పొరపాట్లకు / తప్పులకు : : మన్నించండి. దయచేసి, మీ దృష్టికి వచ్చినవి మాకు తెలియజేయండి సరిచేసుకొనెదము.
0.1-1.కందం
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ చవులు వుట్ట నుడివెద సుమతీ!
01.1.2.వచనం.
మన తెలుగులకు రామునితో అనుబంధము విడదీయరానిది. అందుకే శిశువులు నేర్చే పదాలలో సహితం రాముడు ఎంతో చక్కని దేవుడు.
01.1.3.గేయం.
ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు
01.1.4.వచనం.
ఈ పాట చిన్నప్పుడు మనమందరమూ పాడినదే. అలా రామాయణం ఉగ్గుతోపాటు పోయబడింది.
శ్రీమద్రామాయణానికి కాని శ్రీమద్వాల్మీకి మహర్షికి కాని పరిచయాలు ఏమీ అక్కరలేదు. ఈ ఇతిహాసా నికి ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకు అనుగ్రహించిన ఈ మహర్షిని కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంటూ చిన్న స్తోత్రం…
01.1.5.అనుష్టుప్
కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం।
ఆరుహ్య కవితా శాఖాం
వందే వాల్మీకి కోకిలమ్॥
01.1.6.వచనం
ఈ కోకిల కూజితం జాలతెలుగులకు రుచి చూపించ సంకల్పించ మని అదీ రామకార్యంగా అని అనుగ్రహం. వ్రాసేవారు, పాడేవారు, ఆడేవారు అందరూ తమతమ రామాయణం వ్రాయా లని ఒక నానుడి, అందచేత కావచ్చు గ్రంథరూప, శ్రవణ రూప, దృశ్య రూప రామాయణ ములు, సకల ప్రాంతీయ భాషలలోనూ, విదేశ భాషలలోనూ అగణ్యమైనవి వెలువడినవి. ఇప్పటికీ మహానుభావులు, పండిశ్రేష్టులు చేసిన నటువంటి రామాయణ గ్రంథములు అందుబాటులో ఉన్నాయి కదా మరల ఇప్పుడ ఎందుకు చేయటం? అవన్నీ కాగితం పుస్తకాల రూపంలో ఉన్నాయి. మన తెలుగులు ఎందరో అంతర్జాలం వాడు సౌఖ్యమునకు అలవాటు పడ్డారు పడుతున్నారు, ఇంకా ఎక్కువమందే ఈ మార్గంలోకి వస్తారు. అంతే కాక వివిధ విదేశాలలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉంటున్నారు. వారికి పుస్తకాలు తెప్పించుకోవడం కష్టం. అంతేకాకుండా, ఇప్పుడ వస్తున్న సాంకేతిక విస్తరణ వేగం చూస్తుంటే, శ. ష.స, హ తరాలలో హ తరం వారు ఆపైతరంవారి నవీన మాధ్యమాల మీదనే అలవాటు పడుతున్నారు. ఆ తరువాత తరాలు కాగితం పుస్తకాలను మనం తాళపత్ర గ్రంథాలను చూసినట్టులు చూసినను ఆశ్చర్య పడనక్కరలేదు. కనుక, శీఘ్రమే జాలతెలుగుల సంఖ్య అంతర్జాతీయ స్థాయికి పెరగాలి. మన సంస్కృతి సంప్రదాయాలకు ఆయువుపట్టులైన మన వాంగ్మయము మొత్తము, నవనవీన మాధ్యమం నందు అందుబాటులో తెచ్చుకోవాలి. ఇది అత్యవసరం.
ఈ భావనతో సాశ. 2008లో మన మూల ప్రమాణ గ్రంథములను ఈ నవీన మాధ్యములలో అధ్యయనము చేయుటకు అనుకూలమైన గణనోపాఖ్యానము అను విధానము సంకల్పించబడింది. ఆ విధానములో వివిధ గ్రంథములు చేయుటకొఱకు గణనాలయ మని సంస్థ ఏర్పటుచేసాము. ఆ ఛత్రం క్రింద ప్రప్రథమంగా పోతన తెలుగు భాగవతము అను సంస్థ స్థాపించబడి, చేసినవానిని తెలుగుభాగవతం.ఆర్గ్ నందు ప్రచురించాము. అంతే కాక అందు కొంత భాగము వికీసోర్స్, స్క్రిబ్డ్.కం, ఆర్కైవ్.ఆర్గ్, తెలుగుపరిశోధనాది జాలికలలో ప్రచురించాము.
ఇప్పుడు వాల్మీకి తెలుగు రామాయణ మని సంస్థ ఏర్పాటుచేసుకున్నాము. వాల్మీకి తెలుగు రామాయణ మంటే వాల్మీకి మహర్షి ప్రోక్త తెలుగు వారి శ్రీమత్ రామాయణమని. ఈ బృహద్గ్రంథ విస్తార విస్తృతుల రీత్యా సహితము నలుగురూ చేయివేస్తే కాని దుస్సాధ్య విషయమే. రామ కార్యం కదా ఏమీ పరవాలేదు మన హనుమంతుల వారు అండదండ ఉంటుంది అన్నారు మా శ్రీ అనంతకృష్ణుల వారు. సరే అని ధైర్యంచేసి స్వచ్ఛందంగా పాల్గొనేవారు కావాలని కోరాను.
అడగగానే కొందరు పూజ్యులు ముందుకు వచ్చారు. వారితో సత్సంగం రామునివారము అని సత్సంగం ఏర్పాటు చేసుకుని ఇలా ఆరంభించాము. ఆ విధంగా మన వాల్మీకి తెలుగు రామాయణమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికి ఎక్కడ ఉంటే అక్కడ, వీలయినంత సర్వ సమగ్రంగా, సంబంధించిన పుస్తకములు సహితముగా అందుబాటులోకి తీసుకురావాలని ఈ బృహత్ ప్రయత్నము. అలా ఈ రామకార్యంలో పాలుపంచుకుంటున్న పుణ్యాత్ములకు అందరకూ పేరుపేరునా అబినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
ఎప్పుడో పురాతన కాల ఋషిప్రోక్తమైనది శ్రీమద్రామాయణము. విస్తార విస్తృతుల రీత్యా బృహత్కావ్యము. అనేక చీడ పీడలు, రాక్షస పిశాచ యక్షాది గణాల వైకృత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, తట్టుకుని ఇంతటి బహుకాల ప్రభావములకు లోనైనది. అంతియేకాక, మరల మరల వ్రాయు, ప్రచురించు సందర్భములలో ఆయా మహానుభావుల దాటరాని స్వభావరీత్యా సహితము లుప్త ప్రక్షిప్తాదులు సహజమే. కనుకనే అనేక పాఠ్యంతరములు. అటులనే ఈ పాఠ్యంతరమునను కొన్ని గుణదోషములు దొర్లియే యుండును. కనుక మన్నించి, పంటి కింద రాయిలా పడిననూ, దోషములను వర్జించి గుణవంతములను గ్రహించ మనవి.
ఇందుకు ఉపయోగపడుతున్న అనేక గ్రంథముల, నిఘంటువుల, జాలికల కర్తలకు నిర్వాహకులకు వినయపూర్వక కృతజ్ఞతా ప్రణామములు. సాంకేతిక నిపుణులు, పండితులు, ఎందరో మహానుభావులు, కుటుంబ సభ్యులు సహకారం అందిస్తున్నారు. వారందరికీ; ఆదారాభిమానాలు చూపుతున్న, ప్రోత్సహిస్తున్న చదువరు లందరకీ మనః పూర్వక కృతజ్ఞతలు.
మాన్యులారా! వాల్మీకి తెలుగు రామాయణమ్ను అనుసరించండి. . వాడండి. . చదవండి. . పంచండి. . ధన్యులు కండి. . రామానుగ్రహం పొందండి.
- ఊలపల్లి సాంబశివ రావు.
(భాగవత గణనాధ్యాయి)
0.1-2.1.వచనం.
సర్వశ్రీ
1) అనంతకృష్ణ 2) అబ్బరాజు రమణ
3) అయపిళ్ళ సావిత్రి 4) ఆచార్య అయలూరు మురళి.
5) ఆచార్య.డా. పద్మావతి 6) ఊలపల్లి సాంబశివరావు
7) కూచిభట్ల అరుణ రేఖ, 8) కొర్నెపాటి విద్యాసాగర్
9) గంటి జానకి 10) గంటి నాగలక్ష్మి
11) గన్నవరపు నరసింహమూర్తి 12) గమిని ప్రసాదు
13) జంధ్యాల ఉమాదేవి 14) డా. పురాణపండ వైజయంతి
15) తనికెళ్ళ ప్రభాకరరావు 16) తురగా రామకృష్ణారావు
17) దుర్గామాధురి 18) మోపూరి ఉమామహేశ్
19) లంకా నాగరాజు 20) వెలగపూడి భారతి
________________________________________
01.2.2.గాయత్రి.
ఓం
సహనావవతు!
సహనౌభునక్తు!
సహవీర్యం కరవావహై।
తేజస్వి నావధీతమస్తు!
మా విద్విషా వహై॥
ఓం
శాంతిః శాంతిః శాంతిః!!
________________________________________
ఓం శ్రీరామ
శ్రీ మద్వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్రామాయణ మహేతిహాసము ఆధారంగా అంతర్జాల మాధ్యమమునందు చేయుచున్న శ్రీశ్రీశ్రీ వాల్మీకి తెలుగు రామాయణము కార్యక్రమమునకు సంప్రదించుచున్న ప్రధాన గ్రంథాదులు.
{అవకాశం ఉన్నవారు ఇతర సంప్రదింపు గ్రంథములను అందించమనవి.}
~@~
01.3.1. వచనము
(అ) గ్రంథములు
1) ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు బాలానందినీ వ్యాఖ్యతో రచించిన శ్రీమద్రామాయణము. (1995)
2) గీతాప్రెస్, గోరఖపూరి వారి శ్రీమద్రామాయణము (20వ పునర్ముద్రణ 2021), అనువాదకులు డా. ఎమ్. కృష్ణమాచార్యులు, డా. గోలి వేంకటరామయ్య గార్లు.
3) IIIT, Kharagaour వారి అంతర్జాల మాధ్యమ రామాయణము https://www.valmiki.iitk.ac.in/
4) అంతర్జాల మాధ్యమ వాల్మీకి రామాయణం (రీడు రామాయణ)
https://www-readramayana-org.translate.goog/?_x_tr_sl = en&_x_tr_tl = te&_x_tr_hl = te&_x_tr_pto = tc
5) దేవనాగరి- తుకారాం జావాజి, పూనే వారి రామాయణ, కాశీనాథ పాండురంగ పరవ్ గారు.(1902)
6) హిందీ రామనారాయణా లాల్, ఇలహాబాద్, అనువాదక్, చతుర్వేదీ ద్వారకాప్రసాదు శర్మ గారు, (1927)
7) వావిళ్ళ రామశాస్త్రుల వారు, ఆది సరస్వతీ ముద్రాక్షర శాల, చదలవాడ రామశాస్తుల వారు (1888) –
8) తెవికె నందలి వాల్మీకి రామాయణము.
(ఆ) నిఘంటువులు
I. ఆంధ్రభారతి వారి అంతర్జాల తెలుగు మఱియు సంస్కృత నిఘంటువులు
II. https://www.learnsanskrit.cc/ - వారి అంతర్జాల నిఘంటువు
III. సంస్కృతాంధ్ర నిఘంటువు. చలమచర్ల వేంకట శేషాచార్యులు వారు, (1987)
IV. ఆంధ్ర సంస్కృత కోశము, డా. పుల్లెల శ్రీరామచంద్రుడు, శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి, (1971)
V. సంస్కృతాంధ్ర పదకోశము, భాగవతుల రాధాకృష్ణమూర్తి
VI. శబ్దకల్పదృమః, స్యార – రాజా – రాథాకాన్త – బహాదూరేగ, వారణాశి. (1014)
VII. వాచస్పతమ్, బృహత్ సంస్కృతాభిధారనమ్, శ్రీతారానాథ – తర్కవాచస్పతీ – మహాచార్యేగా, వారణాశి. (విక్రమ సం. 1017)
VIII. ఆంధ్రశబ్ధరత్నాకరము, శిరోమణి చెలమచర్ల రంగాచార్యులు, (1996)
IX. ఆంధ్ర వాచస్పతము, కోట్ర శ్యామల కామశాస్త్రి. ~1938.
X. శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ, హైదరాబాదు, (1936)
________________________________________
శ్రీరామ
0.1.4.1.వచనం.
బ్రహ్మలీన – శ్రీ జయదయాళ్ గోయంధికా
01.4.2.అనుష్టుప్.
ఇతిహాస పురాణాభ్యాం
వేదం సముపబృంహయాన్।
భిభేత్యల్ప శ్రుతాద్వేదో
మామయం ప్రహర్షితి॥
01.4.3.వచనం.
వేద విజ్ఞాన రహస్యముల అవగాహనమునకు ఇతిహాస పురాణము లను అధ్యయనము చేయుట ఎంతయు ఆవశ్యకము. ఇతిహాస పురాణ ములను లోతుగా అధ్యయనము చేయని అల్పజ్ఞడు వేదములను (వేద రహస్యము లను) గూర్చి ప్రస్తావించుటకు పూనుకొనినప్పుడు వానిని జూచి, “వేదములకు విపరీతార్థములను కల్పించి చెప్పును. యధార్థములను భ్రష్టు పట్టించును" అని వేదములు భీతిల్లును..
వాస్తవముగా వేదములను అధ్యయనముచేయుటకు (అధిక శ్రద్ధా సక్తులుగల) కొంత మంది మాత్రమే అర్హులు. వేదభాష మిక్కిలి ప్రాచీన మైనది. వేదార్ధములు మిగుల గంభీర ములు, ఊహలకు అందనిని, అందు వలన వేదము లను అందఱును సులభముగా అర్థము చేసికొనజాలరు. యుగధర్మమును బట్టి వేదమును పరంపరగా పఠించు టయు, బోధించు టయు ఈకాలమున క్రమముగాసన్నగిల్లుతున్నది. బ్రాహ్మణులలోసైతము ఎంతగా వెదకినను అతికష్టము మీద అరుదుగామాత్రమే (అట్టి) వేదపండితులు లభింతురు. (వేదములను మంత్ర / పాఠములుగ పఠించుటే అరుదుగా కనబడుచున్నది. ఇక, వేదవిజ్ఞానమును వినయోగిం చుట / లౌకిక అవసరములకు వాడు నట్టి వేదవిజ్ఞుల విషయము చెప్పుట కేమున్నది?) ఏలననగా వేదములను సాంగోపాంగముగా అధ్యయనము చేయుటకు అధిక సమయము, సూక్ష్మబుద్ధి రెండును ఆవశ్యకములు. ఈ కాలమున ఈ రెండును లోపించుచు న్నట్లు కన బడుచున్నది. రానురాను మానవుల ఆయుర్దాయము, బుద్ధి తగ్గిపోవుచున్నవి. వేదములను అధ్యయ నము చేయుటకు బ్రహ్మచర్యము గూడ చాలా ముఖ్యము. బ్రహ్మచర్య దీక్షను పాటిం చుట గూడ జనులలో లోపించు చున్నది. ఈ విషయము లను దృష్టిలో ఉంచుకొనియే త్రికాలజ్ఞులైన మన మహర్షులు వేదవిజ్ఞా నము సామాన్య జనులకు అందుబాటులో నుండు నట్లుగా సరళమైన, సుబోధకమైన భాషలో ఆకర్షణీయమైన శైలిలో ఇతిహాస, పురాణము లను రచించిరి.
ఇతిహాస గ్రంథములలో శ్రీమద్రామాయణము, మహాభారతము అను రెండుమాత్రమే ప్రస్తుతము లభించుచు న్నవి. ఈరెండు గ్రంథములు భారతీయ వాఙ్మయమునకు తలమా నికములు, ఆర్యసభ్యతకు పట్టుగొమ్మలు. ఇవి భారతీయ గౌరవమును ఇరుమడింపజేయు నవి. ఈరెండింటిలో భక్తి,జ్ఞాన,వైరాగ్యములు, సదాచారములు, నీతినియమములు, ధర్మము మున్నగువాని ప్రభోధములు అడుగడుగునను కన్నట్టుచుండును. రామాయణమునందు మర్యాదపురుషోత్తము డైన శ్రీరామ చంద్రప్రభువు యొక్క దివ్యలీలలు వర్ణింపబడినవి. మహా భారతమున మణిమాలలో దారమువలె లీలాపురుషోత్తము డైన శ్రీకృష్ణభగవానుని మహి మలు అవిచ్ఛిన్నముగ ప్రస్తావింపబడినవి. ఈరెండింటియందును చైతన్యవంతమైన భార తీయ సంస్కృతి యొక్క సజీవరూపము తొణికిసలాడు చుండును. సంస్కృత సాహిత్యము నందు వెలువడిన దృశ్య, శ్రావ్య కావ్యము లన్నింటికిని (నాటకములు, ప్రబంధ ములు, సంకీర్తనలు మున్నగునవి) దాదాపు ఈరెండు ఇతిహాసగ్రంథములే ఆధారములు.
ఋషిప్రణీతములై, ఆర్యసంస్కృతికి మూలములైన ఈ రెండు గ్రంథము లును నిత్యసత్య ములైన ఇతిహాసములుగా చిరస్థిరకీర్తిని ఆర్జించినవి. అట్లే కవితా దృష్టితో గూడ వాఙ్మయ రంగమున అత్యున్నత స్థానమును ఆలంక రించినవి. ఐనను మహాభారతమునకు ఇతిహాస ముగా వచ్చిన గుర్తింపు కావ్యముగా రాలేదు. వాల్మీకి ప్రణీతమైన శ్రీమద్రామాయణమునకు మాత్రము ఇతిహాసముగానే గాక "ఆదికావ్యము"గా గూడ ఎనలేని గౌర వము దక్కినది. ఈ మహాకావ్యము కాంతవలె ఆనందింపజేయుచు, కర్తవ్యమును ఉపదేశించును. (కనుకనే కాంతాసమ్మితము అనబడుచున్నది; సమ్మితములు మూడు. 1. ప్రభుసమ్మితో వేదః – వేదము ప్రభువు వలె కర్తవ్యమును శాసించును. 2. మిత్రసమ్మితం పురాణమ్ – పురాణము మిత్రుని వలె కర్తవ్యమును సూచించును. 3. కాంతా సమ్మితం కావ్యమ్ – కావ్యము కాంత వలె ఆనందింపజేయుచు, కర్తవ్యమునకు మఱలించును). ఇదియే ఈ రామాయణము యొక్క విశేషము.
“సత్యంవద, ధర్మంచర, ఆచారాన్మాప్రమదః, ప్రజాతంతుం మావ్యవచ్చేత్సీః” మున్నగు విధి వాక్యములద్వారా వేదములు గురువువలె ఉపదేశించును. ఇతిహాస పురాణములు మాత్రము “రామవత్ వర్తితవ్యం రావణత్" అనువిధ ముగా మిత్రుని వలె హితబోధ చేయును. కావ్యము లైతే కాంత వలె ప్రేమానురాగములను రంగరించుచు ఆకరణీ యము లైన మృదు మధుర వచనములతో మనలను కర్తవ్యపథమునకు మఱల్చును. రామాయణము నందలి శ్రీరామ చంద్రుని “మాతృభక్తి పితృభక్తి కావ్య రూప” వర్ణనల ప్రభా వము మనపై ఉన్నట్లు “మాతృదేవో భవ పితృదేవో భవ" అను వేదవాక్య ముల ప్రభావము అంతగా ఉండదు. కాంతసమ్మతములై ఉపదేశము లనందించు కావ్యము లలో వాల్మీకి రామాయణ మహాకావ్యము యొక్క స్థానము సర్వోన్నతమైనది. రచనా కౌశలము, కావ్యవస్తు గౌర వము అను ఈ రెండింటివి బట్టి రామాయణము ప్రపంచము నందలి సమస్త కావ్యము లకు మకుటాయమానము.
వాల్మీకిరామాయణము (1) “ఆయా పరిస్థితులలో వ్యక్తులు ఎవరెవరితో ఎట్లు ప్రవర్తింప వలెను?" అను సామా జిక విషయములను నొక్కిచెప్పను. (2) “ప్రతివ్యక్తియు తన కుటుంబ సభ్యులకును, లోకములోని ఇతరుల కును సుఖములను చేకూర్చుటకై పాటుపడుట తన విధిగా భావింపవలె” నని తెలుపును. “అందులకై అవసరమగుచో తన వ్యక్తిగతమైన సుఖము లను త్యజించుటకును ఎట్టి కష్టములనైనను సహనముతో భరించుట కును సిద్దపడ వలెను” ఆను నైతిక బాధ్యతను వక్కాణించును. (3) అంతే గాక సత్యము, న్యాయము, సదాచారము, ప్రతిజ్ఞాపాట వము మొదలగు ఉదాత్తధర్మములను పాటించుచు, ఆదర్శజీవనమును గడిపెడి విధానములను ప్రబోధించును. ఈ విధముగా వాల్మీకి రామాయణము వివిధములైన సామా జిక, నైతిక, ధార్మిక విషయముల ప్రబోధములకు పెన్నిది. ఇందు అవతారపురుషుడైన శ్రీరామచంద్రుని యొక్క దివ్యము లైన మానుష లీలలు, సర్వాంగసుందర ముగా చిత్రింప బడినవి. ఇంకను ఇందు జగజ్జనని యైన సీతాదేవి యుక్క ఆదర్శవంతమైన పాతివ్రత్యము. (లక్ష్మణుని అచంచల కర్తవ్యదీక్ష, భ్రాతృభక్తి,) భరతుని నిరుపమాన మైన భ్రాతృభక్తి, త్యాగ గుణము, దశరధ మహా రాజు యొక్క అపూర్వమైన వాత్సల్యము, కౌసల్యాదేవి యొక్క మహోన్నత సౌజన్యము, ఆదర్శప్రాయ మైన శ్రవణ కుమారుని పితృభక్తి. హనుమంతుని యొక్క సాటిలేని స్వామి భక్తి, విభీషణుని యొక్క అసాధారణమైన న్యాయ దృష్టి, శ్రీరాముని యెడ ప్రజల యొక్క స్వాభావికములైన గాఢానురాగము సందర్భానుసారముగా చక్కగా వర్ణిత ములు, అంతేగాక పురుషోత్తముడైన శ్రీరామచంద్రప్రభువు నకు అందఱి యెడలనుగల పరిపూర్ణమైన దయ, మక్కువ శ్రద్ధాదరములు, ప్రేమానురాగములు, వీటన్నింటితో గూడిన యోగ్యమైన వ్యవహార సరళి ఇందు సాంగో పాంగముగా ప్రతిపాదింపబడినవి.
ఇందలి శ్లోకము లన్నియును మిక్కిలి మధురములు, రుచిరములు. మహాకావ్యోచితము లైన గుణములతో, శబ్దార్థాలంకారములతో సుశోభితములు, రాగతాళయుక్తముగా గానము చేయుటకు అనువైనవి, గంభీ రార్ణ యుక్తములు, సమయోపేతముగా ఇందు శృంగార, వీర, కరుణాద్భు తాది నవరసములు పరిపుష్టములైనవి. రసము లన్నింటికీని ఇది కుదురే యైనను కరుణరసము మాత్రము దీనికి ప్రాణము. ఏ దృష్టితో చూచినను ఇది అందఱును ఆదరింప దగిన (అందరి అభిరుచులను తీర్చగల) ఉత్తమ గ్రంథము.
“వాల్మీకిరామాయణము సర్వోత్కృష్టమైన ఒక మహాకావ్యము. అంతే గాక ఇది శ్రీరామ చంద్రప్రభువు యొక్క అవతార లీలావిశేషములను తెలుపు నట్టి చక్కని ఇతిహాసము” అను విషయము విస్మరింపరానిది. "స్వయంభువు" ఐన బ్రహ్మదేవుడే వాల్మీకిమహామునికి సాక్షా త్కరించి, రామాయణమును రచించుటకు ఆ మునిని ప్రోత్సహించెను. మఱియు అతడు "శ్రీరాముని వృత్తాంతమునకు సంబంధించిన విశేషము లన్ని యును నీకు సహజముగనే కర తలామలకము లగును" అని ఆ మహర్షికి వరమును ప్రసాదించెను. ఆ వర ప్రభావమున కథా విషయము లన్ని యును ఆ మునీశ్వరుని మనస్సునకు స్పష్టముగా గోచరించెను. కావ్య నాయకుడైన శ్రీరామచంద్రుని అవతా కాలమునందే వాటిని ఆ మహర్షి శ్లోకబద్ద మొనర్చెను. అంతేగాదు శ్రీరామచంద్రుని కుమారులైన లవకుశు లచే వాటిని కంఠస్థము చేయించెను. వారిచేతనే రాబోవు సంఘటనలతో సహా ఆ వృత్తాంతమును సంపూర్ణముగా శ్రీరాముని సమక్షముననే నిండు సభలో వినిపింపజేసెను. ఈ విధముగా ఈ ఇతిహాసకారకు డైన శ్రీరాముని ఆమోదము లభించినట్లైనది. దీని ప్రామాణికత విషయమున ఇంతకంటె చెప్ప వలసిన దేమియుండును? శ్రీరాముని ఆమోదముద్రకు నోచుకొనిన ఈ మహాకావ్యము నందు. అసత్యములుగాని, దోషములు గాని, అతిశయోక్తులుగాని ఉండునని ఉహించుటకు ఏమాత్రమును వీలు లేదు. ఇది సకలజనులకు ఆదరణీయము, మిగుల ప్రయోజనకరము. ఈ రామాయణ మహాకావ్యమును (ఈ రామ గాథను) ప్రచారము చేయుట వలన అనంత మైన లోకకళ్యాణము సిద్ధించును.
ప్రపంచము నందలి అన్ని జాతుల వారును. అన్ని వర్గముల వారును (మానవు లెల్లరును) దీనిని వరించుటకును, వినుటకును అర్హులే. ప్రతివ్యక్తియు దీనిని శ్రద్ధగాపఠించి, అవగాహన చేసికొని, ఇందలి ఉత్తమో త్తమ ఉపదేశములను యధాశక్తి ఆచరించినచో అతని జీవితము ఆదర్శప్రాయమై సఫలమగును.
గమనిక :- స్కంధ పురాణాంతర్గత శ్రీమద్రామాయణ మహత్యము నందు బహు విపులంగా వివరింప బడినది. దీనిని పఠించు సంప్రదాయము కూడ గలదు.
________________________________________
0.1.5.1వచనం.
(శ్రీమద్రామాయణ పూజాక్రమః)
01.5.2.అనుష్టుప్
ఓం శుక్లాంబరధరం విష్ణుం,
శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయేత్,
సర్వవిఘ్నోపశాంతయే.
01.5.3.వచనం.
ప్రాణాయామం
ఓం భూర్భువస్సువః . . .
సంకల్పం
. . . . ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమత్ ప్రసాద సిద్ధ్యర్థం, తద్వారా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ద్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, సర్వపాప క్షయర్థం, శ్రీ వాల్మీకి రామాయణ పారాయణ కరిష్యే, తదర్థం శ్రీరామచంద్రపూజాం కరిష్యే.
ఆచమనీయం
ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీకృష్ణపరబ్రహ్మనేనమః.
పూజః
ఆస్మిన్ పుస్తకే శ్రీరామచంద్రం ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పంచామృతం సమర్పయామి, శుద్ధోదకేన స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపీతం సమర్పయాను, ఆభరణాని సమర్పయామి, శ్రీ గంధాన్ ధారయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పై పూజయామి, శ్రీ రామచంద్రాయ నమః ధూప మాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం (క్షీరాది) నైవేద్యం సమర్పయామి, శుద్ధ- ఆచమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, కర్పూర - ఆనంద నీరాజనం దర్శయామి, ఛత్రం ధారయామి, చామరం వీచయామి, గీతం శ్రావయామి, నృత్వం దర్శయామి, వాద్యం ఘోషయామి, సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి, సమస్త రాజోపచార - దేవోపచారాన్ సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి, సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు, సర్వం శ్రీ రామార్పణ మస్తు.
శ్రీమద్రామాయణ పారాయణ - ఉపక్రమః
అంగన్యాస కరన్యాపాదయః
అస్య శ్రీమద్వాల్మీకి రామాయణ మహామన్త్రస్య, నారదో భగవాన్ ఋషి, అనుష్టుప్ ఛందః, శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీరామచన్ద్రో దేవతా, ఓం బీజం, ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది ఇతి శక్తిః, పౌరుషే చా ప్రతిద్వంద్వః, శరైణం జహి రావణిమ్ కీలకం, శ్రీ రామచంద్ర ప్రసాద సిధ్యర్థే జప వినియోగః. ధర్మాత్మా - అంగుష్ఠాభ్యాం నమః, సత్యసంధశ్చ - తర్జనీభ్యాం నమః, రామః - మధ్యమాభ్యాం నమః, దాశరథి ర్యది - అనామికాభ్యాం నమః, పౌరుషే చాప్రతిద్వంద్వ కనిష్ఠికాభ్యాం నమః, శరైణం జహి రావణిం - కరతల కరపృష్టాభ్యాం నమః, ధర్మాత్మా – హృదయాయ నమః, సత్యసంధశ్చ – శిరసే నమః, రామః – శిఖాయై నమః, దాశరథిర్యధి - కవచాయ హుం, పౌరుషే చాప్రతిద్వంద్వః - నేత్రత్రయాయ వౌషట్, శరైణం జహి రావణమ్ - ఆస్ట్రాయ ఫట్, భూర్భువస్సువరోమ్ ఇతి – దిగ్భన్దః.
ధ్యానం
శ్రీ మహా గణపతి ధ్యానం
01.5.8.అనుష్టుప్.
శుక్లాంబరధరం విష్ణుం,
శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్న వదనం ధ్యాయేత్,
సర్వ విఘ్నోపశాంతయే.
శ్రీ సరస్వతీ ప్రార్ధనా
01.5.4.అనుష్టుప్.
సరస్వతి నమస్తుభ్యం,
వరదే కామరూపిణి,
విద్యారంభం కరిష్యామి,
సిద్ధిర్భవతు మే సదా.
శ్రీ వాల్మీకి ప్రార్థన
01.5.5.అనుష్టుప్.
కూజంతం రామ రామేతి,
మధురం మధురాక్షరం,
ఆరుహ్య కవితా శాఖాం,
వందే వాల్మీకి కోకిలం.
శ్రీ ఆంజనేయ ప్రార్థన
01.5.6.త్రిష్టుప్.
మనోజవం మారుత త్యుల్య వేగం,
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ట౦,
వాతాత్మజం వానర యూధ ముఖ్యం,
శ్రీ రామ దూతం శిరసా నమామి.
శ్రీ రామాయణ ప్రార్ధన
01.5.7.అనుష్టుప్.
శ్లోక సార సమా కీర్ణం
సర్గ కల్లోల సంకులం,
కా౦డ గ్రాహ మహా మీనం
వందే రామాయణార్ణవం.
శ్రీ రామ ధ్యానం
01.5.8.త్రిష్టుప్.
1మాతా రామో మత్పితా రామభద్రో,
భ్రాతా రామో మత్ సఖా రాఘవేశః,
సర్వస్వం మే రామచంద్రో దయాళుః,
నా౭న్యం దేవం నైవ జానే న జానే.
2నమోస్తు రామాయ స లక్ష్మణాయ,
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై,
నమోస్తు రుద్రేంద్ర యమా౭నిలేభ్యో,
నమోస్తు చంద్రార్క మరు ద్గణేభ్యః.
01.5.9.వచనం.
అథః శ్రీరామచంద్ర ప్రభు కరుణేన శ్రీమత్ వాల్మీకి తెలుగు రామాయణ పారాయణ ఆరంభః
శ్రీమత్ వాల్మీకి తెలుగు Iరామాయణ పారాయణ అనంతరే పునః పూజా కరిష్యామి.
ఆస్మిన్ పుస్తకే శ్రీరామచంద్రాయ నమః అక్షతాన్ సమర్పయామి, పుష్పై పూజయామి, ధూప మాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం (క్షీరాది) నైవేద్యం సమర్పయామి, శుద్ధ- ఆచమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, కర్పూర - ఆనంద నీరాజనం దర్శయామి, మంత్రపుష్పం సమర్పయామి, సమస్త రాజోపచార - దేవోపచారాన్ సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి, సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు, సర్వం శ్రీ రామార్పణ మస్తు.
________________________________________
01.5.10.శ్లో.
రామాయణ పారాయణ సమాపన శ్లోకాః
1స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం,
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశా,
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం,
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు.
2చరితం రఘునాథస్య
శతకోటి ప్రవిస్తరమ్,
ఏకైక మక్షరం పుంసాం
మహపాతక నాశనమ్.
3రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేధసే!
రఘునాథాయ నాథాయ
సీతాయాః పతయే నమః.
శ్రీ రామమంగళాశాసనమ్
1మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్దియే,
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.
2వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే,
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్.
3విశ్వామి త్రాంతరంగాయ మిథిలానగరీపతేం,
భాగ్యానాం పరిపాకాయ భావ్యరూపాయ మంగళమ్.
4పితృభక్తాయ సతతం భ్రాతృభిః, సహా సీతయా,
నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళమ్.
5త్వ క్తసాకేతచాసాయ చిత్రకూటవిహారణే,
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళమ్.
6సౌమిత్రణా చ జానక్యా చావబాణాసిధారిణే,
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళమ్.
7దండకారణ్యచాసాయ ఖరదూషణశత్రవే,
గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయస్తు మంగళమ్.
8సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే,
సౌలభ్య పరిపూర్ణాయ సత్త్వోద్రిక్తాయ మంగళమ్.
9హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినేః,
వాలి ప్రమధనాయాస్తు మహాధీరాయ మంగళమ్.
10శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే,
జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళమ్.
11విభీషణకృతే ప్రీత్యా లంకాభీష్టప్రదాయినేః,
సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళమ్.
12అగత్యనగరీం దివ్యామభిషిక్తాయ మంగళమ్,
రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళమ్.
13బ్రహ్మాదిదేవసేవ్యాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే,
జానకీ ప్రాణనాథాయ రఘునాథాయ మంగళమ్.
14శ్రీ సౌమ్యజామాత్ హ్బుమనే¬ కృపయాస్మానుపేయుషే,
మహాతే మమ నాథాయ రఘునాథాయ మంగళమ్.
15అమంగళాశాసనః పరైర్మదాచార్య పురోగమై:,
సర్వైశ్చ పూర్త్వైరాచార్త్వైః సత్కృతాయాస్తూ మంగళమ్.
16రమ్యజామాతృమునినా మంగళాశాసనం కృతమ్,
త్రైలోక్యాధిపతి: శ్రీమాన్ కరోతు మంగళం సదా.
ఇతి శ్రీవరవరమునిస్వామికృత శ్రీరామమంగళాశాసనం సంపూర్ణం
________________________________________
0.1-6.1.వచనం.
సద్గురు సకాశాల్లజ్ఞోపదేశో వక్ష్యమాణిరీత్యా శ్రీరామాయణ పారాయణంకుర్యాత్ - దేశకాలౌ సంకీర్త్యన్ :-
అస్యశ్రీ రామాయణమహామంత్రస్య; వాల్మీకి భగవాన్ ఋషిః; అనుష్టుప్ఛందః; శ్రీసీతాలక్ష్మణ భరత శత్రుఘ్నహనుమత్సమేత శ్రీరామ చంద్రోదేవతా; రాం బీజం; శ్రీం శక్తిః; మం కీలకం; సుమశ్రీసీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ త్సమేత శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధ్యర్ధే పారాయణ జపేవినియోగః; రాం అంగుష్ఠాధ్యాన్నమః; రీం తర్జనీ ధ్యాం స్వాహాః; రూం మధ్యమాభ్యాంవషట్; రైం అనామికాభ్యాం హుం; రౌం కనిష్ఠికాభ్యాంవౌషట్; రః కరతలకరపృష్టాభ్యాంఫట్; రాం హృదయాయనమః; రీం శిరసేస్వాహా; రూం శిఖాయైవషట్; రైం కవచాయహుం; రౌం నేత్రత్రయాయ వౌషట్; రః అస్త్రాయ ఫట్; లోకత్రయేణ దిగ్బంధః.
ధ్యానం.
కాలాంభోధర కాంతికాంత మనిశం వీరాసనా ధ్యాసినం, ముద్రాంజ్ఞానమయీందఛాన మపరంహస్తాంబుజం జానుని; సీతాం పార్శ్వగ తాంసరోరుహక రాంవిద్యున్నిభాం రాఘవం, పశ్యంతం మకుటాంగ దాదివివిధాకల్పోజ్జ్వలాంగం భజే.
అథ మానసికపూజా.
లం పృథివ్యాత్మనే శ్రీరామచంద్రపరబ్రహ్మణే గంధం సమర్పయామి- హం ఆకాశాత్మనే శ్రీరామచంద్రపరబ్రహ్మణే పుష్పం సమర్పయామి- యం వాయ్వాత్మనే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే ధూప మాఘ్రాపయామి- రం అగ్న్యాత్మనే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే దీపం దర్శయామి - వం అమృతాత్మనే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే అమృతోపహారం సమర్పయామి- సం సర్వాత్మనే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే సర్వోపచార పూజా స్వమర్ప యామి ఇతి మానసిక పూజా.
మూలమంత్ర
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్వది,
పౌరుషే చాప్రతిద్వంద్వ శరైనం జహి రావణిమ్.
ఇతి, యథాశ క్తిజపిత్వా, శ్రీరామాయణ పారాయణం కుర్యాత్ . అనంతరం, పునః, ధ్యానం, మానసికపూజాం, హృదయాది న్యాసంచ కుర్యాత్- లోకత్రయేణదిగ్విమోకః.
గుహ్యాతిగుహ్య గోప్తాత్వం గృహాణాస్మత్కృతం జపమ్
సిద్ధిర్భవతు మేదేవ త్వత్ప్రసాదా ద్రఘూద్వహ,
ఇతి పారాయణం శ్రీరామచంద్రాయ సమర్పయేత్ .
శ్రీరామచంద్రార్పణమస్తు
॥ప్రార్థనలు॥
రామాయణ విధి, పారాయణ క్రమము అనుసరించలేని పాఠకులు గ్రంథారంభ కాండారంభములందు ప్రార్థనలు చేయుట సముచితము.
________________________________________
01.7.1.మంత్రం.
ఓం నమో నారాయణాయః॥
01.7.2.అనుష్టుప్.
శుక్లాం బరధరం విష్ణుం - శశి వర్ణం, చతుర్భుజం।
ప్రసన్నవదనం ధ్యాయేత్ - సర్వ విఘ్నోప శాంతయే॥
01.7.3.అనుష్టుప్.
శారదా శారదాంభోజ - వదనా వదనాంభుజే।
సర్వదా సర్వదాస్మాకం, - సన్నిధి సన్నిధిం క్రియాత్॥
01.7.4.అనుష్టుప్.
శాంతాకారం భుజగశయనం - పద్మనాభం సురేశం।
విశ్వాధారం గగన సదృశం - మేఘవర్ణం శుభాంగం।
01.7.5.అనుష్టుప్.
లక్ష్మీకాంతం కమల నయనం - యోగిహృద్ధ్యాన గమ్యం।
వందే విష్ణుం భవ భాయహరం - సర్వలోకైక నాథం॥
01.7.6.త్రిష్టుప్.
నమోస్తు రామాయ సలక్ష్మణాయ।
దేవ్యైచ తస్మై జనకాత్మజాయై।
నమోఽ స్తు రుద్రేంద్ర యమాఽ నిలేభ్యో ।
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః॥
01.7.7.అనుష్టుప్
కూజంతం రామరామేతి - మధురం మధురాక్షరమ్।
ఆరుహ్య కవితాశాఖాం - వందే వాల్మీకి కోకిలమ్॥
01.7.8.జగతి.
యత్రయత్ర రఘునాధ కీర్తనమం - తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్।
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥
01.7.9.ఉత్పలమాల.
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; ।
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం।
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ।
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్॥
________________________________________
01.8.1.కందం.
శ్రీకంఠచాప ఖండన
పాకారిప్రముఖ వినుత భండన విలస।
త్కాకుత్థ్సవంశమండన
రాకేందు యశోవిశాల రామనృపాలా॥
01.8.2.అనుష్టుప్.
యదక్షర పదభ్రష్టం
మాత్రాహీనం యద్భవేత్।
తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణా నమోస్తుతే॥
01.8.3.త్రిష్టుప్.
కాయేనవాచా మనసేంద్రియైర్వా
బుధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్।
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణేతి సమర్పయామి॥
ఓం ఓం ఓం॥
ఓం శాంతిః శాంతిః శాంతిః।
సర్వే జనా స్సుఖినోభవంతు॥
________________________________________