గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
దంగేరు గ్రామం / DANGERU VILLAGE
శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి
మీన రాశి, ఉత్తరాబాద్ర నక్షత్రం (1వ పాదం)
అష్ట సోమేశ్వరాలయాలు (ఆగ్నేయం క్షేత్రం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 11 kms. దూరాన, దంగేరు (Dangeru) గ్రామం కలదు. ఇచ్చట శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. కశ్యప మహర్షి ప్రథమ పూజ గావించినాడు. ఆలయం చాల ప్రాచీనమైనది. పూర్వం ఆలయం భూమి ఉపరితలము నకు సుమారు నాలుగు అడుగుల లోతులో ఉండేది. మెట్లు సహయంతో ఆలయం లోనికి ప్రవేశించేవారు. 2011 సంవత్సరములో ఆలయం పునర్నిర్మాణం గావించి, పునః ప్రతిష్ట చేసారు. ఇది అష్ట సోమేశ్వరాలయాలలో ఆగ్నేయం క్షేత్రంగా ప్రతితీ. భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా పేర్కొనారు.
దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రం నందలి శ్రీ భీమేశ్వర లింగము సూర్య యంత్ర ప్రతిష్ట. ఆ రుద్రమూర్తిని శాంతపరచేందుకు ద్రాక్షారామ క్షేత్రం చుట్టూ ఎనిమిది చంద్ర యంత్ర ప్రతిష్టలు జరిగాయి. ఈ శివాలయాలను అష్ట సోమేశ్వరాలయాలు అని అంటారు. ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. ద్రాక్షారామ క్షేత్రం నకు ఆగ్నేయం దిశలో దంగేరు క్షేత్రం ఉంది. ఇచ్చట శ్రీ ఉమా సమేత సోమేశ్వరాలయం దర్శించగలము.
ఆలయం: శ్రీ ఉమా సమేత సోమేశ్వరాలయం తూర్పు అభిముఖముగా ఉంటుంది. ప్రధానాలయం నందు శ్రీ సోమేశ్వర లింగము, శ్రీ ఉమా దేవి అమ్మ వారు దర్శనమిస్తారు. ఆలయ విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ద్వజసంభం, నవగ్రహములు, శ్రీ చండేశ్వర స్వామి, నాగమ్మ తల్లిని దర్శించగలము. ప్రధానాలయం చుట్టూ (గోడ గూటిలో) నాట్యా గణపతి, మేథా దక్షిణ మూర్తి, లింగోద్భవం, బ్రహ్మ, పార్వతి మూర్తులు ఉంటారు. ముఖ మండపం నందు నందీశ్వరుడు, అంతరాలయం నందు గణపతి, కుమారస్వామి, గర్భాలయం లో 18 అంగుళాలు ఎత్తు గల పాన వట్టం పైన శ్రీ సోమేశ్వర లింగము, స్వామి వామ భాగం నందు శ్రీ ఉమా దేవి దర్శనమిస్తారు. శ్రీ సోమేశ్వర స్వామికి ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణ ఉత్సవాలు నిర్వహించుతారు. మహా శివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు జరుగుతాయి. రాత్రి లింగోద్భవం సమయం లో విశేష అభిషేకాలు ఉంటాయి. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు విశేషముగా ఉంటాయి. సంక్రాంతి సందర్భముగా కనుమ నాడు ప్రభల తీర్ధం జరుగుతుంది. దంగేరు చుట్టు ప్రక్కల గ్రామాలు నుంచి భక్తులు ప్రభలతో ఊరేగింపుగా, దంగేరు గ్రామ దేవత శ్రీ పాపలమ్మ తోటకు చేరుకొంటారు. అక్కడ కన్నులు విందుగా తీర్ధం జరుగుతుంది.
శ్రీ సోమేశ్వర లింగము, ఉత్తరాబాద్ర (1వ పాదం) లింగము చెందినది. ఉత్తరాబాద్ర (1వ పాదం) నందు జన్మంచిన శిశువు దోషం నకు ఉపశమనం (ఊరట) కొరకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
రవాణా సమాచారం: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. కాకినాడ నుంచి ద్రాక్షారామం నకు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. కాకినాడ పాత బస్ స్టాండ్ మరియు కాకినాడ జగన్నాధపురం బ్రిడ్జి నుంచి ద్రాక్షారామం నకు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి.
* ద్రాక్షారామం నుంచి కోటిపల్లి కు కె.గంగవరం మీదగా షేరింగ్ ఆటోలు దొరుకుతాయి.
రవాణా సమాచారం: రాజమండ్రి - కోటిపల్లి బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: దంగేరు క్షేత్రం నకు సమీప రైల్వే స్టేషన్స్ రాజమండ్రి మరియు కాకినాడ.
రవాణా సమాచారం: రాజమండ్రి - కోటిపల్లి బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ఉంటాయి.
* కాకినాడ - కోటిపల్లి బస్సులు Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.
* కె.గంగవరం నుంచి దంగేరు కు షేరింగ్ ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 5 Kms.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ ఉండి అక్కయ్య శర్మ, సెల్: 99513 20347 గారిని సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం
ఉతనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్ పృథివీ సముద్ర:|
విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.