియజేసింది.

# ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో పదవీ విరమణ వయస్సు వచ్చినయెడల అతనిపై ఉన్న క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్న యెడల అట్టివానికి భంగం కలగకుండా ఆ ఉద్యోగిని పదవీ విరమణ గావించవలెను.

(G.O.Ms.No.64 F&P తేది:01-03-1979)

(Section 3 of A.P.Public Employment of age of super annuation Act 1984)

# సస్పెన్షన్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు పుర్తిగాకుండా అసంపూర్తిగా ఉన్న సమయంలో సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి చనిపోయిన యెడల,సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించవలెనని ప్రభుత్వం G.O.Ms.No.275 F&P తేది:08-08-1997 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

# AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లోని రూలు.30 ప్రకారం సస్పెన్షన్ ఉన్న ఉద్యోగి క్రమశిక్షణా చర్యల గురించి విచారణ పూర్తికాకముందే ఏ కారణము చేతనైన తన పదవికి రాజీనామా చేసిన యెడల అట్టి రాజీనామా అంగీకరించకూడదు.

# రెండు సం॥ కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి యొక్క క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో పెడుతూ వెంటనే సర్వీసలోకి పునరుద్దరించవలెను. కొన్ని ప్రత్యేక పరిస్థితులలలో మాత్రమే సస్పెన్షన్ కొనసాగిన్చవచ్చు.

(G.O.Ms.No.526 GAD తేది:19-08-2008)

# సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి జీవనాధారంగా వున్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి,అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం FR-53 లోని నియమ నిబంధనలకులోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది.

# సస్పెండ్ అయిన ఉద్యోగిని తిరిగి సర్వీసులో పునరుద్దరించే Resistance)సందర్భంలో జారీచేయవలసిన ఉత్తర్వుల ఫారం ప్రభుత్వం G.O.Ms.No.82 GAD తేది:01-03-1996) ద్వారా నిర్దేశించింది.

# సస్పెండ్ అయిన ఉద్యోగి తాను సస్పెండ్ అయిన తర్వాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/వ్యాపారం గాని యితరత్రా వ్యాపకం గాని చేయటం లేదని ధృవీకరణ పత్రము అధికారికి అందజేయవలెను.

# జీవనాధార భత్యము సస్పెండ్ అయిన ఉద్యోగికి తిరస్కరించరాదు. జీవనాధార భత్యము(Subsistance Allowance) చెల్లింపులు తిరస్కరించటం శిక్షించదగ్గ నేరము.

(Govt.memo.no.29730/A/458/A2/FR-II/96/F&P తేది:14-10-1996)

# సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీలో లేని కాలం(Non Duty) గా పరిగణించినప్పుడు ఉద్యోగి అభ్యర్ధనమేరకు సెలవుగా మార్పు (Convert) చేసినపుడు అతని సెలవు జీతములో నుంచి అతనికి ఇదివరకే చెల్లించియున్న జీవనభృతి లో మొత్తం రికవరీచేయాలి.

# ఉద్యోగిని చిన్న కారణాల వల్ల న్యాయ సమ్మతము గాని సస్పెండ్ చేసే బదులు అతనిని బదిలీచేయవచ్చు. అట్టి బదిలీ కాబడిన ఉద్యోగి బదిలీ కాబడిన కొత్త స్థానంలో చేరకుండా సెలవు పెట్టిన యెడల అట్టి సెలవు మంజూరుచేయకూడదు.

(Govt.circular.memo.no.595SP/B/2000 తేది:21-09-2000 & Govt.memo.no.1733/ser.C GAD 03-08-1967)

# ఉద్యోగులను సర్వసాధారణమైన సామాన్య కారణాలపై అనవసరంగా సస్పెండు చేయకూడదు.ఆ విధంగా సస్పెండు కాబడిన ఉద్యోగికి జీవనాధార భృతి చెల్లించటమే కాకుండా,అతని సేవలు కూడా ప్రభుత్వం పోగొట్టుకుంటుoది. అందువలన అనవసర కారణాల వల్ల ఉద్యోగిని సస్పెండు చేయకూడదు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

(Govt.memo.no.2213/ser.C/66-1 GAD తేది:30-11-1966 & memo no.4993/police-C/69-1 తేది:08-12-1969

*********************

*ఆంధ్రప్రదేశ్ సెలవు నియమాలు, 1933*

*AP లీవ్ రూల్స్ 4.10.1933 నుండి అమలులోకి వచ్చాయి.. సెలవు నిబంధనలు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. కార్యాలయాలు / సంస్థలు / సంఘాలు మరియు సెలవు శాఖ(వెకేషన్ డిపార్ట్మెంట్) లో పనిచేసే ఉద్యోగులతో సహా స్థానిక సంస్థలు.*

*ప్రభుత్వ ఉద్యోగి తన సెలవు దరఖాస్తులో తన స్పష్టమైన చిరునామాను పేర్కొనాలి (FR - 74).*

*సెలవును హక్కుగా క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. (ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.)*

*సెలవు సరిగా మంజూరు చేయబడాలి., సరైన ఉపశమనం(relief) మరియు సరైన ఛార్జీని అప్పగించాలి).*

*ఉద్యోగి తన ఇష్టానికి వ్యతిరేకంగా సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు. (FR 67)*

*ముందస్తు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోవడం డైస్ నాన్ గా పరిగణించబడుతుంది.* (FR-18)

*మంజూరు చేసిన సెలవు యొక్క స్వభావాన్ని మార్పు చేసే అధికారం sanctioning authority కి లేదు*

*తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు సెలవు నుండి రీకాల్ మరియు సెలవు కుదింపు (ఎఫ్‌ఆర్ - 70, ఎపి టిఎ రూల్స్ 76, ఎఫ్‌ఆర్ - 72).*

*సెలవు సమయంలో ప్రభుత్వ ఉద్యోగి ఎటువంటి ఉపాధిని చేపట్టకూడదు.* (FR - 69)

*దరఖాస్తు చేసిన సెలవుకు పబ్లిక్ హాలిడేస్ ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ చేయడానికి అనుమతించబడతాయి.* (Govt.Memo.No 865/1210 / FR-1, Dt.25.9.81)

*సెలవు దరఖాస్తుకు స్థానిక సెలవుదినాలు సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ చేయడానికి అనుమతించబడవు.* (FR-68)

*సస్పెండ్ చేయబడిన ఉద్యోగికి ఎటువంటి సెలవు మంజూరు చేయబడదు.* (FR 55 మరియు 74)

*ఒక ప్రభుత్వ ఉద్యోగి (అతను / ఆమె) కింది సందర్భాల్లో రాజీనామా చేసినట్లు భావించబడుతుంది:*

*‘ఒక సంవత్సరం’ మించిన కాలానికి అనుమతి లేకుండా విధులకు హాజరుకాకపోతే.*

*(5) సంవత్సరాలు దాటిన నిరంతర కాలానికి డ్యూటీకి హాజరుకాకపోవడం సెలవు ఉండి లేదా సెలవు లేకుండా.*

*ప్రభుత్వం ఆమోదించిన కాలానికి మించి foreign service లో నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు అయితే (ఎఫ్‌ఆర్ -18 (ఎ) మరియు 5 (ఎ) మరియు (బి) సెలవు నిబంధనలు)*

*********************

*ఫండమెంటల్ రూల్సు (ఫిక్సేషన్లు-ఇంక్రిమెంట్లు)*

*ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడి నప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22,30,31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది. సెలక్షన్ గ్రేడు, 6/12/18/24 సంవత్సరముల స్కేల్సు, రివైజ్డ్ పే స్కేల్సు, మొ,, వానియందు ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేయబడుచున్నది.*

*అట్లే ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు, ప్రీపోన్మెంటు, పోస్టు పోన్మెంటు మొదలుగునవి ఫండమెంటల్ రూల్పు 24, 26, 27ననుసరించి చేయబడతాయి.*

*F.R.22(a) (i)* : అదనపు బాధ్యతలతో కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి *'తదుపరి పై స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగును.* *అట్టి వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.*

ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940 - 78,910 స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 28,940గా స్థిరీకరించబడుతుంది.

*F.R.22(a) (ii)* : *అదనపు బాధ్యతలు లేని పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి “దిగువస్టేజి' వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది.* అయితే -

*ఎ) ఒకవేళ పాత స్కేలులోని మూల వేతనమునకు సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచోఅట్టి 'సమాన స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.*

ఉదా: *21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు వేతనం పొందుతున్న ఉద్యోగి 28, 940 - 78,910 స్కేలు లో నియమించబడినప్పుడు అతని వేతనము రూ 30,580ల వద్దనే స్థిరీకరించబడుతుంది.*

*బి) ఒకవేళ పాత స్కేలులోని మూలవేతనమునకు సమానమైన స్టేజి లేనిచో దిగువ స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. వేతన వ్యత్యాసము 'పర్సనల్ పే'గా నమోదు చేయబడుతుంది. పాతఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.* (93, 99,05, 10, 15 స్కేళ్ళలో అన్నీ సమాన స్టేజీలే వుంటాయి.*

*సి) పాత స్కేలులోని మూలవేతనము నూతన స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.*

ఉదా : *రూ. 21,230-63,010 స్కేలులో రూ. 25,840/-లు పొందుచున్నచో, 28,940-78,910 స్కేలులో రూ. 28,940/- వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది.*

*F.R.22(a) (iv)* : ఉద్యోగి *పబ్లిక్ సర్వీస్ కమీషన్ చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించబడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.*

*F.R.22 B*: నిబంధన ననుసరించి *వేతన స్థిరీకరణ రెండువిధములుగా చేయవచ్చును. వాస్తవ ప్రమోషన్ తేదీనాడైనను లేక ప్రమోషన్ పొందిన పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటుతేదీనాడైనను వేతన స్థిరీకరణ చేయవచ్చును.*

*జిఓ.ఎంఎస్.నం. 145, తేది. 19.05.2009 ప్రకారము ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండగనే ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను.*

ఉదా: *21,230-63,010 స్కేలులో రూ. 28,120/-లు వేతనం పొందుతూ పదోన్నతి పొందినచో పదోన్నతి పొందిన రోజున వేతనం రూ. 28,940/-లుగా ఎస్ఆర్ 223(1) ప్రకారం నిర్ణయించి తదుపరి ఇంక్రిమెంటు తేదీ నాటికి ఒక నోషనల్ ఇంక్రిమెంటు రూ. 820/-లు కలిపి వేతనాన్ని రూ 28,940-78,910 స్కేలులో తదుపరి స్టేజి వద్ద అనగా రూ 30,580/-లుగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.*

*FR 31 (2)*: నిబంధన ఎస్ఆర్ 22కు అనుబంధమైనది. *దీని ప్రకారం సబ్ స్టాంటివ్ (క్రింది) పోస్టులో కొనసాగివుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేక ఇతర మంజూరుల వలనగాని ఆ స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్ (పై) స్కేలులోని అతని వేతనము తదుపరి పై స్టేజి వద్ద పునస్థిరీకరణ చేయబడుతుంది.* (లాభకరమైనప్పుడు)

ఉదా : *21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు పొందుచున్న ఉద్యోగి వేతనము 28,940 - 78,910 స్కేలులో రూ. 31,460/-ల వద్ద స్థిరీకరణ జరుగుతుంది. అయితే పాత స్కేలులోని ఇంక్రిమెంటు వలన వేతనము రూ. 31,460/-లుగా పెరుగుతుంది. కనుక సదరు ఇంక్రిమెంటు తేదీన క్రొత్త స్కేలులో అతని వేతనము 32,340/- వద్ద పున:స్థిరీకరణ చేయబడుతుంది.*

*F. R. 26*: నిబంధన ననుసరించి *వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయబడును. వార్షిక ఇంక్రిమెంటు మంజూరుకు - ఒక పోస్టులోని డ్యూటీ కాలము, జీత నష్టములేని సెలవు కాలము, ఫారిన్ సర్వీసు కాలము, జాయినింగ్ కాలము మొదలగునవి లెక్కించబడతాయి. అనారోగ్య కారణముపై గాని, ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యనసభ్యసించు కారణముపై గాని పెట్టిన జీతనష్టపుసెలవు 6 నెలల కాలపరిమితికి లోబడి ఇంక్రిమెంటుకు పరిగణించ బడుతుంది. అందుకుగాను సంబంధిత శాఖాధిపతి అనుమతిని పొందవలసి వుంటుంది. శిక్షా చర్యగా సస్పెండు చేయబడిన కాలము ఇంక్రిమెంటుకు లెక్కించబడదు.*

*FR 27*: నిబంధన ననుసరించి *జూనియర్‌ కంటే సీనియర్ తక్కువ వేతనము పొందుచున్న సందర్భములో- ప్రీమెచ్యూర్ ఇంక్రిమెంట్ (ప్రీపోన్మెంట్) మంజూరు చేయబడుతుంది. ఒక పోస్టును మంజూరు చేయు అధికారియే అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయు అధికారము గలిగి యుండును.*

*అయితే ప్రభుత్వపు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సదరు అధికారము దాఖలు పరచబడిన సందర్భములో సంబంధిత క్రింది అధికారులు కూడా అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయవచ్చును.*

*ప్రీపోన్మెంట్ తోపాటు స్టెప్పింగ్ అప్ కూడా యీ నిబంధన క్రిందే చేయబడుతుంది.*

*F R 24* : నిబంధన అనుసరించి *దుష్ప్రవర్తన గల లేక అసంతృప్తికరమైన విధముగా విధులను నిర్వహించుచున్నట్టి ఉద్యోగిపై శిక్షా చర్యగా ఇంక్రిమెంటును కొంత కాలము నిలుపు చేయవచ్చును.*

*ఇంక్రిమెంటు మంజూరు చేయు అధికారియే అట్టి నిలుపుదల చేయవచ్చును.* ఈ నిలుపుదల

*రెండు విధములు - 1. క్యుములేటివ్ ఎఫెక్టుతో - అనగా ప్రతి సంవత్సరము నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.*

*2. క్యుములేటివ్ ఎఫెక్టు లేకుండా - అనగా ఆ ఒక్క సంవత్సరమునకు మాత్రమే నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.*

********************

వెకేషన్

💥 ఉద్యోగి సర్వీసులో క్రమం తప్పకుండా వచ్చు వెకేషన్ లో,ఉద్యోగి విధులకు హాజరుకాకుండా ఉండే అవకాశాన్ని వెకేషన్ అంటారు.

*FR-82 under sub rule I*

💥 ఒక ఉద్యోగి వెకేషన్ శాఖలోనూ,వెకేషన్ శాఖగాని వేరే శాఖ లో రెండింటిలో పనిచేసేటప్పుడు,వెకేషన్ శాఖలో పనిచేస్తున్న ట్లు పరిగణించరాదు.

*FR-82 under sub rule-4*

💥 15 రోజులకు మించిన ప్రభుత్వ సెలవుల నే వెకేషన్ గా భావించాలి.

*FR-82 under sub rule-2*

💥 వెకేషన్ శాఖ నుండి నాన్ వెకేషన్ శాఖకు బదిలీ అయితే ఆ ఉద్యోగి సర్వీసు ఆ శాఖలో తాను చివరగా వాడుకున్న వెకేషన్ పూర్తి ఆయిన తేది నుంచి సమాప్తి అయినట్లు భావించాలి.

*FR-82 under sub rule 7*

💥 నాన్ వెకేషన్ శాఖ నుండి వెకేషన్ శాఖకు బదిలీ అయినచో తన సర్వీసు వెకేషన్ శాఖలో చివరి వెకేషన్ పూర్తి ఆయిన తేది నుండి ప్రారంభించినట్లు భావించబడుతుంది.

💥 వెకేషన్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఏదేని వెకేషన్ లో విధులు నిర్వహించడానికి తగిన ప్రతిఫలం ప్రత్యేకంగా పొందినట్లయితే ఆ ఉద్యోగి వెకేషన్ వాడుకోనకుండా నిరోధించినట్లు భావించరాదు-Ruling 15

💥 వెకేషన్ శాఖలో పనిచేయు ఉద్యోగి,ప్రత్యేకమైన ఉత్తర్వుల ద్వారాగాని లేక జనరలు ఉత్తర్వుల ద్వారా గాని అట్టి వెకేషన్ అనుభవించడానికి నిరోధించబడకుండా ఉంటే,అతను వెకేషన్ అనుభవించినట్లే భావించవలెను.

*FR-82 under sub rule-2*

💥 FR-82 లోని సబ్ రూల్.6 ప్రకారం వినియోగించుకున్న వేసవి సెలవులు 15 రోజుల కన్నా తక్కువ ఉన్నప్పుడు మొత్తం వేసవి సెలవులు కోల్పోయినట్లుగా భావించి 30 సంపాదిత సెలవులు (24+6) జమచేయబడతాయి.

💥 వెకేషన్ శాఖలో పనిచేయు తాత్కాలిక నాల్గవ తరగతి ఉద్యోగులు అర్జిత సెలవులకు అర్హులు కారు.

*Note 1 under APLR20(A)*

💥 ప్రతి ఉపాధ్యాయునికి జనవరి 1వ తేదిన 3 రోజులు,జూలై ఒకటవ తేదిన 3 రోజులు అర్జిత సెలవులు ముందుగా జమచేయాలి.

*G.O.Ms.No.317 విద్య,తేది:15-09-1994*

💥 ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు గాని,జనాభా లెక్కలకు గాని లేక ఇతరత్రా వారి సేవలు ప్రభుత్వం ఉపయోగించుకున్న సందర్భాలలో,అట్టి కాలానికి ఏ మేరకు సంపాదిత సెలవుకు అర్హులో ప్రభుత్వం కాలానుగుణంగా ప్రత్యేక ఉత్తర్వులు జారీచేస్తూ ఉంటుంది.అలాంటి సందర్భాలలో ఉపాధ్యాయులు వెకేషన్ ను ఉపయోగించకుండా నివారింపబడినెల యెడల,వారి సేవలు ఉపయోగించుకున్న అధికారి జారీచేసిన ధృవపత్రము ఆధారంగా శాఖాధిపతి దామాషా పద్దతిపై నిలువచేయుటకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.తదుపరి శాఖాధిపతికి బదులుగా సంస్థాధిపతి ఉత్తర్వులు ఇస్తే సరిపోతుందని సవరణ ఉత్తర్వులు జారీచేసింది.

*G.O.Ms.No.151,విద్య తేది:14-11-2000*

*G.O.Ms.No.174,విద్య తేది:19-12-2000*