మా భవిష్యత్ ప్రణాళికలు / Future Plans
108 నక్షత్ర పాద శివలింగాలు యొక్క Ebook ఉచితంగా Download చేసుకోండి
మా భవిష్యత్ ప్రణాళికలు / Future Plans
పరమేశ్వరిచే సృష్టింపబడిన ఈ మహావిశ్వంలో ఉన్న భూగోళం పై జన్మించడము ఆ పరమేశ్వరుని సంకల్పమే గాని వేరొకటి గాదు. అటువంటి భూగోళం పై పవిత్ర భారత దేశంలో సనాతన సంప్రదాయాలను సనాతన కార్యక్రమాలను, సహనాన్ని ఆచరించే హిందూ సంస్కృతిలో జన్మ తీసుకోవడం కూడా ఆ ఈశ్వర సంకల్పమే. ప్రక్క వారి చెబితేగాని మన బలం మనకు తెలీదు. ఎదుట వారి ఆచరిస్తే గాని మనం విషయం తెలుసుకోక పోవడం మన బలహీనత, అందుచేత మన సంస్కృతిలో అనేక భగవత్ స్వరూపులు, ధార్మిక సంస్థలు వెలసి మానవ జన్మను ప్రభావితం చేస్తున్నాయి. మానవతకు సార్ధకత చేకూరుస్తున్నాయి. తన వంతు సాయంగా ప్రతివారు ఏదో విధంగా, ఏదో రూపంలో (దానధర్మాలు వంటివి) సాటి మనిషికి సహాయపడి మానవ సేవే ఆ పరమేశ్వర సేవ అని అందుచేత మేము కూడా మా వంతు కృషి చేసి మిమ్మలందర్ని భాగస్వాముల్ని చేసి ఈ మహాయజ్ఞంలో భాగస్తుల్ని చేయాలని సంకల్పించి మా భవిష్యత్ కార్యక్రమాల్ని మీ ముందు ఉంచుచున్నాము. ఈ సుప్రసిద్ధ శ్రీ భీమేశ్వర క్షేత్రంలో ఈ దిగువన ఉదహరించిన కార్యక్రమాల్ని చేయాలని వాటికి మీ పూర్ణమద్దతు తెలిపి మాకు సహకరించవలసినదిగా కోరుచున్నాము.
1. భీమేశ్వర క్షేత్రంలో వీరశైవ సత్రం నిర్మించుట
2. యాత్రికులకు నిత్య అన్నదాన పథకం
3. యాత్రికులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించుట
4. వృద్ధాశ్రమం నిర్మించుట
5. వేద పాఠశాల
మేము చేయు ఈ బృహత్పధకంలో మీరు పాలు పంచుకొని మీ వంతు సహకారం అందించవలసినదిగా కోరుచున్నాము. విరాళములు పంపువారు ఈ క్రింద ఇవ్వబడిన వాట్సప్ Phone No.కు పేమెంట్ చేసిన తర్వాత, పేమెంట్ Screenshot తీసి వాట్సప్ మెసేజ్ చేయమని ప్రార్థన.