Compensatory Leaves
*పరిహార సెలవులు:*
*(COMPASINATE CASUAL LEAVES-CCLs)*
🌱 ఈ సెలవు నాన్-గజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.
🌱 సెలవు రోజున గాని లేక ఏ ఇతర పబ్లిక్ హాలిడేస్ రోజున కాని విధులకు హాజరవ్వమని అధికారి ఆదేశించిన సందర్భంలో నష్టపరిహారంగా సి.సి.ఎల్ మంజూరు చేయటం జరుగుతుంది.
🌱 ఈ సెలవు పనిచేసిన రోజు నుండి 6 నెలల లోపు గాని లేదా యాజమాన్యం అనుమతించినప్పటి నుండి మాత్రమే వాడుకోవాలి.
🌱 క్యాలెండర్ సం॥లో 10 రోజులకు మించి ఇలాంటి సెలవులు మంజూరు చేయరాదు.7 రోజులకు మించి జమ చేయరాదు.
*(Govt.Memo.No.13112/58 F&P Dt: 01-03-1958)*
🌱 ఆకస్మిక సెలవు,పరిహార సెలవు రెండూ కలిపి వాడుకునే వెసులుబాటు ఉంది.అయితే రెండు కలిసి 10 రోజులకు మించరాదు.
*(Memo.No.934/poll.B/64-2 Dt:26-04-1963)*
🌱 పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం కల్పించబడింది.
*(G.O.Ms.No.50 Dt:01-02-1968)*