గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
మడుపల్లి గ్రామం / MADIPALLI VILLAGE
శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
మకర రాశి, శ్రవణం నక్షత్రం (2వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 22 kms. దూరాన మడుపల్లి (Madupalli) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ ముక్తేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామి వారి ఆలయం శ్రవణం నక్షత్రం (2వ పాదం) చెందినది. శ్రీ ముక్తేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. అంతరాలయంలో గణపతి కొలువై ఉన్నారు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ ముక్తేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు విశేషంగా నిర్వ హించబడతాయి. కనుమ రోజున ప్రభల ఉత్సవం నిర్వహించబడుతుంది. మకర రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: రావులపాలెం - మురమళ్ళ బస్సులు (Via) మడుపల్లి, ముక్తేశ్వరం మీదగా ఉంటాయి.
* రావులపాలెం - మడుపల్లి మధ్య దూరం సుమారు 22 Kms.
రవాణా సమాచారం: రావులపాలెం & కొత్తపేట నుంచి బయలు దేరిన అయినవిల్లి షేరింగ్ ఆటోలు (Via) మడుపల్లి మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం రేవుకు Boat సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ముక్తేశ్వరం కు రవాణ సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం నుంచి మడుపల్లి కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 6 Kms.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ వెల్లపల్లి వ్యాఘ్రేశ్వర శర్మ, సెల్ నెం : 99490 51852 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
శ్రవణం నక్షత్రం స్తోత్రం
విష్ణోరరాటమసి విష్ణో: శ్నపత్ర స్థో విష్ణో: సూర్యసి విష్ణో:
ధ్రువోసి వైష్ణవమసి విష్ణ్యోత్వా||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
వీడియో వివరణ / Video Description
ఆడియో వివరణ / Audio Description