గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
కుడుపూరు గ్రామం / KUDUPURU VILLAGE
శ్రీ బాలాత్రిపురసుందరి సమేత నీలకంఠేశ్వర స్వామి
మీన రాశి, ఉత్తరాబాద్ర నక్షత్రం (2వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా సుమారు 14 Kms దూరాన కుడుపూరు (Kudupuru) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ నీలకంఠేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ బాలాత్రిపురసుందరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం ఉత్తరాబాద్ర నక్షత్రం (2వ పాదం) చెందినది. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ బాలాత్రిపురసుందరి సమేత నీలకంఠేశ్వర వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, గణపతి, కుమారస్వామి, చండీశ్వరుడు, నవగ్రహములు, నాగేంద్రస్వామి, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ నీలకంఠేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ బాలాత్రిపురసుందరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ దశమి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి నిర్వ హించబడతాయి. మీన రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. కాకినాడ నుంచి ద్రాక్షారామం నకు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. కాకినాడ పాత బస్ స్టాండ్ మరియు కాకినాడ జగన్నాధపురం బ్రిడ్జి నుంచి ద్రాక్షారామం నకు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి.
* ద్రాక్షారామం నుంచి కోటిపల్లి కు కె.గంగవరం మీదగా షేరింగ్ ఆటోలు దొరుకుతాయి.
రవాణా సమాచారం: రాజమండ్రి - కోటిపల్లి బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ఉంటాయి.
* కె.గంగవరం నుంచి కుడుపూరు కు షేరింగ్ ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 8 Kms.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి కీర్తి శేషులు విళ్ళూరి సాంబశివరావు గారి భార్య శ్రీమతి వెంకట లక్ష్మీ నాగమణి గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణులచే అర్చన కార్యక్రామాలు జరుగుచున్నాయి. నాగమణి గారి సెల్: 95050 34302 & 91775 83409 సంప్రదించగలరు. ఇతర అర్చకులు శ్రీ విళ్ళూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యం శర్మ, సెల్ నెం: 89788 05829.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం
ఉతనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్ పృథివీ సముద్ర:|
విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.