గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
తొస్సిపూడి గ్రామం TOSSIPUDI VILLAGE
శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
సింహరాశి, పుబ్బ నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 22 kms. దూరాన, తుల్యాభాగ నదీ తీరం నకు ఉత్తరం భాగంలో తొస్సిపూడి (Tossipudi) అను గ్రామం కలదు. రామచంద్రపురం - అనపర్తి రోడ్డు మార్గములో తొస్సిపూడి గ్రామం ఉంటుంది.
ఇచ్చట శ్రీ రామలింగేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం పుబ్బ నక్షత్రం కు (3వ పాదం) చెందినది. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: తొస్సిపూడి గ్రామం లోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. 1960 సంవత్సరములో పునః ప్రతిష్ట జరిగింది. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. ప్రధానాలయం తూర్ప అభిముఖంగా ఉంటుంది. ఆలయం ప్రవేశం సింహద్వారం నుంచి జరుగుతుంది. ఆలయం ప్రాంగణము లోనికి ప్రవేశించగానే ధ్వజస్ధభం, తులసి కోట, ప్రధానాలయం, చండీశ్వర సన్నిధి దర్శనమిస్తాయి. ముఖ మండపం నందు మహా నందీశ్వరుడు ఉంటాడు. అంతరాలయం నందు గణపతి కొలువైన్నారు. గర్భాలయం నందు శ్రీ రామలింగేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు శ్రీ పార్వతీ దేవి కొలువుదీరింది. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు.
ఆలయం నందు మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. రాత్రికి లింగోద్భవ పూజ జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా రథోత్సవం, మహా అన్నదానం నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం మాఘ బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. ప్రతి మాసం మాస శివరాత్రి, పౌర్ణమి సందర్భముగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించబడును. కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక మాసం పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుగుతుంది. శరన్నవరాత్రులు జరుగుతాయి. సంక్రాంతి, దీపావళీ, సుబ్రహ్మణ్య షష్టి మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా జరుగుతాయి.
రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నుంచి రాజమండ్రి బస్సులు (via) రామచంద్రపురం మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం 2: రామచంద్రపురం - అనపర్తి బస్ సర్వీసులు (via) తొస్సిపూడి గ్రామం మీదగా ఉంటాయి. రామచంద్రపురం - తొస్సిపూడి మధ్య దూరం సుమారు దూరం 17 Kms.
రవాణా సమాచారం 3: కాకినాడ - రాజమండ్రి బస్సులు (via) సామర్లకోట, బలభద్రాపురం, అనపర్తి మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం 4: బలభద్రాపురం సెంటర్ నుంచి తొస్సిపూడి కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 3 Kms.
రవాణా సమాచారం 5: తొస్సిపూడి గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్స్ అనపర్తి
రవాణా సమాచారం 6: విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గములో అనపర్తి రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ప్యాసింజర్ రైలు సర్వీసులుతో పాటు కొన్ని Express రైలుసర్వీసులు కూడ ఆగుతాయి. అనపర్తి రైల్వే స్టేషన్ నుంచి అనపర్తి వంతెన బస్సు స్టాప్ దూరం సుమారు 0.5 Kms. వీటి మధ్య ఆటోలు దొరుకుతాయి. అనపర్తి వంతెన బస్సు స్టాప్ (దేవి చౌక్) నుంచి తొస్సిపూడి కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 8 Kms.
అర్చక స్వామి: మాకు సహకరించిన తొస్సిపూడి - శ్రీ రామలింగేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ దొంతికుర్తి శ్రీమన్నారాయణ మూర్తి, సెల్ నెం. 9441154185 గార్కి నా నమసుమాంజలి.
గమనిక: ప్రస్తుతం ఆలయం పునర్నిర్మాణంలో ఉంది.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పుబ్బ నక్షత్రం స్తోత్రం
భగప్రాణోత్ భర్గ సత్య రాధో|
భగే మధియముదవాదదన్న భగయే ప్రణోజన యగోభి
రశ్వైర్భయ ప్రనృభి న్రై: వస్యామ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.