గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
"అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న"
కుయ్యేరు గ్రామం / KUYYERU VILLAGE
శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మేషరాశి, అశ్వని నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 9 kms. దూరాన, కుయ్యేరు గ్రామం (Kuyyeru) గ్రామం కలదు. కుయ్యేరు బస్ స్టాప్ కు సుమారు 200 మీటర్లు లోపలకి శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: త్రేతాయుగం నందు శ్రీ రామచంద్రమూర్తి అరణ్యవాసం నందు ఒక కుటీరం నిర్మించుకుని, సీతా లక్ష్మణుల సమేతంగా కొంత కాలము నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయంలో రావణ బ్రహ్మ, సీతాదేవిని అపహరించుటకు మారిచుడు అను రాక్షవీరుడును పంపుతాడు. ఆ మారిచుడు ఒక బంగారు లేడి రూపాంలో సీతాదేవి కంటిచూపులో పడ్డాడు. సీతాదేవి ఆశ పడి శ్రీ రాముడుని కోరుతుంది. భార్య కోరికను మన్నించిన శ్రీ రాముడు బంగారు లేడి కోసం బయులుదేరుతాడు. బంగారు లేడి (మారిచుడు) తన వెంట రాముడు అనుసరింప జేయుటకు, ఒక ప్రదేశములో కుయో! అని శబ్ధం చేయడం జరిగింది. నాటి నుంచి ఆ ప్రదేశము "కుయో" గా పిలువబడేది. కాలక్రమేన ఆ ప్రదేశము "కుయ్యేరు" గా మార్పుచెందింది అని స్ధల పురాణం చెప్పుతుంది .
కుయ్యేరు గ్రామం లోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ మల్లేశ్వరాలయం చాల ప్రాచీనమైనది. ఆలయం క్రమ క్రమంగా జీర్ణమైనది. గ్రామస్ధుల సహాకారముతో పునః నిర్మాణం జరిగింది. కాశీ క్షేత్రం నుంచి తెచ్చిన ఒక శివలింగమును ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణములో బలి పీఠం, ధ్వజ స్ధంబం, ముఖ మండపం, ద్వారపాలకులు, నంది, చండీశ్వరుడు, మహా గణపతి, శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి, శ్రీ వల్లిదేవాసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు మొదలగు మూర్తులు దర్శనమిస్తాయి.
రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు బస్ స్టాప్, ఉప్పుమిల్లి, కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నుంచి కుయ్యేరు కు ఆటోలు కూడ దొరుకుతాయి.
అర్చక స్వామి: మాకు సహకరించిన కుయ్యేరు అర్చక స్వామి శ్రీ దొంతికుర్తి రామకృష్ణ శర్మ, సెల్ నెం. 9949422425 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
అశ్వని నక్షత్రం స్తోత్రం
అశ్వినా తేజసాచక్షు: ప్రాణన సరస్వతీ వీర్యమ్|
వాచేంద్రో బలేనేంద్రాయ దఘరింద్రయమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
వీడియో వివరణ / Video Description
ఆడియో వివరణ / Audio Description