గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
కూళ్ళ గ్రామం / KULLA VILLAGE
శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
ధనుస్సు రాశి, పూర్వాషాడ నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 16 kms. దూరాన కూళ్ళ (Kulla) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ సోమేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం పూర్వాషాడ నక్షత్రం (3వ పాదం) చెందినది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కూడ కలదు. అంతరాలయంలో గణపతి కొలువై యున్నారు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ సోమేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి, శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు కూడా వైభవోపేతంగా నిర్వహించబడతాయి. దనుస్సు రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: రామచంద్రపురం నుంచి వాకతిప్ప బస్సులు (వయా) పసలపూడి వంతెన, చెల్లూరు, కూళ్ళ మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: కాకినాడ - కోరుమిల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె. గంగవరం, పామర్రు, టేకీ మీదగా ఉంటాయి.
*పామర్రు నుంచి కూళ్ళ గ్రామం ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 5 Kms.
రవాణా సమాచారం: కాకినాడ - కత్తుంగ బస్సులు (via) ద్రాక్షారామం, కె.గంగవరం, పామర్రు, అంగర, వెదురుమూడి, కొత్తూరు సెంటర్, రావులపాలెం మీదగా ఉంటాయి. ఇవి చాల తక్కువుగా ఉంటాయి. పామర్రు నుంచి కూళ్ళ గ్రామం ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 5 Kms.
రవాణా సమాచారం: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె. గంగవరం మీదగా ఉంటాయి.
*కాకినాడ - కోటిపల్లి మార్గములో కె.గంగవరం ఉంటుంది. కె.గంగవరం నుంచి పామర్రు మీదగా అంగర కు షేరింగ్ ఆటోలు ఉంటాయి. పామర్రు నుంచి కూళ్ళ గ్రామం ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 5 Kms.
* కోటిపల్లి రేవు నుంచి కూళ్ళ గ్రామం (గోదావరి గట్టు మీదగా) ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 6.5 Kms.
* కోటిపల్లి రేవు నుంచి రావులపాలెం కు షేరింగ్ ఆటోలు (Via) కోరుమిల్లి, కూళ్ళ (శ్రీ దుర్గా ఆలయం), కపిలేశ్వరపురం (గోదావరి గట్టు) మీదగా ఉంటాయి. కూళ్ళ (శ్రీ దుర్గా ఆలయం) నుంచి కూళ్ళ గ్రామం దూరం సుమారు 500 meters only.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ వెలవలపల్లి సుబ్బారావు, సెలె నెం : 98496 89703 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పూర్వాషాఢ నక్షత్రం స్తోత్రం
అపాఘమపి కిల్విష మపికృత్యామ పోరేప:|
అపాం మార్గ త్వమస్మదందు స్వపయసువ:||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.