గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

భట్లపాలిక గ్రామం / BHATLAPALIKA VILLAGE

శ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి

మీన రాశి, రేవతి నక్షత్రం (1వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా సుమారు 12 Kms. దూరాన భట్లపాలిక (Bhatlapalika) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ అగస్త్వేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి వారి ఆలయం రేవతి నక్షత్రం (1వ పాదం) చెందినది. శ్రీ అగస్త్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి వారి ఆలయం గౌతమీ (గోదావరి) నది తీరమున ఉన్నది. ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరుడు, విజయదుర్గ, సూర్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, కుమారస్వామి మరియు ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ అగస్త్వేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు నిర్వ హించబడతాయి. మీన రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 7 Kms. దూరంలో బాలాంత్రం బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి భట్లపాలిక గ్రామం నకు రోడ్డు ఉంది. వీటి మధ్మ దూరం సుమారు 6 Kms. గా ఉంటుంది. ఆటోలు ఉండవు. స్వంత వాహనములు కలిగిన వారికి బాగుంటుంది.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నకు సుమారు 21 kms. దూరాన యానాం అను పట్టణం ఉంది. రాజమండ్రి నుంచి యానాం పోవు బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, బాలాంత్రం, కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. యానాం నుంచి భట్లపాలిక గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 10 kms. యానాం బైపాస్ రోడ్ నుంచి భట్లపాలిక గ్రామం నకు గోదావరి గట్టు మీదగా ఆటోలు ఉంటాయి. షేరింగ్ ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి. ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి.

రవాణా సమాచారం: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

రవాణా సమాచారం: రాజమండ్రి - కోటిపల్లి బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: కె.గంగవరం నుంచి మసకపల్లి గ్రామం కు (Via) దంగేరు, భట్లపాలిక మీదగా షేరింగ్ ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 12 Kms.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి మసకపల్లి గ్రామం నకు బస్సులు (Via) కె.గంగవరం, దంగేరు, భట్లపాలిక మీదగా ఉంటాయి. బస్సులు చాల తక్కువగా ఉంటాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ కొత్తలంక సూర్యనారాయణ, సెల్ నెం: 91337 71257 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం

తనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్‌ పృథివీ సముద్ర:|

విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.