గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
యనమదల గ్రామం / YANAMADALA
శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
కర్కాటకరాశి, పునర్వసు నక్షత్రం (4వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా, సుమారు 11 kms. దూరాన యనమదల గ్రామం (Yanamadala) కలదు. ద్రాక్షారామం - రామచంద్రపురం రోడ్డు మార్గములో రాజగోపాల సెంటర్ ఉంటుంది. రాజగోపాల సెంటర్ నకు ఈశాన్యం దిశగా, సుమారు 5.5 Kms. దూరములో యనమదల గ్రామం ఉంటుంది. ఇచ్చట శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. శ్రీ మల్లేశ్వర లింగము, పునర్వసు నక్షత్రం (4వ పాదం) చెందినది. పునర్వసు నక్షత్రం నందు జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహించుతారు. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: యనమదల గ్రామం లోని శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ప్రధానాలయం, చండీశ్వరుడు, కళ్యాణ మండపం ఉంటాయి. ముఖ మండపం నందు నందీశ్వరుడు, గణపతి,
కుమార సామి (సుబ్రహ్మణ్య స్వామి) ఉంటారు. అంతరాలయం యొక్క ద్వారం నకు నందుడు మరియు కాళుడు అను ద్వారపాలకులు ఉంటారు. గర్భాలయం నందు శ్రీ మల్లేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు శ్రీ పార్వతీ దేవి కొలువుదీరింది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం చైత్ర బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. మహా శివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు జరుగుతాయి. లింగోద్భవ కాలం వరకు అభిషేకాలు ఉంటాయి. మహా శివరాత్రి నాడు అన్న సమారాధన సేవ జరుగుతుంది. శరన్నవరాత్రులు విశేషముగా ఉంటుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. సుబ్బారాయుడు షష్ఠి దర్శనాలు విశేషముగా జరుగుతాయి. నక్షత్ర అభిషేక శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ అయిలూరి వెంకట సత్య శ్రీనివాస్, సెల్ నెం. 9848719299 సంప్రదించగలరు.
రవాణా సమాచారం: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 6 kms. దూరంలో రాజగోపాల సెంటర్ (రామచంద్రపురం) ఉంటుంది. ద్రాక్షారామం నుంచి బస్సులు / ఆటోలు దొరుకుతాయి.
రాజగోపాల సెంటర్ నుంచి యనమదల గ్రామం కు ఆటోలు దొరుకుతాయి.
అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన యనమదల - శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన అయిలూరి వెంకట సత్య శ్రీనివాస్, సెల్ నెం. 9848719299 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పునర్వసు నక్షత్రం స్తోత్రం
అదితి ధౌరదితిరం తరి క్షమదితి: మాతా స పితాన పుత్ర:|
విశ్వేదేవా అదితి పంచజనా అదితి జాతిమాది తిర్జనిత్వమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.