గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
కొత్తూరు గ్రామం / KOTTURU VILLAGE
శ్రీ పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి
సింహరాశి, మఖ నక్షత్రం (4వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 9.5 kms. దూరాన, కొత్తూరు (Kotturu) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలంకు చెందినది. కొత్తూరు నందు శ్రీ పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ నాగలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: ఆలయం చాల ప్రాచీనమైనది. ఆలయ ముఖద్వారం పైన శివకుటుంబము మరియు ముఖమంటపము పైన పరమేశ్వరుడు మార్కండేయుని యమధర్మరాజు నుండి రక్షించిన ఘట్టము శిల్పీకరించబడినది. ఆలయ ప్రాంగణములో గణపతి ఆలయం కలదు. శ్రీ నాగలింగేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవములు చైత్రశుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి. సింహరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. కొత్తూరు గ్రామంలో రామాలయము, వేంకటేశ్వరస్వామి ఆలయము కలవు.
రవాణా సమాచారం: రామచంద్రపురం మార్కెట్టు సెంటర్ నుంచి కొత్తూరు శివాలయంకు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 3 కీల్లో మిటార్లుగా ఉంటుంది.
అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ విల్లూరి ఉమా మహేశ్వరరావు, సెల్ నెం : 94946 63385 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
మఖ నక్షత్రం స్తోత్రం
పితృభ్య: స్వధాయిభ్య: స్వధానమ:|
పితామహేభ్య: స్వధాయిభ్య: స్వధానమ:
ప్రపితామహేభ్య: స్వదాయిభ్య: స్వధానమ:
అక్షన్న పిత్రో మీమదంత పితరోతితృ పంత్ పితర:
పితర: శుంధ ధ్వమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.