AAS & STEP UP

*AP GO.68 dt.12.6.2015 Automatic Advancement Scheme (AAS) in PRC 2015

*TS GO.38 dt.15.4.2015 Automatic Advancement Scheme (AAS) in PRC 2015

GO.399 dt.18.11.2005 Amendment to FR 22-B in Promotions

*అప్రయత్న పదోన్నతి పథకం:*

*(Automatic Advancement Scheme)*

*G.O.Ms.No.38 Fin Dt:21-4-2015)*

💥 *స్పెషల్ గ్రేడ్ పోస్టు (SPP-I) స్కేలు:*

ఒక పోస్టులో 6సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి ప్రస్తుతము తాను పొందుతున్న స్కేలు తదుపరి స్కేలు ను స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేలు గా మంజూరుచేస్తారు.

💥 *స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు:*

దీనిని SPP-IA,SPP-IB అను రెండు భాగాలుగా విభజించారు.

☀ ఒక పోస్టులో 12సం॥ స్కేలు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందబోవు తదుపరి ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-I స్కేలుగా మంజూరుచేస్తారు.అయితే ప్రమోషన్ పోస్టుకు కావలసిన అర్హతలు కలిగియుండాలి.12సం॥ సర్వీసు కలిగి,సర్వీసు రూల్స్ ననుసరించి తదుపరి ప్రమోషన్ లేని పోస్టుల్లో పనిచేస్తున్న వారికి స్పెషల్ గ్రేడ్ స్కేలు తదుపరి స్కేలును

SAPP-IA స్కేలుగా మంజూరుచేస్తారు.

☀ ఒక పోస్టులో 18సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందుతున్న SPP-IA/SAPP-Iఆ స్కేలులోనే ఒక ఇంక్రిమెంటు అదనంగా మంజూరుచేస్తారు. దీనిని SPP-IB/SAPP-IB స్కేలుగా వ్యవహరిస్తారు.

💥 *స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు(SPP-II)*

☀ ఒక పోస్టులో 24సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి సర్వీసురూల్స్ ప్రకారం తాను పొందబోవు రెండవ ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.అట్లే SAPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.

☀ ఒకవేళ SPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి 2వ ప్రమోషన్ పోస్టులేని సందర్భంలో SPP-I స్కేలు తదుపరి స్కేలును SPP-II స్కేలుగామంజూరుచేస్తారు.

అట్లే SAPP-IA స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.