2.97.1.
అనుష్టుప్.
సుసంరబ్ధం తు సౌమిత్రిం
లక్ష్మణం క్రోధమూర్ఛితమ్।
రామస్తు పరిసాన్త్వా్యథ
వచనం చేదమబ్రవీత్॥
టీక:-
సుసంరబ్ధం తు = మిక్కిలి తొందరపడుచున్న; సౌమిత్రిం = సుమిత్ర కుమారుడైన; లక్ష్మణం = లక్ష్మణుని; క్రోధ = కోపముతో; మూర్ఛితమ్ = స్మారకము తప్పినట్లున్న; రామః తు = రాముడు ఇట్లు; పరిసాన్త్వ = శాంతింపచేయుచు; అథ = అటు పిమ్మట; వచనం చ = మాటలను; ఇదమ్ = ఈ; అబ్రవీత్ = పలికెను
భావము:-
అటు పిమ్మట రాముడు ఈ విధముగా మిక్కిలి కోపించి తొందరపడుచున్న లక్ష్మణుని శాంతింపచేయుచు ఇట్లు పలికెను.
2.97.2.
అనుష్టుప్.
కిమత్ర ధనుషా కార్యమ్
అసినా వా సచర్మణా।
మహేష్వాసే మహాప్రాజ్ఞే
భరతే స్వయమాగతే॥
టీక:-
కిమత్ర = ఏమి ఉన్నది; ధనుషా = ధనుస్సుతో; కార్యమ్ = పని; అసినా వా = కత్తితో గాని; సచర్మణా = డాలుతో గాని; మహేష్వాసే = గొప్ప ధనుస్సును ధరించినవాడు; మహాప్రాజ్ఞే = అన్నీ తెలిసినవాడు; భరతః = భరతుడు; స్వయమ్ = స్వయముగా; ఆగతే = వచ్చుచున్నప్పుడు
భావము:-
భరతుడు స్వయముగా వచ్చుచున్నపుడు, మనకు ధనుస్సుతో గాని, కత్తితో గాని, డాలుతో గాని, ఏమి పని ఉన్నది?
2.97.3.
అనుష్టుప్.
పితుస్సత్యం ప్రతిశ్రుత్య
హత్వా భరతమాగతమ్।
కిం కరిష్యామి రాజ్యేన
సాపవాదేన లక్ష్మణ॥
టీక:-
పితుః = తండ్రియొక్క; సత్యం = సత్యమును; ప్రతిశ్రుత్య = ప్రతిజ్ఞ చేసిన; హత్వా = చంపి; భరతమ్ = భరతుని; ఆగతమ్ = చూడవచ్చిన; కిం కరిష్యామి = ఏమి చేసెదను; రాజ్యేన = రాజ్యముతో; స + అపవాదేన = అపకీర్తితో కూడిన; లక్ష్మణ = ఓ లక్ష్మణా.
భావము:-
ఓ లక్ష్మణా! తండ్రి వాక్యము సత్యము చేసెదనని ప్రతిజ్ఞ చేసిన నేను, నన్ను చూడవచ్చిన భరతుని చంపి, అపకీర్తితో కూడ సంపాదించిన ఈ రాజ్యముతో ఏమి చేసెదను?
2.97.4.
అనుష్టుప్.
యద్ధ్రవ్యం బాన్ధవానాం వా
మిత్రాణాం వా క్షయే భవేత్।
నాహం తత్ప్రతి గృహ్ణీయాం
భక్షాన్విషకృతానివ॥
టీక:-
యత్ = ఏదైతే; ద్రవ్యం = ద్రవ్యము; బాన్ధవానాం వా = బంధువులకు గాని; మిత్రాణాం వా = మిత్రులకు గాని; క్షయే= నాశనమందు; భవేత్ – కలుగునో; న = చేయను; అహం = నేను; తత్ = వాటిని; ప్రతి గృహ్ణీయాం = స్వీకరించుట; భక్షాన్ = పిండివంటలు; విషకృతాన్ = విషముతో వండిన; ఇవ = వలె.
భావము:-
బంధువులకు గాని, మిత్రులకు గాని నాశనము కలుగుటచే లభించిన ద్రవ్యమును విషముతో వండిన పిండివంటలను వలె నేను ముట్టుకొనను.
2.97.5.
అనుష్టుప్.
ధర్మమర్థం చ కామం చ
పృథివీం చాపి లక్ష్మణ।
ఇచ్ఛామి భవతామర్థే
ఏతత్ ప్రతిశృణోమి తే॥
టీక:-
ధర్మమ్ = ధర్మమును; అర్థం చ = అర్థమును; కామం చ = కామమును; పృథివీం చ + అపి = ఈ రాజ్యమును కూడా; లక్ష్మణ = ఓ లక్ష్మణా; ఇచ్ఛామి = కోరుచున్నాను; భవతామ్ = మీ నిమిత్తమే; అర్థే = కోరుచున్నాను; ఏతత్ = ఇది అంతయు; ప్రతిశృణోమి = ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను; తే = నీ కొరకు,
భావము:-
ధర్మార్ధకామములను, ఈ రాజ్యమును కూడ మీ నిమిత్తమే కోరుచున్నాను కాని, నా కొరకు కాదు. ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.
2.97.6.
అనుష్టుప్.
భ్రాత్రూణాం సంగ్రహార్థం చ
సుఖార్థం చాపి లక్ష్మణ।
రాజ్యమప్యహమిచ్ఛామి
సత్యేనాఽయుధమాలభే॥
టీక:-
భ్రాత్రూణాం = సోదరులైన; సంగ్రహార్థం చ = కూడగట్టుకొనుటకు; సుఖార్థం చ + అపి = సుఖము కొరకు మాత్రమే; లక్ష్మణ = ఓ లక్ష్మణా; రాజ్యమ్ = రాజ్యమును; అపి = అది కూడా; అహమ్ = నేను; ఇచ్ఛామి = కోరుచున్నాను; సత్యేన = శపథము; ఆయుధమ్ = ఆయుధములను; ఆలభే –స్చృశించుచున్నాను
భావము:-
నేను రాజ్యమును కోరుచున్నాను అన్నచో అది సోదరులైన మిమ్ములను కూడగట్టుకొనుటకు, మీ సుఖము కొరకు మాత్రమే. ఆయుధములు స్పృశించి శపథము చేయుచున్నాను.
2.97.7.
అనుష్టుప్.
నేయం మమ మహీ సౌమ్య
దుర్లభా సాగరాంబరా।
న హీచ్ఛేయమధర్మేణ
శక్రత్వమపి లక్ష్మణ॥
టీక:-
న = కాదు; ఇయం = ఈ హూమి; మమ = నాకు; మహీ = భూమిపై; సౌమ్య = సౌమ్యుడా; దుర్లభా = కష్టమైనది; సాగర = సముద్రము;అంబరా = వస్త్రముగా కలిగియున్న; న హి – కాదు; ఇచ్ఛేయమ్ = కోరుకున్నచో; అధర్మేణ = అధర్మముచే; శక్రత్వమ్ +అపి = ఇంద్రపదవి అయినప్పటికీ; లక్ష్మణ = ఓ లక్ష్మణా.
భావము:-
నేను తలచుకున్నచో సముద్రపర్యంతమైన ఈ భూమిపై ఆధిపత్యము నాకు లభించనిది కాదు. కాని, అధర్మముచే వచ్చిన ఇంద్రపదవి కూడ నాకు ఇష్టము కాదు.
2.97.8.
అనుష్టుప్.
యద్వినా భరతం త్వాం చ
శత్రుఘ్నం చాపి మానద।
భవేన్మమ సుఖం కించిత్
భస్మ తత్కురుతాం శిఖీ॥
టీక:-
యత్=ఏది; వినా = లేకుండగ; భరతం = భరతుడుని; త్వాం చ = నిన్ను గాని; శత్రుఘ్నం చ + అపి = శత్రుఘ్నుని గాని; మానద = గౌరవమును సంరక్షించు ఓ లక్ష్మణా; భవేత్ = అగునో; మమ = నాకు; సుఖం = సుఖమైనను; కించిత్ = కొంచెము; భస్మ = భస్మము; తత్ = అది; కురుతాం = చేయునుగాక; శిఖీ = అగ్ని.
భావము:-
గౌరవమును సంరక్షించు ఓ లక్ష్మణా! భరతుడు, నీవు, శత్రుఘ్నుడు అనుభవించని ఏమాత్రము సుఖము నాకు కలిగినను దానిని అగ్ని భస్మము చేయుగాక!
2.97.9.
అనుష్టుప్.
మన్యేఽహమాగతోఽయోధ్యాం
భరతో భ్రాతృ వత్సలః।
మమ ప్రాణాత్ప్రియతరః
కులధర్మమనుస్మరన్॥
టీక:-
మన్యే = తలచుచుంటిని; అహమ్ = నేను; ఆగతః = వచ్చియుండును; అయోధ్యాం = అయోధ్యా నగరముగూర్చి; భరతః = భరతుడు; భ్రాతృ వత్సలః = సోదరులయందు ప్రేమ కలవాడు; మమ = నాకు; ప్రాణాత్ = ప్రాణముకంటె; ప్రియతరః = ప్రియమైనవాడు; కులధర్మమ్ = కులధర్మమును; అనుస్మరన్ = స్మరించును.
భావము:-
భరతుడు సోదరులయందు ప్రేమకలవాడు. నాకు ప్రాణముల కంటే ప్రియుడు. మన వంశములో’ రాజుయొక్క జ్యేష్ఠపుత్రుడే రాజు కావలెను‘ అను కులధర్మమును తెలిసినవాడు అగుటచే అతడు కేకయ దేశము నుండి అయోధ్యకు తిరిగి వచ్చియుండును.
2.97.10.
అనుష్టుప్.
శ్రుత్వా ప్రవ్రాజితం మాం హి
జటావల్కలధారిణమ్।
జానక్యాసహితం వీర
త్వయా చ పురుషర్షభ॥
టీక:-
శ్రుత్వా = విని; ప్రవ్రాజితం = అరణ్యమునకు పంపించబడినవానిగ; మాం హి = నన్ను కూడా; జటావల్కల = జటావల్కలములు; ధారిణమ్ = ధరించినవాడనై; జానక్యా = జానకి; సహితం = సహితముగా; వీర = ఓ వీరుడా; త్వయా చ = నీతోడను; పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడు
భావము:-
నేను జటావల్కలములు ధరించి నీతోను, జానకితోను అరణ్యమునకు పంపివేయబడినట్లు తెలిసికొనియుందును.
2.97.11.
అనుష్టుప్.
స్నేహేనాఽక్రాన్తహృదయః
శోకేనాకులితేన్ద్రియః।
ద్రష్టుమభ్యాగతో హ్యేష
భరతో నాన్యథాఽగతః॥
టీక:-
స్నేహేన = స్నేహపూర్వకముగా; ఆక్రాన్త = ఆక్రమించబడిన; హృదయః = హృదయము గలవాడు; శోకేన = శోకముతో; ఆకులిత = వ్యాకులము చేయబడిన;ఇన్ద్రియః = ఇంద్రియములు గలవాడు; ద్రష్టుమ్ = చూచుటకు; అభ్యాగతః హి = వచ్చి ఉండును; ఏష = అందులకే; భరతః = భరతుడు; న అన్యథా = వేరొక కారణము వలన కాదు; ఆగతః = వచ్చినవాడు.
భావము:-
అది విని అతడి ఇంద్రియములు శోకముతో వ్యాకులమైయుండును. అతడు మనలను చూచుటకు వచ్చెను. వేరొక కారణమువలన కాదని తలచుచున్నాను.
2.97.12.
అనుష్టుప్.
అమ్బాం చ కైకయీం రుష్య
పరుషం చాప్రియం వదన్।
ప్రసాద్య పితరం శ్రీమాన్
రాజ్యం మే దాతుమాగతః॥
టీక:-
అమ్బాం చ = తల్లి అయిన; కైకయీం = కైకేయిని; రుష్య = కోపించి; పరుషం చ = పరుషమైనవియు; అప్రియం = అప్రియమైన; వదన్ = వాక్యములతో; ప్రసాద్య = అనుగ్రహింప చేసుకొని; పితరం = తండ్రిగారిని; శ్రీమాన్ = గౌరవనీయులైన; రాజ్యం = రాజ్యమును; మే = నాకు; దాతుమ్ = ఇచ్చుటకు; ఆగతః = వచ్చెను
భావము:-
భరతుడు తన తల్లి కైకేయిపై కోపించి ఆమెను పరుషములైన అప్రియవాక్యములతో దూషించి, తండ్రిగారిని అనుగ్రహింపచేసుకొని, నాకు రాజ్యమును ఇచ్చుటకై వచ్చినాడు.
2.97.13.
అనుష్టుప్.
ప్రాప్తకాలం యదేషోఽస్మాన్
భరతో ద్రష్టుమిచ్ఛతి।
అస్మాసు మనసాఽప్యేష
నాప్రియం కించిదాచరేత్॥
టీక:-
ప్రాప్తకాలం = తగిన సమయము; యత్ = ఏది కలదో; ఏషః = ఇది; అస్మాన్ = మనలను; భరతః = భరతుడు; ద్రష్టుమ్ = చూచుటకై; ఇచ్ఛతి = కోరుకొనుట; అస్మాసు = నా యెడ; మనసా + అపి = మనస్సునందు కూడ; ఏష = ఇదియే; న + అప్రియం = అప్రియము చేయడు; కించిత్ = కొంచెము కూడ; ఆచరేత్ = ఆచరించుటకు
భావము:-
భరతుడు మనలను చూచుటకై వచ్చుటకు ఇది తగిన సమయమే. ఇతడు మన విషయమున ఏ అప్రియము చేయుటకు, మనస్సులో కూడ ఆలోచింపజాలడు.
2.97.14.
అనుష్టుప్.
విప్రియం కృతపూర్వం తే
భరతేన కదా ను కిమ్।
ఈదృశం వా భయం తేఽద్య
భరతం యోఽత్ర శంకసే॥
టీక:-
విప్రియం = అపకారము; కృత = చేయబడినదా; పూర్వం = గతములో; తే = నీకు; భరతేన = భరతునిచేత; కదా ను కిమ్ = ఎన్నడైనా, ఏమైనా; ఈదృశం వా = ఈ విధముగా; భయం = భయము; తే = నీకు; అద్య = ఇప్పుడు; భరతం = భరతుని; యః = ఎవరు; అత్ర = ఇక్కడ; శంకసే = శంకించుచున్నావు
భావము:-
నీకు పూర్వము ఎన్నడైనా భరతుడు ఏదైనా అపకారము చేసి యున్నాడా? లేదా ఇట్టి భయమును కలిగించినాడా! నీవు భరతుని గూర్చి ఇపుడు ఇట్లు ఎందువలన శంకించుచున్నావు?
2.97.15.
అనుష్టుప్.
న హి తే నిష్ఠురం వాచ్యో
భరతో నాప్రియం వచః।
అహం హ్యప్రియముక్తస్సా్యం
భరతస్యాప్రియే కృతే॥
టీక:-
న హి = లేకుండుట; తే = నీకు; నిష్ఠురం = పరుషమైన; వాచ్యః = పలుకులు; భరతః = భరతుడు; న = తగదు; అప్రియం=అప్రియమైన; వచః = మాటలు; అహం హి = నేనే; అప్రియమ్ = అప్రియములైనవి; ఉక్తః = చెప్పబడినవాడను; స్యాం = కాగలను; భరతస్య = భరతునికి; అప్రియే = అప్రియమైనది; కృతే = చేయబడినచో
భావము:-
నీవు భరతుని విషయమున పరుషములు, అప్రియములు అయిన మాటలు చెప్పరాదు. భరతుని గూర్చి అప్రియ వాక్యములు పలికినచో ఆ వాక్యములు నన్నుగూర్చియే పలికినట్లగును.
2.97.16.
అనుష్టుప్.
కథం ను పుత్రాః పితరం
హన్యుః కస్యాం చిదాపది।
భ్రాతా వా భ్రాతరం హన్యాత్
సౌమిత్రే ప్రాణమాత్మనః॥
టీక:-
కథం ను = ఏ విధముగా; పుత్రాః = కుమారులు; పితరం = తండ్రిని; హన్యుః = చంపెదరు; కస్యాం = ఎట్టి; చిత్+ ఆపది – ఆపదయందైనను; భ్రాతా వా = సోదరుడైన; భ్రాతరం = సోదరుని; హన్యాత్ = చంపును; సౌమిత్రే = లక్ష్మణా; ప్రాణమ్ ఆత్మనః = ప్రాణముతో సమానుడైన
భావము:-
భరతుని దూషించినచో నన్నే దూషించినట్లు అగును. ఎంతటి ఆపదయందైనను పుత్రులు తండ్రిని చంపుదురా! సోదరుడు తన ప్రాణసమానుడైన సోదరుని చంపునా!
2.97.17.
అనుష్టుప్.
యది రాజ్యస్య హేతోస్త్వమ్
ఇమాం వాచం ప్రభాషసే।
వక్షా్యమి భరతం దృష్ట్వా
రాజ్యమస్మై ప్రదీయతామ్॥
టీక:-
యది = అయినచో; రాజ్యస్య హేతోః = రాజ్యముయొక్క కారణమున; త్వమ్ = నీవు; ఇమాం = ఇటువంటి; వాచం = మాటలను; ప్రభాషసే = మాటలాడుచున్నచో; వక్షా్యమి = చెప్పెదను; భరతం = భరతుని; దృష్ట్వా = చూచి; రాజ్యమ్ = రాజ్యమును; అస్మై = ఇతనికి; ప్రదీయతామ్ = ఇవ్వబడును గాక
భావము:-
నీవు రాజ్యముకొరకై ఇట్లు మాటలాడుచున్నయెడల,।రాజ్యమును లక్ష్మణునకు ఇమ్ము’ అని భరతునితో చెప్పెదను.
2.97.18.
అనుష్టుప్.
ఉచ్యమానోఽపి భరతో
మయా లక్ష్మణ తద్వచః।
రాజ్యమస్మై ప్రయచ్ఛేతి
బాఢమిత్యేవ వక్ష్యతి॥
టీక:-
ఉచ్యమానః అపి = చెప్పబడుచున్నవాడై; భరతః = భరతుడు; మయా = నా చేత; లక్ష్మణ = ఓ లక్ష్మణా; తద్వచః = ఆ మాటలకు; రాజ్యమ్ = రాజ్యమును; అస్మై = ఇతనికి; ప్రయచ్ఛ = ఇమ్ము; ఇతి = అని; బాఢమ్ = తప్పక; ఇతి + ఏవ = అనియే; వక్ష్యతి = పలుకగలడు
భావము:-
రాజ్యమును ఇతనికి ఇమ్ము’ అని నేను చెప్పగానే భరతుడు కూడ।తప్పక అట్లే చేసెదను’ అని పలుకగలడు.
2.97.19.
అనుష్టుప్.
తథోక్తో ధర్మశీలేన
భ్రాత్రా తస్య హితే రతః।
లక్ష్మణః ప్రవివేశేవ
స్వాని గాత్రాణి లజ్జయా॥
టీక:-
తథా = అట్లు; ఉక్తః = పలుకబడిన; ధర్మశీలేన = ధర్మశీలుడైన; భ్రాత్రా = సోదరునిచే; తస్య = ఆతని; హితే = హితమునందు; రతః = ఆసక్తి గల; లక్ష్మణః = లక్ష్మణుడు; ప్రవివేశ + ఇవ = ప్రవేశించినటులు; స్వాని = తన; గాత్రాణి = అవయవములను; లజ్జయా = సిగ్గుచే
భావము:-
సోదరుడైన రాముని హితమునందే ఆసక్తి గల ఆ లక్ష్మణుడు, ధర్మశీలుడైన రాముని మాటలు విని సిగ్గుతో తన శరీరములో క్రుంగిపోయినట్లు అయ్యెను.
2.97.20.
అనుష్టుప్.
తద్వాక్యం లక్ష్మణశ్శ్రుత్వా
వ్రీలితః ప్రత్యువాచ హ।
త్వాం మన్యే ద్రష్టుమాయాతః
పితా దశరథస్స్వయమ్॥
టీక:-
తత్ వాక్యం = ఆ మాటలను; లక్ష్మణః = లక్ష్మణుడు; శ్రుత్వా = విని; వ్రీలితః = సిగ్గు పడినవాడై; ప్రత్యువాచ హ = తిరిగి పలికెను; త్వాం = నిన్ను; మన్యే = తలచెదను; ద్రష్టుమ్ = చూచుటకు; ఆయాతః = వచ్చెను; పితా = తండ్రిగారైన; దశరథః = దశరథుడు; స్వయమ్ = స్వయముగా
భావము:-
రాముని పలుకులు విని లక్ష్మణుడు సిగ్గుపడి ఇట్లనెను. మన తండ్రిగారైన దశరథ మహారాజు నిన్ను చూచుటకై స్వయముగా వచ్చుచున్నారని తలచెదను.
2.97.21.
అనుష్టుప్.
వ్రీలితం లక్ష్మణం దృష్ట్వా
రాఘవః ప్రత్యువాచ హ।
ఏష మన్యే మహాబాహుః
ఇహాస్మాన్ద్రష్టుమాగతః॥
టీక:-
వ్రీలితం = సిగ్గుపడిన; లక్ష్మణం = లక్ష్మణుని; దృష్ట్వా = చూచి; రాఘవః = రాముడు; ప్రత్యువాచ హ = తిరిగి పలికెను; ఏషః=ఈతడు; మన్యే = తలచెదను; మహాబాహుః = మహాబాహువైన; ఇహ = ఇక్కడకు; అస్మాన్ = మనలను; ద్రష్టుమ్ = చూచుటకు; ఆగతః = వచ్చెనని
భావము:-
లక్ష్మణుడు సిగ్గుపడినట్లు తెలుసుకొని, రాముడు ఇట్లు పలికెను... మహాబాహువైన దశరథ మహారాజు మనలను అందరిని చూచుటకు ఇక్కడకు వచ్చినాడని తలచెదను.
2.97.22.
అనుష్టుప్.
అథవా నౌ ధ్రువం మన్యే
మన్యమానస్సుఖోచితౌ।
వనవాసమనుధ్యాయ
గృహాయ ప్రతినేష్యతి॥
టీక:-
అథవా = అట్లు కానియెడల; నౌ = మనలను; ధ్రువం = తప్పక; మన్యే = తలచుచుంటిని; మన్యమానః = తలచినవాడై; సుఖోచితౌ = సుఖమునకు అలవాటుపడినవారమని; వనవాసమ్ = వనవాసమునుగురించి; అనుధ్యాయ = ఎడతెగక చింతించుచు; గృహాయ = ఇంటికి; ప్రతినేష్యతి = తిరిగి తీసుకొనిపోగలడు.
భావము:-
వనవాసములోని కష్టములగురించి ఎడతెగని చింతతో, మనము ఇద్దరము సుఖమునకు అలవాటుపడినవారము అను విషయమును తెలిసికొని, తప్పక మనలను మరల ఇంటికి తీసుకొనిపోగలడు అని తలచెదను.
2.97.23.
అనుష్టుప్.
ఇమాం వాప్యేష వైదేహీమ్
అత్యన్తసుఖసేవినీమ్।
పితా మే రాఘవశ్శ్రీమాన్
వనాదాదాయ యాస్యతి॥
టీక:-
ఇమాం=ఈ; వా అపి= అయినను; ఏష = ఈ; వైదేహీమ్ = సీతను; అత్యన్త = మిక్కిలి; సుఖసేవినీమ్ = సుఖమునకు అలవాటుపడిన; పితా = తండ్రి; మే = మనయొక్క; రాఘవః = దశరథమహారాజు; శ్రీమాన్ = శ్రీమంతుడైన; వనాత్ = వనమునుండి; ఆదాయ = తీసుకొని; యాస్యతి = వెళ్ళగలడు
భావము:-
శ్రీమంతుడైన మన తండ్రి దశరథమహారాజు, మిక్కిలి సుఖమునకు అలవాటుపడిన ఈ సీతనైనను వనమునుండి తీసుకొనివెళ్లును.
2.97.24.
అనుష్టుప్.
ఏతౌ తౌ సమ్ప్రకాశేతే
గోత్రవన్తౌ మనోరమౌ।
వాయువేగసమౌ వీర
జవనౌ తురగోత్తమౌ॥
టీక:-
ఏతౌ = ఈ; తౌ = అవి రెండు; సమ్ప్రకాశేతే = ప్రకాశించుచున్నవి; గోత్రవన్తౌ = ఉత్తమజాతికి చెందినవి; మనోరమౌ = అందమైనవి; వాయువేగ = వాయువేగముతో; సమౌ = సమానమైన; వీర = వీరుడా; జవనౌ = వేగము గలవి; తురగ = గుర్రములు; ఉత్తమౌ = ఉత్తమమైనవి.
భావము:-
ఇవిగో.. ఇవి ఉత్తమ జాతియందు పుట్టినవి, అందమైనవి, వాయువేగముతో సమానమైన వేగము కలవి అయిన, ఈ ప్రసిద్ధమైన రెండు ఉత్తమ అశ్వములు సైన్యమునందు ప్రకాశించుచున్నవి.
2.97.25.
అనుష్టుప్.
స ఏష సుమహాకాయః
కమ్పతే వాహినీముఖే।
నాగశ్శత్రుంజయో నామ
వృద్ధస్తాతస్య ధీమతః॥
టీక:-
స ఏషః– ఇదిగో; సుమహాకాయః = పెద్ద శరీరము గలది; కమ్పతే = కదలుచు; వాహినీముఖే = సేనా ముఖమునందు; నాగః = ఏనుగు; శత్రుంజయో నామ = శత్రుంజయము అను పేరు గల; వృద్ధః = పెద్ద వయసు గలది; తాతస్య = తండ్రియొక్క; ధీమతః = సూక్ష్మబుద్ధి గల.
భావము:-
మన తండ్రిగారి... పెద్ద శరీరము గల, సూక్ష్మ బుద్ధి గల శత్రుంజయము అను గజము ఇదిగో సేనా ముఖమునందు కదలుచు వచ్చుచున్నది.
2.97.26.
అనుష్టుప్.
న తు పశ్యామి తచ్ఛత్ర
పాణ్డురం లోకసత్కృతమ్।
పితుర్దివ్యం మహాబాహో
సంశయో భవతీహ మే॥
టీక:-
న తు పశ్యామి –నేను చూచుట లేదు; తత్ = ఆ; ఛత్ర పాణ్డురం = శ్వేతఛత్రమును (తెల్లని గొడుగును); లోక సత్కృతమ్ = జనులందరు గౌరవించెడిది; పితుః = తండ్రిగారియొక్క; దివ్యం = దివ్యమైనది; మహాబాహో = బలమైన బాహువులు గలవాడా; సంశయః = సంశయము; భవతి = కలుగుచున్నది; ఇహ = ఇప్పుడు; మే = నాకు
భావము:-
గొప్ప బాహువులు కలవాడా! జనులందరు గౌరవించు, శ్రేష్ఠమైన మన తండ్రి గారి ఆ శ్వేతఛత్రము మాత్రము ఎందుచేతనో ఈ ఏనుగుపై కనబడుటలేదు. నాకు ఈ విషయమున సంశయము కల్గుచున్నది.
2.97.27.
అనుష్టుప్.
వృక్షాగ్రాదవరోహ త్వం
కురు లక్ష్మణ మద్వచః।
ఇతీవ రామో ధర్మాత్మా
సౌమిత్రిం తమువాచ హ॥
టీక:-
వృక్షాగ్రాత్ –చెట్టుచివరనుండి; అవరోహ = దిగుము; త్వం = నీవు; కురు = చేయుము; లక్ష్మణ = లక్ష్మణా; మత్ = నా యొక్క; వచః = మాటలు; ఇతి = ఇట్లు; ఇవ = వలె; రామః = రాముడు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; సౌమిత్రిం = లక్ష్మణునిగూర్చి; తమ్ = ఆ; ఉవాచ హ = చెప్పెను
భావము:-
నీవు వృక్షాగ్రము నుండి దిగుము. నేను చెప్పినట్లు చేయుము.. అని ధర్మాత్ముడైన రాముడు లక్ష్మణునితో చెప్పెను.
2.97.28.
అనుష్టుప్.
అవతీర్య తు సాలాగ్రాత్
తస్మాత్ససమితింజయః।
లక్ష్మణః ప్రాంజలిర్భూత్వా
తస్థౌ రామస్య పార్శ్వతః॥
టీక:-
అవతీర్య తు = క్రిందకు దిగి; సాలాగ్రాత్ = సాలవృక్షపు అగ్రమునుండి; తస్మాత్ = ఆ; సమితింజయః = యుద్ధములో ఓటమిలేని వాడు; లక్ష్మణః = లక్ష్మణుడు; ప్రాంజలిః – ఘటించిన అంజజలి గలవాడు; భూత్వా తస్థౌ = అయి నిలబడెను; రామస్య = రామునికి; పార్శ్వతః = ప్రక్కనే.
భావము:-
యుద్ధములో పరాజయము ఎరుగని లక్ష్మణుడు సాలవృక్షాగ్రము నుండి దిగి, అంజలి ఘటించి రాముని ప్రక్కనే నిలబడెను.
2.97.29.
అనుష్టుప్.
భరతేనాపి సందిష్టా
సమ్మర్దో న భవేదితి।
సమన్తాత్తస్య శైలస్య
సేనా వాసమకల్పయత్॥
టీక:-
భరతేన అపి = భరతునిచేత; సందిష్టా = ఆజ్ఞాపించబడిన; సమ్మర్దః = సమ్మర్దము; న = వలదు; భవేత్ = అగుట; ఇతి = ఇట్లు; సమన్తాత్ = చుట్టూ; తస్య = ఆ; శైలస్య = పర్వతమునకు; సేనా = సైన్యము; ఆవాసమ్=నివాసము; అకల్పయత్ = చేసికొనెను.
భావము:-
రాముని ఆశ్రమమునకు సమ్మర్దము కలుగకూడదు.. అని భరతుడు ఆజ్ఞాపించుటచే ఆ సైన్యము పర్వతము చుట్టును విడిది చేసెను.
2.97.30.
అనుష్టుప్.
అధ్యర్ధమిక్షా్వకుచమూః
యోజనం పర్వతస్య సా।
పార్శా్వన్య విశదావృత్య
గజవాజిరథాకులా॥
టీక:-
అధ్యర్ధమ్ = ఒకటిన్నర; ఇక్ష్వాకు = ఇక్ష్వాకువంశపు; చమూః = సైన్యము; యోజనం = యోజనముల దూరము; పర్వతస్య = పర్వతమునకు; సా = ఆ; పార్శ్వ = ప్రక్కన; న్యవిశత్ = విడిది చేసెను; ఆవృత్య = చుట్టి; గజ = ఏనుగులు; వాజి = గుర్రములు; రథ = రథములు; ఆకులా = నిండిన
భావము:-
ఏనుగులతోను, గుర్రములతోను, రథములతోను నిండిన భరతుని సైన్యము పర్వతము చుట్టును, ఒకటిన్నర యోజనములు దూరము ఆవరించి విడిది చేసెను.
2.97.31.
త్రిష్టుప్.
సా చిత్రకూటే భరతేన సేనా
ధర్మం పురస్కృత్య విధూయ దర్పమ్।
ప్రసాదనార్థం రఘునందనస్య
విరాజతే నీతిమతా ప్రణీతా॥
టీక:-
సా=ఆ; చిత్రకూటే = చిత్రకూటమునందు; భరతేన = భరతుని చేత; సేనా = సేన; ధర్మం = ధర్మమును; పురస్కృత్య = పురస్కరించుకొని (ముందుంచుకొని); విధూయ = విడిచి; దర్పమ్ = దర్పమును; ప్రసాదనార్థం = అనుగ్రహింపచేసికొనుటకు; రఘునందనస్య = రఘునందనుడైన శ్రీరామునియొక్క; విరాజతే – ప్రకాశించుచుండెను; నీతిమతా – నీతిమంతుడైన; ప్రణీతా = తీసికొనిరాబడిన.
భావము:-
ధర్మమును పురస్కరించుకొని, దర్పమును విడిచి, శ్రీరాముని అనుగ్రహింప చేసుకొనుటకై నీతిమంతుడైన భరతుడు తీసికొనివచ్చిన ఆ సేన చిత్రకూటపర్వత ప్రాంతమునందు ప్రకాశించుచుండెను.
2.97.32.
గద్య.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే అథః సప్తనవతితమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదేకావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; సప్తనవతితమః [97] = తొంభైఏడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [97] తొంభైఏడవ సర్గ సంపూర్ణము.
2.98.1.
అనుష్టుప్.
నివేశ్య సేనాం తు విభుః
పద్భ్యాం పాదవతాం వరః।
అభిగన్తుం స కాకుత్థ్సమ్
ఇయేష గురువర్తకమ్॥
టీక:-
నివేశ్య = బస చేయించి; సేనాం తు = సైన్యమును; తు = చక్కగా; విభుః = విభుడు; పద్భ్యాం = పాదములతో ; పాదవతాం = పాదములు గలవారిలో (మానవులలో); వరః = శ్రేష్ఠుడు; అభిగన్తుం = సమీపించుటకు; సః = ఆ భరతుడు; కాకుత్స్థమ్ = రాముని; ఇయేష = కోరెను; గురుః = తండ్రి యొక్క; వర్తకమ్ = మాటలకు కట్టుబడిన.
భావము:-
భరతుడు చక్కగా సేనను నిలిపి, తండ్రి మాటకు కట్టుబడిన రాముని వద్దకు నడచియే వెళ్లెదనని నిశ్చయించెను.
2.98.2.
అనుష్టుప్.
నివిష్టమాత్రే సైన్యే తు
యథోద్దేశం వినీతవత్।
భరతో భ్రాతరం వాక్యం
శత్రుఘ్నమిదమబ్రవీత్॥
టీక:-
నివిష్టమాత్రే = నిలువబడిన పిమ్మట; సైన్యే = సైన్యము; తు = ఐతే; యతః = ఆ; తథ = ఆయొక్క; దేశమ్ = స్థానములందు; వినీతవత్ = పద్దతిగా; భరతః = భరతుడు; భ్రాతరృమ్ = సోదరునిగురించి; వాక్యమ్ = మాటలను; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని గూర్చి ; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను
భావము:-
సైన్యమును పద్దతిగా ఆయా స్థానములందు నిలిపిన పిమ్మట భరతుడు శత్రుఘ్నునితో రాముని గురించి ఇట్లు పలికెను.
2.98.3.
అనుష్టప్.
“క్షిప్రం వనమిదం సౌమ్య!
నరసంఘైః సమన్తతః।
లుబ్ధైశ్చ సహితైరేభిః
త్వమన్వేషితుమర్హసి॥
టీక:-
క్షిప్రం = శీఘ్రముగా; వనమ్ = వనములో; ఇదం = ఈ; సౌమ్య = సౌమ్యుడా; నరః = తెలివైన మానవుల; సంఘైః = సమూహముతోను; సమన్తతః = అంతటను; లుబ్ధైః = నిషాదులతోను; చ = ఇంకా; సహితైరేభిః = కలసియే; త్వమ్ = నీవు; అన్వేషితుమ్ = వెదకుటకు; అర్హసి = తగి ఉంటివి.
భావము:-
శత్రుఘ్నా! నీవు కొంతమంది మన వారితో ఇంకా నిషాదులతో కలసి వెంటనే ఈ వనము అంతా శోధించుము.
2.98.4.
అనుష్టుప్.
గుహో జ్ఞాతిసహస్రేణ
శరచాపాసిధారిణా।
సమన్వేషతు కాకుత్స్థమ్
అస్మిన్ పరివృతస్స్వయమ్॥
టీక:-
గుహః = గుహుడు; జ్ఞాతి = బంధువులు; సహస్రేణ = వేలకొలది; శర = శరములు; చాప = చాపములు; అసి = ఖడ్గములు; ధారిణా = ధరించినవారితో ; సమన్వేషతు = చక్కగా వెదకునుగాక; కాకుత్స్థమ్ = రామలక్ష్మణులను; అస్మిన్ = ఈ అడవిలో; పరివృతః = కూడినవాడై; స్వయమ్ = స్వయముగా
భావము:-
గుహుడు స్వయముగా ధనస్సులు, బాణములు , కత్తులు ధరించిన వేలకొలది తన బంధువులతో కలిసి ఈ వనములో రామలక్ష్మణులను బాగా వివరముగా వెదకవలెను.
2.98.5.
అనుష్టుప్.
అమాత్యైస్సహ పౌరైశ్చ
గురుభిశ్చ ద్విజాతిభిః।
వనం సర్వం చరిష్యామి
పద్భ్యాం పరివృతస్స్వయమ్॥
టీక:-
అమాత్యైః = అమాత్యులతో; సహ = కలిసి; పౌరైః + చ = పౌరులతోను; చ = ఇంకా; గురుభిః + చ = గురువులతోను; చ = ఇంకా; ద్విజాతిభిః = బ్రాహ్మణులతో కూడ; వనమ్ = వనమును; సర్వమ్ = అంతటను; చరిష్యామి = తిరిగెదను; పద్భ్యామ్ = పాదములతో; పరివృతః = కలసినవాడనై; స్వయమ్ = స్వయముగా
భావము:-
అమాత్యులతోను, పౌరులతోను, గురువులతోను, బ్రాహ్మణులతోను కలిసి ఈ వనములో అంతట నేను స్వయముగా నడచుచు తిరిగెదను.
2.98.6.
అనుష్టుప్.
యావన్న రామం ద్రక్ష్యామి
లక్ష్మణం వా మహాబలమ్।
వైదేహీం చ మహాభాగం
న మే శాంతిర్భవిష్యతి॥
టీక:-
యావత్ = అంతవరకు; న = కాదో; రామం = రాముని; ద్రక్ష్యామి = నేను చూచుట; లక్ష్మణమ్ = లక్ష్మణుని; వా = కాని; మహాబలమ్ = మహాబలిశాలిని; వైదేహీం = సీతమ్మను; చ = కూడ; మహాభాగమ్ = మహాభాగ్యవంతురాలిని; న = జరుగదు; మే = నాకు; శాతిః = శాంతి; భవిష్యతి = కలుగుట
భావము:-
రాముని, మహాబలశాలి అయిన లక్ష్మణుని, మహాభాగ్యవంతురాలైన సీతను చూడనంతవరకు నాకు దుఃఖశాంతి కలుగదు.
2.98.7.
అనుష్టుప్.
యావన్న చంద్రసంకాశం
ద్రక్ష్యామి శుభమాననమ్।
భ్రాతుః పద్మపలాశాక్షం
న మే శాంతిర్భవిష్యతి॥
టీక:-
యావత్ = ఎంతవరకు; న = లేదు; చంద్రసంకాశం = చంద్రసమానమైనది; ద్రక్ష్యైమి = చూచునంతవరకు; శుభమ్ = మంగళకరమైన; ఆననమ్ = ముఖమును; భ్రాతుః = సోదరుని; పద్మపలాశ = పద్మ పత్రముల వంటి; అక్షం = నేత్రములు గలది ; న = లేదు; మే = నాకు; శాన్తిః = శాంతి; భవిష్యతి = కలుగుట.
భావము:-
చంద్రునితో సమానమైనది , పద్మ పత్రముల వంటి నేత్రములు కలది అయిన అన్నగారి మంగళకరమైన ముఖమును చూడనంతవరకు నాకు మనఃశాంతి కలుగదు.
2.98.8.
అనుష్టుప్.
యావన్న చరణౌ భ్రాతుః
పార్థివవ్యంజనాన్వితౌ।
శిరసా ధారయిష్యామి
న మే శాంతిర్భవిష్యతి॥
టీక:-
యావత్ = ఎంతవరకు; న = లేదు; చరణౌ = పాదద్వయములను; భ్రాతుః = అన్నగారియొక్క; పార్థివ వ్యంజనాన్వితౌ = రాజచిహ్నములతో కూడిన; శిరసా = శిరస్సు మీద; ధారయిష్యామిx = ధరించునంతవరకు; న = లేదు; మే = నాకు; శాంతిః = శాంతి; భవిష్యతి = కలుగుట.
భావము:-
రాజచిహ్నములతో కూడిన నా అన్నగారి పాదములను శిరస్సు మీద ధరించనంత వరకు నాకు మనశ్శాంతి కలుగదు.
2.98.9.
అనుష్టుప్.
యావన్న రాజ్యే రాజ్యార్హః
పితృపైతామహే స్థితః।
అభిషేకజలక్లిన్నో
న మే శాంతిర్భవిష్యతి॥
టీక:-
యావత్ = అంతవరకు; న = కాదో; రాజ్యే = రాజ్యమునందు; రాజ్యార్హః = రాజ్యమునకు అర్హుడైనవాడు; పితృపైతామహే = పితృపితామహులకు చెందిన; స్థితః = ఉండినవాడు; అభిషేక = రాజ్యాభిషేక; జలక్లిన్నః = జలములచే తడపబడినవాడై; న = లేదు; మే = నాకు; శాంతిః = శాంతి; భవిష్యతి = కలుగుట
భావము:-
రాజ్యమునకు తగిన ఆ రాముడు, రాజ్యాభిషేక జలములచే తడిసి పితృపితామహ క్రమమున వచ్చుచున్న రాజ్యమును పొందనంతవరకు నాకు మనశ్శాంతి కలుగదు.
2.98.10.
అనుష్టుప్.
సిద్ధార్థః ఖలు సౌమిత్రిః
యశ్చంద్రవిమలోపమమ్।
ముఖం పశ్యతి రామస్య
రాజీవాక్షం మహాద్యుతి॥
టీక:-
సిద్ధార్థః = కృతార్థుడు; ఖలు = మిక్కిలి; సౌమిత్రిః = లక్ష్మణుడు; యః = ఏ; చంద్ర = చంద్రునితో; విమల = స్వచ్ఛమైన; ఉపమమ్ = పోలినది; ముఖం = ముఖమును; పశ్యతి = చూచుచున్నాడో; రామస్య = రామునియొక్క; రాజీవ + అక్షం = పద్మముల వంటి కన్నులు గలది ; మహాద్యుతి = గొప్పకాంతి కలది
భావము:-
స్వచ్ఛమైన చంద్రునితో సమానమైనది , పద్మముల వంటి నేత్రములు కలది, గొప్ప కాంతితో ప్రకాశించుచున్నది అయిన రాముని ముఖమును ఎల్లపుడు చూడగలిగిన లక్ష్మణుడు మిక్కిలి కృతార్థుడు.
2.98.11.
అనుష్టుప్.
కృతకృత్యా మహాభాగా
వైదేహీ జనకాత్మజా।
భర్తారం సాగరాంతాయాః
పృథివ్యా యానుగచ్ఛతి॥
టీక:-
కృతకృత్యా = కృతార్థురాలు; మహాభాగా = మహాభాగ్యవంతురాలు; వైదేహి = సీతమ్మ; జనకాత్మజా = జనకుని కుమార్తె అయిన;; భర్తారం = ప్రభువైనవానిని; సాగరాంతాయాః = సముద్రము వరకు వ్యాపించినది; పృథివ్యాః= భూమికి అంతకును; అనుగచ్ఛతి = అనుసరించి వెళ్లుచున్నదో.
భావము:-
సముద్రము వరకు వ్యాపించిన ఈ భూమి అంతకును ప్రభువైన ఆ రాముని అనుసరించి వెళ్ళిన మహాభాగ్యవంతురాలైన సీత చాల కృతార్థురాలు.
2.98.12.
అనుష్టుప్.
సుభగశ్చిత్రకూటోఽసౌ
గిరిరాజోపమో గిరిః।
యస్మిన్వసతి కాకుత్థ్సః
కుబేర ఇవ నందనే॥
టీక:-
సుభగః = మంగళకరమైనది; చిత్రకూటః = చిత్రకూటము; అసౌ = ఇట్టి ; గిరిరాజ = హిమవత్పర్వతముతో; ఉపమః = సమానమైనది ; గిరిః = పర్వతము; యస్మిన్ = దేనిపై; వసతి = నివసించుచున్నాడో; కాకుత్స్థః= రాముడు; కుబేర = కుబేరుడు; ఇవ = వలె; నందనే = నందన వనములో
భావము:-
కుబేరుడు నందన వనములో నివసించునట్లు రాముడు హిమవత్పర్వముతో సమానమైన ఈ చిత్రకూట పర్వతముపై నివసించుచున్నాడు. అందుచే ఈ పర్వతము చాల భాగ్యశాలి.
2.98.13.
అనుష్టుప్.
కృతకార్యమిదం దుర్గం
వనం వ్యాళనిషేవితమ్।
యదధ్యాస్తే మహాతేజా
రామశ్శస్త్రభృతాం వరః”॥
టీక:-
కృతకార్యమ్ = కృతకృత్యమైనది; ఇదం = ఈ; దుర్గమ్ = ప్రవేశింప శక్యము కానిది; వనమ్ = వనము; వ్యాళః = శ్వపదః, ఇత్యమరః, క్రూరమృగములు; నిషేవితమ్ = నివసించెడిది; యత్ = దేనిని; అధ్యాస్తే = అధిష్టించి యున్నాడో; మహాతేజా = గ్పొప తేజస్సు కలవాడు; రామః = రాముడు; శస్త్రభృతాం = ఆయుధములు ధరించిన వారిలో; వరః = శ్రేష్ఠుడైన.
భావము:-
క్రూరమృగములతో నిండి, ప్రవేశింపశక్యము గాని ఈ వనము కృతకృత్యమైనది. దీనియందు శస్త్రాస్తధర శ్రేష్ఠుడైన రాముడు అధిష్టించి ఉండెను.”
2.98.14.
అనుష్టుప్.
ఏవముక్త్వా మహాతేజా
భరతః పురుషర్షభః।
పద్భ్యామేవ మహాబాహుః
ప్రవివేశ మహాద్వనమ్॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; మహాతేజా = మహాతేజస్సు కలిగిన; భరతః = భరతుడు; పురుషర్షభః = పురుషులో శ్రేష్ఠుడు; పద్భ్యామ్ + ఏవ = పాదములతోనే; మహాబాహుః = గొప్ప బాహువులు కలవాడు; ప్రవివేశ = ప్రవేశించెను; మహాత్ = గొప్పదైన; వనమ్- వనమును
భావము:-
ఈ విధముగా పలికి, మహాతేజశ్శాలి, పురుషశ్రేష్ఠుడు, బలము కలిగిన బాహువులు కలిగిన భరతుడు నడచుచు ఆ గొప్ప అడవిలోనికి ప్రవేశించెను.
2.98.15.
అనుష్టుప్.
స తాని ద్రుమజాలాని
జాతాని గిరిసానుషు।
పుష్పితాగ్రాణి మధ్యేన
జగామ వదతాం వరః॥
టీక:-
సః = అతడు; తాని = ఆ; ద్రుమః = వృక్షముల; జాలాని = గుంపులను; జాతాని = పుట్టిన; గిరిసానుషు = పర్వతము చరియల మీద; పుష్పిత + అగ్రాణి = పుష్పించిన అగ్రభాగములు గల; మధ్యేన = నడుమలో ; జగామ = వెళ్లెను; వదతాం = మాటలాడువారిలో ; వరః = శ్రేష్ఠుడు
భావము:-
మాటలలో నేర్పరి యైన భరతుడు, కాలినడకనే ఆ మహావనములోనికి ప్రవేశించెను. అతడు పర్వతము చరియల మీద పెరిగిన వృక్షముల గుంపుల నడుమ నడచుచు వెళ్ళెను.
2.98.16.
అనుష్టుప్.
స గిరేశ్చిత్రకూటస్య
సాలమాసాద్య పుష్పితమ్।
రామాశ్రమగతస్యాగ్నేః
దదర్శ ధ్వజముచ్ఛ్రితమ్॥
టీక:-
సః = అతడు; గిరేః = పర్వతము పై; చిత్రకూటస్య = చిత్రకూటముయొక్క; సాలమ్ = సాల వృక్షమును; ఆసాద్య = సమీపించి; పుష్పితమ్ = పుష్పించిన; రామ = రాముని; ఆశ్రమగతస్య = ఆశ్రమమునుండి; ఆగ్నేః = అగ్నియొక్క; దదర్శ = చూచెను; ధ్వజమ్ = ధూమ ధ్వజమును; ఉచ్ఛ్రితమ్ = ఎత్తైన.
భావము:-
అతడు చిత్రకూట పర్వతముపై ఉన్న పుష్పించిన ఒక సాలవృక్షమును సమీపించి, రాముని ఆశ్రమము నుండి పైకి ఎగురుచున్న పొగను చూచెను.
2.98.17.
అనుష్టుప్.
తం దృష్ట్వా భరతశ్శ్రీమాన్
ముమోద సహ బాంధవః।
అత్ర రామ ఇతి జ్ఞాత్వా
గతః పారమివాంబసః॥
టీక:-
తం = ఆ ధూమమును; దృష్ట్వా = చూచి; భరతః = భరతుడు; శ్రీమాన్ = సంపన్నుడైన; ముమోద = సంతోషించెను; సహ = కూడా ఉన్న; బాంధవః = బంధువులతో; అత్ర = ఇక్కడ; రామ = రాముడు; ఇతి = అని; జ్ఞాత్వా = తెలుసుకొని; గతః = పొందినవాడు ; పారమ్ = ఆవలి ఒడ్డును; ఇవ- వలె; అంబసః = నది యొక్క.
భావము:-
భావము: భరతుడు ఆ ధూమమును చూడగానే రాముడు ఇక్కడనే గలడని తెలుసుకొని, నది ఆవలి ఒడ్డుకు చేరిన ఈతగాడు వలె చాలా సంతోషించెను.
2.98.18.
త్రిష్టుప్.
స చిత్రకూటే తు గిరౌ నిశమ్య
రామాశ్రమం పుణ్యజనోపపన్నమ్।
గుహేన సార్ధం త్వరితో జగామ
పునర్నివేశ్యైవ చమూం మహాత్మా॥
టీక:-
సః = అతడు; చిత్రకూటే = చిత్రకూటము; తు = నిశ్చయముగ; గిరౌ = పర్వతమునందు; నిశమ్య = చూచి; రామాశ్రమమ్ = రాముని ఆశ్రమమును; పుణ్యజన = పుణ్యజనులతో; ఉపపన్నమ్ = నిండిఉన్న; గుహేన = గుహునితో; సార్ధం = కూడ; త్వరితః = తొందరపడుచున్నవాడై; జగామ = వెళ్లెను; పునః = మరల; నివేశ్య + ఏవ = అక్కడనే ఉండమని; చమూం = సేనను; మహాత్మా = మహాత్ముడైన
భావము:-
మహాత్ముడైన ఆ భరతుడు, ఆ చిత్రకూట పర్వతముపై పుణ్యాత్ములతో నిండిన రాముని ఆశ్రమమును చూచి, సేనను దూరముగనే ఉండమని నియమించి, గుహునితో కూడ మరల తొందరగా నడుచుచు వెళ్లెను.
2.98.19.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే అథః అష్టనవతితమః సర్గ
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదేకావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; షణ్ణవతితమః [98] = తొంభైఎనిమిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [98] తొంభైఎనిమిదవ సర్గ సంపూర్ణము.
2.99.1.
అనుష్టుప్.
నివిష్టాయాం తు సేనాయామ్
ఉత్సుకో భరతస్తదా।
జగామ భ్రాతరం ద్రష్టుం
శత్రుఘ్నమనుదర్శయన్॥
టీకా:-
నివిష్టాయామ్ = విడిసి ఉండగా; సేనాయామ్ = సేనను; ఉత్సుకః = ఉత్సాహము కలవాడైన; భరతః = భరతుడు; తదా = అప్పుడు; జగామ = వెళ్ళెను; భ్రాతరం = సోదరుని; ద్రష్టుం = చూచుటకు; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని; అనుదర్శయన్ = చూపించుచు.
భావము:-
భరతుడు తన సేనను అక్కడనే నిలిపి, తన సోదరుడైన రాముని చూడవలెనను ఉత్సాహముతో శత్రుఘ్నునకు ఆ గుర్తులను చూపించుచు శీఘ్రముగా ముందుకు వెళ్ళెను.
2.99.2.
అనుష్టుప్.
ఋషిం వసిష్ఠం సందిశ్య
“మాతౄర్మే శీఘ్రమానయ”।
ఇతి త్వరితమగ్రే స
జగామ గురువత్సలః॥
టీకా:-
ఋషిమ్ = ఋషియైన; వసిష్ఠమ్ = వశిష్ఠుని; సందిశ్య = ఆదేశించి; మాతౄః = తల్లులను; మే = నా; శీఘ్రమ్ = తొందరగా; ఆనయ = తీసుకొనిరమ్ము; ఇతి = అని; త్వరితం = వడివడిగా; అగ్రే = ముందుగ; సః = అతడు; జగామ = వెళ్ళెను; గురువత్సలః = పెద్దలయందు గౌరవము కలవాడు.
భావము:-
పెద్దలయందు గౌరవముగల ఆ భరతుడు "నా తల్లులను తొందరగా తీసుకొనిరమ్ము" అని వశిష్ట మహర్షిని చెప్పి తాను ముందుగా వడివడిగా వెళ్ళెను.
2.99.3.
అనుష్టుప్.
సుమంత్రస్త్వపి శత్రుఘ్నమ్
అదూరాదన్వపద్యత।
రామదర్శనజస్తర్షో
భరతస్యేవ తస్య చ॥
టీకా:-
సుమంత్రః = సుమంత్రుడు; అపి = కూడ; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని; అదూరాత్ = దగ్గరగ; అన్వపద్యత = వెంబడించెను; రామృః = రాముని; దర్శనః = దర్శనమునందు; జః = కలిగిన; తర్షః = అభిలాష; భరతస్య = భరతునికి; ఏవ = వలెనె; తస్య = అతనికి.
భావము:-
సుమంత్రుడు కూడ శత్రుఘ్నుని వెనుకనె వెళ్ళెను. భరతునకు రాముని చూడవలెనని వలెనే అతనికి కూడ మిక్కిలి ఆసక్తి కలిగెను.
2.99.4.
అనుష్టుప్.
గచ్ఛన్నేవాథ భరతః
తాపసాలయ సంస్థితామ్।
భ్రాతుః పర్ణకుటీం శ్రీమాన్
ఉటజం చ దదర్శ హ॥
టీకా:-
గచ్ఛత్ = వెడలిన; ఏవ = వెంటనే; అథ = తరువాత; భరతః = భరతుడు; తాపసాలయ = తపోవనమునందు; సంస్థితామ్ = ఉన్న; భ్రాతుః = సోదరునియొక్క; పర్ణకుటీం = పర్ణశాలను; శ్రీమాన్ = శ్రీమంతమైన; ఉటజమ్ = మునులనివాసమైన; దదర్శ హ = చూచెను.
భావము:-
తరువాత ఆ భరతుడు అట్లు పోవుచునే అక్కడి తపోవనమునందు శ్రీమంతమైన మునులు నివసించునట్టి పర్ణశాల సోదరుడైన రాముని పర్ణశాలను చూచెను.
2.99.5.
అనుష్టుప్.
శాలాయాస్త్వగ్రతస్తస్యా
దదర్శ భరతస్తదా।
కాష్ఠాని చావభగ్నాని
పుష్పాణ్యుపచితాని చ॥
టీకా:-
శాలాయాః = పర్ణశాలయొక్క; అగ్రతః = ఎదురుగ; తస్యా = ఆ; దదర్శ = చూచెను; భరతః = భరతుడు; తదా = అప్పుడు; కాష్ఠాని = కట్టెలను; అవభగ్నాని = ముక్కలుగానఱికిన; పుష్పాణి = పుష్పములను; అపచితాని = కోయబడిన.
భావము:-
కోసిన పుష్పములను, నఱికిన కట్టెలను భరతుడు ఆ పర్ణశాల ఎదురుగ చూచెను.
2.99.6.
అనుష్టుప్.
స లక్ష్మణస్య రామస్య
దదర్శాఽ శ్రమమీయుషః।
కృతం వృక్షేష్వభిజ్ఞానం
కుశచీరైః క్వచిత్క్వచిత్॥
టీక:-
సః = అతడు; లక్ష్మణస్య = లక్ష్మణునియొక్కయు; రామస్య = రామునియొక్కయు; దదర్శా = చూచెను; ఆశ్రమమ్ = ఆశ్రమమును; ఈయుషః = పొందిన; కృతం = చేయబడిన; వృక్షేషు = వృక్షములయందు; అభిజ్ఞానం = గుర్తుగ; కుశః = దర్భలను; చీరైః = నారచీరలను; క్వచిత్ క్వచిత్ = అక్కడక్కడ.
భావము:-
ఆశ్రమమునందున్న రామలక్ష్మణులు, తమ పర్ణశాలకు దారి తెలియుటకై, అక్కడక్కడ వృక్షములపై దర్భలను, నారచీరలను గుర్తుగ కట్టియుండుట భరతుడు చూచెను.
2.99.7.
అనుష్టుప్.
స దదర్శ వనే తస్మిన్
మహతః సంచయాన్కృతాన్।
మృగాణాం మహిషాణాం చ
కరీషైశ్శీతకారణాత్॥
టీక:-
సః = అతడు; దదర్శ = చూచెను; వనే = వనమునందు; తస్మిన్ = ఆ; మహతః = గొప్పదైన; సంచయాన్ = పోగులను; కృతాన్ = చేయబడిన; మృగాణాం = మృగములయొక్క; మహిషాణాం = దున్నపోతులయొక్క; కరీషైః = పిడకలచే; శీతకారణాత్ = చలి కారణముగ.
భావము:-
భరతుడు ఆ వనమునందు శీతాకాలమునందు ఉపయోగించుకొనుటకై వారు మృగముల మఱియు దున్నపోతుల పేడతో చేసుకొనిన పిడకల రాశులను చూచెను.
2.99.8.
అనుష్టుప్.
గచ్ఛన్నేవ మహాబాహుః
ద్యుతిమాన్ న్భభరతస్తదా।
శత్రుఘ్నం చాబ్రవీద్ధృష్టః
తానమాత్యాంశ్చ సర్వశః॥
టీక:-
గచ్ఛన్న ఏవ = నడచుచునే; మహాబాహుః = గొప్ప బాహువులు గల; ద్యుతిమాన్ = తేజస్సు కలవాడు ; భరతః = భరతుడు; తదా = అప్పుడు; శత్రుఘ్నం = శత్రుఘ్నుని గూర్చి; అబ్రవీత్ = పలికెను; హృష్టః = సంతుష్టుడైనవాడు; తాన్ = ఆ; అమాత్యాంశ్చ = మంత్రులను గూర్చి; సర్వశః = నలువైపుల.
భావము:-
మహాబాహువు, తేజోవంతుడును ఐన ఆ భరతుడు నడచుచు, అవి అన్నియు చూచుచు, సంతోషించి, శత్రుఘ్నునితోను, తన చుట్టూ ఉన్న మంత్రులతోను ఇట్లు పలికెను.
2.99.9.
అనుష్టుప్.
“మన్యే ప్రాప్తాః స్మ తం దేశం
భరద్వాజోఽయమబ్రవీత్।
నాతిదూరే హి మన్యేఽహం
నదీం మందాకినీమితః॥
టీక:-
మన్యే = తలంచుచున్నాను; ప్రాప్తాః = పొందతిమి; స్మ = సుమా; తం = ఆ; దేశం = ప్రదేశమును; భరద్వాజః = భరద్వాజుడు; అయమ్ = నాకు; అబ్రవీత్ = చెప్పెనో; న = లేదు; అతిదూరే = ఎక్కువదూరం; మన్యే = తలంచుచున్నాను; అహం = నేను; నదీం = నదిని; మందాకినీమ్ = మందాకిని; ఇతః = ఇక్కడనుండి.
భావము:-
“హర్షి చెప్పెన ఆ ప్రదేశమునకు వచ్చితిమి సుమా. మందాకినీ నది ఇక్కడికి దగ్గరలోనే ఉన్నదని అనుకొనుచున్నాను.
2.99.10.
అనుష్టుప్.
ఉచ్చైర్బద్ధాని చీరాణి
లక్ష్మణేన భవేదయమ్।
అభిజ్ఞానకృతః పంథా
అకాలే గంతుమిచ్ఛతా॥
టీక:-
ఉచ్చైః = ఎత్తుగ; బద్ధాని = కట్టబడిన; చీరాణి = చీరలు; లక్ష్మణేన = లక్ష్మణునిచే; భవేత్ = కావచ్చును; అయమ్ = ఈ; అభిజ్ఞాన = గుర్తులుగా; కృతః = చేయబడిన; పంథా = మార్గము; అకాలే = సమయము కాని సమయమునందు; గంతుమ్ = వెళ్ళుటకు; ఇచ్ఛతా = కోరుచున్న.
భావము:-
ఇక్కడ నారచీరలు ఎత్తుగ కట్టబడియున్నవి. అకాలముగ ఆశ్రమమునుండి బయటకు వెళ్ళి మరలి వచ్చునపుడు దారి తెలియుటకై లక్ష్మణుడు చేసిన గుర్తులు కావచ్చును.
2.99.11.
అనుష్టుప్.
ఇదం చోదాత్తదంతానాం
కుంజరాణాం తరస్వినామ్।
శైలపార్శ్వే పరిక్రాంతమ్
అన్యోన్యమభిగర్జతామ్॥
టీక:-
ఇదం = ఇది; ఉదాత్త = పెద్దవైన; దంతానాం = దంతములను కలిగియున్న; కుంజరాణాం = ఏనుగులు; తరస్వినామ్ = వేగము బలము కలవి, శబ్దకల్పదృమం; శైల = పర్వతము; పార్శ్వే = ప్రక్కన; పరిక్రాంతమ్ = సంచరించుచు; అన్యోన్యమ్ = ఒకదానితో ఒకటి; అభిగర్జతామ్ = ఘీంకరించునవి.
భావము:-
గొప్ప బలమైన వేగవంతమైన ఏనుగులు ఇదిగో పెద్ద పెద్ద దంతములు కలిగి ఉన్నవి. ఒకదానినొకటి చూచుకొనుచు ఘీంకరించుచు పర్వతము ప్రక్కన సంచరించుచున్నవి.
2.99.12.
అనుష్టుప్.
యమేవాధాతుమిచ్ఛంతి
తాపసాస్సతతం వనే।
తస్యాసౌ దృశ్యతే ధూమః
సంకులః కృష్ణవర్త్మనః॥
టీక:-
యమ్ ఏవ = దేనిని; అధాతుమ్ = ఉంచుటకు; ఇచ్ఛంతి = ఇష్టపడెదరో; తాపసాః = తాపసులు; సతతమ్ = ఎల్లప్పుడు; వనే = వనమునందు; తస్య = ఆ; అసౌ = ఈ; దృశ్యతే = కనబడుచున్నది; ధూమః = పొగ; సంకులః = దట్టమైన; కృష్ణవర్త్మనః = అగ్నియొక్క.
భావము:-
అరణ్యమునందు నివసించు తాపసులు ఎల్లప్పుడును తమను తాము సంరక్షించుకొనుటకై ఉంచుకొనెడి అగ్నినుండి పుట్టిన దట్టమైన పొగ ఇక్కడ కనబడుచున్నది.
*గమనిక:-
కృష్ణవర్త్మః -కృష్ణం కృష్ణవర్ణం వర్త్మ యస్య. వాయు ప్రసారిత ధూమ పథాభ్యంతర ఏవ గతిరస్యేతి భావః, అగ్నిః, శబ్దకల్పద్రుమః
2.99.13.
అనుష్టుప్.
అత్రాహం పురుషవ్యాఘ్రం
గురుసత్కారకారిణమ్।
ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టో
మహర్షిమివ రాఘవమ్”॥
టీక:-
అత్ర = ఇక్కడ అహం = నేను; పురుషవ్యాఘ్రం = పురుషశ్రేష్ఠుని; గురు = నేను = శ్రేష్టమైన; సత్కార = మంచిపనులను; కారిణమ్ = చేయువాని; ఆర్యం = పూజనీయుని; ద్రక్ష్యామి = చూడగలను; సంహృష్టః = సంతోషముగ; మహర్షిమ్ = మహర్షి; ఇవ = వంటివాడు; రాఘవమ్ = రాముని.
భావము:-
ఇక్కడ నాకు సంతోషముగ, శ్రేష్టమైన సత్కార్యములను చేయువాడు, పురుషోత్తముడు, మహర్షి సమానుడు, పూజనీయుడు ఐన రాముడు కనబడును.”
2.99.14.
అనుష్టుప్.
అథ గత్వా ముహూర్తంతు
చిత్రకూటం స రాఘవః।
మందాకినీమనుప్రాప్తః
తం జనం చేదమబ్రవీత్॥
టీక:-
అథ = తరువాత; గత్వా = వెళ్ళి; ముహూర్తమ్ = కొద్ది సమయము; చిత్రకూటమ్ = చిత్రకూట పర్వతమును గూర్చి; సః = ఆ; రాఘవః = భరతుడు; మందాకినీమ్ = మందాకినీ నదిని; అనుప్రాప్తః = చేరుకున్నవాడై; తం = ఆ; జనమ్ = ఉన్న వారిని గూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
ఆ భరతుడు చిత్రకూట పర్వతము వైపు కొద్ది సేపు నడిచి, మందాకినీ నదిని చేరి, అక్కడ తన పరివార జనముతో ఇట్లు పలికెను.
2.99.15.
అనుష్టుప్.
“జగత్యాం పురషవ్యాఘ్ర
ఆస్తే వీరాసనే రతః।
జనేంద్రో నిర్జనం ప్రాప్య
ధింమే జన్మ సజీవితమ్॥
టీక:-
జగత్యామ్ = నేలపై; పురషవ్యాఘ్ర = పురుషశ్రేష్ఠుడు; ఆస్తే = ఉండును; వీరాసనే = వీరాసనములో; రతః = ఆసక్తి కలవాడై; జనేంద్రః = రాజు; నిర్జనం = జనసంచారము లేని ప్రదేశము; ప్రాప్య = పొంది; ధిక్ = ఛీ, నింద అగు గాక ; మే = నా; జన్మ = జన్మను గూర్చి; సజీవితమ్ = జీవితముతో కూడిన .
భావము:-
ప్రజలకు రాజైన పురుషోత్తముడు రాముడు, నిర్మానుష్యమైన వనములో వీరాసనము వేసుకొని నేలపై కూర్చుని ఉంటాడు. ఛీ ఇట్టి నా జీవితము జీవించుట ఏల?
</p><p>*గమనిక:-<br>
వీరాసనము- వీరులు, తీవ్ర సాధనలు చేయువారు, దేనిపైన ఆనుకోకుండా కూర్చుండు పద్దతి, కుడి మోకాలు పై ఎడమ పాదమును; ఎడమ మోకాలు క్రింద కుడి పాదమును ఉంచి కూర్చుండుట వీరాసనము
<br><br><a href="https://static.langimg.com/photo/imgsize-141610,msid-93719062/telugu-samayam.jpg" target=”_blank” ><center> వీరాసనము<<br><br> <img src="https://static.langimg.com/photo/imgsize-141610,msid-93719062/telugu-samayam.jpg " alt="వీరాసనము"; width="123px" ; > </center></a><br>
</p>
2.99.16.
అనుష్టుప్.
మత్కృతే వ్యసనం ప్రాప్తో
లోకనాథో మహాద్యుతిః।
సర్వాన్కామాన్పరిత్యజ్య
వనే వసతి రాఘవః॥
టీక:-
మత్కృతే = నా కొరకై; వ్యసనం = కష్టమును; ప్రాప్తః = పొంది; లోకనాథః = లోకములకు ప్రభువు; మహాద్యుతిః = గొప్ప తేజోవంతుడు; సర్వాన్ = సమస్తమైన; కామాన్ = కోరికలను; పరిత్యజ్య = విడిచి; వనే = వనమునందు; వసతి = నివసించుచున్నాడు; రాఘవః = రాముడు.
భావము:-
లోకనాథుడును, గొప్ప తేజోవంతుడును ఐన రాఘవ రాముడు నా కారణముగ కష్టములకు లోనై అన్ని కోరికలను విడనాడి అరణ్యమునందు నివసించుచున్నాడు.
2.99.17.
అనుష్టుప్.
ఇతి లోకసమాక్రుష్టః
పాదేష్వద్య ప్రసాదయన్।
రామస్య నిపతిష్యామి
సీతాయా లక్ష్మణస్య చ”॥
టీక:-
ఇతి = ఇట్లు; లోక = లోకముచే; సమాక్రుష్టః = నిందింపబడిన; పాదేషు = పాదములపై; అద్య = నేడు; ప్రసాదయన్ = ప్రసన్నము చేసుకొనుచు; రామస్య = రాముని; నిపతిష్యామి = పడెదను; సీతాయా = సీత యొక్క; లక్ష్మణస్య = లక్ష్మణుని; చ = కూడ.
భావము:-
లోకముచే నిందింపబడిన నేను రాముని, సీతను, లక్ష్మణుని ప్రసన్నము చేసుకొనుటకై వారి పాదములపై పడెదను.”
2.99.18.
అనుష్టుప్.
ఏవం సంవిలపం స్తస్మిన్
వనే దశరథాత్మజః।
దదర్శ మహతీం పుణ్యాం
పర్ణశాలాం మనోరమామ్॥
టీక:-
ఏవం = ఇట్లు; సంవిలపం = విలపించుచు; తస్మిన్ = ఆ; వనే = వనమునందు; దశరథాత్మజః = దశరథుని కుమారుడు; దదర్శ = చూచెను; మహతీమ్ = గొప్పదైన; పుణ్యామ్ = పుణ్యప్రదమైన; పర్ణశాలామ్ = పర్ణశాలను; మనోరమామ్ = మనోహరమైన
భావము:-
దశరథుని కుమారుడైన భరతుడు అట్లు విలపించుచు గొప్పది, పుణ్యప్రదమైనది అందమైనది ఐన ఆ పర్ణశాలను దర్శించెను.
2.99.19.
అనుష్టుప్.
సాలతాలాశ్వకర్ణానాం
పర్ణైర్బహుభిరావృతామ్।
విశాలాం మృదుభిస్తీర్ణాం
కుశైర్వేదిమివాధ్వరే॥
టీక:-
సాల = మద్ది చెట్ల; తాల = తాటి చెట్ల; అశ్వకర్ణానాం = గుఱ్ఱము చెవులవలె ఉండునవి; పర్ణైః = ఆకులతో; బహుభిః = చాల; ఆవృతామ్ = కప్పబడినది; విశాలాం = వెడల్పైన; మృదుభిః = లేతవి; తీర్ణాం = విస్తరింపబడిన; కుశైః = దర్భలచే; వేదిమ్ = పీఠము; ఇవ = వలె; అధ్వరే = యజ్ఞములో.
భావము:-
ఆ పర్ణశాల మద్ది, తాటి, చెట్ల ఆకులతో కప్పబడి ఉండి, లేతపత్రముల, దర్భలు పరచిన ఒక విశాలమైన యజ్ఞ పీఠము వలె కనిపించుచున్నది.
2.99.20.
అనుష్టుప్.
శక్రాయుధనికాశైశ్చ
కార్ముకైర్భారసాధనైః।
రుక్మపృష్ఠైర్మహాసారైః
శోభితాం శత్రుబాధకైః॥
టీక:-
శక్రాయుధ = దేవేంద్రుని వజ్రాయుధమునకు; నికాశైః = సాటివచ్చునట్టి; కార్ముకైః = నిల్లులు; భారసాధనైః = గురుతరమైన కార్యములు సాధించునవి; రుక్మపృష్ఠైః = బంగారముతో తాపడము చేయబడినది; మహాసారైః = మహాశక్తివంతమైనవి; శోభితామ్ = శోభిల్లుచున్నవి; శత్రుబాధకైః = శత్రువులకు వేదన కలిగించునవి.
భావము:-
దేవేంద్రుని వజ్రాయుధమునకు సాటివచ్చునవి, గురుతరమైన కార్యములు సాధించునవి, బంగారము తాపడము చేసినవి, మహాశక్తువతములైనవి, శత్రువులను అణచివేయునవి ఐన ధనుస్సులను.
2.99.21.
అనుష్టుప్.
అర్క రశ్మి ప్రతీకాశైః
ఘోరైస్తూణీగతైశ్శరైః।
శోభితాం దీప్తవదనైః
సర్పైర్భోగవతీమివ॥
టీక:-
అర్క = సూర్యుని; రశ్మి = కాంతికి; ప్రతీకాశైః = సూచించునవి; ఘోరైః = భయంకరమైనవి; తూణీగతైః = అంబులపొదులలో గల; శరైః = బాణములతో; శోభితాం = మెరయుచున్నవి; దీప్తవదనైః = మెరయుచున్న పడగలతో ; సర్పైః = సర్పములు; భోగవతీమ్ = భోగవతి నగరములో; ఇవ = వలె.
భావము:-
సూర్యుని కిరణముల వలె ప్రకాశించుచు, భీకరమిలైన అమ్ములు కలిగి అమ్ముల పొదులు శోభిస్తున్నవి. అవి భోగవతీ నగరము (నాగలోకము) లోని సర్పముల పడగల వలెనున్నవి.
2.99.22.
అనుష్టుప్.
మహారజతవాసోభ్యామ్
అసిభ్యాం చ విరాజితామ్।
రుక్మబిన్దువిచిత్రాభ్యాం
చర్మభ్యాం చాపి శోభితామ్॥
టీక:-
మహా= పెద్ద; రజత= వెండిచేత; వాసోభ్యామ్ = చేయబడిన ఒరలలో ఉన్నవి; అసిభ్యాం = రెండు కత్తులు; విరాజితామ్ = ప్రకాశించుచు ఉన్నవి; రుక్మ= బంగారపు; బిన్దు= చుక్కలు, పూలతో; విచిత్రాభ్యాం = చిత్రింపబడినవి; చర్మభ్యాం = రెండు డాలులచేత; అపి = కూడ; శోభితామ్ = శోఊభిల్లుచున్నవి.
భావము:-
వెండితో చేయబడి ప్రకాశించుచున్న పెద్ద ఒరలలో ఉన్న రెండు కత్తులను, బంగారు పువ్వులతో అలంకరింపబడిన రెండు డాలులు గోడలపై వ్రేలాడుచున్నవి.
2.99.23.
అనుష్టుప్.
గోధాంగుళిత్రైరాసక్తైః
చిత్రైః కాంచనభూషితైః।
అరిసంఘైరనాధృష్యాం
మృగైస్సింహగుహా మివ॥
టీక:-
గోధా = ఉడుము చర్మపు; అంగుళిత్రైః = వ్రేళ్ళ తొడుగులను; ఆసక్తైః = వ్రేలాడుచున్నవానిని; చిత్రైః = వివిధ వర్ణములతో; కాంచనభూషితైః = బంగారముతో అలంకరింపబడిన; అరిసంఘైః = శత్రుమూకలవలన; అనాధృష్యాం = చూచుటకు వీలుకాని; మృగైః = లేళ్ళకు; సింహగుహామ్ = సింహము యొక్క గుహ; ఇవ = వలె.
భావము:-
బంగారముతో అలంకరింపబడిన రంగురగులతో గోడకు వ్రేళ్ళాడుతున్న వ్రేళ్ళకు తొడుగుకొను ఉడుము చర్మపు తొడుగులను, అవి లేళ్ళు ప్రవేశించలేని సింహపు గుహ వలె ఉండి, శత్రుమూకలకు దొరకనివి.
2.99.24.
అనుష్టుప్.
ప్రాగుదక్ప్రవణాం వేదిం
విశాలాం దీప్తపావకామ్।
దదర్శ భరతస్తత్ర
పుణ్యాం రామనివేశనే॥
టీక:-
ప్రాగుదక్ = ఈశాన్యమూల; ప్రవణాం = అంచులు కట్టబడిన; వేదిమ్ = యజ్ఞమునకైన తిన్నె; విశాలాం = విశాలమైన; దీప్తః = జ్వలించుచున్న; పావకామ్ = అగ్నిని; దదర్శ = చూచెను; భరతః = భరతుడు; తత్ర = అక్కడ; పుణ్యాం = పవిత్రమైన; రామనివేశనే = రాముని ఆశ్రమమునందు.
భావము:-
ప్రజ్వలించుచున్న విశాలమైన యజ్ఞవేదిక పిట్టగోడలు కట్టబడి ఈశాన్య మూలమున ఉన్నదానిని, పవిత్రమైన రాముని ఆశ్రమమునందు భరతుడు చూచెను.
2.99.25.
అనుష్టుప్.
నిరీక్ష్య స ముహూర్తం తు
దదర్శ భరతో గురుమ్।
ఉటజే రామమాసీనం
జటామండలధారిణమ్॥
టీక:-
నిరీక్ష్య = పరిశీలించి; సః = ఆ; ముహూర్తం = క్షణకాలము; దదర్శ = చూచెను; భరతః = భరతుడు; గురుమ్ = పెద్దవానిని, అన్నగారిని; ఉటజే = పర్ణశాలయందు; రామమ్ = రాముని; ఆసీనం = కూర్చుని ఉన్న; జటామండలధారిణమ్ = జటలు ధరించినవానిని.
భావము:-
భరతుడు క్షణకాలము పరిశీలనగా చూసి ఆ పర్ణశాలలో జటలు కట్టిన శిరోజములతో కూర్చునియున్న అన్నగారైన రాముని దర్శించెను.
2.99.26.
అనుష్టుప్.
తం తు కృష్ణాజినధరం
చీరవల్కలవాససమ్।
దదర్శ రామమాసీనమ్
అభితః పావకోపమమ్॥
టీక:-
తం = ఆ; తు = శుభ; కృష్ణాజినధరం = నల్లని ఆడ జింక చర్మము ధరించినవానిని ; చీరవల్కల = నారచీరలు; వాససమ్ = వస్త్రములుగ గలవానిని ; దదర్శ = చూచెను; రామమ్ = రాముని; ఆసీనమ్ = కూర్చుని ఉన్న; అభితః = ఎదుట, సర్వశబ్దసంబోధిని; పావక = అగ్ని; ఉపమమ్ = పోలినవాడు.
భావము:-
కృష్ణాజినము కట్టుకుని, నారచీర ఉత్తరీయముగా ధరించి కట్టెదుట అగ్నిదేవుని సరిపోలి కూర్చుని ఉన్న రాముని భరతుడు చూసెను.
2.99.27.
అనుష్టుప్.
సింహస్కంధం మహాబాహుం
పుండరీకనిభేక్షణమ్।
పృథివ్యాస్సాగరాంతాయాః
భర్తారం ధర్మచారిణమ్॥
టీక:-
సింహస్కంధమ్ = సింహపుమూపు వంటి మూపు కలవాని; మహాబాహుమ్ = గొప్ప చేతులు కలవాడు; పుండరీక = పద్మములతో; నిభ = సమానమైన; ఈక్షణమ్ = కన్నులు గలవానిని; పృథివ్యాః = భూమికి; సాగరాంతాయాః = సముద్రము చివరలు గల; భర్తారం = ప్రభువును; ధర్మచారిణమ్ = ధర్మమును ఆచరించువానిని.
భావము:-
సింహపుమూపు వంటి మూపుముతోను, పెద్ద పెద్ద చేతులతోను, పద్మముల వంటి కన్నులతోనూ, ధర్మాచారపరాయణుడైన, సముద్ర పర్యంతము ఉన్న భూమికి ప్రభువైన రాముని భరతుడు చూచెను.
2.99.28.
అనుష్టుప్.
ఉపవిష్టం మహాబాహుం
బ్రహ్మాణమివ శాశ్వతమ్।
స్థండిలే దర్భసంస్తీర్ణే
సీతయా లక్ష్మణేన చ॥
టీక:-
ఉపవిష్టంమ్ = కూర్చున్న వాvf; మహాబాహుమ్ = గొప్ప బాహువులు కలవాని; బ్రహ్మాణమ్ = బ్రహ్మదేవుని; ఇవ = వలె; శాశ్వతమ్ = నిత్యుడు; స్థండిలే = పవిత్రమైననేలపైనున్న; దర్భ = దర్భలు; సంస్తీర్ణే = పరచబడిన; సీతయా = సీతతో; లక్ష్మణేన = లక్ష్మణునితో.
భావము:-
దర్భాసనం పై కూర్చుని ఉన్న శాశ్వతుడైన బ్రహ్మ దేవుని వంటి రాముడు కనిపించెను. సీతా లక్ష్మణులు ఇరువైపుల దర్భలు పరచిన పవిత్రస్థలమున ఉండిరి.
*గమనిక:-
వ్రతము పూనినవారు పండుకొనుటకై దర్భాదులచే సంస్కరింపఁబడిన నేల.
2.99.29.
అనుష్టుప్.
తం దృష్ట్వా భరతశ్శ్రీమాన్
దుఃఖశోకపరిప్లుతః।
అభ్యధావత ధర్మాత్మా
భరతః కైకేయీ సుతః॥
టీక:-
తం = ఆ; దృష్ట్వా = చూచి; భరతః = భరతుడు; శ్రీమాన్ = శ్రీమంతుడు; దుఃఖః = బాధతో; శోకః = శోకమునందు; పరిప్లుతః = తూలిపోవుచున్నవాడు; అభ్యధావత = పరుగిడెను; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; భరతః = భరతుడు; కైకేయీ సుతః = కైకేయు కుమారుడు.
భావము:-
శ్రీమంతుడును, ధర్మాత్ముడును, కైకేయి కుమారుడును, ఐన భరతుడు బాధతో శోకించుచు తీలిపోవుచు రామునివద్దకు పరుగిడెను.
2.99.30.
అనుష్టుప్.
దృష్ట్వైవ విలలాపాఽ ర్తో
బాష్పసందిగ్ధయా గిరా।
అశక్నువన్ ధారయితుం
ధైర్యాద్వచనమబ్రవీత్॥
టీక:-
దృష్ట్వైవ = చూచినంతనే; విలలాప = విలపించెను; ఆర్తః = పీడితుడై; బాష్ప = కన్నీటిచే; సందిగ్ధయా = అస్పష్టమయిన; గిరా = వాక్కులతో; అశక్నువన్ = అశక్తుడై; ధారయితుం = అణచుకొనుటకు; ధైర్యాత్ = ధైర్యముచేత; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను.
భావము:-
భరతుడు రాముని చూచినంతనే కంఠములో చేరిన కన్నీరు వలన అస్పష్టముగ మాటలాడుచు విలపించెను. దుఃఖమును అణచుకొనజాలకనే ధైర్యముచేసికొని ఇట్లు పలికెను.
2.99.31.
అనుష్టుప్.
“యస్సంసది ప్రకృతిభిః
భవేద్యుక్త ఉపాసితుమ్।
వన్యైర్మృగైరుపాసీనః
సోఽ యమాస్తే మమాగ్రజః॥
టీక:-
యః = ఎవడు; సంసది = సభయందు; ప్రకృతిభిః = మంత్రులుచేత; భవేత్ = ఉండుటకు; యుక్తః = తగియున్నవాడై; ఉపాసితుమ్ = సేవించుటకు; వన్యైః = వనమునందు; మృగైః = మృగములచే; ఉపాసీనః = సేవింపబడుచు; సః = అతడు; అయమ్ = ఈ; అస్తే = ఉండెనో; మమ = నా; అగ్రజః = అన్నగారు.
భావము:-
“సభలయందు మంత్రులు ప్రభృతులతో సేవింపబడుతూ ఉండవలసిన మా అన్నగారైన రాముడు ఈ వనమునందు అడవి జంతువుల మధ్యన ఉండెను.
*గమనిక:-
ప్రకృతి- సప్తప్రకృతులు - స్వామ్యాది, స్వామి, అమాత్యుఁడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము.
2.99.32.
అనుష్టుప్.
వాసోభిర్బహుసాహస్రైః
యో మహాత్మా పురోచితః।
మృగాజినే సోఽ యమిహ
ప్రవస్తే ధర్మమాచరన్॥
టీక:-
వాసోభిః = వస్త్రములచేత; బహుసాహస్రైః = అనేక వేల; యః = ఏ; మహాత్మా = మహాత్ముడు; పురా = పూర్వము; ఉచితః = అలవాటు పడెనో ; మృగాజినే = జింక చర్మములను; సః = అతడు; అయమ్ = ఇటువంటి; ఇహ = వలె; ప్రవస్తే = ధరించి ఉన్నాడు; ధర్మమ్ = ధర్మమును; ఆచరన్ = ఆచరించుచు.
భావము:-
ఏ మహాత్ముడు పూర్వము వేలకొలది వస్త్రములకు అలవాటు పడియుండెనో, అటువంటి ఆ రాముడు ఇప్పుడు ధర్మమును ఆచరించుచు జింకచర్మములను ధరించుచున్నాడు.
2.99.33.
అనుష్టుప్.
అధారయద్యో వివిధాః
చిత్రాస్సుమనసస్తదా।
సోఽ యం జటాభారమిమం
వహతే రాఘవః కథమ్॥
టీక:-
అధారయత్ = ధరించియున్నాడో; యః = ఏ; వివిధాః = వివిధములైన; చిత్రాః = చిత్రమైన రంగురంగుల; సుమనసః = పువ్వులను; తదా = అప్పుడు; సః = అతడు; అయం = ఈ; జటాభారమ్ = జటాజూటమును; ఇమం = ఈ; వహతే = వహించుచున్నాడు; రాఘవః = రాముడు; కథమ్ = ఎట్లు.
భావము:-
పూర్వము చిత్రవిచిత్రములైన అనేక రకముల పుష్పములను ధరించిన రాముడు ఈనాడు ఈ జటాభారమును ఎట్లు ధరించుచున్నాడో కదా.
2.99.34.
అనుష్టుప్.
యస్య యజ్ఞైర్యథాదిష్టైః
యుక్తో ధర్మస్య సంచయః।
శరీరక్లేశసమ్భూతం
స ధర్మం పరిమార్గతే॥
టీక:-
యస్య = ఎవరకి ;యజ్ఞైః = యజ్ఞములచే; యథాదిష్టైః = యథావిధిగ; యుక్తః = తగియున్న; ధర్మస్య = ధర్మముయొక్క; సంచయః = సంపాదనము; శరీరక్లేశసమ్భూతం = కాయ కష్టముతో కూడినవాడై; సః = అతడు; ధర్మమ్ = ధర్మమును; పరిమార్గతే = శోధించుచున్నాడు.
భావము:-
ఏ రాముడు శాస్త్ర సమ్మతమైన యజ్ఞములను చేసి ధర్మమును ఆచరించెనో, అట్టి రాముడు నేడు కాయకష్టము చేయుచు ధర్మమును ఆచరించుచున్నాడు.
2.99.35.
అనుష్టుప్.
చందనేన మహార్హేణ
యస్యాంగముపసేవితమ్।
మలేన తస్యాంగమిదం
కథమార్యస్య సేవ్యతే॥
టీక:-
చందనేన = గంధముచే; మహార్హేణ = గొప్ప విలువైన; యస్య = ఎవని; అంగమ్ = శరీరము; ఉపసేవితమ్ = సేవింపబడినదో; మలేన = మురికిచే; తస్య = అతని; అంగమ్ = శరీరము; ఇదం = ఈ; కథమ్ = ఎట్లు; ఆర్యస్య = అన్నగారియొక్క; సేవ్యతే = సేవింపబడుచున్నదో.
భావము:-
చాలా విలువైన సుగంధ ద్రవ్యములను నిత్యము సేవింపబడెడి మా అన్నగారి శరీరము ఇప్పుడు ఎలా మాసిపోయి ఉన్నదో కదా.
2.99.36.
అనుష్టుప్.
మన్నిమిత్తమిదం దుఃఖం
ప్రాప్తో రామః సుఖోచితః।
ధిగ్జీవితం నృశంసస్య
మమ లోకవిగర్హితమ్”॥
టీక:-
మత్ = నా; నిమిత్తమ్ = మూలముగా ; ఇదం = ఈ; దుఃఖమ్ = దుఃఖమును; ప్రాప్తః = పొందెను; రామః = రాముడు; సుఖోచితః = సుఖమునకు అలవాటు పడిన; ధిక్ = ఛీ, నింద అగు గాక; జీవితం = జీవితము; నృశంసస్య = క్రూరుడనైన; మమ = నా; లోకవిగర్హితమ్ = లోకముచే నిందింపబడిన.
భావము:-
సుఖమునకు అలవాటు పడిన రాముడు నా కారణముగ ఈ విధముగ కష్టపడుచున్నాడు. ఛీఛీ. లోకముచే నిందింపబడుచు క్రూరుడనైన నా ఈ జీవితము వ్యర్థము కదా.”
2.99.37.
అనుష్టుప్.
ఇత్యేవం విలపన్దీనః
ప్రస్విన్నముఖపంకజః।
పాదావప్రాప్య రామస్య
పపాత భరతో రుదన్॥
టీక:-
ఇత్యేవం = ఇట్లు; విలపన్ = విలపించుచు; దీనః = దీనముగ; ప్రస్విన్న = చెమట పట్టిన; ముఖ = ముఖము అను; పంకజః = పద్మము కలవాడై; పాదౌ = పాదములను; అప్రాప్య = పొందకనే; రామస్య = రాముని; పపాత = పడెను; భరతః = భరతుడు; రుదన్ = రోధించుచు.
భావము:-
భరతుడు చెమట పట్టిన ముఖముతో దీనముగా విలపించుచు రాముని పాదములను చేరకుండగనే నేలపై పడెను.
2.99.38.
అనుష్టుప్.
దుఃఖాభితప్తో భరతో
రాజపుత్రో మహాబలః।
ఉక్త్వాఽఽర్యేతి సకృద్దీనం
పునర్నోవాచ కించన॥
టీక:-
దుఃఖాః = దుఃఖముచే; అభితప్తః = మిక్కిలి తపింపబడినవాడై; భరతః = భరతుడు; రాజపుత్రః = రాకుమారుడు; మహాబలః = మహాబలశాలి; ఉక్త్వా = పలికి; ఆర్య = పూజనీయుడైన; ఇతి = అని; సకృత్ = ఒక్కమారు; దీనం = దీనముగ; పునః = మరల; న = లేదు; ఉవాచ = పలికెను; కించన = ఏమియు.
భావము:-
మహాబలశాలియు రాజపుత్రుడును ఐన భరతుడు దుఃఖముచే పీడింపబడి "ఆర్యా" అని ఒక్కసారి దీనముగా పలికి, తరువాత ఏమియు పలుకలేకపోయెను.
2.99.39.
అనుష్టుప్.
బాష్పాభిహతకంఠశ్చ
ప్రేక్ష్య రామం యశస్వినమ్।
ఆర్యేత్యేవాథ సంకృశ్య
వ్యాహర్తుం నాశకత్తదా॥
టీక:-
బాష్పాః = కన్నీటిచే; అభిహత = కొట్టబడిన; కంఠః = కంఠముతో; చ = ఇంకను; ప్రేక్ష్య = చూచి; రామం = రాముని; యశస్వినమ్ = కీర్తిమంతుడైన; ఆర్యే = ఆర్యా; ఇతి = అని; ఏవ = మాత్రమే; అథ = తరువాత; సంకృశ్య = ఆక్రోశించి, అరచి; వ్యాహర్తుం = పలుకుటకు; న = కాలేదు; శకత్ = సమర్థుడు; తదా = అప్పుడు.
భావము:-
భరతుడు కీర్తిమంతుడైన రాముని చూచి, దుఃఖము నిండిన కంఠముతో "ఓ ఆర్యా" అని మాత్రమే బిగ్గరగా ఆక్రోశించి, తరువాత ఏమియు పలుకలేక ఉండిపోయెను.
2.99.40.
అనుష్టుప్.
శత్రుఘ్నశ్చాపి రామస్య
వవందే చరణౌ రుదన్।
తావుభౌ స సమాలింగ్య
రామశ్చాశ్రూణ్యవర్తయత్॥
టీక:-
శత్రుఘ్నః = శత్రుఘ్నుడును; చాపి = సహితము; రామస్య = రాముని; వవందే = నమస్కరించెను; చరణౌ = పాదద్వయములను; రుదన్ = రోదించుచు; తావుభౌ = వారిద్దరిని; సః = అతడు; సమాలింగ్య = కౌగలించుకొని; రామః చ = రాముడు; చ = పిమ్మట; అశ్రూణి = కన్నీటిని; అవర్తయత్ = విడిచెను.
భావము:-
శత్రుఘ్నుడు కూడ రోదించుచు రాముని పాదములకు నమస్కరించెను. రాముడు వారిరువురిని కౌగలించుకొని కన్నీరు కార్చెను.
2.99.41.
అనుష్టుప్.
తతస్సుమన్త్రేణ గుహేన చైవ
సమీయతూ రాజసుతావరణ్యే।
దివాకరశ్చైవ నిశాకరశ్చ
యథాఽమ్బరే శుక్రబృహస్పతిభ్యామ్॥
టీక:-
తతః = తరువాత; సుమన్త్రేణ = సుమంత్రునితోను; గుహేన చైవ = గుహనితోను; చైవ = కూడ; సమీయతుః = కలిసిరి; రాజసుతౌ = రాకుమారులు ఇరువురు ; అరణ్యే = అరణ్యమునందు; దివాకరః చైవ = కూడ; నిశాకరః చ = చంద్రుడును; చ = మఱియు; యథా = ఎట్లో; అంబరే = ఆకాశమునందు; శుక్రః = శుక్రుని; బృహస్పతిభ్యామ్ = బృహస్పతులతో (గ్రహములు).
భావము:-
తరువాత, రామలక్ష్మణులు సుమంత్రునితోను మఱియు గుహనితోను, ఆకాశములో రవిచంద్రులు శుక్ర బృహస్పతులతో కలిసినట్లు, ఆ వనమున కలిసిరి.
2.99.42.
త్రిష్టుప్.
తాన్పార్థివాన్వారణయూథపాభాన్
సమాగతాం స్తత్ర మహత్యరణ్యే।
వనౌకసస్తేఽ పి సమీక్ష్య సర్వేఽ -
ప్యశ్రూణ్యముంచన్ప్రవిహాయ హర్షమ్॥
టీక:-
తాన్ = ఆ; పార్థివాన్ = రాజులను; వారణ = ఏనుగులు; యూథపా = గుంపుల; భాన్ = ప్రకాశము గల; సమాగతాం = కలిసిన; తత్ర = అక్కడ; మహత్ = గొప్ప; అరణ్యే = అరణ్యమునందు; వనౌకసః = వన+ ఓకసః, వనమును నివాసముగా గలవారు, ఆటవికులు; తే = వారు; అపి = కూడ; సమీక్ష్య = చూచి; సర్వే = అందరు; అపి = కూడ; అశ్రూణి = కన్నీళ్ళను; అముంచన్ = విడిచిరి; ప్రవిహాయ = విడిచి; హర్షమ్ = సంతోషమును.
భావము:-
ఆ మహారణ్యములో, ప్రకాశవంతములైన ఏనుగుల వలె నున్న రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను చూచి దుఃఖితులై వనవాసులు సైతము కన్నీళ్లు కార్చిరి.
2.99.43.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే ఏకోనశతతమః సర్గః
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదేకావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యాకాండ లోని; ఏకోనశతతమః [99] = తొంభైతొమ్మిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యాకాండలోని [99] తొంభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము.
2.100.1.అనుష్టుప్.
జటిలం చీరవసనమ్
ప్రాంజలిం పతితం భువి।
దదర్శ రామో దుర్దర్శమ్
యుగాంతే భాస్కరంయథా॥
టీక:-
జటిలం = శిరోజములు జటలుకట్టినవాడు; చీర = నారచీర; వసనమ్ = కట్టినవాడు; ప్రాంజలిం = జోడించిన చేతులలో; పతితంభువిన్ = దండనమస్కారమ చేయువాని; దదర్శ = చూచెను; రామః = రాముడు; దుర్దర్శమ్ = చూడశక్యముకానివాడు; యుగాంతే = ప్రళయకాల; భాస్కరం = సూర్యుని; యథా = వలె.
భావము:-
నారచీరలు, జటలతో దండప్రణామముల చేయుచున్న వానిని ప్రళయకాల సూర్యుని భంగి తేజశ్శాలి ఐన రాముడు చూచెను.
2.100.2.అనుష్టుప్.
కథంచిదభివిజ్ఞాయ
వివర్ణవదనం కృశమ్।
భ్రాతరం భరతం రామః
పరిజగ్రాహ బాహునా॥
టీక:-
కథంచి = ఎట్టకేలకు; అభివిజ్ఞాయ = గుర్తుపట్టెను; వివర్ణ = వన్నెతగ్గిన; వదనం = ముఖముకలవాని; కృశమ్ = చిక్కిపోయినవాని; భ్రాతరమ్ = తమ్ముడు; భరతమ్ = భరతుని; రామః = రాముడు; పరిజగ్రాహ = తీసుకొనెను; బాహునా = చేతులలోనికి.
భావము:-
రాముడు పాలిపోయిన మోముతో, బక్కచిక్కిన తమ్ముడు భరతుని ఎట్టకేలకు గుర్తుపట్టి, తన చేతులతో పట్టి లేవదీసెను.
2.100.3.అనుష్టుప్.
ఆఘ్రాయ రామస్తం మూర్ధ్ని
పరిష్వజ్య చ రాఘవః।
అంకే భరతమారోప్య
పర్యపృచ్ఛత్సమాహితః॥
టీక:-
ఆఘ్రాయ = వాసన చూచి; రామః = రాముడు; తం = అతని; మూర్ధ్ని = శిరస్సును; పరిష్వజ్య = కౌగలించుకొనెను; చ = మఱియు; రాఘవః = రఘురాముడు; అంకే = ఒడిలో; భరతమ్ = భరతుడిని; ఆరోప్య = ఎక్కించుకుని; పర్యపృచ్ఛః = అడిగెను; సమాహితః = సావధానుడై.
భావము:-
రఘురాముడు భరతుని కౌగలించుకొని, శిరస్సున ముద్దిడి, ఒడిలో కూర్చుండ బెట్టుకొనెను. పిమ్మట సావధానముగా ఇట్లు అడిగెను.
2.100.4.అనుష్టుప్.
“క్వ ను తేఽభూత్పితా తాత!
యదరణ్యం త్వమాగతః।
న హి త్వం జీవతస్తస్య
వనమాగంతుమర్హసి॥
టీక:-
క్వను = ఎక్కడ; తః = నీ; ఆభూత్ = ఉండెను; పితా = తండ్రి; తాత = నాయనా; యత్ = కదా; అరణ్యమ్ = అడవికి; త్వమ్ = నీవు; ఆగతః = వచ్చితివి; న = లేదు; హి = నిశ్చయాత్మకము; త్వమ్ = నీవు; జీవతః = జీవించి యుండగా; తస్య = అతడు; వనమ్ = అరణ్యమునకు; ఆగంతుమ్ = వచ్చుటకు; మర్హసి = తగవు.
భావము:-
“నాయనా భరతా! నీవేమో ఇలా అరణ్యానికి వచ్చితివి కదా, మరి తండ్రిగారు ఎక్కడున్నారు. ఆయన జీవించి ఉండగా నీవిలా వనానికి రారాదు కదా.
2.100.5.అనుష్టుప్.
చిరస్య బత పశ్యామి
దూరాద్భరతమాగతమ్।
దుష్ప్రతీకమరణ్యేఽస్మిన్
కిం తాత! వనమాగతః॥
టీక:-
చిరస్య = చాలాకాలమునకు; బత = అహో, సంతోష ప్రకటన; పశ్యామి = చూచితిని; దూరాత్ = దూరమునుండి; భరతమ్ = భరతుని; ఆగతమ్ = వచ్చిన; దుష్ప్రతీకమ్ = చిక్కిపోయిన శరీరము కలవాడవు; అరణ్యేః = అడవిలోని; అస్మిన్ = ఈ; కిం = ఎందుకు; తాత = నాయనా; వనమ్ = వనములోనికి; ఆగతః = వచ్చితివి.
భావము:-
ఇంత దూరము వచ్చిన భరతుడిని చూచితిని, అహో! ఎంతోకాలము అయింది ఇతనిని చూసి. నాయనా! ఇంత చిక్కిపోయినవాడవు ఎందుకు శ్రమ తీసుకుని ఈ అడవిలోని వనమునకు వచ్చావు
2.100.6.అనుష్టుప్.
కచ్చిద్ధారయతే తాత!
రాజా యత్త్వమిహాఽగతః?।
కచ్చిన్న దీన స్సహసా
రాజా లోకాంతరం గతః?॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; ధారయతే = జీవించియే ఉండెను; తాత = బాబు; రాజా = రాజు, దశరథుడు; యత్ = ఈ; త్వం = నీవు; ఇహమ్ = ఇక్కకు; ఆగతః = వచ్చితివి; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; న = లేదు; దీనః = దీనుడై; సహసా = వెటనే; రాజా = రాజు, దశరతుడు; లోకాంతరంగతః = పరలోకానికి పోయివాడు.
భావము:-
బాబా భరత! నీవు ఇక్కడకు వచ్చావు. దశరథమహారాజు జీవించే ఉన్నాడు కదా? దుఃఖాక్రాంతుడై ప్రాణాలు విడువలేదు కదా?
2.100.7.అనుష్టుప్.
కచ్చిత్సౌమ్య? న తే రాజ్యమ్
భ్రష్టం బాలస్య శాశ్వతమ్।
కచ్చిచ్ఛుశ్రూషసే? తాత!
పితరం సత్యవిక్రమమ్॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకం; సౌమ్య = సౌమ్యుడు; న = లేదు; తే = నీ; రాజ్యమ్ = రాజ్యము; భ్రష్టమ్ = చేజాఱినది; బాలస్య = చిన్నవాడ వైన; శాశ్వతమ్ = స్థిరమైన; కచ్చిత్ = ప్రశ్నార్థకం, కదా; శుశ్రూషసే = సేవచేయుట; తాత = నాయనా; పితరం = తండ్రిని; సత్యవిక్రమమ్ = సత్యపరిపాలనాదీక్షుడు.
భావము:-
నాయనా చిన్నవాడవు సౌమ్యుడవైన భరత! స్థిరమైన నీ రాజ్యముకాని చేజారినదా? తండ్రిగారికి సేవలు చేయుచునే ఉంటివి కదా?
2.100.8.అనుష్టుప్.
కచ్చిద్ధశరథో రాజా
కుశలీ సత్యసంంగరః।
రాజసూయాశ్వమేధానామ్
ఆహర్తా ధర్మనిశ్చయః॥
తాత్పర్యము :-
సత్యసంధుడు, ధర్మవిధుడు, అనేకమైన రాజసూయ యాగములు అశ్వమేధ యాగములు చేసినవాడు ఐన దశరథమహారాజు క్షేమంగా ఉన్నాడు, కదా?
భావము:-
సత్యసంధుడు, ధర్మవిధుడు, అనేకమైన రాజసూయ యాగములు అశ్వమేధ యాగములు చేసినవాడు ఐన దశరథమహారాజు క్షేమంగా ఉన్నాడు, కదా?
2.100.9.అనుష్టుప్.
స కచ్చిద్బ్రాహ్మణో విద్వాన్
ధర్మనిత్యో మహాద్యుతిః।
ఇక్ష్వాకూణాముపాధ్యాయో
యథావత్తాత పూజ్యతే॥
టీక:-
స = ఆ; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; బ్రాహ్మణః = వేదవేత్త; విద్వాన్ = విద్వాంసుడు; ధర్మ = ధర్మమునందు; నిత్యః = స్థిరముగ ఉండువాడు; మహా = గొప్ప; ద్యుతిః = తేజశ్శాలి; ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకు వంశస్థులకు; ఉపాధ్యాయః = పురోహితుడు; యథావత్ = మునుపటివలెనే; తాత = నాయనా; పూజ్యతే = గౌరవించుచుంటివి.
భావము:-
ఆ బ్రాహ్మణోత్తముడు, పండితుడు, నిత్యధర్మశీలి, గొప్పతేజస్వి, ఇక్ష్వాకు కులంవారికి పురోహితుడు ఐన వసిష్ఠులవారిని గౌకవించుచు ఉన్నావు కదా?
2.100.10.అనుష్టుప్.
సా తాత! కచ్చిత్కౌసల్యా
సుమిత్రా చ ప్రజావతీ।
సుఖినీ కచ్చిదార్యా చ
దేవీ నందతి కైకయీ॥
టీక:-
సా = ఆ; తాత = నాయనా; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; కౌసల్యా = కౌసల్యా దేవి; సుమిత్రా = సుమిత్రాదేవి; చ = మఱియు; ప్రజావతీ = సంతానవతులు; సుఖినీ = సౌఖ్యవంతులు; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; ఆర్యా = పూజ్యురాలు; చ = పాదపూరణము; దేవీ = రాణి; నందతి = సంతోషించుచున్నది; కైకయీ = కైకయి.
భావము:-
నాయనా భరతా! తల్లులు కౌసల్యాదేవి, సుమిత్రాదేవిలకు సౌఖ్యమే కదా? మఱియు కైకేయీదేవికి సంతోషంగా ఉన్నది కదా?
2.100.11.అనుష్టుప్.
కచ్చిద్వినయసంపన్నః
కులపుత్రో బహుశ్రుతః।
అనసూయురనుద్రష్టా
సత్కృతస్తే పురోహితః॥
తాత్పర్యము :-
వినయశీలుడు, ఉత్తమకులమువాడు, అనేక శాస్త్రములు చదివిన వాడు, అసూయా రహితుడు, పురోహితుడు ఐన వశిష్ఠుని కుమారుడు సుయజ్ఞుని నీవు సన్మానించుచు ఉన్నావు కదా?
భావము:-
వినయశీలుడు, ఉత్తమకులమువాడు, అనేక శాస్త్రములు చదివిన వాడు, అసూయా రహితుడు, పురోహితుడు ఐన వశిష్ఠుని కుమారుడు సుయజ్ఞుని నీవు సన్మానించుచు ఉన్నావు కదా?
2.100.12.అనుష్టుప్.
కచ్చిదగ్నిషు తే యుక్తో
విధిజ్ఞో మతిమానృజుః।
హుతం చ హోష్యమాణం చ
కాలే వేదయతే సదా॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; అగ్నిషు = అగ్నుల యందు; తే = నీ; యుక్తః = తగిన, శ్రద్ధకలవాడు; విధిజ్ఞః = శాస్త్రవిధానము తెలిసినవాడు; మతిమాన్ = బుద్ధిశాలి; ఋజుః = సరియగు స్వభావము కలవాడు; హుతం = హవిస్సులు వ్రేల్చుట యందు; చ = మఱియు; హోష్యమాణం = వ్రేల్చదగినవానిని; చ = మఱియు; కాలే = సమయము; వేదయతే = తెలుపునా; సదా = ఎప్పుడు.
భావము:-
అగ్నికార్యములందు శాస్త్ర విధివిధానములు, యక్తాయుక్తములు తెలిసిన వాడు, బుద్ధిశాలి, ఋజుస్వభావి అగు పురోహితుడు హోమకార్యాలలో తగిన హవిస్సులు, తగిన ముహూర్తము ఎల్లప్పుడూ తెలుపుచుండెను కదా?
2.100.13.అనుష్టుప్.
కచ్చిద్దేవాన్పిత్రూన్ మాతౄన్
గురూన్పితృసమానపి।
వృద్ధాంశ్చ తాత వైద్యాంశ్చ
బ్రహ్మణాంశ్చాభిమన్యసే॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; దేవాన్ = దేవతలను; పిత్రూన్ = తండ్రులను; మాతౄన్ = తల్లులను; గురూన్ = గురువులను; పితృసమాన్ = పితృసమానులను; అపి = ఇంకా; వృద్ధాః = పెద్దలను; చ = కూడ; తాత = నాయనా; వైద్యాః = వైద్యులను; చ = ఇంకా; బ్రహ్మణాః = బ్రాహ్మణులను; చ = ఇంకా; అభిమన్యసే = గౌరవించుచుంటివి.
భావము:-
నాయనా భరతా! దేవతలను, తండ్రులను, మాతలను, గురువులను, పితృసమానులను ఇంకా పెద్దలను మఱియు వైద్యులను ఇంకా బ్రాహ్మణులను గౌరవించుచుంటివి కదా?
*గమనిక :-
(1) తండ్రి- పితలు- పంచపితలు, 1. కన్నతండ్రి, 2. వడుగుచేసిన వాడు, 3. చదువుచెప్పినవాడు, 4. అన్నముపెట్టినవాడు, 5. వెఱపు తీర్చినవాడు (శబ్దరత్నాకరము). పాఠ్యంతరమున 1. జనకుడు, 2. ఉపనేత, 3. కన్యాదాత, 4. అన్నదాత, 5. భయత్రాత. (2) మాతలు- పంచమాతలు, 1. రాజు భార్య, 2. అన్న భార్య, 3. గురువు భార్య, 4. భార్యతల్లి, 5. తన తల్లి. (3) షోడశ మాతలు- 1. స్తన్యదాత్రి, 2. గర్భదాత్రి, 3. అన్నదాత్రి, 4. గురుపత్ని, 5. ఇష్టదేవపత్ని, 6. సాపత్యమాత, 7. కన్య, 8. గర్భారభగిని, 9. స్వామిపత్ని, 10, భార్యాజనని, 11. మాతమహి, 12. పితామహి. 13. బంధుపత్ని, 14. మాతృభగిని, 15. పితృభగిని, 16. మాతుల (మేనమామ భార్య). ఆంధ్రభారతి నిఘంటువు.కాం (4) గురువులు- 1. తండ్రి, 2. ఉపాధ్యాయుడు, 3. తాత (పితామహుడు), 4. తాత (మాతామహుడు), 5. పినతండ్రి, 6. పెదతండ్రి, 7. అన్న, 8 మేనమామ, 9. జీవిత సహచర తండ్రి, 10. కులపెద్ద, 11. మంత్రోపదేశము చేసిన ఆచార్యుడు, 12 రాజు, 13. రక్షకుడు (సౌజన్యము శబ్దరత్నాకరము)
2.100.14.అనుష్టుప్.
ఇష్వస్త్రవరసంపన్నమ్
అర్థశాస్త్ర విశారదమ్।
సుధన్వానముపాధ్యాయమ్
కచ్చిత్త్వం తాత! మన్యసే॥
టీక:-
ఇషుః = బాణములు, శస్త్రములు; అస్త్రః = అస్త్రములు; వర = శ్రేష్టమైనవి; సంపన్నమ్ = సమృద్దిగా కలవానిని; అర్థశాస్త్ర = రాజనీతి శాస్త్రము, దండనీతి, శబ్దరత్నాకరము; విశారదమ్ = విద్వాంసుడు; సుధన్వానమ్ = సుధాన్వుడను; ఉపాధ్యాయమ్ = గురువును; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; త్వం = నీవు; తాత = నాయనా; మన్యసే = మన్నించుచుంటివి.
భావము:-
శ్రేష్ఠమైన అస్త్రశస్త్రములు కలవానిని, రాజనీతి శాస్త్ర నిష్ణాతుని, సుధన్వ ఉపాధ్యాయులవారిని గౌరవించుచున్నావు కదా?
*గమనిక :-
(1) ఇషుః- బాణములు, శస్త్రములు, మంత్రప్రయోగము లేని ఆయుధములు. (2) అస్త్రః- అస్త్రములు, మంత్రప్రయోగము కల ఆయుధములు. (3) విశారదుడు- విద్వాంసుడు, నేర్పరి, వ్యుతపత్తి. విశాల+ దా+ శ- లస్య రః, కృ.ప్ర., విరివిగా తెలివి నొసగువాడు. (4) ఉపాధ్యాయుడు- వ్యుత్పత్తి. ఇజ్- అధ్యయనే- ఉపేత్య అధీయతే అస్మాత్- ఉప+అధి+ఇ+ఘణ్, కృ.ప్ర., చేరి ఇతని వలన విద్య నేర్వబడును, వేతనము గ్రహించి విద్య నేర్పు వాడు, ఆంధ్రశబ్దరత్నాకరము.
2.100.15.అనుష్టుప్.
కచ్చిదాత్మసమాశ్శూరాః
శ్రుతవన్తో జితేంద్రియాః।
కులీనాశ్చేంగితజ్ఞాశ్చ
కృతాస్తే తాత మంత్రిణః॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; ఆత్మ = స్వీయ, తనతో; సమాః = సమానులైన; శూరాః = శూరులని; శ్రుతవన్తః = విద్వాంసులను; జితేంద్రియాః = ఇంద్రియజయంకలవారిని; కులీనాః = సద్వంశమువారిని; చ = ఇంకా; ఇంగితజ్ఞాః = ఇంగితజ్ఞానము, విచక్షణ జ్ఞానము కలవారిని; చ = ఇంకా; కృతాః = చేయబడినారు; తే = నీ; తాత = నాయనా; మంత్రిణః = మంత్రులుగ.
భావము:-
నాయనా భరతా! నీతో సమానులైన శూరులూ, విద్వాంసులూ, ఇంద్రియ జయము కలవారిని, సువంశస్థులను మఱియు మంచి ఇంగితజ్ఞానము కలవారిని మంత్రులుగా నియమించుకున్నావు కదా?
2.100.16.అనుష్టుప్.
మంత్రో విజయమూలం హి
రాజ్ఞాం భవతి రాఘవ।
సుసంవృతో మంత్రధరైః
అమాత్యైశ్శాస్త్రకోవిదైః॥
టీక:-
మన్త్రః = ఆలోచన, మంత్రాంగము; విజయ = విజయమునకు; మూలం = కారణము; హి = నిశ్చయముగ; రాజ్ఞామ్ = రాజులకు; భవతి = అగును; రాఘవ = రఘువంశోద్భవ, భరత; సుసంవృతః = చక్కగా దాచబడిన; మంత్రధరైః = మంత్రాంగములు ధరించువారు; అమాత్యైః = మంత్రులు; శాస్త్రకోవిదైః = శాస్త్రము బాగాతెలిసినవారు.
భావము:-
రఘువంశపు భరతా! శాస్త్రములు తెలిసిన వారూ, మంత్రాగ రహస్యములను బయటపడనీయని వారూ ఐన మంత్రుల మంత్రాంగములే రాజుల విజయాలకు మూలకారణం
2.100.17.అనుష్టుప్.
కచ్చిన్నిద్రావశం నైషీః
కచ్చిత్కాలే ప్రబుధ్యసే।
కచ్చిచ్చాపరరాత్రేషు
చింతయస్యర్థనైపుణమ్॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; నిద్రావశం = గాఢనిద్రపోవుట; నైషీః = చేయుట లేదు; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; కాలే = తగిన సమయము నందు; ప్రబుధ్యసే = మెళకువగా ఉంటున్నావు; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; అపరరాత్రేషు = రాత్రి చివర ఝామున, తెల్లవారు ఝామున; చింతయః = ఆలోచనలు చేయుచున్నాము; అర్థనైపుణమ్ = రాజకీయ శాస్త్ర నైపుణ్యము కావలసిన విషయములు.
భావము:-
నిద్రాలోలుడవు కావుటలేదుకదా? తగిన సమయాలలో మేల్కొనే ఉంటున్నావు కదా? రాజకీయ మంత్రాంగములు తెల్లవారగట్ల నిర్వహిస్తున్నావు కదా?
2.100.18.అనుష్టుప్.
కచ్చిన్మంత్రయసే నైకః
కచ్చిన్న బహుభిస్సహ।
కచ్చిత్తే మంత్రితో మంత్రో
రాష్ట్రం న పరిధావతి॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; మంత్రయసే = మంత్రాంగము ఆలోచించుట; న = లేదు; ఏకః = ఒంటరిగా; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; న = లేదు; బహుభిః = మరీ ఎక్కువమందితో; సహ = కూడి; ప్రశ్నార్థకము, కదా; తే = నీ చేత; మంత్రితః = ఆలోచింపబడిన; మన్త్రః = మంత్రాంగము; రాష్ట్రమ్ = దేశమున; న = లేదు; పరిధావతి = ప్రసరించుట, పొక్కుట.
భావము:-
మంత్రాగములు ఆలోచించుట ఒంటరిగా కాని, మరీ ఎక్కువమందితో కాని చేయుటలేదు కదా? నీ మంత్రాగ ఆలోచనలు దేశమంతా పాకిపోవుటలేదు కదా?
2.100.19.అనుష్టుప్.
కచ్చిదర్థం వినిశ్చిత్య
లఘుమూలం మహోదయమ్।
క్షిప్రమారభసే కర్తుమ్
న దీర్ఘయసి రాఘవ!॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; అర్థమ్ = ప్రయోజనము; వినిశ్చిత్య = నిశ్చయించి; లఘుమూలం = స్వల్పసాధనములు; మహా = గొప్పగా; ఉదయమ్ = కలుగునవి; క్షిప్రమ్ = శీఘ్రమే; ఆరభసే = ఆరంభించుట, చేపట్టుట; కర్తుమ్ = చేయుట; న = లేదు; దీర్ఘయసి = ఆలస్యము చేయుట; రాఘవ = రఘువంశపువాడ.
భావము:-
రఘువంశపప భరతా! స్వల్ప యత్నముతో అదికమైన ప్రయోజనము సిద్దించు కార్యములను గుర్తించి వెంటనే చేపట్టుచున్నావు కదా? ఇందు ఆలస్యము చేయుటలేదు కదా?
2.100.20.అనుష్టుప్.
కచ్చిత్తు సుకృతాన్యేవ
కృతరూపాణి వా పునః।
విదుస్తే సర్వకార్యాణి
న కర్తవ్యాని పార్థివాః॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; తు = పాదపూరణము; సు = చక్కగా; కృతాన్ = చేసినవి; ఏవ = నిశ్చయంగా; కృత = చేయుచున్న; రూపాణి = రూపంలో ఉన్నవి; వా = లేదా; పునః = మఱియు; విదుః = తెలుసుకొను చున్నారు; తే = నీ యొక్క; సర్వ = సమస్తమైన; కార్యాణి = కార్యక్రమములను; న = లేదు; కర్తవ్యాని = చేయవలసిన పనులు; పార్థివాః = రాజులు.
భావము:-
చేపట్టిన కార్యములు పూర్తి అయినపిమ్మట లేదా చాలావరకు కృకకృత్యమైనవి, ఇతర రాజులకు తెలుస్తున్నవి కదా? లేక చేస్తున్న కార్యములు, చేయబోవు కార్యక్రమములు సమస్తము వారికి తలిసిపోతోందా? బయటకు పొక్కుచున్నదా?
2.100.21.అనుష్టుప్.
కచ్చిన్నతర్కైర్యుక్త్యా వా
యే చాప్యపరికీర్తితాః।
త్వయా వా తవ వాఽమాత్యైః
బుధ్యతే తాత మంత్రితమ్॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; న = లేదు; తర్కైః = ఊహలచేత; యుక్త్యా = యుక్తిచేత, ఉపాయముచేత; వా = కాని; యే = ఏ యొక్క; చాపి = ఇతరమైన; అపరికీర్తితాః = చెప్పడబడని విధమున కాని; త్వయా = నీ చేత; వా = కాని; తవ = నీ యొక్క; వా = కాని; అమాత్యైః = మంత్రుల చేత; బుధ్యతే = తెలియబడుతున్నది; తాత = న్యనా; మంత్రితమ్ = ఆలోచనలో ఉన్న కార్యక్రమము.
భావము:-
నాయాన భరతా! ఇతరులు ఎవరునూ తమ తర్కము వాడి గాని, ఏదైనా మనకు వినిన ఉపాయముచేత గాని, మనము విని ఉండని ఉపాయముచేత గాని, నీ ఆలోచనలు లేదా నీ మంత్రులు చేసిన ఆలోచనలు కాని కనిపెట్టుట లేదు కదా?
2.100.22.అనుష్టుప్.
కచ్చిత్సహస్రాన్మూర్ఖాణామ్
ఏకమిచ్ఛసి పండితమ్।
పండితో హ్యర్థకృచ్ఛ్రేషు
కుర్యాన్నిశ్రేయసం మహత్॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; సహస్రాన్ = వేలమంది; మూర్ఖాణామ్ = మూర్ఖుల కంటె; ఏకమ్ = ఒక్క; ఇచ్ఛసి = కోరుదువు; పండితమ్ = పండితుని; పండితః = పండితుడు; అర్థకృచ్ఛ్రేషు = కార్యసంకటమున; కుర్యాన్ = చేయును; నిశ్రేయసం = క్షేమమును; మహత్ = గొప్ప.
భావము:-
వేలమంది మూర్ఖుల కంటె, ఒక్క పండితుని కోరుకుందువు కదా. ఎలాంటి కార్యసంకటము ఎదురైనా పండితుడు గొప్ప పరిష్కారము చూపిస్తాడు.
2.100.23.అనుష్టుప్.
సహస్రాణ్యపి మూర్ఖాణామ్
యద్యుపాస్తే మహీపతిః!।
అథవాప్యయుతాన్యేవ
నాస్తి తేషు సహాయతా॥
టీక:-
సహస్రాణి = వేలకొలది; అపి = ఒక్క; మూర్ఖాణామ్ = మూర్ఖులను; యది = ఒకవేళ; ఉపాస్తే = ఆశ్రయించినను; మహీపతిః = రాజు; అథవా = లేక; అపి = కూడ; ఆయుతాని = పదివేలకొలది; ఏవ = ఐనను; న = లేదు; అస్తి = ఉండుట; తేషు = వారిలో; సహాయతా = సహాయత్వము.
భావము:-
రాజా భరత! మూర్ఖులను వేలకొలదిని లేదా పదివేలకొలదిని ఐనా చేరదీసినను. వారి వలన ఎట్టి సహాయము లభించదు.
2.100.24.అనుష్టుప్.
ఏకోఽప్యమాత్యో మేధావీ
శూరో దక్షో విచక్షణః।
రాజానం రాజపుత్రం వా
ప్రాపయేన్మహతీం శ్రియమ్॥
టీక:-
ఏకః = ఒక్కడు; అపి = ఐనా; అమాత్యః = అమాత్యుడు, మంత్రి; మేధావీ = తెలివికలవాడు; శూరః = స్థిరబుద్ది; దక్షః = సమర్థుడ; విచక్షణః = నేర్పరి, ఆంధ్రశబ్ద రత్నాకరము; రాజానం = రాజునకు; రాజపుత్రం = రాకుమారుడు; వా = ఐనా; ప్రాపయేన్ = పొందించును; మహతీమే = గొప్పదైన; శ్రియమ్ = శ్రేయస్సును, శుభము, మేలు.
భావము:-
తెలివితేటలు, స్థిరబుద్ధి, సమర్థత, నేర్పరితనము కలవాడైన మంత్రి ఒక్కడున్నా రాజునకు లేదా రాకుమారులకు అన్నీ శుభాలు, మేళ్ళు కలుగజేయును.
2.100.25.అనుష్టుప్.
కచ్చిన్ముఖ్యా మహాత్స్వేవ
మధ్యమేషు చ మధ్యమాః।
జఘన్యాశ్చ జఘన్యేషు
భృత్యాః కర్మసు యోజితాః॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; ముఖ్యా = ముఖ్యమైన కార్యములందు; మహాత్సు = గొప్పవారిని; ఏవ = నిశ్చయంగా; మధ్యమేషు = మధ్యమ కార్యములందు; చ = పాదపూరణము; మధ్యమాః = మధ్యములను; జఘన్యాః = అధమకార్యములందు; చ = పాదపూరణము; జఘన్యేషు = సామర్థ్యము తక్కువవారిని; భృత్యాః = భృత్యులను; కర్మసు = పనులందు; యోజితాః = నియోగించెదవు.
భావము:-
అధిక సామర్థ్యము కలవారిని ముఖ్యమైన కార్యములందు, సామాన్య సామర్థ్యము గలవారిని సామాన్య పనులందు మఱియు తక్కువ సామర్థ్యము కలవారిని చిన్నపనులలోనూ నియంమించుచున్నావు కదా?
2.100.26.అనుష్టుప్.
అమాత్యానుపధాతీతాన్
పితృపైతామహాంఛుచీన్।
శ్రేష్ఠాంఛ్రేష్ఠేషుకచ్చిత్వమ్
నియోజయసి కర్మసు॥
టీక:-
అమాత్యాన్ = మంత్రులను; ఉపధా = ప్రలోభములకు; అతీతాన్ = లొంగనివారు; పితృపైతామహాన్ = వంళపారంపర్యంగా వచ్చినవారు; శుచీన్ = పరిశుద్ధ వర్తన కలవారు; శ్రేష్ఠామ్ = శ్రేష్ఠులను; శ్రేష్ఠేషు = శ్రేష్ఠమైనవాని; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; త్వమ్ = నీవు; నియోజయసి = నియమించుచుంటివి; కర్మసు = కార్యము లందు.
భావము:-
మంత్రులు పరిశుద్ధమైన వర్తన కలవారు, వంశపారంపర్యంగా మన దగ్గరే ఉంటున్నవారు, ప్రలోభాలకు లొంగని స్వభావము కలవారు. ఆ శ్రేష్టులను ప్రధానమైన కార్యక్రమములందు నియమించుచుంటివి కదా?
*గమనిక :-
;ఉపధ- ధర్మార్థ కామములచేత మంత్రి మున్నగువారి గుణములు పరీక్షించుట. ఆంధ్రశబ్దరత్నాకరము. ఉపధయందు వాడునట్టి ప్రలోభములకు అతీతులు అయినవారు నెగ్గి పదవికి అర్హత పొందుదురు. కనుక వారిని ఉపధాతీతులు అందురు.
2.100.27.అనుష్టుప్.
కచ్చిన్నోగ్రేణ దండేన
భృశముద్వేజితప్రజమ్।
రాష్ట్రం తవానుజానంతి
మంత్రిణః కైకయీసుత!॥
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; ఉగ్రేణ = తీక్షణమైన; దండేన = శిక్షలకు; భృశమ్ = మిక్కలి; ఉద్వేజిత = వెఱపుచెందిన; ప్రజమ్ = పౌరులను; రాష్ట్రమ్ = దేశపు; తవ = నీ; అనుజానంతి = అనుమతించుట; మంత్రిణః = మంత్రులను; కైకయీసుత = కైకేయి పుత్రుడ.
భావము:-
ఓ కైకేయిపుత్ర భరతా! ప్రజలు బెదరిపోయెడి ఉద్దండశిక్షలు విధించుటకు, నీ దేశ మంత్రులను అనుమతించవు కదా?
2.100.28.అనుష్టుప్.
కచ్చిత్త్వాం నావజానంతి
యాజకాః పతితం యథా।
ఉగ్రప్రతిగ్రహీతారమ్
కామయానమివ స్త్రియః॥
తాత్పర్యము :-
టీక:-
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; త్వాం = నిన్ను; న = లేదు; అవజానంతి = అవమానించుట; యాజకాః = ఋత్విక్కులు; పతితం = పతితుని; యథా = వలె; ఉగ్ర = భయంకరముగ; ప్రతిగ్రహీతారమ్ = దానములు ప్రతిగ్రహించు; కామయానమ్ = కాముకులను; ఇవ = వలె; స్త్రియః = స్త్రీలు.
కాముకులను స్త్రీలు అవమానించునట్లు, వేదపండితులైన ఋత్విక్కులు
కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; త్వాం = నిన్ను; న = లేదు; అవజానంతి = అవమానించుట; యాజకాః = ఋత్విక్కులు; పతితం = పతితుని; యథా = వలె; ఉగ్ర = భయంకరముగ; ప్రతిగ్రహీతారమ్ = దానములు ప్రతిగ్రహించు; కామయానమ్ = కాముకులను; ఇవ = వలె; స్త్రియః = స్త్రీలు.
2.100.29.అనుష్టుప్.
ఉపాయకుశలం వైద్యమ్
భృత్యసందూషణే రతమ్।
శూరమైశ్వర్యకామం చ
యో న హంతి స హన్యతే॥
టీక:-
ఉపాయ = సామదానిది యందు, ఆంధ్రశబ్దరత్నాకరము; కుశలం = నేర్పు గలవానిని; వైద్యమ్ = పండితుని; భృత్యసందూషణే = భత్యసందూషణ యందు; రతమ్ = ఆసక్తికలవాడైన; శూరమ్ = శూరుని; ఐశ్వర్య = సంపదలపై; కామం = అమితాసక్తి కలవాడైన; చ = మఱియు; యో = ఎవరైతే; న = లేదో; హంతి = చంపుట; స = అతడు; హన్యతే = చంపబడును.
భావము:-
రాజోద్యోగులకు ప్రభువుపై లేనిపోనివి చెప్పి పుల్లలు పెట్టే భత్యుసందోషణము చేయు దుష్టవర్తన వాడూ, రాజులు ప్రయోగించు సామదానాది చతుర్విధోపాయము లందు నేర్పు కలవాడూ ఐన విద్యావంతుని. మఱియు సంపదలందు వెంపర్లాడు శూరుడుని సంహరింప వలెను. అటుల సంహరింపని వాడు నశించును.
*గమనిక :-
(1) ఉపాయము- రాజు శత్రువులను లొంగదీయు సాధనములైన సాధన విశేషము, చతుర్విధోపాయములైన సామదాన బేధ దండోపాయములు, (2) వైద్యుడు- వ్యుత్పత్తి. విద్యా+ అణ్, త.ప్ర., పండితుడు, చికిత్సకుడు. (3) భృత్యసందూషణము- లేనిపోనివి చెప్పి మనస్సు విరిచి, ఉద్యోగులను ప్రభువునకు ఎదురుతిరుగునట్లు చేయుట.
2.100.30.అనుష్టుప్.
కచ్చిద్ధృష్టశ్చ శూరశ్చ
మతిమాన్ ధృతిమాన్ శుచిః।
కులీనశ్చానురక్తశ్చ
దక్షస్సేనాపతిః కృతః॥
టీక:-
కచ్చిత్ = ఎవరైతే; ధృష్టః = ప్రతిభ కలవాడు, వావిళ్ళ నిఘంటువు; చ = మఱియు; శూరః = యుద్ధమునకు భయపడనివాడు, వావిళ్ళనిఘంటువు; చ = మఱియు; మతిమాన్ = సూక్ష్మబుద్ధి; ధృతిమాన్ = ధైర్యశాలి; శుచిః = ఉపధాశుద్ధుడయిన వ్యక్తి, శబ్దరత్నాకరము; కులీనః = మంచికులమున పుట్టినవాడు; చ = మఱియు; అనురక్తః = అనురక్తి కలవాడు; చ = మఱియు; దక్షః = సమర్థుడు; సేనాపతిః = సేనాపతి; కృతః = చేయబడెను.
భావము:-
వ్యవహారములు నిర్వహించుటలో ప్రతిభ కలవాడూ, శత్రువులతో యుద్దమునందు నిర్భభయుడై విజయము సాధించువాడూ, వ్యూహరచనాది సకల సైనిక కార్యము లందు సూక్ష్మబుద్ధి కలవాడూ, విపత్సమయములలో ధైర్యముతో కాగల కార్యము సాధించువాడూ, ఉపధ- ప్రలోభములైన ధర్మార్థ కామములచేత గుణములు పరీక్షించబడి శుద్ధుడుగా నిగ్గుతేలినవాడూ, మంచి వంశమున పుట్టినవాడూ, స్వామియందు రాజ్యమునందు భక్తి కలవాడూ ఐనవానినే సేనాపతిగా నియమించితివి కదా?
2.100.31.అనుష్టుప్.
బలవంతశ్చ కచ్చిత్తే
ముఖ్యా యుద్దవిశారదాః।
దృష్టాపదానా విక్రాంతా
త్వయా సత్కృత్యమానితాః॥
టీక:-
బలవంతః = అత్యంత బలశాలులు; చ = మఱియు; కచ్చిత్ = కదా?; తే = ఆ; ముఖ్యా = శ్రేష్టమైనవారు; యుద్ద = యుద్ధ తంత్రము లందు; విశారదాః = నేర్పరులు; దృష్టా = వ్యక్తమైన, ప్రగల్భ; పదానా = ఓడించుట; విక్రాంతా = పరాక్రమము కలవారు; త్వయా = నీచేత; సత్కృత్య = ఆదరించి; మానితాః = గౌరవించబడుచుంటిరి.
భావము:-
శ్రేష్టమైన యుద్దతంత్రజ్ఞులను, అత్యంత బలశాలులను, ఎంతోమంది శూరులను ఓడించి ప్రసిద్ధులైన వారిని ఆదరించి గౌరవించుచుంటివి కదా?
2.100.32.అనుష్టుప్.
కచ్చిద్బలస్య భక్తం చ
వేతనం చ యథోచితమ్।
సంప్రాప్తకాలం దాతవ్యమ్
దదాసి న విలమ్బసే॥
టీక:-
కచ్చిత్ = కదా; బలస్య = సేనలకు; భక్తం = అన్నవేతనము, భోజనములు; చ = మఱియు; వేతనం = ధనరూప జీతము; చ = పాదపూరణము; యథోచితమ్ = తగిన; సంప్రాప్త = వచ్చిన; కాలం = సమయమున; దాతవ్యమ్ = ఇవ్వదగిన; దదాసి = ఇచ్చుచుంటివి; న = లేదు; విలమ్బసే = ఆలస్యము చేయబడుట.
భావము:-
సైన్యాలకు వారి అవసరాలు తీరుస్తుంటే శ్రద్ధగా పనిచేస్తారు కనుక పెట్టవలసిన భోజనాదులు, తగిన జీతాలు ఇవ్వదగిన సమయం కాగానే ఆలస్యం లేకుండా అందే ఏర్పాటు చేస్తున్నావుకదా?
2.100.33.అనుష్టుప్.
కాలాతిక్రమణాచ్చైవ
భక్తవేతనయోర్భృతాః।
భర్తుః కుప్యంతి దుష్యంతి
సోఽనర్థస్సుమహాన్ స్మృతః॥
టీక:-
కాలాతిక్రమణాః = ఆలస్యములు; చైవ = ఐతే; భక్త = భోజనాదులకు; వేతనాః = వేతనములకు; భృతాః = పోషింపబడువారైన భృత్యులు; భర్తుః = ప్రభువు విషయమున; కుప్యంతి = కోపగింతురు; దుష్యంతి = చెడిపోవుదురు; సః = అది; అనర్థః = అనర్థము అని; సుమహాన్ = అత్యంత; స్మృతః = వినబడును.
భావము:-
సైనికులకు విద్యుక్తమైన ఆహారాది రూప, ధనరూప భృత్యముల విషయములలో అనవసర జాప్యములు జరుగుతుంటే, వారు కోపాలకు, చెడునడతలకు లోనగుదురని పెద్దలు చేప్తుంటారు.
2.100.34.అనుష్టుప్.
కచ్చిత్సర్వేఽనురక్తాస్త్వామ్
కులపుత్రాః ప్రధానతః।
కచ్చిత్ప్రాణాం స్తవార్థేషు
సంత్యజంతి సమాహితాః॥
టీక:-
కచ్చిత్ = కదా?; సర్వేః = అందరు; అనురక్తాః = అనురాగములు; త్వామ్ = నీ ఎడల; కులపుత్రాః = క్షత్రియోత్తములు; ప్రధానతః = పెట్టుకుంటున్న వారు; కచ్చిత్ = కదా?; ప్రాణాం = తమ ప్రాణములను; తవ = నీ; అర్థేషు = అవసరము కొఱకు; సంత్యజంతి = త్యాగముచేయుటకు; సమాహితాః = సిద్దముగా ఉన్నవారు.
భావము:-
ఉత్తమ క్షత్రియ వంశజులు అందరూ నీ ఎడల అనురాగము కలిగి ఉన్నారు కదా? నీ పనులు సాధించుట కొఱకు ప్రాణములు ఐనా ఫణంగా పెడతారు కదా?
2.100.35.అనుష్టుప్.
కచ్చిజ్జానపదో విద్వాన్
దక్షిణః ప్రతిభానవాన్।
యథోక్తవాదీ దూతస్తే
కృతో భరత! పండితః॥
టీక:-
కచ్చిత్ = కదా?; జానపదః = స్వదేశీయుడు; విద్వాన్ = మిక్కిలి జ్ఞానము కలవాడు; దక్షిణః = అత్యంత దక్షతకలవాడు; ప్రతిభానవాన్ = సమయస్పూర్తి కలవాడు; యథోక్తవాదీ = చెప్పినవిధముగా చెప్పువాడు, తగినట్లు మాచ్లాడు వాడు; దూతః = రాయబారిగా; తే = నీకు; కృతః = చేయబడెను; భరత = భరతుడా; పండితః = శాస్త్రములు చదివిన వాడు.
భావము:-
స్వదేశీయుడు అనగా కోసల దేశపువానిని, మంచి జ్ఞానసంపన్నుని, అత్యంత దక్షత కలవానిని, మంచి సమయల్పూర్తి కలవానిని, తగిన విధముగా సంభాషించుట యందు ఎలా చెప్పబడెనో అటులనే చెప్పుటయందు మరొక విధముగా పలుకు ఇతరుల పలుకులకు తర్కబద్దముగా ఖండించుటందు నేర్పు కలవానిని దూతగా నియమించితివి కదా?
2.100.36.అనుష్టుప్.
కచ్చిదష్టాదశాన్యేషు
స్వపక్షే దశ పంచ చ।
త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైః
వేత్సి తీర్థాని చారకైః॥
టీక:-
కచ్చిత్ = కదా?; అష్టాదశాః = పద్దెనిమిది; అన్యేషు = పరులలో, శత్రువులలో; స్వపక్షః = తనపక్షము నందు; దశపంచ = పదిహేను; చ = మరియు; త్రిభిస్త్రిభిః = ముగ్గురు ముగ్గురు; అవిజ్ఞాతైః = పరిచయము లేనివారు; వేత్సి = తెలుసుకొనుచున్నావు; తీర్థాని = దేశ పదాధికారులు; చారకైః = గూఢచారులచేత.
భావము:-
పర రాజ్యపు మంత్రి, పురోహితుడు, యువరాజు మున్నగు అష్టాదశ (18) పదాధికారుల గురించి, మఱియు స్వరాష్ట్రపు మంత్రి, పురోహితుడు, యువరాజు ఎదురుగనే ఉందురు కనుక వారిని తప్పించి మిగతా పదిహేనుగురు (15) పదాధికారుల గుఱించి తెలుసుకొనుటకు ఒక్కొక్కరి మీద వారిలో వారికి తెలియని ముగ్గురేసి (3) గూఢచారులను నియమించి, వారి గురించి నిరంతర సమాచారాం గ్రహించుచుంటివి కదా అని అడుగుతుండెను
*గమనిక :-
(1) తీర్థాని-మంత్రి ఇతి మోదినీ, మంత్రిప్రభృత్యష్టాదశరాష్ట్రసంపత్, శబ్దకల్పదృమము, తీర్థములవారు అనగా రాజకార్యములను నిర్వహించెడి వారు. (2) అష్టాదశ-అధికారులు : సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002, (అ.) 1. మంత్రి, 2. పురోహితుడు, 3. యువరాజు, 4. సేనాపతి, 5. ద్వారపాలుడు, 6. అంతరవేశకుడు, 7. కారాగృహాధికారి, 8. కోశాధ్యక్షుడు, 9. ఆయవ్యయ నిరీక్షకుడు, 10. ఉపదేశకుడు, 11. నగరాధ్యక్షుడు, 12. నవోద్యమ యోజకుడు, 13. ధర్మాధ్యక్షుడు, 14. సభాధ్యక్షుడు, 15. దండాధ్యక్షుడు, 16. దుర్గాధ్యక్షుడు, 17. సీమాభాగరక్షకుడు, 18. అరణ్యరక్షకుడు. [మహాభారతము -సభా. 5అ.] (3) తన రాజ్యమైనా పర రాజ్యమేనా కృతకృత్యం కావడానికి ప్రధానభూమికలు ఆయా మంత్రి, పురోహితుడు, యువరాజు మున్నగు అష్టాదశ పదాధికారులు. కనుక వారిని తీర్థులు అని అందురు. వారి నడవడికలు ఆలోచనలు ప్రభావం రాజ్యమీద రాజుమీద చాలా అధికంగా ఉంటుంది కనుక, రాజు నిరంతరం తప్పక తెలుసుకొనవలెను. ఇందు స్వరాష్ట్ర మంత్రి, పురోహితుడు, యువరాజు ఎదురుగనే ఉందురు కనుక అంత అక్కరలేదు కాని శత్రుదేశ పదాధికారులలు పద్దెనిమిది మంది మఱియు పై ముగ్గరు తప్పించి మిగతా పదిహేనుగురు తన పదాధికారుల గుఱించి తెలుసుకొనుటకు తగిన గూఢచారులను నియమించుకొని, వారి గురించి నిరంతర సమాచారము రాజు గ్రహించవలెను
2.100.37.అనుష్టుప్.
కచ్చిద్వ్యపాస్తానహితాన్
ప్రతియాతాంశ్చ సర్వదా।
దుర్బలాననవజ్ఞాయ
వర్తసే రిపుసూదన!॥
టీక:-
కచ్చిత్ = కదా?; వ్యపాస్తాన్ = ఓడింపబడిన; అహితాన్ = శత్రువులను; ప్రతియాతామ్ = కక్షదీర్చుకొనుటకువచ్చిన; చ = ఇంకనూ; సర్వదా = ఎల్లప్పుడూ; దుర్బలాన్ = బలహీనులను; అనవజ్ఞాయ = నిర్లక్ష్యము చేయక; వర్తసే = మెలగుచుంచివి; రిపుసూదన = శత్రుసంహారకుడా.
భావము:-
శత్రుసంహారకుడా భరతా! శత్రుశేషాదులు ప్రమాదకారులు కదా. నీచేతిలో ఓడిపోయినవారు, నీ ఎదుట నిలబడలేక వెనుదిరిగిన వారు కక్షతీర్చుకొన రావచ్చును. వారిని దుర్బలులు కదా అని నిర్లక్ష్యము చేయక అప్రమత్తముగా మెలగుతున్నావు కదా?
2.100.38.అనుష్టుప్.
కచ్చిన్న లోకాయతికాన్
బ్రహ్మణాంస్తాత! సేవసే।
అనర్థకుశలా హ్యేతే
బాలాః పండితమానినః॥
టీక:-
కచ్చిత్ = కదా?; న = లేదు; లోకాయతికాన్ = లోకాయత మతస్థుడైన, నాస్తికుడైన; బ్రహ్మణామ్ = బ్రాహ్మణులను; తాత = నాయనా; సేవసే = సేవించుట; అనర్థః = కీడుకలిగించుట లందు; కుశలాః = నేర్పరులు; ఏతే = వీరు; బాలాః = అజ్ఞానులు; పండితమానినః = పండితమన్యః, తాము పండితులమని భావించువారు.
భావము:-
నాయనా భరతా! నాస్తికులైన బ్రాహ్మణులను దరిచేరనీయుట లేదుకదా? ఎందుకనగా, తాము పండితులమని అహకరించుచుండు అజ్ఞానులు అగుటచే వీరు హాని కలిగించుటలో బహు నేర్పరులు
*గమనిక :-
(1) లోకాయతికులు - చార్వాకులు, స్వభావమును అనుసరించి లోకములు ప్రాప్తించుననెడి వారు, లోకాయత మతస్థులు. స్వభావమునకు ప్రభుత్వము ఆపాదింతురు. (2) లోకాయతికులు స్వభావము తప్ప వేరు భగవంతుడు లేడను నాస్తిక దుర్బుద్ధికలవారు. తమను తాము పండితులమని భావించుకొని, శుష్కవాదములు చేయుచూ హాని కలిగింతురు. కనుక, వారిని ఎల్లప్పుడూ దూరముపెట్టుటే ఉచితము.
2.100.39.అనుష్టుప్.
ధర్మశాస్త్రేషు ముఖ్యేషు
విద్యమానేషు దుర్బుధాః।
బుద్ధిమాన్వీక్షికీం ప్రాప్య
నిరర్థం ప్రవదంతి తే॥
టీక:-
ధర్మశాస్త్రేషు = ధర్మశాస్త్రములు; ముఖ్యేషు = ప్రధానమైనవాటిని; విద్యమానేషు = వర్తమానకాలములో ఉండగా; దుర్బుధాః = ఈ దుర్బుద్ధి కల వారు; బుద్ధిమ్ = బుద్దిని; అన్వీక్షికీమ్ = తర్కశాస్త్రము పరిజ్ఞానము; ప్రాప్య = పొంది; నిరర్థం = శుష్క, ప్రయోజనశూన్యమైనవి; ప్రవదంతి = చెప్పుదురు; తే = నీకు.
భావము:-
ప్రామాణికమైన ధర్మశాస్త్రములన్నీ అందుబాటులోనే ఉండగా, వాటిని కాదని శుష్కతర్కములను అవలంబించి, నిరర్థకమైనవి నీకు చెప్పుదురు
*గమనిక :-
(1) దుర్బుద్దాః- అన్విక్షికీం శుద్ధిం ప్రాప్యశుఫ్క తర్క విషయాం బుద్ధిమేం స్థాప. శుభ్రమైన అక్షపాదుఁడు మొదలయినవారు చేసిన తర్కశాస్త్రము అన్వీక్షకీ నేర్చినను, శుష్క తర్కములను తీసి ప్రయోజన శూన్యమైన విషయములు బొందువారు. (2) ధర్మశాస్త్రములు: భారతీయ సామాజిక వ్యక్తిగత జీవితములను శాసించు గ్రంథాలు. బౌద్ధాయన, ఆపస్తంబ, విశిష్ట ధర్మసూత్రములు, మను, యాజ్ఞవల్క్య, నారద, బృహస్పతి స్మృతులు, దేవన్నిబట్టు రచించిన స్మృతిచంద్రిక, క్రీ. శ. 12 వ శతాబ్దము నీలకంఠుడు రచించిన వ్యవహారమయూఖము ధర్మశాస్త్రములుగా గుర్తించబడినవి.
2.100.40.అనుష్టుప్.
వీరైరధ్యుషితాం పూర్వమ్
అస్మాకం తాత! పూర్వకైః।
సత్యనామాం దృఢ ద్వారామ్
హస్త్యశ్వరథసంకులామ్॥
టీక:-
వీరైః = వీరులులైన; అధ్యుషితామ్ = అధిష్టింపబడినది; పూర్వమ్ = ఇంతకుముందు; అస్మాకం = మన యొక్క; తాత = నాయనా; పూర్వకైః = పూర్వీకులచేత; సత్యనామామ్ = సార్థకమైన పేరుకలది; దృఢ = బలిష్టమైన; ద్వారామ్ = ద్వారమలుకలది; హస్తి = గజములు; అశ్వ = అశ్వములు; రథ = రథములు; సంకులామ్ = సమ్మర్థము కలది, కిక్కిరిసినది.
భావము:-
నాయనా భరతా! పేరుకు తగినది ఎంతటి యోధులకు శక్యముకానిదైన అయోధ్య. ఇది పూర్వమునుండి వీరులైన మన పూర్వీకులు పరిపాలించినది. దృఢమైన కోట ద్వారములు కలది, గజ తురగ రథాది చతురంగబలాలుతో కిక్కిరిసి ఉన్నది.
*గమనిక :-
;అయోధ్యానగరము వర్ణనలో యోధులకునూ శక్యముకానిది, దృఢమైన ద్వారములు కలది అనుటచే, చుట్టూ బలమైన కోట కలదు అని తెలియుచున్నది
2.100.41.అనుష్టుప్.
బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః
స్వకర్మనిరతైస్సదా।
జితేంద్రియైర్మహోత్సాహైః
వృతామార్యైస్సహస్రశః॥
టీక:-
బ్రాహ్మణైః = బ్రాహ్మణులు; క్షత్రియైః = క్షత్రియులు; వైశ్యైః = వైశ్యులు; స్వ = తమ; కర్మ = ధర్మమునందు; నిరతైః = మిక్కిలిఆసక్తికలవారు; సదా = ఎల్లప్పుడు; జితేంద్రియైః = ఇంద్రియ లోలత్వము లేనివారు; మహోత్సాహైః = గొప్పఉత్సాహభరితులు; వృతామ్ = నిండియున్నది; ఆర్యైః = ఆర్యులు; సహస్రశః = వేలకొలది.
భావము:-
అయోధ్యలో ఎల్లప్పుడు స్వధర్మము అనుసరించువారు, చపలత్వములు లేనివారు, ఉత్సాహభరితులు, గౌరవనీయులు ఐన వేలకోలది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కలరు.
2.100.42.అనుష్టుప్.
ప్రాసాదైర్వివిధాకారైః
వృతాం వైద్యజనాకులామ్।
కచ్చిత్సముదితాం స్ఫీతామ్
అయోధ్యాం పరిరక్షసి॥
టీక:-
ప్రాసాదైః = సౌధములు; వివిధ = రకరకముల; ఆకారైః = ఆకారములు కలవి; వృతామ్ = నిండినది; వైద్యజనాః = పండితులుతో; ఆకులామ్ = కిక్కిరిసినది; కచ్చిత్ = కదా?; సముదితామ్ = సంతుష్టులతో కూడినదీ; స్ఫీతామ్ = సమృద్దికలదీ ఐన; అయోధ్యామ్ = అయోధ్యను; పరిరక్షసి = కాపాడుతుంటివి.
భావము:-
రకరకములైన రాజభవనములు, ఎందరో పండితులు, సంతుష్టులైన ప్రజలు కలది, సర్వసమృద్దమైనది ఐన అయోధ్యానగరమును చక్కగా రక్షించుచుంటివి కదా?
2.100.43.అనుష్టుప్.
కచ్చిచ్చిత్యశతైర్జుష్టః
సునివిష్టజనాకులః।
దేవస్థానైః ప్రపాభిశ్చ
తటాకైశ్చోపశోభితః॥
టీక:-
కచ్చిత్ = సంభావనమ్, సర్వశబ్దసంబేధిని, ప్రసిద్ద; చైత్యః = యజ్ఞశాలలు; శతైః = వందలకొలది; జుష్టః = కలది; సు = చక్కగా; నివిష్ట = నివసించెడి; జనాః = ప్రజలచే; ఆకులః = కిక్కిరిసి ఉన్నది; దేవస్థానైః = గుళ్ళు, దేవాలయమలు; ప్రపాభిః = పానీయశాలలూ; చ = మఱియు; తటాకైః = చెరువులు; చ = మఱియు; ఉపశోభితః = ప్రకాశించునది.
భావము:-
ఆ అయోధ్య వందలకొలది ప్రసిద్ధ యజ్ఞశాలలు, చక్కటి నివసించెడి ప్రజలు, దేవాలయములు, పానీయశాలలు, చెరువులతో ప్రకాశించుచుండెను
2.100.44.అనుష్టుప్.
ప్రహృష్టనరనారీకః
సమాజోత్సవశోభితః।
సుకృష్టసీమా పశుమాన్
హింసాభిః పరివర్జితః॥
టీక:-
ప్రహృష్ట = మిక్కిలి తృప్తిచెందిన; నరనారీకః = స్త్రీపురుషులు కలది; సమాజోత్సవ = సామాజిక ఉత్సవములతో; శోభితః = శోభిల్లుచున్నది; సు = మంచిగా; కృష్ట = దున్నబడిన; సీమా = పొలములు కలది; పశుమాన్ = శ్రేష్ఠమైన పశుసంపద కలది; హింసాభిః = హింసలచే; పరివర్జితః = విడువబడినది.
భావము:-
మన కోసలరాజ్యంలోని స్త్రీపురుషులు పూర్తి తృప్తిగా జీవిస్తుంటారు. ఇక్కడ సామాజిక ఉత్సవాలు శోభిల్లుతుండును. పొలాలన్నీ చక్కగా దున్నబడితుండును. పశువులన్నీ కూడ శ్రేష్ఠమైనవి. హింసాకృత్యములు ఏమియును లేవు.
2.100.45.అనుష్టుప్.
అదేవమాతృకో రమ్యః
శ్వాపదైః పరివర్జితః।
పరిత్యక్తో భయైస్సర్వైః
ఖనిభిశ్చోపశోభితః॥
టీక:-
అదేవమాతృకః = వర్షాధారముకాని వ్యవసాయము సాగు దేశము, నదీమాతృకము; రమ్యః = మనోహరమైనది; శ్వాపదైః = క్రూరజంతువులచే; పరివర్జితః = విడువబడినది; పరిత్యక్తః = పూర్తిగా విడువబడిన; భయైః = భయములు కలది; సర్వైః = సమస్తమైన; ఖనిభి = గనులచే; చ = మఱియు; ఉపశోభితః = ప్రకాశింపజేయబడినది.
భావము:-
మన కోసలరాజ్యము సమీపముననే సరయు జీవనది ఉండుటచే వ్యవయాపనులకు దైవాధీనమైన వర్షముపై ఆధారపడనక్కరలేని నదీమాతృకము. ఇది మనోహరమైన దేశము. ఎట్టి క్రూరమృగాలూ లేవు. ఎట్టి భయాందోళనలు లేవు. గనులు సమృద్ధిగా ఉన్నవి
*గమనిక :-
(1) దేవమాతృకము- వర్షము దైవాధీనమైనది కనుక. వాననీటితో సాగెడి వ్యవసాయము కల దేశము దేవమాతృకము, వర్షాధార వ్యవసాయము సాగు దేశము. (2) నదీమాతృకము- నదిలోని నీటితో సాగెడి వ్యవసాయము కలదేశము.
2.100.46.అనుష్టుప్.
వివర్జితో నరైః పాపైః
మమ పూర్వైస్సురక్షితః।
కచ్చిజ్జనపదస్స్ఫీతః
సుఖం వసతి? రాఘవ!॥
టీక:-
వివర్జిత = విడువబడిన; నరైః = మానవులు; పాపైః = పాపాత్ములైన వారిచే; మమ = నా; పూర్వైః = పూర్వీకులచే; సురక్షితః = బాగుగా రక్షింప బడినది; కచ్చిత్ = కదా?; జనపదః = దేశము; స్ఫీతః = సమృద్దిగా; సుఖమ్ = సౌఖ్యముగా; వసతి = ఉన్నది; రాఘవ = రఘువంశమువాడ.
భావము:-
రఘువంశోద్భవుడవైన భరతా? మన పూర్వీకులు పూర్తి సురక్షితము అగునట్లు పాలించినది, పాపాత్ములు లేనిది, సకల సంపదలు సమృద్ది కలది ఐన ఆ కోసల సుఖనివాసమై ఉన్నది కదా
2.100.47.అనుష్టుప్.
కచ్చిత్తే దయితాస్సర్వే
కృషిగోరక్షజీవినః।
వార్తాయాం సంశ్రిత స్తాత!
లోకో హి సుఖమేధతే॥
టీక:-
కచ్చిత్ = కదా; దయితాః = ఇష్టమైనవానివి; సర్వే = సమస్తమైన; కృషి = వ్యవసాయము; గోరక్షః = పశుపాలకులనలపై; జీవినః = జీవించువారికి; వార్తాయామ్ = వార్త అనగా కృషిగోరక్షణములు యందు; సంశ్రితః = ఆశ్రయించినవారై; తాత = నాయనా; లోకః = ప్రజలు; హి = నిశ్చయముగా; సుఖమ్ = సుఖముగా; ఏధతే = వృద్దిపొందుచున్నారు.
భావము:-
వ్యవసాయదారులు, గోపాలకులు అందరకూ నీవు ఇష్టుడవే కదా? వ్యవసాయము, గోపాలనలు చేపట్టి ప్రజలందరూ సుఖముగా అభివృద్ధి పొందుతున్నారు కదా?
2.100.48.అనుష్టుప్.
తేషాం గుప్తిపరీహారైః
కచ్చిత్తే భరణం కృతమ్।
రక్ష్యా హి రాజ్ఞా ధర్మేణ
సర్వే విషయవాసినః॥
టీక:-
తేషాం = వారియొక్క; గుప్తి = కాపాడుట; పరీహారైః = ఆపదలను నివారించుటచేతను; కచ్చిత్ = కదా; తే = నీచే; భరణమ్ = పోషణము; కృతమ్ = చేయబడినది; రక్ష్యాః = రక్షింపదగినవారు; హి = నిశ్చయంగా; రాజ్ఞా = రాజుచేత; ధర్మేణ = ధర్మముచేత; సర్వే = అందరు; విషయ = దేశమునందు; వాసినః = నివసించువారిని.
భావము:-
నీవు వారందరి రక్షణ, పోషణ, ఆపదలను తొలగించుట చేయుచుంటివి కదా? మరి, రాజధర్మము ప్రకారము దేశములోని ప్రజలను అందరినీ పాలింపవలసిన బాధ్యత రాజుదే కదా?
2.100.49.అనుష్టుప్.
కచ్చిత్ స్త్రియస్సాంత్వయసి
కచ్చిత్తాశ్చ సురక్షితాః।
కచ్చిన్న శ్రద్ధాధాస్యాసామ్
కచ్చిద్గుహ్యం న భాషసే॥
టీక:-
కచ్చిత్ = కదా; స్త్రియః = స్త్రీలను; సాంత్వయసి = అనునయించుచుంటివి; కచ్చిత్ = కదా; తా = వారు; చ = కదా; సు = బాగుగా; రక్షితాః = రక్షింపబడుచున్నారు; కచ్చిత్ = కదా; తే = నీచేత; న = లేదు; శ్రద్ధాధాసి = నమ్ముట; ఆసామ్ = ఈ స్త్రీల మాటలను; కచ్చిత్ = కదా; గుహ్యం = రహస్యం; న = లేదు; భాషసే = చెప్పుట.
భావము:-
స్త్రీలతో అనునయంగా మాట్లాడుచుంటివి కదా? వారికి బాగా రక్షణ కల్పించుచుంటివి కదా? వారి మాటలను నమ్ముటలేదు కదా? రహస్యములేవీ వారికి చెప్పుట లేదు కదా?
2.100.50.అనుష్టుప్.
కచ్చిన్నాగవనం గుప్తమ్
కచ్చిత్తే సంతి ధేనుకాః।
కచ్చిన్న గణికాశ్వానామ్
కుంజరాణాం చ తృప్యసి॥
టీక:-
కచ్చిత్ = కదా; నాగ = గజముల; వనమ్ = సమూహము, ఉండుచోటు; గుప్తమ్ = రక్షింపబడుచున్నవి; కచ్చిత్ = కదా; తే = నీకు; సంతి = ఉన్నవి; ధేనుకాః = ఆడ ఏనుగులు; కచ్చిత్ = కదా; న = లేదు; గణికాః = ఆడఏనుగులకు; అశ్వానామ్ = గుఱ్ఱములకు; కుంజరాణాం = ఏనుగులకు; చ = కూడా; తృప్యసి = తృప్తిపడుతుంటివి.
భావము:-
నీ ఏనుగుల గుంపును చక్కగా కాపాడుకొనుచుంటివి కదా? ఏనుగుల శాల చక్కటి రక్షణలో ఉన్నది కదా? నీవద్ద ఆడ ఏనుగులు ఉన్నాయి కదా? నీవద్ద ఉన్న ఆడ ఏనుగుల, గుఱ్ఱముల, ఏవుగుల విషయంలో ఇంక చాల్లే అనుకోవటంలేదుకదా?
2.100.51.అనుష్టుప్.
కచ్చిద్దర్శయసే నిత్యమ్
మనుష్యాణాం విభూషితమ్।
ఉత్థాయోత్థాయ పూర్వాహ్ణే
రాజపుత్ర! మహాపథే॥
టీక:-
కచ్చిత్ = కదా; దర్శయసే = దర్శనము ఇస్తున్నావు; నిత్యమ్ = ప్రతిదినము; మనుష్యాణాం = మానవులకు; విభూషితమ్ = బాగా అలంకరింపబడి; ఉత్థాయోత్థాయ = లేస్తూనే; పూర్వాహ్ణే = ఉదయవేళలో; రాజపుత్ర = రాకుమార; మహాపథే = రాజమార్గమున.
భావము:-
రాకుమారా భరతా! నీవు ప్రతిదినము ప్రొద్దుటే లేచి, చక్కగా అలంకరించుకొని, ప్రధాన రాజమార్గమునకు వెళ్ళి ప్రజలకు దర్శనము ఇస్తున్నావు కదా?
2.100.52.అనుష్టుప్.
కచ్చిన్న సర్వే కర్మాంతా
ప్రత్యక్షాస్తేఽవిశంకయా।
సర్వే వా పునరుత్సృష్టా
మధ్యమేవాత్ర కారణమ్॥
టీక:-
కచ్చిత్ = కదా; న = కాదు; సర్వే = అందరు; కర్మాంతా = కార్మికులు; ప్రత్యక్షః = ఎదుటకు; అస్తి = వచ్చుటకు; తే = నీకు; అవిశంకయా = సందేహము లేకుండా; సర్వే = అందరు; వా = లేదా; పునః = మరీ; ఉత్సృష్టా = దూరముగా ఉంచబడినవారు; మధ్యమేవ = మధ్యేమార్గము; అత్ర = ఈ విషయము నందు; కారణమ్ = శ్రేయస్సుకు కారణము.
భావము:-
నీ సేవకులు, పనిచేయు కార్మికులు అందరూ నీ ఎదుటకు వచ్చుటకు సందేహించుట లేదు కదా? లేక భయాతిశయముచేత దూరందూరముగా ఉండిపోతున్నారా? ఈ విషయంలో మధ్యేమార్గము అవలంభించుట మంచిది.
2.100.53.అనుష్టుప్.
కచ్చిత్సర్వాణి దుర్గాణి
ధనధాన్యాయుధోదకైః।
యన్త్రేశ్చ పరిపూర్ణాని
తథా శిల్పిధనుర్ధరైః॥
టీక:-
కచ్చిత్ = కదా; సర్వాణి = సమస్తమైన; దుర్గాణి = కోటలలోను; ధనః = ధనము; ధాన్యః = ధాన్యము మొదలగునవి; ఆయుధః = ఆయుధములు; ఉదకైః = జలపూర్ణమైన జలవనరులు; యన్త్రైః = యంత్రములు; చ = మఱియు; పరిపూర్ణాని = సుసంమృద్దిగా; తథా = అలాగే; శిల్పిః = వడ్రంగిలోనగువారు; ధనుర్ధరైః = విలుకాండ్రు.
భావము:-
కోటలు అన్నింటిలోనూ యుద్దము, ప్రకృతి వైపరీత్యాది అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనుటకు అవసరమైనవి కోశాగారమున, ధాన్యాగారమున, జలవనరులందు, ఆయుధగారమున, మానవ వనరులు, బలవనరులు సర్వం ఎల్లప్పుడు సిద్దంగా ఉంటున్నవి కదా.
*గమనిక :-
(1) రాజ్యమునందు అత్యవసర సమయాలకోసం నిల్వ ఉంచుకొన వలసినవి (అ) కోశాగారము నందు జీతభత్యములు మున్నగు వానికి సరిపడు ధనము. (ఆ) ధాన్యాగారము నందు కోటదాటి వెళ్ళక్కరలేకుండా పరివారము, సైన్యము, ప్రజలు అందరికీ అవసరమైన ధాన్యము మున్నగు ఆహారపదార్థముల నిల్వలు. (ఇ) జలవనరులు అత్యవసర పరిస్థితులకును సరిపడు జలపూర్ణమైనవి అయిన సరోవరములు నూతులు మున్నగునవి. (ఈ) ఆయుధగారము నందు శత్రువులను ఎదుర్కొనుటకు వలసిన ఆయుధముల యుద్ధపరికరముల నిల్వలు. యంత్రాగారమున కోటగోడ పై భాగమున శత్రువులపై దాడి చేయుకు వలసిన సాధనములు పరికరములు, వాటి విడిభాగములు, ఆయుధములు తయారు చేయు యంత్రములు, తిరుగలి, రుబ్బురోలు, జలయంత్రము, నేతమగ్గములు మున్నగు కీలు పనిముట్లు. (ఉ) మానవ వనరులు వడ్రంగిలోనగువారు మఱియు విలుకాండ్రు మున్నగు వృత్తినిపుణులు. వడ్లంగిలోనగువాఁరు- వీరు ఐదుగురు, వడ్లంగి/ వడ్రంగి- కొయ్యపని వారు, సాలె- నేతపనివారు, మంగలి- క్షురకులు, చాకలి- బట్టలు శుభ్రపరచువారు, ముచ్చి- రంగులు వేయువారు. శబ్దరత్నాకరము. (ఊ) బలసంగ్రహణములు విలుకాండ్రు, గజ, తురగ, రథ, పదాది సైనిక బలములు.
2.100.54.అనుష్టుప్.
ఆయస్తే విపులః కచ్చిత్
కచ్చిదల్పతరో వ్యయః।
అపాత్రేషు న తే కచ్చిత్
కోశో గచ్ఛతి రాఘవ!॥
టీక:-
ఆయః = ఆదాయము; తే = నీ; విపులః = అధికముగా ఉన్నది; కచ్చిత్ = కదా; కచ్చిత్ = కదా; అల్పతరః = మిక్కిలి తక్కువగ ఉన్నది; వ్యయః = వ్యయము; అపాత్రేషు = అనర్హులకు; న = లేదు; తే = నీ; కచ్చిత్ = కదా; కోశః = కోశాగారమునుండి; గచ్ఛతి = పోవుట; రాఘవ = రఘువంశజ్ఞుడా.
భావము:-
ఓ రఘువంశపు భరతుడా! నీ ఆదాయము అధికముగాను, వ్యయము మిక్కిలి తక్కువగాను ఉన్నవి కదా? నీ కోశాగారమునుండి అనర్హులకు ఇచ్చుట లేదు కదా? అనవసర వ్యయములు చేయుట లేదుకదా?
*గమనిక :-
;అర్థశాస్త్ర సూత్రముల ప్రకారము ఆదాయముల కంటె వ్యయములు బాగా తక్కువ ఉండవలెను. అనవసర వ్యయములు జరుగ రాదు. మిగులు ధనములు భవిష్యత్కాల అవసరములకు, అత్యవసర సమయములలోని అవసరములకు, సంపదవృద్ధికిని దాచుకొనవలెను
2.100.55.అనుష్టుప్.
దేవతార్థే చ పిత్రర్థే
బ్రాహ్మణాభ్యాగతేషు చ।
యోధేషు మిత్రవర్గేషు
కచ్చిద్గచ్ఛతి తే వ్యయః॥
టీక:-
దేవతాః = దేవకార్యముల; అర్థే = కొఱకు; చ = మఱియు; పిత్రః = పిత్రు కార్యముల; అర్థే = కొఱకు; బ్రాహ్మణాః = బ్రాహ్మణులైన; అభ్యాగతేషు = అతిథి; చ = మఱియు; యోధేషు = యుద్ధవీరులకు; మిత్రవర్గేషు = మిత్రులు అందరికీ; కచ్చిత్ = కదా; గచ్ఛతి = వెళ్ళుచున్నది; తే = నీ; వ్యయః = వ్యయములు.
భావము:-
నీయొక్క వ్యయములు దేవకార్యముల కొఱకు, పిత్రుకార్యముల కొఱకు, బ్రాహ్మణ అతిథులకు, యుద్ధవీరులకు, మిత్రులు అందరికీ అందించుచుంటివి కదా?
2.100.56.అనుష్టుప్.
కచ్చిదార్యో విశుద్ధాత్మా
క్షారితశ్చాపకర్మణా।
అపృష్టశ్శాస్త్రకుశలైః
న లోభాద్వధ్యతే శుచిః॥
టీక:-
కచ్చిత్ = కదా; ఆర్యః = గౌరవనీయుడు; విశుద్ధాత్మా = పరిశుద్ధమైన ఆత్మ కలవాడు; క్షారితః = ఆరోపింపబడినవాడై; చ = పాదపూరణము; అపకర్మణా = చెడ్డపనిచేత, నేరముచేత; అపృష్ట = ప్రశ్నింపకుండనే; శాస్త్రకుశలైః = న్యాయ శాస్తమునందు నేర్పరులచేత; న = లేదు; లోభాత్ = దురాశవలన; వధ్యతే = చంపుట; శుచిః = నేరము చేయనివాడు.
భావము:-
గౌరవనీయుడు, పరిశుద్ధమైన మనసు కలవాడు దురాశవలన ఆరోపింపబడిన చేయని నేరమునకు, న్యాయకోవిదులచే పరీక్షింపబడకుండా మరణశిక్ష పొందుట లేదుకదా?
2.100.57.అనుష్టుప్.
గృహీతశ్చైవ పృష్టశ్చ
కాలే దృష్టస్సకారణః।
కచ్చిన్న ముచ్యతే చోరో
ధనలోభాన్నరర్షభ॥
టీక:-
గృహీతః = ఋజువైనవాడు; చైవ = మాత్రము; పృష్టః = ప్రశ్నింపబడిన వాడు; చ = మఱియు; కాలే = ఆ సమయమునందు; దృష్టః = చూడబడిన వాడు; సకారణః = కారణము ఉన్నవాడు; కచ్చిత్ = కదా; న = లేదు; ముచ్యతే = విడువబడుట; చోరః = చోరుడు; ధనలోభాన్ = ధనాశవలన; నరర్షభ = పురుషశ్రేష్ఠుడా.
భావము:-
ఓ పురుషశ్రేష్ఠుడా! భరతా! దొంగతనము వంటి నేరము చేసినట్లు సాక్ష్యము, చేయుటకు కారణము ఉండి, న్యాయాధికారుల పరీక్షలో ఋజువు కాబడిన నేరస్తుడు ధనాశవలన విడువబడుట లేదుకదా!
2.100.58.అనుష్టుప్.
వ్యసనే కచ్చిదాఢ్యస్య
దుర్గతస్య చ రాఘవ।
అర్థం విరాగాః పశ్యంతి
తవామాత్యా బహుశ్రుతాః॥
టీక:-
వ్యసనే = కష్టమునందున్న; కచ్చిత్ = కదా; ఆఢ్యస్య = కధనికునియొక్క; దుర్గతస్య = దరిద్రునియొక్క; చ = మఱియు; రాఘవ = రఘువంశజుడా; అర్థమ్ = విషయములో; విరాగాః = పక్షపాతబుద్ధి లేకుండా; పశ్యంతి = చూచుచుండిరి; తవ = నీ; ఆమాత్యా = మంత్రుల; బహుశ్రుతాః = మిక్కిలి విద్యగలవారు.
భావము:-
సకల శాస్త్రకోవిదులైన నీ ఆమాత్యులు ఆపద వచ్చిన వాని విషయములో ధనికుడైన, పేదవాడైన పక్షపాతబుద్ధి లేకుండా ఆ ఆపదకు పరిష్కారము చేయుచుండిరి కదా?
2.100.59.అనుష్టుప్.
యాని మిథ్యాభిశస్తానామ్
పతంత్యశ్రూణి రాఘవ।
తాని పుత్రాన్పశూన్ఘ్నంతి
ప్రీత్యర్థమనుశాసతః॥
టీక:-
యాని = ఏ; మిథ్యా = లేని; అభిశస్తానామ్ = నింద మోపబడినవాని; పతంతి = పడునో; అశ్రూణి = కన్నీళ్ళు; రాఘవ = రఘుకులజుడా; తాని = వాని; పుత్రాన్ = పుత్రులు; పశూన్ = పశువులు; ఘ్నంతి = చంపును; ప్రీత్యర్థమ్ = ఇష్టానుసారము; అనుశాసతః = తీర్పుచెప్పిన వానియొక్క.
భావము:-
రఘువంశపు భరతుడా! అపనింద మోపబడిన వాని విషయములో తన ఇష్టానుసారము అనర్హుమైన తీర్పుచెప్పినచో, ఆ అపనింద మోపబడినవాని కన్నీళ్ళు ఆ తీర్పు చెప్పిన వాని కొడుకులు పశువులు సంపదలు నశింపజేయును.
2.100.60.అనుష్టుప్.
కచ్చిద్వృద్ధాంశ్చ బాలాంశ్చ
వైద్యాముఖ్యాంశ్చ రాఘవ।
దానేన మనసా వాచా
త్రిభిరేతైర్బుభూషసే॥
టీక:-
కచ్చిత్ = కదా; వృద్ధామ్ = వృద్ధులను; చ = మఱియు; బాలామ్ = బాలురను; చ = మఱియు; వైద్యాః = పండితులైన; ముఖ్యామ్ = శ్రేష్ఠులను; చ = పాదపూరణము; రాఘవ = రఘువంశపువాడా; దానేన = దానముచేత; మనసా = మనసుచేత; వాచా = మాటలచేత; త్రిభిః = మూడింటిచేత; ఏతైః = ఈ; బుభూషసే = వశపరచుకొనుచుంటివి.
భావము:-
ఓ భరతుడా! వృద్దులను, బాలురను, పండితోత్తములను దానములతోను, మనస్పూర్తిగా ఇష్ట పడుటతోను, మంచిమాటలతోనూ అను మూడు మార్గములతో వశపరచుకొనుచుంటివి కదా?
2.100.61.అనుష్టుప్.
కచ్చిద్గురూంశ్చ వృద్ధాంశ్చ
తాపసాన్ దేవతాతిథీన్।
చైత్యాంశ్చ సర్వాన్సిధ్దార్థాన్
బ్రాహ్మణాంశ్చ నమస్యసి॥
టీక:-
కచ్చిత్ = కదా; గురూమ్ = గురువులను; చ = మఱియు; వృద్ధామ్ = పెద్దలను; చ = మఱియు; తాపసాన్ = మునులను; దేవతాః = దేవతలను; అతిథీన్ = అతిథులను; చైత్యామ్ = దేవాలయములు; చ = పాదపూరణము; సర్వాని = అన్నింటిని; సిధ్దార్థాన్ = కృతార్థులైన; బ్రాహ్మణామ్ = బ్రాహ్మణులను; చ = కూడ; నమస్యసి = నమస్కరించుచుంటివి.
భావము:-
గురువులను, పెద్దలను, వృద్దులను, మునులను, దేవతలను, అతిథులను మఱియు దేవాలయము లన్నింటినీ ఇంకా కృతార్థులైన బ్రాహ్మణులను నమస్కరించుచుంటివి కదా?
2.100.62.అనుష్టుప్.
కచ్చిదర్థేన వా ధర్మమ్
అర్థం ధర్మేణ వా పునః।
ఉభౌ వా ప్రీతిలోభేన
కామేన చ న బాధసే॥
టీక:-
కచ్చిత్ = కదా; అర్థేన = అర్థముచేత; వా = కాని; ధర్మమ్ = ధర్మము; అర్థమ్ = అర్థము; ధర్మేణ = ధర్మముచేత; వా = కాని; పునః = లేదా; ఉభౌ = రెంటిని; వా = కాని; ప్రీతి = సుఖమునందు; లోభేన = అత్యాశచే; కామేన = కామముచే; చ = మఱియు; న = లేదు; బాధసే = బాధించుట.
భావము:-
ధర్మాచరణకు అగు (ఉదయము) సమయములలో ధనాది ప్రయోజనాలను అర్థము సంపాదించుట కొఱకు ధర్మమునకు లోపము చేయుట కాని, ధనార్జన చేయు (తదనంతర) సమయములలో ధర్మాచరణలో పడి అర్థము సంపాదించుటలో లోపము చేయుట కాని, సుఖించవలసిన (రాత్రి) సమయములలో ధర్మాచరణ అర్థసంపాదనలలో పడి సుఖాభిలాష కామములను తీర్చుకొనుటలో లోపము చేయుటలేదు కదా? ధర్మార్థకామములను సమతూకములో నడుపుచుంటివి కదా?
2.100.63.అనుష్టుప్.
కచ్చిదర్థం చ ధర్మం చ
కామం చ జయతాంవర!।
విభజ్య కాలే కాలజ్ఞ!
సర్వాన్వరద! సేవసే॥
టీక:-
కచ్చి = కదా; అర్థమ్ = అర్థము; చ = మఱియు; ధర్మమ్ = ధర్మము; చ = మఱియు; కామమ్ = కామము; చ = పాదపూరణము; జయతాంవర = జయశీలశ్రేష్ఠుడా; విభజ్య = విభజించుకొనుము; కాలే = కాలమును; కాలజ్ఞ = తగిన కాలముల గుఱించి ఎరిగినవాడ; సర్వాన్ = అన్నింటినీ; వరద = వరములను ఇచ్చువాడా; సేవసే = సేవించుచుంటివి.
భావము:-
ఓ ఉత్తమజయశీలుడా! కాలజ్ఞుడా! కోరిన దానములు ఇచ్చువాడా! భరతుడా! ధర్మార్థకామములను అన్నింటినీ తగిన కాలములను తగువిధముగా విభజించుకొని సేవించుచుంటివి కదా?
*గమనిక :-
;ధర్మార్థకామములకు సమయ విభజన- (అ)ధర్మాచరణకు ఉదయ కాలము అనుకూలము. (ఆ) తదనంతర సమయములలో అర్థ సంపాదనకు అనుకూలము. (ఇ) తదనంతరము సుఖించటకైన రాత్రి సమయము కామములు తీర్చుకొనుటకు అనుకూలము.
2.100.64.అనుష్టుప్.
కచ్చిత్తే బ్రాహ్మణాశ్శర్మ
సర్వశాస్త్రార్థకోవిదాః।
ఆశంసంతే మహాప్రాజ్ఞ!
పౌరజానపదైస్సహ॥
టీక:-
కచ్చిత్ = కదా; తే = నీ; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; శర్మ = సుఖశాంతులు; సర్వ = సమస్తమైన; శాస్త్రాః = శాస్తములందలి; అర్థ = విషయము; కోవిదాః = తెలుసకున్నజ్ఞాని; ఆశంసంతే = కోరుతున్నారు; మహా = గొప్ప; ప్రాజ్ఞ = బుద్దిమంతుడా; పౌరః = పురవాసుల; జానపదైః = జనపదానివాసులు; సహ = సహితముగా.
భావము:-
సకల శాస్త్రములను క్షుణ్ణంగా గ్రహించిన జ్ఞానులైన బ్రాహ్మణులు, నీతోపాటు నీదేశ పౌరుల, గ్రామీణుల సుఖశాంతులు కోరుతున్నారు కదా?
2.100.65.అనుష్టుప్.
నాస్తిక్యమనృతం క్రోధమ్
ప్రమాదం దీర్ఘసూత్రతామ్।
అదర్శనం జ్ఞానవతామ్
ఆలస్యం పంచవృత్తితామ్॥
టీక:-
నాస్తిక్యమ్ = నాస్తికత్వము, దైవములేడనుట; అనృతమ్ = అసత్యము; క్రోధమ్ = అధికమైన కోపము; ప్రమాదం = ఏమఱుపాటు; దీర్ఘసూత్రతామ్ = ప్రతిపనికి సాగతీత స్వభావము, మితిమీరిన సమయం తీసుకొనుట; అదర్శనం = చూడకపోవుట, కలియకపోవుట; జ్ఞానవతామ్ = జ్ఞానవంతులను; ఆలస్యం = సోమరిపోతుతనము; పంచవృత్తితామ్ = పంచవృత్తులు, ఐదు నడవడికలు, శబ్దరత్నాకరము.
భావము:-
1. నాస్తికత్వము, 2. అసత్యము, 3. క్రోధము, 4. ఏమఱుపాటప, 5. సాగతీతస్వభావము, 5. జ్ఞానవంతులవద్దకు పోకపోవుట, 6. సోమరితనము, పనిచేపట్టుటకు జాగుచేయుట, 8. పంచమనోవృత్తులు అగు ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్రమత్తు, స్మృతిరూపవాదము.
*గమనిక :-
;పంచవృత్తులు- పంచమనోవృత్తులు, సూ. ప్రమాణవిపర్య్యవికల్పనిద్రాస్మృతతయః, వాచస్పతము, ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్రమత్తు, స్మృతిరూపవాదము అను పంచమనోవృత్తులు, సంకేతపదకోశము.
2.100.66.అనుష్టుప్.
ఏకచింతనమర్థానామ్
అనర్థజ్ఞైశ్చ మంత్రణమ్।
నిశ్చితానామనారంభమ్
మంత్రస్యాపరిరక్షణమ్॥
టీక:-
ఏకచింతనమ్ = ఒంటరిగా ఆలోచన చేయడం; అర్థానామ్ = కార్యముల యొక్క; అనర్థజ్ఞైః = వివరము తెలియని వారు; చ = కూడా; మంత్రణమ్ = రాజకీయ తంత్ర ఆలోచన; నిశ్చితానామ్ = నిశ్చయింపబడినవి; అనారంభమ్ = మొదలుపెట్టక పోవుట; మంత్రస్యాః = ఆలోచన యొక్క; అపరిరక్షణమ్ = రహస్యమును కాపాడకపోవుట.
భావము:-
9. మంత్రులను సంబంధిచిన రాజోద్యోగులతో చర్చించకుండా రాజు తాను ఒక్కడే నిర్ణయము తీసుకొను ఆలోచనకూడ చేయుట. అటులనే 9. కార్య ప్రయోజనము తెలియని వారితో చర్చించుట. 1. నిర్ణయములు తీసుకొనట్టి కార్యములను మొదలుపెట్టకపోవుట. 12. మంత్రాగ విషయముల రహస్యము కాపాడకపోవుట.
2.100.67.అనుష్టుప్.
మంగళాస్యప్రయోగం చ
ప్రత్యుత్థానం చ సర్వతః।
కచ్చిత్త్వం వర్జయస్యేతాన్
రాజదోషాంశ్చతుర్దశ॥
టీక:-
మంగళస్య = మంగళకరమైనవాటిని; అప్రయోగం = చేయకపోవుట; చ = కూడా; ప్రత్యుత్థానమ్ = ఎదుర్కొనుట; చ = పాదపూరణము; సర్వతః = అంతట; కచ్చిత్ = కదా; త్వమ్ = నీవు; వర్జయస్య = విడుచుచుంటివి; ఏతాన్ = ఈ; రాజ = రాజులయొక్క; దోషామ్ = దోషములను; చ = పాదపూరణము; చతుర్దశ = పద్నాలుగు (14).
భావము:-
13. మంగళకరమైనవి చేయకపోవుట. 14. ప్రతీదానికి స్పందించుట. ఈ పద్నాలుగు (14) రాజదోషములను నీవు విసర్జించుతుంటివి కదా?
2.100.68.అనుష్టుప్.
దశపంచచతుర్వర్గాన్
సప్తవర్గం చ తత్త్వతః।
అష్టవర్గం త్రివర్గం చ
విద్యాస్తిస్రశ్చ రాఘవ॥
టీక:-
దశః = పదింటి (10); పంచః = ఐదింటి (5); చతుః = నాలుగింటి (4); వర్గాన్ = వర్గములను; సప్త = ఏడింటి (7); వర్గమ్ = వర్గమును; చ = పాదపూరణము; తత్త్వతః = యదార్థముగా; అష్ట = ఎనిమిదింటి (8); వర్గమ్ = వర్గము; త్రి = మూడింటి (3); వర్గమ్ = వర్గము; చ = మఱియు; విద్యాః = విద్యలు; తిస్రః = మూడింటిని; చ = మఱియు; రాఘవ = రఘువంశపు భరతుడా.
భావము:-
ఓ రఘుకుల భరతుడా! దశఃవర్గము(10) దుర్గుణములు, పంచఃవర్గము(5) రాజ్య విభాగమలు, చతుర్వర్గము(4) ఉపాయములు, సప్తవర్గము(7) రాజ్యతంత్రములు, అష్టవర్గము(8) రాజ్యం అంగాలు, త్రివర్గము(3) శత్రుగతులు, త్రివిద్యలను మఱియు.
*గమనిక :-
(1) దశ వర్గం- ఇవి రెండు: 1. వేట, జూదం, అదే పనిగా ఇతరులను గురించి చెడుగా మాట్లాడటం, పొగరుబోతుతనం, నృత్త, గీత, వాద్యాల వ్యసనానికి లోనవడం, పనిలేకుండా తిరుగుతూ ఉండటం మొదలైనవి ఒక వర్గం. 2. లుబ్ధత్వం, క్రౌర్యం, సోమరితనం, అలవాటుగా అబద్ధమాడటం, ఏమరిపాటు వల్ల చిక్కుల్లో ఇరుక్కోవడం, పిరికితనం, నిలకడలేకపోవడం, మూఢత్వం, అతి మెతకతనం (నయత్వం), ఇతరులను అవమానపరచే ధోరణి మొదలైనవి రెండవ వర్గం. పారమార్థిక పదకోశం. (2) పంచవర్గం- అమాత్యుడు, రాష్ట్రము, దుర్గము, కోశము, దండము (సైన్యము). సంకేత పదకోశము. (3)చతుర్వర్గం- చతురుపాయములు, సామ దాన బేధ దండోపాయములు. (4) సప్తవర్గము- సప్తాంగములు, రాజ్యతంత్రంలో ఏడు అంగాలు ఉన్నాయని శాస్త్రం చెపుతుంది. అవి: రాజు, మంత్రి, మిత్రుడు, బొక్కసం/ ఖజానా, రాజ్యం, కోట, సైన్యం. (5) అష్టవర్గము- అష్టాంగములు- రాజనీతి సంబంధంగా, వైయక్తిక నీతి సంబంధంగా ఎనిమిది అంశాలు కలిగిన రెండు పట్టికలు ఉన్నాయి. కృషి, వాణిజ్యం, దుర్గం (కోట ), ఏనుగులను పట్టుకొని మచ్చిక చేసే అడవి, గనులు, పన్నుల సేకరణ, వాస యోగ్యమైన కొత్త ప్రదేశాలలో జనావాసాలను నిర్మించడం. పాఠ్యంతరమున. పైశున్యం (కొండేలు చెప్పడం), దుస్సాహసం, పర ధనాపహరణం, ఓర్వలేనితనం, అసూయ, నోటి దురుసుతనం, దండ పారుష్యం (అతి కఠినంగా శిక్షించడం). (6) త్రివర్గము- శత్రువులయొక్క ఉనికి వృద్ధి క్షయము గమనించవలెను. (7) విద్యస్త్రిః- మూడు విద్యలు- త్రయి, వార్తా, దండనీతులు, ‘త్రయి’ ఋగ్యజుస్సామ వేదములు, ‘వార్తా’ కృషి గోరక్షణాదులు, ‘దండనీతులు’ నీతి శాస్త్రము.
2.100.69.అనుష్టుప్.
ఇంద్రియాణాం జయం బుద్ధ్యా
షాడ్గుణ్యం దైవమానుషమ్।
కృత్యం వింశతివర్గం చ
తథా ప్రకృతిమండలమ్॥
టీక:-
ఇంద్రియాణాం = ఇంద్రియములను; జయమ్ = జయించుట; బుద్ధ్యా = తెలుసుకొని; షాడ్గుణ్యమ్ = సంధివిగ్రహాది ఆరు; దైవిక = దైవమువలన కలిగెడి బాధలు; మానుషమ్ = మనుషుల వలన కలిగెడి బాధలు; కృత్యమ్ = శత్రుపక్షమునుండి నలుగురు గుర్తించిన వారిని తన పక్షమునకు తెచ్చుకోనుట (4); వింశతి = ఇరవై (20); వర్గమ్ = వర్గము; చ = పాదపూరణము; తథా = మఱియు; ప్రకృతిః = సప్తప్రకృతుల; మండలమ్ = ద్వాదశమండలము రాజులు.
భావము:-
ఇంద్రియలౌల్యము లేకుండుట, సంధివిగ్రహాది గుణములు ఆరింటిని తెలుసుకొని ఉండుట, దైవమువలన మానవులవలన కలుగు బాధలు, సంధిచేసుకొనరాని వింశతి(20)వర్గము, రాజ్యమునకైన సప్తప్రకృతులు మఱియు ద్వాదశమండలము అను రాజు,
*గమనిక :-
;(8) షాడ్గుణ్యము- ఆరుగుణములు, సంధి, విగ్రహ, ఆసన, ద్వైదీభావము, సమాశ్రయము, సంధి అనగా శత్రువుతో ఒడంబడిక చేసికొనుట, విగ్రహము అనగా శత్రువుతో విరోధము నడపుట, ఆసనము అనగా అనుకూల కాలమునకై వేచి ఉండుట, యానము అంటే శత్రువుపై దండెత్తి వెడలుట, ద్వైధీభావము అనగా బలహీనులు బలవంతులు ఇద్దరితో మంచిగా ఉండుట, సమాశ్రయము అనగా బలవంతుని ఆశ్రయించుట. (9) దైవికములు- దైవము వలన కలుగునవి, అగ్నిప్రమాదములు, వరదలు, కఱువుకాటకములు, మరణము అను ఈ ఐదు బాధలు. (10) మానుషములు- మనుషుల వలన కలుగు బాధలు, అధికారులు, దొంగలు, శత్రువులు, రాజునకు సన్నిహితులు, దురాశాపరుడైన రాజు, ఈ ఐదుగురు మనుషులవలన కలుగు బాధలు (11) కృత్యమ్ శత్రుపక్షమునుండి జీతము దొరకని లుబ్దుడు, అవమానించబడిన ఆత్మాభిమాని, నిష్కారణ కోపమునకు గురైనవాడు, భయపెట్టబడిన వీరుడు అను నాలుగు విధముల వారిని వారికి కావలసినవి ఇచ్చి తన వైపునకు త్రిప్పుకొనుట (12) వింశతివర్గము- 1. బాలుడు, 2. వృద్దుడు, 3. దీర్ఘరోగి, 4. బందువులచే బహిష్కరింపబడినవాడు, 5. పిఱికివాడు, 6. పిఱికివారైన జనులు కలవాడు, 7. లోభి, 8. దురాశాపరులకు ఆశ్రయమిచ్చువాడు, 9 మంత్రి సేనాపతి మొదలగు వారిని సంతృప్తి పరచనివాడు, 10. విషయాసక్తుడు, 11. చంచలచిత్తుల యొక్క సూచనలను గ్రహించువాడు, 12. దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు. 13. దైవోపహతుడు, 14. అదృష్టమును నమ్ముకొని పురుషయత్నము చేయని వాడు, 15. దుర్భిక్షపీడితుడు, 16. చిక్కులపాలైన సేనలు కలవాడు, 17. స్వదేశము వీడినవాడు, 18. పెక్కుమంది శత్రువులు కలవాడు, 19. కాలము అనుకూలింపనివాడు, 20. సత్యధర్మములు పాటింపని వాడు అను ఈ ఇరవై విధములవారితో రాజు సంధిచేసుకొనరాదు. (13) ప్రకృతిమండలము, సప్తప్రకృతులు, స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. ఇవి రాజ్యాంగములు. సంకేతపదకోశము.(14) మండలము- ద్వాదశమండలము, విజిగీషువు అనగా తన రాజ్యము విస్తరింపచేయవలెననెడి కోరిక కలవాడు. ఈ విజిగీషువు మఱియు అతని చుట్టూ పదకొండు మంది రాజులు ఉందురు వీరు పన్నెండు మందిని మండలము అందురు. విజిగీషువు మండలము మధ్యన ఉండును; అతనికి ముందుభాగమున శత్రువు, మిత్రుడు, శత్రుమిత్రుడు, మిత్రశత్రువు, శత్రుమిత్రమిత్రుడు అను ఐదుగురు; వెనుకభాగమున పార్ష్ణిగ్రాహుడు, దాడిచేయబోవుచున్న రాజునకు వెనుక కాచుకుని ఉన్నవాడు, ఆక్రందుడు, పార్ష్ణిగ్రాసారుడు, ఆక్రందసారుడు అను నలుగురు ఉందురు; పార్శ్వమునందు మధ్యస్తుడు ఉండును; వారికి వెలుపల ఉదాసీనుడు ఉండును
2.100.70.అనుష్టుప్.
యాత్రాదండవిధానం చ
ద్వియోనీ సన్ధివిగ్రహౌ।
కచ్చిదేతాన్మహాప్రాజ్ఞ
యథాదనుమన్యసే॥
టీక:-
యాత్రాః = దండయాత్రల; దండః= సైనిక; విధానమ్ = విధానములు, వ్యూహములు; చ = మఱియు; ద్వియోనీ = రెండైన ఉపాయమలు; సన్ధివిగ్రహౌ = సంధి విగ్రహములు; కచ్చిత్ = కదా; ఏతాన్ = వీటిని; మహా = గొప్ప; ప్రాజ్ఞ = ప్రజ్ఞగలవాడా; యథావత్ = యథావిదిగా; అనుమన్యసే = అనుసరించుచుంటివి.
భావము:-
దండయాత్రలు సైనిక సంవిధానము, వ్యూహరచనలు, సంధి విగ్రహము అను రెండు ఉపాయమలు వీటన్నింటినీ, (17) ఓ మహాబుద్ధిశాలి భరతుడా! యథావిధిగా అనుసరించుచుంటివి కదా?
*గమనిక :-
;(15) యాత్ర అంటే దండయాత్ర. (16) దండవిధానములు- సప్తవ్యూహములు, గరుడవ్యూహము, సూచీవ్యూహము, వజ్రవ్యూహము, శకటవ్యూహము, మకరవ్యూహము, దండవ్యూహము, పద్మవ్యూహము. (17) ద్వియోని సంధివిగ్రహము- శత్రువుతో నడుచుకొనదగిన విషయములు, సంధివిగ్రహాది షడ్గుణములలో సంధి విగ్రహము ప్రధానములు. యాన ఆసనములకు మూలము నిగ్రహము, ద్వైధీభావము సమాశ్రయములకు మూలము సంధి.
2.100.71.అనుష్టుప్.
మంత్రిభిస్త్వం యథోద్దిష్టైః
చతుర్భిస్త్రిభిరేవ వా।
కచ్చిత్సమస్తైర్వ్యస్తైశ్చ
మన్త్రం మంత్రయసే మిథః॥
టీక:-
మంత్రిభి = మంత్రులతో; త్వం = నీవు; యథోద్దిష్టైః = శాస్త్రములలో చెప్పబడిన; చతుర్భిః = నలుగురు; త్రిభిః = ముగ్గురు; ఏవ = మాత్రమే; వా = కాని; కచ్చిత్ = కదా; సమస్తైః = అందరితోను; వ్యస్తైః = ఒక్కొక్కరితోను; చ = మఱియు; మన్త్రమ్ = మంత్రాగపు ఆలోచనలు; మంత్రయసే = ఆలోచించుచుంటివి; మిథః = రహస్యమునందు.
భావము:-
నీవు శాస్త్రోక్త లక్షణము గల ముగ్గరు లేదా నలుగురు మంత్రులతో కాని, అందరితోకలిసి కాని, వేరువేరుగా ఒక్కొక్కరితో గాని రహస్యముగా మంత్రాగము ఆలోచించుటకు చర్చించుచున్నావు కదా?
2.100.72.అనుష్టుప్.
కచ్చిత్తే సఫలా వేదాః
కచ్చిత్తే సఫలాః క్రియాః।
కచ్చిత్తే సఫలా దారాః
కచ్చిత్తే సఫలం శ్రుతమ్॥
టీక:-
కచ్చిత్ = కదా; తే = నీ; ఫలాః = సఫలమగచున్నది; వేదాః = వేదాధ్యయనము; కచ్చిత్ = కదా; తే = నీ; సఫలాః = సఫలమగచున్నది; క్రియాః = పనులు; కచ్చిత్ = కదా; తే = నీ; సఫలాః = సఫలమగచున్నది; దారాః = భార్యా; కచ్చిత్ = కదా; తే = నీ; సఫలమ్ = సఫలమగచున్నది; శ్రుతమ్ = శాస్త్రశ్రవణము.
భావము:-
అగ్నిహోత్రాదులతో నీ వేదాధ్యయనము సఫలమైనది చేయుచున్నావు కదా? చేయు దానములు, అనుభవించు భోగములుతో నీ ధనము సఫలము అగుచున్నది కదా? నీ భార్య అనుకూలవతిగా సేవించుచు సంతానవతి అగుటద్వారా మీ దాంపత్యము సఫలము చేయుచున్నారు కదా? నీ వినయాది సద్గుణములతో కూడిన సత్ప్రవర్తనలతో నీవు వినిన శాస్త్ర పురాణాది గ్రంధములు చదివినందుకు సఫలము చేయుచుంటివు కదా?
*గమనిక :-
;శ్రీ మహాభారతము ఉద్యోగ పర్వము- ప్రజాగర పర్వము విదురవాక్యమను 39వ అధ్యాయమునందలి 83వ శ్లోకమునందు, పై అయోధ్యకాండ 100వ సర్గ 71వ శ్లోకము యొక్క ఆశయమును స్పష్టము చేయుచున్నది. శ్లో|| అగ్నిహోత్రఫలా వేదాః శీలవృత్తఫలం శ్రుతమ్l రతిపుత్రఫలా నారీ దత్తభుక్తఫలం ధనమ్ll..83; తా|| "వేదాధ్యయనానికి ఫలం అగ్నిహోత్రాన్ని అర్పించడమే. శాస్త్రానికి ఫలం సత్ప్రవర్తన. స్త్రీ సంగమానికి ఫలం సుఖసంతానం కలగడమే. ధనానికి ఫలం దానం చేయడం, అనుభవించడమూను!
2.100.73.అనుష్టుప్.
కచ్చిదేషైవ తే బుద్ధిః
యథోక్తా మమ రాఘవ!।
ఆయుష్యా చ యశస్యా చ
ధర్మకామార్థ సంహితా॥
టీక:-
కచ్చిత్ = కదా; ఏషైవ = అట్టిదే; తే = నీ; బుద్ధిః = బుద్ది; యథాః = ఎట్లు; ఉక్తా = చెప్పబడినట్లు; మమ = నాచేత; రాఘవ = రఘువంశ భరతుడా; ఆయుష్యాః = ఆయుర్దాయము; చ = మఱియు; యశస్యాః = కీర్తులను; చ = మఱియు; ధర్మకామార్థ = ధర్మార్థకామములందు; సంహితా = కూడినదిగా ఉన్నది.
భావము:-
ఓ భరతా! ఉన్నత రఘువంశమున జన్మించినవాడవు కదా. నేను చేసిన బోధలు ప్రకారము, నీ బుద్ది ధర్మార్థకామములందు శ్రద్ధకలదై ఆయుర్దాయమును కీర్తినీ పెంపొందించు విధముగా ఉన్నది కదా?
2.100.74.అనుష్టుప్.
యాం వృత్తిం వర్తతే తాతో
యాం చ నః ప్రపితామహాః।
తాం వృత్తిం వర్తసే కచ్చిత్
యా చ సత్పథగా శుభా॥
టీక:-
యామ్ = ఏ; వృత్తిమ్ = ఆచారమున, పద్దతిలో; వర్తతే = నడచుచున్నాడో; తాతః = తండ్రి; యామ్ = ఏ; చ = మఱియు; నః = మన; ప్రపితామహాః = ముత్తాత; తామ్ = అట్టి; వృత్తిమ్ = పద్దతిలో; వర్తసే = నడచుచుంటివి; కచ్చిత్ = కదా; యా = ఏది; చ = పాదపూరణము; సత్పథగా = మంచివారి మార్గము; శుభా = మంగళకరమైనదో.
భావము:-
సత్పురుషులు అనుసరించవలసినట్టిది, శుభకరమైనది అగు ఏ ఆచారములను మన తండ్రి ఆచరించుచున్నాడో, మన తాతముత్తాతలు అనుసరించిరో, వానినే నీవు కూడ అనుసరించుతున్నావు కదా?
2.100.75.అనుష్టుప్.
కచ్చిత్త్స్వాదు కృతం భోజ్యమ్
ఏకో నాశ్నాసి రాఘవ!।
కచ్చిదాశంసమానేభ్యో
మిత్రేభ్యస్సంప్రయచ్ఛసి॥
టీక:-
కచ్చిత్ = కదా; స్వాదు = మధురముగా; కృతం = చేయబడిన; భోజ్యమ్ = ఆహారము; ఏకః = ఒక్కడవే; న = లేదు; ఆశ్నాసి = తినుట; రాఘవ = రఘుకుల భరత; కచ్చిత్ = కదా; అశం = దానిని; సమానేభ్యః = కోరుచున్న; మిత్రేభ్యః = మిత్రులకొఱకు; సంప్రయచ్ఛసి = ఇచ్చుచున్నావు.
భావము:-
ఓ రఘు వంశపు భరతుడ! మృదుమధురమైన ఆహారాము నీవొక్కడవే భుంజిచుటలేదు కదా. మిత్రులకు కూడా పెడుతున్నావు కదా.
2.100.76.త్రిష్టుప్
రాజా తు ధర్మేణ హి పాలయిత్వా
మహామతిర్దండధరః ప్రజానామ్।
అవాప్య కృత్స్నాం వసుధాం యథావత్
ఇతశ్చ్యుతః స్వర్గము పైతి విద్వాన్॥
టీక:-
రాజా = రాజు; తు = ఐతే; ధర్మేణ = ధర్మముచేత; హి = మాత్రమే; పాలయిత్వా = పరిపాలించి; మహామతిః = గొప్పబుద్ధిశాలి; దండధరః = దండించువాడై; ప్రజానామ్ = ప్రజలను; అవాప్య = పొంది; కృత్స్నాం = సమస్తమైన; వసుధాం = రాజ్యమును; యథావత్ = శాస్త్రము ప్రకారము; ఇతః = ఈ లోకమునుండి; చ్యుతః = జారినవాడై; స్వర్గమ్ = స్వర్గలోకమును; ఉపైతి = పొందును; విద్వాన్ = విద్వాంసుడైన.
భావము:-
మహాబుద్ధిశాలి, విద్వాంసుడు ఐన రాజు సమస్త రాజ్యమును పొంది, ప్రజలను తగు విధముగ దండించుచు, యథాశాస్తరముగా ధర్మము ప్రకారము పరిపాలించుచు, మరణానంతరము స్వర్గలోకమునకు పొందును.
2.100.77.గద్యం
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాండే శతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; శతతమః [100] = నూరవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని లోని [100] వందవ సర్గ సంపూర్ణము.
2.101.1.అనుష్టుప్
రామస్య వచనం శ్రుత్వా
భరతః ప్రత్యువాచ హ।
“కిం మే ధర్మాద్విహీనస్య
రాజధర్మః కరిష్యతి॥
తాత్పర్యము :-
రాముని మాటలు వినిన భరతుడు ఈ విధముగా సమాధానము చెప్పదొడగెను. “ధర్మహీనుడనై నేను, రాజధర్మము ప్రకారము రాజ్యమేలుట ఏవిధముగ చేయగలను.
భావము:-
రాముని మాటలు వినిన భరతుడు ఈ విధముగా సమాధానము చెప్పదొడగెను. “ధర్మహీనుడనై నేను, రాజధర్మము ప్రకారము రాజ్యమేలుట ఏవిధముగ చేయగలను.
*గమనిక :
(1) “అన్న యుండఁ దమ్ముండుఁ రాజ్యార్హుండుగాఁడు; నీవు పరివేత్తవు;” అన్నారు అన్న దేవాపి రాజ్యం వదలి తపోమార్గం పట్టి అడవులలో ఉండిపోయాడు. కనుక రాజ్యం చేస్తున్న తమ్ముడు శంతనుని పెద్దలు, (పోతెభా శంతనుని వృత్తాంతము, 9-662-సీ. పరివేత్త అనగా అన్న కన్న ముందు పెండ్లాడిన తమ్ముఁడు, ధర్మము తప్పినవాడు. రాజ్యమునకు భర్త రాజు కనుక, రాజ్యము భార్యతో సమానము. ఆ ధర్మము సూచిస్తూ, భరతుడు ఈ ధర్మము తప్పిన నేను ఎలా రాజ్యం ఏలగలను అంటున్నాడు. కాని పద్నాలుగేళ్ళు దూరంగా ఉన్నవానికి వంశపారంపర్యాలు వర్తించవు అను ధర్మము స్మరించి, రాముడు భరతుని రాజ్యం చేపట్టు అంటున్నాడు.ఆహా! (2) భరతుని భావము రాముని సేవించుటే, కనుక ఇతర ఐహిక పురుషార్థములు పట్టిచుకోను. అనగా నాకు ధర్మాది లేనివాడిని అని గోరఖ్ పూర్ వారి ప్రతి.
2.101.2.అనుష్టుప్
శాశ్వతోఽయం సదా ధర్మః
స్థితోఽస్మాసు నరర్షభ!।
జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్
న కనీయాన్నృపోభవేత్॥
తాత్పర్యము :-
ఓ రామరాజా! మన వంశము నందు ఎప్పుడైనా జేష్టపుత్రుడు ఉండగా చిన్నవాడు రాజ్యపాలకుడు కాకుడదు అనునది శాశ్వత ధర్మము.
భావము:-
ఓ రామరాజా! మన వంశము నందు ఎప్పుడైనా జేష్టపుత్రుడు ఉండగా చిన్నవాడు రాజ్యపాలకుడు కాకుడదు అనునది శాశ్వత ధర్మము.
2.101.3.అనుష్టుప్
స సమృద్ధాం మయా సార్ధమ్
అయోధ్యాం గచ్ఛ రాఘవ!।
అభిషేచయచాత్మానం
కులస్యాస్య భవాయ నః॥
తాత్పర్యము :-
రఘురామా! అందుచేత, నాతో కూడా ఐశ్వర్యసమృద్ధమైన మన అయోధ్యానగరమునకు రమ్ము. పట్టాభిషిక్తుడవు కమ్ము. మన కులక్షేమమును కానిమ్ము.
భావము:-
రఘురామా! అందుచేత, నాతో కూడా ఐశ్వర్యసమృద్ధమైన మన అయోధ్యానగరమునకు రమ్ము. పట్టాభిషిక్తుడవు కమ్ము. మన కులక్షేమమును కానిమ్ము.
2.101.4.అనుష్టుప్
రాజానం మానుషం ప్రాహుః
దేవత్వే సమ్మతో మమ।
యస్య ధర్మార్థసహితం
వృత్తమాహురమానుషమ్॥
తాత్పర్యము :-
నేను దేవతగా గ్రహింస్తాను కాని, రాజును మానవునిగానే తెలుపుతుంటారు. ఏ రాజైతే ధర్మార్థములు కలిగిన చరిస్తుంటాడో అతను మానుషాతీతశక్తులు కలవాడే.
భావము:-
నేను దేవతగా గ్రహింస్తాను కాని, రాజును మానవునిగానే తెలుపుతుంటారు. ఏ రాజైతే ధర్మార్థములు కలిగిన చరిస్తుంటాడో అతను మానుషాతీతశక్తులు కలవాడే.
2.101.5.అనుష్టుప్
కేకయస్థే చ మయి తు
త్వయి చారణ్య మాశ్రితే।
దివమార్యో గతో రాజా
యాయజూకస్సతాం మతః॥
తాత్పర్యము :-
నీవు వనవాసము ప్రవేశించితివి, నేను ఇంకా కేకయదేశముననే ఉంటిని. మరి, సత్పురుషులు ఇష్టపడేవాడూ, యజ్ఞాలు చేస్తుండేవాడూ, పూజ్యుడూ ఐన రాజా దశరథులవారు స్వర్గస్థుడాయెను.
భావము:-
నీవు వనవాసము ప్రవేశించితివి, నేను ఇంకా కేకయదేశముననే ఉంటిని. మరి, సత్పురుషులు ఇష్టపడేవాడూ, యజ్ఞాలు చేస్తుండేవాడూ, పూజ్యుడూ ఐన రాజా దశరథులవారు స్వర్గస్థుడాయెను.
2.101.6.అనుష్టుప్
నిష్క్రాన్తమాత్రే భవతి
ససీతే సహలక్ష్మణే।
దుఃఖశోకాభిభూతస్తు
రాజా త్రిదివమభ్యగాత్॥
తాత్పర్యము :-
సీతాలక్ష్మణులతో నీవు బయలుదదేరగానే, దశరథమహారాజు దుఃఖశోకములచే పీడితుడై స్వర్గస్థుడయ్యెను.
భావము:-
సీతాలక్ష్మణులతో నీవు బయలుదదేరగానే, దశరథమహారాజు దుఃఖశోకములచే పీడితుడై స్వర్గస్థుడయ్యెను.
2.101.7.అనుష్టుప్
ఉత్తిష్ఠ పురుషవ్యాఘ్ర!
క్రియతాముదకం పితుః।
అహం చాయం చ శత్రుఘ్నః
పూర్వమేవ కృతోదకౌ॥
తాత్పర్యము :-
పురుషోత్తముడా! లెమ్ము. తండ్రికి జలతర్పణములు సమర్పించుము. ఈ శత్రుఘ్నుడు నేనూ కూడా ఇక్కడకు రాడానికి ముందే జలతర్పణలు వదిలితిమి.
భావము:-
పురుషోత్తముడా! లెమ్ము. తండ్రికి జలతర్పణములు సమర్పించుము. ఈ శత్రుఘ్నుడు నేనూ కూడా ఇక్కడకు రాడానికి ముందే జలతర్పణలు వదిలితిమి.
2.101.8.అనుష్టుప్
ప్రియేణ కిల దత్తం హి
పితృలోకేషు రాఘవ!।
అక్షయ్యం భవతీత్యాహుః
భవాంశ్చైవ పితుః ప్రియః॥
తాత్పర్యము :-
రఘురామ! ప్రియమైన పుత్రునిచే ఇవ్వబడిన తర్పణలు పితృలోకము నందున్న వానికి అక్షయమై ఉండును అని చెప్పెదరు. తండ్రికి ప్రియమైన పుత్రుడవు నీవే.
భావము:-
రఘురామ! ప్రియమైన పుత్రునిచే ఇవ్వబడిన తర్పణలు పితృలోకము నందున్న వానికి అక్షయమై ఉండును అని చెప్పెదరు. తండ్రికి ప్రియమైన పుత్రుడవు నీవే.
2.101.9.త్రిష్టుప్
త్వామేవ శోచంస్తవ దర్శనేప్సుః
త్వయ్యేవ సక్తామనివర్త్య బుద్ధిమ్।
త్వయా విహీనస్తవ శోకమగ్న-
స్త్వాం సంస్మరన్నస్తమితః పితా తే॥
తాత్పర్యము :-
నీ గురించిమాత్రమే నిన్ను మాత్రమే చూడగోరుచూ, నీ యందే లగ్నమైన మనసును మరల్చుకోలేక, నిన్ను గూర్చిన తలపులతో కూడిన శోకమునందు మునిగిపోయి తండ్రి దశరథుడు మరణించెను.
భావము:-
నీ గురించిమాత్రమే నిన్ను మాత్రమే చూడగోరుచూ, నీ యందే లగ్నమైన మనసును మరల్చుకోలేక, నిన్ను గూర్చిన తలపులతో కూడిన శోకమునందు మునిగిపోయి తండ్రి దశరథుడు మరణించెను.
2.101.10.గద్యం
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే ఏకోత్తరశతతమః సర్గః.
తాత్పర్యము :-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని లోని [101] నూటొకటవ సర్గ సంపూర్ణము
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని లోని [101] నూటొకటవ సర్గ సంపూర్ణము.
2.102.1.అనుష్టుప్.
తాం శ్రుత్వా కరుణాం వాచం
పితుర్మరణసంహితామ్।
రాఘవో భరతేనోక్తాం
బభూవ గతచేతనః॥
తాత్పర్యము :-
ఆ దుఃఖకరమైన తండ్రి మరణ వార్త భరతుడు చెప్పగాన్ రఘురాముడు స్పృహతప్పి మూర్ఛపోయెను.
భావము:-
ఆ దుఃఖకరమైన తండ్రి మరణ వార్త భరతుడు చెప్పగాన్ రఘురాముడు స్పృహతప్పి మూర్ఛపోయెను.
2.102.2.అనుష్టుప్.
తం తు వజ్రమివోత్సృష్టమ్
ఆహవే దానవారిణా।
వాగ్వజ్రంభరతే నోక్తమ్
అమనోజ్ఞం పరంతపః!॥
టీక:-
తమ్ = అవి; తు = నిశ్చయంగా; వజ్రమ్ = వజ్రము; ఇవ = వలె; ఉత్సృష్టమ్ = విడువబడిన; ఆహవే = యుద్ధమునందు; దానవారిణా = ఇంద్రునిచే; వాక్ = పలుకు అను; వజ్రం = వజ్రము; భరతేన = భరతునిచే; ఉక్తమ్ = చెప్పబడినది; అమనోజ్ఞమ్ = మనసు వినుటడుటను ఇష్టపడని; పరంతపః = శత్రునాశకుడ.
భావము:-
ఆ పలుకులు దానవాంతకుడైన ఇంద్రుని చేతినుండి ప్రయోగింపబడిన వజ్రాయుధమువంటివి. భరతుడు పలికిన ఆ వజ్రమువంటి కఠినాతికఠినమైన పలుకులు శత్రువులను నశింపజేయువాడైన రాముని మనసు నొప్పించాయి.
*గమనిక :
(1) దానవారిః- దానవ+అరి, శత్రువు, ఇంద్రుడు, (2) పరంతపః- పరః+తపః, శత్రువులను తపించువాడా.
2.102.3.అనుష్టుప్.
ప్రగృహ్య రామో బాహూ వై
పుష్పితాగ్రో యథా ద్రుమః।
వనే పరశునా కృత్తః
తథా భువి పపాత హ॥
టీక:-
ప్రగృహ్య = చేపట్టిన; రామః = రాముడు; బాహూ = చేతులతో; వై = నిస్సందేహముగ; పుష్పితః = పుష్పించిన; అగ్రః = మీద; యథా = ఎలా అయితే; ద్రుమః = చెట్టు; వనే = వనమునందు; పరశునా = గొడ్డలిచేత; కృత్తః = ఛేదింపబడిన, నరకబడిన; తథా = ఆవిధముగ; భువిన్ = నేలమీద; పపాతహ = పడిపోయెను.
భావము:-
గొడ్డలి పట్టుకుని ఊచిపెట్టి నరుకుతే కూలిపోయే పైనంతా పువ్వులు పూచిన చెట్టు వలె, కళకళలాడుతున్న రాముడు నేలమీద నిలువునా కూలిపోయెను.
2.102.4.అనుష్టుప్.
తథా నిపతితం రామం
జగత్యాం జగతీపతిమ్।
కూలఘాతపరిశ్రాన్తం
ప్రసుప్తమివ కుంజరమ్॥
టీక:-
తథా = ఆవిధముగ; నిపతితమ్ = పడిపోయినవాడు; రామమ్ = రాముడు; జగత్యామ్ = నేలమీద; జగతీపతిమ్ = లోకనాథుడు, జగత్ప్రభువు; కూల = నదీతీరమును; ఘాత = పొడిచి; పరిశ్రాన్తమ్ = అలసిపోయిన; ప్రసుప్తమ్ = నిద్రించుచున్న; ఇవ = వలె; కుంజరమ్ = ఏనుగు.
భావము:-
అలా నేలమీద పడిపోయిన రాముడు, ఏటిగట్టును దంతాలతో పొడిచిపొడిచి అలసిపోయి నిద్రిస్తున్న గజరాజు వలె ఉండెను.
2.102.5.అనుష్టుప్.
భ్రాతరస్తే మహేష్వాసం
సర్వతశ్శోక కర్శితమ్।
రుదంతస్సహ వైదేహ్యా
సిషిచుస్సలిలేన వై॥
టీక:-
భ్రాతరః = సోదరులు; తే = ఆ; మహేష్వాసం = గొప్పధనుస్సు గలవానిపై; సర్వతః = అంతట; శోక = శోకముచే; కర్శితమ్ = కృశించిన; రుదంతః = విలపించుచు; సహ = సహితముగా; వైదేహ్యా = సీతాదేవితో; సిషిచు = వలె; సలిలేన = చల్లుట; వై = చేసిరి.
భావము:-
సకల శోకాలతోనూ కృశించిపోయిన ఆ మహాధనుర్ధారైన రాముని చూసి, ఆ సోదరులందరూ సీతాదేవితో సహితంగా విలపించుచూ, రామునిపై తేరుకొనుటకు నీరు చల్లిరి.
2.102.6.అనుష్టుప్.
స తు సంజ్ఞాం పునర్లబ్ధ్వా
నేత్రాభ్యామస్రముత్సృజన్।
ఉపాక్రామత కాకుత్స్థ
కృపణం బహు భాషితుమ్॥
టీక:-
స = ఆ; తు = నిద్రనుండి; సంజ్ఞామ్ = మెళకువ; పునః = మరల; లబ్ధ్వా = పొందగా; నేత్రాభ్యామ్ = కన్నులచే; అస్రమ్ = కన్నీటిని; ఉత్సృజన్ = విడుచుచు; ఉపాక్రామ్త = ప్రారంభించెను; కాకుత్స్థ = కాకుస్త్థ రాముడు; కృపణం = దీనముగా; బహు = మిక్కిలిగా; భాషితుమ్ = పలుకుటను.
భావము:-
నిద్రమేల్కొనినట్లు రాముడు వంటిమీదకు తెలివి తెచ్చుకుని, కన్నీరు నిండిన కన్నులతో దైన్యముతో ఎక్కువగా మాట్లాడసాగెను.
2.102.7.అనుష్టుప్.
స రామస్స్వర్గతం శ్రుత్వా
పితరం పృథివీపతిమ్।
ఉవాచ భరతం వాక్యం
ధర్మాత్మా ధర్మసంహితమ్॥
టీక:-
స = ఆ; రామః = రాముడు; స్వర్గతం = మరణం గురించి; శ్రుత్వా = వినినవాడై; పితరమ్ = తండ్రియొక్క; పృథివీపతిమ్ = మహారాజుయొక్క; ఉవాచ = చెప్పబడిన; భరతమ్ = భరతుని గురించి; వాక్యమ్ = మాటలతో; ధర్మాత్మా = ధర్మాత్ముడు; ధర్మసంహితమ్ = ధర్మువైపుననే ఉండువాడు.
భావము:-
తమ తండ్రి దళరథమహారాజు మరణవార్త వినినట్టి రాముడు. ఆ వార్త తనకు తెలిపిన ధర్మముమార్గముననే మెలగు మహాధర్మాత్ముడు ఐన భరతునితో.
2.102.8.అనుష్టుప్.
“కిం కరిష్యామ్యయోధ్యాయాం
తాతే దిష్టాం గతిం గతే।
కస్తాం రాజవరాధ్దీనామ్
అయోధ్యాం పాలయిష్యతి॥
టీక:-
కిం = ఏమి; కరిష్యామి = చేయగలను; అయోధ్యాయామ్ = అయోధ్య యందు; తాతే = తండ్రి; దిష్టామ్ = కాల; గతిం = గతిని; గతే = పోయాక; కః = ఎవరు; తామ్ = ఆయొక్క; రాజవరాత్ = రాజశ్రేష్ణునిచే; హీనామ్ = శూన్యమైనది; అయోధ్యామ్ = అయోధ్యను; పాలయిష్యతి = పాలించగలరు.
భావము:-
అయోధ్య ఇప్పుడు వచ్చి నేనేమి చేయగలను? తండ్రిగారు కాలధర్మం చెందారు కదా. ఆ దశరధ రాజశ్రేష్ఠుడు లేని అయోధ్యానగరమును వారి వలె ఎవరు పరిపాలించగలరు?
2.102.9.అనుష్టుప్.
కిం ను తస్య మయా కార్యం?
దుర్జాతేన మహాత్మనః।
యో మృతో మమ శోకేన
మయా చాపి న సంస్కృతః॥
టీక:-
కిం = ఏమి; ను = కారణము; తస్య = అట్టి; మయా = నాచేత; కార్యం = ప్రయోజనకరమైన పని; దుర్జాతేన = చెడ్డపుట్టుక గల; మహాత్మనః = మహాత్మునకు; యః = ఎవరైతే; మృతః = రణించెనో; మమ = నన్నుగూర్చిన; శోకేన = శోకముచేత; మయా = నాచేత; చాపి = ఏమి; న = లేదో; సంస్కృతః = సంస్కరింపబడినది.
భావము:-
చెడ్డ పుట్కగల నావలన మహాత్ముడైన మనతండ్రిగారికి ఏమి ఉపయోగం? నాగురించిన శోకంతో మరణించినప్పటికీ వారికి అంతిమసంస్కారం చేయలేకపోతిని
2.102.10.అనుష్టుప్.
అహో భరత! సిద్ధార్థః
యేన రాజా త్వయాఽ నఘ!।
శత్రుఘ్నేన చ సర్వేషు
ప్రేతకృత్యేషు సత్కృతః॥
టీక:-
అహో = ఏమి అదృష్టము; భరత = భరతుడా; సిద్ధార్థః = కృతార్థుడవు; యేన = యే; రాజా = రాజు; త్వయా = నీచేత; అనఘ = పాపరహితుడా; శత్రుఘ్నేన = శత్రుఘ్నునిచేత; చ = మఱియు; సర్వేషు = సమస్తమైన; ప్రేతకృత్యేషు = అంత్యసమస్కారములు; సత్కృతః = చక్కగాచేసినవాడవు.
భావము:-
ఓహో పాపరదిచుడా! భరతుడా! నీవు రాజుగారికి సేవచేయుటచే విషయంలో కృతార్థుడవు. నీతోపాటు మన శత్రుఘ్నుడు కూడ. అంత్యక్రియలన్నీ సక్రమముగా ఆచరించిరి
2.102.11.అనుష్టుప్.
నిష్ప్రధానామనేకాగ్రాం
నరేంద్రేణ వినాకృతామ్।
నివృత్తవనవాసోఽ పి
నాయోధ్యాం గంతుముత్సహే॥
టీక:-
నిష్ప్రధానామ్ = ప్రధానపురుషుడు లేని; అనేకాగ్రామ్ = వ్యాకులమైన; నరేంద్రేణ = రాజశ్రేష్టునిచే; వినాకృతామ్ = విడువబడినది; నివృత్త = నెరవేరిన; వనవాస = వనవాసము; అపి = అయినను; న = లేను; అయోధ్యామ్ = అయోధ్యగూర్చి; గంతుమ్ = పోవుటకు; ఉత్సహే = ఉత్సాహములేదు.
భావము:-
దశరథమహారాజు మరణంతో ప్రధాన పురుషుడులేనిదైన అయోధ్యకు, వనవాసదీక్షానంతరమునూ పోవుటకు ఉత్సాహం అనిపించుట లేదు.
2.102.12.అనుష్టుప్.
సమాప్తవనవాసం మామ్
అయోధ్యాయాం పరంతప!।
కోఽ ను శాసిష్యతి? పునః
తాతే లోకాంతరం గతే॥
టీక:-
సమాప్తః = పూర్తయిన; వనవాసమ్ = వనవాసము; మామ్ = నన్ను; అయోధ్యాయామ్ = అయోధ్యలో; పరంతప = శత్రునాశక; కః = ఎవరు; అనుశాసిష్యతి = శిక్షింపగలరు; పునః = మరల; తాతే = తండ్రి; లోకాంతరమ్ = పరలోకమునకు; గతే = పోయినవాడగుచుండ.
భావము:-
మన తండ్రిగారైన దశరథమహారాజుగారు స్వర్గస్థులయినారు కదా, వనవాసము పూర్తిచేసుకుని నేను అయోధ్యకు తిరిగి వచ్చిననూ మంచీచెడూ నాకు ఎవరు బోధించెదరు?
2.102.13.అనుష్టుప్.
పురా ప్రేక్ష్య సువృత్తం మాం
పితాయాన్యాహ సాంత్వయన్।
వాక్యాని తాని శ్రోష్యామి
కుతః శ్రోత్రసుఖాన్యహమ్?”॥
టీక:-
పురా = ఇంతకు ముందు; ప్రేక్ష్య = చూచి; సువృత్తం = మంచి నడవడిక గలవానిగా; మామ్ = నన్ను; పితాః = తండ్రి; యాని = ఏ; అహ = పలికెనో; సాంత్వయన్ = బుజ్జగించుచు; వాక్యాని = పలికిన మాటలను; తాని = వాటిని; శ్రోష్యామి = వినగలను; కుతః = ఎవరినుండి; శ్రోత్రసుఖాన్ = చెవులకు ఇంపైనవి; అహమ్ = నేను.
భావము:-
ఇదివరలో నా సత్ప్రవర్తన గమనించిన మన తండ్రిగారు, చెవులకింపుగా బుజ్జగింపు మాటలు మాట్లాడేవారు. ఆ మధురమైన మాటలు ఇప్పుడు ఎవరినుండి వినగలను
2.102.14.అనుష్టుప్.
ఏవముక్త్వా స భరతం
భార్యామభ్యేత్య రాఘవః।
ఉవాచ శోకసంతప్తః
పూర్ణచంద్రనిభాననామ్॥
టీక:-
ఏవమ్ = ఇలాగ; ఉక్త్వా = పలికి; స = అతను; భరతమ్ = భరతుని గురించి; భార్యామ్ = భార్యను; అభ్యేత్య = సమీపించి; రాఘవః = రఘురాముడు; ఉవాచ = చెప్పెను; శోక = శోకముతో; సంతప్తః = బాధపడుతూ; పూర్ణచంద్రనిభాననామ్ = నిండుచంద్రునివంటిమోముకలామెను.
భావము:-
రఘురాముడు భరతునితో ఇలా పలికి, పిమ్మట, చల్లని ముఖవర్చస్సుతో శోభిల్లే సీతాదేవి దగ్గరకు చేరి ఇట్లనెను.
2.102.15.అనుష్టుప్.
“సీతే! మృతస్తే శ్వశురః
పిత్రా హీనోఽ సి లక్ష్మణ!।
భరతో దుఃఖమాచష్టే
స్వర్గతం పృథివీపతిమ్॥
టీక:-
సీతే = సీతాదేవీ; మృతస్తే = మరణించినవాడాయెను; శ్వశురః = నీ మామగారు; పిత్రా = తండ్రి; హీనః = లేనివాడవు; అసి = అయితివి; లక్ష్మణ = లక్ష్మణా; భరతః = భరతుడు; దుఃఖమ్ = దుఃఖకర వార్తను; ఆచష్టే = తెలుపుచుండెను; స్వర్గతమ్ = స్వర్గస్తుడాయెను; పృథివీపతిమ్ = మహారాజు.
భావము:-
ఓ సీతాదేవి! మీ మామగారు మరణించినాడు. ఓ లక్ష్మణా! నీవు తండ్రిలేనివాడవు అయితివి. ఘోరవార్త మహారాజు స్వర్గస్తుడాయెనని ఇదిగో భరతుడు తెలుపుతుండెను.
2.102.16.అనుష్టుప్.
తతో బహుగుణం తేషాం
బాష్పో నేత్రేష్వజాయత।
తథా బ్రువతి కాకుత్స్థే
కుమారాణాం యశస్వినామ్॥
టీక:-
తత = పిమ్మట; బహుగుణమ్ = అత్యధికముగ; తేషామ్ = వారి; బాష్పః = కన్నీరు; నేత్రేషు = కన్నులనుండి; ఆజాయత = వచ్చెను; తథా = ఆవిధముగా; బ్రువతి = చెప్పుచుండగా; కాకుత్స్థః = రాముడు; కుమారాణామ్ = కుమారులకు; యశస్వినామ్ = యశశ్శాలులు అయిన.
భావము:-
అంతట వారి కన్నులనుండి ఎంతో కన్నీళ్ళు ఉబికినవి. రాముడు ఇలా భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు చెప్పుచుండగా,
2.102.17.అనుష్టుప్.
తతస్తే భ్రాతరస్సర్వే
భృశమాశ్వాస్య రాఘవమ్।
అబ్రువన్ జగతీభర్తుః
క్రియతాముదకం పితుః॥
టీక:-
తతః = అటుపిమ్మట; తే = ఆ; భ్రాతరః = సోదరులు; సర్వే = అందరు; భృశమ్ = మిక్కిలి; ఆశ్వాస్య = ఓదార్చి; రాఘవమ్ = రఘిరాముని; అబ్రువన్ = చెప్పిరి; జగతీభర్తుః = మహారాజైన; క్రియతామమ్ = చేయబడుగాక; ఉదకం = జలతర్పణము; పితుః = తండ్రిగారికి.
భావము:-
అతని సోదరులు ముగ్గరు రఘురాముని ఎంతో ఓదార్చిరి. “మన తండ్రిగారైన దశరథమహారాజువారికి జలతర్పణములు ఇమ్ము.” అని వేడిరి.
2.102.18.అనుష్టుప్.
సా సీతా శ్వశురం శ్రుత్వా
స్వర్గలోకగతం నృపమ్।
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యామ్
అశకన్నేక్షితుం పతిమ్॥
టీక:-
సా = ఆ; సీతాః = సీతాదేవి; శ్వశురమ్ = మామగారి కబురు; శ్రుత్వా = విని; స్వర్గలోకగతమ్ = స్వర్గస్తుడైన; నృపమ్ = రాజుగురించి; నేత్రాభ్యామ్ = కన్నులతో; అశ్రుః = కన్నీళ్ళతో; పూర్ణాభ్యామ్ = నిండిన; న = లేదు; శకత్ = సమర్థత; ఈక్షితుమ్ = చూచుటకు; పతిమ్ = భర్తను.
భావము:-
మామగారు స్వర్గస్తులైరని సీతాదేవి వినెను. దానితో ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయెను, తన భర్త రాముని చూడలేకపోయెను.
2.102.19.అనుష్టుప్.
సాంత్వయిత్వా తు తాం రామో
రుదన్తీం జనకాత్మజామ్।
ఉవాచ లక్ష్మణం తత్ర
దుఃఖితో దుఃఖితం వచః॥
టీక:-
సాంత్వయిత్వా = ఓదార్చి; తు = పాదపూరణము; తాం = ఆ; రామః = రాముడు; రుదన్తీమ్ = రోదించుచున్న, ఏడ్చుచున్న; జనకాత్మజామ్ = జనకుని పుత్రిక; ఉవాచ = చెప్పెను; లక్ష్మణమ్ = లక్ష్మణునితో; తత్ర = అక్కడ; దుఃఖితః = దుఖితుడగుచు; దుఃఖితమ్ = దుఃఖించుచున్న; వచః = మాటలను.
భావము:-
రాముడు ఆ ఏడ్చుచున్న జానకీదేవిని ఓదార్చి, దుఃఖించుచున్న లక్ష్మణునికి ఇలా చెప్పెను.
*గమనిక :
జనకాత్మజ- జనకమహారాజు పుత్రిక, సీతాదేవి.
2.102.20.అనుష్టుప్.
“ఆనయేంగుదిపిణ్యాకం
చీరమాహర చోత్తరమ్।
జలక్రియార్థం తాతస్య
గమిష్యామి మహాత్మనః॥
టీక:-
ఆనయ = తీసుకురాబడుగాక; ఇంగుది = ఇంగువ; పిణ్యాకమ్ = ముద్ద; చీరమ్ = నారచీరను; ఆహర = తెమ్ము; చ = మఱియు; ఉత్తరమ్ = ఉత్తరీయము; జలక్రియ = జలతర్పణ సమర్పించుట; అర్థమ్ = కొఱకు; తాతస్య = తండ్రిగారి; గమిష్యామి = వెళ్ళెదను; మహాత్మనః = మహాత్ముడైన.
భావము:-
“ఇంగువముద్ద పట్టుకురమ్ము, నారచీరను, ఉత్తరీయములను కూడ తీసుకురమ్ము. మహాత్ముడైన తండ్రిగారికి జలతర్పణలు సమర్పించుటకు వెళ్ళెదను.
2.102.21.అనుష్టుప్.
సీతా పురస్తాద్వ్రజతు
త్వమేనామభితో వ్రజ।
అహం పశ్చాద్గమిష్యామి
గతిర్హ్యేషా సుదారుణా॥
టీక:-
సీతా = సీత; పురస్తాత్ = ముందుగా; వ్రజతు = నడచుగాక; త్వమ్ = నీవు; ఏనామ్ = ఆమె; అభితః = వెనుక; వ్రజ = నడువుము; అహం = నేను; పశ్చాత్ = ఆ వెనుక; గమిష్యామి = వెళ్ళెదను; గతిః = గమనము; ఏషా = ఈ; సుదారుణా = మిక్కిలి దారుణమైనది.
భావము:-
సీత ముందు బయలుదేరెదను. ఆమె వెనుక నీవు నడువుము. ఆ వెనుక నేను వచ్చెదను. ఇలా తండ్రికి జలతర్పణ వదులుటకు వెళ్ళుట ఉన్నదే. అది ఎంతో భయకరమైనది.
2.102.22.అనుష్టుప్.
తతో నిత్యానుగస్తేషాం
విదితాత్మా మహామతిః।
మృదుర్దాంతశ్చ శాంతశ్చ
రామే చ దృఢభక్తిమాన్॥
టీక:-
తతః = అటుపిమ్మట; నిత్య = ఎప్పుడును; అనుగస్తః = అనుసరించువాడు; తేషామ్ = వారికి; విదిత = ప్రసిద్దమైన; ఆత్మః = బుద్ధిమంతుడు; మహామతిః = గొప్ప ఆలోచనాపరుడు; మృదుః = మృదుస్వభావి; దాంతః = ఇంద్రియనిగ్రహము కలవాడు; చ = మఱియు; శాంతః = శాంతస్వభావి; చ = మఱియు; రామే = రాముని విషయమై; చ = ఇంకను; దృఢ = గట్టి; భక్తిమాన్ = భక్తికలవాడు.
భావము:-
అటుపిమ్మట, వారిని నిత్యమూ అనులరించువాడూ, ప్రశస్తమైన బుద్దిశాలి, గొప్ప ఆలోచనాపరుడు, మెత్తని స్వభావము ఇంద్రియనిగ్రహము శాంతము కలవాడు, మఱియు, రాముని యందు దృఢమైన భక్తి కలవాడు. .
2.102.23.అనుష్టుప్.
సుమన్త్రస్తైః నృపసుతైః
సార్ధమాశ్వాస్య రాఘవమ్।
అవాతారయదాలమ్బ్య
నదీం మందాకినీం శివామ్॥
టీక:-
సుమన్త్రః = సుమంత్రుడు; తైః = ఆ; నృపసుతైః = రాకుమారులతో; సార్ధమ్ = కూడ, కలిసి; ఆశ్వాస్య = ఊరడించెను; రాఘవమ్ = రఘురాముని; అవాతారయః = దింపెను; ఆలమ్బ్య= పట్టుకొని; నదీమ్= నదిలోనికి; మందాకినీమ్= గంగా; శివామ్= మంగళకరమైన.
భావము:-
సుమంత్రుడు దశరథమహారాజు పుత్రులు రాముని సోదరు ఐన భరత, ళత్రుఘ్న, లక్ష్మణులలో కలిసి రఘురాముని ఓదార్చెను, పిమ్మట రామునికి ఆసరా ఇచ్చి మంగళకరమైన గంగావది లోనికి, జలతర్పణ విడుచుకు, తీసుకువెళ్ళెను.
2.102.24.అనుష్టుప్.
తే సుతీర్థాం తతః కృచ్ఛ్రాత్
ఉపాగమ్య యశస్వినః।
నదీం మందాకినీం రమ్యాం
సదా పుష్పితకాననామ్॥
టీక:-
తే = వారు; సుతీర్థామ్ = మంచి రేవు; తతః = అటుపిమ్మట; కృచ్ఛ్రాత్ = కష్టము వలన; ఉపాగమ్య = సమీపించిన; యశస్వినః = యశస్సు కలవారు; నదీమ్ = నదిలో; మందాకినీమ్ = గంగై; రమ్యామ్ = మనోజ్ఞమైన; సదా = సతతము; పుష్పిత = పుష్పించిన; కాననామ్ = అడవికలది.
భావము:-
గొప్ప కీర్తిమంతులైన సోదరులు వచ్చిన ఆ పుణ్యతీర్థము వద్దకు వెళ్ళిరి. సతతమూ పుష్పించిన అడవిని ఆనుకుని ప్రవహించే ఆ మనోహరమైన గంగా నదిని చేరిరి.
2.102.25.అనుష్టుప్.
శీఘ్రశ్రోత సమాసాద్య
తీర్థం శివమకర్దమమ్।
సిషిచుస్తూదకం రాజ్ఞే
తాతైతత్తే భవత్వితి॥
టీక:-
శీఘ్ర = వడిగా, వేగంగా; శ్రోతః = ప్రవాహముగలది; సమాసాద్య = పొందదగినది; తీర్థమ్ = రేవు; శివమ్ = శుభకరమైనది; అకర్దమమ్ = బురదలేనిది; సిషిచుః = విడిచిరి; ఉదకం = జలతర్పణలు; రాజ్ఞే = రాజుగారికి; తాత = తండ్రి!; ఏతత్ = ఇది; తే = నీకు; భవత్ = అగుగాక; ఇతి = అని.
భావము:-
ఆ శుభకరమైన బురదలేని ప్రవాహ వడిగల రేవులో దిగిరి. తమ తండ్రిగారైన దశరథమహారాజునకు, “తండ్రిగారు! ఇది మీకు చెందుగాక” అనుచు జలతర్పణములు విడిచిరి.
2.102.26.అనుష్టుప్.
ప్రగృహ్య చ మహీపాలో
జలపూరితమంజలిమ్।
దిశం యామ్యామభిముఖో
రుదన్వచనమబ్రవీత్॥
టీక:-
ప్రగృహ్య = గ్రహించి; చ = ఇంకను; మహీపాలః = రాజు; జలః = నీరు; పూరితమ్ = నిండిఉన్నది; అంజలిమ్ = దోసిళ్ళతో; దిశమ్ = దిక్కువైపు; యామ్యామ్ = దక్షిణ; అభిముఖః = ఎదురుగా; రుదన్ = ఏడ్చుచు; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను.
భావము:-
రాముడు దోసిలినిండా నీరు తీసుకుని, దక్షిణదిక్కుకు తిరిగి రోదించుచు ఇలా అనెను.
2.102.27.అనుష్టుప్.
“ఏతత్తై రాజశార్దూల!
విమలం తోయమ క్షయమ్।
పితృలోకగతస్యాద్య
మద్దత్తముపతిష్ఠతు”॥
టీక:-
ఏతత్ = ఏదైతే అది; తే = నీకు; రాజశార్దూల = రాజశ్రేష్ఠుడా; విమలం = స్వచ్చమైన; తోయమ్ = జలము; అక్షయమ్ = అక్షయమైనది; పితృలోకగతస్య = పితృలోకమునకు వెళ్ళిన; ఆద్య = ఇప్పుడు; మత్ = నాచేత; దత్తమ్ = సమర్పించబడిన; ఉపతిష్ఠతు = అగుగాక.
భావము:-
“ఓ రాజశ్రేష్ఠుడవైన దశరథమహారాజా! ఇప్పుడు నేను సమర్పించిన జలతర్పణము ఏదైతే ఉందో అది, పితృలోకమునకు వెళ్ళిన నిన్ను అక్షయమై చేరుగాక."
2.102.28.అనుష్టుప్.
తతో మందాకినీతీరాత్
ప్రత్యుత్తీర్య స రాఘవః।
పితుశ్చకార తేజస్వీ
నివాపం భ్రాతృభిస్సహ॥
తాత్పర్యము :-
టీక:-
తతః = పిమ్మట; మందాకినీ = గంగానదీ; తీరాత్ = రేవు నుండి; ప్రత్యుత్తీర్య = ఆవలి ఒడ్డునకువెళ్ళి; స = ఆ; రాఘవః = రఘురాముడు; పితుః = తంజ్రిగారికి; చకార = చేసెను; తేజస్వీ = తేజశ్శాలి ఐన; నివాపమ్ = పిండప్రదానము; భ్రాతృభిః = తమ్ముళ్ళతో; సహ = కలిసి.
పిమ్మట తేజశ్శాలి ఐన ఆ రాముడు, సోదరులు గంగానది
తతః = పిమ్మట; మందాకినీ = గంగానదీ; తీరాత్ = రేవు నుండి; ప్రత్యుత్తీర్య = ఆవలి ఒడ్డునకువెళ్ళి; స = ఆ; రాఘవః = రఘురాముడు; పితుః = తంజ్రిగారికి; చకార = చేసెను; తేజస్వీ = తేజశ్శాలి ఐన; నివాపమ్ = పిండప్రదానము; భ్రాతృభిః = తమ్ముళ్ళతో; సహ = కలిసి.
2.102.29.అనుష్టుప్.
ఐంగుదం బదరీమిశ్రం
పిణ్యాకం దర్భసంస్తరే।
న్యస్య రామస్సదుఃఖార్తో
రుదన్వచనమబ్రవీత్॥
టీక:-
ఐంగుదమ్ = ఇంగువ; బదరీ = రేగుపళ్ళతో; మిశ్రమ్ = మిళితము చేసినది; పిణ్యాకం = తెలకపిండి; దర్భ = దర్భల; సంస్తరే = శయ్యపై; న్యస్య = ఉంచి; రామః = రాముడు; సదుఃఖార్తః = దుఖముతో ఆర్తి పొందినవాడై; రుదన్ = రోదించుచు; వచనమ్ = పలుకులు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
రాముడు ఇంగువ రేగుపళ్ళు తెలగపిండలను కలిపి ముద్దలు చేసి దర్భాసనముపై ఉంచెను. దుఃఖమువలన కలిగి ఆర్తితో రోదించుచు ఇట్లు పలికెను.
2.102.30.అనుష్టుప్.
ఇదం భుంక్ష్వమహారాజ!
ప్రీతో యదశనా వయమ్।
యదన్నః పురుషో భవతి
తదన్నాస్తస్య దేవతాః॥
టీక:-
ఇదమ్ = దీనిని; భుంక్ష్వ = తినుము; మహారాజ = మహారాజా; ప్రీతః = సంతోషించుచున్నవాడవై; యత్ = ఏది; అశనాః = ఆహారముగా కలవారమో; వయమ్ = మేము; యత్ = ఏది; అన్నః = ఆహారము; పురుషః = మానవులు; భవతి = అగునో; తత్ = ఆయొక్క; అన్నాః = ఆహారముగాకలవారే; తస్య = వాని; దేవతాః = దేవతలుకూడా.
భావము:-
ఓ దశరథ మహారాజా! మేమ మానవులము ఏ ఆహారము తినెదమో. అద్ ఆహారము వారి దేవతలు కూడా తినెదరు కదా.
2.102.31.అనుష్టుప్.
తతస్తేనైవ మార్గేణ
ప్రత్యుత్తీర్య నదీతటాత్।
ఆరురోహ నరవ్యాఘ్రో
రమ్యసానుం మహీధరమ్॥
టీక:-
తత్ = అటుపిమ్మట; తేన = ఆ; ఏవ = చేతనే; మార్గేణ = మార్గమును; ప్రత్యుత్తీర్యః = దాటెను; నదీతటాత్ = నది ఒడ్డును; ఆరురోహ = ఎక్కెను; నరవ్యాఘ్రః = నరశ్రేష్టుడు; రమ్య = మనోహరమైన; సానుమ్ = చరియలు కలదైన; మహీధరమ్ = కొండను.
భావము:-
అటుపిమ్మట, నది దాటిన అదే మార్గమున వెనుదిరిక పోయి నది ఒడ్డును దాటెను. రాముడు అందమైన చరియలు గల చిత్రకూట పర్వతమును ఎక్కెను.
*గమనిక :
చిత్రకూట- వ్యుత్పత్తి. చిత్రాణి కూటాని శృంగాని యస్య, రంగురంగుల (చిత్రమైన) శిఖరములు (కూట) కలది, చిత్రకూట పర్వతము
2.102.32.అనుష్టుప్.
తతః పర్ణకుటీద్వారమ్
ఆసాద్య జగతీపతిః।
పరిజగ్రాహ బాహుభ్యామ్
ఉభౌ భరతలక్ష్మణౌ॥
టీక:-
తతః = తరువాత; పర్ణకుటీ = పర్ణశాల; ద్వారమ్ = గుమ్మమును; ఆసాద్య = చేరి; జగతీపతిః = లోకాధినాథుడు; పరిజగ్రాహ = పట్టుకొనెను; బాహుభ్యామ్ = చేతులను; ఉభౌ = రెంటిని; భరతలక్ష్మణౌ = భరత లక్ష్మణుల.
భావము:-
లోకాధినాథుడైన రాముడు పర్ణశాల గుమ్మము వద్దకు చేరెను. భరత లక్ష్మణుల ఇద్దరి చేతులను పట్టుకొనెను.
2.102.33.అనుష్టుప్.
తేషాం తు రుదతాం శబ్దాత్
ప్రతిశ్రుత్కోఽ భవద్గిరౌ।
భ్రాతౄణాం సహ వైదేహ్యా
సింహానామివ నర్దతామ్॥
టీక:-
తేషామ్ = వారు; తు = విశేషముగ; రుదతామ్ = ఏడ్చుచున్న; శబ్దాత్ = ధ్వనులకు; ప్రతిశ్రుత్కః = ప్రతిధ్వనులు; అభవత్ = కలిగెను; గిరౌ = కొండలందు; భ్రాతౄణామ్ = సోదరులు; సహ = సహితముగా; వైదేహ్యా = సీతాదేవితో; సింహానామ్ = సింహములు; ఇవ = వలె; నర్దతామ్ = అరుపులు.
భావము:-
వారు ఏడ్చుచున్న శబ్దములు, కొండలందు ప్రతిధ్వనులు కలిగించెను. అది సీతాదేవి మఱియు ఆ సోదరులు సింహములు గర్జించి నటుల గర్జించుచున్నట్లు ఉండెను.
2.102.34.అనుష్టుప్.
మహాబలానాం రుదతాం
కుర్వతాముదకం పితుః।
విజ్ఞాయ తుములం శబ్దం
త్రస్తా భరత సైనికాః॥
టీక:-
మహాబలానామ్ = మహాబలశాలులు; రుదతామ్ = రోదించుచుండగా; కుర్వత్ = చేయుచు; ఉదకం = జలతర్పణలు; పితుః = తండ్రిగారికి; విజ్ఞాయ = తెలిసి; తుములమ్ = వ్యాకులమైన; శబ్దమ్ = ధ్వనులు; త్రస్తా = బెదిరిరి; భరత = భరతునియొక్క; సైనికాః = సైనికులు.
భావము:-
ఆ విధముగా మహా బలశాలులైన ఆ దశరథ కుమారులు తండ్రిగారికి ఉదకప్రదానములు చేయుచూ రోదించుచుండిరి. ఆ వ్యాకులపూర్ణమైన శబ్దాములు విని (దూరముగా ఉన్న) భరతుని సైనికులు బెదిరిరి.
2.102.35.అనుష్టుప్.
అబ్రువంశ్చాపి రామేణ
భరత స్సంగతో ధ్రువమ్।
తేషామేవ మహఛబ్దః
శోచతాం పితరం మృతమ్॥
టీక:-
అబ్రువన్ = అనిరి; చాపి = కూడ; రామేణ = రాముని; భరతః = భరతుడు; సంగతః = కలిసినాడు; ధ్రువమ్ = తప్పక; తేషామే = వారియొక్క; ఏవ = మాత్రమే; మహత్ = గొప్పదైన; శబ్దః = శబ్దము; శోచతామ్ = ఏడ్చుచున్న; పితరమ్ = తండ్రిగురించి; మృతమ్ = మరణించిన.
భావము:-
“భరతుడు రాముని కలిసే ఉంటాడు. వారందరూ మరణించిన తండ్రి గురించి రోదిస్తూ ఉంటారు. అదే ఈ గొప్ప ధ్వని ఐ ఉంటుంది” అని భరతుని సైనికులు అనుకోసాగిరి.
2.102.36.అనుష్టుప్.
అథ వాసాన్పరిత్యజ్య
తం సర్వేఽ భిముఖాస్స్వనమ్।
అప్యేకమనసో జగ్ముః
యథాస్థానం ప్రధావితాః॥
టీక:-
అథ = ఆ తరువాత; వాసాన్ = ఉన్నచోటు; పరిత్యజ్య = వదలి; తమ్ = ఆ; సర్వేః = అందరూ; అభిముఖాః = దిక్కువైపు; స్వనమ్ = శబ్దముయొక్క; అపి = కూడి; ఏకమనస = ఒకే ఆలోచన కలవారై; జగ్ముః = వెళ్ళిరి; యథాస్థానం = వారివారి స్థానములు ప్రకారమే; ప్రధావితాః = పరుగెత్తి.
భావము:-
వారందరూ వెంటనే తమున్న చోటునుండి శోకాల శబ్దాలు వినబడుతున్న వైపునకు, ఓకే ఆలోచనతో పద్దతిగా తమ వరుసలు ప్రకారమే, కలిసికట్టుగా పరుగెట్టుకుంటూ వెళ్ళిరి.
2.102.37.అనుష్టుప్.
హయైరన్యే గజైరన్యే
రథైరన్యే స్వలంకృతైః।
సుకుమారా స్తథైవాన్యే
పద్భిరేవ నరా యయుః॥
టీక:-
హయైః = గుఱ్ఱములచేత; అన్యే = కొందరు; గజైః = ఏనుగులచేత; అన్యే = కొందరు; రథైః = రథములచేత; అన్యే = కొందరు; స్వలంకృతైః = స్వీయఅలంకారములుకలవారై; సుకుమారాః = సుకుమారులు; తథైవ = అట్లే; అన్యే = కొందరు; పద్భిః = కాళ్ళచేత; ఏవ = మాత్రమే; నరా = మానవులు; యయుః = వెళ్ళిరి.
భావము:-
వారందరు వారివారి స్థాయీ పద్దతి ప్రకారం వస్త్రాభరణాలు ధరించి బయలుదేరారు. కొందరు గుఱ్ఱాలెక్కి, కొందరు ఏనుగులెక్కి, సుకుమారులు రథాలెక్కి, పదాతిదళాలతో కొందరు కాలినడకను బయలుదేరిరి. వరుసలలో పద్దతి ప్రాకారము వారివారి స్థానములు తప్పకుండ వెళ్ళిరి.
2.102.38.అనుష్టుప్.
అచిరప్రోషితం రామం
చిరవిప్రోషితం యథా।
ద్రష్టుకామో జనస్సర్వో
జగామ సహసాఽ ఽ శ్రమమ్॥
టీక:-
అచిర = కొద్దికాలముక్రితమే; ప్రోషితమ్ = ప్రవాసమునకు వెళ్ళినవాని; రామమ్ = రాముని; చిర = ఎంతోకాలం క్రితము; విప్రోషితమ్ = ప్రవాసమునకు వెళ్ళినవాని; యథా = వలె; ద్రష్టు = చూడవలెనని; కామః = కోరుతున్నవారు; జనః = ప్రజలు; సర్వః = అందరు; జగామ = వెళ్ళిరి; సహసాః = వెంటనే; ఆశ్రమమ్ = ఆశ్రమము గూర్చి.
భావము:-
ఆ జనులు అందరు కొద్ది కాలము క్రితమే వనాంతరమునకు ప్రవాసము వెళ్ళిన రాముని, ఎంతోకాలము క్రితమే దేశము విడిచిన వెళ్ళినవాని వలె భావించిరి. కనుక రాముని చూడవలెనని వారందరు ఆశ్రమమునకు బయలుదేరిరి.
2.102.39.అనుష్టుప్.
భ్రాతౄణాం త్వరితాస్తత్ర
ద్రష్టుకామాస్సమాగమమ్।
యయుర్బహువిధైర్యానైః
ఖురనేమిస్వనాకులైః॥
టీక:-
భ్రాతౄణామ్ = సోదరుల యొక్క; త్వరితః = తొందర పడుచున్నవారై; తత్రద్రష్టుః = చూడవలెనని; కామాః = కోరికలకో; సమాగమమ్ = కలియుటకు; యయుః = వెళ్ళిరి; బహు = అనేక; విధైః = విధములైన; యానైః = వాహనములపైన; ఖురః = గిట్టల; నేమిః = రథచక్రములపై చుట్టూ వేసిన ఇనుప కట్టు; స్వనః = చప్పుళ్ళతో; ఆకులైః = వ్యాకులమైన.
భావము:-
అక్కడ ఉన్న నలుగురు సోదరులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను చూడవలెనని కోరి వివిధ వాహనాల నేమి, గుఱ్ఱముల డెక్కల వ్యాకులమైన చప్పుళ్ళతో తొందరతో కూడిన ఆ సైనికులు వెళ్ళిరి.
*గమనిక :
చక్రనేమి- రథము/ బండి నడుచుటకై గుండ్రముగా తిరుగుచూ ఉండే భాగము. చక్రము సరిగామధ్యభాగమున ఉండు రంద్రము నందు జొనిపి చక్రమునకు లంబముగా ఉండు బలమైన ఇనుపకమ్మీని ‘ఇరుసు’ లేదా ‘అక్షము’ అందురు, ఇది బండికి బలంగా కలిపి ఉండును. దాని ఆధారంగానే చక్రము గుండ్రముగా తిరుగును. చక్రమునకు ఇరుసు పట్టే తూము / రంద్రము మధ్యన ఉండే బలమైన మోటైన భాగము ‘కన్ను’. ఇరుసు మఱియు కన్ను మధ్యన ఘర్షణ / రాపిడి మఱియు పుట్టే ఉష్ణము తగ్గించుటకు వాడు నూనెను ‘కందెన’ అందురు. కొన్ని ‘ఆకులు’ లేదా కమ్మీలు అనబడునవి కఱ్ఱలు/ ఊచలు చక్రము పై నుండ వర్తుల చట్రమును కలిపి ఉండును. ఈ చట్రముపైన చూట్టూ బిగించి ఉండు ఇనుపకమ్మి ‘నేమి’ లేదా ‘బండికంటికడకమ్మి’. ఈ నేమి యే బండిపోవునప్పుడు నేలపై తాకుచూ వెళ్ళు భాగము.
2.102.40.అనుష్టుప్.
సా భూమిర్బహుభిర్యానైః
ఖురనేమిసమాహతా।
ముమోచ తుములం శబ్దం
ద్యౌరివాభ్రసమాగమే॥
టీక:-
సా = ఆ; భూమిః = ప్రాంతము; బహుభిః = అనేకములైన; యానైః = వాహనముల; ఖురః = గుఱ్ఱముడెక్కలు; నేమిః = చక్రము మీది ఇనుప పట్టా; సమాహతా = మిక్కిలి తొక్కుడు వలన; ముమోచ = విడుదలైను; తుములమ్ = సంకులము; శబ్దమ్ = చప్పుడు; ద్యౌరివ = ఆకాశము; అభ్రః = మేఘములు; సమాగమే = సమూహము.
భావము:-
అలా అనేక వాహనముల రాకట వలన వాని గుఱ్రాల గిట్టల, చక్రాల నేమిల వలన ఏర్పడి, సంకులము, శబ్దములు. ఆకాశములో మేఘములు కమ్ముకున్నట్లుగా ఉన్నది.
2.102.41.అనుష్టుప్.
తేన విత్రాసితా నాగాః
కరేణుపరివారితాః।
ఆవాసయంతో గంధేన
జగ్మురన్యద్వనం తతః॥
టీక:-
తేన = దాని వలన; విత్రాసితా = మిక్కిలి బెదిరిన; నాగాః = ఏనుగులు; కరేణు = ఆడ ఏనుగులు; పరివారితాః = చుట్టూచేరి ఉండగా; ఆవాసయంతః = సువాసనలు వ్యాపింపజేయుచు; గంధేన = మదగంధము వలన; జగ్ముః = వెళ్ళినవి; అన్యత్ = అతరమైన; వనం = అడవులరు; తతః = అక్కడనుండి.
భావము:-
ఆ చప్పుళ్ళకు ఏనుగులు తమ ఆడ ఏనుగులతోపాటు బాగా బెదిరిపోయెను. తమ మదజలగంధంతో ఆ పదేశమంతా సువాసనలు వెదజల్లి మరింకొక వనమునకు వెళ్ళిపోయినవి.
2.102.42.అనుష్టుప్.
వరాహ వృకసంఘాశ్చ
మహిషాస్సర్పావానరాః।
వ్యాఘ్ర గోకర్ణగవయా
విత్రేసుః పృషతై స్సహ॥
టీక:-
వరాహః = అడవిపందులు; వృక = తోడేళ్ళు; సంఘాః = సమూహాలు; చ = మఱియు; మహిషాః = దున్నపోతులు; సర్పాః = పాములు; వానరాః = కోతులు; వ్యాఘ్రః = పెద్దపులులు; గోకర్ణః = కణితిమృగములు; గవయాః = ఆవులు; విత్రేసుః = భయపడినవి; పృషతైః = దుప్పులు, తెల్లమచ్చలు కల్గినవి కృష్ణసారంగములు; సహ = సహితము.
భావము:-
వరాహః, తోడేళ్ళు, సమూహాలు, దున్నపోతులు, పాములు, కోతులు, పెద్దపులులు, కణితిమృగములు, ఆవులు, దుప్పులు అనగా తెల్లమచ్చలు కల్గిన కృష్ణసారంగములు సహితముగా భయపడినవి.
2.102.43.అనుష్టుప్.
రథాంగసాహ్వా నత్యూహా
హంసాః కారణ్డవాః ప్లవాః।
తథా పుంస్కోకిలాః క్రౌంచా
విసంజ్ఞా భేజిరే దిశః॥
టీక:-
రథాంగ = చక్రవాకములు; సాహ్వా = గొప్ప; నత్యూహా = నీటికోశ్ళు; హంసాః = హంసలు; కారణ్డవాః = కన్నెలేడి అను పక్షులు; ప్లవాః = కొంగలు; తథా = అట్లే; పుంస్కోకిలాః = మగకోకిలలు; క్రౌంచా = బలాకము అను పక్షులు; విసంజ్ఞా = మతితప్పినవై; భేజిరే = పొందినవి; దిశః = దిక్కులను.
భావము:-
గొప్ప చక్రవాకములు, నీటికోశ్ళు హంసలు, కన్నెలేడి అను పక్షులు, కొంగలు, ఇంకా, మగ కోయిలలు, బలాకము అను పక్షులు మతితప్పినవై అన్ని దిక్కులకు పారిపోయినవి.
2.102.44.అనుష్టుప్.
తేన శబ్దేన విత్రస్తైః
ఆకాశం పక్షిభిర్వృతమ్।
మనుష్యైరావృతా భూమిః
ఉభయం ప్రబభౌ తదా॥
టీక:-
తేన = ఆ; శబ్దేన = చప్పుళ్ళకు; విత్రస్తైః = బెదిరిపోయిన; ఆకాశమ్ = ఆకాశము; పక్షిభి = పక్షులతో; వృతమ్ = కూడినవ; మనుష్యైః = మానవులతో; ఆవృతా = కప్పబడిన; భూమిః = భూమండలము; ఉభయం = రెండూ; ప్రబభౌ = మిక్కిలి ప్రకాశించినవి; తదా = అప్పుడు.
భావము:-
అప్పుడు, ఆ; చప్పుళ్ళకు బెదిరిపోయిన పక్షులతో నిండిపోయిన ఆకాశమూ మఱియు మానవులతో నిండిన భూమండలమూ రెండూ మిక్కిలి ప్రకాశించినవి.
2.102.45.అనుష్టుప్.
తతస్తం పురషవ్యాఘ్రం
యశస్వినమరిన్దమమ్।
ఆసీనం స్థణ్డిలే రామం
దదర్శ సహసా జనః॥
టీక:-
తతః = అప్పుడు; తమ్ = ఆ; పురషవ్యాఘ్రమ్ = పురుష శ్రేష్ఠుని; యశస్వినమ్ = కీర్తిశాలిని; అరిన్దమమ్ = శత్రునాశకుని; ఆసీనమ్ = కూర్చున్నవానిని; స్థణ్డిలే = నేలమీద; రామమ్ = రాముని; దదర్శ = చూచెను; సహసా = శీఘ్రముగా; జనః = జనులు.
భావము:-
అప్పుడు అక్కడకు వచ్చిన భరతుని సైనికులు మునగువారు అందరూ నేలపై కూర్తున్న పురుషశ్రేష్ఠుడు, కీర్తిశాలి, శత్రునాశకుడు, ఐన శ్రీరాముని శీఘ్రమే చూచిరి.
2.102.46.అనుష్టుప్.
విగర్హమాణః కైకేయీం
మంథరాసహితామపి।
అభిగమ్య జనో రామం
బాష్పపూర్ణముఖోఽ భవత్॥
టీక:-
విగర్హమాణః = నిందించుచు; కైకేయీమ్ = మహారాణి కైకను; మంథరాః = మంథరతో; సహితామ్ = సహితముగా; అపి = కూడ; అభిగమ్య = చేరి; జనః = వారందరు; రామమ్ = రాముని; బాష్ప = కన్నీరు; పూర్ణ = అలముకున్న; ముఖః = ముఖము; అభవత్ = ఐరి.
భావము:-
వారందరు రాముని చేరుతూనే, మహారాణికైకను, ఆమె సేవకురాలు మంథరను నిందించుచు వచ్చిరి.
2.102.47.అనుష్టుప్.
తాన్నరాన్ భాష్పపూర్ణాక్షాన్
సమీక్ష్యాథ సుదుఃఖితాన్।
పర్యష్వజత ధర్మజ్ఞః
పితృవన్మాతృవచ్చ సః॥
టీక:-
తాన్ = ఆ; నరాన్ = జనులను గురించి; భాష్ప = కన్నీరు; పూర్ణ = నిండిన; అక్షాన్ = కన్నులుగలవారిని; సమీక్ష్య = వీక్షించి; అథ = అటుపిమ్మట; సుదుఃఖితాన్ = మిక్కిలి దుఃఖించుచున్న వారిని; పర్యష్వజత = కౌగలించుకొనెను; ధర్మజ్ఞః = దర్మజ్ఞుడు; పితృవత్ = తండ్రులవలె; మాతృవచ్చ = తల్లులవలె; సః = అతను.
భావము:-
కన్నీళ్ళు నిండిన కళ్ళతో, ఎంతో దుఃఖించుచున్న ఆ వచ్చిన వారందరినీ వీక్షించెను. పిమ్మట, ధర్మజ్ఞుడైన ఆ శ్రీరాముడు వారిని తండ్రులవలెను, తల్లుల వలెను గ్రహించుచు కౌగలించుకొనెను.
2.102.48.జగతి.
స తత్ర కాంశ్చిత్పరిషస్వజే నరా-
న్నరాస్తు కేచిత్తు తమభ్యవాదయన్।
చకార సర్వాన్సవయస్యబాంధవాన్
యథార్హ మాసాద్య తదా నృపాత్మజః॥
టీక:-
సః = ఆయన; తత్ర = అక్కడ; కాంశ్చిత్ = కొందరిని; పరిషస్వజే = కొగలించుకొనెను; నరాన్ = జనులను; నరాః = జనులు; తు = ఐతే; కేచిత్తు = కొంతమంది; తమ్ = ఆయనను; అభ్యవాదయన్ = నమస్కరించిరి; చకార = చేసెను; సర్వాన్ = అందరు; వయస్య = సమవయస్కులను; బాంధవాన్ = బంధువలను; యథార్హమ్ = తగిన విధముగా; ఆసాద్య = చేరి; తదా = అప్పుడు; నృపాత్మజః = రాకుమారుడు.
భావము:-
ఆ రాముడు అక్కడ కొందరిని కౌగలించుకొనెను. ఐతే కొందమంది ఆయనకు నమస్కారములు చేసిరి. అప్పుడు రాముడు తన బంధుమిత్రులను అందర దగ్గరకు వెళ్ళి వారి వారికి తగిన విధముగా గౌరవించెను.
2.102.49.జగతి.
స తత్ర తేషాం రుదతాం మహాత్మనాం
భువం చ ఖం చానునినాదయన్స్వనః।
గుహా గిరీణాం చ దిశశ్చ సంతతం
మృదంగఘోషప్రతిమః ప్రశుశ్రువే॥
టీక:-
సః = ఆ; తత్ర = అక్కడ; తేషామ్ = వారిని; రుదతామ్ = రోదన; మహాత్మనామ్ = మహాత్ములయొక్క; భువమ్ = భూలోకమును; చ = మఱియు; ఖం = ఆకాశమును; చ = కూడా; అనునినాదయన్ = ప్రతిధ్వనించెను; స్వనః = శబ్దము; గుహాః = గుహల యందు; గిరీణామ్ = కొండలోను; చ = మఱియి; దిశః = నల్దిక్కులయందు; చ = కూడా; సంతతమ్ = ఎడతెగకుండా; మృదంగఘోష = మృదంగధ్వనితో; ప్రతిమః = సమానమైన; ప్రశుశ్రువే = వినబడెను.
భావము:-
అక్కడ ఆ మహాత్ములు రామాదుల రోదన ధ్వని ఎంతో గంభీరంగా ఉందంటే, ఆరోదన ధ్వని నింగీనేలా అంతా నిండిపోయి ప్రతిధ్వనించెను. ఆ ప్రతిధ్వనులు కొండలలోనూ గుహలలోను, నల్దిక్కులా ఎడతెగకుండా వినబడెను.
2.102.50.గద్యం
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే ద్యుత్తరశతతమః సర్గ్.
తాత్పర్యము :-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని లోని [102] నూటరెండవ సర్గ సంపూర్ణము
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని లోని [102] నూటరెండవ సర్గ సంపూర్ణము.
2.103.1.అనుష్టుప్
వసిష్ఠః పురతః కృత్వా
దారాన్ దశరథస్య చ।
అభిచక్రామ తం దేశం
రామదర్శనతర్షితః॥
టీక:-
వసిష్ఠః = వసిష్ఠుడు; పురతః = ముందట; కృత్వా = పెట్టుకొని; దారాన్ = భార్యలను; దశరథస్య = దశరథుని యొక్క; చ = మఱియు; అభిచక్రామ = నడచి వెళ్ళెను; తమ్ = ఆ; దేశమ్ = మఱియు; రామ= మఱియు; దర్శన= మఱియు; తర్షితః= మఱియు.
భావము:-
వసిష్ఠుడు దశరథుని భార్యలను వెంటపెట్టుకుని, రాముని చూడాలనే తహతహతో అక్కడకు నడచెను.
2.103.2.అనుష్టుప్
రాజపత్న్యశ్చ గచ్ఛన్త్యో
మందం మందాకినీం ప్రతి।
దదృశుస్తత్ర తత్ తీర్థం
రామలక్ష్మణసేవితమ్॥
టీక:-
రాజపత్న్యః = రాజభార్యలు; చ = కూడ; గచ్ఛన్త్యః = వెళ్తూ; మందమ్ = మెల్లిగా వెళ్ళునదైన; మందాకినీమ్ = కాశిగంగానది; ప్రతి = వలె; దదృశుః = చూసిరి; తత్ర = అక్కడ; తత్ = ఆ; తీర్థమ్ = రేవును; రామలక్ష్మణ = రామలక్ష్మణులచో; సేవితమ్ = సేవింపబడినది.
భావము:-
దశరథమహారాజు భార్యలు అక్కడ ప్రవహించే గంగానది వలె మెల్లిగా పోవుచూ, అక్కడ రామలక్ష్మణులు ఉపయోగించిన ఆ నదీ రేవును చూసిరి.
*గమనిక:-
మందాకిని- ఋక్షపర్వతమునుండి వెలువడునట్టి ఒక నది. ఇది చిత్రకూటమునకు సమీపమున ప్రలహించుచున్నది. దీని ఇప్పటి నామము “కాశిగంగ”
2.103.3.అనుష్టుప్
కౌసల్యా బాష్పపూర్ణేన
ముఖేన పరిశుష్యతా।
సుమిత్రామబ్రవీద్దీనా
యాశ్చాన్యా రాజయోషితః॥
టీక:-
కౌసల్యా = కౌసల్యాదేవి; బాష్ప = కన్నీరు; పూర్ణేన = నిండిన; ముఖేన = ముఖముతో; పరిశుష్యతా = ఎండిపోయిన; సుమిత్రామ్ = సుమిత్రా దేవితోనూ; అబ్రవీత్ = చెప్పెను; దీనా = దీనురాలై; యాః = పోవుచున్న; చ = కూడ; అన్యాః = ఇతరమైన; రాజయోషితః = రాజుస్త్రీలతోనూ.
భావము:-
కౌసల్యాదేవి కన్నీరు నిండా పాకిన వాడిపోయిన ముఖముతో కూడా వస్తున్న సుమిత్రాదేవితోనూ, మఱియు ఇతర దశరథ మహారాజు భార్యలతోనూ ఇలా చెప్పెను
2.103.4.అనుష్టుప్
“ఇదం తేషామనాథానాం
క్లిష్టమక్లిష్టకర్మణామ్।
వనే ప్రాక్కలనం తీర్థం
యే తే నిర్విషయీకృతాః॥
టీక:-
ఇదం = కూడ; తేషామ్ = అట్టి; అనాథానామ్ = అనాథలుకాబడిన; క్లిష్టమ్ = క్లేశకరమైన; అక్లిష్టకర్మణామ్ = శ్రమపడనక్కరలేని పనులు చేయు వారు; వనే = అడవినందలి; ప్రాక్ = తూర్పున; కలనం = ఉన్న; తీర్థమ్ = రేవు; యేతే = ఏదైతే అది; నిర్విషయీకృతాః = దేశము నుండి వెళ్ళగొట్టబడిన వారు.
భావము:-
కష్టపడుట అలవాటులేనివారు, క్లేశకరమైన అనాథలై ఉన్నవారు, దేశబహిష్కారము చేయబడినవారు ఐనట్టి రామలక్ష్మణులు, అడవికి తూర్పుదిక్కున ఉన్న ఈ రేవునే ఉపయోగించిరి.
2.103.5.అనుష్టుప్
“ఇతస్సుమిత్రే! పుత్రస్తే
సదా జలమతంద్రితః।
స్వయం హరతి సౌమిత్రిః
మమ పుత్రస్య కారణాత్॥
టీక:-
ఇతః = ఇక్కడనుండే; సుమిత్రే = సుమిత్రాదేవీ; పుత్రః = కొడుకు; తే = నీ; సదా = సతతము; జలమ్ = నీటిని; అతంద్రితః = సోమరితనములేనివాడై; స్వయమ్ = స్వయముగా; హరతి = తీసుకు వెళ్ళుచున్నాడు; సౌమిత్రిః = సుమిత్రపుత్రుడు లక్ష్మణుడు; మమ = నాయొక్క; పుత్రస్య = కొడుకు యొక్క; కారణాత్ = వలన.
భావము:-
“ఓ సుమిత్రా! నీ కుమారుడైన లక్ష్మణుడు, నా కుమారుడు రాముని కొఱకు నిత్యం స్వయముగా ఇక్కడనుండే నీళ్ళు మోసుకు వెళ్ళుచున్నాడు
2.103.6.అనుష్టుప్
జఘన్యమపి తే పుత్రః
కృతవాన్న తు గర్హితః।
భ్రాతుర్యదర్థసహితం
సర్వం తద్విహితం గుణైః॥
టీక:-
జఘన్యమ్ = చిన్నపని; అపి = అయునను; తే = నీ; పుత్రః = కొడుకు; కృతవాన్ = చేసినవాడు; న = కాదు; తు = నిశ్టయంగా; గర్హితః = నిందింపదగినది, నికృష్టమైనది; భ్రాతుః = అన్నగారి; అర్థ = ప్రయోజనంతో; సహితమ్ = కూడినవి; సర్వం = సమస్తము; తత్ = అవి; విహితమ్ = శాస్త్రోక్తమైన; గుణైః = సుగుణములే.
భావము:-
నీ కుమారుడు చేసినది గొప్పపనేమీ కాకపోవచ్చును. కాని అదేమీ నికృష్టమైనది కాదు. ఎందుకనగా, అన్నగారికి సేవచేయుటకు సంబంధించిన ఆ పనులన్నీ కూడ శాస్త్రోక్తమైన సుగుణములు మాత్రమే.
2.103.7.అనుష్టుప్
అద్యయమపి తే పుత్రః
క్లేశానామతథోచితః।
నీచానర్థసమాచారం
సజ్జం కర్మ ప్రముంచతు॥
టీక:-
అద్య = ఇప్పుడు; అయమ్ = ఈ; అపి = కూడ; తే = నీ; పుత్రః = కొడుకు; క్లేశానామ్ = క్లేశములకు; అతథోచితః = అట్లు తగని; నీచ = అధమమూ; అనర్థ = నిరర్థకమూలకు; సమ = సమానమైన; ఆచారం = పద్ధతిగా చేసే; సజ్జమ్ = ఉద్యుక్తమైన; కర్మ = పనులను; ప్రముంచతు = విడుచు గాక.
భావము:-
ఇప్పుడు కూడ ఈ క్లేశములకు నీ కొడుకు తగడు. తను ఉద్యమిచిన ఈ అధమ అనర్థపు సేవలు నుండి ఈ లక్ష్మణుడు విముక్తుడు అగుగాక..
2.103.8.అనుష్టుప్
దక్షిణాగ్రేషు దర్భేషు
సా దదర్శ మహీతలే।
పితురింగుదిపిణ్యాకం
న్యస్తమాయతలోచనా॥
టీక:-
దక్షిణాః = దక్షిణదిక్కుగా; అగ్రేషు = కొసలు ఉండేలా; దర్భేషు = పరచిన దర్బలను; సా = ఆమె; దదర్శ = చూచెను; మహీతలే = నేలమీద; పితుః = తండ్రికొఱకు; ఇంగుది = గారచెట్టు, శబ్దరత్నాకరము, https://xn--joc6a9di0b9hmd.xn--fpcrj9c3d/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81/%E0%B0%AA%E0%B0%A6%E0%B0%82/%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%9A%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/
భావము:-
నేలమీద పరచిన దక్షిణదిక్కుగా కొసలుండేలా పరచిన దర్భలను ఆ కౌసల్యాదేవి చూచెను. ఆమె తన విశాలనేత్రాలతో రామాదులచే తండ్రికొఱకు ఆ దర్భలపై ఉంచబడిన గారతెలగపిండిన ముద్దలను చూచెను.
; పిణ్యాకం = తెలగపిండి; న్యస్తమ్ = ఉంచబడిన; ఆయతలోచనా = విశాలనేత్రి, కౌసల్య.
2.103.9.అనుష్టుప్
తం భూమౌ పితురార్తేన
న్యస్తం రామేణ వీక్ష్య సా।
ఉవాచ దేవీ కౌసల్యా
సర్వా దశరథస్త్రియః॥
టీక:-
తం = వాటిని; భూమౌ = నేలమీద; పితురాః = తండ్రిగుఱించిన; ఆర్తేన = బెంగమనోవ్యథతో; న్యస్తమ్ = ఉంచబడిన వాటిని; రామేణ = రామునిచే; వీక్ష్య = చూచి; సా = ఆమె; ఉవాచ = పలికెను; దేవీ = మహారాణి; కౌసల్యా = కొసల్యాదేవి; సర్వా = సమస్తమైన; దశరథస్త్రియః = దశరథుని భార్యలతో.
భావము:-
అవా ఆమె తండ్రి మరణానికి కలిగిన మనోవ్యథతో ఉన్ననూ రాముడు ఉంచిన పిండములను చూచి, కౌసల్యాదేవి, కూడా వచ్చిన దశరథుని భార్యలందరితోనూ ఇలా చెప్పసాగింది.
2.103.10.అనుష్టుప్
“ఇదమిక్ష్వాకునాథస్య
రాఘవస్య మహాత్మనః।
రాఘవేణ పితుర్దత్తం
పశ్యతైతద్యథావిధి॥
టీక:-
ఇదమ్ = ఇది; ఇక్ష్వాకునాథస్య = ఇక్ష్వాకువంశ ప్రభువు యొక్క; రాఘవస్య = రఘువంశ దశరథునికి; మహాత్మనః = మహాత్మునికి; రాఘవేణ = రఘురామునిచే; పితుః = తండ్రికి; దత్తం = ఇవ్వబడిన; పశ్యతః = చూడండి; ఏతత్ = ఇదంతా; యథావిధి = పద్దతిప్రకారము.
భావము:-
రఘురాముడు తన తండ్రి, ఇక్ష్వాకు వంశ ప్రభువు, మహాత్ముడు ఐన రఘువంశపు దశరథునికి చేస్తున్న శాస్త్రోక్తముగా చేయుచున్న పిండ ప్రదానము చూడండి.
2.103.11.అనుష్టుప్
తస్య దేవసమానస్య
పార్థివస్య మహాత్మనః।
నైతదౌపయికం మన్యే
భుక్తభోగస్య భోజనమ్॥
టీక:-
తస్య = ఆయన; దేవసమానస్య = దేవతలతో సమానమైనవానికి; పార్థివస్య = భూపతికి, రాజు; మహాత్మనః = మహాత్ముని; న = కాదు; ఏతత్ = ఇదంతా; ఉపయికమ్ = ఉపయోగించినది; మన్యే = తలచెదను; భుక్తభోగస్య = సకల భోగములు అనుభవించువికి; భోజనమ్ = ఇది.
భావము:-
దేవతలతో సమానుడు, మహారాజు, సకల రాజభోగాలు అనుభవించువాడు ఆ దశరథునకు ఈ భోజనము తగినది కాదని నా భావన.
2.103.12.అనుష్టుప్
చతురంతాం మహీం భుక్త్వా
మహేంద్రసదృశో విభుః।
కథమింగుదిపిణ్యాకం
స భుంక్తే వసుధాధిపః॥
టీక:-
చతురః = నాలుగు; అంతామ్ = దిక్కులచివరివరకు; మహీమ్ = రాజ్యమును; భుక్త్వా = అనుభవించిన; మహేంద్ర = మహేంద్రునితో; సదృశః = సమానమైన; విభుః = విశిష్ఛ ప్రభువు; కథమ్ = ఎట్లు; ఇంగుది = గార, శబ్దరత్నాకరము; పిణ్యాకమ్ = తెలగపిండిని; స = ఆయన; భుంక్తే = తినగలడు; వసుధాధిపః = ఆయన.
భావము:-
దశరథమహారాజు సామాన్యుడు కాడు. నాలుగు దిక్కులా విస్తరించిన గొప్ప రాజ్యాన్ని ఏలిన వాడు. దేవతల ప్రభువైన మహేంద్రునితో సరితూగు విశిష్ఠమైన ప్రభువు. అంతచి వాడు ఈ గార తెలగపిండిని ఎలా తినగలడు? లేదు తినలేడుచ
2.103.13.అనుష్టుప్
అతో దుఃఖతరం లోకే
న కించిత్ప్రతిభాతి మా।
యత్ర రామః పితుర్దద్యాత్
ఇంగుదిక్షోదమ్భుద్ధిమాన్॥
టీక:-
అతః = దీనికంటె; దుఃఖతరం = అధిక దుఃఖము; లోకే = లోకంలో; న = లేదు; కించిత్ = ఇంచుకంత; ప్రతిభాతి = తోచుటలేదు; మా = నన్ను గూర్చి; యత్ర = ఎప్పుడు; రామః = రాముడు; పితుః = తండ్రికి; దద్యాత్ = ఇచ్చెనో; ఇంగుది = గారకాయల; క్షోదమ్ = పిండిని; బుద్ధిమాన్ = బహుబుద్ధిశాలి.
భావము:-
లోకంలో నాకు ఇంతకంటే మిక్కిలి దుఃఖకరమైనది ఏమాత్రం తోచుట లేదు. చూడండి, మహాబుద్ధిశాలి ఐన రాముడు ఎంతో గొప్పవాడైన తన తండ్రికి గారపిండి పెడుతున్నాడు.
2.103.14.అనుష్టుప్
రామేణగుదిపిణ్యాకం
పితుర్దత్తం సమీక్ష్య మే।
కథం దుఃఖేన హృదయం
న స్ఫోటతి సహస్రధా॥
టీక:-
రామేణ = రామునిచేత; ఇంగుదిపిణ్యాకం = గారకాయల పిండి; పితుః = తండ్రిగారికి; దత్తం = సమర్పించినది; సమీక్ష్య = చూచిన; మే = నా; కథం = ఎందుకని; దుఃఖేన = దుఋఖముచేత; హృదయం = హృదయము; న = లేదు; స్ఫోటతి = పగిలిపోవుట; సహస్రధా = వేయివ్రక్కలై.
భావము:-
రాముడు తన తండ్రిగారికి ఇలా గారపిండి సమర్పిస్తుంటే చూసిన నా హృదయము దుఃఖముతో వేయివ్రక్కలు ఎందుక అగుటలేదు?
2.103.15.అనుష్టుప్
శ్రుతిస్తు ఖల్వియం సత్యా
లౌకికీ ప్రతిభాతి మా।
యదన్నః పురుషో భవతి
తదన్నాస్తస్య దేవతాః॥
టీక:-
శ్రుతిస్తు = వినబడునది; ఖలు = కదా; ఇయం = ఈ; సత్యా = సత్యమైనదిగా; లౌకికీ = లోకప్రసిద్ధమైన; ప్రతిభాతి = తోచుచున్నది; మా = నన్ను గూర్చి; యత్ = ఏదైతే; అన్నః = ఆహారమై; పురుషః = మానవువికి; భవతి = అగునో; తత్ = అదియే; అన్నాః = ఆహారమై; తస్య = వాని; దేవతా = దేవతలకు;
భావము:-
నాకు తోచినంతవరకుం, లోకంలో ప్రసిద్ధంగా వినబడు సత్యము ఏమి టంటే, ఏ మానవునికైనా ఏది ఆహారమైతే అదే వాని దేవతలకు, పిత్దేవతలకు అహారాము అగును అని.
2.103.16.అనుష్టుప్
ఏవమార్తాం సపత్న్యస్తా
జగ్మురాశ్వాస్య తాం తదా।
దదృశుశ్చాశ్రమే రామం
స్వర్గచ్యుతమివామరమ్॥
టీక:-
ఏవమ్ = ఆవిధముగ; ఆర్తామ్ = మనోవ్యథచెందిన; సపత్న్యః = సవతులు; తా = ఆ; జగ్ముః = వెళ్ళిరి; ఆశ్వాస్య = ఓదార్చి; తాం = ఆమెను; తదా = అప్పుడు; దదృశుః = చూచిరి; చ = మఱియు; ఆశ్రమే = ఆశ్రమ మందు; రామం = రాముడిని; స్వర్గచ్యుతమ్ = స్వర్గలోకం నుండి జాకినివాడు; ఇవా = వలె ఉన్న; అమరమ్ = దేవత.
భావము:-
ఆ దశరథ భార్యలు, మనోవ్యథ చెంది ఉన్న కౌసల్యను ఓదార్చిరి. ఆమెతో కలిసి ఆశ్రమము చేరిరి. అంతట, అక్కడ స్వర్గమునుండి దిగివచ్చిన దేవతవలె ఉన్న రాముని దర్శించిరి.
2.103.17.అనుష్టుప్
సర్వభోగైః పరిత్యక్తం
రామం సమ్ప్రేక్ష్య మాతరః।
ఆర్తా ముముచురశ్రూణి
సస్వరం శోకకర్శితాః॥
టీక:-
సర్వ = సమస్తమైన; భోగైః = భోగములను; పరిత్యక్తమ్ = విడిచిన వానిని; రామమ్ = రాముడిని; సమ్ప్రేక్ష్య = చూచి; మాతరః = తల్లులు; ఆర్తాః = బాధగా; ముముచుః = విడిచిరి; అశ్రూణి = కన్నీళ్ళను; సస్వరం = ధ్వనితో; శోకః = శోకముచేత; కర్శితాః = పీడితులు.
భావము:-
కౌసల్య మున్నగు తల్లులు, భోగములు సర్వము వదిలివేసిన శ్రీరాముడిని చూసిరి. ఆ దుఃఖపీడితులు బాధతో కన్నీరుకార్చుచూ గట్టిగా రోదించిరి.
2.103.18.అనుష్టుప్
తాసాం రామస్సముత్థాయ
జగ్రాహ చరణాన్ శుభాన్।
మాత్రూణాం మనుజవ్యాఘ్రః
సర్వాసాం సత్యసంగరః॥
టీక:-
తాసామ్ = ఆయొక్క; రామః = శ్రీరాముడు; సముత్థాయ = లేచి నిలబడి; జగ్రాహ = పట్టుకొనెను; చరణాన్ = పాదములను; శుభాన్ = శుభకరమైనవి; మాత్రూణామ్ = తల్లుల; మనుజవ్యాఘ్రః = మానవశ్రేష్ఠుడు; సర్వాసామ్ = అందరి; సత్యసంగరః = సత్యసంధుడు.
భావము:-
అంత సత్యసంధుడు, మానవశ్రేష్ఠుడు ఐన శ్రీరాముడు లేచి నిలబడి, కౌసల్యాదేవికే కాక వచ్చిన తల్లులు అందరి శుభకరమైన పాదములకు పాదాభివందనములు చేసెను..
2.103.19.అనుష్టుప్
తాః పాణిభిస్సుఖస్పర్శైః
మృద్వంగుళితలైశ్శుభైః।
ప్రమమార్జూ రజః పృష్ఠాత్
రామస్యాయతలోచనాః॥
టీక:-
తాః = వారు; పాణిభిః = హస్తములతో; సుఖః = సుఖకరమైన; స్పర్శైః = స్పర్శలుగల; మృదు = మృదువైన; అంగుళితలైః = వేళ్ళుగల; శుభైః = మంగళకరమైన; ప్రమమార్జూ = తుడిచిరి, ప్రమగ్న+మార్జూ; రజః = దుమ్ము; పృష్ఠాత్ = వీపుమీది; రామస్య = రామునియొక్క; ఆయతలోచనాః = విశాలమైన కన్నులు గలవారు.
భావము:-
వారి శుభకరమైన మృదువైన వేళ్ళు సుఖకరమైన అరచేతులతో రాముని వీపు మీది దుమ్ము తుడుచుటలో లగ్నమైన తల్లుల కన్నులు విప్పారెను.
2.103.20.అనుష్టుప్
సౌమిత్రిరపి తాస్సర్వా
మాతౄఽస్సమ్ప్రేక్ష్య దుఃఖితః।
అభ్యవాదయతాసక్తం
శనై రామాదనంతరమ్॥
టీక:-
సౌమిత్రిః = సుమిత్ర పుత్రుడు, లక్ష్మణుడు; అపి = కూడా; తాః = వారు; సర్వాః = అందరు; మాతౄః = తల్లులను; అస్సమ్ప్రేక్ష్య = తిలకించి; దుఃఖితః = దుఖించుచున్న; అభ్యవాదయత్ = నమస్కరించెను; ఆసక్తమ్ = ఆపేక్షగా; శనైః = సున్నితముగా; రామాత్ = రాముని; అనంతరమ్ = తరువాత.
భావము:-
అందరు తల్లులకు దుఃఖించుచున్న ఆ లక్ష్మణుడు, రాముడి తరువాత తానును భక్తిశ్రద్ధలతో ఆపేక్షగా సున్నితముగా నమస్కరించెను.
2.103.21.అనుష్టుప్
యథా రామే తథా తస్మిన్
సర్వా వవృతిరే స్త్రియః।
వృత్తిం దశరథాజ్జాతే
లక్ష్మణే శుభలక్షణే॥
టీక:-
యథా = ఏవిధముగనైతే; రామే = రామునియందు; తథా = అదేవిధముగా; తస్మిన్ = అతనిని; సర్వాః = అందరు; వవృతిరే = చేసిరి; స్త్రియః = స్త్రీలు, భార్యలు; వృత్తిమ్ = ప్రవృత్తినే; దశరథాత్ = దశరథునినుండి; జాతే = పుట్టిన; లక్ష్మణే = లక్ష్మణుని; శుభలక్షణే = శుభలక్షణములు గలవానిని.
భావము:-
దశరథుని భార్యలందరు రాముని ఆదరించిన విధముగనే, ఆ శుభలక్షణములు గల లక్ష్మణుని కూడ ఆదరించుచు అలాగే వీపు నిమిరిరి.
2.103.22.అనుష్టుప్
సీతాఽపి చరణాంస్తాసామ్
ఉపసంగృహ్య దుఃఖితా।
శ్వశ్రూణామశ్రుపూర్ణాక్షీ
సా బభూవాగ్రతః స్థితా॥
టీక:-
సీతః = సీతాదేవి; అపి = కూడా; చరణామ్ = పాదములు; తాసామ్ = ఆ; ఉపసంగృహ్య = నమస్కారముకొఱకు పట్టుకొని; దుఃఖితా = దుఃఖితురాలై; శ్వశ్రూణామ్ = అత్తగార్లకు; అశ్రుః = కన్నీటితో; పూర్ణాః = నిండిన; అక్షీ = కన్నులు కలామె; సా = ఆమె; బభూవ = ఆయెను; అగ్రతః = ఎదుట; స్థితా = నిలిచినది.
భావము:-
శోకించుచున్న సీతాదేవి కూడా వారి పాదములకు పాదాభివందనము చేసెను. ఉప్పొంగుతున్న కన్నీటితో ఆమె అత్తగార్ల ఎదుట నిలబడెను.
2.103.23.అనుష్టుప్
తాం పరిష్వజ్య దుఃఖార్తాం
మాతా దుహితరం యథా।
వనవాసకృశాం దీనాం
కౌసల్యా వాక్యమబ్రవీత్॥
టీక:-
తామ్ = ఆమెను; పరిష్వజ్య = కౌగలించుకొనెను; దుఃఖార్తామ్ = దుఃఖముతో పీడింపబడినామెను; మాతా = తల్లి; దుహితరమ్ = కుమార్తెను; యథా = వలె; వనవాస = వనవాసముచో; కృశామ్ = చిక్కిపోయినామెను; దీనామ్ = దీనురాలితో; కౌసల్యాః = కొసల్యాదేవి; వాక్యమ్ = మాటలు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
కన్నకూతురిన తల్లి కౌగలించుకున్నట్లు ఆమెను కొగలించుకొని, వనవాసమువలన చిక్కిపోయినది పైగా దీనురాలైన సీతాదేవితో కౌసల్యాదేవి ఇలా అనెను.
2.103.24.అనుష్టుప్
“విదేహరాజస్య సుతా
స్నుషా దశరథస్య చ।
రామపత్నీ కథం దుఃఖం
సమ్ప్రాప్తా నిర్జనే వనే॥
టీక:-
విదేహరాజస్య = విదేహదేశరాజు గారి యొక్క; సుతాః = కుమార్తె; స్నుషాః = కోడలు; దశరథస్య = దశరథమహారాజుగారి; చ = మఱియు; రామపత్నీ = శ్రీరాముడి భార్య; కథమ్ = ఎట్లు; దుఃఖమ్ = దుఃఖము; సమ్ప్రాప్తాః = పొందినదో; నిర్జనే = జనులులేనట్టి; వనే = అడవులందు.
భావము:-
“విదేహరాజు గారి పుత్రిక, దశరథమహారాజు గారి కోడలు, శ్రీరాముడి భార్య ఐన సీతకు, మనుషుల సంచారమే లేని ఈ అడవులలో పడే దుఃఖాలు కలిగాయి కదా. .
2.103.25.అనుష్టుప్
పద్మమాతపసంతప్తం
పరిక్లిష్టమివోత్పలమ్।
కాంచనం రజసా ధ్వస్తం
క్లిష్టం చంద్రమివామ్బుదైః॥
టీక:-
పద్మమ్ = పద్మము; ఆతపః = ఎండకు; సంతప్తం = మాడిపోయిన; పరిక్లిష్టమ్ = నలిగిన; ఇవ = వలె; ఉత్పలమ్ = కలువ పువ్వు; కాంచనమ్ = బంగారము; రజసా = దుమ్ముపట్టిన; ధ్వస్తమ్ = చెడిన; క్లిష్టమ్ = కప్పబడిన; చంద్రమ్ = చంద్రుడు; ఇవ = వలె; అమ్బుదైః = మేఘములతో.
భావము:-
ఎండకు ఎండిపోయిన పద్మము వలె, నలిగిపోయిన కలువ పూవు వలె, దుమ్ముపట్టి మకిలిగా ఐన బంగారము వలె, మబ్బులతో కప్పబడిన చందమామ వలె
*గమనిక:-
1. పద్మము- ఉత్పత్తి. పద-గతౌ స్థైర్యే- పద+మన్, కృ.ప్ర., వ్యాపించునది, తామరపువ్వు. 2.ఉత్పలము- వ్యుత్పత్తి. పల-గతౌ-ఉచ్+పల్+అచ్, కృ.ప్ర. సుగంధముచే వ్యాపించునది, కలువ , శబ్దరత్నాకరము
2.103.26.అనుష్టుప్
ముఖం తే ప్రేక్ష్య మాం శోకో
దహత్యగ్నిరివాఽఽశ్రయమ్।
భృశం మనసి వైదేహి!
వ్యసనారణిసమ్భవః”॥
టీక:-
ముఖమ్ = ముఖము; తే = నీ; ప్రేక్ష్య = చూచి; మామ్ = నన్ను; శోకః = శోకము; దహతి = కాల్చివేయుచున్నది; అగ్నిః = నిప్పు; ఇవ = వలె; ఆశ్రయమ్ = చేరినదానిని; భృశమ్ = మిక్కిలి; మనసి = మనసునందు; వైదేహి = జానకీ; వ్యసనః = కష్టముల; ఆరణి = అరణినుండి; సమ్భవః = పుట్టిన.
భావము:-
ఓ సీతా! అట్టి నీ మోము చూసి, కఱ్ఱలో పుట్టిన అగ్ని కఱ్ఱలను కాల్చివేయునట్లు, శోకము నా మనస్సును కాల్చివేయుచున్నది.”
*గమనిక:-
అరణి- నిప్పుకొయ్య, అగ్నిని రగిలించే కఱ్ఱ, ఒక జమ్మి కొయ్యను నేలపై పెట్టి, మరొక కఱ్ఱతో కవ్వముతో చిలికినట్లు మధించి అగ్ని పుట్టించు సాధనము.
2.103.27.అనుష్టుప్
బ్రువన్త్యామేవమార్తాయాం
జనన్యాం భరతాగ్రజః।
పాదావాసాద్య జగ్రాహ
వసిష్ఠస్య చ రాఘవః॥
టీక:-
బ్రువన్త్యామ్ = చెప్పుచుండగా; ఏవమ్ = ఈ విధముగ; ఆర్తాయామ్ = శోకించుచున్న; జనన్యామ్ = తల్లి; భరతాగ్రజః = భరతుని అన్నగారు, రాముడు; పాదౌ = పాదాలురెంటిని; ఆసాద్య = సమీపించి; జగ్రాహ = పట్టుకొనెను; వసిష్ఠస్య = వసిష్టునియొక్క; చ = కూడా; రాఘవః = రఘురాముడు.
భావము:-
శోకంతో ఉన్న తల్లి కౌసల్యా దేవి ఇలా చెప్తుండగా, రాముడు వసిష్టుల వారి వద్దకు వెళ్ళి పాదాభివందనము చేసెను.
2.103.28.జగతి.
పురోహితస్యాగ్నిసమస్య వై తదా
బృహస్పతేరింద్రమివామరాధిపః।
ప్రగృహ్య పాదౌ సుసమృద్ధతేజస-
స్సహైవ తేనోపవివేశ రాఘవః॥
టీక:-
పురోహితస్య = పురోతుని యొక్క; అగ్ని = అగ్నిదేవునితో; సమస్య = సమ+అస్య, సమానమైనవాని; వై = నిస్సందేహముగా; తదా = తదా; బృహస్పతిః = బృహస్పతియొక్క; ఇంద్రమ్ = ఇందుడు; ఇవ = వలె; అమరాధిపః = దేవతల ప్రభువు; ప్రగృహ్య = పట్టుకొనెను; పాదౌ = రెండుపాదములను; సు = మిక్కిలి; సమృద్ధ = అధికమైన; తేజసః = తేజస్సుగలవానిని; సహైవ = కూడానే; తేన = ఆయన; ఉపవివేశ = కూర్చండెను; రాఘవః = రఘురాముడు.
భావము:-
రఘురాముడు, అగ్నితో సమానమైన తేజస్సు గల తమ పురోహితులు వసిష్టులవారికి, దేవేంద్రుడు, మహా తేజశ్శాలి ఐన బృహస్పతికి చేసినట్లు, పాదాభివందనము చేసి వారి వద్దే కూర్చుండెను.
2.103.29.జగతి.
తతో జఘన్యం సహితైస్సమన్త్రిభిః
పురప్రధానైశ్చ సహైవ సైనికైః।
జనేన ధర్మజ్ఞతమేన ధర్మవా-
నుపోపవిష్టో భరతస్తదాఽగ్రజమ్॥
టీక:-
తతః = వారు; జఘన్యమ్ = కూర్చున్న పిమ్మట; సహితైః = కూడిన; స = ఆ; మన్త్రిభిః = మంత్రులతో; పురప్రధానః = నగరములోని ప్రముఖులతో; చ = కూడ; సహైవ = కలిసి; సైనికైః = సైనికులతో; జనేన = వారితో; ధర్మజ్ఞతమేవ = ధర్మముబాగాతెలిసిన; ధర్మవాన్ = ధర్మాత్ముడైన; ఉపోపవిష్టః = కూర్చుండెను; భరతః = భరతుడు; తదా = అప్పుడు; అగ్రజమ్ = అన్నగారితో.
భావము:-
వాసిష్ఠుని ప్రక్కన శ్రీరాముడు ఆసీనుడైన పిమ్మట, మంత్రులతోనూ, పురప్రముఖులతోనూ, సైనికులతోనూ, ధర్మమెరిగిన వారితోనూ కూడా కలిసి అన్నగారి వద్ద కూర్చుండెను.
2.103.30.జగతి.
ఉపోపవిష్టఃస్తు తదా స వీర్యవాం-
స్తపస్వివేషేణ సమీక్ష్య రాఘవమ్।
శ్రియా జ్వలన్తం భరతః కృతాంజలి-
ర్యథా మహేంద్ర ప్రయతః ప్రజాపతిమ్॥
టీక:-
ఉపోపవిష్టః = ప్రక్కన కూర్చున్నవాడు; తు = ఐన; తదా = అప్పుడు; సః = ఆ; వీర్యవాన్ = పరాక్రమవంతుడైన; తపస్వి = తాపసుల వంటి; వేషేణ = వేషముతో; సమీక్ష్య = చూచి; రాఘవమ్ = రఘురాముని; శ్రియా = తేజస్సుతో; జ్వలన్తమ్ = ప్రకాశిస్తున్న; భరతః = భరతుడు; కృతాంజలిః = దోసిలొగ్గెను; యథా = ఎలా ఐతే; మహేంద్ర = మహేంద్రుడు; ప్రయతః = ప్రణమిల్లునో; ప్రజాపతిమ్ = బ్రహ్మదేవునికి.
భావము:-
ప్రక్కనే కూర్చుని ఉన్న పరాక్రమవంతుడు, మునిరూపు ధరించినవాడు ఐన రఘురాముని వీక్షించి, గొప్ప తేజస్సుతో ప్రకాశించుచున్న భరతుడు, బ్రహ్మదేవునికి మహేంద్రుడు చేయునట్లు, దోసిలొగ్గి నమస్కరించి ప్రణమిల్లెను.
2.103.31.జగతి.
కిమేష వాక్యం భరతోఽద్య రాఘవం
ప్రణమ్య సత్కృత్య చ సాధు వక్ష్యతి।
ఇతీవ తస్యార్యజనస్య తత్త్వతో
బభూవ కౌతూహలముత్తమం తదా॥
టీక:-
కిమ్ = ఏ; ఏషః = విధముగా; వాక్యమ్ = మాటలు; భరతః = భరతుడు; అద్య = ఇప్పుడు; రాఘవమ్ = రఘురామునికి; ప్రణమ్య = ప్రణతుడై; సత్కృత్య = సత్కరించి; చ = మఱియు; సాధుః = సజ్జనుడు; వక్ష్యతి = చెప్పునో; ఇతీవ = అని; తస్య = ఆ; ఆర్యజనస్య = గౌరవనీయులకు; తత్త్వతః = కచ్చితముగా, యథార్థముగా; బభూవ = కలిగెను; కౌతూహలమ్ = కుతూహలము; ఉత్తమమ్ = మంచి; తదా = అప్పుడు.
భావము:-
శ్రీరామునికి ఇప్పుడు ప్రణమిల్లి సత్కరించిన సజ్జనుడైన భరతుడు ఏ విధముగా మాట్లాడునో అని అక్కడ ఆసీనులైన సభ్యులకు నిజానికి మంచి కుతూహలము జనించెను
2.103.32.జగతి.
స రాఘవస్సత్యధృతిశ్చ లక్ష్మణో
మహానుభావో భరతశ్చ ధార్మికః।
వృతాః సుహృద్భిశ్చ విరేజురధ్వరే
యథా సదస్యైస్సహితాస్త్రయోఽగ్నయః॥
టీక:-
సః = ఆ; రాఘవః = రఘురాముడు; సత్యధృతిః = స్వచ్ఛమైన ధైర్యముకలవాడు; చ = మఱియు; లక్ష్మణః = లక్ష్మణుడు; మహానుభావః = గొప్పప్రభాశాలి; భరతః = భరతుడు; చ = మఱియు; ధార్మికః = ధర్మము ఆచరించువాడు; వృతాః = చుట్టూచేరిన; సుహృద్భిః = శ్రేయోదాయకులతో; చ = కూడ; విరేజుః = ప్రకాశించిరి; అధ్వరే = యజ్ఞములందు; యథా = వలె; సదస్యైః = సదస్యులతో; సహిత = కూడి ఉన్న; త్రయః = మూడు; అగ్నయః = అగ్నుల.
భావము:-
అచ్చమైన ధైర్యశాలి ఐన శ్రీరాముడు, మహానుభావుడైన లక్ష్మణుడు మఱియు పరమ ధర్మవర్తనుడైన భరతుడు ముగ్గురూ, చూట్టూచేరి ఆశీనులైన శ్రేయోభిలాషులతో, యజ్ఞములలో సదస్యులు చుట్టూ పరవేష్టించి ఉండగా త్రేతాగ్నులు ప్రకాశించునట్లు వలె విరాజిల్లిరి.
2.103.33.గద్యం
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే త్యుత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; త్ర్రుత్తరశతతమః [103] = నూటమూడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని లోని [103] నూటమూడవ సర్గ సంపూర్ణము
2.104.1.
అనుష్టుప్.
తం తు రామస్సమాశ్వాస్య
భ్రాతరం గురువత్సలమ్।
లక్ష్మణేన సహ భ్రాత్రా
ప్రష్టుం సముపచక్రమే॥
టీక:-
తం = అతనిని; తు = ఐతే; రామః = ఆ రాముడు; సమాశ్వాస్య = ఓదార్చి; భ్రాతరం = సోదరుడైన భరతుని; గురువత్సలమ్ = పెద్దలయందు ప్రేమ గలవానిని; లక్ష్మణేన = లక్ష్మణునితో; సహ = కలసి; భ్రాత్రా = సోదరుడు; ప్రష్టుమ్ = ప్రశ్నించుటకు; సముపచక్రమే = ప్రారంభించెను.
భావము:-
లక్ష్మణ సమేతుడైన ఆ రాముడు, పెద్దలయందు ప్రేమ గల ఆ భరతుని ఓదార్చి యిట్లు ప్రశ్నించుటకు ప్రారంభించెను.
2.104.2.
అనుష్టుప్.
“కిమేతదిచ్ఛేయమహం
శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా।
యస్మాత్త్వమాగతో దేశమ్
ఇమం చీరజటాజినః॥
టీక:-
కిమ్ = ఎందుకు; ఏతత్ = ఈ విధముగా; ఇచ్ఛేయమ్ = కోరుచున్నాను; అహం = నేను; శ్రోతుం = వినవలెనని; ప్రవ్యాహృతం = చెప్పుము; త్వయా = నీచేత; యస్మాత్ = ఎందువలన; త్వమ్ = నీవు; ఆగతః = వచ్చుట; దేశమ్ = చోటునకు; ఇమం = ఈ; చీర = నారచీర; జటాజినః = జట అజినములు.
భావము:-
“నీవు నారచీర జట అజినములు ధరించి ఇక్కడకు వచ్చుటకు కారణమును తెలుసుకొనగోరుచున్నాను. చెప్పుము.
2.104.3.
అనుష్టుప్.
కింనిమిత్తమిమం దేశం
కృష్ణాజినజటాధరః।
హిత్వా రాజ్యం ప్రవిష్టస్త్వం
తత్సర్వం వక్తుమర్హసి॥
టీక:-
కింనిమిత్తమ్ = ఎందుకొరకు; ఇమమ్ = ఈ; దేశం = చోటునకు; కృష్ణాజిన = కృష్ణ + అజిన, కృష్టాజినములు; జటాధరః = జటాధారివై; హిత్వా = విడిచిపెట్టి; రాజ్యమ్ = రాజ్యమును; ప్రవిష్టః = ప్రవేశించుట; త్వం = నీవు; తత్ = ఆ; సర్వం = మొత్తమంతయును; వక్తుమ్ = చెప్పుటకు; అర్హసి = తగినవాడవు.
భావము:-
కృష్ణాజినజటాధరించి రాజ్యమును విడిచి మరీ ఇక్కడకు వచ్చుటకు కారణమేమో అదంతా సవిస్తరముగా చెప్పుము.
2.104.4.
అనుష్టుప్.
ఇత్యుక్తః కైకయీపుత్రః
కాకుత్థ్సేన మహాత్మనా।
ప్రగృహ్య బలవద్భూయః
ప్రాంజలిర్వాక్యమబ్రవీత్॥
టీక:-
ఇతి = ఇట్లు; ఉక్తః = పలికి; కైకయీపుత్రః = కైకేయి కుమారుడైన భరతుడు; కాకుత్థ్సేన = రాముని చేత; మహాత్మనా = మహాత్ముడైన; ప్రగృహ్య = కౌగిలించుకొని; బలవత్ = గట్టిగా; భూయః = మరల; ప్రాంజలిః = చేతులు జోడించి; వాక్యమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను.
భావము:-
భరతుడు రాముని మాటలు విని, రాముని మరల గట్టిగా కౌగిలించుకొని, నమస్కరించుచు ఇట్లు పలికెను,
2.104.5.
అనుష్టుప్.
ఆర్యం తాతః పరిత్యజ్య
కృత్వా కర్మ సుదుష్కరమ్।
గతస్స్వర్గం మహాబాహుః
పుత్రశోకాభిపీడితః॥
టీక:-
ఆర్యం = పూజ్యుని; తాతః = తండ్రిగారు; పరిత్యజ్య = విడిచి పెట్టెను; కృత్వా = చేసి; కర్మ = పనిని; సుదుష్కరమ్ = చేయ శక్యముకాని; గతః = వెళ్లెను; స్వర్గం = స్వర్గమునకు; మహాబాహుః = గొప్ప బలము కలిగిన; పుత్రశోక = పుత్ర వియోగ శోకముచే; అభిపీడితః = సహించుట.
భావము:-
చేయరాని అట్టి పనిని చేసి, మన తండ్రి నిన్ను అడవికి పంపి, పుత్రశోకము సహింపజాలక స్వర్గస్థుడయ్యెను.
2.104.6.
అనుష్టుప్.
స్త్రియా నియుక్తః కైకేయ్యా
మమ మాత్రా పరన్తప।
చకార సుమహత్పాపమ్
ఇదమాత్మయశోహరమ్॥
టీక:-
స్త్రియా = స్త్రీ అయిన; నియుక్తః = ప్రేరేపింపగా; కైకేయ్యా = కైకేయి; మమ = నా యొక్క; మాత్రా = తల్లి; పరన్తప = శత్రు సంహారకుడు; చకార = చేసినాడు; సుమహత్ = గొప్పదైన; పాపమ్ = పాపమును; ఇదమ్ = ఇట్లు; ఆత్మ= తన; యశః = కీర్తిని; హరమ్ = నశింపచేసి.
భావము:-
స్త్రీ అయిన నా తల్లి కైకేయి ప్రేరేపింపగా, శశ్రుసంహారక సనర్థుడైన మన తండ్రి తన కీర్తిని అంతను నశింపచేసికొని ఈ మహాపాపమునకు ఒడిగట్టెను.
2.104.7.
అనుష్టుప్.
సా రాజ్యఫలమప్రాప్య
విధవా శోకకర్శితా।
పతిష్యతి మహాఘోరే
నిరయే జననీ మమ॥
టీక:-
సా = ఆమె; రాజ్యఫలమ్ = రాజ్యాధికారమును; అప్రాప్య = లభించక; విధవా = వైధవ్యముచేత; శోక = శోకముచే; కర్శితా = పీడింహబడినవై; పతిష్యతి = పడగలదు; మహాఘోరే = భయంకరమైన; నిరయే = నరకములో; జననీ = తల్లి; మమ = నా యొక్క.
భావము:-
నా తల్లి రాజ్యము లభింపక వైధవ్యమును మాత్రము పొంది, శోకముచే కృశించినదై, భయంకరమైన నరకములో పడగలదు.
2.104.8.
అనుష్టుప్.
తస్య మే దాసభూతస్య
ప్రసాదం కర్తుమర్హసి।
అభిషించస్వ చాధైవ
రాజ్యేన మఘవానివ॥
టీక:-
తస్య = ఆ విధముగా; మే = నాకు; దాసభూతస్య = దాసునివంటివాని; ప్రసాదమ్ = అనుగ్రహించుట; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = అర్హుడవు; అభిషించస్వ = అభిషిక్తుడవు కమ్ము; చ = మఱియు; అధైవ = అధ + ఏవ = ఇప్పుడే; రాజ్యేన = రాజ్యమును; మఘవాన్ = దేవేంద్రుని; ఇవ = వలె.
భావము:-
దాసుడనైన నన్ను అనుగ్రహించి, దేవేంద్రుడు వలె ఇప్పుడే రాజ్యాభిషిక్తుడవు అగుము.
2.104.9.
అనుష్టుప్.
ఇమాః ప్రకృతయస్సర్వా
విధవా మాతరశ్చ యాః।
త్వత్సకాశమనుప్రాప్తా
ప్రసాదం కర్తుమర్హసి॥
టీక:-
ఇమాః = ఈ ప్రజలు; ప్రకృతయః = ప్రజలు; సర్వా = అందరును; విధవా = భర్తను కోల్పోయిన; మాతరః = తల్లులు; చ = మఱియు; యాః = వారు; త్వత్ = మీ; సకాశమ్ = దగ్గరకు; అనుప్రాప్తా = వచ్చినారు; ప్రసాదమ్ = అనుగ్రహించుట; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = అర్హుడవు
భావము:-
ఈ ప్రజలు, భర్తను కోల్పోయిన మన తల్లులు, అందరును నీ దగ్గరకు వచ్చినారు. అనుగ్రహింపుము.
2.104.10.
అనుష్టుప్.
తదానుపూర్వ్యా యుక్తం చ
యుక్తం చాత్మని మానద!।
రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ
సకామాన్సుహృదః కురు॥
టీక:-
తత్ = ఆ కారణం చేత; అనుపూర్యా = వంశక్రమము ప్రకారము; యుక్తమ్ = కూడినది; చ = మఱియు; యుక్తం = తగినది; చ = మఱియు; ఆత్మని = నీ యందు; మానద = గౌరవమును ఇచ్చువాడ; రాజ్యమ్ = రాజ్యమును; ప్రాప్నుహి = పొందింపజేయుము, అంగీకరించుము; ధర్మేణ = ధర్మానుసారముగా; సకామాన్ = సంత్రుప్తులైనవైరిగా; సుహృదః = బంధు, మిత్రులు; కురు = చేయుము.
భావము:-
అందుచే, వంశ క్రమమును బట్టి పెద్ద వాడవగు నీకు సంక్రమించినది, తగినది అయిన ఈ రాజ్యమును ధర్మానుసారముగా స్వీకరించి నీ బంధుమిత్రులను సంత్రుప్తి పరచుము.
2.104.11.
అనుష్టుప్.
భవత్వవిధవా భూమిః
సమగ్రా పతినా త్వయా‘
శశినా విమలేనేవ
శారదీ రజనీ యథా॥
టీక:-
భవతు = అగుగాక; అవిధవా = సనాథురాలు; భూమిః = భూమి; సమగ్రా = సమస్తమైన; పతినా = ప్రభువుగా; త్వయా = నీచే; శశినా = చంద్రుని; విమలేన = నిర్మలమైన; ఇవ = వలె; శారదీ = శరత్కాలపు; రజనీ = రాత్రి; యథా = వలె
భావము:-
శరత్కాలరాత్రి నిర్మలమైన చంద్రుని పొందినట్లు.. సమస్తమైన ఈ భూమి నిన్ను ప్రభువుగా పొంది సనాథురాలు అగుగాక.
2.104.12.
అనుష్టుప్.
ఏభిశ్చ సచివైస్సార్ధం
శిరసా యాచితో మయా।
భ్రాతుశ్శిష్యస్య దాసస్య
ప్రసాదం కర్తుమర్హసి॥
టీక:-
ఏభిశ్చ = వీరందరూ; సచివైః = మంత్రులు; సార్థం = అందరును; శిరసా = శిరస్సునువంచి; యాచితః = ప్రార్థించుచున్నాము; మయా = నా చేత; భ్రాతుః = సోదరుడను; శిష్యస్య = శిష్యుడను; దాసస్య = దాసుడను; ప్రసాదం = అనుగ్రహింపుము; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = అర్హుడవు.
భావము:-
ఈ సచివులు, నేను, అందరము కూడా శిరస్సు వంచి నమస్కరించుచు, నిన్ను ప్రార్ధించుచున్నాము నీ సోదరుడను, శిష్యుడను, దాసుడను అయిన నన్ను అనుగ్రహింపుము..
2.104.13.
అనుష్టుప్.
తదిదం శాశ్వతం పిత్య్రం
సర్వం ప్రకృతిమండలమ్।
పూజితం పురుషవ్యాఘ్ర!
నాతిక్రమితుమర్హసి”॥
టీక:-
తత్ = అట్లు; ఇదం = ఈ; శాశ్వతం = శాశ్వతమైనది; పిత్య్రం = వంశక్రమమున వచ్చుచున్నది; సర్వం = అంతయును; ప్రకృతిమండలమ్ = రాజ్యము సమస్తము, వైద్యసాంస్క్రీట్.; పూజితం = చేయు ప్రార్థనను; పురుషవ్యాఘ్ర = ఓ నరశ్రేష్ఠుడా; న = లేదు; అతిక్రమితుమ్ = కాదనుటకు; అర్హసి = అర్హుడవు.
భావము:-
రామా! దేశంలోని ప్రజలు స్వామి ఆది సప్త రాజ్యాంగములు సమస్తము శాశ్వతమైన వంశక్రమానుగతాచారమును గౌరవించుచుండెను కనుక కాదనకుము. రాజ్యము స్వీకరించుము.”
*గమనిక:-
ప్రకృతిమండలమ్- 1 స్వామి అమాత్యుడు సహృత్తు కోశము రాష్ట్రము దుర్గము బలము అను ఏడు రాజ్యాంగములు మఱియు 2 జనసమూహము, ఆంధ్రశబ్దరత్నాకరము.
2.104.14.
అనుష్టుప్.
ఏవముక్త్వా మహాబాహుః
సబాష్పః కైకయీసుతః।
రామస్య శిరసా పాదౌ
జగ్రాహ విధివత్పునః॥
టీక:-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికిన; మహాబాహుః = ఆజానుబాహువైన; సబాష్పః = కన్నీరు కార్చుచు; కైకయీసుతః = కైకేయి కుమారుడైన భరతుడు; రామస్య = రామునికి; శిరసా = శిర స్సుతో; పాదౌ = పాదములను; జగ్రాహ = స్పృశించి; విధివత్ = నమస్కరించెను; పునః = మరల.
భావము:-
మహాబాహువైన భరతుడు కన్నీరు కార్చుచు ఇట్లు పలికి, మరల పద్దతి ప్రకారము రాముని పాదములను శిరసా నమస్కరించెను.
2.104.15.
అనుష్టుప్.
తం మత్తమివ మాతంగం
నిఃశ్వసన్తం పునః పునః।
భ్రాతరం భరతం రామః
పరిష్వజ్యేదమబ్రవీత్॥
టీక:-
తం = ఆ; మత్తమ్ = మదించిన; ఇవ = వలె; మాతంగం = ఏనుగు; నిఃశ్వసన్తం = నిట్టూర్చుచు; పునః పునః = మాటిమాటికి; భ్రాతరం = సోదరుడు; భరతం = భరతునికి; రామః = రాముడు; పరిష్వజ్య = కౌగిలించుకొని; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:-
రాముడు మాటిమాటికి నిట్టూర్చుచు, మదించిన ఏనుగు వలె ఉన్న సోదరుడైన ఆ భరతుని కౌగిలించుకొని ఇట్లు పలికెను.
2.104.16.
అనుష్టుప్.
“కులీనస్సత్త్వసమ్పన్నః
తేజస్వీ చరితవ్రతః।
రాజ్యహేతోః కథం పాపమ్
ఆచరేత్త్వద్విధో జనః॥
టీక:-
కులీనః = ఉత్తమ కులమునందు పుట్టినవాడు; సత్త్వసమ్పన్నః = బలవంతుడు; తేజస్వీ = తేజశ్శాలి; చరితవ్రతః = ఇచ్చిన మాటకు వెనుదిరుగని వాడు; రాజ్యహేతః = రాజ్యము మంచికోరువాడు; కథం = ఎట్లు; పాపమ్ = పాపమును; ఆచరేతి∙= ఆచరించును; ఇతి = ఈ; విధః = విధముగా; జనః = జనుడు.
భావము:-
ఉత్తమ కులమునందు పుట్టినవాడు, బలశాలి, తేజశ్ళాలి, ఇచ్చినమాటపై నిలబడువాడు. రాజ్యక్షేమము ఆకాంక్షించు వాడు అయిన నీవంటి జనుడెవ్వడైనా పాపమ చేయునా! (అనగా నీ విషయమున నాకేమియు సందేహము లేదని భావము)
2.104.17.
అనుష్టుప్.
న దోషం త్వయి పశ్యామి
సూక్ష్మమప్యరిసూదన!।
న చాపి జననీం బాల్యాత్
త్వం విగర్హితుమర్హసి॥
టీక:-
న = లేదు; దోషం = దోషము; త్వయి = నీచే; పశ్యామి = కనబడుట; సూక్ష్మమపి = కొంచెమె కూడ; అరిసూదన = శత్రుసంహారకుడవైన ఓ భరతా; న = లేదు; చ = మఱియు; అపి = ఇంకను; జననీం = తల్లిని; బాల్యాత్ = బాల్యము చేత; త్వం = నీవు; విగర్హితుమ్ = నిందించుట; అర్హసి = అర్హుడవు.
భావము:-
నీలో ఏ కొంచెము కూడ దోషము నాకు కనబడుటలేదు. బాల్యము చేత, నీవు నీ తల్లిని కూడ నిందింపవలదు.
2.104.18.
అనుష్టుప్.
కామకారో మహాప్రాజ్ఞ
గురూణాం సర్వదాఽనఘ!।
ఉపపన్నేషు దారేషు
పుత్రేషు చ విధీయతే॥
టీక:-
కామకారః = యధేష్టముగా ప్రవర్తించువారు; మహాప్రాజ్ఞ = సమర్థులైన; గురూణాం = పెద్దలచే; సర్వదా = ఎల్లప్పుడును; అనఘ = ఓ పుణ్యాత్ముడా; ఉపపన్నేషు = పొందబడినవారు; దారేషు = భార్య విషయములోను; పుత్రేషు చ = పుత్రుల విషయములోను ఇంకను; విధీయతే = చెప్పబడినది.
భావము:-
పుణ్యుడా! పెద్దలు సమర్థులైన వారు తమ భార్యాపుత్రాదుల విషయమున తమ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చునని శాస్త్రము.
2.104.19.
అనుష్టుప్.
వయమస్య యథా లోకే
సంఖ్యాతాస్సౌమ్య సాధుభిః।
భార్యాః పుత్రాశ్చ శిష్యాశ్చ
త్వమనుజ్ఞాతుమర్హసి॥
టీక:-
వయమ్ = మనము; అస్య = తండ్రిగారికి; యథా = ఆ విధముగా; లోకే = లోకములో; సంఖ్యాతాః = చెప్పబడినట్లు; సౌమ్య = సౌమ్యుడవైన ఓ భరతా; సాధుభిః = సత్పురుషులు; భార్యాః = భార్యల విషయమునను; పుత్రాః = పుత్రుల విషయమునను; చ = మఱియు; శిష్యాః = శిష్యుల విషయమునను; చ = ఇంకను; త్వమ్ = నీవు; అనుజ్ఞాతుమ్ అర్హసి = తెలిసికొనగలవు.
భావము:-
సత్పురుషులు లోకములో భార్యాపుత్రశిష్యుల విషయమున ఏవిధముగా చెప్పుచున్నారో, మనము దశరథ మహారాజునకు అట్టివారమే అను విషయమును తెలుసుకొనుము.
2.104.20.
అనుష్టుప్.
వనే వా చీరవసనం
సౌమ్య! కృష్ణాజినామ్బరమ్।
రాజ్యే వాఽపి మహారాజో
మాం వాసయితుమీశ్వరః॥
టీక:-
వనే = వనములో; వా = కాని; చీరవసనం = నారచీరలను; సౌమ్య = సౌమ్యుడైన ఓ భరతా; కృష్ణాజినామ్ = కృష్ణాజినము; అమ్బరమ్ = వస్త్రములను; రాజ్యే వా = రాజ్యాభిషిక్తుని చేయుట కాని; అపి = మఱియు; మహారాజః = మహారాజునకు; మాం = నన్ను; వాసయితుమ్ = నివసింపచేయుటకు; ఈశ్వరః = అధికారము
భావము:-
భరతుడా! నాచేత నారచీరలు, కృష్ణాజినము ధరింపజేసి అరణ్యములో నివసింపచేయుటకు గాని, నన్ను రాజ్యములో అభిషిక్తుని చేయుటకు గాని, మహారాజునకు అధికారము ఉన్నది.
2.104.21.
అనుష్టుప్.
యావత్పితరి ధర్మజ్ఞే
గౌరవం లోకసత్కృతమ్।
తావద్ధర్మభృతాం శ్రేష్ఠ!
జనన్యామపి గౌరవమ్॥
టీక:-
యావత్ = ఆ విధముగానే; పితరి = తండ్రి విషయమున; ధర్మజ్ఞే = ధర్మజ్ఞుడైన; గౌరవం = గౌరవమును; లోకసత్కృతమ్ = లోకులందరు మెచ్చుకొనునట్లుగా; తావత్ = అంతటి; ధర్మభృతాం = ధర్మవేత్తలలో; శ్రేష్ఠ = శ్రేష్ఢుడవైన; జనన్యామ్ = తల్లి విషయమునందు కూడ; అపి = ఇంకను; గౌరవమ్ = గౌరవమును.
భావము:-
ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ భరతా! ధర్మజ్ఞుడైన తండ్రి విషయమున లోకులందరు మెచ్చుకొనునట్లుగా ఎంతటి గౌరవమును చూపించవలెనో అంతటి గౌరవమును తల్లి విషయమునందు కూడ చూపవలెను.
2.104.22.
అనుష్టుప్.
ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం
“వనం గచ్ఛేతి రాఘవ!”।
మాతాపితృభ్యాముక్తోఽహం
కథమన్యత్సమాచరే॥
టీక:-
ఏతాభ్యాం = వారిరువురు; ధర్మశీలాభ్యాం = ధర్మశీలులైన; వనం = అరణ్యమునకు; గచ్ఛేతి = వెళ్లమని; రాఘవ = రాముడు; మాతాపితృభ్యామ్ = తల్లిదండ్రులిద్దరు; ఉక్త = ఆజ్ఞాపించగా; అహం = నేను; కథమ్ = ఎట్లు; అన్యత్ = మరియొక విధముగా; సమాచరే = చేయుదును.
భావము:-
ధర్మశీలులైన నా తల్లిదండ్రులిద్దరు నన్ను అరణ్యమునకు వెళ్లమని ఆజ్ఞాపించగా నేను మరి యొక విధముగా ఎట్లు చేయుదును?
2.104.23.
అనుష్టుప్.
త్వయా రాజ్యమయోధ్యాయాం
ప్రాప్తవ్యం లోకసత్కృతమ్।
వస్తవ్యం దండకారణ్యే
మయా వల్కలవాససా॥
టీక:-
త్వయా = నీచే; రాజ్యమ్ = రాజ్యపాలనము; అయోధ్యాయాం = అయోధ్యలో గల; ప్రాప్తవ్యం = పొందవలెను; లోకసత్కృతమ్ = లోకుల గౌరవమునకు; వస్తవ్యం = పాత్రమైన; దండకారణ్యే = దండకారణ్యములో; మయా = నాచే; వల్కలః = నారచీరలు; వాససా = ధరించి ఉండుట.
భావము:-
నీవు అయోధ్యలో లోకుల గౌరవమునకు పాత్రమైన రాజ్యపాలనము చేయుచుండవలెను. నేను నారచీరలు ధరించి దండకారణ్యములో ఉండెదను.
2.104.24.
అనుష్టుప్.
ఏవం కృత్వా మహారాజో
విభాగం లోకసన్నిధౌ।
వ్యాదిశ్య చ మహాతేజా
దివం దశరథో గతః॥
టీక:-
ఏవం = ఈవిధముగా; కృత్వా = చేసి; మహారాజః = మహారాజు; విభాగం = పంపకము; లోకః = ప్రజల; సన్నిధౌ = సమక్షమున; వ్యాదిశ్య చ = ఆజ్ఞాపించి; మహాతేజా = మహాతేజశ్శాలి; దివం = స్వర్గమునకు; దశరథః = దశరథ మహారాజు; గతః = వెళ్లెను
భావము:-
ప్రజల సమక్షమున ఈ విధముగా పంపకము చేసి, మహాతేజశ్శాలి అయిన దశరథ మహారాజు మనలను ఆజ్ఞాపించి స్వర్గస్థుడైనాడు.
2.104.25.
అనుష్టుప్.
స చ ప్రమాణం ధర్మాత్మా
రాజా లోకగురుస్తవ।
పిత్రా దత్తం యథాభాగమ్
ఉపభోక్తుం త్వమర్హసి॥
టీక:-
సః = ఆయన; చ = మఱియు; ప్రమాణం = ప్రమాణముగా; ధర్మాత్మా = ధర్మాత్ముడు; రాజా = మహారాజు; లోకగురుః = లోక గురువు; తవ = నీకునూ; పిత్రా = తండ్రి; దత్తం = ఇచ్చిన; యథాభాగమ్ = భాగమును; ఉపభోక్తుం = అనుభవించుటకు; త్వమ్ = నీవు; అర్హసి = అర్హుడవు.
భావము:-
ధర్మాత్ముడును, లోకగురువునూ, నీకునూ గురువుగా, మహారాజుగా ఇచ్చిన వాక్యమును నీవు ప్రమాణముగా గ్రహించవలెను. నీకు తండ్రిగా ఇచ్చిన భాగమును అనుభవింపవలెను.
2.104.26.
అనుష్టుప్.
చతుర్దశ సమాస్సౌమ్య!
దండకారణ్యమాశ్రితః।
ఉపభోక్షే్యత్వహం దత్తం
భాగం పిత్రా మహాత్మనా॥
టీక:-
చతుర్దశ = పదునాలుగు; సమాః = సంవత్సరములు; సౌమ్య = సౌమ్యుడైన ఓ భరతా; దండకారణ్యమ్ = దండకారణ్యములో; ఆశ్రితః = నివసించుటకు; ఉపభోక్షే్యతు = అనుభవించెదను; అహం = నేను; దత్తం = ఇవ్వబడిన; భాగం = భాగమును; పిత్రా = తండ్రి; మహాత్మనా = మహాత్ముడైన.
భావము:-
మహాత్ముడైన తండ్రి పదునాలుగు సంవత్సరములు దండకారణ్యములో నివసించుట అనే భాగమును నాకిచ్చెను. నేను దానిని అనుభవించెదను.
2.104.27.
త్రిష్టుప్.
యదబ్రవీన్మాం నరలోకసత్కృతః
పితా మహాత్మా విబుధాధిపోపమః।
తదేవ మన్యే పరమాత్మనో హితం
న సర్వలోకేశ్వర భావమప్యయమ్॥
టీక:-
యత్ = ఏ విధముగా; అబ్రవీత్ = పలికెను; మాం = నన్ను; నరలోక సత్కృతః = మొత్తము భూలోకమునకు పూజ్యుడు; పితా = తండ్రి; మహాత్మా = మహాత్ముడైన; విబుధాధిపః = దేవేంద్రునితో; ఉపమః = సమానుడు; తదేవ = తత్ + ఏవ, అటువంటి; మన్యే = ఆజ్ఞను అనుసరించుటయే; పరమాత్మనః = భగవంతునితో సమానుడు: హితమ్ = శ్రేయస్కరము; న = లేదు; సర్వలోకేశ్వర = లోకముల అధికారము సైతము; భావమ్ = తలంతును; అపి = కూడా; అయమ్ = నేను.
భావము:-
మన తండ్రి అయిన దశరథ మహారాజు ఈ మానవ లోకము మొత్తమునకు పూజ్యుడు. దేవేంద్రునితో సమానుడు. అట్టి మహాత్ముడు ఇచ్చిన ఆజ్ఞయే నాకు పరమహితము. తండ్రి ఇచ్చావ్యతిరిక్తమైన సమస్త లోకముల అధికారము సైతము నాకు శ్రేయస్కరము కాదు. అని నేను తలంతును.
2.104.28.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే చతురుత్తరశతతమః సర్గః
టీక:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; చతురుత్తరశతతమః [104] = నూటనాలుగవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని లోని [104] నూటనాలుగవ సర్గ సంపూర్ణము.
2.105.1.
అనుష్టుప్.
తతః పురుషసింహానాం
వృతానాం తైస్సుహృద్గణైః।
శోచతామేవ రజనీ
దుఃఖేన వ్యత్యవర్తత॥
టీకా:-
 తతః = తరువాత; పురుషసింహానాం = పురుషశ్రేష్ఠులు; వృతానాం = చుట్టూ చేరియుండగ; తైః = వారు; సుహృద్గణైః = పరివారము; శోచతామేవ = దుఃఖితులై; రజనీ = రాత్రి; దుఃఖేన = దుఃఖముతో; వ్యత్యవర్తత = గడిచినది
తాత్పర్యం :-
తరువాత; దుఃఖితులైయున్న పురుషశ్రేష్ఠులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ పరివారముతో పరివేష్టులై యుండగా రాత్రి అతికష్టముగా గడిచినది
2.105.2.
అనుష్టుప్.
రజన్యాం సుప్రభాతాయాం
భ్రాతరస్తే సుహృద్వృతాః।
మందాకిన్యాం హుతం జప్యం
కృత్వా రామముపాగమన్॥
టీకా:-
 రజన్యాం = రాత్రి; సుప్రభాతాయాం = ప్రభాత సమయము; భ్రాతరః తే = ఆ సోదరులు; సుహృద్వృతాః = పరివారముతో కలిసి ఉన్న; మందాకిన్యాం = గంగా నది యందు; హుతమ్ = హోమముసను; జప్యమ్ = జపములను; కృత్వా = చేసి; రామమ్ = రాముని; ఉపాగమన్ = చేరిరి
తాత్పర్యం :-
మరుసటి ఉదయమున రాముని సోదరులు తమ పరివారముతో కలిసి గంగా నది ఒడ్డున హోమములు జపములు చేసి; రాముని చేరిరి
2.105.3.
అనుష్టుప్.
తూష్ణీం తే సముపాసీనా
న కశ్చిత్కిఞ్చిదబ్రవీత్।
భరతస్తు సుహృన్మధ్యే
రామం వచనమబ్రవీత్॥
టీకా:-
 తూష్ణీం = మౌనముగ; తే = వారు; సముపాసీనా = కూర్చొని; న = లేదు; కశ్చిత్ = ఒక; కిఞ్చిత్ = ఏమి; అబ్రవీత్ = పలికెను; భరతః = భరతుడు; తు = మాత్రము; సుహృత్ = పరివారమందరి; మధ్యే = సమక్షమున; రామమ్ = రామునిగూర్చి; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను
తాత్పర్యం :-
వారందరును ఏమియు పలుకకుండా మౌనముగ కూర్చుని ఉండిరి. భరతుడు మాత్రము పరివారము అందరి సమక్షమున రామునితో ఇట్లు చెప్పెను.
2.105.4.
అనుష్టుప్.
“సాన్త్వితా! మామికా మాతా
దత్తం రాజ్యమిదం మమ।
తద్దదామి తవైవాహం
భుంక్ష్వ రాజ్యమకంటకమ్॥
టీకా:-
 సాన్త్వితా = తోడపుట్టినవాడ, సోదరా; మామికా = నా; మాతా = తల్లి; దత్తం = ఇచ్చిన; రాజ్యమ్ = రాజ్యమును; ఇదం = ఈ; మమ = నాకు; తత్ = దానిని; దదామి = ఇచ్చిచుంటిని; తవ = నీవు; ఏవ = మాత్రమే; అహం = నేను; భుంక్ష్వ = అనుభవించుము; రాజ్యం = రాజ్యమును; అకంటకమ్ = ఎదురులేక
తాత్పర్యం :-
“రామా! నాకు ఈ రాజ్యమును నా తల్లి ఇచ్చెను, నేను దానిని నీకిచ్చుచుంటిని. నీవే అకంటకముగా రాజ్యమును అనుభవించుము.
2.105.5.
అనుష్టుప్.
మహతేవాంబువేగేన
భిన్నస్సేతుర్జలాగమే।
దురావారం త్వదన్యేన
రాజ్యఖండమిదం మహత్॥
టీకా:-
 మహతేవ = గొప్పదైన; అంబువేగేన = జలప్రవాహమును; భిన్నః = తెగిన; సేతుః = ఆనకట్ట; జలాగమే = వర్ష ఋతువునందు; దురావారం = ఆపలేనిది; త్వత్ = నీ కన్న; అన్యేన = ఇతరులు; రాజ్యఖండమ్ = రాజ్యమండలమును; ఇదం = ఈ; మహత్ = విశాలమైన
తాత్పర్యం :-
వర్షర్తువునందు గట్టు తెగిన జలప్రవాహమును ఎవరును ఆపలేనట్లు, ఈ విశాలమైన రాజ్య మండలమంతటను నిలబెట్టుటకు నీవు తప్ప ఎవరుకును సాధ్యముగాదు.
2.105.6.
అనుష్టుప్.
గతిం ఖర ఇవాశ్వస్య
తార్క్ష్యస్యేవ పతత్రిణః।
అనుగంతుం న శక్తిర్మే
గతిం తవ మహీపతే!॥
టీకా:-
 గతిం = వేగమును; ఖర = గాడిద; ఇవ = వలె; అశ్వస్య = గుఱ్ఱముయొక్క; తార్క్ష్యస్య = గరుత్మంతునియొక్క; ఇవ = వలె; పతత్రిణః = సాధారణ పక్షి; అనుగంతుం = అనుసరించుటకు; న = లేదు; శక్తిః = సామర్థ్యము; మే = నాకు; గతిం = వేగమును; తవ = నీ; మహీపతే = రాజా
తాత్పర్యం :-
ఓ చక్రవర్తీ! సాధారణ పక్షి గరుత్మంతుని వలెను, గాడిద గుఱ్ఱము వలెను వేగమును అందుకొనలేనట్లు నేను నీ సామర్థ్యమును అందుకొనుటకు అశక్తుడను.
*గమనిక:-
 తార్క్ష్యః- వ్యుత్రత్తి. తార్క్ష్య+యఞ్, తార్క్ష్యస్య అపత్యమ్, కశ్యపుని కుమారుడు. గరుడుడు; అనూరుడు. తల్లి వినత; గరుడుని వేగము అసామాన్యమని లోకప్రసిద్ధి. చూ. వాల్మీకి తెలగు రామాయణము, వివరణలు విభాగమున, వ్యాసములు ఉపవిభాగము,
2.105.7.
అనుష్టుప్.
సుజీవం నిత్యశస్తస్య
యః పరైరుపజీవ్యతే।
రామ! తేన తు దుర్జీవం
యః పరానుపజీవతి॥
టీకా:-
 సుజీవం = మంచిజీవనము; నిత్యశః = నిత్యము; తస్య = అతని; యః = ఎవరిపై; పరైః = ఇతరులు; ఉపజీవ్యతే = జీవనార్థమై ఆశ్రయింతురో; రామ = రామా; తేన = వానిది; తు = ఐతే; దుర్జీవం = చెడ్డజీవనము; యః = ఎవరైతే; పరాన్ = ఇతరులపై; ఉపజీవతి = జీవనార్థమై ఆశ్రయించి యుండునో
తాత్పర్యం :-
రామా! తనపై ఆశ్రయించి ఇతరులు జీవించుచుండు వారి జీవనమే మంచిజీవనము. ఇతరులపై ఆశ్రయించి జీవించుచుండు వారిది దుర్జీవనము కదా
2.105.8.
అనుష్టుప్.
యథా తు రోపితో వృక్షః
పురుషేణ వివర్ధితః।
హ్రస్వకేణ దురారోహో
రూఢస్కంధో మహాద్రుమః॥
టీకా:-
 యథా = ఎట్లు; తు = ఐతే; రోపితః = నాటబడిన; వృక్షః = వృక్షము; పురుషేణ = పురుషునిచే; వివర్ధితః = పెరిగినది; హ్రస్వకేణ = మరుగుజ్జునకు; దురారోహః = ఎక్కుటకు వీలులేనిది; రూఢస్కంధః = పెద్దమ్రాను గలదైన; మహాద్రుమః = మహావృక్షము
తాత్పర్యం :-
ఒక పురుషునిచే నాటబడిన బీజము మొలకెత్తి, ఒక మరుగుజ్జుచే ఎక్కుబడలేనంత మ్రానుగా మహావృక్షమై పెరిగినను.
2.105.9.
అనుష్టుప్.
స యదా పుష్పితో భూత్వా
ఫలాని న విదర్శయేత్।
స తాం నానుభవేత్ప్రీతిం
యస్య హేతోః ప్రరోపితః॥
టీకా:-
 సః = అది; యదా = ఎట్లు; పుష్పితః = పుష్పించిన; భూత్వా = ఐన; ఫలాని = ఫలములు; న = లేదు; విదర్శయేత్ = పొందుట; సః = అది; తాం = అతనికి; న = లేదు; అనుభవేత్ = అనుభవమును; ప్రీతిం = ఆనందమును; యస్య = ఎవని; హేతుః = కారణము, చేత; ప్రరోపితః = పోషింపబడెనో
తాత్పర్యం :-
ఎంతబాగా పుష్పించిననూ, పోషించిన అతను కోరు పంటను పండించలేకపోయినచో, అతనికి ఆ మహావృక్షము ఆనందము కలిగించదు. అనగా దాని జీవనము వ్యర్ధము కదా.
2.105.10.అనుష్టుప్.
ఏషోపమా మహాబాహో
తమర్థం వేత్తు మర్హసి।
యది త్వమస్మాన్వృషభో
భర్తా భృత్యాన్న శాధి హి॥
టీకా:-
 ఏషః = ఈ; ఉపమా = పోలిక; మహాబాహుః = మహాబలశాలి; తమ్ = పుణ్యం, ఇతి మోదిని; అర్థం = గూడార్థమును; వేత్తుమ్ = అర్థము చేసుకొనుటకు; అర్హసి = తగి ఉంటివి; యది = ఒకవేళ; త్వమ్ = నీవు; అస్మాన్ = మమ్ములను; వృషభః = గొప్ప; భర్తా = ప్రభువు; భృత్యాన్ = సేవకులు; న = లేదు; శాధి = మార్గదర్శి; హి = కదా
తాత్పర్యం :-
పురుషశ్రేష్ఠుడవైన నీకు పుణ్యం ఉంటుంది ఈ ఉపమాలంకారానికి అంతరార్థం గ్రహించుము. గొప్ప ప్రభువా నీ సేవకులమైన మమ్ములను , నీవు రాజువై ప్రజలనందరను పరిపాలించెదవు అను ఆశతో చిన్ననాటినుండి నిన్ను పెంచిన మన తండ్రియైన దశరథుని శ్రమ వృథాయగును కదా.
2.105.11.
అనుష్టుప్.
శ్రేణయస్త్వాం మహారాజ
పశ్యన్త్వగ్ర్యాశ్చ సర్వశః।
ప్రతపన్తమివాదిత్యం
రాజ్యే స్థితమరిందమమ్॥
టీకా:-
 శ్రేణయః = శ్రేణులు; త్వాం = నిన్ను; మహారాజ = మహారాజు; పశ్యన్త్వ = చూచి; అగ్ర్యా = శ్రేష్టమైన; సర్వశః = అన్ని దిక్కుల; ప్రతపన్తమ్ = ప్రకాశించుచున్న; ఇవ = వలె; ఆదిత్యం = సూర్యుడు; రాజ్యే = సింహాసనముపై; స్థితమ్ = కూర్చున్న; అరిందమమ్ = శత్రుసంహారకుడు
తాత్పర్యం :-
శత్రుసంహారకుడవైన నీవు సూర్యునివలె ప్రకాశించుచు, సింహాసనాసీనుడవై రాజ్యపాలన చేయుచుండగా వర్తక శ్రేణులు, శిల్పిశ్రేణులు మున్నగు ప్రజాశ్రేణులు ఆనందించును గాక.
2.105.12.
అనుష్టుప్.
తవానుయానే కాకుత్స్థ!
మత్తా నర్దన్తు కుంజరాః।
అంతఃపురగతా నార్యో
నందన్తు సుసమాహితాః॥
టీకా:-
 తవ = నీ; అనుయానే = అనుచరులచే; కాకుత్స్థ = కాకుత్స్థవంశజుడా; మత్తా = మదించిన; నర్దన్తు = స్తుతింతబడుగాక; కుంజరాః = ఏనుగులు; అంతఃపురగతా = అంతపురములో ఉండెడు; నార్యః = స్త్రీలు; నందన్తు = ఆనందించెదరుగాక; సుసమాహితాః = చక్కగా మనసుకుదుటబడినవారు.
తాత్పర్యం :-
రామా! నీ అనుచరులు మదగజ ఘీంకారము వంటి ధ్వనితో స్తుతింతురు గాక. అంతఃపుర స్త్రీలు అందరూ సమాహితచిత్తులై ఆనందించెదరు గాక.
2.105.13.
అనుష్టుప్.
తస్య సాధ్విత్యమన్యన్త
నాగరా వివిధా జనాః।
భరతస్య వచశ్శ్రుత్వా
రామం ప్రత్యనుయాచతః॥
టీకా:-
 తస్య = అతని; సాధు = మంచి; ఇతి = ఇది; అమన్యన్త = పొగుడిరి; నాగరాః = నగరవాసులు; వివిధా = వివిధ; జనాః = ప్రజలు; భరతస్య = భరతుని; వచః = మాటలను; శ్రుత్వా = విని; రామంప్రతి = రాముని గూర్చి; అనుయాచతః = ప్రార్థించివ వాడు
తాత్పర్యం :-
భరతుడు రాముని విన్నవించుచు పలికిన మాటలను ఆ నగరవాసులు విని భళీ భళీ అని మెచ్చుకొనిరి
2.105.14.
అనుష్టుప్.
తమేవం దుఃఖితం ప్రేక్ష్య
విలపంతం యశస్వినమ్।
రామః కృతాత్మా భరతం
సమాశ్వాసయదాత్మవాన్॥
టీకా:-
 తమ్ = ఈ; ఏవం = అట్లు; దుఃఖితం = దుఃఖితుడై; ప్రేక్ష్య = చూచి; విలపంతం = విలపించుచున్న; యశస్వినమ్ = కీర్తిమంతుడైన; రామః = రాముడు; కృతాత్మా = సక్రమమైన; భరతం = భరతుడు; సమాశ్వాసయదత్ = ఓదార్చెను; ఆత్మవాన్ = వివేకవంతుడైన
తాత్పర్యం :-
పరాక్రమవంతుడును క్రమశిక్షణాపరుడును ఐన రాముడు దుఃఖముతో విలపించుచున్న కీర్తిశాలి భరతుని ఈ విధముగా ఓదార్చెను
2.105.15.
అనుష్టుప్.
నాఽత్మనః కామకారోఽ స్తి
పురుషోఽ యమనీశ్వరః।
ఇతశ్చేతరతశ్చైనం
కృతాంతః పరికర్షతి॥
టీకా:-
 న = లేదు; ఆత్మనః = తనకు; కామకారః = ఇష్టమైనది చేయువాడు ; అస్తి = ఉండుట; పురుషః = పురుషుడు; అయమ్ = ఈ; అనీశ్వరః = యజమాని కాడు; ఇతః = ఇక్కడ; ఇతరతః = అక్కడ; ఏనం = అతనిని; కృతాంతః = దైవము; పరికర్షతి = లాగుచుండును
తాత్పర్యం :-
ఏ పురుషునకును స్వాతంత్ర్యము గాని, ఇష్టము వచ్చినట్లు చేయు సామర్థ్యము గాని లేదు. దైవము ప్రతి ఒక్కరిని అటునిటు త్రోయుచుండును. విధి బలీయమైనది సుమా.
2.105.16.
అనుష్టుప్.
సర్వే క్షయాంతాః నిచయాః
పతనాంతా సముచ్ఛ్రయాః।
సంయోగా విప్రయోగాంతా
మరణాంతం చ జీవితమ్॥
టీకా:-
 సర్వే = అందరు; క్షయాంతాః = నశించును; నిచయాః = పేరుకుపోయినది; పతనాంతా = పడిపోవును; సముచ్ఛ్రయాః = పెరిగినది; సంయోగా = కలయచు; విప్రయోగాంతాః = విడిపోవుదురు; మరణాంతం = మరణించువరకు; జీవితమ్ = జీవితము
తాత్పర్యం :-
కూడపెట్టినది ఏదైనా నశించక తప్పదు. పెరిగినది ఏదైనా నశించుట తథ్యము. ఎవరైనా జీవితములో మరణించువరకు ఇతరులను కలుస్తుంటారు విడిపోతుంటారు. ఇది సహజము.
2.105.17.
అనుష్టుప్.
యథా ఫలానాం పక్వానాం
నాన్యత్ర పతనాద్భయమ్।
ఏవం నరస్య జాతస్య
నాన్యత్ర మరణాద్భయమ్॥
టీకా:-
 యథా = ఎట్లు; ఫలానాం = ఫలములు; పక్వానాం = పండినవి; న = లేదు; అన్యత్ర = ఇతరములందు; పతనాత్ = పడిపోవుటయందు; భయమ్ = భయము; ఏవం = అట్లే; నరస్య = మానవుని; జాతస్య = జన్మించిన; న = లేదు; అన్యత్ర = ఇతరములయందు; మరణాత్ = మరణమువలన; భయమ్ = భయము
తాత్పర్యం :-
పండిన ఫలములకు రాలిపోవునను భయము తప్ప ఇతర భయములు లేనట్లే, పుట్టిన ప్రతి మానవునకు మరణించునను భయము తప్ప ఇతర భయము లుండవు
2.105.18.
అనుష్టుప్.
యథాఽగారం దృఢస్థూణం
జీర్ణం భూత్వాఽవసీదతి।
తథైవ సీదంతి నరా
జరామృత్యువశం గతాః॥
టీకా:-
 యథా = ఎట్లు; అగారం = భవనము; దృఢః = దృఢమైన; స్థూణం = స్తంభములు; జీర్ణం = శిథిలము; భూత్వా = అగును; అవసీదతి = నశించును; తథైవ = అట్లే; సీదంతి = నశించును; నరా = మానవుడు; జరా = వృద్ధాప్యము; మృత్యు = మృత్యువు; వశం = లోనై; గతాః = పోయినవాడగును.
తాత్పర్యం :-
ఎంత దృఢమైన స్తంభములపై నిర్మింపబడిన భవనము ఐనను, శిథిలమైపోవును కదా. అట్లే మానవుడు సహితము జరామరణములకు లోనై నశించును.
2.105.19.
అనుష్టుప్.
అత్యేతి రజనీ యా తు
సా న ప్రతినివర్తతే।
యాత్యేవ యమునా పూర్ణా
సముద్ర ముదకాకులమ్॥
టీకా:-
 అత్యేతి = గడచిన; రజనీ = రాత్రి; యా = ఏ; సా = ఆ; న = లేదు; ప్రతినివర్తతే = తిరిగి రాదు; యాత్యేవ = సాగిపోవును; యమునా = యమునా నది; పూర్ణా = నిండుగా ఉన్న; సముద్రమ్ = సముద్రము వైపు; ఉదక = జలము; ఆకులమ్ = నిండిపోవును
తాత్పర్యం :-
గడచిన రాత్రి తిరిగి రాదు కదా. యమునానది నిండా ఉన్న ఈ జలము పోయి సముద్రమున కలియును, కాని తిరిగి వెనుకకు రాదు కదా.
2.105.20.
అనుష్టుప్.
అహోరాత్రాణి గచ్ఛంతి
సర్వేషాం ప్రాణినామిహ।
ఆయూంషి క్షపయన్త్యాశు
గ్రీష్మే జలమివాంశవః॥
టీకా:-
 అహః = పగలు; రాత్రాణి = రాత్రులు; గచ్ఛంతి = గడచి పోవును; సర్వేషాం = సకల; ప్రాణినామ్ = ప్రాణులు; ఇహ = ఈ లోకము; ఆయూంషి = జీవితకాలము; క్షపయంతి = క్షీణించుట; ఆశు = వేగముగ; గ్రీష్మే = గ్రీష్మ ఋతువు నందు; జలమ్ = నీరు; ఇవ = వలె; ఆంశవః = సూర్యరశ్మిచే
తాత్పర్యం :-
పగళ్ళు రాత్రుళ్ళు గడిచిపోవుచునే ఉండును. అందువలన సకల జీవుల ఆయుర్దాయము, మండుటెండలలో సూర్యుని కిరణముల తాపముచే నీరు త్వరత్వరగా ఆవిరైపోవునట్లు, తగ్గిపోవుచుండును
2.105.21.
అనుష్టుప్.
ఆత్మానమనుశోచ త్వం
కిమన్యమనుశోచసి।
ఆయుస్తే హీయతే యస్య
స్థితస్య చ గతస్య చ॥
టీకా:-
 ఆత్మానమ్ = నిన్నుగూర్చి; అనుశోచ = చింతించుము; త్వం = నీవు; కిమ్ = ఎందుకు; అన్యమ్ = ఇతర; అనుశోచసి = చింతించుచుంటివి; ఆయుః = ఆయువు; తే = నీ; హీయతే = తగ్గిపోవును; యస్య = యొక్క; స్థితస్య = స్థిరముగ ఉండుట; గతస్య = నడుచుట
తాత్పర్యం :-
ఇతరుల గురించి ఎందుకు చింతించెదవు. నీ గురించే నీవు చింతించుము. ఎందుకనగా, నిలిచి ఉన్నా నడచుచు ఉన్నానీ ఆయుర్జాయము క్షీణించిపోవుచున్నది కదా
2.105.22.
అనుష్టుప్.
సహైవ మృత్యుర్వ్రజతి
సహ మృత్యుర్నిషీదతి।
గత్వాసుదీర్ఘమధ్వానం
సహమృత్యుర్నివర్తతే॥
టీకా:-
 సహైవ = కలసి; మృత్యుః = మృత్యువు; వ్రజతి = వెళ్ళుచున్నది; సహ = కలసి; మృత్యుః = మృత్యువు; నిషీదతి = కూర్చొనును, ఉండును; గత్వా = ప్రయాణము; సుదీర్ఘమ్ = చాల దూరము; అధ్వానం = దూరము; సహ = కలిసి; మృత్యుః = మృత్యువుతో; నివర్తతే = మరలుచుండును.
తాత్పర్యం :-
ఎప్పిటికీ మృత్యువు జీవుని కూడా ఉండును. జీవుడు ఎక్కడికి పోయినను మృత్యువు అతనిని వెంబడించి వెళ్ళు ఉండును. ఎంత ఎంత దూరాలు పోయినా కూడ వేనుకకు వచ్చునప్పుడు సహితము తనతోనే మరలివచ్చును.
2.105.23.
అనుష్టుప్.
గాత్రేషు వలయః ప్రాప్తాః
శ్వేతాశ్చైవ శిరోరుహాః।
జరయా పురుషో జీర్ణః
కిం హి కృత్వా ప్రభావయేత్॥
టీకా:-
 గాత్రేషు = శరీరముపై; వలయః = ముడతలు; ప్రాప్తాః = కలిగి; శ్వేతాః = తెల్లబారుట; చైవ = జరిగినను; శిరోరుహాః = తలవెంట్రుకలు; జరయా = ముసలితనము తో; పురుషః = మానవుడు; జీర్ణః = నశించినవాడు; కిం = ఎట్లు; హి = కదా; కృత్వా = పొంది; ప్రభావయేత్ = వైభవముకలవానిగా.
తాత్పర్యం :-
వయసుతో వెంట్రుకలు నెరిసిపోయి, శరీరము ముడతలుపడును. వృద్ధాప్యమును పొందిన మానవుడు క్షీణించిపోయినవాడు, తిరిగి మునుపటి శోభను ఎట్లు పొందగలడు.
2.105.24.
అనుష్టుప్.
నందన్త్యుదిత ఆదిత్యే
నందన్త్యస్తమితే రవౌ।
ఆత్మనో నావబుద్ధ్యన్తే
మనుష్యా జీవితక్షయమ్॥
టీకా:-
 నందన్త్య = సంతోషించును; ఉదిత = ఉదయించినప్పుడు; ఆదిత్యే = సూర్యుడు; నందన్త్య = సంతోషించును; అస్తమితే = అస్తమించినప్పుడు; రవౌ = సూర్యుడు; ఆత్మనః = వారి; న = లేడు; అవబుద్ధ్యన్తే = తెలుసుకొనుట; మనుష్యా = మానవుడు; జీవితక్షయమ్ = ఆయుక్షీణము
తాత్పర్యం :-
సూర్యుడు ఉదయించినప్పుడు దినచర్య ప్రారంభించుటకును, సూర్యుడు అస్తమించి నప్పుడు విశ్రమించుటకును మానవుడు సంతోషించుచుండును. ఉదయాస్తమయము లతో తన ఆయువు క్షీణించుట మాత్రము ఎఱుగలేడు.
2.105.25.
అనుష్టుప్.
హృష్యన్త్యృతుముఖం దృష్ట్వా
నవం నవమిహాగతమ్।
ఋతూనాం పరివర్తేన
ప్రాణినాం ప్రాణసంక్షయః॥
టీకా:-
 హృష్యన్త్య = సంతోషించును; ఋతుముఖమ్ = ఋతువు ప్రారంభమును; దృష్ట్వా = చూచి; నవనవమ్ = సరికొత్తది; ఇహ = ఇప్పుడు; ఆగతమ్ = వచ్చినది; ఋతూనామ్ = ఋతువులు; పరివర్తేన = మారుట; ప్రాణినాం = ప్రాణులు; ప్రాణసంక్షయః = ఆయుక్షీణము
తాత్పర్యం :-
ఋతువు మారి కొత్త ఋతువు రాగా మానవుడు క్రొత్తక్రొత్త ఋతువు వచ్చింది. క్రొత్తక్రొత్త పుష్పఫలాదులు వస్తాయని సంతోషించును. కాని ఋతువులు మారుటచే జీవులకు ఆయుక్షీణము జరుగుచుండును కదా.
2.105.26.
అనుష్టుప్.
యథా కాష్ఠం చ కాష్ఠం చ
సమేయాతాం మహార్ణవే।
సమేత్య చ వ్యపేయాతాం
కాలమాసాద్య కంచన॥
టీకా:-
 యథా = ఎట్లు; కాష్ఠం = కఱ్ఱ; కాష్ఠం = కఱ్ఱ; సమేయాతాం = కలుసుకొని; మహార్ణవే = మహాసముద్రము నందు; సమేత్య = కలిసి; వ్యపేయాతాం = విడిపోవును; కాలమ్ = సమయము; ఆసాద్య = పొంది; కంచన = ఒకానొక.
తాత్పర్యం :-
మహాసముద్రము నందు కాలానుగుణంగా కఱ్ఱలు కొంత తడవు కలిసి ఉండును. కొంత తడవు తరువాత విడిపోవును కదా.
2.105.27.
అనుష్టుప్.
ఏవం భార్యాశ్చపుత్రాశ్చ
జ్ఞాతయశ్చ ధనాని చ।
సమేత్య వ్యవధావంతి
ధ్రువో హ్యేషాం వినాభవః॥
టీకా:-
 ఏవం = అట్లు; భార్యాః = జీవనసహచరులు; చ = మఱియు; పుత్రాః = పుత్రులు; చ = మఱియు; జ్ఞాతః = బంధువులు; చ = మఱియు; ధనాని = ధనము; చ = మఱియు; సమేత్య = కలిసి; వ్యవధావంతి = విడిపోవును; ధ్రువోహి = నిశ్చయముగ; హి = మాత్రమే; ఏషాం = వీటియొక్క; వినాభవః = విడిపోయినవగుట.
తాత్పర్యం :-
అట్లే జీవనసహచరులు, పుత్రులు, బంధువులు, ఐశ్వర్యము కొంతకాలము కూడియుండి తరువాత కోల్పోవుట నిశ్చయము.
2.105.28.
అనుష్టుప్.
నాత్ర కశ్చిద్యథాభావం
ప్రాణీ సమభివర్తతే।
తేన తస్మిన్న సామర్థ్యం
ప్రేతస్యా స్త్యనుశోచతః॥
టీకా:-
 న = లేదు; అత్ర = అక్కడ; కశ్చిత్ = ఏదైన; యథాభావం = కోరినట్లు; ప్రాణీ = ప్రాణులకు; సమభివర్తతే = ప్రవర్తించుటకు; తేన = అందుచేత; తస్మిన్ = దాని విషయమున; న = లేదు; సామర్థ్యం = చేతనగుట, నేర్పు; ప్రేతస్యాః = మరణించిన; అస్తి = అగుటకు; అనుశోచతః = చింతించువాడు.
తాత్పర్యం :-
జనన మరణ విషయమునందు తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుటకు ఏ ప్రాణికి అవకాశములేదు. మరణించినవానికై శోకించువానికి ఎవరికని అందుచేత ఆ విషయమున సమర్థత లేదు కదా.
2.105.29.
అనుష్టుప్.
యథా హి సార్థం గచ్ఛంతం
బ్రూయాత్కశ్చిత్పథి స్థితః।
అహమప్యాగమిష్యామి
పృష్ఠతో భవతామితి॥
టీకా:-
 యథా = ఎట్లు; హి = కదా; సార్థం = ప్రయాణికులు; గచ్ఛంతం = పోవుచు; బ్రూయాత్ = చెప్పుచు; కశ్చిత్ = ఏమి; పథి = మార్గము నందు; స్థితః = ఆగి ఉన్నవారు; అహమ్ = నేను; అపి = కూడ; ఆగమిష్యామి = వచ్చెదను; పృష్ఠతః = వెనుక; భవతామ్ = మీరు; ఇతి = అని
తాత్పర్యం :-
ప్రయాణించుచున్న బాటసారులకు, వెనుక ఉన్నవాడు “నేనును వచ్చుచుంటిని” అని చెప్పుచున్ననట్లు.
2.105.30.
అనుష్టుప్.
ఏవం పూర్వైర్గతో మార్గః
పితృపైతామహో ధ్రువః।
తమాపన్నః కథం శోచేత్
యస్య నాస్తి వ్యతిక్రమః॥
టీకా:-
 ఏవం = ఇట్లు; పూర్వైః = పూర్వము; గతః = పోయినవారి; మార్గః = మార్గమున; పితృః = తండ్రి; పితామహః = తాత; ధ్రువః = నిశ్చయముగ; తమ్ = దానిని; ఆపన్నః = పొందినవాడు; కథం = ఎట్లు; శోచేత్ = చింతించుట; యస్య = దేని వలన; నాస్తి = లేరను; వ్యతిక్రమః = మరలి వచ్చును
తాత్పర్యం :-
తండ్రి తాత మున్నగు పూర్వజులందరు పోయిన మార్గము అందరికిని తప్పదు కదా. అటువంటప్పుడు ఆ సమయం వచ్చి చనిపోయిన వానికి వెనుకకు వచ్చుట లేదు కదా. ఇంక దానికి ఉన్నవాడు ఎందుకు దుఃఖించాలి.
2.105.31.
అనుష్టుప్.*****
వయసః పతమానస్య
స్రోతసో వాఽ నివర్తినః।
ఆత్మా సుఖే నియోక్తవ్యః
సుఖభాజః ప్రజాః స్మృతాః॥
టీకా:-
 వయసః = వయసు; పతమానస్య = తరిగిపోవుచుండగా; స్రోతసః = ప్రవాహము; వా = మఱియు; అనివర్తినః = తిరిగిరాని; ఆత్మా = తాను; సుఖే = సుఖములను; నియోక్తవ్యః = నియమింపబడిన; సుఖభాజః = సుఖమును అనుభవించవలెను; ప్రజాః = ప్రజలు; స్మృతాః = చెప్పబడినది
తాత్పర్యం :-
నదీ ప్రవాహము వలె కాలము కూడ మరలి రానట్లు, రాజు తన వర్తమాన జీవితమును సుఖముగ ధర్మబద్దముగా అనుభవించుట యందు లగ్నము చేయవలెను. అంత ప్రజలు సుఖముగా నుందురు అని చెప్పబడెను.
2.105.32.
అనుష్టుప్. *****
ధర్మాత్మా స శుభైః కృత్స్నైః
క్రతుభిశ్చాప్తదక్షిణైః।
స్వర్గం దశరథః ప్రాప్తః
పితా నః పృథివీపతిః॥
టీకా:-
 ధర్మాత్మా = ధర్మాత్ముడైన; సః = ఆ; శుభైః = శుభప్రదమైన; కృత్స్నైః = చేసిన; క్రతుభిః = యాగమలు; ఆప్తదక్షిణైః = భూరి దక్షిణలు; స్వర్గం = స్వర్గము; దశరథః = దశరథుడు; ప్రాప్తః = పొందిన; పితా = తండ్రి; నః = లేదు; పృథివీపతిః = రాజు
తాత్పర్యం;
మన ధర్మాత్ముకుడైన తండ్రి దశరథ మహారాజు భూరిదక్షిణలతో యజ్ఞములు చేసి స్వర్గస్తుడయ్యెను.
2.105.33.
అనుష్టుప్.
భృత్యానాం భరణాత్సమ్యక్
ప్రజానాం పరిపాలనాత్।
అర్థాదానాచ్చ ధర్మేణ
పితా న స్త్రిదివఙ్గతః॥
టీకా:-
 భృత్యానాం = సేవకులు; భరణాత్ = పోషణ; సమ్యక్ = మంచిగ; ప్రజానాం = విషయములను; పరిపాలనాత్ = రక్షణ; అర్థ = పన్నులు; ఆదానాత్ = ఆదాయము; చ = మఱియు; చ = మఱియు; ధర్మేణ = ధర్మబద్దముగ; పితాః = తండ్రి; త్రిదివం = స్వర్గము; గతః = వెళ్ళెను
తాత్పర్యం :-
మన తండ్రి ప్రజాపరిపాలన సేవకులను పోషించుట చక్కగా చేసెను. ధర్మబద్ధముగా ధన సంపాదన చేసెను. కనుక స్వర్గముకు వెళ్ళెను.
2.105.34.
అనుష్టుప్.
కర్మభిస్తు శుభైరిష్టైః
క్రతుభిశ్చాప్తదక్షిణైః।
స్వర్గం దశరథః ప్రాప్తః
పితా నః పృథివీపతిః॥
టీకా:-
 కర్మభిః = కర్మలు; తు = ఐతే; శుభైః = శుభప్రదమైన; ఇష్టైః = ఇష్టపూర్తములు; క్రతుభిః = క్రతువులు; ఆప్తదక్షిణైః = భూరిదక్షిణలు; స్వర్గం = స్వర్గము; దశరథః = దశరథుడు; ప్రాప్తః = పొందెను; పితా = తండ్రి; నః = మన; పృథివీపతిః = రాజు
తాత్పర్యం :-
భూరిదక్షిణలు ఇచ్చి అనేక యజ్ఞములు చేసెను. శుభప్రదమైన కర్మలను చేయుచు నందువలన మన తండ్రి, మన ప్రభువు ఐన దశరథమహారాజు స్వర్గము పొందెను.
*గమనిక:-
 ఇష్టాపూర్తములు- అగ్నిహోత్రాది కర్మలు ఇష్టులు, వాపీకూప తటాకములు ఆరామ దేవాలయ నిర్మాణాలు పూర్తములు. వావిళ్ళ నిఘంటువు. కోరిచేసేవి ఇష్టములు. జలము మున్నగు వనరులు, ప్రజల ధర్మపాలనుకు, విశాంతికి వంటివి నిరమించుట పూర్తములు పూర్తి శుభకర కార్యములు.
2.105.35.
అనుష్టుప్.
ఇష్ట్వా బహువిధైర్యజ్ఞైః
భోగాంశ్చావాప్య పుష్కలాన్।
ఉత్తమం చాయురాసాద్య
స్వర్గతః పృథివీపతిః॥
టీకా:-
 ఇష్ట్వా = యజించి; బహువిధైః = బహువిధములైన; యజ్ఞైః = యజ్ఞములు; భోగాన్ = భోగములను; చ = మఱియు; అవాప్య = అనుభవించి; పుష్కలాన్ = పుష్కలముగ; ఉత్తమమ్ = ఉత్తమమైన; చ = మఱియు; ఆయుః = దీర్ఘాయువు; ఆసాద్య = పొంది; స్వర్ గతః = స్వర్గమును పొందెను; పృథివీపతిః = రాజు
తాత్పర్యం :-
చాల యజ్ఞములను యజించి గొప్ప భోగములను అనుభవించెను. మన తండ్రి దశరథుడు దీర్ఘాయువును పొంది స్వర్గస్తుడయ్యెను
2.105.36.
అనుష్టుప్.
ఆయురుత్తమమాసాద్య
భోగానపి చ రాఘవః।
స న శోచ్యః పితా తాత
స్వర్గతస్సత్కృతస్సతామ్॥
టీకా:-
 ఆయుః = ఆయువు; ఉత్తమమ్ = గొప్ప; ఆసాద్య = పొంది; భోగాన్ = భోగములను; అపి = కూడ; రాఘవః = మహాశక్తిశాలి ఎందును తక్కువకాని వాడు, దశరథుడు; సః = ఆ; న = లేదు; శోచ్యః = చింతించుట; పితా = తండ్రి; తాత = ఓ నాయనా; స్వర్గతః = స్వర్గస్తుడయ్యెను; సత్కృతః = గౌరవింపబడెను; సతామ్ = ఉత్తములచే
తాత్పర్యం :-
నాయనా! మన తండ్రి ఐన దశరథమహారాజు రఘువంశోత్తముడు, మహాశక్తిశాలి ఎందును తక్కువకాని వాడు. గొప్ప భోగములను అనుభవించి, ఉత్తమ పురుషులచే గౌరవింపబడి. స్వర్గస్తుడాయెను కావున చింతింప పనిలేదు.
*గమనిక:-
 రాఘవుడు- 1. రఘువంశీయుడు. 2. రఘః, ఉత్పత్తి. శక్తౌ భావా. అక సేట్, రాఘతే అరాఘిష్ట. ఋదిత్ చంఙ న హ్రస్వః. వాచస్పతము. శక్తౌ ఇతి కవికల్పదృమః. శక్తిః సామర్థ్యమ్ ఇతి దుర్గాదాస్. రాఘవ. రఘవోగోత్రాపత్యమ్ అణ్. శక్తిభావము నందు ఎవరికిని తక్కువ కానివాడు, మిక్కిలి శక్తిమంతుడు, మంచి సమర్థుడు.
2.105.37.
అనుష్టుప్.
స జీర్ణం మానుషం దేహం
పరిత్యజ్య పితా హి నః।
దైవీమృద్ధిమనుప్రాప్తో
బ్రహ్మలోకవిహారిణీమ్॥
టీకా:-
 సః = ఆ; జీర్ణం = నశించినట్టిది; మానుషం = మానవ; దేహం = శరీరము; పరిత్యజ్య = విడిచి; పితా = తండ్రి; హి = కదా; నః = మన; దైవీమ్ = దివ్యమైన; ఋద్ధిమ్ = గొప్ప; అనుప్రాప్తః = పొందెను; బ్రహ్మలోకవిహారిణీమ్ = బ్రహ్మలోకమునందు సంచరించువాడగుటను
తాత్పర్యం :-
మన తండ్రి తన మానవ శరీరము జీర్ణించి పోవుచుండుటచే దానిని విడిచిపెట్టెను. బ్రహ్మలోకమున సంచరించగల దివ్యత్వమును పొందెను.
2.105.38.
అనుష్టుప్.
తం తు నైవంవిధః కశ్చిత్
ప్రాజ్ఞః శోచితుమర్హతి।
త్వద్విధో మద్విధశ్చాపి
శ్రుతవాన్బుద్ధిమత్తరః॥
టీకా:-
 తమ్ = అతనిని గూర్చి; న = లేదు; ఏవం = ఈ; విధః = విధముగ; కశ్చిత్ = ఎట్లైన; ప్రాజ్ఞః = ప్రఙ్ఞగలవాడు; శోచితుమ్ = దుఃఖించుట; అర్హతి = తగు; తత్ = నీ; విధః = వలె; మత్ = నా; విధః = వలె; చాపి = కూడ; శ్రుతవాన్ = బహుశాస్త్రజ్ఞానము కలవాడు; బుద్ధిమత్తరః = మిక్కిలి బుద్ధిమంతుడు
తాత్పర్యం :-
వారిని గురించి ఏవిధముగా చూచినను ప్రఙ్ఞగలవాడు దుఃఖించుటకు తగదు. నీవంటి వారి నావంటి వారి కంటెను మిక్కిలి బుద్ధిమంతుడు, బహు శాస్త్ర జ్ఞానము కలవాడు మన తండ్రి.
*గమనిక:-
 బుద్ధిమతః- బుద్ధిమత్తరః- బుద్ధిమత్తమమ్. (తరతమ బేధములు)
2.105.39.s
అనుష్టుప్.
ఏతే బహువిధాః శోకా
విలాపరుదితే తథా।
వర్జనీయా హి ధీరేణ
సర్వావస్థాసు ధీమతా॥
టీకా:-
 ఏతే = ఇట్టి; బహు = అనేక; విధాః = విధములైన; శోకా = ఇష్టవియోగానుచింతనమ్; విలాప = దుఖముతో ప్రలాపించుట; రుదితే = ఏడ్చుట; తథా = మఱియు; వర్జనీయా = విడువ దగినది; హి = కదా; ధీరేణ = ధైర్యము, స్వాతంత్ర్యము కలవాడు; సర్వావస్థాసు = దీనావస్థల యందు; ధీమతా = బుద్ధిశాలులు
తాత్పర్యం :-
ఇట్టి అనేక విధముల ఏడ్చుచు విలపించుచు శోకించుట ధీరులైనవారూ బుద్ధిశాలులకు ఎటువంటి దీనావస్థలయందైనను విడువదగినది కదా.
2.105.40.
అనుష్టుప్.
స స్వస్థో భవ మా శోచేః
యాత్వా చావసతాం పురీమ్।
తథా పిత్రా నియుక్తోఽ సి
వశినా వదతాంవరః॥
టీకా:-
 స = నీవు; స్వస్థః = ప్రశాంతతపొందినవాడవు; భవ = అగుము; మా = వలదు; శోచేః = శోకముతో; యాత్వా = వెళ్ళి; చ = మఱియు; ఆవస = నివసింపుము; తాం = నీవు; పురీమ్ = అయోధ్యానగరమునకు; తథా = అట్లు; పిత్రా = తండ్రి యొక్క; నియుక్తః = ఆజ్ఞనుబద్దుడవు; అసి = ఉన్నావు; వశినా = ఇంద్రియనిగ్రహము కలవాడు; వదతాంవరః = సంభాషణానైపుణ్యము గలవాడా
తాత్పర్యం :-
సంభాషణానైపుణ్యముగల భరతుడా! నీవు శోకించవలదు స్వస్థుడవు కమ్ము. అయోధ్యకు వెళ్ళి వసింపుము. ఇంద్రియనిగ్రహము కలవాడైన మన తండ్రి గారిచే అట్లే ఆజ్ఞానుబద్దుడవు ఐతివి.
2.105.41.
అనుష్టుప్.
యత్రాహమపి తేనైవ
నియుక్తః పుణ్యకర్మణా।
తత్రైవాహం కరిష్యామి
పితురార్యస్య శాసనమ్॥
టీకా:-
 యత్ర = ఎట్లు; అహమ్ = నేను; అపి = కూడ; తేన = అతని వలన; ఏవ = మాత్రమే; నియుక్తః = ఆజ్ఞాబద్దుడను; పుణ్యకర్మణా = పుణ్య కర్మలుకలవాడైన; తత్ర ఏవ = అట్లు; ఏవ = మాత్రమే; అహం = నేను; కరిష్యామి = చేసెదను; పితుః = తండ్రి; ఆర్యస్య = కులీనుడు న్యాయశీలుడు సాధువు; శాసనమ్ = ఆజ్ఞ
తాత్పర్యం :-
పుణ్యకర్మశీలుడు న్యాయశీలుడు నగు తండ్రిచేత నేను ఎట్లైతే ఆజ్ఞాపించబడితినో అట్లే నేను సైతము ప్రవర్తించెదను
2.105.42.
అనుష్టుప్.
న మయా శాసనం తస్య
త్యక్తుం న్యాయ్యమరిందమ!।
తత్త్వయాఽ పి సదా మాన్యం
స వై బంధుః స నః పితా॥
టీకా:-
 న = కాదు; మయా = నాచే; శాసనం = ఆజ్ఞ; తస్య = అతని; త్యక్తుం = వదిలి వేయుట; న్యాయ్యమ్ = న్యాయబద్ధము; అరిందమ = అరిడ్వర్గములు అణచువాడ; తత్ = ఆ; త్వయ = నీ వలన; అపి = కూడ; సదా = ఎల్లప్పుడు; మాన్యమ్ = మన్నింపదగివాడు; సః = అతడు; వై = కదా, అనునయార్థము; బంధుః = భర్త, సర్వశబ్దసంబోధిని; సః = అతడు; నః = మనకు; పితా = తండ్రి
తాత్పర్యం :-
కామ క్రోదాదులను అణచిన భరతా! మన తండ్రి ఆజ్ఞ నాచే వమ్ము చేయబడుట న్యాయసమ్మతము కాదు కదా. మన తండ్రి అతడే కదా మన భర్త. నీ చేత కూడ సర్వదా గౌరవింపదగినవాడు కదా.
*గమనిక:-
 అరిందమః- అరిమ్- అంతశ్శత్రువులగు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను ఆఱింటి సముదాయమును, దమః నిగ్రహించుకున్నవాడు.
2.105.43
అనుష్టుప్.
తద్వచః పితురేవాహం
సమ్మతం ధర్మచారిణః।
కర్మణా పాలయిష్యామి
వనవాసేన రాఘవ॥
టీకా:-
 తత్ = అందువలన; వచః = మాట; పితుః ఏవ = తండ్రి; ఏవం = మాత్రమే; అహమ్ = నేను; సమ్మతం = ఒప్పిదమైనది; ధర్మచారిణః = ధర్మపరాయణుడు; కర్మణా = ప్రవర్తనచే; పాలయిష్యామి = పాలించుట; వనవాసేన = వనవాసముచే; రాఘవ = భరతా
తాత్పర్యం :-
శక్తిమంతుడు సమర్దుడగు భరతుడా! అందువలన ధర్మపరాయణుడను ఐన నేను తండ్రి ఆజ్ఞనే వనవాసము చేయుట ద్వారా పాలించెదను.
2.105.44.
అనుష్టుప్.
ధార్మికేణానృశంసేన
నరేణ గురువర్తినా।
భవితవ్యం నరవ్యాఘ్ర!
పరలోకం జిగీషతా॥
టీకా:-
 ధార్మికేణా = ధార్మికత్వములు; అనృశంసేన = క్రూరత్వము లేకపోవుట; నరేణ = నృపునికి, క్షత్రియులకి, కాకీశీనాథ పాండురంగ ప్రబ, వాల్మీకి రామాయణ; గురువర్తినా = ఏలికగా వర్తించువానికి, ఆంధ్రశబ్దరత్నాకరము; భవితవ్యం = ఉండదగినవి; నరవ్యాఘ్ర = పురుష సింహమా; పరలోకమ్ = ఉన్నతలోకముసు; జిగీషతా = గెల్వనిచ్చ, సాధించవలెనను కోరిక
తాత్పర్యం :-
పురుషసింహా భరతా! ఏలికగా వర్తించు క్షత్రియులకు ధార్మికత్వము, అక్రూరత్వము, ఉన్నతలోకములను ఆకాంక్షించుట కలిగి ఉండదగినవి
2.105.45.
అనుష్టుప్.
ఆత్మానమనుతిష్ఠత్వం
స్వభావేన నరర్షభ।
నిశామ్యతు శుభం వృత్తం
పితుర్దశరథస్య నః”॥
టీకా:-
 ఆత్మానమ్ = స్వయముగా; అనుతిష్ఠ = ఆచరింపుము; త్వం = నీవు; స్వభావేన = స్వభావికముగ; నరర్షభ = పురుష శ్రేష్ఠుడు; నిశామ్య = చూసితివి; తు = కదా; శుభమ్ = శుభకరమైన; వృత్తం = ప్రవర్తన; పితుః = తండ్రి; దశరథస్య = దశరథుని; నః = మన
తాత్పర్యం :-
పురుషశ్రేష్టుడవైన భరతుడా! నీవు స్వభావికముగా స్వయముగా ఆచరింపుము. మన తండ్రి ఐన దశరథుని యొక్క శుభకరమైన ప్రవర్తన తెలిసినవాడవే కదా.”
2.105.46.
జగతి.
ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా
పితుర్నిదేశ ప్రతిపాలనార్థమ్।
యవీయసం భ్రాతరమర్థవచ్చ
ప్రభుర్ముహూర్తాద్విరరామ రామః॥
టీకా:-
 ఇత్యేవమ్ = ఈ విధముగ; ఉక్త్వా = పలికి; వచనం = మాటను; మహాత్మా = మహాత్ముడైన; పితుర్నిదేశ = తండ్రి ఆజ్ఞను; ప్రతిపాలనార్థమ్ = పాలించుటకు; యవీయసం = చిన్న; భ్రాతరమ్ = సోదరుని; అర్థవచ్చ = అర్థవంతము పలికి; ప్రభుః = ప్రభువు; ముహూర్తత్ = పన్నెడు క్షణములపాటు, పన్నెండు సెకనులో ఐదింట నాలుగు వంతు, 15 సెకన్లపాటు, కొద్ది సమయము; విరరామ = మౌనమువహించెను; రామః = రాముడు
తాత్పర్యం :-
తన తమ్ముడు తండ్రి ఆజ్ఞను పాలించవలెనని రాముడు భరతునితో ఈ విధముగా పలికి, కొద్ది సమయము మౌనము వహించెను.
2.105.47.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే అథః పంచోత్తరశతతమ సర్గః॥
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; పంచోత్తరశతతమః [105] = నూటఐదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [105] నూటఐదవ సర్గ సంపూర్ణము.
2.106.1.
అనుష్టుప్.
ఏవముక్త్వా తు విరతే
రామే వచనమర్థవత్।
తతో మందాకినీతీరే
రామం ప్రకృతివత్సలమ్॥
టీక:-
ఏవం = ఈ విధముగా; ఉక్త్వా = చెప్పి; తు = వెంటనే; విరతే = విరమించిన వాడగుచుండగ; రామే = రాముడు; వచనమ్ = మాటను; అర్థవత్ = అర్థవంతమైన; తతః = తరువాత; మందాకినీ = గంగానది; తీరే = తీరములో; రామమ్ = రామునిగూర్చి; ప్రకృతి = పౌరవర్గము, 5 వావిళ్ళనిఘంటువు; వత్సలమ్ = వాత్సల్యము కలవాడైన.
భావము:-
ఈ విధముగా అర్థవంతమైన మాట చెప్పి రాముడు మౌనము వహించిన వెంటనే, పురజనులయెడ పుత్రప్రేమ కలిగిన రామునితో మందాకినీ తీరమునందు.
*గమనిక:-
1. మందాకినీ- గంగానది, మెల్లగా కుటిల గమనముచే ప్రవహించునది అని వ్యుత్పత్తి. 2. ప్రకృతి- స్వామ్యాదిసప్తకము, 1. స్వామి, 2. అమాత్యుఁడు, 3. సుహృత్తు, 4. కోశము, 5. రాష్ట్రము, 6. దుర్గము, 7. బలము.
2.106.2.
అనుష్టుప్.
ఉవాచ భరతశ్చిత్రం
ధార్మికో ధార్మికం వచః।
“కో హి స్యాదీదృశో లోకే
యాదృశస్త్వమరిన్దమ॥
టీక:-
ఉవాచ = చెప్పెను; భరతః = భరతుడు; చిత్రమ్ = ఆశ్చర్యకరమైన; ధార్మికః = ధర్మమును పాలించెడివాడైన; ధార్మికమ్ = ధర్మమయమైన; వచః = మాటను; కః = ఎవరు; హి = నిజముగా; స్యాత్ = ఉందురు; ఈదృశః = ఇటువంటివాడు; లోకే = లోకములో; యాదృశః = ఎటువంటివాడవో; త్వమ్ = నీవు; అరిందమ = శత్రువులను అణచువాడా!
భావము:-
ధార్మికుడైన (ధర్మపాలకుడైన) భరతుడు ఆశ్చర్యకరమైన పలుకులతో ధర్మముగురించి చెప్పెను. “ఓ అరిందమా! ఈ లోకమునందు నీ వంటివారు బహుశా ఎవ్వరును ఉండియుండరు.
2.106.3.
అనుష్టుప్.
న త్వాం ప్రవ్యథయేద్దుఃఖం
ప్రీతిర్వా న ప్రహర్షయేత్।
సమ్మతశ్చాసి వృద్ధానాం
తాంశ్చ పృచ్ఛసి సంశయాన్॥
టీక:-
న = (వ్యతిరేక భావము; క్రియకు అన్వయించుకోవాలి); త్వామ్ = నిన్ను; ప్రవ్యథయేత్ = బాధింపదు; దుఃఖం = దుఃఖము; ప్రీతిః = ఆనందము; వా = గానీ; న ప్రహర్షయేత్ = ఉల్లాసపరచదు; సమ్మతః = అంగీకరింపబడినవాడవు; చ = మఱియు; అసి = అయియుంటివి; వృద్దానామ్ = వృద్ధులచే (జ్ఞానులచే); తాన్ = వారిని; చ = కూడా; పృచ్ఛసి = అడిగెదవు; సంశయాన్ = సందేహములను
భావము:-
దుఃఖము నిన్ను బాధించదు, ఆనందము కూడ నిన్ను అధికముగా ఉల్లాసపరచదు. నీవు వేదములు తెలిసిన జ్ఞానుల మెప్పు పొందినవాడవు. అయినను నీ సందేహములను తీర్చుకొనుటకై వారిని సంప్రదించెదవు.
2.106.4.
అనుష్టుప్.
యథా మృతస్తథా జీవన్
యథాఽసతి తథా సతి।
యస్యైష బుద్ధిలాభస్స్యాత్
పరితప్యేత కేన సః॥
టీక:-
యథా = ఎటులో; మృతః = మరణించినవాడు; తథా = అదే విధముగా; జీవన్ = బ్రతికి ఉన్నవాడు; యథా = ఎటులో; అసతి = చెడ్డది; తథా = అటులే; సతి = మంచిది; యస్య = ఎవరికి; ఏషః = ఇది; బుద్ధిలాభః = జ్ఞానముయొక్క లాభము; స్యాత్ = అగునో; పరితప్యేత = బాధపడునా; కేన = దేనివలననైనా; సః = అతడు
భావము:-
మరణించినవానిని కాని, బ్రతికి ఉన్నవాడిని గాని, మంచిని కాని, చెడుని గాని, ఒకే విధముగా చూడగలిగిన జ్ఞానము ఎవనికైన లభించినచో, యిక అతడు దేనివలననూ బాధించబబడడు.
2.106.5.
అనుష్టుప్.
పరావరజ్ఞో యశ్చస్యాత్
యథా త్వం మనుజాధిప।
స ఏవం వ్యసనం ప్రాప్య
న విషీదితుమర్హతి॥
టీక:-
పరావరజ్ఞః = గతము భవిష్యత్తులను తెలిసినవాడు; యః = ఎవడు; చ = కూడ; స్యాత్ = ఉండునో; యథా = ఏ విధముగా ; త్వం = నీవు; మనుజాధిప = ఓ రాజా; సః = అతడు; ఏవం = ఇటువంటి; వ్యసనం = కష్టమును; ప్రాప్య = పొంది; న = (వ్యతిరేక భావము; క్రియకు అన్వయించుకోవాలి); విషీదితుమ్ = బాధపడుటకు; అర్హతి = తగినవాడు
భావము:-
ఓ రాజా! నీవంటి పరమార్థమును తెలిసినవాడు, భూత-భవిష్యత్తులు తెలిసినవాడు ఎవడు గలడో వానికి ఇటువంటి కష్టము (రాజ్యబహిష్కరణ) కలుగకూడదు.
2.106.6.
అనుష్టుప్.
అమరోపమసత్త్వస్త్వం
మహాత్మా సత్యసంగరః।
సర్వజ్ఞస్సర్వదర్శీ చ
బుద్ధిమాంశ్చాసి రాఘవ!॥
టీక:-
అమర = దేవతలతో; ఉపమ = సమానమైన; సత్త్వః = బల సామర్థ్యములు కలవాడవు; త్వం = నీవు; మహాత్మా = ఓ మహాత్మా; సత్యసంగరః = ఇచ్చిన మాటపై నిలబడువాడవు, విలియమ్-మోనియర్; సర్వజ్ఞః = సమస్త విషయములను తెలిసినవాడవు; సర్వదర్శీ = సకలము సమభావనతో చూచువాడవు, వాచస్పతము.; చ = మఱియు; బుద్ధిమాన్ = బుద్ధిగలవాడు, జ్ఞానముకలవాడవు; చ = మఱియు; అసి = ఉంటివి; రాఘవ = ఓ రాఘవా (రామా)!
భావము:-
ఓ మహాత్మా, రాఘవా! నీవు దేవతలతో సమానమైన బలసామర్థ్యములు గలవాడవు, ఇచ్చినమాటపైనిలబడువాడవు, సమస్త విషయములను తెలిసినవాడవు, బుద్ధి జ్ఞానములు కలవాడవు.
2.106.7.s
అనుష్టుప్.
న త్వామేవం గుణైర్యుక్తం
ప్రభవాభవకోవిదమ్।
అవిషహ్యతమం దుఃఖమ్
ఆసాదయితుమర్హతి॥
టీక:-
న = (వ్యతిరేక భావము; క్రియకు అన్వయించుకోవాలి); త్వాం = నిన్ను; ఏవం = ఇటువంటి; గుణైః-యుక్తం = గొప్ప గుణములతో కూడిన వాడివి; ప్రభవ = సృష్టి; అభవ = వినాశము; కోవిదః = పండితుడవు; (ప్రభవాభవకోవిదమ్ = సృష్టి–లయ తత్త్వములు తెలిసిన పండితుడవైన నిన్ను); అవిషహ్యతమమ్ = అత్యధికసహింపశక్యము గాని; దుఃఖమ్ = దుఃఖము; ఆసాదయితుం = పొందుటకు ; అర్హతి = తగినది
భావము:-
ఇంతటి గుణసంపన్నుడవైన, సృష్టి–లయ తత్త్వములను బాగుగా తెలిసిన నీకు, అలవిమాలిన దుఃఖము కలుగుట న్యాయము కాదు.
*గమనిక:-
అవిషహ్యమ్- అవిషహ్యతరమ్- అవిషహ్యతమమ్
2.106.8.
అనుష్టుప్.
ప్రోషితే మయి యత్పాపం
మాత్రా మత్కారణాత్కృతమ్।
క్షుద్రయా తదనిష్టం మే
ప్రసీదతు భవాన్మమ॥
టీక:-
ప్రోషితే = దేశాంతరగతుడనైన (నేను ఊరిలో లేనప్పుడు); మయి = నేను; యత్ = ఏ; పాపము = పాపము; మాత్రా = తల్లిచేత (తల్లి సమానురాలైన మందర చేత అని మరొక అర్థము కూడా పెద్దలు చెప్పిరి); మత్-కారణాత్ = నా కొరకు ; కృతమ్ = చేయబడినదో; క్షుద్రయా = నీచమైనదానిచే; తత్ = అది; అనిష్టం = ఇష్టములేనిది; మే = నాకు; ప్రసీదతు = అనుగ్రహించెదవుగాక; భవాన్ = మీరు; మమ = నాయొక్క
భావము:-
నేను ఊరిలో లేనప్పుడు, నా ప్రయోజనమునకై కపటముతో మా అమ్మచే చేయబడిన, నాకు ఇష్టము కాని పాపమును, మీరు క్షమించి నన్ను అనుగ్రహించవలెను.
2.106.9.
అనుష్టుప్.
ధర్మబంధేన బద్ధోఽస్మి
తేనేమాం నేహ మాతరమ్।
హన్మితీవ్రేణ దండేన
దండార్హాం పాపకారిణీమ్॥
టీక:-
ధర్మబంధేన = ధర్మబంధనముతో; బద్ధః = బంధితుడను; అస్మి = అయిఉంటిని; తేన = అందుచే; ఇమాం = ఈ; న = (వ్యతిరేక అర్థము; క్రియకు అన్వయించాలి); ఇహ = ఇక్కడ; మాతరమ్ = తల్లిని; హన్మి = చంపెదను; తీవ్రేణ = తీవ్రమైన; దండేన = శిక్షతో; దండార్హాం = శిక్షకు అర్హురాలైన; పాపకారిణీమ్ = పాపము చేసినదానిని
భావము:-
నేను ధర్మమునకు (స్త్రీలను చంపరాదను ధర్మమునకు) కట్టుబడి ఉండుటచే పాపము చేసి శిక్షార్హురాలైన మా తల్లిని తీవ్ర దండనముతో చంపజాలను.
2.106.10.
అనుష్టుప్.
కథం దశరథాజ్జాతః
శుద్ధాభిజనకర్మణః।
జానన్ ధర్మమధర్మిష్ఠం
కుర్యాం కర్మ జుగుప్సితమ్॥
టీక:-
కథం = ఎట్లు; దశరథాత్ = దశరథునినుండి; జాతః = జన్మించిన; శుద్ధ = నిర్మలమైన; అభిజన = వంశము; కర్మణః = కర్మలు గల (శుద్ధ-అభిజన-కర్మణః = మంచి కర్మలు చేయు వంశపరంపర కలవానినుంచి); జానన్ = తెలిసినవాడను; ధర్మం = ధర్మమును; అధర్మిష్ఠం = అధర్మమును; కుర్యాం = చేయగలను; కర్మ = కార్యమును; జుగుప్సితమ్ = నీచమైన
భావము:-
గొప్ప వంశకీర్తి గల ధశరథునకు పుట్టి, ధర్మము తెలిసినవాడనై, నేను ఇటువంటి నీచమైన కార్యమును ఎట్లు చేయగలను?
2.106.11.
అనుష్టుప్.
గురుః క్రియావాన్వృద్ధశ్చ
రాజా ప్రేతః పితేతిచ।
తాతం న పరిగర్హేయం
దైవతం చేతి సంసది॥
టీక:-
గురుః = గురువు; క్రియావాన్ = కార్యశీలుడు (యజ్ఞాది కార్యములు చేయుటలో కార్యశీలుడు); వృద్ధః = అధికుడు (జ్ఞానములోను; వయస్సులోను అధికుడు); చ = మఱియు; రాజా = రాజు; ప్రేతః = మరణించినవాడు; పితా = తండ్రి; ఇతి = అయినందువలన; చ = మఱియు; తాతమ్ = తండ్రిని; న = కూడదు; పరిగర్హే = ధిక్కరించ; అయం = ఇతను; దైవతం = దైవసమానుడు; చ = కూడ; ఇతి = అందుచే; సంసది = సభలో
భావము:-
యజ్ఞాది కార్యములలో క్రియాశీలుడు, అధికుడైన మన తండ్రి గురుసమానుడు, రాజు. ఇపుడు మరణించి పితృదేవుడయ్యెను. అటువంటి దైవసమానుడైన తండ్రిమాటను నేను సభలో ధిక్కరించకూడదు.
2.106.12.
అనుష్టుప్.
కో హి ధర్మార్థయోర్హీనమ్
ఈదృశం కర్మ కిల్బిషమ్।
స్త్రియాః ప్రియం చికీర్షుస్సన్
కుర్యాత్? ధర్మజ్ఞ! ధర్మవిత్॥
టీక:-
కః = ఎవరు; హి = ఐననూ; ధర్మార్థయోః = ధర్మము అర్థము ఈ రెంటిలో; హీనం = అధమమైనది (ధర్మార్థములలో తక్కువది); ఈదృశం = ఇటువంటి; కర్మ = కార్యము; కిల్బిషమ్ = పాపమును; స్త్రియాః = భార్యకు; ప్రియం = ఇష్టము; చికీర్షుః = చేయగోరువాడు; సన్ = అయిఉండి; కుర్యాత్ = చేయునా; ధర్మజ్ఞ = ధర్మము తెలిసినవాడా; ధర్మవిత్ = ధర్మము తెలిసినవాడు
భావము:-
ఓ ధర్మజ్ఞ రామా! ధర్మము తెలిసినవాడు ఎవడైనను భార్యను సంతోషపెట్టుటకై ఇటువంటి ధర్మార్థములలో హీనమైన పాపకర్మ (అర్హుడైన పెద్దకొడుకుకు రాజ్యాభిషేకము నిరాకరించి అడవులకు పంపుట) చేయునా?
*గమనిక:-
ధర్మవిత్- ధర్మవిత్తు, పండితుడు, ధర్మము తెలిసినవాడు, వ్యుత్పత్తి, ధర్మంవేత్తి- ధర్మ+ విద+ క్విప్, కృప్ర. ధర్మము తెలిసినవాడు. ఆంధ్రశబ్దరత్నాకరము. అసంబద్దమైన స్త్రీ కోరిక అంగీకరించుట, అర్హుడైన పెద్దకొడుకునకు రాజ్యాభిషేకము నిరాకరించి అడవులకు పంపుట ధర్మార్థములలో అధమమైనవి. 1. పెద్ద కొడుకు రాజ్యాధికారం ఆపుట ధర్మంలో అధమము, 2. ఆ సకల సమర్థుని రాజ్యాధికారమునకు దూరము చేయటచే, రాజ్యాన్ని సమర్థంగా నిర్వహించ వలెనను అర్థం / ప్రయోజనము కుంటుపడును కనుక అర్థంలో అధమము.
2.106.13.
అనుష్టుప్.
అన్తకాలే హి భూతాని
ముహ్యన్తీతి పురా శ్రుతిః।
రాజ్ఞైవం కుర్వతా లోకే
ప్రత్యక్షం సా శ్రుతిః కృతా॥
టీక:-
అంతకాలే = మరణ సమయమున; హి = నిజముగా; భూతాని = ప్రాణులు; ముహ్యంతి = మోహము పొందుదురు ; ఇతి = అని; పురా = పూర్వమునుండి; శ్రుతిః = వినికిడి, ధర్మము; రాజ్ఞా = రాజుచేత; ఏవం = ఈ విధముగా; కుర్వతా = చేయబడి; లోకే = లోకములో; ప్రత్యక్షం = ప్రత్యక్షముగా; సా = ఆ; శ్రుతి = వినికిడి; కృతా = చేయబడినది
భావము:-
‘మరణము దగ్గరపడినప్పుడు ప్రాణులు మోహములో పడి విచక్షణ కోల్పోయి ప్రవర్తించును’ అని పూర్వమునుండి వినికిడి. రాజు ఇట్లు ప్రవర్తించుట ఆ మాట ప్రత్యక్షముగా నిరూపించుట అగును.
*గమనిక:-
శ్రుతి- పూర్వము నుండి వినబడుచుండునది. కాలపరీక్షలో నెగ్గినది, నమ్మదగినదే. గణనాధ్యాయి.
2.106.14.
అనుష్టుప్.
సాధ్వర్థమభిసంధాయ
క్రోధాన్మోహాచ్చ సాహసాత్।
తాతస్య యదతిక్రాంతం
ప్రత్యాహరతు తద్భవాన్॥
టీక:-
సాధు = చక్కని; అర్థం = న్యాయము; అభిసంధాయ = ఆలోచించి, అనుసంధించి; క్రోధాత్ = కోపమువలన (ఇప్పుడే విషము త్రాగెదనని కోపించిన కైకేయి వలన); మోహాత్ = మోహమువలన (కైకేయి మీద మోహమువలన); చ = మఱియు; సాహసాత్ = ఉద్రేకమువలన; తాతస్య = తండ్రియొక్క; యత్ = ఏదైతే; అతిక్రాంతం = మితిమీరబడినదో; ప్రతి ఆహరతు = మరల్చెదవు; తత్ = దానిని; భవాన్ = మీరు
భావము:-
ఇప్పుడే విషము త్రాగెదననిన కైకేయీ కోపమువలన కోపమువలన, కైకేయీ మీద మోహము వలన మోహమువలన, తన ఉద్రేకమువలన, తండ్రిచేసిన ధర్మాతిక్రణకు మీరు, మంచిచెడులు బాగుగా ఆలోచించి అనుసంధానించి పరిష్కారము చేసెదరు గాక.
*గమనిక:-
వాతెరా- 2.12.47.అనుష్టుప్. । అహం హి విషమద్యైవ పీత్వా బహు తవాగ్రతః। పశ్యతస్తే మరిష్యామి రామో యద్యభిషిచ్యతే॥
2.106.15.
అనుష్టుప్.
పితుర్హి సమతిక్రాంతం
పుత్రో యస్సాధు మన్యతే।
తదపత్యం మతం లోకే
విపరీతమతోఽన్యథా॥
టీక:-
పితుః = తండ్రియొక్క; హి = నిజముగా; సమతిక్రాంతం = సమ్+అతిక్రాంతం, చేసిన పొరపాటును; పుత్రః = కుమారుడు; యః = ఏది; సాధు = మంచిది అని; మన్యతే = సరిచేయునో; తత్ = అతడు; అపత్యం = కుమారుడు; మతం = అభిప్రాయము; లోకే = లోకములో; విపరీతమ్ = విపరీతుడగును; అతః = దీనికి; అన్యథా = వేరయినచో
భావము:-
తండ్రి చేసిన పొరపాటును సవరించ పూనుకొను పుత్రుడు నిజమైన పుత్రుడు (సుపుత్రుడు). లోకపుదృష్టిలో విరుద్ధముగా వర్తించెడి వాడు విపరీతుడు అగును.
2.106.16.
అనుష్టుప్.
తదపత్యం భవానస్తు
మా భవాన్ దుష్కృతం పితుః।
అభిపత్తా కృతం కర్మ
లోకే ధీరవిగర్హితమ్॥
టీక:-
తత్ = ఆ; అపత్యం = పుత్రుడు; భవాన్ = మీరు; అస్తు = అగుదురు గాక; మా భవాన్ = కాకుందురు గాక; దుష్కృతం = చెడుపనిని; పితుః = తండ్రియొక్క; అభిపత్తా = పొందినవాడు; కృతం = చేయబడినది; లోకే = లోకములో; ధీర = పండితులచే; విగర్హితం = నిందించబడినది
భావము:-
మీరు తండ్రి పొరపాటు సరిదిద్దెడి అట్టి పుత్రుడు అగుదురు గాక! తండ్రి చేసిన పాపకార్యములు, పండితులచే తిరస్కరించపడిన కార్యములు మీకు చెందరాదు.
2.106.17.
అనుష్టుప్.
కైకేయీం మాం చ తాతం చ
సుహృదో బాంధవాంశ్చ నః।
పౌరజానపదాన్సర్వాన్
త్రాతు సర్వమిదం భవాన్॥
టీక:-
కైకేయీం = కైకేయిని; మాం = నన్ను; చ = మఱియు; తాతం = తండ్రిని; చ = మఱియు; సుహృదః = స్నేహితులను; బాంధవాన్ = బంధువులను; చ = మఱియు; నః = మన; పౌరజానపదాన్ = పట్టణవాసులను; గ్రామప్రజలను; సర్వాన్ = అందరిని; త్రాతు = రక్షించుడు; సర్వమ్ = సకలమును; ఇదం = ఈ; భవాన్ = మీరు
భావము:-
మీరు ఈ విధముగ కైకేయిని, నన్ను, తండ్రిని, స్నేహితులను, బంధువులను, మఱియు ప్రజలందరిని రక్షించుడు.
2.106.18.
అనుష్టుప్.
క్వ చారణ్యం క్వచ క్షాత్రం
క్వ జటాః క్వ చ పాలనమ్।
ఈదృశం వ్యాహతం కర్మ
న భవాన్కర్తుమర్హతి॥
టీక:-
క్వ = ఎక్కడ; చ = మఱియు; అరణ్యం = అడవి; క్వ = ఎక్కడ; చ = మఱియు; క్షాత్రం = క్షత్రియధర్మము; క్వ = ఎక్కడ; జటాః = జడలతోకూడిన జుట్టు; క్వ = ఎక్కడ; చ = మఱియు; పాలనమ్ = పాలన; ఈదృశం = ఇటువంటి; వ్యాహతం = వ్యర్థమైన; కర్మ = కార్యము; న = కాదు; భవాన్ = మీరు; కర్తుం = చేయుటకు; అర్హతి = యోగ్యుడు
భావము:-
అడవి ఎక్కడ? క్షత్రియ ధర్మము ఎక్కడ? జటలతో కూడిన జుట్టు ఎక్కడ? పరిపాలన ఎక్కడ? ఇటువంటి అనుచితమైన పని (రాజ్యపాలన తిరస్కరణ) మీరు చేయుట సరి కాదు. (అంటే పరిపాలించ వలసిన మీరు వనవాసము చేయుట మీకు అనుచితము)
2.106.19.
అనుష్టుప్.
ఏష హి ప్రథమో ధర్మః
క్షత్రియస్యాభిషేచనమ్।
యేన శక్యం మహాప్రాజ్ఞ!
ప్రజానాం పరిపాలనమ్॥
టీక:-
ఏషః = ఇది; హి = నిజముగ; ప్రథమః = మొదటి; ధర్మః = ధర్మము; క్షత్రియస్య = క్షత్రియునియొక్క; అభిషేచనమ్ = రాజ్యాభిషేకము; యేన = అది; శక్యం = సాధ్యము; మహా = గొప్ప; ప్రాజ్ఞ = జ్ఞానము గలవాడా; ప్రజానాం = ప్రజలను; పరిపాలనమ్ = పరిపాలించుట
భావము:-
అర్హుడైన క్షత్రియుని మొదటి ధర్మము రాజ్యాభిషేకము పొందుట. ఓ మహాజ్ఞానీ, దానివలననే క్షత్రియధర్మమగు ప్రజాపరిపాలనము సాధ్యమగును.
2.106.20.
అనుష్టుప్.
కశ్చ ప్రత్యక్ష ముత్సృజ్య
సంశయస్థ మలక్షణమ్।
ఆయతిస్థం చరేద్ధర్మం
క్షత్రబంధురనిశ్చితమ్॥
టీక:-
కః = ఎవరైనా; చ = కూడ; ప్రత్యక్షమ్ = ప్రత్యక్షమైనది (ఇప్పటి కర్తవ్యము; రాజ్యాభిషేకము); ఉత్సృజ్య = విడిచి; సంశయస్థమ్ = సందేహపూరితము; అలక్షణమ్ = మంచిలక్షణము కాదు; ఆయతిస్థం = భవిష్యత్తునకు సంబంధించిన; చరేత్ = ఆచరించును; ధర్మం = ధర్మమును; క్షత్రబంధుః = భ్రష్టక్షత్రియుడు; అనిశ్చితమ్ = సందిగ్ధమైనది.
భావము:-
ప్రస్తుత ధర్మమును వదిలి, సందేహపూరితమగునది చేపట్టుట మంచిపని కాదు. సందిగ్ధమైన భవిష్యత్తునకు చెందెడిది అగు ధర్మమును క్షత్రియ భ్రష్ఠుడు చేయును కదా.
2.106.21.
అనుష్టుప్.
అథ క్లేశజమేవత్వం
ధర్మం చరితు మిచ్ఛసి।
ధర్మేణ చతురో వర్ణాన్
పాలయన్ క్లేశ మాప్నుహి॥
టీక:-
అథ = లేక; క్లేశజమ్ = కష్టమైనది; ఏవ = మాత్రమే; త్వం = నీవు; ధర్మం = ధర్మమును; చరితుమ్ = ఆచరించుటకు; ఇచ్ఛసి = కోరుకున్నచో; ధర్మేణ = ధర్మముతో; చతురః = నాలుగు; వర్ణాన్ = వర్ణములను; పాలయన్ = పరిపాలించుచు; క్లేశమ్ = శ్రమను; ఆప్నుహి = పొందుము
భావము:-
కష్టతరమైన ధర్మమును మాత్రమే నీవు ఆచరింపదలచినచో, ధర్మబద్ధముగా నాలుగు వర్ణముల ప్రజలను పరిపాలించెడి శ్రమను పొందుము.
2.106.22.
అనుష్టుప్.
చతుర్ణామాశ్రమాణాం హి
గార్హస్థ్యం శ్రేష్ఠమాశ్రమమ్।
ప్రాహుర్ధర్మజ్ఞ ధర్మజ్ఞాః!
తం కథం త్యక్తు మర్హసి॥
టీక:-
చతుర్ణామాశ్రమాణాం = చతపరాశ్రమములలో (బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్న్యాసము); హి = నిజముగా; గార్హస్థ్యం = గృహస్థ ఆశ్రమము; శ్రేష్ఠమ్ = ఉత్తమమైన; ఆశ్రమమ్ = ఆశ్రమము; ప్రాహుః = అని చెప్పుదురు ; ధర్మజ్ఞ = ధర్మజ్ఞులు; ధర్మజ్ఞాః = ధర్మము తెలిసినవాడా; తం = దానిని; కథం = ఎట్లు; త్యక్తుమ్ = విడిచిపెట్టుటకు; అర్హసి = అర్హుడవు అగుదువు?
భావము:-
నాలుగు ఆశ్రమములలో గృహస్థాశ్రమమే ఉత్తమమైనదని ధర్మజ్ఞులు చెప్పెదరు కదా. ఓ ధర్మజ్ఞా! ఆ గృహస్థాశ్రమమును ఎట్లు విడిచిపెట్టగలవు?
*గమనిక:-
చతురాశ్రమములు- చూ. https://telugubhagavatam.org/?Details&Branch=anuyuktaalu&Fruit=Four_Asramas. తెలుగుభాగవతం.ఆర్గ్. > వివరణలు > అనుయుక్తాలు.
2.106.23.
అనుష్టుప్.
శ్రుతేన బాలః స్థానేన
జన్మనా భవతో హ్యహమ్।
స కథం పాలయిష్యామి
భూమిం భవతి తిష్ఠతి॥
టీక:-
శ్రుతేన = తెలియును; బాలః = చిన్నవాడను; స్థానేన = స్థానముచేత; జన్మనా = పుట్టుక; భవతః = మీకంటె; హి = నిజముగా; అహమ్ = నేను; సః = అటువంటి; కథం = ఎట్లు; పాలయిష్యామి = పాలించగలను; భూమిమ్ = రాజ్యమును; భవతి = మీరు; తిష్ఠతి = ఉండగా.
భావము:-
మీకంటె నేను జన్మతః చిన్నవాడను అని తెలియును కదా. అటువంటి నేను మీరు ఉండగా ఈ రాజ్యమును ఎట్లు పాలించగలను?
*గమనిక:-
చూ. తెలుగుభాగవతం.ఆర్గ్ > నవమ స్కంధము > శంతనుని వృత్తాంతము > 9-662-సీ. + 9-663-వ. అన్న ఉండగా తమ్ముడు రాజ్యము చేపట్టరాదు. అట్లు చేసిన దోషుని పరివేత్త అందురు. శంతనుడు తన రాజ్యంలో వర్షాలు కురియకపోవుటకు కారణము బ్రహ్మణులను అడిగెను. అంత బ్రాహ్మణులు “అన్న ఉండగా అగ్నిహోత్రాన్ని స్వీకరించినా, వివాహమాడినా, ఆ తమ్ముని పరివేత్త అందురు. కనుక అన్న ఉండగా తమ్ముడు రాజ్యార్హుడు కాడు. ఈ దోషము నీ యందు ప్రాపించెను కదా.” అని వివరించిరి
2.106.24.g
అనుష్టుప్.
హీనబుద్ధిగుణో బాలో
హీనః స్థానేన చాప్యహమ్।
భవతా చ వినాభూతో
న వర్తయితుముత్సుహే॥
టీక:-
హీన = తక్కువ; బుద్ధి = బుద్ధి (గల); గుణః = గుణములు గలవాడు ; బాలః = చిన్నవాడను; హీనః = హీనుడను; స్థానేన = అర్హతచే; చ = మఱియు; అపి = కూడా; అహం = నేను; భవతా = మీరు; చ = మఱియు; వినాభూతః = వదిలిపెట్టబడిన వాడినై ; న = (వ్యతిరేక అర్థం; క్రియకి అన్వయించాలి); వర్తయితుమ్ = జీవించుటకు; ఉత్సుహే = ఆసక్తి చూపుచుండుట
భావము:-
మీ కంటె గుణములలోను, అర్హతలోను, చిన్నవాడను. మీరు లేకుండా బ్రతుకుటకు కూడ ఆసక్తి కలుగుట లేదు. రాజ్యపాలన చేయలేను.
2.106.25.
అనుష్టుప్.
ఇదం నిఖిలమవ్యగ్రం
రాజ్యం పిత్ర్యమకంటకమ్।
అనుశాధి స్వధర్మేణ
ధర్మజ్ఞ! సహబాంధవైః॥
టీక:-
ఇదం = ఈ; నిఖిలం = సమస్తమైన; అవ్యగ్రం = అలజడులు లేని; రాజ్యం = రాజ్యమును; పిత్ర్యం = తండ్రినుంచి వచ్చినది; అకంటకమ్ = శత్రువులవంటి సమస్యలు లేనిది; అనుశాధి = పరిపాలించుము; స్వధర్మేణ = స్వధర్మముచేత; ధర్మజ్ఞ = ఓ ధర్మము తెలిసినవాడా; స బాంధవైః = బంధువులతో కలిసి
భావము:-
సకల ధర్మములు తెలిసిన రామా! శత్రుబాధలు లేనిది, తండ్రిద్వారా సంక్రమించినది, ప్రశాంతమైనది అయిన ఈ సమస్తరాజ్యమును ధర్మము ననుసరించి బంధువులతో కూడి పరిపాలించుము.
2.106.26.
అనుష్టుప్.
ఇహైవ త్వాఽభిషించన్తు
సర్వాః ప్రకృతయస్సహ।
ఋత్విజస్సవసిష్ఠాశ్చ
మంత్రవన్మంత్రకోవిదాః॥
టీక:-
ఇహైవ = ఇహ+ఏవ, ఇక్కడనే; త్వామ్ = నిన్ను; అభిషించంతు = పట్టాభిషేకిము చేసెదరు గాక; సర్వాః = అందరు; ప్రకృతయః = అమత్యాది ప్రకృతులు; సహ = కలిసి; ఋత్విజః = యజ్ఞకర్తలు; స = కలిసి; వసిష్ఠాః = వసిష్ఠునితో; చ = మఱియు; మంత్రవత్ = ఓ మంత్రములు ఫలవంతమగునట్లు; మంత్రకోవిదాః = మంత్రవేత్తలు
భావము:-
ఇక్కడనే వసిష్ఠముని, మంత్రులు, యజ్ఞకర్తలు, అమాత్యాది ప్రకృతులు అందరితో కూడి మంత్రవేత్తలు నీకు మంత్రములు ఫలవంతమగునట్లు రాజ్యాభిషేకము చేయుదురు గాక.
2.106.27.
అనుష్టుప్.
అభిషిక్తస్త్వమస్మాభిః
అయోధ్యాం పాలనే వ్రజ।
విజిత్య తరసా లోకాన్
మరుద్భిరివ వాసవః॥
టీక:-
అభిషిక్తః = అభిషేకింపబడినవాడవై; త్వం = నీవు; అస్మాభిః = మాతో; అయోధ్యాం = అయోధ్యను; పాలనే = పాలనలో; వ్రజ = సాగుము; విజిత్య = జయించి; తరసా = సామర్థ్యముతో; లోకాన్ = లోకములను; మరుద్భిః = దేవతలతో; ఇవ = వలె; వాసవః = ఇంద్రుడు
భావము:-
నీవు అభిషేకింపబడి మాతో కూడి అయోధ్యను పరిపాలించుటకు వెళ్ళుము. దేవతలతో కూడిన ఇంద్రుని వలె నీ సామర్థ్యముతో లోకములను జయింపుము.
2.106.28.
అనుష్టుప్.
ఋణాని త్రీణ్యపాకుర్వన్
దుర్హృదస్సాధు నిర్దహన్।
సుహృదస్తర్పయన్కామైః
త్వమేవాత్రానుశాధి మామ్॥
టీక:-
ఋణాని = ఋణములు; త్రీణి = మూడు; అపాకుర్వన్ = తీర్చుచు; దుర్హృదః = చెడ్డ హృదయము కలవారిని, శత్రువులను; సాధు = సమగ్రముగా; నిర్దహన్ = దహనము చేయుచు; సుహృదః = స్నేహితులను; తర్పయన్ = తృప్తిపరచుచు; కామైః = కోరికలతో; త్వమ్ = నీవు; ఏవ = మాత్రమే ; అత్ర = అక్కడ (అయోధ్యలో); అనుశాధి = పరిపాలించుము; మామ్ = మమ్ము
భావము:-
ఋషి ఋణము, దేవ ఋణము, పితృ ఋణము అను మనుషులకు విధించిన ఋణత్రయములను తీర్చుచు , శత్రువులను సమగ్రముగా నిర్మూలించుచు, స్నేహితుల కోరికలు తీర్చి వారిని తృప్తిపరచుచు, నీవే మమ్ము అయోధ్యలో పరిపాలించుము.
2.106.29.
అనుష్టుప్.
అద్యాఽర్య! ముదితాస్సన్తు
సుహృదస్తేఽభిషేచనే।
అద్య భీతాః పలాయంతాం
దుర్హృదస్తే దిశో దశ॥
టీక:-
అద్య = ఈ దినము ;ఆర్య = ఓ గౌరవనీయుడా; ముదితాః = సంతోషించినవారు; సంతు = అగుదురు గాక; సుహృదః = స్నేహితులు; తే = నీ; అభిషేచనే = పట్టాభిషేకముచేత; అద్య = ఈ దినము; భీతాః = భయపడినవారై; పలాయంతామ్ = పారిపోయెదరు గాక; దుర్హృదః = చెడ్డమనసుకలవారు, శత్రువులు; తే = నీ; దిశః = దిక్కులు; దశ = పది
భావము:-
ఓ పూజ్యుడా! ఈ దినము నీ రాజ్యాభిషేకముచే నీ మిత్రులందరు సంతోషించెదరు గాక. నీ శత్రువులు భయముతో పది దిక్కులకు పారిపోయెదరు గాక.
2.106.30.
అనుష్టుప్.
ఆక్రోశం మమ మాతుశ్చ
ప్రమృజ్య పురుషర్షభ।
అద్య తత్ర భవంతం చ
పితరం రక్ష కిల్బిషాత్॥
టీక:-
ఆక్రోశం = శాపమును; మమ = నా; మాతుః = తల్లియొక్క; చ = మఱియు; ప్రమృజ్య = తుడిచివేసి; పురుషర్షభ = పురుషులలో వృషభము వంటివాడా (శ్రేష్ఠుడా); అద్య = ఈ దినము; తత్ర భవంతం = పూజ్యుడైన; చ = కూడ; పితరం = తండ్రిని; రక్ష = రక్షింపుము; కిల్బిషాత్ = పాపములనుండి
భావము:-
ఓ ఉత్తముడా! నేడు, అటుల రాజ్యము చేపట్టి, నా తల్లి శాపనార్థములను తొలగింపచేసి, పూజ్యుడైన మన తండ్రిని కూడ పాపములనుండి రక్షించుము .
2.106.31.
అనుష్టుప్.
శిరసా త్వాఽభియాచేఽహం
కురుష్వ కరుణాం మయి।
బాంధవేషు చ సర్వేషు
భూతేష్వివ మహేశ్వరః॥
టీక:-
శిరసా = శిరస్సుతో; త్వామ్ = నిన్ను; అభియాచే = ప్రార్థించుచున్నాను; అహం = నేను; కురుష్వ = చేయుము; కరుణాం = దయను; మయి = నాయందు; బాంధవేషు = బంధువులయందు; చ = మఱియు; సర్వేషు = అందరియందు; భూతేషు = ప్రాణులయందు; ఇవ = వంటి; మహేశ్వరః = ఈశ్వరుడు
భావము:-
నేను శిరస్సు వంచి నిన్ను ప్రార్థించుచున్నాను. సర్వప్రాణులపై మహేశ్వరుడు దయ చూపునట్లు నాపైన, బంధువులపైన, అందరిపైన నీవు దయ చూపింపుము.
2.106.32.
అనుష్టుప్.
అథైతత్పృష్ఠతః కృత్వా
వనమేవ భవానితః।
గమిష్యతి గమిష్యామి
భవతా సార్ధమప్యహమ్”॥
టీక:-
అథ = అట్లుకాక, వికల్పః, సర్వశబ్దసంబేధిని; ఏతత్ = దీనిని; పృష్ఠతః = వెనుకను; కృత్వా = చేసి; వనం = అరణ్యమునుగూర్చి; ఏవ = మాత్రమే; భవాన్ = మీరు; ఇతః = ఇక్కడనుండి; గమిష్యతి = వెళ్ళినచో; గమిష్యామి = వెళ్ళెదను; భవతా = మీతో ; సార్ధం = సహచరుడిగా; అపి = కూడ; అహం = నేను
భావము:-
కాని మీరు నా యీ ప్రార్థనను తిరస్కరించి అరణ్యమునకే వెళ్ళదలచినచో నేను కూడ మీ వెంట వచ్చెదను.”
2.106.33.
జగతి.
తథాహి రామో భరతేన తామ్యతా
ప్రసాద్యమానశ్శిరసా మహీపతిః।
నచైవ చక్రే గమనాయ సత్త్వవా-
న్మతిం పితుస్తద్వచనే ప్రతిష్ఠితః॥
టీక:-
తథా హి = ఆ విధముగా; రామః = రాముడు; భరతేన = భరతునిచే; తామ్యతా = విషాదపూరితుడైన; ప్రసాద్యమానః = బ్రతిమాలబడినవాడు; శిరసా = శిరస్సుతో; మహీపతిః = రాజు; న = (వ్యతిరేక అర్థము; క్రియకు అన్వయించుకోవాలి); చ = మఱియు; ఏవ = అట్లు; చక్రే = చేసెను; గమనాయ = (అయోధ్య) వెళ్ళుటకు; సత్త్వవాన్ = శక్తివంతుడు; మతిం = ఆలోచనను; పితుః = తండ్రియొక్క; తత్ = ఆ; వచనే = మాటయందు; ప్రతిష్ఠితః = నిలిచినవాడు
భావము:-
ఆ విధముగా విషాదపూరితుడైన భరతుడు వినయముగా రాముని అయోధ్యకు తిరిగి రమ్మని బ్రతిమాలెను. కాని శక్తివంతుడైన రాముడు తండ్రి ఆజ్ఞపై ధృడముగా నిలిచినవాడై అయోధ్యకు తిరిగివెళ్ళెడి ఆలోచన చెయ్యలేదు.
2.106.34.
జగతి.
తదద్భుతం స్థైర్యమవేక్ష్య రాఘవే
సమం జనో హర్షమవాప దుఃఖితః।
న యాత్యయోధ్యామితి దుఃఖితోఽభవత్
స్థిరప్రతిజ్ఞత్వమవేక్ష్య హర్షితః॥
టీక:-
తత్ = ఆ; అద్భుతం = అద్భుతమును; స్థైర్యం = మనోధైర్యమును ; అవేక్ష్య = చూసి; రాఘవే = రాముడిలో; సమం = ఒకే సమయములో; జనః = ప్రజ; హర్షం = ఆనందమును; అవాప = పొందెను; దుఃఖితః = దుఃఖించుచున్నదై; న యాతి = వెళ్ళడు; అయోధ్యామ్ = అయోధ్యనుగురించి; ఇతి = అని; దుఃఖితః = దుఃఖించుచున్నది; అభవత్ = అయ్యెను; స్థిరప్రతిజ్ఞత్వం = స్థిరమైన ప్రతిజ్ఞ కలిగియుండుటను; అవేక్ష్య = చూచి; హర్షితః = ఆనందించునది
భావము:-
అటువంటి అద్భుతమైన మనోధైర్యము రాముడిలో చూచి జనులందరు ఒకేసారి ఆనందమును, దుఃఖమును కూడ పొందిరి. అయోధ్యకు మరలిరాడని తెలిసి వారు దుఃఖించిరి. రాముడు ఇచ్చిన మాటను తప్పకపోవుట చూచి ఆ ప్రజలు ఆనందించిరి.
2.106.35.
జగతి.
తమృత్విజో నైగమయూథవల్లభా-
స్తదా విసంజ్ఞాశ్రుకలాశ్చ మాతరః।
తథా బ్రువాణం భరతం ప్రతుష్టువుః
ప్రణమ్య రామం చ యయాచిరే సహ॥
టీక:-
తమ్ = అతనిని; ఋత్విజః = యజ్ఞకర్తలు; నైగమ = వేద (నిగమ) జ్ఞుల; యూథః = సముదాయములు; వల్లభాః = నాయకులు; తదా = అప్పుడు; విసంజ్ఞా = నిస్పృహులు; అశ్రుకలాః = (ఎక్కువగా ఏడ్చుటచే) కన్నీటిచారల ముఖములు కలవారు; చ = మఱియు; మాతరః = తల్లులు; తథా = ఆ విధముగా; బ్రువాణం = చెప్పుచున్న; భరతం = భరతుని; ప్రతుష్టువుః = మెచ్చుకొనిరి; ప్రణమ్య = నమస్కరించి; రామం = రాముని; చ = మఱియు; యయాచిరే = అభ్యర్ధించిరి; సహ = కలిసి
భావము:-
అప్పుడు యజ్ఞకర్తలు, నగర ప్రముఖులు, మిక్కిలి దుఃఖితులై రోదించిన తల్లులు, రాముని వేడుకుంటున్న భరతుని మెచ్చుకొనిరి. రామునికి మరల నమస్కరించి భరతునితో కలిసి అభ్యర్ధించిరి.
2.106.36.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే। అయోధ్యకాండే షడుత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; షడుత్తరశతతమః [106] = నూటఆరవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [106] నూటఆరవ సర్గ సంపూర్ణము.
2.107.1.
అనుష్టుప్.
పునరేవం బ్రువాణం తం
భరతం లక్ష్మణాగ్రజః।
ప్రత్యువాచ తతశ్శ్రీమాన్
జ్ఞాతిమధ్యేఽభిసత్కృతః
టీక:-
 పునః = మరల; ఏవం = ఈ విధముగా; బ్రువాణం = పలికెను; తం = అటువంటి; భరతం = భరతునితో; లక్ష్మణ = లక్ష్మణుని; అగ్రజః = అన్నగారైన రాముడు; ప్రత్యువాచ = సమాధానము చెప్పెను; తతః = అటు పిమ్మట; శ్రీమాన్ = శ్రీమంతుడు; జ్ఞాతిః = బంధువులు; మధ్యే = యందు; అభిసత్కృతః = గౌరవింపబడువాడు
భావము:-
 శ్రీమంతుడు, దాయాదులు అందరిచేత గౌరవింపబడువాడు అయిన రాముడు మరల ఈ విధముగా మాటలాడుచున్న భరతునితో ఇట్లు పలికెను.
2.107.2.
అనుష్టుప్.
“ఉపపన్నమిదం వాక్యం
యత్త్వమేవమభాషథాః।
జాతః పుత్రో దశరథాత్
కైకేయ్యాం రాజసత్తమాత్॥
టీక:-
 ఉపపన్నమ్ = యుక్తముగా ఉన్నవి; ఇదం = ఇటువంటి; వాక్యం = మాటలను; యత్ = ఏవైతే; త్వమ్ = నీవు; ఏవమ్ = ఈ విధముగా; అభాషథాః = చక్కగా చెప్పినదంతయు; జాతః = పుట్టుట; పుత్రః = కుమారుడు; దశరథాత్ = దశరథునకు; కైకేయ్యాం = కైకేయియందు; రాజసత్తమాత్ = రాజశ్రేష్ఠుడైన
భావము:-
 రాజశ్రేష్ఠుడైన దశరథునకు కైకేయియందు జన్మించిన పుత్రుడవైన నీవు చక్కగా చెప్పినదంతయు యుక్తముగానే ఉన్నది.
2.107.3.
అనుష్టుప్.
పురా భ్రాతః! పితా నః స
మాతరం తే సముద్వహన్।
మాతామహే సమాశ్రౌషీత్
రాజ్యశుల్కమనుత్తమమ్॥
టీక:-
 పురా = పూర్వము; భ్రాతః = సోదరా; పితా = తండ్రిగారు; నః = మన; సః = తను; మాతరం = తల్లిని; తే = నీ; సముద్వహన్ = వివాహ సమయములో; మాతామహే = మాతామహుని; సమాశ్రౌషీత్ = ప్రతిజ్ఞ చేయుట; రాజ్య = రాజ్యమను; శుల్కమ్ = ఉంకువ, కట్నం, కన్యాశుల్కం; అనుత్తమమ్ = అత్యుత్తమమైన.
భావము:-
 మన తండ్రి పూర్వము నీ తల్లిని వివాహమాడు సమయమునందు కట్నముగ అత్యుత్తమమైన ఈ రాజ్యమును ఆమె కుమారునకే ఇచ్చెదనని నీ మాతామహునికి ప్రతిజ్ఞ చేసి చెప్పెను.
2.107.4.
అనుష్టుప్.
దైవాసురే చ సంగ్రామే
జనన్యై తవ పార్థివః।
సంప్రహృష్టో దదౌ రాజా
వరౌరారాధితః ప్రభుః!॥
టీక:-
 దైవాసురే = దేవదానవుల మధ్య; చ = మఱియు; సంగ్రామే = యుద్ధములో; జనన్యై = తల్లికి; తవ = నీ యొక్క; పార్థివః = మహారాజు; సంప్రహృష్టః = సంతోషించినవాడు; దదౌ = ఇచ్చెను; రాజా = దశరథ మహారాజు; వరౌః = రెండు వరములను; ఆరాధితః = సేవింపబడినవాడు; ప్రభుః = భరతా
భావము:-
 భరతుడా! దేవాసురుల సంగ్రామము జరిగినపుడు నీ తల్లి చేసిన సేవకు చాల సంతోషించి, దశరథ మహారాజు, ఆమెకు రెండు వరములను ఇచ్చెను.
2.107.5.
అనుష్టుప్.
తతస్సా సంప్రతిశ్రావ్య
తవ మాతా యశస్వినీ।
అయాచత నరశ్రేష్ఠం
ద్వౌ వరౌ వరవర్ణినీ॥
టీక:-
 తతః = అప్పుడు; సా = ఆమె (కైకేయి); సంప్రతిశ్రావ్య = ఒట్టు పెట్టించుకున్నది; తవ = నీ యొక్క; మాతా = తల్లి; యశస్వినీ = కీర్తి గలదీ; అయాచత = అడిగెను; నరశ్రేష్ఠం = నరశ్రేష్ఠుడైన దశరథ మహారాజుచే; ద్వౌ = రెండు; వరౌ = వరములను; వరవర్ణినీ = ఉత్తమజాతి స్త్రీ అయినదీ.
భావము:-
 పిదప కీర్తి గలదీ, ఉత్తమ స్త్రీజాతికి చెందినదీ అయిన నీ తల్లి, రెండు వరములను కోరి, దశరథ మహారాజుచే ఒట్టు పెట్టించుకొన్నది.
2.107.6.
అనుష్టుప్.
తవ రాజ్యం నరవ్యాఘ్ర
మమ ప్రవ్రాజనం తథా।
తౌ చ రాజా తదా తస్యై
నియుక్తః ప్రదదౌ వరౌ॥
టీక:-
 తవ = నీకు; రాజ్యం = రాజ్యమును; నరవ్యాఘ్ర = ఓ నరశ్రేష్ఠుడా; మమ = నాకు; ప్రవ్రాజనం = పరివ్రాజకత్వము; తథా = అట్లు; తౌ = ఆ రెండు వరములను; చ = ఇంకను; రాజా = దశరథ మహారాజు; తదా = అప్పుడు; తస్యై = అట్లు; నియుక్తః = కోరగా; ప్రదదౌ = ఇచ్చెను; వరౌ = వరములను
భావము:-
 నీకు రాజ్యము, నాకు పరివ్రాజకము అను రెండు వరములను కోరెను. ఆమె అట్లు కోరగా రాజు ఆ వరములను ఆమెకు ఇచ్చెను.
*గమనిక:-
 ప్రవ్రాజం- సన్న్యసించడం ప్రవ్రాజం. సన్న్యసించిన వాడు ప్రవ్రాజక/ ప్రవ్రాజకుడు. సన్న్యసించిన స్త్రీ ప్రవ్రాజిక. పరివ్రాట్టు/ పరివ్రాజకుడు అనే పదానికి కూడా సన్న్యసించినవాడనే అర్థం. పారమార్థిక పదకోశం, పొత్తూరి వేంకటేశ్రరరావు. పరి మిక్కిలి వ్రాజక వ్రజత్ వెళ్ళుట చేయువాడు, పరివ్రాజకుడు. కనుకనే రాముడు వనవాస సమయంలో అనేక వనములకు వెళ్ళెను. తన తండ్రి తన మామగారికి ఇచ్చిన మాట, పినతల్లికి ఇచ్చిన మాట ఒకటే కనుక పితృవాక్యపరిపాలన అని ఏకవచనం వాడెను.
2.107.7.
అనుష్టుప్.
తేన పిత్రాఽహమప్యత్ర
నియుక్తః పురుషర్షభ।
చతుర్దశ వనే వాసం
వర్షాణి వరదానికమ్॥
టీక:-
 తేన = వానిచే; పిత్రా = తండ్రి; అహమ్ = నేను; అపి = అయినను; అత్ర = అక్కడ; నియుక్తః = ఆజ్ఞాపించెను; పురుషర్షభ = ఓ పురుషశ్రేష్ఠుడా; చతుర్దశ = పదునాలుగు; వనే వాసం = వనములో నివసించవలెనని; వర్షాణి = సంవత్సరములు; వరదానికమ్ = వరములలో ఒకటిగా.
భావము:-
 ఆ వరములలో ఒకటిగా పదునాలుగు సంవత్సరములు నేను వనములో నివసించవలెనని, నన్ను తండ్రి ఆజ్ఞాపించినాడు.
2.107.8.
అనుష్టుప్.
సోఽహం వనమిదం ప్రాప్తో
నిర్జనం లక్ష్మణాన్వితః।
సీతయా చాప్రతిద్వన్ద్వః
సత్యవాదే స్థితః పితుః॥
టీక:-
 సః = అతడు; అహం = నేను; వనమ్ = వనమునకు; ఇదమ్ = ఈ; ప్రాప్తః = వచ్చితిని; నిర్జనం = నిర్జనమైన; లక్ష్మణాన్వితః = లక్ష్మణ సహితుడనై; సీతయా = సీతతో; చ = ఇంకను; అప్రతిద్వన్ద్వః = ఎదురులేనివాడనై; సత్యవాదే = సత్యవాక్కునందే; స్థితః = స్థిరముగా; పితుః = తండ్రి.
భావము:-
 నేను తండ్రి పలికిన సత్యవాక్కునందే స్థిరముగా నిలచి, ఎదురు లేనివాడనై, సీతాలక్ష్మణ సహితుడనై, ఈ నిర్జన వనమునకు వచ్చితిని.
*గమనిక:-
 తన తండ్రి తన మామగారికి ఇచ్చిన మాట, పినతల్లికి ఇచ్చిన మాట ఒకటే కనుక పితృవాక్యపరిపాలన అని ఏకవచనం వాడెను.
2.107.9.
అనుష్టుప్.
భవానపి తథేత్యేవ
పితరం సత్యవాదినమ్।
కర్తుమర్హతి రాజేంద్ర
క్షిప్రమేవాభిషేచనాత్॥
టీక:-
 భవాన్ = నీవు; అపి = కూడా; తథేదైవ = అదే విధముగా; పితరం = తండ్రి గారి; సత్యవాదినమ్ = సత్యవాదిత్వమును; కర్తుమ్ = చేయుటకు; అర్హతి = అర్హుడవు; రాజేంద్ర = ఓ రాజేంద్రా; క్షిప్రమ్ ఏవ = వెంటనే; అభిషేచనాత్ = రాజ్యాభిషిక్తుడవై
భావము:-
 నీవు కూడ అదేవిధముగా, మన తండ్రి చెప్పిన ప్రకారము వెంటనే రాజ్యాభిషిక్తుడవై, ఆయన సత్యవాదిత్వమును నిలబెట్టుము.
2.107.10.
అనుష్టుప్.
ఋణాన్మోచయ రాజానం
మత్కృతే భరత! ప్రభుమ్।
పితరం చాపి ధర్మజ్ఞం
మాతరం చాభినందయ॥
టీక:-
 ఋణాత్ = ఋణము నుండి; మోచయ = విముక్తులను చేయుము; రాజానం = మహారాజును; మత్కృతే = నా మాట విని; భరత = ఓ భరతా; ప్రభుమ్ = ప్రభును; పితరం = తండ్రిని; చ = ఇంకను; అపి = అయినప్పటికీ; ధర్మజ్ఞం = ధర్మజ్ఞుడైన; మాతరం = తల్లిని; చ = మఱియు; అభినందయ = మిక్కిలి సంతోషపెట్టుము.
భావము:-
 నా మాట విని దశరథ మహారాజును ఋణవిముక్తుని చేయుము. ధర్మజ్జుడైన తండ్రిని, తల్లిని సంతోషపెట్టుము.
*గమనిక:-
 దశరథుడు కైకేయి తండ్రి, తనమామ ఐన కేకయ మహారాజునకు కన్యాశుల్కముగా మాట ఇచ్చుటచే అది జరిగేవరకు ఋణగ్రహస్తుడు అని రాముడు సూచిస్తున్నాడు.
2.107.11.
అనుష్టుప్.
శ్రూయతే హి పురా తాత!
శ్రుతిర్గీతా యశస్వినా।
గయేన యజమానేన
గయేష్వేవ పితృన్ప్రతి॥
టీక:-
 శ్రూయతే = వినుచున్నాము; హి = కదా; పురా = పూర్వము; తాత = ఓ భరతా; శ్రుతిః = శ్రుతులు; గీతా = గానము; యశస్వినా = యశస్సు కలిగిన; గయేన = గయుని చేత; యజమానేన = యాగము చేయుచు; గయేషు = గయ క్షేత్రములో; ఇవ = ఇట్లు; పితృన్ ప్రతి = పితృదేవతలను గూర్చి.
భావము:-
 పూర్వము గయ క్షేత్రములో పితృ దేవతలను గూర్చి యాగము చేయుచు, కీర్తిమంతుడైన గయుడు, ఈ విధముగ చెప్పినట్లు వినుచుచుంటిమి కదా.
2.107.12.
అనుష్టుప్.
పున్నామ్నో నరకాద్యస్మాత్
పితరం త్రాయతే సుతః।
తస్మాత్పుత్ర ఇతి ప్రోక్తః
పితృన్ యః పాతి సర్వతః॥
టీక:-
 పుత్ = పుత్; నామ్నో = అను పేరు గల; నరకాది = నరకము నుండి; యస్మాత్ = నాటి నుండి; పితరం = తండ్రిని; త్రాయతే = రక్షించుచు; సుతః = కుమారుడు; తస్మాత్ = ఆ కారణముగా; పుత్ర = కుమారునిగా; ఇతి = ఇట్లు; ప్రోక్తః = చెప్పుదురు; పితృన్ = పితృదేవతలను; యః = ఎవరైతే; పాతి = రక్షించును; సర్వతః = అన్ని విధముల.
భావము:-
 కుమారుడు తండ్రిని "పుత్’’ అను నరకము నుండి రక్షించును. కావున అతడు పుత్రుడు అనబడుచుండెను. అతడు పితృదేవతలను అన్ని విధముల రక్షించును.
2.107.13.
అనుష్టుప్.
ఏష్టవ్యా బహవః పుత్రా
గుణవంతో బహుశ్రుతాః।
తేషాం వై సమవేతానామ్
అపి కశ్చిద్గయాం వ్రజేత్॥
టీక:-
 ఏష్టవ్యా = కోరుకొనవలెను; బహవః = చాలామంది; పుత్రా = కుమారులను; గుణవంతః = గుణవంతులు; బహుశ్రుతాః = బాగా తెలిసినవాడు; తేషాం = వారిలో; వై = కావచ్చు; సమవేతానామ్ = కూడిన; అపి = ఐనను; కశ్చిత్ = ఏ ఒక్కరు; గయాం = గయ క్షేత్రముకు; వ్రజేత్ = వెళ్లవచ్చును.
భావము:-
 అందుచేత అతనికి పుత్రుడు అను పేరు వచ్చినది. గుణవంతులు, లోకం తెలిసినవారు చాలామంది పుత్రులు కావలెనని కోరుకొనవలెను. ఎందుచేతననగా, వారందరిలో ఏ ఒక్కడైనను గయ క్షేత్రమునకు వెళ్ళవచ్చును కదా.
2.107.14.
అనుష్టుప్.
ఏవం రాజర్షయస్సర్వే
ప్రతీతా రాజనందన!।
తస్మాత్రాహి నరశ్రేష్ఠ
పితరం నరకాత్ప్రభో~॥
టీక:-
 ఏవం = ఇట్లు; రాజర్షయః = రాజర్షులు; సర్వే = అందరును; ప్రతీతా = నిర్ణయించినారు; రాజనందన = రాజకుమారుడా; తస్మాత్ = ఆ కారణముగా; త్రాహి = రక్షించుము; నరశ్రేష్ఠ = నరశ్రేష్ఠుడైన; పితరం = తండ్రిని; నరకాత్ = నరకములో; ప్రభో = రాజా
భావము:-
 రాజర్షుల రాకుమార రాజా భరతుడా! రాజర్షులందరు తండ్రిని పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు నిర్ణయించినారు. అందుచే ఉత్తముడైన మన తండ్రిని నరకములో పడకుండ రక్షించుము.
*గమనిక:-
 పుత్- పృ+డుతి, పర్చతి సంయచ్ఛతి రుణద్ధి పుణ్యమ్, పుణ్యమును ఆపునది. ఒక నరకము.
2.107.15.
అనుష్టుప్.
అయోధ్యాం గచ్ఛ భరత!
ప్రకృతీరనురంజయ।
శత్రుఘ్నసహితో వీర!
సహ సర్వైర్ద్విజాతిభిః॥
టీక:-
 అయోధ్యాం = అయోధ్యా నగరమునకు; గచ్ఛ = వెళ్లుము; భరత = ఓ భరతా; ప్రకృతీః = ప్రజలందరినీ; అనురంజయ = రంజింపచేయుము; శత్రుఘ్న = శత్రుఘ్నునితో; సహితః = కూడినవాడవై; వీర = వీరుడా; సహ = కూడి; సర్వైః = అందరును; ద్విజాతిభిః = ద్విజులందరితోను.
భావము:-
 మహావీరుడైన భరతుడా! శత్రుఘ్నునితోను ద్విజులందరితోను కలిసి అయోధ్యకు వెళ్లి రాజ్యమతటినీ రంజింపజేయుము.
2.107.16.
అనుష్టుప్.
ప్రవేక్ష్యే దండకారణ్యమ్
అహమప్యవిలంబయన్।
ఆభ్యాన్తు సహితో రాజన్!
వైదేహ్యా లక్ష్మణేన చ॥
టీక:-
 ప్రవేక్షే్య = ప్రవేశించెదను; దండకారణ్యమ్ = దండకారణ్యములోనికి; అపి = లేదా; అవిలంబయన్ = ఆలస్యము చేయకుండా; ఆభ్యాన్తు = వెళ్లెదను; సహితః = కలసి; రాజన్ = రాజా; వైదేహ్యా = సీతతోను; లక్ష్మణేన = లక్ష్మణునితోను; చ = ఇంకను.
భావము:-
 నేను సీతాలక్ష్మణులతో కలిసి, ఆలస్యము చేయకుండా వెంటనే దండకారణ్యమునకు వెళ్లెదను.
2.107.17.
అతిజగతి.
త్వం రాజా భరత భవ స్వయం నరాణాం
వన్యానామహమపి రాజరాణ్మృగాణామ్।
గచ్ఛ త్వం పురవరమద్య సంప్రహృష్టః
సంహృష్టస్త్వహమపి దండకాన్ప్రవేక్షే్య॥
టీక:-
 త్వం = నీవు; రాజా = రాజు; భరత = భరతుడు; భవ = అగుము; స్వయం = స్వయముగా; నరాణాం = నరులకు; వన్యానామ్ = వనములోని; అహమ్ = నేను; అపి = కూడా; రాజరాట్ = రాజాధిరాజును; మృగాణామ్ = మృగములకు; గచ్ఛ = వెళ్లుము; త్వం = నీవు; పురవరమ్ = శ్రేష్టమైన అయోధ్యాపికి; అద్య = ఇప్పుడే; సంప్రహృష్టః = సంతోషపూర్వకముగా; సంహృష్టస్తు = సంతోషపూర్వకముగా ఉన్నవాడనై; అహమ్ = నేను; అపి = కూడా; దండకాత్ = దండకారణ్యములోనికి; ప్రవేక్ష్యే = ప్రవేశించెదను.
భావము:-
 నీవు నరులకు రాజువగుము. నేను వనములోనున్న మృగములకు రాజాధిరాజు అయ్యెదను. నీవు సంతోషపూర్వకముగా ఇపుడు అయోధ్యకు వెళ్లుము. నేను సంతోషపూర్వకముగా దండకారణ్యమునకు వెళ్ళెదను.
2.107.18.
అతిజగతి.
ఛాయాం తే దినకరభాః ప్రబాధమానాం
వర్షత్రం భరత కరోతు మూర్థ్ని శీతామ్।
ఏతేషామహమపి కాననద్రుమాణాం
ఛాయాం తామతిశయినీం సుఖీ శ్రయిష్యే॥
టీక:-
 ఛాయాం = నీడను; తే = నీకు; దినకరభాః = సూర్యుని ఎండ; ప్రబాధమానాం = బాధను తొలగించుచు; వర్షత్రం = గొడుగు; భరత = భరతా; కరోతు = ఇచ్చుగాక; మూర్థ్ని = శిరస్సునకు; శీతామ్ = చల్లదనము; ఏతేషామ్ = అటులనే; అహమ్ = నేను; అపి = కూడ; కాననః = అరణ్యములో; ద్రుమాణాం = వృక్షముల; ఛాయాం = నీడను; తామ్ = ఆ వృక్షముల క్రింద; అతిశయినీం = దట్టమైన; సుఖీ = సుఖముగా; ఆశ్రయిష్యే = ఆశ్రయించెదను
భావము:-
 సూర్యుని ఎండను తొలగించుచు, శ్వేతచ్ఛత్రము నీ శిరస్సుపై చల్లని నీడను ఇచ్చుగాక. అటులనే, నేను కూడా ఈ అడవిలో వృక్షముల క్రింద దట్టమైన నీడను సుఖముగా ఆశ్రయించెదను.
2.107.19.
అతిజగతి.
శత్రుఘ్నః కుశలమతిస్తు తే సహాయః
సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రమ్।
చత్వారస్తనయవరా వయం నరేంద్రం
సత్యంథం భరత చరామ మా విషీద॥
టీక:-
 శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; కుశలమతిః = బుద్ధిశాలి; తు = తప్పక; తే = నీకు; సహాయః = సహాయకుడు; సౌమిత్రిః = లక్ష్మణుడు; మమ = నాకు; విదితః = తెలిసినదే; ప్రధానమిత్రమ్ = ప్రధాన మిత్రుడని; చత్వారః = నలుగురమును; తనయవరా = ఉత్తమపుత్రులము; వయం = మనము; నరేంద్రమ్ = దశరథ మహారజును; సత్యంథమ్ = సత్యవ్రతునిగా; భరత = భరతా; చరామ = చేసెదము; మా = వద్దు; విషీద = దుఃఖించుట.
భావము:-
 బుద్ధిశాలియైన శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉండును. లక్ష్మణుడు నాకు ప్రధాన మిత్రుడని ప్రసిద్ధమైన విషయమే కదా! మనము నలుగురు కుమారులము దశరథ మహారాజును సత్యవ్రతునిగా నిలబెట్టెదము. దుఃఖించకుము.
2.107.20.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాండే సప్తోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; సప్తోత్తరశతతమః [107] = నూటఆరఏడవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [107] నూటఏడవ సర్గ సంపూర్ణము.
2.108.1.
అనుష్టుప్.
ఆశ్వాసయంతం భరతం
జాబాలిః బ్రాహ్మణోత్తమః।
ఉవాచ రామం ధర్మజ్ఞం
ధర్మాపేతమిదం వచః॥
టీక:-
 ఆశ్వాసయంతం = ఓదార్చుచున్న; భరతం = భరతుని; జాబాలిః = జాబాలి; బ్రాహ్మణోత్తమః = బ్రాహ్మణోత్తముడు; ఉవాచ = పలికెను; రామం = రాముని గూర్చి; ధర్మజ్ఞమ్ = ధర్మము నెరిగినవాడైన; ధర్మాపేతమ్ = ధర్మమును తప్పిన; ఇదం = ఈ; వచః = మాటను.
భావము:-
 ధర్మము నెరిగిన రాముడు భరతునకు ఇట్లు నచ్చచెప్పుచుండగా, బ్రాహ్మణోత్తముడైన జాబాలి అతనితో ధర్మవిరుద్ధమైన మాటలను ఇట్లు పలికెను.
2.108.2.
అనుష్టుప్.
“సాధు రాఘవ! మాఽభూత్తే
బుధ్దిరేవం నిరర్థికా।
ప్రాకృతస్య నరస్యేవ
హ్యార్యబుద్ధేర్మనస్వినః॥
టీక:-
 సాధు = బాగున్నది; రాఘవ = రామా; మా = జరుగకుండుగాక; అభూత్ = కలుగుట; తే = నీకు; బుద్ధిః = బుద్ధి; ఇవం = వలె; నిరర్థికా = నిష్ప్రయోజనమైన; ప్రాకృతస్య = సామాన్యమైన; నరః = మానవుని; ఇవ = వలె; హా = అయ్యో; ఆర్యబుద్ధేః = దొడ్డ బుద్ధిగలకలవాడు; మనస్వినః = ఆత్మాభిమానము కలిగియున్నకలవాడు.
భావము:-
 రామా! బాగున్నది. శ్రేష్ఠమైన బుద్ధి కలవాడవు, అభిమాన వంతుడ వైన నీకు సామాన్యమైన మానవునకు వలె ఇటువంటి నిష్ప్రయోజనమైన ఆలోచన కలుగకుండుగాక.
2.108.3.
అనుష్టుప్.
కః కస్య పురుషో బంథుః
కిమాప్యం కస్య కేనచిత్।
యదేకో జాయతే జంతుః
ఏక ఏవ వినశ్యతి॥
టీక:-
 కః = ఏ; కస్య = ఎవనికి; పురుషః = పురుషుడు; బంథుః = బంధువు; కిమ్ = ఏమి; ఆప్యం = పొందదగినది; కస్య = ఎవనికి; కేనచిత్ = ఎవనినుండి; యత్ = దేనివలన; ఏకః = ఒక్కడే; జాయతే = జన్మించుచున్నాడు; జంతుః = ప్రాణి; ఏక ఏవ = ఒకనిగనే; వినశ్యతి = నశించుచున్నాడు.
భావము:-
 జీవి ఒంటరిగనే పుట్టుచున్నాడు. ఒంటరిగనే గిట్టుచున్నాడు. ఎవరు ఎవరికి బంధువు? ఎవని నుండి ఎవడు ఏమి పొందును?
2.108.4.
అనుష్టుప్.
తస్మాన్మాతా పితా చేతి
రామ! సజ్జేత యో నరః।
ఉన్మత్త ఇవ స జ్ఞేయో
నాస్తి కశ్చిద్ధి కస్యచిత్॥
టీక:-
 తస్మాత్ = అందువలన; మాతా = తల్లి; పితా = తండ్రి; చ = మఱి; ఇతి = అని; రామ = రామా; సజ్జేత = ఆసక్తుడై ఉండునో; యః = ఏ; నరః = మానవుడు; ఉన్మత్త = ఉన్మాది; ఇవ = వలె; సః = ఆ; జ్ఞేయః = తెలియదగినవాడు; నాస్తి = లేడు; కశ్చిత్ = ఎవడును; హి = కదా; కస్య చిత్ = ఎవనికిని.
భావము:-
 రామా! తల్లి తండ్రి అని అనుకొనుచు వారిపై ప్రేమానురాగములు కలిగియున్నవాడు ఉన్మాది వంటివాడు. ఎవరికి ఎవరు ఏమి అగుదురు?
2.108.5.
అనుష్టుప్.
యథా గ్రామాంతరం గచ్ఛన్
నరః కశ్చిత్ క్వచిత్ వసేత్।
ఉత్సృజ్య చ తమావాసం
ప్రతిష్ఠేతాపరేఽహని॥
టీక:-
 యథా = ఎట్లైతే; గ్రామాంతరం = ఇతర గ్రామమునకు; గచ్ఛన్ = వెళ్లిన; నరః = మానవుడు; కశ్చిత్ = ఒకానొక; క్వచిత్ = ఒకచోట; వసేత్ = నివసించునో; ఉత్సృజ్య = విడిచి; తమ్ = ఆ; ఆవాసం = నివాసమును; ప్రతిష్ఠేతా = చేరునో; అపరే = ఇతరమందు; అహని = దినమున.
భావము:-
 రామా! మరొక ఊరు వెళ్ళువాడు ఒకచోట నిలిచి, మరునాడు ఆ ప్రదేశమును విడిచి దినాంతమున మరొక నివాసమును చేరును.
2.108.6.
అనుష్టుప్.
ఏవమేవ మనుష్యాణాం
పితా మాతా గృహం వసు।
అవాసమాత్రం కాకుత్స్థ!
సజ్జన్తే నాత్ర సజ్జనాః॥
టీక:-
 ఏవమేవ = అట్లే; మనుష్యాణాం = మానవులకు; పితా = తండ్రి; మాతా = తల్లి; గృహం = ఇల్లు; వసు = ధనము; అవాసమాత్రం = నివాసము వంటివి మాత్రమే; కాకుత్స్థ = రామా; సజ్జన్తే = వ్యామోహము కలవారు; న = కారు; అత్ర = వీటియందు; సజ్జనాః = సజ్జనులకు.
భావము:-
 కాకుత్స్థ రామ! మానవులకు తల్లి, తండ్రి, ఇల్లు, ధనము అనునవి నివాస స్థానముల వంటివి మాత్రమే. జ్ఞానులకు వాటియందు వ్యామోహము ఉండదు.
2.108.7.
అనుష్టుప్.
పిత్ర్యం రాజ్యం పరిత్యజ్య
స నార్హసి నరోత్తమ!।
ఆస్థాతుం కాపథం దుఃఖం
విషమం బహుకంటకమ్॥
టీక:-
 పిత్ర్యం = తండ్రికి సంబంధించిన; రాజ్యం = రాజ్యమును; పరిత్యజ్య = విడిచి; సః = ఆ; న = కూడదు; అర్హసి = అర్హత; నరోత్తమ = మానవోత్తమ; ఆస్థాతుం = పాటించుటకు; కాపథం = కుత్సిత మార్గమును, వాచస్పతము, కష్టనామౌషధమ్, రాజనిర్ఘంటః; దుఃఖమ్ = బహు దుఃఖ కారణము; విషమమ్ = ఎగుడుదిగుడులది; బహుకంటకమ్ = మిక్కిలి ముళ్ళదారి.
భావము:-
 రామ! మానవోత్తముడవైన నీవు తండ్రినుండి సంక్రమించిన రాజ్యమును విడిచిపెట్టి అనేక కష్టములతో కూడుకొనియున్నది, బహుదుఃఖకారకమైనది, ఎగుడుదిగుడులది, మిక్కిలి ముళ్ళదారి ఐన ఈ వనవాస మార్గము పట్టరాదు కదా.
2.108.8.
అనుష్టుప్.
సమృద్ధాయామయోధ్యాయాం
ఆత్మానమభిషేచయ।
ఏకవేణీధరా హి త్వాం
నగరీ సంప్రతీక్షతే॥
టీక:-
 సమృద్ధాయామ్ = సకలైశ్వర్యములతో సంపూర్ణమైన; అయోధ్యాయామ్ = అయోధ్యకు; ఆత్మానమ్ = నిన్ను; అభిషేచయ = అభిషేకించుకొనుము; ఏకవేణీధరా = ఒంటిజడ, పతివ్రత ఒంటి వేసుకొనుట సంప్రదాయము, త్వత్పరాయణోత్యర్థః, గోపినాథః; హి = కదా; త్వాం = నీకై; నగరీ = పట్టణము, విత్తనము, సర్వశబ్దసంబోధిని, తదద్ధిదేవతా, గోపీనాథః; సంప్రతీక్షతే = ఎదురుచూచున్నది, ఆశించుచున్నది.
భావము:-
 నీవు సకలైశ్వర్య సమృద్ధమైన అయోధ్యకు తిరిగివెళ్లి పట్టాభిషిక్తుడవు అగుము. నీ కొరకై అయోధ్యానగరము, పతివ్రత భర్తకోసం ఎదురు చూచునట్లు, తన అధిదేవత కూడా నీవు చేపట్టుటకై నిరీక్షించుచుండెను.
2.108.9.
అనుష్టుప్.
రాజభోగాననుభవన్
మహార్హాన్పార్థివాత్మజ!।
విహర త్వమయోధ్యాయాం
యథా శక్రస్త్రివిష్టపే॥
టీక:-
 రాజభోగాన్ = రాజ భోగములను; అనుభవన్ = పొందుము; మహార్హాన్ = మిక్కిలి అర్హమైన; పార్థివాత్మజ = రాకుమారా; విహర = విహరించుము; త్వమ్ = నీవు; అయోధ్యాయామ్ = అయోధ్యయందు; యథా = అట్లు; శక్రః = దేవేంద్రుడు; త్రివిష్టపే = స్వర్గమునందు.
భావము:-
 రాకుమారా రామా! నీవు నీకు అర్హమైన రాజభోగములను పొందుము. దేవేంద్రుడు స్వర్గమునందు విహరించునట్లు అయోధ్యా నగరమునందు విహరించుము.
2.108.10.
అనుష్టుప్.
న తే కశ్చిద్ధశరథః
త్వం చ తస్య న కశ్చన।
అన్యో రాజా త్వమన్య చ
తస్మాత్కురు యదుచ్యతే॥
టీక:-
 న = కాడు; తే = నీకు; కశ్చిత్ = ఎవడు; దశరథః = దశరథుడు; త్వం = నీవు; తస్య = అతనికి; న = కావు; కశ్చన = ఎవడవు; అన్యః = వేరు; రాజా = రాజా; త్వం = నీవు; అన్యః = వేరు; తస్మాత్ = అందువలన; కురు = చేయుము; యత్ = ఏది; ఉచ్యతే = చెప్పబడినదో.
భావము:-
 నీకు దశరథుడు ఏమియు కాడు. అతనికి నీవు ఏమియును కావు. ఆ రాజు వేరు. నీవు వేరు. అందువలన నేను చెప్పినట్లు చేయుము.
2.108.11.
అనుష్టుప్.
బీజమాత్రం పితా జంతోః
శుక్లం రుధిరమేవ చ।
సంయుక్తమృతుమన్మాత్రా
పురుషస్యేహ జన్మ తత్॥
టీక:-
 బీజమాత్రం = బీజము మాత్రమే; పితా = తండ్రి; జంతోః = ప్రాణికి; శుక్లం = శుక్లము; రుధిరమేవ = రక్తము; సంయుక్తమ్ = కలిసినపుడు; ఋతుమన్మాత్రా = ఋతుక్రమములోనున్న తల్లి; పురుషస్య = జీవికి; ఇహ = ఈ లోకము నందు; జన్మ = జన్మించుట; తత్ = అందువలన.
భావము:-
 ప్రాణికి తండ్రి బీజము మాత్రమే. తల్లి ఋతుక్రమము ఐన పిదప శుక్లము శోణితముతో కలిసినచో ప్రాణి జన్మించుట జరుగును.
2.108.12.
అనుష్టుప్.
గతః స నృపతిస్తత్ర
గంతవ్యం యత్ర తేన వై।
ప్రవృత్తిరేషా మర్త్యానాం
త్వం తు మిథ్యా విహన్యసే॥
టీక:-
 గతః = వెళ్ళెను; సః = ఆ; నృపతిః = రాజు; తత్ర = అక్కడకు; గంతవ్యం = వెళ్ళవలసినచోటు; యత్ర = ఎక్కడకు; తేనవై = తాను; వై = నిశ్చయంగా; ప్రవృత్తిః = ప్రవృత్తి; ఏషా = ఇది; మర్త్యానాం = మానవులకు; త్వం = నీవు; మిథ్యా = అకారణముగా; విహన్యసే = పీడింపబడుచున్నావు.
భావము:-
 ఆ దశరథుడు తాను ఎక్కడకు పోవలెనో అక్కడకు పోయినాడు. ఇది మానవుల జీవన్మరణ పద్ధతి. నీవు అకారణమగ కష్టముల పాలగుచున్నావు.
2.108.13.
అనుష్టుప్.
అర్థధర్మపరా యే యే
తాంస్తాంఛోచామి నేతరాన్।
తే హి దుఃఖమిహ ప్రాప్య
వినాశం ప్రేత్య భేజిరే॥
టీక:-
 అర్థధర్మపరా = ధర్మార్థములయందు ఆసక్తి కలవారు; యే యే = ఎవరెవరు; తాంతాన్ = వారి నందరిని గూర్చి; శోచామి = విచారించుచున్నాను; న = లేదు; ఇతరాన్ = ఇతర; తే = వారు; హి = కదా; దుఃఖమ్ = దుఃఖమును; ఇహ = ఈ లోకమున; ప్రాప్య = పొంది; వినాశం = వినాశమును; ప్రేత్య = మరణించి; భేజిరే = పొందెదరు.
భావము:-
 కేవలం ధర్మార్థముల నిమిత్తము పాటుపడు వారిని చూచి నాకు జాలి కలుగుచున్నది. ఇతరుల కొరకు నాకు ఆలోచన లేదు. ఆ ధర్మార్థపరులు కష్టములను అనుభవించి మరణానంతరము కూడ వినాశనము చెందెదరు.
2.108.14.
అనుష్టుప్.
అష్టకా పితృదైవత్యం
ఇత్యయం ప్రసృతో జనః।
అన్నస్యోపద్రవం పశ్య
మృతో హి కిమశిష్యతి॥
టీక:-
 అష్టకా = అష్టక శ్రాద్ధము; పితృదైవత్యం = ప్రత్యాబ్దిక శ్రాద్ధము; ఇతి = అని; అయం = ఈ; ప్రసృతః = ప్రవర్తించుచున్నది; జనః = జనము; అన్నస్య = అన్నముయొక్క; ఉపద్రవం = నష్టమును; పశ్య = చూడుము; మృతః = మరణించిన వాడు; హి = కదా; కిమ్ = ఏమి; అశిష్యతి = తినును.
భావము:-
 మానవులు అష్టక శ్రాద్ధము, ప్రత్యాబ్దిక శ్రాద్ధము అని మరణించిన వారి కొరకై చేయుచుందురు. ఎంత అన్నము నష్టమగుచున్నదో చూడుము. మరణించిన వాడు ఏమి తినును?
2.108.15.
అనుష్టుప్.
యది భుక్తమిహాన్యేన
దేహమన్యస్య గచ్ఛతి।
దద్యాత్ప్రవసత శ్శ్రాద్ధం
న తత్పథ్యశనం భవేత్॥
టీక:-
 యది = ఒకవేళ; భుక్తమ్ = తినబడినచో; ఇహ = ఈ లోకమున; అన్యేన = ఇతరుని; దేహమ్ = శరీరమును; అన్యస్య = వేరొకనిచే; గచ్ఛతి = పొందును; దద్యాత్ = ఇవ్వవలెను; ప్రవసతః = దూరదేశమునకు పోవువానికి; శ్రాద్ధం = శ్రాద్ధమును; న = కాదు; తత్ = ఆ; పథి = మార్గమున; అశనం = ఆహారము; భవేత్ = అగును.
భావము:-
 ఈ లోకమున ఒకడు భుజించిన ఆహారముచే మరియొకని పొట్ట నిండినచో, పరదేశమునకు (పరలోకమునకు) పోవు వానికి శ్రాద్ధము పెట్టవచ్చును. అది అతనికి దారిలో ఆహారము అగును కదా!
2.108.16.
అనుష్టుప్.
దానసంవననా హ్యేతే
గ్రంథా మేధావిభిః కృతాః।
యజస్వ దేహి దీక్షస్వ
తపస్తప్యస్వ సంత్యజ॥
టీక:-
 దానసంవననా = దానము చేయమని; సంవననా = వశీకరణ విద్యలే, శబ్దరత్నాకరము; హి = కదా; ఏతే = ఇవన్నీ; గ్రంథాః = గ్రంథములు; మేధావిభిః = మేధావులచే; కృతాః = చేయబడినవి; యజస్వ = యజ్ఞము చేయుము; దేహి = ఇమ్ము; దీక్షస్వ = దీక్ష కలిగియుండుము; తపః = తపస్సు; తప్యస్వ = అభ్యసించుము; సంత్యజ = శ్రేష్ఠమైన వదలివేయుము.
భావము:-
 యజ్ఞములు చేయుమని, దానములు ఇమ్మని, దీక్షలు వహించుమని, తపస్సు చేయుమని, సర్వమును దానము చేయుమని, చెప్పుచు మేధావులు వ్రాసిన గ్రంథములన్నియు దానము చేయమని ప్రయోగించు వశీకరణ విద్యలే కదా!
2.108.17.
అనుష్టుప్.
స నాస్తి పరమిత్యేవ
కురు బుద్ధిం మహామతే।
ప్రత్యక్షం యత్తదాతిష్ఠ
పరోక్షం పృష్ఠతః కురు॥
టీక:-
 సః = ఆ; నాస్తి = లేదు; పరమ్ = పరము; ఇత్యేవ = అనియే; కురు = చేయుము; బుద్ధిం = బుద్ధిని; మహామతే = బుద్ధిమంతుడా; ప్రత్యక్షం = కనిపించుచున్న దానిని; యత్ = ఏది; తత్ = దానిని; అతిష్ఠ = చేయుము; పరోక్షం = కనిపించని దానిని; పృష్ఠతః = వెనుక; కురు = ఉంచుము.
భావము:-
 గొప్పబుద్ధిమంతుడవైన ఓ రామా! తనది కానిది ఏదియు వేరుగ లేదని భావించి, కనిపించుచున్నదానిని ఆచరించుము. కనిపించని దానికై ఏదియును ఆచరింపకుము.
2.108.18.
అనుష్టుప్.
సతాం బుద్ధిం పురస్కృత్య
సర్వలోకనిదర్శినీమ్।
రాజ్యం త్వం ప్రతిగృహ్ణీష్వ
భరతేన ప్రసాదితః॥
టీక:-
 సః = ఆ; తాం = అటువంటి; బుద్ధిం = బుద్ధిని; పురస్కృత్య = పురస్కరించుకొని; సర్వలోక = అన్ని లోకములకును; నిదర్శినీమ్ = నిదర్శనముగ; రాజ్యం = రాజ్యమును; త్వం = నీవు; ప్రతిగృహ్ణీష్వ = స్వీకరింపుము; భరతేన = భరతునిచే; ప్రసాదితః = ప్రసాదించబడిన.
భావము:-
 అన్ని లోకములేకు ఆమోదయోగ్యమైన నేను చెప్పిన ఉదాహరణములను విచారించి, భరతుడు స్వీకరించమని నీకు ఇచ్చుచున్న రాజ్యమును స్వీకరించుము.
2.108.19.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యకాణ్డే అష్టోత్తరశతతమః సర్గః.
టీక:-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; అష్టోత్తరశతతమః [108] = నూటఎనిమిదవ; సర్గః = సర్గ.
భావము:-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము; అయోధ్యకాండలోని లోని [108] నూటఎనిమిదవ సర్గ సంపూర్ణము.