AP GLI / TS GLI

*GO.2931 dt.10.07.2013 Online payment of APGLI Loan and Claims Instead of Cheque

*GO.26 dt.22.2.1995 Ceiling limit on the maximum premium payable to APGLI Fund

*TSGLI కొన్ని ముఖ్యమైన ఉత్తర్వులు:*

💥 2015 రివైజ్డ్ స్కేల్ ల అనుసరించి TSGLI స్లాబు రెట్లు సవరించడం జరిగింది.

*(G.O.Ms.No.49 తేది:27-04-2015)*

💥 స్లాబురేట్ల పైన కాకుండా బేసిక్ పే పై 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు.

*(G.O.Ms.No.26 తేది:22-02-1995)*

💥 సరళీకరించిన ప్రతిపాదన దరఖాస్తును ప్రవేశపెట్టడం జరిగింది.

*(G.O.Ms.No.189 తేది:10-07-2013)*

💥 మున్సిపల్ ఉద్యోగ,టీచర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఎయిడెడ్ టీచర్లకు వర్తించదు.

*(G.O.Ms.No.25 తేది:03-03-2011)*

💥 21 సం॥ పైన 53 సం॥ లోపు వయస్సు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు,10 సం॥ సర్వీసు పూర్తిచేసిన వర్క్ చార్టెడ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమజీతాల నుంచి రికవరీ చేసి పాలసీబాండ్ పొందాలి.

💥 గర్భిణీలు ప్రసవించిన 6 నెలల తరువాతే భీమాకు అర్హులు.

💥 ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్నవారు 48 సం॥ దాటినవారు మరోపాలసీ 53 సం॥ల వయస్సు వరకు మాత్రమే తీసుకోవచ్చును.

*(Memo.No.29335/342/A2 తేది:05-03-2010 & G.O.MsNo.16 తేది:17-02-2011)*

💥 అప్రెంటీస్ వ్యవస్థ రద్దుకావడం వల్ల 1సం॥ వరకు వేచి వుండకుండా మొదటి నెల జీతంతో మినహాయించవచ్చు.

*(G.O.Ms.No.199 తేది:30-07-2013)*

💥 ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం మినహాయించి,ప్రతిపాదనలు స్వీకరించి,వాటిని జిల్లా కార్యాలమునకు పంపవలసిన బాధ్యత DDO లకు ఉంది.

*(G.O.Ms.No.43 తేది:21-01-1989)*

*(G.O.Ms.No.368 తేది:15-11-1994)*

💥 పాలసీ నెంబర్ మరియు నామిని వివరాలు విధిగా సర్వీసు రిజిస్టరులో నమోదు చేయించాలి.

💥 TSGLI ప్రీమియంకు సెక్షన్-80సి ప్రకారం ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కలదు.

💥 సం॥కి 9% వడ్డీతో 90% వరకు లోన్ సౌకర్యం కల్పిస్తారు.

💥 ప్రస్తుతం అన్ని పాలసీ బాండ్లను క్రింద తెలిపిన వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. _www.tsgli.telangana.gov.in_