2.13.1.
అనుష్టుప్.
అతదర్హం మహారాజమ్
శయానమతథోచితమ్।
యయాతిమివ పుణ్యాంతే
దేవలోకాత్పరిచ్యుతమ్॥
టీకః-
అ = వ్యతిరేకార్థము; తత్ = దానికి; అర్హం = తగినివాడు; మహారాజమ్ = మహారాజు దశరథుని; శయానమ్ = నేలపై పడి పరుండియున్న; అతథోచితమ్ = అతథ+ఉచితము, అటులుండు అలవాటు లేనివాడు; యయాతిమ్ = యయాతి రాజు; ఇవ = వలె; పుణ్యాః = పుణ్యములు; అంతే = పూర్తి అయినపుడు; దేవలోకాత్ = స్వర్గం నుండి; పరిచ్యుతమ్ = పడిపోయినవాడు.
భావంః-
దశరథుడు అట్టి దీనస్థితికి తగినవాడు గాని, అలవాటుపడ్డవాడు గాని కాదు. పుణ్యము అంతా వ్యయము అయిపోయిన తరువాత స్వర్గలోకము నుంచి, భూమిపై పడిన యయాతి చక్రవర్తి వలె అతడు నేలపై పడి ఉన్నాడు.
గమనికః-
యయాతి- వ్యుత్పత్తి. య+యాతి, యస్య వాయురివ యాతి సర్వత్ర, వాయువు వలె అంతట సంచరించువాడు. చంద్రవంశపు చక్రవర్తి. ప్రియంవద నహుషుల కుమారుడు. నహుషునికి అనంతరము మహాఖ్యాతితో రాజ్యము ఏలెను. అతిఘోర తపముచేసి, బ్రహ్మలోకము మొదలుగాఁగల దేవలోకములు అన్ని తిరిగి ఇంద్రలోకమునకు పోయి ఇంద్రునితో తన తపోమాహాత్మ్యమును పొగుడుకొనెను. అందులకు ఇంద్రుఁడు సహింపక ఆత్మస్తుతి చేసికొనువారు ఈలోకమున ఉండను అర్హులు కారు అని అతనిని అధోలోకమున పడత్రోసెను. అంత యయాతి ఖిన్నుఁడు అయి ఇంతకాలము తపముచేసి ఈలోకమునకు వచ్చి మరల భూలోకమునకు పోలేను. నన్ను మన్నించి సద్భువనమున (నక్షత్రలోకమున) ఉండునట్లు అనుగ్రహింపుము అని వేఁడఁగా అతఁడు అట్లె అనుగ్రహించెను.
2.13.2.
అనుష్టుప్.
అనర్థరూపా సిద్ధార్థా
హ్యభీతా భయదర్శినీ।
పునరాకారయామాస
తమేవ వరమంగనా॥
టీకః-
అనర్థ = కీడు; రూపా = రూపములో ఉన్నది; సిద్ధార్థా = తీరిన కోరిక గలది; హి = నిశ్చయార్థము; అభీతా = భయము లేనిది; భయదర్శినీ = భయమును ప్రదర్శించునది; పునః = మరల; ఆకారయామాస = తెలియపరచెను; తమేవ = అవే; వరమ్ = వరములను; అంగనా = సుందరి, కైకేయి.
భావంః-
అటువంటి మహారాజును, సాక్షాత్తు మూర్తీభవించిన అనర్థమా అన్నట్లు ఉన్నది, తన పని సాధించుకున్నది, ఏ మాత్రము జంకు, గొంకు లేనిది, భయపెట్టునది ఐన కైకేయి మరల అవే వరములను కోరసాగెను.
గమనికః-
అంగన- చక్కని అవయవములు కలది, శరీరసౌష్టవముగల స్త్రీ.
2.13.3.
అనుష్టుప్.
“త్వం కత్థసే మహారాజ
సత్యవాదీ దృఢవ్రతః।
మమ చేమం వరం కస్మాత్
విధారయితుమిచ్ఛసి”॥
టీకః-
త్వం = మీరు; కత్థసే = ప్రగల్భములు పలికెదవు; మహారాజ = ఓ మహారాజా; సత్యవాదీ = నిజములు పలికెడివాడు; దృఢవ్రతః = మాట నిలబెట్టుకోవటమే వ్రతముగా గలవాడు; మమ చ = నాది; చ = కూడా; ఇమం వరం = ఈ వరమును; కస్మాత్ = ఎందుకు; విధారయితుమ్ = అక్షేపించుటకు; ఇచ్ఛసి = కోరుచున్నావు.
భావంః-
మహారాజా! ‘నేను సత్యవంతుడను. చేసిన ప్రతిజ్ఞ విడువను’, అని అనుచు బడాయి చెప్పుకొనుచు ఉందువు కదా. ఇప్పుడు నా వరమును ఎందుకు కాదనుచున్నావు.
2.13.4.
అనుష్టుప్.
ఏవముక్తస్తు కైకేయ్యా
రాజా దశరథస్తదా।
ప్రత్యువాచ తతః క్రుద్ధో
ముహూర్తం విహ్వలన్నివ॥
టీకః-
ఏవం = ఇట్లు; ఉక్తః = పలుకబడిన; తు = నిశ్చయార్థం; కైకేయ్యా = కైకేయి ద్వారా; రాజా దశరథః = దశరథ మహారాజు; తథా = అప్పుడు; ప్రత్యువాచ = సమాధానము చెప్పెను; తతః = ఆపై; క్రుద్ధః = కోపముగా; ముహూర్తం = క్షణకాలము; విహ్వలన్నివ = వివశుడయి.
భావంః-
కైకేయి ఇట్లు అనగానే దశరథుడు కొంతసేపు వినశుడయి, చాలా కోపించి, ఇట్లనెను.
2.13.5.
అనుష్టుప్.
మృతే మయి గతే రామే
వనం మనుజపుంగవే।
హంతానార్యే! మమామిత్రే!
సకామా సుఖినీ భవ॥
టీకః-
మృతే = మరణించిన తరువాత; మయి = నేను; గతే = వెళ్లగ; రామే = శ్రీరాముడు; వనం = అడవి రించి; మనుజపుంగవే = మనుజులలో ఉత్తముడైన; హంత = ఘాతకురాలా వావిళ్ళ నిఘంటువు; అనార్యే = నీచురాలా; మమృ = నా; అమిత్రే = శత్రువువా; సకామా = కోరిక తీరిన తరువాత; సుఖినీ = సంతోషముగా; భవ = ఉండెదవు
భావంః-
ఓ ఘాతకురాలా! నీచురాలా! నా శత్రువా! మనుజ శ్రేష్టుడైన రాముడు అరణ్యానికి వెళ్లిన పిదప, నేను మరణించగానే, నీవు కోరిక తీరి సుఖముగా ఉండెదవు లెమ్ము.
2.13.6.
అనుష్టుప్.
స్వర్గేఽపి ఖలు “రామస్య
కుశలం” దైవతైరహమ్।
ప్రత్యాదేశాదభిహితమ్
ధారయిష్యే కథం బత॥
టీకః-
స్వర్గః = స్వర్గములో; అపి = కూడా; ఖలు = ఎట్లు; రామస్య = రాముని యొక్క; కుశలం = కుశలమును; దైవతైః = దేవతలు; అహమ్ = నేను; ప్రత్యాదేశాత్ = దాచిపెట్టుటవలన; అభిహితమ్ = హితముగా పలికిన; ధారయిష్యే = ధరింప (గ్రహింప)జేయగలను; కథం = ఏ విధముగా; బత = అయ్యో
భావంః-
నేను స్వర్గానికి వెళ్లినపుడు, "రాముడు కుశలముగా ఉన్నాడా?” అని దేవతలు ప్రశ్నించినప్పుడు, అసలు విషయము దాచిపుచ్చి, క్షేమముగానే ఉన్నాడు.. అని చెప్పి వారిని ఎట్లు నమ్మించగలను?
2.13.7.
అనుష్టుప్.
కైకేయ్యాః ప్రియకామేన
రామః ప్రవ్రాజితో మయా।
యది సత్యం బ్రవీమ్యేతత్
తదసత్యం భవిష్యతి॥
టీకః-
కైకేయ్యాః = కైకేయికి; ప్రియకామేన = ప్రియము చేయుట కొరకు; రామః = రాముడు; ప్రవ్రాజితః = పంపబడినాడు; మయా = నా చేత; యది = ఏది కలదో; సత్యం = సత్యము; బ్రవీమ + ఏతత్ = ఈ విధముగా పలికిన; తత్ = అది; అసత్యం = అసత్యము; భవిష్యతి = అనిపించును.
భావంః-
అసలు విషయము దాచకుండా, ‘కైకేయికి ప్రియము చేయట కొరకు నేను రాముని అరణ్యమునకు పంపినాను’ అని చెప్పినను అది ఎవ్వరును నమ్మరు.
2.13.8.
అనుష్టుప్.
అపుత్రేణ మయా పుత్రః
శ్రమేణ మహతా మహాన్।
రామో లబ్ధో మహాబాహు
స్సకథం త్యజ్యతే మయా॥
టీకః-
అపుత్రేణ = సంతానరహితుడు; మయా = నా చేత; పుత్రః = సంతానముగా; శ్రమేణ = మిక్కిలి కృషితో; మహతా = గొప్పదైన; మహాన్ = గొప్పవాడు; రామః = రాముడు; లబ్ధః = లభించెను; మహాబాహుః = శక్తిమంతమైన బాహువులు కలిగి; సః = అతడు; కథం = ఏ విధముగా; త్యజ్యతే = విడిచిపెట్టగలను; మయా = నాచేత
భావంః-
పుత్రుడు లేని నేను ఎంతో శ్రమపడి, గొప్పవాడు, మహాపరాక్రమశాలి అయిన రాముని పుత్రునిగా పొందితిని. అట్టి రాముని ఎట్లు విడువగలను?
2.13.9.
అనుష్టుప్.
శూరశ్చ కృతవిద్యశ్చ
జితక్రోధో క్షమాపరః।
కథం కమలపత్రాక్షో
మయా రామో వివాస్యతే॥
టీకః-
శూరః = శూరుడు; చ = మఱియు; కృతవిద్యాః = నేర్వబడిన విద్యలు గలవాడు; చ = మఱియు; జితక్రోధః = జయించి బడిన కోపము గలవాడు; క్షమాపరః = ఓరిమి, క్షమాగుణము కలిగినవాడు; కథం = ఏ విధముగ; కమలపత్రాక్షః = తామర పత్రముల వంటి కన్నులు గలవానికి; మయా = నా చేత; రామః = రాముడు; వివాస్యతే = దేశబహిష్కరణ
భావంః-
శూరుడు, విద్యలన్నీ అభ్యసించిన వాడు, కోపము జయించినవాడు, ఓర్పు కలవాడు, తామరరేకుల వంటి నేత్రములు కలవాడు అయిన రామునికి నేను దేశబహిష్కరణశిక్ష వేయగలను.
2.13.10.
అనుష్టుప్.
కథమిందీవరశ్యామమ్
దీర్ఘబాహుం మహాబలమ్।
అభిరామమహం రామమ్
ప్రేషయిష్యామి దండకాన్॥
టీకః-
కథమ్ = ఏ విధముగా; ఇందీవరశ్యామమ్ = నీలి కలువల వలె ముదురు నీలి ఛాయవాడు; దీర్ఘబాహుం = దీర్ఘబాహువులు; మహాబలమ్ = బలవంతుడు; అభిరామమ్ = మనోహరమైనవాడు; అహం = నేను; రామమ్ = రాముని; ప్రేషయిష్యామి = పంపగలను; దండకాన్ = దండకారణ్యములకు, దండనలకు.
భావంః-
నల్ల కలువల వలె నీలివర్ణపు ఛాయ కలవాడు, దీర్ఘబాహువులు కలవాడు, బలవంతుడు, మనోహరమైనవాడు అయిన రాముని దండకారణ్యములకు పొమ్మని శిక్షలు వేయగలను.
2.13.11.
అనుష్టుప్.
సుఖానాముచితస్యైవ
దుఃఖైరనుచితస్య చ।
దుఃఖం నామానుపశ్యేయమ్
కథం రామస్య ధీమతః॥
టీకః-
సుఖానామ్ = సుఖములకు; ఉచితస్య = అలవడినవాడు; ఏవ = మాత్రము; దుఃఖైః = ఇబ్బందులు; అనుచితస్య చ = అలవాటు లేనివాడు; చ = ఇంకా; దుఃఖం = కష్టములు; నామ = పేరు గల; అనుపశ్యేయమ్ = నేను చూడగలను; కథం = ఏ విధముగా; రామస్య = రాముని యొక్క; ధీమతః = ధీమంతుడు
భావంః-
రాముడు సుఖములకు అలవాటుపడినవాడు. కష్టములను ఎరుగడు. అట్టి బుద్ధిమంతుడైన రాముడు కష్టలనువాటిని పడుచుండుట నేనెట్లు ఊహించగలను.
2.13.12.
అనుష్టుప్.
యది దుఃఖమకృత్వాఽద్య
మమ సంక్రమణం భవేత్।
అదుఃఖార్హస్య రామస్య
తత స్సుఖమవాప్నుయామ్॥
టీకః-
యది = ఏ విధముగా; దుఃఖమ్ = దుఃఖము; అకృత్వా = కలిగించక; అద్య = ఇప్పుడు ; మమ = నాకు; సంక్రమణం = మరణము; భవేత్ = సంభవిస్తే; అదుఃఖార్హస్య = దుఃఖములకు తగనివాడు; రామస్య = రామునకు; తతః = అట్లు; సుఖమ్ = సంతోషము; అవాప్నుయామ్ = నేను పొందెదను
భావంః-
దుఃఖాలకు తగని రామునికి దుఃఖము కలిగించకుండగా నేను ఇప్పుడే మరణించినట్లయితే నాకు సుఖము కలుగును.
గమనికః-
(1) సంక్రమణము- వ్యుత్పత్తి. సమ్+ క్రము- పాదవిన్యాసే+ ల్యూట్- అన- ణత్వమ్, కృ.ప్ర., స్థితి, దశ, రీతి యందు మార్పులకు లోనగుట, నిగమము, తృణజులూక న్యాయమున ఒక దేహమును వీడి, మఱియొక దేహము పొందుట, మరణము. సూర్యుని రాశి మారుట. (2) తృణజులూక న్యాయము- గడ్డి పురుగు/ గొంగళీ పురుగు ఒక తృణము (గడ్డి పోచ) పట్టుకుని ఉన్న ఈ పురుగు, తన శరీరమును చాచి మఱియొక తృణము పట్టుకొని గాని, ముందటి తృణమును వదులదు. అట్లే జీవి మరొక దేహమ దొరక పుచ్చుకొని, పాత దేహమును విడుచును.
2.13.13.
అనుష్టుప్.
నృశంసే! పాపసంకల్పే!
రామం సత్యపరాక్రమమ్।
కిం విప్రియేణ కైకేయి!
ప్రియం యోజయసే మమ।
అకీర్తి రతులా లోకే
ధ్రువః పరిభవశ్చ మే॥
టీకః-
తథా = ఈ విధంగా; విలపతః = విలపించుచుండ; తస్య = ఆయన; పరిభ్రమిత చేతసః = తిరుగుచున్న; చేతసః = మనస్సుతో; అస్తమభ్యగమత్ = అస్తాద్రికి చేరెను; సూర్యః = సూర్యుడు; రజనీ = రాత్రి; చ = కూడా; అభ్యవర్తత = వచ్చెను.
భావంః-
క్రూరురాలా! పాపిష్టిదానా! కైకేయీ! సత్యపరాక్రమవంతుడు, నాకు చాలా ఇష్టుడు అయిన రామునికి ఎందుచేత కీడు కలిగించుచున్నావు. నాకు ఈ లోకములో గొప్ప అపకీర్తి, పరాభవము తప్పవు.
2.13.14.
అనుష్టుప్.
తథా విలపతస్తస్య
పరిభ్రమితచేతసః।
అస్తమభ్యగమత్సూర్యో
రజనీ చాభ్యవర్తత॥
టీకః-
తథా = ఈ విధంగా; విలపతః = విలపించుచుండ; తస్య = ఆ దశరథుడు; పరిభ్రమిత = మిక్కిలి చలించిన; చేతసః = మనస్సుతో; అస్తమ్ = అస్తమించుట; అభ్యగమత్ = చేరెను; సూర్యః = సూర్యుడు; రజనీ = రాత్రి; చ = కూడా; అభ్యవర్తత = వచ్చెను
భావంః-
చెదిరిన మనస్సుతో దశరథుడు ఈ విధముగా విలపించుచుండగా సూర్యుడు అస్తమించి రాత్రి ఆయెను.
2.13.15.
అనుష్టుప్.
సా త్రియామా తథార్తస్య
చంద్రమండలమండితా।
రాజ్ఞో విలపమానస్య
న వ్యభాసత శర్వరీ॥
టీకః-
సా = ఆ; త్రియామా = మూడు జాములు (తొమ్మిది గంటలలో); తథా = ఆ విధముగా; ఆర్తస్య = బాధతో; చంద్రమండల మండితా = వృత్తాకార చంద్రునితో అలంకరించబడినప్పటికిని; రాజ్ఞః = దశరథ మహారాజునకు; విలాపమానస్య = విలపించిచున్నవాడు; న వ్యభాసత = ప్రకాశించలేదు; శర్వరీ = రాత్రి
భావంః-
ఆర్తుడై ఆ విధముగా విలపించుచున్న దశరథునికి, రాత్రి చంద్రమండలముతో ప్రకాశించుచున్నను, చీకటిగానే ఉండెను.
గమనికః-
యామము- జాము, అహోరాత్రములో ఎనిమిదవ (1/8వ)వంతు కాలము, ఇప్పటి రోమను కాలమానములో మూడు (3) గంటలు
2.13.16.
అనుష్టుప్.
తథైవోష్ణం వినిశ్వస్య
వృద్ధో దశరథో నృపః।
విలలాపార్తవద్దుఃఖమ్
గగనాసక్తలోచనః॥
టీకః-
తథైవ = ఆ విధముగా; ఉష్ణం = వేడిగా; వినిశ్వస్య = నిట్టూర్చి; వృద్ధః = వృద్ధుడు; దశరథః = దశరథుడను; నృపః = రాజు; విలలాప = విలపించెను; ఆర్తవత్ = వ్యాధితో బాధపడినట్లు; దుఃఖమ్ = దుఃఖముతో; గగనాసక్త లోచనః = ఆకాశములో లగ్నమైన కన్నులతో.
భావంః-
ఆ వృద్ధ దశరథుడు వేడి నిట్టూర్పులు విడుచుచు, రోగ పీడితుని వలె ఆకాశము వైపు చూచుచు అతి దీనముగా విలపించెను.
2.13.17.
అనుష్టుప్.
న ప్రభాతం త్వయేచ్ఛామి
నిశే నక్షత్రభూషణే!।
క్రియతాం మే దయా భద్రే
మయాఽయం రచితోంజలిః॥
టీకః-
న = లేదు; ప్రభాతం = ఉదయమును; త్వయః = నీ చేత; ఇచ్ఛామి = కోరుకొనుట; నిశే = రాత్రీ; నక్షత్ర = నక్షత్రములతో; భూషణే = అలంకరించబడిన; క్రియతాం = చేయబడుగాక; మే = నాకు; దయా = దయ; భద్రే = శుభకరమైన; మయా = నా చేత; అయం = ఈ; రచితః = చేయబడినది; అంజలిం = దోసిలి
భావంః-
నక్షత్రములను అలంకారములుగ ధరించిన మంగళకరివైన ఓ రాత్రీ! నాకు తెల్లవారనీకుము. ఇదిగో అంజలి ఘటించి ప్రార్థించుచున్నాను.
2.13.18.
అనుష్టుప్.
అథవా గమ్యతాం శీఘ్రమ్
నాహమిచ్ఛామి నిర్ఘృణామ్।
నృశంసాం కైకయీం ద్రష్టుమ్
యత్కృతే వ్యసనం మహత్”॥
టీకః-
అథవా = లేకుంటే; గమ్యతాం = వెళ్ళబడుగాక (వెళ్లిపొమ్ము); శీఘ్రమ్ = వేగముగా; న = లేదు; అహమ్ = నేను; ఇచ్ఛామి = కోరుకొనుట; నిర్ఘృణామ్ = దయలేనిది; నృశంసాం = క్రూరురాలు; కైకయీం = కైకేయిని; ద్రష్టుమ్ = చూచుటకు; యత్కృతే = ఎవరి కారణముగా; వ్యసనం = విపత్తు సంభవించినదో; మహత్ = గొప్పదైన
భావంః-
లేదా ఓ రాత్రీ తొందరగా గడచిపొమ్ము. ఇంత ఆపదకు కారణభూతురాలు, దయావిహీనురాలు, క్రూరురాలు అయిన కైకేయిని చూచుట నాకు ఏ మాత్రము ఇష్టము లేదు.”
2.13.19.
అనుష్టుప్.
ఏవముక్త్వా తతో రాజా
కైకేయీం సంయతాంజలిః।
ప్రసాదయామాస పునః
కైకేయీం చేదమబ్రవీత్॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = మాట్లాడి; తతః = ఆ తరువాత; రాజా = రాజు; కైకేయీం = కైకేయిని; సంయతాంజలిః = ముకుళించిన చేతులతో; ప్రసాదయామాస = ప్రాధేయపడెను; పునః = మరల; కైకేయీం = కైకేయి గురించి; చ = మఱియు; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = మాట్లాడెను
భావంః-
ఆ రాజు ఈ విధముగా పలికి, పిదప చేతులు జోడించి నమస్కరించుచు కైకేయిని ప్రాధేయపడెను. ఇంకనూ ఆమెతో ఇట్లు పలికెను.
2.13.20.
అనుష్టుప్.
“సాధు వృత్తస్య దీనస్య
త్వద్గతస్య గతాయుషః।
ప్రసాదః క్రియతాం దేవి
భద్రే రాజ్ఞో విశేషతః॥
టీకః-
సాధువృత్తస్య = మంచి ప్రవర్తన కలిగినవాడను; దీనస్య = దీనుడను; త్వత్ = నిన్ను; గతస్య = ఆశ్రయించిన వాడను; గతాయుషః = గతించిన ఆయుర్దాయము కలవాడును; ప్రసాదః = అనుగ్రహము; క్రియతాం = చేయబడుగాక; దేవి = ఓ రాణీ; భద్రే = శుభప్రదురాలవైన; రాజ్ఞః = రాజును; విశేషతః = ముఖ్యముగా
భావంః-
“శుభప్రదురాలవైన ఓ రాణీ! నేను మంచి నడవడిక కలవాడను, దీనుడను. నిన్ను ఆశ్రయించినవాడను. క్షీణించిన ఆయుర్దాయము కలవాడను, ముఖ్యముగా రాజును, నన్ను అనుగ్రహించుము.
2.13.21.
అనుష్టుప్.
శూన్యే న ఖలు సుశ్రోణి!
మయేదం సముదాహృతమ్।
కురు సాధు ప్రసాదం మే
బాలే! సహృదయా హ్యసి॥
టీకః-
శూన్యే = శూన్యములో (ఆకాశములో); న = కాదు; ఖలు = నిశ్చయముగ; సుశ్రోణి = మంచి కటిప్రదేశము కలదానా, సుందరీ; మయా= నాచేత; ఇదం = ఇది అంతయు; సముదాహృతమ్ = పలుకబడినది; కురు = చేయుము; సాధు = బాగుగా; ప్రసాదం = అనుగ్రహమును; మే = నాకు; బాలే = ఓ యువతీ; సహృదయా హి అసి = మంచి హృదయము కలదానవు
భావంః-
ఓ సుశ్రోణీ, నేను చెప్పుచున్నది ఆకాశములో కలసిపోవుటలేదు కదా. ఓ బాలా, నా విషయములో అనుగ్రహించుము. నీవు మంచి హృదయము కలదానవు కదా.
2.13.22.
అనుష్టుప్.
ప్రసీద దేవి! రామో మే
త్వద్దత్తం రాజ్యమవ్యయమ్।
లభతామసితాపాంగే!
యశః పరమవాప్ను హి॥
టీకః-
ప్రసీద = దయతో ఉండుము; దేవి = ఓ రాణీ; రామో = రాముని; మే = నా యొక్క; త్వద్దత్తం = నీ చేత ఇవ్వబడిన; రాజ్యమ్ = రాజ్యమును; అవ్యయమ్= శాశ్వతమైన; లభతామ్ = పొందుగాక; అసిత అపాంగే = నల్లని కనుకొనలతో; యశః = కీర్తి; పరమ = గొప్ప; అవాప్ను = పొందుదువు; హి = కూడా.
భావంః-
నల్లని నేత్రాంతములు కల ఓ దేవీ! అనుగ్రహించుము. నా రాజ్యము రామునకు నీవే ఇమ్ము. ఈ విధముగా శాశ్వత కీర్తి సంపాదించుకొందుదువు.
2.13.23.
అనుష్టుప్.
మమ రామస్య లోకస్య
గురూణాం భరతస్య చ।
ప్రియమేతద్గురుశ్రోణి!
కురు చారుముఖేక్షణే!॥
టీకః-
మమ = నాకు; రామస్య = రామునికి; లోకస్య = లోకములకు; గురూణాం = గురువులకు; భరతస్య చ = భరతునికి మఱియు; ప్రియమ్ = సంతోషకరమైనది, ఏతత్ = దీనిని; గురుశ్రోణి = ఓ విశాలమైన కటిప్రదేశము కలదానా; కురు = చేయుము; చారు ముఖ, ఈక్షణే = అందమైన ముఖమును కన్నులును కలదానా!
భావంః-
ఓ విశాల శ్రోణీ! సుందరముఖీ! చారునేత్రీ! ఈ పని చేయుము. ఇది నాకు, లోకమునకు, రామునికి, గురువులకు, భరతునకు కూడా ప్రియమైనది.
2.13.24.త్రిష్టుప్
విశుద్ధభావస్య సుదుష్టభావా
తామ్రేక్షణస్యాశ్రుకలస్య రాజ్ఞః।
శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం
భర్తుర్నృశంసా న చకార వాక్యమ్॥
టీకః-
విశుద్ధృ = పరిశుద్ధమైన; భావస్య = హృదయముగల; సుదుష్టభావా = దుష్ట భావము గలామె; తామ్రేక్షణస్య = ఎఱ్ఱని కన్నుల; అశ్రుకలస్య = కన్నీటిబిందువులు కల; రాజ్ఞః = రాజు; శ్రుత్వా = విన్న తరువాత; విచిత్రం = విచిత్రమైన రీతిలో; కరుణం = హృదయ విదారకమైన; విలాపం = విలాపమును; భర్తః = భర్త; నృశంసా = క్రూరురాలు; న = లేదు; చకార = లక్ష్యపెట్టుట; వాక్యమ్ = మాటలు.
భావంః-
విశుద్ధమైన హృదయము గల రాజు, తనభర్త, దీనుడై, ఎఱ్ఱటి కన్నీటి బిందువులు కార్చుచు, అనేక విధముల దీనముగా విలపించుచుండగా విని, దుష్ట స్వభావము గల ఆ క్రూరురాలు అతని మాటలను లక్ష్యము చేయలేదు.
2.13.25.
జగతి.
తతస్స రాజా పునరేవ మూర్ఛితః
ప్రియామతుష్టాం ప్రతికూలభాషిణీమ్।
సమీక్ష్య పుత్రస్య వివాసనం ప్రతి
క్షితౌ విసంజ్ఞో నిపపాత దుఃఖితః॥
టీకః-
తతః = ఆ తరువాత; సః = అతడు; రాజా = దశరథ మహారాజు; పునః ఏవ = మరల; మూర్ఛితః = మూర్ఛపోయినవాడు; ప్రియామ్ = ప్రియభార్య; అతుష్టాం = సంతసింపకున్న; ప్రతికూల = వ్యతిరేకముగా; భాషిణీమ్ = మాట్లాడుచున్న; సమీక్ష్య = చూచి; పుత్రస్య = కుమారుని; వివాసనమ్ = దేశబహిష్కరాదిశిక్షల; ప్రతి = గురించి; క్షితౌ = నేలపై; విసంజ్ఞః = స్పృహ కోల్పోయి; నిపపాత = పడిపోయెను; దుఃఖితః = బాధపడినవాడై.
భావంః-
ఎంత చెప్పినను సంతోషించక, రాముని అరణ్యములకు పంపవలెనని ప్రతికూలముగా మాటలాడుచున్న భార్యను చూచి, ఆ రాజు దుఃఖితుడై, మరల మూర్ఛితుడై నేల మీద పడిపోయెను.
2.13.26.
జగతి.
ఇతీవ రాజ్ఞో వ్యథితస్య సా నిశా
జగామ ఘోరం శ్వసతో మనస్వినః।
విబోధ్యమానః ప్రతిబోధనం తదా
నివారయామాస స రాజసత్తమః॥
టీకః-
ఇతీవ = ఈ విధముగా; రాజ్ఞః = దశరథ మహారాజు; వ్యథితస్య = బాధపడిన; సా = ఆ; నిశా = రాత్రి; జగామ = గడచెను; ఘోరం = భయంకరముగ; శ్వసతః = నిట్టూర్చుచుండ; మనస్వినః = ఆత్మగౌరవము గల; విబోధ్యమానః = మేల్కొలుపబడుచు; ప్రతిబోధనం = మేల్కొలుపును; తదా = అప్పుడు; నివారయామాస = నివారించెను; స = ఆ; రాజసత్తమః = ఉత్తముడైన రాజు.
భావంః-
ఆత్మాభిమానవంతుడైన దశరథుడు ఆ విధముగా దుఃఖించుచు, తీవ్రమైన నిట్టూర్పులు విడుచుచు ఉండ, రాత్రి గడచిపోయినది. ప్రాతఃకాలమున వందిమాగధులు వచ్చి మేల్కొల్పుటకు పూనుకొనిరి. కాని ఆ రాజశ్రేష్ఠుడు వారిని నివారించెను.
2.13.27.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే త్రయోదశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; త్రయోదశః [13] = పదమూడవ; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [13] పదమూడవ సర్గ సంపూర్ణము.
2.14.1.
అనుష్టుప్.
పుత్రశోకార్దితం పాపా
విసంజ్ఞం పతితం భువి।
వివేష్టమానముద్వీక్ష్య
సైక్ష్వాకమిదమబ్రవీత్॥
టీకః-
పుత్రశోక + అర్థితం = తన కుమారుని వేదన చేత వేధింపబడినవాడు; పాపా = చెడు స్వభావం గల స్త్రీ; విసంజ్ఞం = అపస్మారకము కలవాడు; పతితం = పడిపోయినవాడు; భువి = నేలపై; వివేష్టమానమ్ = దొర్లుచున్నవాడిని; ఉత్వీక్ష్య = పైకి చూచి; సా = ఆమె; ఇక్ష్వాకమ్ = ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథుని గూర్చి; ఇదమ్ = ఈ మాటలను; అబ్రవీత్ = మాట్లాడెను.
భావంః-
పుత్ర శోకముతో బాధపడుచు స్పృహ లేకుండా నేలమీద పడి, దొర్లుచున్న ఆ దశరథునితో ఆ పాపాత్మురాలు ఇట్లు పలికెను.
2.14.2.
అనుష్టుప్.
“పాపం కృత్వేవ కిమిదమ్
మమ సంశ్రుత్య సంశ్రవమ్।
శేషే క్షితితలే సన్నః
స్థిత్యాం స్థాతుం త్వమర్హసి॥
టీకః-
పాపం = పాపమును; కృత్వా = చేసినవాని; ఇవ = వలె; కిమ్ = ఏమిటి; ఇదమ్ = ఇది; మమ = నా మాటలు; సంశ్రుత్య = విన్న తరువాత; సంశ్రవమ్ = వాగ్దానమును; శేషే = పండుకొన్నావు; క్షితి తలే = నేలపై; సన్నః = దుఃఖముతో; స్థిత్యాం = నైతికత యొక్క హద్దుల్లో; స్థాతుమ్ = ఉండుటకు; త్వమ్ = నీవు; అర్హసి = తగుదువు.
భావంః-
“ఏమిటిది? నాకిచ్చిన ప్రతిజ్ఞ వినగానే ఏదో మహాపాపం చేసినవాని వలె దుఃఖించుచు నేలపై పడి ఉంటివి! నీవు నీ మర్యాద పాటించుము.
2.14.3.
అనుష్టుప్.
ఆహు స్సత్యం హి పరమమ్
ధర్మం ధర్మవిదో జనాః।
సత్యమాశ్రిత్య హి మయా
త్వం చ ధర్మం ప్రబోధితః॥
టీకః-
ఆహుః = పలుకుదురు; సత్యం = సత్యమును; హి = పాదపూరణం; పరమమ్ = అత్యున్నత; ధర్మమ్ = ధర్మముగా; ధర్మవిదః = ఏది ధర్మమో తెలిసినవారు; జనాః = ప్రజలు; సత్యమ్ = సత్యములో; ఆశ్రిత్య = ఆశ్రయించిన; హి = కూడా; మయా = నా చేత; త్వం = మీరు; చ = మఱియు; ధర్మమ్ = కర్తవ్యము; ప్రబోధితః = చెప్పబడుతున్నది
భావంః-
ధర్మవేత్తలయిన జనులు సత్యమే ధర్మమని చెప్పుదురు కదా! నేను కూడా ఆ సత్యమును ఆశ్రయించి నిన్ను ధర్మమును గురించి గుర్తుచేయు చుంటిని.
2.14.4.
అనుష్టుప్.
సంశ్రుత్య శైబ్యశ్శ్యేనాయ
స్వాం తనుం జగతీపతిః।
ప్రదాయ పక్షిణే రాజన్
జగామ గతిముత్తమామ్॥
టీకః-
సంశ్రుత్య = చేసిన వాగ్దానముః శైబ్యః = శిబి యొక్క; శ్యేనాయ = డేగకు; స్వామ్ = తనది; తనుమ్ = శరీరమును; జగతీపతిః = జగత్తును పరిపాలించు రాజు; ప్రదాయ = ఇచ్చెను; పక్షిణే = పక్షికి; రాజన్ = రాజు; జగామ = పొందెను; గతిమ్ = గతిని , ఉత్తమమ్ = అత్యున్నతమైన.
భావంః-
రాజా! మహారాజు శిబి చేసిన ప్రతిజ్ఞ ‘తన దేహమును డేగకు ఇచ్చెదనని’. రాజు ఆ ప్రతిజ్ఞ ప్రకారము డేగకు దానమిచ్చి ఉత్తమలోకములు పొందెను.
2.14.5.
అనుష్టుప్.
తథా హ్యలర్కస్తేజస్వీ
బ్రాహ్మణే వేదపారగే।
యాచమానే స్వకే నేత్రే
ఉద్ధృత్యావిమనా దదౌ॥
టీకః-
తథా హి = అదే కోవలో; అలర్కః = అలర్కుడు; తేజస్వీ = తేజశ్శాలి; బ్రాహ్మణే = బ్రాహ్మణునకు; వేదపారగే = వేదపండితుడు; యాచమానే = అడిగినప్పుడు;స్వకే = తన సొంత; నేత్రే = నేత్రములను; ఉద్ధృత్య = పెకిలించి; అవిమనాః = నిస్సంకోచముగా; దదౌ = ఇచ్చెను.
భావంః-
అదే కోవలో, తేజఃశాలి అయిన అలర్కుడు వేదపారంగతుడయిన బ్రాహ్మణుడు వచ్చి కోరగా ఎట్టి నిస్సంకోచము లేక తన కన్నులు పెకలించి ఇచ్చివేసెను.
2.14.6.
అనుష్టుప్.
సరితాం తు పతిస్స్వల్పామ్
మర్యాదాం సత్యమన్వితః।
సత్యానురోధాత్సమయే
స్వాం వేలాం నాతివర్తతే॥
టీకః-
సరితామ్ = నదుల యొక్క; తు = కూడా; పతిః = భర్త; స్వల్పామ్ = అతి స్వల్పమైన; మర్యాదామ్ = సరిహద్దును; సత్యమ్ = సత్యమును; అన్వితః = అనుసరించువాడు, కూడినవాడు; సత్యః = సత్యమును; అనురోధాత్ =అనువర్తన; సమయే = నియమమువలన; స్వామ్ = తన యొక్క; వేలామ్ = చెలియలికట్టను; న = లేదు; అతివర్తతే = అతిక్రమించుట.
భావంః-
సత్యసంధుడైన సముద్రుడు కూడా, పోటు సమయములలో ఎంత పైకి వచ్చినా, తన సత్యము అనువర్తింపవలెనను నియమము వలన, అతి స్వల్పమైన సరిహద్దుగా ఉన్న చెలియలికట్టను సైతము దాటుట లేదు.
2.14.7.
అనుష్టుప్.
సత్యమేకపదం బ్రహ్మ
సత్యే ధర్మః ప్రతిష్ఠితః।
సత్యమేవాక్షయా వేదాః
సత్యేనైవాప్యతే సరమ్॥
టీకః-
సత్యమ్ = సత్యము; ఏకపదమ్ = ఒకే మాట; బ్రహ్మ = బ్రహ్మస్వరూపము; సత్యే = సత్యముపై; ధర్మః = ధర్మము; ప్రతిష్ఠితః = ప్రతిష్ఠితమైయున్నది; సత్యమేవ = సత్యము మాత్రమే; అక్షయా = నశించనది; వేదాః = జ్ఞానం; సత్యేనృ = సత్యము చేత; ఏవ = మాత్రమే; ఆప్యతే = పొందబడును; పరమ్ = సర్వోన్నతమైనది
భావంః-
సత్యము అనే ఒక్కపదము బ్రహ్మస్వరూపము. ధర్మము సత్యము పైననే ఆధారపడి ఉన్నది. సత్యమే అక్షయ వేదాలు. సత్యము ద్వారానే పరమపదమును చేరగలుగుతారు.
2.14.8.
అనుష్టుప్.
సత్యం సమనువర్తస్వ
యది ధర్మే ధృతా మతిః।
సఫలస్స వరో మేఽస్తు
వరదో హ్యసి సత్తమ॥
టీకః-
సత్యమ్ = సత్యమును; సమనువర్తస్వ = అనుసరించుము; యది = ఏది కలదో; ధర్మే = ధర్మముమీద; ధృతా = నిలిపినచో; మతిః = మనసును, బుద్ది; సఫలః = సఫలము; వరః = వరము; మే = నాకు; అస్తు = అగుగాక; వరదః హి = వరములు ప్రసాదించినవాడవు; అసి = అయితివి; సత్తమః = ఓ శ్రేష్ఠమైనవాడా!
భావంః-
ఓ పురుషశ్రేష్ఠా! నీ బుద్ధి ధర్మము పైననే స్థిరముగా నిలిపి ఉన్నచో సత్యమును పాటించుము. నా వరములు సఫలము అగునట్లు చేయుము. ఆ వరములిచ్చినవాడవు నీవే కదా!
2.14.9.
అనుష్టుప్.
ధర్మస్యైహాభికామార్థమ్
మమ చైవాభిచోదనాత్।
ప్రవ్రాజయ సుతం రామమ్
త్రిఃఖలు త్వాం బ్రవీమ్యహమ్॥
టీకః-
ధర్మస్య = ధర్మముయొక్క; ఇహ = ఈ విషయములో; అభికామః = ఆకాంక్ష; అర్థమ్ = కొఱకు; మమ = నా యొక్క; చ = మఱియు; ఏవ = మాత్రమే; అభిచోదనాత్ = ప్రేరేపణలు వలన; ప్రవ్రాజయ = దూరముగా (అరణ్యములకు); సుతం = కొడుకు అయిన; రామమ్ = రాముని; త్రిఃఖలు = మూడు మారులు; త్వామ్ = నీకు; బ్రవీమి = చెప్పుచున్నాను; అహమ్ = నేను
భావంః-
ధర్మముమీద నాకుగల ఆకాంక్ష ప్రేరేపించుటచే మాత్రమే నా కొడుకు రాముడుని దూరముగా అడవులకు పంపుము. పంపుము, పంపుము అని మూడుమార్లు చెప్పుచున్నాను.
2.14.10.
అనుష్టుప్.
సమయం చ మమార్యేమమ్
యది త్వం న కరిష్యసి।
అగ్రతస్తే పరిత్యక్తా
పరిత్యక్ష్యామి జీవితమ్”॥
టీకః-
సమయం = ఒప్పందమును; చ = మఱియు; మమ = నాకు;ఆర్యః = ఓ గౌరవనీయుడా; ఇమమ్ = దీనిని; యది = ఈ విధముగా; త్వం = నీవు; న = లేనిచో; కరిష్యసి = చేయుట; అగ్రతః = ముందు; తే = నీ యొక్క; పరిత్యక్తా = విడువబడి; పరిత్యక్ష్యామి = విడువగలను; జీవితమ్ = జీవతమును.
భావంః-
ఓ పూజ్యుడా ! నీవు నాకిచ్చిన మాటను నెరవేర్చక విడిచిపెట్టినచో నేను నీ ఎదుటనే నా జీవితము చాలించెదను.”
2.14.11.
అనుష్టుప్.
ఏవం ప్రచోదితో రాజా
కైకేయ్యా నిర్విశంకయా।
నాశక త్పాశమున్మోక్తుమ్
బలిరింద్రకృతం యథా॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగా; ప్రచోదితః = నిర్బంధింబడి; రాజా = దశరథ మహారాజు; కైకేయ్యా = కైకేయి చేత; నిర్విశంకయా = జంకుగొంకు లేక; నా = లేకపోయెను; శకత్ = చేయజాలుట; పాశమ్ = ధర్మపాశమును; ఉన్ముక్తమ్ = విడుచుటను; బలిః = బలి చక్రవర్తి; ఇంద్ర = పరమేశ్వరునిచేత; కృతమ్ = ప్రయోగింపబడిన; యథా = ఏ విధముగ.
భావంః-
ఏ మాత్రమూ జంకు, గొంకు లేక కైకేయి ఈ విధముగా నిర్బంధించుటతో దశరథుడు, భగవంతుడైన వామనుని ద్వారా ప్రయోగించిన ధర్మపాశమును బలి చక్రవర్తి విడిపించుకొనలేకపోయినట్లు విడిపించుకొనలేకపోయెను.
గమనికః-
(1) ఇంద్ర- వ్యుత్పత్తి. ఇది+రా, ఇందతి పరమైశ్వర్యవాన్ భవతి పరమైశ్వర్యవంతుడు. భగవంతుడు (ఋ. 5.32.1), వ్యుత్పత్తి., ఇది- పరమేశ్వర్యే- ఇంద్+రన్, ఔణా, పరమేశ్వరుడు. (2) అసుర చక్రవర్తి బలి స్వర్గమును ఆక్రమించెను. అటుల రాజ్యభ్రష్టుడైన ఇంద్రుడు శ్రీమహావిష్ణువును ఆశ్రయించెను. శ్రీమహావిష్ణువు వామనావతారమెత్తి బలిని మూడడుగుల మేర దానము ఇమ్మని కొరెను. అట్లే యని వాగ్దానము చేసి, దానము ఇచ్చెను. పిమ్మట, ఆ వాగ్ధాన పాశమునకు కట్టుపడి, స్వర్గము వీడి పాతాళమున కేగెను.
2.14.12.
అనుష్టుప్.
ఉద్భ్రాంతహృదయశ్చాపి
వివర్ణవదనోఽభవత్।
స ధుర్యోవైపరిస్పందన్
యుగచక్రాంతరం యథా॥
టీకః-
ఉత్ = మిక్కిలి; భ్రాంతః = వికల్పమైన; హృదయః = హృదయము కలవాడు; చాపి = ఇంకను; వివర్ణ = పాలిపోయిన; వదనః = ముఖము కలవాడు; అభవత్ = అయ్యెను; సః = అతడు, దశరథుడు; ధుర్యః = బరువుమోసెడి ఎద్దు; వై = పాదపూరణము, పరిస్పన్థన్ = కట్టబడియున్న; యుగ = రెండు, బండికి రథమునకు ఎద్దు, గుఱ్ఱమలు కట్టుటకగు కాడి; చక్రాంతరం = చక్రములమధ్య; యథా = వలె
భావంః-
కాడికి కట్టబడిన ఎద్దు, చక్రముల మధ్య నలిగిపోవునట్లు దశరథుని హృదయము వికల్పమైపోయెను, ముఖము పాలిపోయెను.
2.14.13.
అనుష్టుప్.
విహ్వలాభ్యాం చ నేత్రాభ్యామ్
అపశ్యన్నివ భూపతిః।
కృచ్ఛ్రాద్ధైర్యేణ సంస్తభ్య
కైకేయీమిదమబ్రవీత్॥
టీకః-
విహ్వలాభ్యాం = బెదురుచూపుల; చ = మఱియు; నేత్రాభ్యామ్ = కన్నులతో; అపశ్నత్ = చూడలేనివాని; ఇవ = వలె; భూపతిః = రాజు; కృత్ = కష్టముతో; చ = పాదపూరణం; ధైర్యేణ = ధైర్యముతో; సంస్తభ్య = స్థిరముగా నిలచి; కైకేయీమ్ = కైకేయి గూర్చి; ఇదమ్ = ఈ మాటలు; అబ్రవీత్ = పలికెను
భావంః-
దశరథుడు బెదురు చూపులు చూచుచు, చూడలేనివానివలె ఉండెను. అట్టి స్థితిలోనూ అతి కష్టముగా ధైర్యముతో నిలద్రొక్కుకుని కైకేయితో ఇట్లు అనెను.
2.14.14.
అనుష్టుప్.
“యస్తే మంత్రకృతః పాణిః
అగ్నౌ పాపే మయా ధృతః।
తం త్యజామి స్వజం చైవ
తవ పుత్రం త్వయా సహ॥
టీకః-
యః = ఏ; తే = నీ యొక్క; మంత్రకృతః = మంత్రములచే పవిత్రము చేయబడిన; పాణిః = చేయి; అగ్నౌ = వివాహాగ్ని సన్నిధిలో; పాపే = ఓ దుష్టురాలా; మయా = నా చేత; ధృతః = ధరించబడినది; తం = దానిని; త్యజామి = విడిచిపెట్టుచున్నాను; స్వజం = నా వలన జన్మించిన; చ = మఱియు; ఇవ = వలె; సహ = కలిసి; తవ = నీ యొక్క; పుత్రం = కుమారుని; త్వయా = నీతో; సహ = కలిపి
భావంః-
ఓ పాపాత్మురాలా! అగ్నిసాక్షిగా మంత్రసంసృతమైన నీ హస్తమును గ్రహించితిని. ఆ హస్తమును, నీకు నా వలన పుట్టిన కుమారుడిని, నిన్ను కూడ విడిచిపెట్టెదను.
2.14.15.
అనుష్టుప్.
ప్రయాతా రజనీ దేవి
సూర్యస్యోదయనంప్రతి।
అభిషేకం గురుజనః
త్వరయిష్యతి మాం ధ్రువమ్॥
టీకః-
ప్రయాతా = వెళ్లినది; రజనీ = రాత్రి; దేవి = ఓ రాణీ; సూర్యస్య = సూర్యునియొక్క; ఉదయనం = ఉదయము గూర్చి; ప్రతి = అనునిత్యం; అభిషేకం = అభిషేకము గూర్చి; గురుజనః = వృద్ధులు; త్వరయిష్యతి = త్వరపడుదురు; మాం = నన్ను; ధ్రువమ్ = నిశ్చయముగ
భావంః-
తాత్పర్యముః రాత్రి గడిచిపోయి సూర్యోదయము కానున్నది. పట్టాభిషకము గురించి పెద్దలు నన్ను త్వరపెట్టెదరు.
2.14.16.
అనుష్టుప్.
రామాభిషేకసంభారైః
తదర్థముపకల్పితైః।
రామః కారయితవ్యో మే
మృతస్య సలిలక్రియామ్॥
టీకః-
రామః = రాముని; అభిషేక = పట్టాభిషేకమునకైన; సంభారైః = పదార్థములు; తదర్థమ్ = ఆ ప్రయోజనం కొరకు; ఉపకల్పితైః = సిద్ధపఱచబడినవి; రామః = రాముడు మాత్రమే; కారయితవ్యః = చేయుటకు తగినవాడు; మే = నాయొక్క; మృతస్య = మరణమునకు; సలిలక్రియామ్ = ఉదకతర్పణము
భావంః-
రామాభిషేక కొఱకని సంభారాలు అన్నీ సిద్దముగా చేయబడినవి. (వాటిని ఉపయోగించి,) నేను మరణించిన పిదప రాముడు మాత్రమే నాకు జలతర్పణము చేయవలెను.
2.14.17.
అనుష్టుప్.
త్వయా సపుత్రయా నైవ
కర్తవ్యా సలిలక్రియా।
వ్యాహన్తాఽస్యశుభాచారే!
యది రామాభిషేచనమ్॥
టీకః-
త్వయా = నీ చేత; స = సహితం; పుత్రయా = నీ కొడుకు; నైవ = కాదు; కర్తవ్యా = చేయదగినది; సలిలక్రియా = జలతర్పణము; వ్యాహన్తాస్య = అడ్డుకున్నచో; అశుభాచారే = దుర్మార్గపు ప్రవర్తన గలదానా; యది = అట్లు; రామః = రాముని; అభిషేచనమ్ = పట్టాభిషేకమును.
భావంః-
నీవు రామాభిషేకమునకు విఘ్నము కలిగించు పక్షమున నీవు గాని, నీ కుమారుడు గాని, నాకు ఉదకక్రియలు చేయరాదు.
2.14.18.
అనుష్టుప్.
న చ శక్తోఽస్మ్యహం ద్రష్టుమ్
దృష్ట్వా పూర్వం తథాసుఖమ్।
హతహర్షం నిరానందమ్
పునర్జనమవాఙ్ముముఖమ్”॥
టీకః-
న = కాను; చ = పాదపూరణము; శక్నోమి = సమర్థుడను; అహమ్ = నేను; ద్రష్టుమ్ = చూచుటకు; దృష్ట్వా = చూచి; పూర్వం = ముందు; తథా సుఖమ్ = ఆ విధముగా సంతోషముగా ఉండి; హతహర్షమ్ = కొట్టబడిన సంతోషము కలవారై; నిరానందమ్ = ఆనందము లేకుండ; పునః = మరల; జనమ్ = ప్రజలు; అవాఙ్ముఖమ్ = తలలు వంచి
భావంః-
సుఖముగా ఉన్న జనులను ఇంతకు ముందు చూచుచున్న నేను, ఇప్పుడు ఆ ప్రజలే సంతోషము లేక, ఆనందము నశించి, తలలు వంచి దుఃఖించుచుండగా చూడజాలను.”
2.14.19.
అనుష్టుప్.
తాం తథా బ్రువతస్తస్య
భూమిపస్య మహాత్మనః।
ప్రభాతా శర్వరీ పుణ్యా
చంద్రనక్షత్రశాలినీ॥
టీకః-
తాం = ఆమెను గూర్చి; తథా = అట్లు; బ్రువతః = మాటలాడుచుండగనే; తస్య = ఆ; భూమిపస్య = మహారాజు; మహాత్మనః = గొప్ప మనసు కలిగిన; ప్రభాతా = తెల్లవారినది; శర్వరీ = రాత్రి; పుణ్యాః = పవిత్రమైన; చంద్రః = చంద్రుడు; నక్షత్రః= నక్షత్రములు; శాలినీ = శోభించుచున్న
భావంః-
ఆ మహాత్ముడు దశరథుడు ఆమెతో ఇట్లు పలుకుచుండగానే చంద్రుడు,నక్షత్రములతో ప్రకాశించుచున్న రాత్రి, పుణ్యకాలము కడచి తెల్లవారినది.
2.14.20.
అనుష్టుప్.
తతః పాపసమాచారా
కైకేయీ పార్థివం పునః।
ఉవాచ పరుషం వాక్యమ్
వాక్యజ్ఞా రోషమూర్ఛితా॥
టీకః-
తతః = తరువాత; పాప సమాచారాః = పాపప్రవృత్తి కలది; కైకేయీ = కైకేయి; పార్థివం = రాజుగూర్చి; పునః = మరల; ఉవాచ = మాట్లాడిన; పరుషం = కఠినమైన; వాక్యం = మాటలు; వాక్యజ్ఞా = మాటల నేర్పరి; రోష = కోపముతో; మూర్ఛితా = వివశమై, స్పృహ కోల్పోయిన,
భావంః-
పాప ప్రవృత్తి కలది, మాటలు నేర్పరి అయిన కైకేయి, కోపంతో వివశురాలై రాజుతో మరల ఇలా పరుషముగా పలికెను.
2.14.21.
అనుష్టుప్.
“కిమిదం భాషసే రాజన్
వాక్యం గరరుజోపమమ్।
ఆనాయయితుమక్లిష్టమ్
పుత్రం రామమిహార్హసి॥
టీకః-
కిమిదం = ఎందుకు ఇది; భాషసే = పలుకుచున్నావు; రాజన్ = ఓ రాజా; వాక్యం = మాటలను; గరః = విషముతో; రుజః = రోగముతోను; ఉపమమ్ = పోలునవి; అనాయయితుమ్ = పిలిపించుటకు; అక్లి్ష్టమ్ = ఆలస్యము లేకుండ; పుత్రం = నీ కొడుకును; రామమ్ = రాముడిని; ఇహ = ఇక్కడ; అర్హసి = అర్హుడవై ఉంటివి.
భావంః-
“రాజా, విషపు పలుకులు, రోగిష్టి మాటలు మాట్లాడుచుంటివి, ఏమిటిది? ఇక ఆలస్యము చేయక నీ పుత్రుడైన రాముడిని ఇచటకు రప్పించుము.
2.14.22.
అనుష్టుప్.
స్థాప్య రాజ్యే మమ సుతమ్
కృత్వా రామం వనేచరమ్।
నిస్సపత్నాం చ మాం కృత్వా
కృతకృత్యో భవిష్యసి”॥
టీకః-
స్థాప్య = నిలుపుటచే; రాజ్యే = రాజ్యమునందు; మమ = నాయొక్క; సుతమ్ = కుమారుని; కృత్వా = చేసి; రామం = రాముని; వనేచరమ్ = అరణ్యములో తిరుగునట్లు; నిస్సపత్నాం = నిః+ సపత్నాం, శత్రువులు లేనిదానిని; చ = మఱియు; మాం = నన్ను; కృత్వా = చేసి; కృతకృత్యః = బాధ్యతతీర్చుకున్నవాడవు; భవిష్యసి = కాగలవు
భావంః-
నా కుమారునకు రాజ్యము నిచ్చి, రాముడిని అరణ్యమునకు పంపి, నాకు శత్రువులెవ్వరు లేకుండగ చేసినచో నీవు కృతకృత్యుడవు అయ్యెదవు“ అని పలికెను.
2.14.23.
అనుష్టుప్.
స నున్న ఇవ తీక్ష్ణేన
ప్రతోదేన హయోత్తమః।
రాజా ప్రచోదితోఽభీక్ష్ణమ్
కైకేయీమిదమబ్రవీత్॥
టీకః-
సః = అతడు; నున్నః = కొట్టబడిన; ఇవ = వలె; తీక్ష్ణేన = తీవ్రముగా; ప్రతోదేన = చెర్నాకోలాతో, కొరడాతో; హయోత్తమః = శ్రేష్ఠమైన గుఱ్ఱము; రాజా = మహారాజు; ప్రచోదితః = ప్రేరేపించబడిన; అభీక్ష్ణమ్ = మరల మరల; కైకేయీమ్ = కైకేయి గూర్చి; ఇదమ్ = ఈ మాటలు; అబ్రవీత్ = పలికెను
భావంః-
కొరడాతో గట్టిగా కొట్టబడిన ఉత్తమ జాతి అశ్వము వలె దశరథమహారాజు ఆ విధముగా మాటలచే పొడవబడి కైకేయితో ఇట్లు పలికెను
2.14.24.
అనుష్టుప్.
“ధర్మబన్ధేన బధ్దోఽస్మి
నష్టా చ మమ చేతనా।
జ్యేష్ఠం పుత్రం ప్రియం రామమ్
ద్రష్టుమిచ్ఛామి ధార్మికమ్॥
టీకః-
ధర్మబన్ధేన = నీతి బంధముల చేత; బద్ధమ్ = కట్టుబడి ఉన్నాను; అస్మిన్ = అగును; నష్టా = కోల్పోయినది; చ= మఱియు; మమ చేతనా = నా బుద్ధి కూడ; జ్యేష్ఠమ్ = పెద్దవాడు; పుత్రమ్ = కుమారుడు; ప్రియమ్ = ప్రియమైన వాడు; రామమ్ = రాముడిని; ద్రష్టుమ్ = చూచుటకు; ఇచ్ఛామి = కోరుకొనుచున్నాను; ధార్మికమ్ = నీతిబద్ధుడును
భావంః-
“ధర్మపాశమునకు కట్టుబడిపోయితిని. నా బుద్ధి కూడ పనిచేయుట లేదు. ధర్మాత్ముడు, నా ప్రియ జ్యేష్ఠకుమారుడైన, రాముని చూడవలెను అని తలచుచున్నాను” అనెను.
2.14.25.
అనుష్టుప్.
తతః ప్రభాతాం రజనీమ్
ఉదితే చ దివాకరే।
పుణ్యే నక్షత్రయోగే చ
ముహూర్తే చ సమాహితే॥
టీకః-
తతః = తరువాత; ప్రభాతామ్ = తెల్లవారగ; రజనీమ్ = రాత్రిని; ఉదితే చ = ఉదయించగా; చ = పాదపూరణము; దివాకరే = సూర్యుడు; పుణ్యే = మంగళకరమైనది; నక్షత్రయోగే = నక్షత్రయోగములో; చ = పాదపూరణము; ముహూర్తే = ముహూర్తము; చ = పాదపూరణము; సమాహితే = సమీపించగా
భావంః-
తెల్లవారి, సూర్యుడు ఉదయించెను. పుణ్య నక్షత్రములతో కూడిన శుభ ముహూర్తము సమీపించుచుండెను.
2.14.26.
అనుష్టుప్.
వసిష్ఠో గుణసమ్పన్నః
శిష్యైః పరివృతస్తదా।
ఉపగృహ్యాశు సమ్భారాన్
ప్రవివేశ పురోత్తమమ్॥
టీకః-
వశిష్ఠః = వశిష్ఠ మహర్షి; గుణసపన్నః = సకల సద్గుణములు కలిగిన; శిష్యైః = శిష్యులచే; పరివృతః = కూడినవాడై; తదా = ఆ సమయములో; ఉపగృహ్య = కలిగి; ఆశు=శీఘ్రముగా; సమ్భారాన్ = అవసరమైన పదార్థములు; ప్రవివేశ = ప్రవేశించెను; పురోత్తమమ్ = ఆ రాజధాని నగరమైన అయోధ్యను
భావంః-
అపుడు సద్గుణ సంపన్నుడైన వసిష్ఠుడు శిష్యపరివృతుడై, అభిషేక సంభారాలతో అయోధ్యలో ప్రవేశించెను.
2.14.27.
అనుష్టుప్.
సిక్తసమ్మార్జితపథామ్
పతాకోత్తమ భూషితామ్।
విచిత్రకుసుమాకీర్ణామ్
నానాస్రగ్భిర్విరాజితామ్॥
టీకః-
సిక్త = తడుపబడిన; సమ్మార్జిత = తుడువబడిన; పథామ్ = వీధులు; పతాక = కేతనములు, జండాలు; ఉత్తమ = చక్కనివానితో; భూషితామ్ = అలంకరించబడిన; విచిత్ర = రకరకాల; కుసుమ = పువ్వులతో; ఆకీర్ణామ్ = దట్టము చల్లినవి; నానా = వివిధములైన; స్రగ్భిః = పూలమాలలతో; విరాజితామ్ = శోభించు
భావంః-
అయోధ్యలోని వీధులన్నీ తుడిచి నీళ్లు చల్లి ఉండెను. దానిని అందమైన పతాకములచే అలంకరించిరి. అనేకమైన రంగుల పువ్వులు చల్లిరి. అనేక విధములుగ పూలమాలికలు కట్టిరి.
2.14.28.
అనుష్టుప్.
సంహృష్టమనుజోపేతామ్
సమృద్ధవిపణాపణామ్।
మహోత్సవసమాకీర్ణామ్
రాఘవార్థే సముత్సుకామ్॥
టీకః-
సంహృష్టః = సంతోషముతో నిండిన; మనుజ = ప్రజలతో; ఉపేతామ్ = కూడిఉన్నది; సమృద్ధ = సమృద్ధిగా ఉన్న; విపణః = దుకాణములు; అపణామ్ = అంగడివీధులు; మహోత్సవ = గొప్ప ఉత్సవములతో; సమాకీర్ణామ్ = నిండిన; రాఘవః = రాముని; అర్థే = కొఱకు; సముత్సుకామ్ = మిక్కిలి ఉత్సాహముతో కూడిన
భావంః-
అక్కడ మనుష్యులందరు ఆనందోత్సాహాలతో ఉండిరి. దుకాణములు, అంగడిసమూహములు వివిధ వస్తువులతో సమృద్ధములుగా ఉండెను. ఎక్కడ చూచినా మహోత్సవములు జరుగుచుండెను, ప్రజలు అందరూ మిక్కిలి ఉత్యాహముతో ఎదురుచూచు చుండిరి.
2.14.29.
అనుష్టుప్.
చందనాగరుధూపైశ్చ
సర్వతః ప్రతిధూపితామ్।
తాం పురీం సమతిక్రమ్య
పురందరపురోపమామ్॥
టీకః-
చందన = చందనము; అగరు = అగరు; ధూపైశ్చ = పరిమళ ద్రవ్యములచే; సర్వతః = అంతట; ప్రతిధూపితామ్ = ధూపము వ్యాపించినది; తాం = ఆ; పురీం = నగరమును; సమతిక్రమ్య = అధిగమించిన; పురందర = ఇంద్రుని; పురః = పట్టణమును, అమరావతిని; ఉపమామ్ = పోలియున్నదానిని
భావంః-
నలుమూలలా చందనసువాసనలూ, అగురుధూపాలూ వ్యాపించుచుండెను. సాక్షాత్తు దేవేంద్రుని నగరమైన అమరావతి వలె ఉండెను.
2.14.30.
అనుష్టుప్.
దదర్శాంతఃపురశ్రేష్ఠమ్
నానాద్విజగణాయుతమ్।
పౌరజానపదాకీర్ణమ్
బ్రాహ్మణైరుపశోభితమ్॥
టీకః-
దదర్శః = చూచెను; అంతఃపుర = రాజసౌధము; శ్రేష్ఠమ్ = ఉత్తమమైనదానిని; నానా = వివిధములైన; ద్విజ = బ్రాహ్మణ; గణః = సమూహములతో; యుతమ్ = కూడినది; పౌర = నగరవాసులు; జానపద = గ్రామవాసులతో; ఆకీర్ణమ్ = నిండిఉన్నది; బ్రాహ్మణైః = బ్రాహ్మణులతో; ఉపశోభితమ్ = శోభాయమానముగా ఉన్నది
భావంః-
అట్టి నగరములో ప్రవేశించిన వసిష్ఠుడు కొంతదూరములో శ్రేష్ఠమైన రాజాంతఃపురము చేరెను. అక్కడ వివిధ రకముల ద్విజులు గుంపులు గుంపులుగా చేరి ఉండిరి. అయోద్యాది నగరవాసులు, జనపదులు అనగా గ్రామస్తులుతో నిండుగా ఉన్నది. బ్రాహ్మణులతో శోభాయమానముగా ఉన్నది.
2.14.31.
అనుష్టుప్.
యజ్ఞవిద్భిస్సుసమ్పూర్ణమ్
సదస్యైః పరమద్విజైః।
తదంతఃపురమాసాద్య
వ్యతిచక్రామ తం జనమ్॥
టీకః-
యజ్ఞవిద్ = యజ్ఞముల గురించి తెలిసినవారు, హి = నిశ్చయార్థకము; యజ్ఞవేత్తలు; సుసమ్పూర్ణమ్ = పరిపూర్ణమై ఉన్నది; సదస్యైః = యజ్ఞవిధి పరీక్షించు సభికులు; పరమ = శ్రేష్ఠులైన; ద్విజైః = బ్రాహ్మణులతో; తత్ = ఆ; అంతఃపురమ్ = రాజసౌధమును; ఆసాద్య = పొంది; వ్యతిచక్రామ = దాటి వెళ్ళెను.; తమ్ జనమ్ = ఆ జనులను
భావంః-
ఉత్తమ బ్రాహ్మణులైన యజ్ఞవేత్తలు, యాగసభికులుతో నిండి ఉండెను. ఆ రాజభవనము దరచేరి ఆ జనులను దాటి వెళ్ళెను.
గమనికః-
1. యజ్ఞవిద్- యజ్ఞనిర్వాహణలో నిష్ణాతుడు, సాంస్క్రీట్ కోష్, జాలనిఘంటువు, 2. సదస్య- సభికుడు, యజ్ఞవిధి పరీక్షాధికారి, వావిళ్ళ నిఘంటువు.
2.14.32.
అనుష్టుప్.
వసిష్ఠః పరమప్రీతః
పరమర్షిర్వివేశ చ।
సత్వపశ్యద్వినిష్క్రాంతమ్
సుమంత్రం నామ సారథిమ్॥
టీకః-
వసిష్ఠః = వసిష్ఠ మహర్షి; పరమప్రీతః = పరమానందభరితుడై; పరమర్షిః = ఆ మహర్షి; వివేశ = ప్రవేశించెను కూడ; చ = కూడ; సః = ఆయన; తు = పాదపూరణము; అపశ్యత్ = చూసెను; వినిష్క్రాంతమ్ = బయటికి వచ్చుచు; సుమంత్రమ్ = సుమంత్రుడు; నామ = పేరు గల; సారథిమ్ = రథసారథిని.
భావంః-
పరమానందభరితుడైన వసిష్ఠ మహర్షి, అచట జనులను దాటుకొని, భవనము ప్రవేశించుచుండెను. అప్పుడు ఆయన బయటికి వచ్చుచున్న రథసారథి సుమంత్రుని చూసెను.
2.14.33.
అనుష్టుప్.
ద్వారే మనుజసింహస్య
సచివం ప్రియదర్శనమ్।
తమువాచ మహాతేజా
స్సూతపుత్రం విశారదమ్॥
టీకః-
ద్వారే = ద్వారమునందు; మనుజసింహస్య = మనుజులలో శ్రేష్ఠుడైన దశరథమహారాజు యొక్క; సచివం = మంత్రిని; ప్రియ = ఆహ్లాదకరముగా; దర్శనమ్ = కనబడుటజరిగెను; తమ్ = అతనిగూర్చి; ఉవాచ = ఈ విధముగా మాట్లాడెను; మహాతేజా = తేజోసంపన్నుడైన; సూతపుత్రం = ఆ సూతుని (పురాణములు చెప్పువాడు) పుత్రుని (సుమంత్రుడు); విశారదమ్ = జ్ఞాని అయిన
భావంః-
అంతలో రాజద్వారము వద్ద దశరథమహారాజు యొక్క రాజసచివుడు ఐన సుమంత్రుడు ఆహ్లాదభరితముగ కనబడెను. జ్ఞాని, సూతుని పుత్రుడు, మహాతేజశ్శాలి ఐన ఆయనతో వసిష్ఠముని ఇట్లనెను.
2.14.34.
అనుష్టుప్.
“వసిష్ఠః క్షిప్రమాచక్ష్వ
నృపతేర్మామిహాగతమ్।
ఇమే గంగోదకఘటా
స్సాగరేభ్యశ్చ కాంచనాః॥
టీకః-
వసిష్ఠః = వసిష్ఠ మహర్షి; క్షిప్రమ్ = త్వరగా; ఆచక్ష్వ = చెప్పుము; నృపతేః = రాజునకు; మామ్ = నా గురించి; ఇహ = ఇక్కడకు; ఆగతమ్ = వచ్చినవానిగ; ఇమే = వీటిని; గంగ = గంగానదీ; ఉదకః = జలముతో నిండిన; ఘటః = కుండలు; సాగరేభ్యః = సముద్రముల నుండి; చ = కూడ; కాంచనాః = బంగారముతో చేసినవి.
భావంః-
వసిష్ఠుడు పండితుడైన సుమంత్రునితో ‘నేను వచ్చినట్లుగా రాజుతో శీఘ్రముగా వెళ్లి చెప్పుము’ అనెను. “గంగాజలము నింపినవి, సముద్ర జలాలతో నింపినవి అగు బంగారు కలశములు
2.14.35.
అనుష్టుప్.
ఔదుమ్బరం భద్రపీఠమ్
అభిషేకార్థమాగతమ్।
సర్వబీజాని గన్ధాశ్చ
రత్నాని వివిధాని చ॥
టీకః-
ఔదుమ్బరమ్ = మేడిచెట్టు చెక్కతో తయారయిన; భద్రపీఠమ్ = శుభకరమైన ఆసనము; అభిషేక = పట్టాభిషేకము; అర్థమ్ = కొఱకు; ఆగతమ్ = వచ్చియున్నవి; సర్వ = సమస్తమైన; బీజాని = ధాన్యములు, విత్తనములు; గన్ధాః = సుగంధ ద్రవ్యములు; చ = మఱియు; రత్నాని = రత్నములు; చ = మఱియు; వివిధాని = రకరకములైన; చ = కూడా.
భావంః-
మేడికఱ్ఱతో చేసిన భద్రపీఠము, అన్ని రకముల ధాన్యములు, అనేక రకములైన గంధములు, రత్నములు సమస్తము పట్టాభిభిషేకము కొరకు సిద్ధముగా ఉన్నాయి.
2.14.36.
అనుష్టుప్.
క్షౌద్రం దధి ఘృతం లాజా
దర్భాస్సుమనసః పయః।
అష్టౌ చ కన్యా రుచిరా
మత్తశ్చ వరవారణః॥
టీకః-
క్షౌద్రం = తేనె; దధి = పెరుగు; ఘృతం = నెయ్యి; లాజా = పేలాలు; దర్భాః = దర్భలు; సుమనసః = పువ్వులు; పయః = పాలు; అష్టౌ = ఎనిమిదిమంది; చ = పాదపూరణము; కన్యాః = కన్యలు; రుచిరాః = అందమైన; మత్తః = మదించిన; చ = మఱియు; వర = శ్రేష్ఠమైన; వారణః = ఏనుగులు.
భావంః-
తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు, అందమైన ఎనమండుగురు కన్యలు, శ్రేష్ఠమైన మదపుటేనుగులు.
2.14.37.
అనుష్టుప్.
చతురశ్వో రథశ్శ్రీమాన్
నిస్త్రింశో ధనురుత్తమమ్।
వాహనం నరసంయుక్తమ్
ఛత్రం చ శశిసన్నిభమ్॥
టీకః-
చతుర = నాలుగు; అశ్వః = గుఱ్ఱముల; రథః = రథము; శ్రీమాన్ = మహిమాన్వితమైన; నిస్త్రింశః = ఖడ్గము; థనుః = ధనుస్సు; ఉత్తమమ్ = ఉత్తమమైనది; వాహనం = వాహనము (పల్లకీ); నర = మోసే బోయలుతో; సంయుక్తమ్ = సహితముగా ఉన్నది; ఛత్రం = గొడుగు; శశి = చంద్రునివలె; సన్నిభమ్ = పోలినది.
భావంః-
నాలుగు గుఱ్ఱాల గొప్ప రథము, ఖడ్గము, ఉత్తమమైన ధనుస్సు, బోయలతో కూడిన పల్లకీ, చంద్రసదృశమైన ఛత్రమూ.
2.14.38.
అనుష్టుప్.
శ్వేతే చ వాలవ్యజనే
భృంగారుశ్చ హిరణ్మయః।
హేమదామపి నద్ధశ్చ
కకుద్మాన్పాండురో వృషః॥
టీకః-
శ్వేతః = తెల్లని; చ = పాదపూరణము; వాలవ్యజనే = చామరములు; భృంగారుః = పాత్రలు; చ = పాదపూరణము; హిరణ్మయః = బంగారపువి; హేమదామ్ = బంగారు పగ్గములతో; అపి = కూడ; నద్ధః = కట్టబడిన; చ = పాదపూరణము; కకుద్మాన్ = మూపురముతో; పాండురః = తెల్లని; వృష్టః = ఎద్దు
భావంః-
తెల్లని వింజామరలు, బంగారు పాత్రలు, బంగారు పగ్గాలతో కట్టబడిన పెద్ద మూపురము కల తెల్లని ఎద్దు.
2.14.39.
అనుష్టుప్.
కేసరీ చ చతుర్దంష్ట్రో
హరిశ్రేష్ఠో మహాబలః।
సింహాసనం వ్యాఘ్రతనుః
సమిద్ధశ్చ హుతాశనః॥
టీకః-
కేసరీ = అందమైన జూలు కలిగినది; చ = మఱియు; చదుర్దంష్ట్రః = నాలుగు పెద్ద దంతములు కలది; హరి = గుఱ్ఱము; శ్రేష్ఠః = శ్రేష్ఠమైనది; మహా = అత్యంత; బలః = బలము కలది; సింహాసనం = సింహాసనము; వ్యాఘ్రతనుః = పులి చర్మము; సమిద్ధః = ప్రకాశవంతమైన; చ = మఱియు; హుతాశనః = అగ్ని.
భావంః-
అందమైన జూలు కల సింహము, నాలుగు పెద్ద దంతములు కల ఏనుగు, మంచి బలమైనది అగు శ్రేష్ఠమైన గుఱ్ఱము, సింహాసనము, వ్యాఘ్రచర్మము, ప్రకాశవంతమైన అగ్ని.
2.14.40.
అనుష్టుప్.
సర్వవాదిత్రసంఘాశ్చ
వేశ్యాశ్చాలంకృతాః స్త్రియః।
ఆచార్యా బ్రాహ్మణా గావః
పుణ్యాశ్చ మృగపక్షిణః॥
టీకః-
సర్వ = అన్నిరకములైన; వాదిత్ర = వాద్యములు; సంఘాః = సమూహముతో; చ = మఱియు; వేశ్యాః = వేశ్యలు; చ = మఱియు; అలంకృతాః = అలంకరించబడిన; స్త్రియః = స్త్రీలు; ఆచార్యాః = ఉపాధ్యాయులు; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; గావః = ఆవులు; పుణ్యాః = పవిత్రమైన; మృగః = మృగములు; పక్షిణః = పక్షులు.
భావంః-
సకలవాద్య సమూహాలు, అలంకరించుకున్న వేశ్యలు, స్త్రీలు, ఆచార్యులు, బ్రాహ్మణులు, పవిత్రమైన గోవులు, మృగాలు, పక్షులు
2.14.41.
అనుష్టుప్.
పౌరజానపదశ్రేష్ఠా
నైగమాశ్చ గణై స్సహ।
ఏతే చాన్యే చ బహవో
ప్రీయమానాః ప్రియంవదాః॥
టీకః-
పౌరః = నగరవాసులు; జానపదః = గ్రామీణులు; శ్రేష్ఠా = శ్రేష్ఠులైన; నైగమాః = వ్యాపారస్థులు; చ = మఱియు; గణైః = వారి అనుచరులతో; సహ = కలిసి; ఏతే = వీరందరు ; చ =మఱియు; అన్యే = ఇతరులు; చ = మఱియు; బహవః = అనేకులు; ప్రీయమానాః = ఇష్టులైనవారు; ప్రియంవదాః = మంచిమాటలు పలుకుచు.
భావంః-
శ్రేష్ఠులైన పురజనులు, గ్రామీణులూ, వర్తకులు, ఇంకను ఎంతోమంది ఇష్టులు అందరు గుంపులు గుంపులుగా ప్రీతిగా మాట్లాడుకొనుచూ వచ్చిరి
2.14.42.
అనుష్టుప్.
అభిషేకాయ రామస్య
సహ తిష్ఠన్తి పార్థివైః।
“త్వరయస్వ మహారాజమ్
యథా సముదితేఽహని॥
టీకః-
అభిషేకాయ = పట్టాభిషేకము కొరకు; రామస్య = రాముని యొక్క; సహ = కూడి; తిష్ఠన్తి = నిరీక్షిస్తున్నారు; పార్థివైః = రాజులతో; త్వరయస్య = త్వరితముగా; మహారాజమ్ = చక్రవర్తి; యథా = ఆ విధముగా; సముదితే = ఉదయించగనే; అహని = దినము
భావంః-
అందరు రాజులు సహితముగ రామపట్టాభిషేకము కొరకై వచ్చి ఎదురుచూస్తున్నారు. “సూర్యోదయము అయిన వెంటనే మహారాజును తొందరపెట్టుము.
2.14.43.
అనుష్టుప్.
పుష్యే నక్షత్రయోగే చ
రామో రాజ్యమవాప్నుయాత్।
ఇతి తస్య వచ శ్శ్రుత్వా
సూతపుత్రో మహాత్మనః॥
టీకః-
పుణ్యే = శుభసమయములో; నక్షత్రయోగే = నక్షత్ర యోగమునందు; చ = పాదపూరణము; రామః= రాముడు; రాజ్యమ్ = రాజ్యమును; అవాప్నుయాత్ = పొందునో; ఇతి = ఈ విధముగా; తస్య = ఆ; వచః = మాటలు; శ్రుత్వా = వినినవాడై; సూతపుత్రః = సూతుని కొడుకు, సుమంత్రుడు; మహాత్మనః = మహాత్ముడైన వసిష్ఠుని
భావంః-
పుణ్యమైన నక్షత్రమునందు రామునికి పట్టాభిషేకము చేయుటకు నిశ్చయించిరి.” మహాత్ముడైన వసిష్ఠుని మాటలు విని సుమంత్రుడు.
2.14.44.
అనుష్టుప్.
స్తువన్నృపతిశార్దూలమ్
ప్రవివేశ నివేశనమ్।
తం తు పూర్వోదితం వృద్ధమ్
ద్వారస్థా రాజ సమ్మతమ్॥
టీకః-
స్తువత్ = స్తుతించుటకు; నృపతి శార్దూలమ్ = రాజులలో పులి వంటి వాడయిన దశరథుడిని (రాజశ్రేష్ఠుడు); ప్రవివేశ = ప్రవేశించెను; నివేశనమ్ =గృహమును; తం = వానిని; తు = పాదపూరణము; పూర్వ = అందరికంటె ముందుగా; ఉదితం = వచ్చిన; వృద్ధమ్ = వృద్ధుని; ద్వారస్థా = ద్వారపాలకులు; రాజ సమ్మతమ్ = రాజు ఆదరము పొందినవాడు
భావంః-
ఆ దశరథ రాజశ్రేష్ఠుని స్తుతించుచు రాజభవనములో ప్రవేశించెను. అందరికంటె ముందుగా వచ్చినవాడు, వృద్ధుడు, రాజాదరము కలవాడు ఐన ఆయనను
2.14.45.
అనుష్టుప్.
న శేకురభిసంరోద్ధుమ్
రాజ్ఞః ప్రియచికీర్షవః।
స సమీపస్థితో రాజ్ఞః
తామవస్థామజజ్ఞివాన్॥
టీకః-
న = కాలేకపోయిరి; శేకుః =సమర్థులు; అభిసంరోద్దుమ్ = అడ్డగించుటను; రాజ్ఞః = రాజునకు; ప్రియచికీర్షవః = ప్రియమును కలిగించువారు; సః = అతడు; సమిపస్థితః = పక్కగా నిలబడినవాడై; రాజ్ఞః = రాజు; తామ్ = అటువంటి; అవస్థామ్ = పరిస్థితిని; అజజ్ఞివాన్ = తెలియనివాడై
భావంః-
రాజునకు ప్రీతిపాత్రుడు అయిన సుమంత్రుని ద్వారపాలకులు అడ్డుపెట్టలేకపోయిరి. రాజు దగ్గరకు వెళ్లిన సుమంత్రుడు అతడున్న పరిస్థితి తెలియక ..
2.14.46.
అనుష్టుప్.
వాగ్భిః పరమతుష్టాభిః
అభిష్టోతుం ప్రచక్రమే।
తతస్సూతో యథాకాలమ్
పార్థివస్య నివేశనే॥
టీకః-
వాగ్భిః = మాటలతో; పరమ = మిక్కిలి; తుష్టాభిః = సంతోషము గల; అభిష్టః తుం = ప్రశంసించుటకు; ప్రచక్రమే = ప్రారంభించెను; తతః = అటు పిమ్మట; సూతః = రథసారథి; యథాకాలమ్ = సమయానుకూలముగా; పార్థివస్య = రాజు యొక్క; నివేశనే = గృహమునందు
భావంః-
ఆనందకరములైన మాటలతో స్తుతించుట ప్రారంభించెను. సారథి అయిన సుమంత్రుడు కాలానుగుణముగా ఈ విధముగా ప్రసంగించెను.
2.14.47.
అనుష్టుప్.
సుమంత్రః ప్రాంజలిర్భూత్వా
తుష్టావ జగతీపతిమ్।
“యథా నందతి తేజస్వీ
సాగరో భాస్కరోదయే॥
టీకః-
సుమంత్రః = సుమంత్రుడు; ప్రాంజలిః = రెండు చేతులు జోడించినవాడై; భూత్వా = అయి; తుష్టావ = సంతోషముతో; జగతీపతిమ్ = రాజు యొక్క; యథా = ఏవిధముగా; నందతి = ఆనందించునో; తేజస్వీ = తేజఃశాలి; సాగరః = సముద్రము; భాస్కర = చంద్రుని; ఉదయే = ఉదయించు సమయములో.
భావంః-
సుమంత్రుడు రెండు చేతులు జోడించి, రాజుకు నమస్కరించి, “సహజముగా ఆనందముతో నిండిన నీవు సూర్యోదయ సమయములో తేజశ్శాలి అయిన సముద్రుడు ఆనందించునట్లు
గమనికః-
భాస్కరః- (1) తన తీక్ష్ణ కిరణ కాంతులతో లోకమును ప్రకాశింపజేయువాడు, సూర్యుడు. మఱియు తన అమృత కిరణములతో చల్లని వెన్నెల కురియుచు లోకము ఆహ్లాద పఱచువాడు, చంద్రుడు. కనుక, భాస్కరుడు అనగా మెఱయువాడు సూర్యుడు, చంద్రుడు కూడ. అట్లు ఇద్దరును భాస్కరులే. ఇక్కడ కవి చంద్రునిగా గ్రహించెను. చంద్రుడు సముద్రుని పుత్రుడు. కనుక, చంద్రో (పుత్రో) దయము చూచి సముద్రుడు ఉప్పొంగుచుండును. సౌజన్యము- గోరక్పూరు రామాయణము.
2.14.48.
అనుష్టుప్.
ప్రీతః ప్రీతేన మనసా
తథాఽనందఘనః స్వతః।
ఇంద్రమస్యాం తు వేలాయామ్
అభితుష్టావ మాతలిః॥
టీకః-
ప్రీతః = సంతోషముతో; ప్రీతేన = ఆనందించిన; మనసా = మనస్సుతో; తథా = ఆ విధముగా; ఆనందఘనః = ఆనందముతో నిండిన; స్వతః = సహజముగా; ఇంద్రమ్ = ఇంద్రుని; అస్యామ్ = ఇదే; తు= పాదపూరణము; వేలాయామ్ = సమయములో; అభితుష్టావ = ప్రశంసించెను; మాతలిః = మాతలి (ఇంద్రుని రథసారథి)
భావంః-
సంతోషభరితమైన మనస్సుతో ఆనందించుము. ఈ ప్రాతఃకాలమందే ఇంద్రుని రథసారథి మాతలి దేవేంద్రుని స్తుతించెను.
2.14.49.
అనుష్టుప్.
సోఽజయద్దానవాన్సర్వాన్
తథా త్వాం బోధయామ్యహమ్।
వేదాస్సహాంగవిద్యాశ్చ
యథాహ్యాత్మభువం విభుమ్॥
టీకః-
సః = ఆ ఇంద్రుడు; అజయత్ = గెలిచెను; దానవ = రాక్షసులను; సర్వాన్ = అందరిని; తథా = ఆ విధముగా; త్వాం = నిన్ను; బోధయామి = మేల్కొలుపుచున్నాను; అహమ్ = నేను; వేదాః = వేదములు; సహాంగవిద్యాః = వేదాంగ విద్యలతో సహా; చ= మఱియు; యథా హి = ఆ విధముగా; ఆత్మభువమ్ = స్వయముగా జన్మించిన; విభుమ్ = భగవంతుడిని
భావంః-
ఇంద్రుడు సకల దానవులను జయించెను. నేను కూడా నిన్ను అట్లే మేల్కొలుపుచున్నాను. వేదములు, వాటి అంగవిద్యలు – తనంతట తానే పుట్టినవాడును, భగవంతుడును
2.14.50.
అనుష్టుప్.
బ్రహ్మాణం బోధయన్త్యద్య
తథా త్వాం బోధయామ్యహమ్।
ఆదిత్యస్సహ చన్ద్రేణ
యథా భూతధరాం శుభామ్॥
టీకః-
బ్రహ్మాణం = బ్రహ్మను; బోధయన్తి = మేల్కొలుపునో; అద్య = ఈ సమయములో; తథా = ఆ విధముగా; త్వాం = నిన్ను; బోధయామి = మేల్కొలుపుచున్నాను; అహమ్ = నేను; ఆదిత్యః = సూర్యుడు; సహ = కలిపి; చన్ద్రేణ = చంద్రునితో; యథా = ఆ విధముగా; భూతధరామ్ = సమస్త ప్రాణులను ధరించునది; శుభామ్ = మంగళకరమైనది
భావంః-
ప్రభువు అయిన బ్రహ్మదేవుని మేల్కొలిపినట్లు. నేను నిన్ను మేల్కొల్పుచున్నాను. సూర్యచంద్రులు, సమస్త ప్రాణులను ధరించేదీ, మంగళకరమైనది అయిన
2.14.51.
అనుష్టుప్.
బోధయత్యద్య పృథివీమ్
తథా త్వాం బోధయామ్యహమ్।
ఉత్తిష్ఠాశు మహారాజ
కృతకౌతుకమంగలః॥
టీకః-
బోధయతి = మేల్కొలిపిన ట్లు; అద్య = ఈ సమయములో; పృథివీమ్ = భూమిని; తథా = ఆ విధముగా; త్వాం = నిన్ను; బోధయామి = మేల్కొలుపుచున్నాను; అహమ్ = నేను; ఉత్తిష్ఠాశు = మేల్కొనుము; మహారాజ = మహారాజా; కృత కౌతుకః = అనువైన వస్త్రములను; మంగలః = మంగళకరమైన
భావంః-
పృథివిని మేల్కొల్పినట్లు నేను నిన్ను మేల్కొలుపుచున్నాను. మహారాజా! ఉత్సవమునకు తగిన మంగళవేషము ధరించి.
2.14.52.
అనుష్టుప్.
విరాజమానో వపుషా
మేరోరివ దివాకరః।
సోమసూర్యౌ చ కాకుత్స్థ
శివవైశ్రవణావపి॥
టీకః-
విరాజమానః = విరాజిల్లుతున్న; వపుషా = శరీరముతో; మేరోః = మేరు పర్వతము నుండి; ఇవ = వలె; దివాకరః = సూర్యుడు; సోమసూర్యౌ చ = సూర్యుడు మఱియు చంద్రుడు; కాకుత్స్థ = కాకుత్స్థ వంశములో జన్మించిన దశరథ మహారాజా; శివః = శివుడు; వైశ్రవణాః = కుబేరుడు; అపి = కూడ
భావంః-
ప్రకాశించుచున్న శరీరముతో మేరు పర్వతము నుంచి సూర్యుడు పైకి వచ్చునట్లు వెంటనే లెమ్ము. సోమసూర్యులు, శివకుబేరులు.
2.14.53.
అనుష్టుప్.
వరుణశ్చాగ్నిరింద్రశ్చ
విజయం ప్రదిశన్తు తే।
గతా భగవతీ రాత్రిః
కృతం కృత్యమిదం తవ॥
టీకః-
వరుణః = వరుణుడు; చ = మఱియు; ఆగ్నిః = అగ్ని; ఇన్ద్రః + చ = ఇంద్రుడు మఱియు; విజయం = విజయమును; ప్రదిశన్తు తే = సమకూర్చుదురు గాక; గతాః = గడచిన; భగవతీ = పూజ్యమైన; రాత్రిః = రాత్రి సమయము; కృత = చేయబడిన; కృత్యమ్=కార్యమును; ఇదం = ఈ; తవ = నీ చేత
భావంః-
వరుణుడు, అగ్ని, ఇంద్రుడు నీకు సర్వోన్నతిని ఇచ్చెదరుగాక. పూజ్యమైన రాత్రి గడిచిపోయినది. ఇంతవరకు నీచేత జరిగిన పనులు తెలిసికొని.
2.14.54.
అనుష్టుప్.
బుద్ధ్యస్వ నృపశార్దూల
కురు కార్యమనంతరమ్।
ఉదతిష్ఠత రామస్య
సమగ్రమభిషేచనమ్॥
టీకః-
బుద్ధ్యస్వ = తెలుసుకొనుము; నృప శార్దూలః = రాజులలో శ్రేష్ఠుడా; దశరథమహారాజు; కురు = చేయుము; కార్యమ్ = పనిని; అనంతరమ్ = ఇటుపై; ఉదతిష్ఠత = సిద్ధమైనది; రామస్య = రాముని యొక్క; సమగ్రమ్ = సంపూర్ణముగ; అభిషేచనమ్ = పట్టాభిషేకమునకు వలయునవి
భావంః-
ఇటుపై చేయదగిన పనులు గ్రహింపుము. రామాభిషేకమునకు కావలసినవి అన్నియు సంపూర్ణముగా సిద్ధము చేయబడినవి.
2.14.55.
అనుష్టుప్.
పౌరజానాపదైశ్చాపి
నైగమైశ్చ కృతాంజలిః।
స్వయం వశిష్ఠో భగవాన్
బ్రాహ్మణైస్సహ తిష్ఠతి॥
టీకః-
పౌరః = పురవాసులచే; జానపదైః = గ్రామప్రజలచే, జానపదులచే; చ = మఱియు; అపి = కూడ; నైగమైః = వ్యాపారస్థులచేతను; చ = మఱియు; కృతాంజలిః = ఘటించబడిన అంజలి గలవాడై; స్వయం = స్వయముగా; వశిష్ఠః = వశిష్ఠ మహర్షి; భగవాన్ = భగవంతునితో సమానుడైన; బ్రాహ్మణైః = బ్రాహ్మణులతో; సహ = కలిసి; తిష్ఠతి = వేచియుండెను.
భావంః-
పూజ్యుడైన వసిష్ఠుడు బ్రాహ్మణ సమేతుడై, పౌరులు, జానపదులు, వర్తకులు నమస్కరించుచుండగా, ద్వారము వద్ద వేచియుండెను.
2.14.56.
అనుష్టుప్.
క్షిప్రమాజ్ఞాప్యతాం రాజన్
రాఘవస్యాభిషేచనమ్।
యథా హ్యపాలాః పశవో
యథా సేనా హ్యనాయకాః॥
టీకః-
క్షిప్రమ్ = త్వరగా; ఆజ్ఞాప్యతామ్ = ఆజ్ఞాపించబడుగాక; రాజన్ = ఓ మహారాజా; రాఘవస్య = రాముని యొక్క; అభిషేచనమ్ = పట్టాభిషేకము; యథా హి = ఏ విధముగా; అపాలాః = పరిపాలకుడు లేని; పశవః = పశువులు; యథా = ఏ విధముగా; సేనా హి = సైన్యమును; అనాయకాః = నాయకుడు లేని
భావంః-
రామపట్టాభిషేకమునకు శీఘ్రముగా ఆజ్ఞను ఇమ్ము. పాలకుడు లేని పశువు వలె, నాయకుడు లేని సైన్యము వలె.
2.14.57.
అనుష్టుప్.
యథా చన్ద్రం వినా రాత్రిః
యథా గావో వినా వృషమ్।
ఏవం హి భవితా రాష్ట్రమ్
యత్ర రాజా న దృశ్యతే”॥
టీకః-
యథా = ఏ విధముగా; చంద్రమ్ = చంద్రుడు; వినా = లేకుండా; రాత్రిః = రాత్రి; యథా = ఎట్లు; గావో = గోవులు; వినా = లేకుండా; వృషమ్ = వృషభము; ఏవం హి = అదేవిధముగా; భవితా = కాగలదు; రాష్ట్రమ్ = రాజ్యము; యత్ర = ఎచ్చట; రాజా = రాజు; న దృశ్యతే = చూడబడడో
భావంః-
రాజు కనబడని రాజ్యము చంద్రుడు లేని రాత్రి వలె, వృషభములు లేని గోవు వలె అయిపోవును కదా!”
2.14.58.
అనుష్టుప్.
ఇతి తస్య వచశ్శృత్వా
సాంత్వపూర్వమివార్థవత్।
అభ్యకీర్యత శోకేన
భూయ ఏవ మహీపతిః॥
టీకః-
ఇతి = ఈ విధముగా; తస్య = అతని (సుమంత్రుని యొక్క); వచనః = మాటలు; శృత్వా = విని; సాంత్వపూర్వమ్ = బ్రతిమాలుటతో కూడిన; ఇవ=వంటిది;అర్థవత్ = మంచి అర్థము కలది; అభ్యకీర్యత = పరివృతమైన; శోకేన = దుఃఖము చేత; భూయః ఏవ = మరలను; మహీపతిః = దశరథ మహారాజు
భావంః-
మంచి అర్థముతో కూడినది, బ్రతిమాలుచు ఉన్నది అయిన సుమంత్రుని మాట విని దశరథుడు మరల శోకాక్రాంతుడైనాడు.
2.14.59.
అనుష్టుప్.
తత స్సరాజా తం సూతమ్
సన్నహర్షస్సుతం ప్రతి।
శోకరక్తేక్షణ శ్శ్రీమాన్
ఉద్వీక్ష్యోవాచ ధార్మికః।
వాక్యైస్తు ఖలు మర్మాణి
మమ భూయో నికృన్తసి॥
టీకః-
తతః = అటుపిమ్మట; సః = ఆ; రాజా = మహారాజు; తం = ఆ; సూతమ్ = సారథి సుమంత్రుని గూర్చి; సన్నః = సన్నగిల్లిన; హర్షః = ఆనందమును కలవాడై; సుతం = కుమారుని; ప్రతిః = గురించి; శోక = శోకముతో; రక్తః= ఎర్రబడిన; ఈక్షణః = కళ్లతో; శ్రీమాన్ = దివ్యమైన; ఉత్వీక్ష్యః = పైకిచూచి; ఉవాచ = పలికెను; ధార్మికః = ధర్మాత్ముడైనవాడు; వాక్యైః = మాటలతో; ఖలు=నిశ్చయముగ; మర్మాణి = ప్రాణాధార మర్మస్థానములను; మమ = నా యొక్క; భూయః = ఇంకను; నికృన్తసి = ఖండించుచుంటివి.
భావంః-
ధర్మాత్ముడైన దశరథుడు కుమారుని గూర్చి ఆలోచనతో సంతోషము సన్నగిల్లినవాడై, దుఃఖముచేత ఎఱ్ఱబారిన నేత్రాలతో ఆ సూతుని వైపు చూచి, “నీ మాటలతో ఇంకను నా మర్మములు ఛేదించుచున్నావు.” అనెను.
2.14.60.
అనుష్టుప్.
సుమంత్రః కరుణం శ్రుత్వా
దృష్ట్వా దీనం చ పార్థివమ్।
ప్రగృహీతాంజలిః కించిత్
తస్మాద్దేశాదపాక్రమత్॥
టీకః-
సుమంత్రః= సుమంత్రుడు; కరుణం = దయామయమైన పలుకులను; శ్రుత్వా =విని; దృష్ట్వా = చూచి; దీనం = దీనుడైన; చ = పాదపూరణము; పార్థివమ్ = మహారాజును; ప్రగృహీతాంజలిః = దోసిలి ఘటించినవాడై; కించిత్ = కొద్దిగా; తస్మాత్ = ఆ; దేశాత్ = ప్రదేశము నుండి; అపాక్రమత్ = తొలగిపోయెను
భావంః-
దీనుడైన ఆ దశరథుని చూచి, దయానీయమైన అతని మాటలు వినగానే సుమంత్రుడు అంజలి ఘటించి, ఆ ప్రదేశము నుండి కొంచెము దూరముగా తొలగిపోయెను.
2.14.61.
అనుష్టుప్.
యదా వక్తుం స్వయం దైన్యాన్
న శశాక మహీపతిః।
తదా సుమంత్రం మంత్రజ్ఞా
కైకేయీ ప్రత్యువాచ హ॥
టీకః-
యదా = ఎప్పుడైతే; వక్తుమ్ = చెప్పుటకు; స్వయమ్ = స్వయముగా; దైన్యాన్ = విచారమువలన; న = కాలేదో; శశాక = కాలేదో; మహీపతిః = మహారాజు; తదా = ఆ సమయములో; సుమంత్రమ్ = సుమంత్రుని గూర్చి; మంత్రజ్ఞా = మంత్రాంగము తెలిసిన; కైకేయీ = కైకేయి; ప్రత్యువాచ = ప్రత్యుత్తరము ఇచ్చెను; హ = పాదపూరణము.
భావంః-
దైన్యవశుడైన దశరథుడు స్వయముగా ఏమియు ప్రత్యుత్తరము ఎప్పుడైతే చెప్పలేకపోయెనో, అప్పుడు మంత్రాంగంలో దిట్ట ఐన కైకేయి సుమంత్రునికి ఇటలు సమాధానము చెప్పెను.
2.14.62.
అనుష్టుప్.
సుమంత్ర రాజా రజనీమ్
రామహర్షసముత్సుకః।
ప్రజాగరపరిశ్రాన్తో
నిద్రావశముపేయివాన్॥
టీకః-
సుమంత్రః = ఓ సుమంత్రుడా; రాజా = దశరథ మహారాజు; రజనీమ్ = రాత్రి యందు; రామమ్ = రామునిగూర్చి; హర్షః = ఆనందమువలన; సముత్సుకః = ఆవేశము పొందుచు; ప్రజాగర = మిక్కిలి మేల్కొనుటచే; పరిశ్రాంతః = అలసినవాడై; నిద్రావశమ్ = నిద్రకు వశమును; ఉపేయివాన్ = పొందుచున్నాడు.
భావంః-
సుమంత్రా! రామునికి రాజ్యాభిషేకము జరుగుననెడి ఆనందావేశముతో రాజు రాత్రి అంతా మెలకువగా నుండి, నిద్ర లేక అలసిపోయి ఇప్పుడు నిద్రపోవుచున్నాడు.
2.14.63.
అనుష్టుప్.
“తద్గచ్ఛ త్వరితం సూత!
రాజపుత్రం యశస్వినమ్।
రామమానయ భద్రం తే
నాత్ర కార్యా విచారణా”॥
టీకః-
తత్ = ఆ కారణముచే; గచ్ఛ = వెళ్లి; త్వరితమ్ = వేగముగా; సూత = ఓ సూతుడా, సుమంత్రా; రాజపుత్రం = రాజకుమారుడిని; యశస్వినమ్ = యశస్సు కలిగినవానిని; రామమ్ = రాముని; ఆనయ = తీసుకుని రమ్ము; భద్రం = మంగళము; తే = నీకు; న = కాదు; అత్ర = ఇచట; కార్యా = పని; విచారణా = ఆలోచించుట.
భావంః-
“ఓ సుమంత్రా! నీవు త్వరగా పోయి యశోవంతుడైన రాజకుమారుడు రాముని తీసికొనిరమ్ము. ఇచట ఇక ఆలోచించవలసిన పని లేదు. నీకు మంగళమగు గాక!”
2.14.64.
అనుష్టుప్.
స మన్యమానః కల్యాణమ్
హృదయేన ననంద చ।
నిర్జగామ చ సంప్రీత్యా
త్వరితో రాజశాసనాత్॥
టీకః-
సః = అతడు; హృదయేన = అంతరంగమందు; మన్యమానః = అగునని భావించి; కల్యాణమ్ = శుభసమయము గురించి; ననంద చ = సంతోషము; చ = మఱియు; నిర్జగామ = బయలుదేరెను; చ = మఱియు; సంప్రీత్యా = ఆనందముతో; త్వరితః = శీఘ్రముగా; రాజ శాసనాత్ = మహారాజు యొక్క ఆదేశముతో.
భావంః-
సుమంత్రుడు ఆంతరంగములో శుభకార్యము జరుగుచున్నదని భావించి సంతోషముగా రాజాజ్ఞ గైకొని తొందరగా బయలుదేరెను.
2.14.65.
అనుష్టుప్.
సుమంత్రశ్చింతయామాస
త్వరితం చోదితస్తయా।
వ్యక్తం రామోఽభిషేకార్థమ్
ఇహాయాస్యతి ధర్మవిత్॥
టీకః-
సుమంత్రః = సుమంత్రుడు; చింతయామాస = ఆలోచించుచు; త్వరితం = వేగముగా; చోదితః = పురిగొల్పబడిన; తయా = ఆమె చేత; వ్యక్తం = తప్పనిసరిగా; రామః = రాముడు; అభిషేకార్థమ్ = పట్టాభిషేకముకొరకు; ఇహ = ఇక్కడకు; ఆస్యాతి = వచ్చును; ధర్మవిత్ = ధర్మము నెరిగిన
భావంః-
సుమంత్రుడు కైకేయిచే ప్రేరేపించబడి, సంతోషించుచు మనస్సులో ”ధర్మాత్ముడైన రాముడు పట్టాభిషేకార్థము ఇక్కడకు తప్పక రానున్నాడు” అనుకొనెను.
2.14.66.
అనుష్టుప్.
ఇతి సూతో మతిం కృత్వా
హర్షేణ మహతా వృతః।
నిర్జగామ మహాబాహో
రాఘవస్య దిదృక్షయా॥
టీకః-
ఇతి = ఈ విధముగా; సూతః = సుమంత్రుడు; మతిమ్ = ఆలోచన; కృత్వా = చేసి; హర్షేణ = ఆనందముతో; మహతా = మిక్కిలి; వృతః = నిండినవాడై; నిర్జగామ = బయలుదేరెను; మహాబాహో = మహాబాహువులు కలిగిన; రాఘవస్య = రఘురామునియొక్క; దిదృక్షయా = చూచు కోరికతో
భావంః-
సుమంత్రుడు ఈ విధముగా అనుకొనుచు, సంతోషముతో, గొప్ప బాహువులు గల రాముని చూడవలెనను కోరికతో బయలుదేరెను.
2.14.67.
అనుష్టుప్.
సాగరహ్రదసంకాశాత్
సుమన్త్రోఽంతఃపురాః శుభాత్।
నిష్క్రమ్య జనసమ్బాధమ్
దదర్శ ద్వారమగ్రతః॥
టీకః-
సాగర = సాగరములో; హద్ర = లోతైన ప్రదేశమును; సంకాశాత్ = పోలినటువంటి; సుమంత్రః = సుమంత్రుడు; అంతఃపురాః = అంతఃపురము నుండి; శుభాత్ = దివ్యమైన; నిష్క్రమ్య = బయటకు వచ్చి; జన సమ్బాధమ్ = జనసమ్మర్దముతో ఉన్న; దదర్శ = చూచెను; ద్వారమ్ = ద్వారమును; అగ్రతః = ముందు
భావంః-
సాగరములోని లోతైన ప్రదేశమువలె గంభీరముగా నున్న అంతఃపురము నుండి బయల్వడిన సుమంత్రుడు, గుమ్మం వద్ద కిక్కిరిసి ఉన్న జనులను చూచెను.
2.14.68.
జగతి.
తతః పురస్తాత్సహసా వినిర్గతో
మహీపతీన్ ద్వారగతో విలోకయన్।
దదర్శ పౌరాన్ వివిధాన్మహాధనా
నుపస్థితాన్ ద్వారముపేత్య విష్ఠితాన్॥
టీకః-
తతః = ఆటు పిమ్మట; పురస్తాత్ = ముందుభాగములో; సహసా = వెనువెంటనే; వినిర్గతః = బయటకు వచ్చినవాడై; మహీపతీన్ = రాజులను; ద్వారగతః = ద్వారము చేరినవాడై; విలోకయన్ = చూచుచు; దదర్శ = చూచెను; పౌరాన్ = పుర ప్రజలను; వివిధాన్ = వివిధములైన; మహాధనాన్ = గొప్ప సంపన్నులను; ఉపస్థితాన్ = వచ్చియున్న; ద్వారమ్ = ద్వారమును; ఉపేత్య = సమీపించి; విష్ఠితాన్ = ఉన్నటువంటి
భావంః-
సుమంత్రుడు వెనువెంటనే బయలుదేరి ద్వారము సమీపించి, అచటకు వచ్చి వేచియున్న రాజులను, మహాధనవంతులైన వివిధ శ్రేణులకు చెందిన పౌరులను చూచెను.
2.14.69.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే చతుర్దశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; చతుర్దశః [14] = పద్నాల్గవ; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [14] పద్నాల్గవ సర్గ సంపూర్ణము.
2.15.1.
అనుష్టుప్.
తే తు తాం రజనీముష్య
బ్రాహ్మణా వేదపారగాః।
ఉపతస్థురుపస్థానమ్
సహ రాజపురోహితాః॥
టీకః-
తే = ఆ; తు = ; తాం = ఆ; రజనీమ్ = రాత్రి అంతా; ఉష్య = ఉండి; బ్రాహ్మణా = బ్రాహ్మణులు; వేదపారగాః = వేదపారంగతులు; ఉపతస్థుః = చేరుకొనిరి; ఉపస్థానమ్ = దగ్గరలో ఉన్న ప్రదేశమును; సహ = కూడి; రాజపురోహితః = రాజపురోహితుడు.
భావంః-
వేదవిదులైన బ్రాహ్మణులు ఆ రాత్రి అక్కడనే ఉండి, మరుసటి ఉదయమున రాజపురోహితుడైన వసిష్ఠునితో కూడి ఆ పట్టాభిషేకవేదిక చెంతన ఉన్న ప్రదేశమునకు చేరుకొనిరి.
2.15.2.
అనుష్టుప్.
అమాత్యా బలముఖ్యాశ్చ
ముఖ్యా యే నిగమస్య చ।
రాఘవస్యాభిషేకార్థే
ప్రియమాణాస్తు సంగతాః॥
టీకః-
అమాత్యాః = మంత్రులు; బలముఖ్యాః = సేనాధిపతులు; చ = మఱియు; ముఖ్యాః = ముఖ్యులు; యే = ఎవరో వారు; నిగమస్య = వ్యాపారు లందు; రాఘవస్య = రాముని యొక్క; అభిషేకార్థే = పట్టాభిషేకము కొరకై; ప్రియమాణః = సంతోషించుచున్నవారలు; అస్తు = అయి; సంగతాః = కలిసిరి.
భావంః-
మంత్రులు, సేనాధిపతులు, ఇంకా వ్యాపారులలో ప్రముఖులు, రాముడి అభిషేక సందర్భముగా ఆనందోత్సాహులై అక్కడకు చేరుకొనిరి.
2.15.3.
అనుష్టుప్.
ఉదితే విమలే సూర్యే
పుష్యే చాభ్యాగతేఽ హని।
లగ్నే కర్కటకే ప్రాప్తే
జన్మ రామస్య చ స్థితే॥
టీకః-
ఉదితే = ఉదయించగా; విమలే = స్వచ్ఛమైన; సూర్యే = సూర్యుడు; పుష్యే = పుష్యమీ నక్షత్రము; అభ్యాగతే = ఏతెంచిన; అహని = పగటి సమయమున; లగ్నే = లగ్నమున; కర్కటకే = కర్కాటకము; ప్రాప్తే = ఉన్న సమయమున; జన్మ = జనన కాలమున; రామస్య = రాముని; స్థితే = ఉన్న.
భావంః-
ప్రశాంత సూర్యోదయమైన తరువాత, పగటి సమయమున, పుష్యమీ నక్షత్రము ఉన్న వేళ, రాముడు జన్మించిన కర్కాటక లగ్నముననే..
2.15.4.
అనుష్టుప్.
అభిషేకాయ రామస్య
ద్విజేంద్రైరుపకల్పితమ్।
కాంచనా జలకుమ్భాశ్చ
భద్రపీఠం స్వలంకృతమ్॥
టీకః-
అభిషేకాయ = అభిషేకము చేయుటకు; రాముస్య = రాముని యొక్క; ద్విజేన్ద్రైః = బ్రాహ్మణోత్తములచే; ఉపకల్పితమ్ = నిర్ణయించబడినది; కాంచనాః = బంగారు; జలకుమ్భాః = నీటికుండలును; చ = మఱియు; భద్రపీఠం = సింహాసనము; స్వలంకృతమ్ = మంచిగా అలంకరింపబడిన.
భావంః-
రామునికి అభిషేకము చేయవలెనని బ్రాహ్మణోత్తములచే నిర్ణయించబడినది. బంగారపు నీటికుండలు, బాగుగా అలంకరించబడిన సింహాసనము ఉన్నవి.
2.15.5.
అనుష్టుప్.
రథః చ సమ్యగాస్తీర్ణో
భాస్వతా వ్యాఘ్రచర్మణా।
గంగాయమునయోఃపుణ్యాత్
సంగమాదాహృతం జలమ్॥
టీకః-
రథః = రథములును; చ = మఱియు; సమ్యక్ = మంచిగా; ఆస్తీర్ణః = కప్పబడిన; భాస్వతా = ప్రకాశించుచున్న; వ్యాఘ్రచర్మణా = పులిచర్మము; గంగా యమునయోః = గంగా యమునా నదుల యొక్క; పుణ్యాః = పుణ్యప్రదమైన; సంగమాత్ = కలయిక నుండి; ఆహృతం = తీసుకొనిరాబడిన; జలమ్ = నీరు.
భావంః-
పులిచర్మముతో కప్పబడియున్న రథమునందు, పుణ్యప్రదమైన గంగాయమునా నదుల సంగమము నుండి గ్రహించిన నీటిని...
2.15.6.
అనుష్టుప్.
యాశ్చాన్యా స్సరితః పుణ్యా
హ్రదాః కూపాస్సరాంసి చ।
ప్రాగ్వాహాశ్చోర్ధ్వవాహాశ్చ
తిర్యగ్వాహా స్సమాహితాః॥
టీకః-
యాః = ఏ; అన్యాః = ఇతరములైన; సరితః = నదులు; పుణ్యాః = పుణ్యప్రదమైన; హ్రదాః = తటాకములు; కూపాః = నూతులు, చెలమలు; సరాంసి = సరస్సులు; చ = మఱియు; ప్రాగ్వాహాః = తూర్పుదిశగా ప్రవహించునవి; ఊర్ధ్వవాహాః = పైకి ఉబుకుచూ ప్రవహించునవి; తిర్యగ్వాహాః = అడ్డముగా ఉత్తర దిశగా ప్రవహించునవి; సమాహితాః = పరస్పరము కలసి ప్రవహించునవి, నదీసంగమములు.
భావంః-
ఇతర పుణ్య నదుల నుండి, తటాకములు, కూపములు, సరస్సులనుండి, తూర్పుదిశగా ప్రవహించు కావేరి, కృష్ణ, గోదావరి నదుల నుండి, నైమిశారణ్య ప్రాంతంలోని ఊర్ధ్వముఖముగా ప్రవహించు బ్రహ్మావర్త, రుద్రావర్త సరస్సుల నుండి, ఉత్తరదిశగా అడ్డముగా ప్రవహించు గండకీ ప్రభృతి నదుల నుండి, నదీసంగమముల నుండి...
2.15.7.
అనుష్టుప్.
తాభ్యశ్చైవాహృతం తోయమ్
సముద్రేభ్యశ్చ సర్వశః।
సలాజాః క్షీరిభిశ్ఛన్నా
ఘటాః కాంచనరాజతాః॥
టీకః-
తాభ్యః = వాటి నుండియు; చ = పాదపూరణము; ఏవ = అన్నింటి; ఆహృతం = తీసుకురాబడిన; తోయం = నీరు; సముద్రేభ్యః = సముద్రముల నుండి; సర్వశః = అన్నిటినుండి; స లాజః = పేలాలు కలుపబడిన; క్షీరిభిః = మఱ్ఱి మున్నగు పాలచెట్ల ఆకులచే; ఛన్నా = కప్పబడిన; ఘటాః = కలశములు; కాంచన = బంగారు; రాజతాః = వెండివి.
భావంః-
వాటి నుండి తీసుకువచ్చిన నీరు, మఱియు సకల సముద్రములు, నుండి తీసుకువచ్చిన జలములు, పేలాలు వేయబడి, పవిత్రమైన మఱ్ఱి, మేడి, రావి, గంగరావి, జువ్వి ఐదు పాలచెట్ల ఆకులతో కప్పబడి ఉన్న బంగారు కలశములు, వెండి కలశములు...
గమనికః-
క్షీరవృక్షః- పు. క్షీరీ క్షీర యుక్తః వృక్షః. (1) క్షీరయుక్త పంచప్రకార వృక్షః. అవి. న్యగ్రోధోదుంబరాశ్వత్థపారీషప్లక్షపాదపాః. శబ్దకల్పదృమ. మఱ్ఱి, మేడి, రావి, గంగరావి, జువ్వి అను ఈ ఐదు (5) చెట్లనుండి పాలు కారును కావున వీటిని క్షీరి, క్షీరివృక్షములు అందురు.
2.15.8.
అనుష్టుప్.
పద్మోత్పలయుతా భాంతి
పూర్ణాః పరమవారిణా।
క్షౌద్రం దధి ఘృతం లాజా
దర్భా స్సుమనసః పయః॥
టీకః-
పద్మః = తామరపువ్వులు; ఉత్పల = కలువపువ్వులు; యుతా = కలసిన; భాంతి = ప్రకాశించుచున్న; పూర్ణాః = నిండియున్న; పరమ = శ్రేష్ఠమైన; వారిణా = జలములతో; క్షౌద్రం = తేనే; దధి = పెరుగు; ఘృతం = నెయ్యి; లాజా = పేలాలు; దర్భాః = దర్భలు; సుమనసః = పువ్వులు; పయః = పాలు.
భావంః-
తామరలు, కలువలతో అలంకరింపబడి, శ్రేష్ఠమైన జలములతో నిండియున్న కలశములు ప్రకాశించుచున్నవి. తేనె, పాలు, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పుష్పములు సిద్ధము చేయబడినవి.
2.15.9.
అనుష్టుప్.
వేశ్యాశ్చైవ శుభాచారా
స్సర్వాభరణభూషితాః।
చంద్రాంశువికచప్రఖ్యమ్
కాంచనం రత్నభూషితమ్॥
టీకః-
వేశ్యాః = వేశ్యలు; చైవ = ఐతే; శుభాచారః = శుభకరమైన ఆచారవంతుల; సర్వ = సకల; ఆభరణ = ఆభరణములతో; భూషితాః = అలంకరింపబడినవారు; చంద్ర = చంద్రుని; అంశు = కిరణములవలె; వికచ = వికసించిన (ప్రసరించిన); ప్రఖ్యమ్ = వలె వ్యక్తమౌతున్న; కాంచనం = బంగారము; రత్న = రత్నములతో; భూషితమ్ = అలంకరింపబడియున్నది.
భావంః-
శుభాచారవతులును, సర్వాలంకారభూషితులు నైన వేశ్యలు, బంగారము, రత్నములు అలంకరించిన, చంద్రుని అమృతకిరణాలు ప్రసరించినట్లు ద్యోతకము అవుతున్నారు.
2.15.10.
అనుష్టుప్.
సజ్జం తిష్ఠతి రామస్య
వాలవ్యజనముత్తమమ్।
చంద్రమండలసంకాశమ్
ఆతపత్రం చ పాండురమ్॥
టీకః-
సజ్జం = సిద్ధము చేయబడి; తిష్ఠతి = ఉన్నది; రామస్య = రాముని యొక్క; వాలవ్యజనమ్ = వింజామరము, చామరము; ఉత్తమమ్ = శ్రేష్ఠమైన; చంద్రమండలసంకాశమ్ = చంద్రమండలముతో పోలినది; ఆతపత్రం చ = గొడుగు కూడ; పాండురమ్ = తెల్లనిది.
భావంః-
చంద్రుని కాంతి యంత గొప్పగ మెరయుచున్న శ్రేష్ఠమైన తెల్లని ఛత్రచామరములు రాముని కొరకు సిద్ధము చేయబడినవి.
2.15.11.
అనుష్టుప్.
సజ్జం ద్యుతికరం శ్రీమత్
అభిషేకపురస్కృతమ్।
పాండురశ్చ వృషస్సజ్జః
పాండురోఽ శ్వశ్చ సుస్థితః॥
టీకః-
సజ్జం = సిద్ధము చేయబడినది; ద్యుతికరం = వెలుగునిచ్చునది; శ్రీమత్ = సకృత్యాలంకృతం, అమరకోశం; అభిషేక = అభిషేకమునకు; పురస్కృతమ్ = పురః+ కృతమ్, ముందే సిద్ధము చేయబడినది; పాండురః = తెల్లని; వృషః = ఎద్దు; సజ్జః = సిద్ధము చేయబడినది; పాండురః = తెల్లని; అశ్వః చ = గుఱ్ఱము కూడ; సుస్థితః = చక్కగా ఉన్నది.
భావంః-
అభిషేకమునకు పూర్వమే, శుభ్రంగా కడిగి అలంకారములు చేసిన కాంతివంతముగ మెరయుచున్న తెల్లని వృషభము, మఱియు తెల్లని గుఱ్ఱము చక్కగా సిద్ధము చేయబడి ఉన్నవి.
2.15.12.
అనుష్టుప్.
ప్రసృతశ్చ గజఃశ్రీమాన్
ఔపవాహ్యః ప్రతీక్షతే।
అష్టౌ చ కన్యా మాంగల్యాః
సర్వాభరణభూషితాః॥
టీకః-
ప్రసృతః = ప్రవృద్ధ, శబ్దకల్పదృమం; గజః = ఏనుగు; శ్రీమాన్ = శుభయుతమైనది; ఔపవాహ్యః = ఎక్కి తిరుగుటకు తగినది; ప్రతీక్షతే = ఎదురుచూచున్నది; అష్టౌ = ఎనిమిదిమంది; కన్యాః = కన్యలు; మాంగల్యాః = మంగళమూర్తులైన; సర్వ = సకల; ఆభరణ = ఆభరణములను; భూషితాః = అలంకరించుకున్న.
భావంః-
ఎత్తైన, రాజులు అధిరోహించుటకు తగియున్న పట్టపుటేనుగు నిరీక్షించుండెను. సర్వాలంకారభూషితులు మంగళస్వరూపులు ఐన ఎనిమిది మంది కన్యలు నిరీక్షించుచుండిరి.
2.15.13.
అనుష్టుప్.
వాదిత్రాణి చ సర్వాణి
వందినశ్చ తథాఽ పరే।
ఇక్ష్వాకూణాం యథా రాజ్యే
సంభ్రియేతాభిషేచనమ్॥
టీకః-
వాదిత్రాణి = సంగీత వాద్యములు; సర్వాణి = అన్నియు; వందినః చ = భట్రాజులు, స్తుతిచేసి జీవించువారు; చ = ఇంకను; తథాపరే = తదితరులు; ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకువంశజులు; యథా = ఎట్లు; రాజ్యే = రాజ్యమునందు; సంభ్రియేత = ఏర్పాటుచేయబడునో; అభిషేచనమ్ = పట్టాభిషేకము చేయుటకు అవసరమైన ద్రవ్యములు.
భావంః-
సంగీతవాద్యములు, వందిమాగధులు, తదితరులు కూడ నిరీక్షించుచున్నారు. ఇక్ష్వాకువంశజుల పట్టాభిషేకము ఎటుల చేయుదురో ఆ ఏర్పాట్లు అన్నియు చేయబడినవి.
2.15.14.
అనుష్టుప్.
తథాజాతీయమాదాయ
రాజపుత్రాభిషేచనమ్।
తే రాజవచనాత్తత్ర
సమవేతామహీపతిమ్॥
టీకః-
తథా = అట్లే; జాతీయమ్ = సజాతీయులు, జ్ఞాతులు; ఆదాయ = తీసుకొనివచ్చిన; రాజపుత్ర = రాజకుమారుడు రాముని; అభిషేచనమ్ = అభిషేకమునకు; తే = వారు; రాజవచనాత్ = రాజాజ్ఞననుసరించి; తత్ర = అక్కడ; సమవేతాః = సమావేశమై ఉన్నవారు; మహీపతిమ్ = రాజును.
భావంః-
అదే విధముగా ఇక్ష్వాకువంశము వారిని రాముని పట్టాభిషేకమునకు తీసుకువచ్చిరి. రాజాజ్ఞ ననుసరించి అక్కడ సమావేశమైనవారు మహారాజు దశరథుడు. .
2.15.15.
అనుష్టుప్.
అపశ్యన్తోఽ బ్రువన్ “కో ను
రాజ్ఞో నః ప్రతివేదయేత్।
న పశ్యామశ్చ రాజానమ్
ఉదితశ్చ దివాకరః”॥
టీకః-
అపశ్యన్తో = చూడనివారై; అబ్రువన్ = పలికిరి; కః ను = ఎవరు; రాజ్ఞః = రాజునకు; నః = మనలను గూర్చి; ప్రతివేదయేత్ = తెలియజేసెదరు; న = లేదు; పశ్యామః = చూచుట; రాజానమ్ = రాజును; ఉదితః = ఉదయించినాడు; దివాకరః = సూర్యుడు.
భావంః-
వారికి మహారాజు కనిపింపక, "సూర్యోదయమైనది. ఐనను మహారాజు కనిపించుట లేదు. మన రాకను గురించి మహారాజునకు ఎవరు తెలియజేసెదరు." అని తమలోతాము అనుకొనిరి.
2.15.16.
అనుష్టుప్.
“యౌవరాజ్యాభిషేకశ్చ
సజ్జో రామస్య ధీమతః”।
ఇతి తేషు బ్రువాణేషు
సార్వభౌమాన్ మహీపతీన్॥
టీకః-
యౌవరాజ్యాభిషేకః = యౌవరాజ్యాభిషేకము కూడ; చ = కూడ; సజ్జః = సిద్ధమైయున్నది; రామస్య = రాముని యొక్క; ధీమతః = బుద్ధిమంతుడైన; ఇతి = ఇట్లు; తేషు = వారు; బ్రువాణేషు = పలుకుచుండగా; సార్వభౌమాన్ = అన్ని దేశముల యొక్క; మహీపతీన్ = రాజులు.
భావంః-
”సద్గుణసంపన్నుడైన రాముని యౌవరాజ్యాభిషేకమునకు సర్వము సిద్ధము చేయబడినది.” అని సకల దేశముల రాజులు పలుకుతున్నారు.
2.15.17.
అనుష్టుప్.
అబ్రవీత్తానిదం సర్వాన్
సుమన్త్రో రాజసత్కృతః।
“రామం రాజ్ఞో నియోగేన
త్వరయా ప్రస్థితోఽ స్మ్యహమ్॥
టీకః-
అబ్రవీత్తాని = పలికెను; ఇదం = ఈ; సర్వాన్ = సర్వులకు; సుమంత్రః = సుమంత్రుడు; రాజసత్కృతః = రాజుచే సత్కరింపబడిన; రామం = రాముని గూర్చి; రాజ్ఞః = రాజుయొక్క; నియోగేన = ఆజ్ఞచే; త్వరయా = త్వరగా; ప్రస్థితః = ప్రయాణమై; అస్మి = ఉన్నాను; అహమ్ = నేను.
భావంః-
దశరథమహారాజుచే గౌరవింపబడిన సుమంత్రుడు ఇట్లు పలికెను. “నేను రాజాజ్ఞచే శీఘ్రముగా రాముని వద్దకు వెళ్ళుచున్నాను.
2.15.18.
అనుష్టుప్.
పూజ్యా రాజ్ఞో భవంతస్తు
రామస్య చ విశేషతః।
అయం పృచ్ఛామి వచనాత్
సుఖమాయుష్మతామహమ్॥
టీకః-
పూజ్యా = పూజనీయులు; రాజ్ఞః = రాజునకు; భవంతః = మీరు; అస్తు = ఐన; రామస్య = రామునికి; విశేషతః = విశేషముగా; అయం = ఈ; పృచ్ఛామి = అడిగెదను; సుఖమ్ = సుఖమును; ఆయుష్మతామ్ = ఆయుష్మంతులైన; అహమ్ = నేను.
భావంః-
తామందరును దశరథమహారాజునకు, విశేషముగా రామునకు పూజనీయులు. మీ అందరి యొక్క మాటగా ఆయుష్మంతుడైన రాజుగారి సౌఖ్యమును నేను అడిగెదను.
2.15.19.
అనుష్టుప్.
రాజ్ఞః సంప్రతిబుద్ధస్య
చానాగమన కారణమ్”।
ఇత్యుక్త్వాఽ ంతఃపురద్వారమ్
ఆజగామ పురాణవిత్॥
టీకః-
రాజ్ఞ = రాజు యొక్క; సంప్రతిబుద్ధస్య = మేల్కొనిన; చ = కూడా; అనాగమన = రాకుండుటకు; కారణమ్ = కారణమును; ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; అంతఃపురద్వారమ్ = అంతఃపుర ద్వారమును; ఆజగామ = చేరెను; పురాణవిత్ = పురాణ కోవిదుడైన.
భావంః-
దశరథమహారాజు మేల్కొనియుండి కూడ రాకపోవుటకు కారణమును తెలుసుకొనెదను" అని పలికి పురాణకోవిదుడైన సుమంత్రుడు రాజాంతఃపురద్వారమును చేరుకొనెను.
2.15.20.
అనుష్టుప్.
సదాఽసక్తం చ తద్వేశ్మ
సుమంత్రః ప్రవివేశ హ।
తుష్టావాస్య తదా వంశమ్
ప్రవిశ్య స విశాంపతేః॥
టీకః-
సదా = ఎల్లప్పుడును; ఆసక్తం = అడ్డులేనిది, ఆప్టే డిక్షనరీ; తత్ = ఆ; వేశ్మ = భవనమును; సుమంత్రః = సుమంత్రుడు; ప్రవివేశ హ = ప్రవేశించెను; తుష్టావ = కీర్తించెను; తదా = అప్పుడు; వంశమ్ = వంశమును; ప్రవిశ్య = ప్రవేశించి; సః = అతడు; విశాంపతేః = రాజుయొక్క.
భావంః-
తనకు ఎప్పుడును అడ్డులేనటువంటి రాజాంతఃపురములో ప్రవేశించి, దశరథ మహారాజుయొక్క వంశమును కీర్తించెను.
2.15.21.
అనుష్టుప్.
శయనీయం నరేంద్రస్య
తదాఽ ఽ సాద్య వ్యతిష్ఠత।
సోఽ త్యాసాద్య తు తద్వేశ్మ
తిరస్కరణిమంతరా॥
టీకః-
శయనీయం = పడకగది; నరేంద్రస్య = రాజుయొక్క; తత్ = ఆ; ఆసాద్య = చేరి; వ్యతిష్ఠత = నిలిచెను; సః = అతడు; ఆసాద్య = చేరి; తత్ = ఆ; వేశ్మ = గది; తిరస్కరణిమ్ = తెరకు; అంతరా = లోపలి.
భావంః-
సుమంత్రుడు దశరథమహారాజుయొక్క పడక గది లోపలి తెరకు చేరువగ నిలచెను.
2.15.22.
అనుష్టుప్.
ఆశీర్భిర్గుణయుక్తాభి
రభితుష్టావ రాఘవమ్।
“సోమసూర్యౌ చ కాకుత్స్థ
శివవైశ్రవణావపి॥
టీకః-
ఆశీర్భిః = ఆశీర్వచనములతో; గుణయుక్తాభిః = గుణములతో కూడిన; అభితుష్టావ = స్తుతించెను; రాఘవమ్ = దశరథుని; సోమ = చంద్రుడు; సూర్యౌ = సూర్యుడు; కాకుత్స్థ = కాకుత్స్థ వంశజుడైన దశరథమహారాజా; శివ = శివుడు; వైశ్రవణ = కుబేరుడు; అపి = కూడ.
భావంః-
సుమంత్రుడు దశరథుని యొక్క గుణగణములను కీర్తించుచు ఆశీర్వచనములను పలికెను. “ఓ దశరథమహారాజా! నీకు సూర్యచంద్రులు, శివుడు, కుబేరుడు మొదలగు వారి ఆశీర్వచనము.
2.15.23.
అనుష్టుప్.
వరుణశ్చాగ్నిరింద్రశ్చ
విజయం ప్రదిశన్తు తే।
గతా భగవతీ రాత్రిః
అహః శివముపస్థితమ్॥
టీకః-
వరుణః = వరుణదేవుడు; అగ్నిః = అగ్నిదేవుడు; ఇంద్రశ్చ = ఇంద్రుడు; విజయం = విజయమును; ప్రదిశన్తు = ప్రసాదించెదరు; తే = నీకు; గతా = గడచినది; భగవతీ = పూజనీయమైన; రాత్రిః = రాత్రి; అహః = పగలు; శివమ్ = శుభము; ఉపస్థితమ్ = వచ్చినది.
భావంః-
ఇంద్రాగ్నివరుణులు నీకు విజయము చేకూర్చెదరుగాక. పూజనీయమైన రాత్రి గడచిపోయినది. శుభప్రదమైన పగలు వచ్చినది.
2.15.24.
అనుష్టుప్.
బుద్ధ్యస్వ నృపశార్దూల!
కురు కార్యమనంతరమ్।
బ్రాహ్మణా బలముఖ్యాశ్చ
నైగమాశ్చాగతా నృప!॥
టీకః-
బుద్ధ్యస్వ = లెమ్ము; నృపశార్దూల = రాజశ్రేష్ఠా; కురు = చేయుము; కార్యమ్ = కార్యమును; అనంతరమ్ = తరువాతి; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; బలముఖ్యాః = సేనాధిపతులు; చ = మఱియు; నైగమాః = వ్యాపారులును; చ = మఱియు; ఆగతాః = వచ్చియున్నారు; నృప = రాజా.
భావంః-
రాజా! మేల్కొనుము. తదుపరి కార్యక్రమములను నిర్వర్తించుము. బ్రాహ్మణులు, సేనాధిపతులు, వ్యాపారులు వేంచేసియున్నారు.
2.15.25.
అనుష్టుప్.
దర్శనం తేఽ భికాంక్షన్తే
ప్రతిబుధ్యస్వ రాఘవ”।
స్తువన్తం తం తదా సూతమ్
సుమన్త్రం మన్త్రకోవిదమ్॥
టీకః-
దర్శనం = దర్శనమును; తే = నీ యొక్క; అభికాంక్షన్తే = కోరుచున్నారు; ప్రతిబుద్ధ్యస్వ = మేలుకొనుము; రాఘవ = దశరథా; స్తువన్తం = స్తుతించుచున్న; తం = ఆ; తదా = అప్పుడు; సూతమ్ = రథసారథి గురించి; సుమన్త్రం = సుమంత్రుని గురించి; మన్త్రకోవిదమ్ = మంత్రమును (ఆలోచనను) ఎరిగినవాడు.
భావంః-
దశరథ మహారాజా! మేలుకొనుము. వారందరు నీ దర్శనమును కోరుచున్నారు" అనెను. అప్పుడు దశరథుడు మేల్కొని స్తుతించుచున్న మంత్రకోవిదుడు, తన రథసారథి అయిన సుమంత్రునితో..
2.15.26.
అనుష్టుప్.
ప్రతిబుధ్య తతో రాజా
ఇదం వచనమబ్రవీత్।
“రామమానయ సూతేతి
యదస్యభిహితోఽ నయా”॥
టీకః-
ప్రతిబుద్ధ్య = మేలుకొని; తతః = తరువాత; రాజా = రాజు; ఇదం = ఈ; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను; రామమ్ = రాముని; ఆనయ = తీసుకొని రమ్ము; సూత = సారథీ; ఇతి = అని; యత్ = కదా; అసి అభిహిత = చెప్పబడినది కదా; అనయా = తీసుకొని రమ్ము.
భావంః-
తరువాత దశరథమహారాజు మేలుకొని "సుమంత్రా రాముని తోడ్కొని రమ్మని చెప్పియుంటిని కదా" అని తన సారథితో పలికెను.
2.15.27.
అనుష్టుప్.
“కిమిదం కారణం యేన
మమాజ్ఞా ప్రతిహన్యతే।
న చైవ సంప్రసుప్తోఽ హమ్
ఆనయేహాశు రాఘవమ్”॥
టీకః-
కిమ్ = ఏ; ఇదం = ఈ; కారణం = కారణము; యేన = దేని వలన; మమ = నా యొక్క; ఆజ్ఞ = ఆజ్ఞ; ప్రతిహస్యతే = పాటింపబడలేదు; న చ ఏవ = లేదు; సంప్రసుప్తః = నిదురించుట; అహమ్ = నేను; ఆనయ = తీసుకొని రమ్ము; ఇహ = ఇక్కడకు; ఆశు = వెంటనే; రాఘవమ్ = రాముని.
భావంః-
"ఏ కారణము వలన నా ఆజ్ఞ పాటింపబడ లేదు. నేను నిదురించుట లేదు. వెంటనే రాముని తోడ్కొని రమ్ము".
2.15.28.
అనుష్టుప్.
ఇతి రాజా దశరథ
స్సూతం తత్రాన్వశాత్పునః।
స రాజవచనం శ్రుత్వా
శిరసా ప్రతిపూజ్య తమ్॥
టీకః-
ఇతి = ఇట్లు; రాజాదశరథ = దశరథమహారాజు; సూతం = సారథిని; తత్ర = అక్కడ; అన్వశాత్ = ఆజ్ఞాపించెను; పునః = మరల; సః = అతడు; రాజవచనం = రాజాజ్ఞను; శ్రుత్వా = విని; శిరసా = శిరస్సుతో; ప్రతిపూజ్య = పూజించి; తమ్ = అతనిని.
భావంః-
అట్లు దశరథమహారాజు సారథిని మరల ఆజ్ఞాపించెను. రాజాజ్ఞను వినిన సుమంత్రుడు దశరథునికి శిరస్సు వంచి నమస్కరించెను.
2.15.29.
అనుష్టుప్.
నిర్జగామ నృపావాసాన్
మన్యమానః ప్రియం మహత్।
ప్రసన్నో రాజమార్గం చ
పతాకాధ్వజశోభితమ్॥
టీకః-
నిర్జగామ = బయల్వెడలెను; నృపావాసాత్ = రాజభవనమునుండి; మన్యమానః = మనసునందు తలచుచు; ప్రియం = శుభమును; మహత్ = గొప్ప; ప్రసన్నః = ప్రసన్నుడై; రాజమార్గం చ = రాజమార్గమును; చ = మఱియు; పతాకాః = జెండాలతోను; ధ్వజః = జెండాకఱ్ఱలతోను; శోభితమ్ = శోభిలుచున్న.
భావంః-
సుమంత్రుడు గొప్ప శుభము జరుగవలెనని తలచుచు, రాజభవనము నుండి బయలుదేరి, పతాకములతోను, ధ్వజములతోను శోభిలుచున్న రాజమార్గమును చూచెను.
2.15.30.
అనుష్టుప్.
హృష్టః ప్రముదిత స్సూతో
జగామాశు విలోకయన్।
స సూతస్తత్ర శుశ్రావ
రామాధికరణాః కథాః॥
టీకః-
హృష్టః = సంతోషించి; ప్రముదితః = ఆనందముగా; సూతః = సారథి; జగామ = వెళ్ళెను; ఆశు = వెంటనే; విలోకయన్ = చూచి; సః = అతడు; సూతః = సారథి; తత్ర = అక్కడ; శుశ్రావ = వినెను; రామాధికరణాః = రాముని గూర్చి; కథాః = విషయములను.
భావంః-
సుమంత్రుడు సంతోషముగ అక్కడినుండి ప్రయాణమగుచు రాముని గురించి ఆనందాతిశయములతో చెప్పుకొనుచున్న విషయములను వినెను.
2.15.31.
అనుష్టుప్.
అభిషేచనసంయుక్తాః
సర్వలోకస్య హృష్టవత్।
తతో దదర్శ రుచిరమ్
కైలాసశిఖరప్రభమ్॥
టీకః-
అభిషేచన సంయుక్తాః = అభిషేకమునకు సంబంధించిన; సర్వ = అందరు; లోకస్య = ప్రజలయొక్క; హృష్టవత్ = ఆనందించిన; తతః = తరువాత; దదర్శ = చూచెను; రుచిరమ్ = అందమైన; కైలాసశిఖర = కైలాసశిఖరము వలె; ప్రభమ్ = ప్రకాశించుచున్న.
భావంః-
సుమంత్రుడు రామాభిషేకమునకు గురించి ప్రజలు చెప్పుకొనుచున్న మాటలను సంతోషముగా విని కైలాసశిఖరమువలె ప్రకాశించుచున్న...
2.15.32.
అనుష్టుప్.
రామవేశ్మ సుమన్త్రస్తు
శక్రవేశ్మసమప్రభమ్।
మహాకవాటవిహితమ్
వితర్దిశతశోభితమ్॥
టీకః-
రామ = రాముని; వేశ్మ = గృహమును; సుమంత్రః = సుమంత్రుడు; తు = పాదపూరణము; శక్ర = ఇంద్రుని; వేశ్మ = భవనముతో; సమ = సమానముగా; ప్రభమ్ = ప్రకాశిస్తున్నది; మహా = మిక్కిలి పెద్ద; కవాట = తలుపులతో; విహితమ్ = కలది; వితర్ది = వేదికలు; శత = వంద; శోభితమ్ = ప్రకాశిస్తున్నది.
భావంః-
సుమంత్రుడు పెద్ద పెద్ద తలుపులతోను, వంద వేదికలతో శోభిలుచు, ఇంద్రభవనము వలె వెలుగొందుచున్న రాముని గృహమును చూచెను.
2.15.33.
అనుష్టుప్.
కాంచనప్రతిమైకాగ్రమ్
మణివిద్రుమతోరణమ్।
శారదాభ్రఘనప్రఖ్యమ్
దీప్తం మేరుగుహోపమమ్॥
టీకః-
కాంచన = బంగరు; ప్రతిమ = బొమ్మలు కల; ఏకాగ్రమ్ = ఒకే విషయమున లగ్నమైనది, సూర్యారాయాంధ్ర, అనన్యవృత్తి, శబ్దరత్నాకరం; మణి = మణులు; విద్రుమ = పగడముల; తోరణమ్ = తోరణములు గలది; శారద = శరదృతువు నందలి; అభ్ర = ఆకాశమునగల; ఘన = మేఘము వలె; ప్రఖ్యమ్ = కాంతివంతమై; దీప్తం = వెలుగుచుండెను; మేరు = మేరుపర్వతము యొక్క; గుహ = గుహ; ఉపమమ్ = వలె ఉండెను.
భావంః-
రాముని భవనములో అనన్యమైన స్వర్ణప్రతిమలే ఉండెను. మాణిక్యములు పగడాలు గల తోరణము కట్టబడియుండెను. శరదృతువు నందలి మేఘము వలె, మేరుపర్వతపు గుహ వలె రాముని భవనము ప్రకాశించుచుండెను.
2.15.34.
అనుష్టుప్.
మణిభిర్వరమాల్యానామ్
సుమహద్భిరలంకృతమ్।
ముక్తామణిభిరాకీర్ణమ్
చందనాగరు ధూపితమ్॥
టీకః-
మణిభిః = మణులతో; వరమాల్యానామ్ = శ్రేష్ఠమైన మాల; సుమహద్భిః = చాలపెద్దది; అలంకృతమ్ = అలంకరింపబడినది; ముక్తాః = ముత్యములతోను; మణిభిః = మణులతోను; ఆకీర్ణమ్ = నిండి యున్నది; చందన = మంచిగంధము; అగరు = అగరులతో; ధూపితమ్ = ధూపములు వేయబడినది.
భావంః-
మేలైన మణుల పెద్ద హారములు అలంకరించినది. ముత్యములు మణులతో నిండి ఉన్నది. మంచిగంధము అగరు ధూపములు వేసినది.
2.15.35.
అనుష్టుప్.
గంధాన్మనోజ్ఞాన్ విసృజత్
దార్దురం శిఖరం యథా।
సారసైశ్చ మయూరైశ్చ
నినదద్భిర్విరాజితమ్॥
టీకః-
గంధాన్ = గంధములను; మనోజ్ఞాన్ = ఆహ్లాదకరమైన; విసృజత్ = వెదచల్లుతున్నది; దార్దురం = దర్దురపర్వతము యొక్క; శిఖరం = శిఖరము; యథా = ఎట్లు; సారసైః = సారస పక్షులచే; మయూరైః = నెమళ్ళ చేతను; నినదద్భిః = కూతలతో; విరాజితమ్ = ప్రకాశింపబడినది.
భావంః-
దర్దురపర్వతశిఖరము వలె, ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లుతున్నది. సారసపక్షుల యొక్క, నెమళ్ళ యొక్క కూతలతో శోభిలుచున్నది.
2.15.36.
అనుష్టుప్.
సుకృతేహామృగాకీర్ణమ్
సుకీర్ణం భక్తిభిస్తథా।
మనశ్చక్షుశ్చ భూతానామ్
ఆదదత్తిగ్మతేజసా॥
టీకః-
సుకృతే = మంగళకరమైన, శబ్దకల్పద్రుమ; ఈహా = చేష్టలుగల; మృగాః = జింక బొమ్మలతో; ఆకీర్ణమ్ = నిండినది; సుకీర్ణం = చక్కగా వ్యాప్తమైనది, కప్పబడినది, సర్వశబ్ద సంబోధిని; భక్తిభిః = భాగములతో, ఆంధ్ర వాచస్పతము, చెక్కడములతో; తథా = మఱియు; మనః = మనస్సును; చక్షుః చ = దృష్టిని; భూతానామ్ = జీవులయొక్క; ఆదదత్ = ఆకర్షించుచున్నది; తిగ్మతేజసా = మంచి కాంతితో.
భావంః-
చక్కని చెక్కడములతో నింపబడినది. మఱియు, అంతటా మంగళకరమైన చేష్టలు గల లేళ్ళు తిరుగాడుచున్నవి. అందరి హృదయములను, దృష్టిని ఆకర్షించుచున్నది.
2.15.37.
అనుష్టుప్.
చంద్రభాస్కరసంకాశమ్
కుబేరభవనోపమమ్।
మహేంద్రధామప్రతిమమ్
నానాపక్షిసమాకులమ్॥
టీకః-
చంద్ర = చంద్రునితో; భాస్కర = సూర్యునితో; సంకాశమ్ = సమానమైనది; కుబేర = కుబేరుని యొక్క; భవనః = భవనముతో; ఉపమమ్ = పోలినది; మహేంద్ర = మహేంద్రుని యొక్క; ధామ = భవనమును; ప్రతిమమ్ = పోలినది; నానా = అనేక రకముల; పక్షి = పక్షులతో; సమాకులమ్ = సమకూడినది
భావంః-
కుబేరుని భవనముతో సరిపోలునది. సూర్యచంద్రుల తేజస్సు వలె ప్రకాశము కలది. అనేక జాతులతో పక్షులతో నిండి యున్నది. ఇంద్ర భవనము వలె ఉన్నది.
2.15.38.
అనుష్టుప్.
మేరుశృంగసమం సూతో
రామవేశ్మ దదర్శ హ।
ఉపస్థితైః సమాకీర్ణమ్
జనైరంజలికారిభిః॥
టీకః-
మేరుశృంగ సమం = మేరుపర్వతశిఖరము వలె; సూతః = సారథి; రామ = రామునియొక్క; వేశ్మ = భవనము; దదర్శ హ = చూచెను; ఉపస్థితైః = వచ్చియున్న; సమాకీర్ణమ్ = రద్దీగా ఉన్నది; జనైః = ప్రజలచే; అంజలికారిభిః = నమస్కరించుచున్న.
భావంః-
సుమంత్రుడు మేరుపర్వత సమానమైన రాముని భవనమును దర్శించెను. ముకుళిత హస్తములతో నిరీక్షించుచున్న ప్రజలతో రద్దీగా ఉన్నది
2.15.39.
అనుష్టుప్.
ఉపాదాయ సమాక్రాంతైః
తథా జానపదైర్జనైః।
రామాభిషేకసుముఖైః
ఉన్ముఖైస్సమలంకృతమ్॥
టీకః-
ఉపాదాయ = కానుకలుతో; సమాక్రాంతైః = ఆక్రమించియున్న; తథా = మఱియు; జానపదైర్జనైః = పల్లెప్రజలతో; రామః = రాముని; అభిషేకః = పట్టాభిషేకమును గూర్చి; సుముఖైః = సుముఖముగా ఉన్నవారు; ఉన్ముఖైః = ఎదురుచూచుచున్నవారు; సమలంకృతమ్ = చక్కగా అలంకరింపబడినది.
భావంః-
రామాభిషేకమునకు సుముఖులై కానుకలు చేబూని ఎదురు చూచుచున్న జానపదజనులతో చాలా చక్కగా ఉన్నది.
2.15.40.
అనుష్టుప్.
మహామేఘసమప్రఖ్యమ్
ఉదగ్రం సువిభూషితమ్।
నానారత్నసమాకీర్ణమ్
కుబ్జకైరాతకావృతమ్॥
టీకః-
మహా = గొప్ప; మేఘ = మేఘముల వలె; సమప్రఖ్యమ్ = మిక్కిలి ప్రకాశము కలది; ఉదగ్రం = ఉన్నతమైనది; సువిభూషితమ్ = మంచిగా అలంకరింపబడియున్నది; నానా = అనేక రకములైన; రత్న = జాతి రత్నములచే; సమాకీర్ణమ్ = నిండియున్నది; కుబ్జ = మరుగుజ్జులతోను; కైరాతక = కిరాతకులతోను; ఆవృతమ్ = గుమిగూడియున్నది.
భావంః-
గొప్పమేఘము వలెనున్నది. అనేక రత్నములచే అలంకరింపబడి యున్నది. ఉన్నతమైన ఆ భవనము వద్ద మఱుగుజ్జువారు, కిరాతకులు గుమిగూడి ఉండిరి.
2.15.41.
జగతి.
స వాజియుక్తేన రథేన సారథిః
నరాకులం రాజకులం విరాజయన్।
వరూథినా రామగృహాభిపాతినా
పురస్య సర్వస్య మనాంసి హర్షయన్॥
టీకః-
సః = అతడు; వాజి = గుఱ్ఱములు; యుక్తేన = కూర్చబడిన; రథేన = రథములో; సారథిః = సారథి; నరాకులం = ప్రజలతో నిండియున్న; రాజకులం = రాజమందిరమును; విరాజయన్ = ప్రకాశింపజేయుచు; వరూథినా = పై కప్పు కలిగియున్న; రామ = రాముని; గృహ = భవనమును గూర్చి; అభిపాతినా = వెళ్ళుచున్నది; పురస్య = పురము యొక్క; సర్వస్య = అన్నిటి యొక్క; మనాంసి = మనస్సులను; హర్షయన్ = సంతోషింపజేయుచు.
భావంః-
సుమంత్రుడు గుఱ్ఱములు కూర్చబడి ఆచ్ఛాదన కల రథమునెక్కి పురజనులతో క్రిక్కిరిసి యున్న రాజమందిరమును ప్రకాశింపజేయుచు, పౌరులందరి మనసులను సంతోషింపజేయుచు రాముని భవనమునకు వెళ్ళెను.
2.15.42.
జగతి.
తతస్సమాసాద్య మహాధనం మహత్
ప్రహృష్టరోమా స బభూవ సారథిః।
మృగైర్మయూరైశ్చ సమాకులోల్బణం
గృహం వరార్హస్య శచీపతేరివ॥
టీకః-
తతః = తరువాత; సమాసాద్య = చేరి; మహా = మిక్కిలి; ధనం = ఐశ్వర్యవంతమైనది; మహత్ = గొప్ప; ప్రహృష్టరోమా = గగుర్పాటు గలవాడై; సః = అతడు; బభూవ = అయ్యెను; సారథిః = సారథి; మృగైః = అనేక జింకలతోను; మయూరైశ్చ = నెమళ్ళతోను; సమాకులోల్బణం = అందముగా అతిశయించినది; గృహం = భవనమును; వర = శ్రేష్ఠునియొక్క; అర్హస్య = పూజ్యునియొక్క; శచీపతేః = ఇంద్రుని యొక్క; ఇవ = వలె.
భావంః-
శ్రేష్ఠుడు పూజ్యుడు ఐన ఇంద్రుని భవనము వలె, మహదైశ్వర్య సంపన్నముగ నుండి, అనేక లేళ్ళు, నెమళ్ళతో అందముగా ఒప్పారియున్న రాముని భవనమును చూచి సుమంత్రుడు గగుర్పాటు పొందెను.
2.15.43.
జగతి.
స తత్ర కైలాసనిభాః స్వలంకృతాః
ప్రవిశ్య కక్ష్యాస్త్రిదశాలయోపమాః।
ప్రియాన్, వరాన్ రామమతే స్థితాన్, బహూన్
వ్యపోహ్య శుద్ధాంతముపస్థితో రథీ॥
టీకః-
సః = అతడు; తత్ర = అక్కడ; కైలాసనిభాః = కైలాసముతో సమానమైనవి; స్వలంకృతాః = బాగుగా అలంకరింపబడినవి; ప్రవిశ్య = ప్రవేశించి; కక్ష్యాః = గృహము లోపలి భాగములు, గదులు; త్రిదశాలయోపమాః = దేవతాగృహములతో సమానమైన; ప్రియాన్ = స్నేహితులను; వరాన్ = శ్రేష్ఠులైన; రామమతే = రాముని మనసునందు; స్థితాన్ = ఉన్న; బహూన్ = చాలమందిని; వ్యపోహ్య = దాటుకొని; శుద్ధాంతమ్ = అంతఃపురమును; ఉపస్థితః = చేరెను; రథీ = సారథి.
భావంః-
దేవతాగృహముల వలె అందముగా నున్న గదులు, కైలాసము వలె చక్కగా అలంకరింపబడిన దానిలో సారథి అప్పుడు ప్రవేశించెను. సారథి సుమంత్రుడు అక్కడ రాముని మిత్రులను అనేకులను దాటుకొని అంతఃపురమును చేరెను.
2.15.44.జగతి
స తత్ర శుశ్రావ చ హర్షయుక్తాః
రామాభిషేకార్థకృతా జనానామ్।
నరేంద్రసూనోరభిమంగలార్థాః
సర్వస్య లోకస్య గిరః ప్రహృష్టః॥
టీకః-
సః = అతడు; తత్ర = అక్కడ; శుశ్రావ = వినెను; హర్షయుక్తాః = ఆనందముతో కూడిన; రామాభిషేకార్థకృతాః = రాముని అభిషేకము కొరకై ఏర్పాటు చేయబడినవి; జనానామ్ = జనులయొక్క; నరేంద్రసూనః = రాకుమారునియొక్క; అభిమంగళార్థః = మంగళప్రదమైన ప్రయోజనము గల; సర్వస్య = సమస్తమైన; లోకస్య = లోకముయొక్క; గిరః = మాటలను; ప్రహృష్టః = ఆనందభరితమైన.
భావంః-
సుమంత్రుడు అక్కడ శ్రీరాముని పట్టాభిషేకమును గురించి, శ్రీరామునికి మంగళమును చేకూర్చు ఏర్పాట్ల గురించి జనులు హర్షాతిరేకముగ చెప్పుకొనెడి మాటలను వినెను.
2.15.45.జగతి
మహేంద్రసద్మప్రతిమం తు వేశ్మ
రామస్య రమ్యం మృగపక్షి జుష్టమ్।
దదర్శ మేరోరివ శృంగముచ్చం
విభ్రాజమానం ప్రభయా సుమంత్రః॥
టీకః-
మహేంద్రృ = మహేంద్రుని; సద్మ = గృహముతో; ప్రతిమం = సరపోలునది; తు = పాదపూరణము; వేశ్మ = గృహము; రామస్య = రాముని యొక్క; రమ్యం = అందమైనది; మృగ పక్షి జుష్టమ్ = పశుపక్షాదులతో నిండి యున్న; దదర్శ = చూచెను; మేరోః = మేరుపర్వతము యొక్క; ఇవ = వలె; శృంగమ్ = శిఖరము; ఉచ్చం = ఎత్తైన; విభ్రాజమానం = ప్రకాశించుచున్నది; ప్రభయా = కాంతితో; సుమంత్రః = సుమంత్రుడు.
భావంః-
సుమంత్రుడు ఇంద్రభవనము వంటిది, మేరుపర్వతశిఖరమంత గొప్పగా మెరయుచున్నది, మృగములు, పక్షులతో కూడినదియును ఐన రాముని భవనమును చూచెను.
2.15.46.త్రిష్టుప్
ఉపస్థితైరంజలికారకైశ్చ
సోపాయనైర్జానపదైర్జనైశ్చ।
కోట్యా పరార్థైశ్చ విముక్తయానైః
సమాకులం ద్వారపథం దదర్శ॥
టీకః-
ఉపస్థితైః = చేరువలో ఉన్నవారు; అంజలికారకైః = చేతులుజోడించి నమస్కరించువారు; చ = మఱియు; సోపాయనైః = కానుకలతో కూడినవారు; జానపదైః = పల్లెజనులతోను; జనైశ్చ = ప్రజలతోను; కోటాః = కోట్లకొలది; అపరార్థైః = బయటనుండివచ్చినవారు; [కోట్యాః = కోట్లసంఖ్యలోనూ; పరార్థైః = పరార్థసంఖ్యలోను;] చ = పాదపూరణము; విముక్త = విడిచిన; యానైః = వాహనములు కలవారు; సమాకులం = నిండియున్న; ద్వారపథం = ద్వారము వద్ద; దదర్శ = చూచెను.
భ
సుమంత్రుడు, అంజలి ఘటించి ఉన్నవారిని, కానుకలతో బయటనుండి వచ్చిన కోటిమంది [వచ్చిన చాలా ఎక్కువమందిని, (కోట్లు పరార్థాల కొలది)] వాహనములను విడిచి వచ్చినవారిని, పల్లెజనులను, పురప్రజలను చూచెను.
*గమనిక:-
కోట్యాపరార్థైః- కోట్లు పరార్థాల కొలది, కోటి- 1,00,00,000. పరార్థము- 10,000,00,00,000,00 0,00,00,000,00,00,000 (1028), అనగా పదివేల కోట్లకోట్లకోట్లకొలది. పరార్థము కొఱకు చూ, పోతన తెలుగు భాగవతము, వివరణలు, పారిభాషికపదములందు మన సంఖ్యామానము. https://telugubhagavatam.org/?Details&Branch=anuyuktaalu&Fruit=OurNumberSystem
2.15.47.
జగతి.
తతో మహామేఘమహీధరాభం
ప్రభిన్న మత్యంకుశమత్యసహ్యమ్।
రామౌపవాహ్యం రుచిరం దదర్శ
శత్రుంజయం నాగముదగ్రకాయమ్॥
టీకః-
తతః = తరువాత; మహా = పెద్ద; మేఘ = మేఘము; మహీధరః = పర్వతముతో; ఆభం = సమానమైన; ప్రభిన్నమ్ = మదజలము కారుచున్నది; అత్యంకుశమత్ = అంకుశమును లెక్క చేయనిది; అసహ్యమ్ = సహింపబడనిది; రామౌ = రాముడు; ఉపవాహ్యం = ఎక్కుటకు తగినది; రుచిరం = అందమైనది; దదర్శ = చూచెను; శత్రుంజయం = శత్రుంజయము అను పేరు గలిగిన; నాగమ్ = ఏనుగును; ఉదగ్ర = చాల ఎత్తైన; కాయమ్ = శరీరము కలది.
భావంః-
సుమంత్రుడు శత్రుంజయము అను పేరు గల గొప్ప మేఘమును, పర్వతమును పోలియున్న ఎత్తైన అందమైన ఏనుగును చూచెను. శ్రీరాముడు అధిరోహించుటకు తగినదైన ఉపవాహ్యము అగు ఆ ఏనుగు కన్నుల వెంట మదజలము కారుచు, అంకుశమును కూడ లెక్క చేయక నియంత్రించుటకు వీలుకానట్లుండెను.
గమనికః-
ఆంధ్రవాచస్పతము- గజజాతులు త్రివిధములు. (1) భద్రము- రాజులు ఎక్కెడి ఏనుగు, అందు రకములు (అ) ఉపవాహ్యము (ఆ) ఔపవాహ్యము (ఇ) పక్షము. తెలుగులో పట్టపుటేనుగు. (2) మందము- యుద్ధకాలమందు వాహన యోగ్యమైనది. అందు రకములు- సన్నహ్యము. (3) గోకర్ణము / మృగము అడవియందు తిరుగునవి. ఈ త్రివిధములకును మానబేధముచే ఆరాళము, అత్యారాళము, మధ్యము, కనిష్టము, వామనము అను నామములు కలవు. మఱియు పిష్టకము, వ్యాళము, పూతనము, మాతృకము, మాయకము, పంచమంగళము మున్నగు గజజాతి బేధములు అనేకములు కలవు. గజములను గూర్చి మృగచర్మీయము, రాజపుత్యము అను గ్రంథములు కలవు అందురు.
2.15.48.
జగతి.
స్వలంకృతాన్ సాశ్వరథాన్ సకుంజరాన్
అమాత్య ముఖ్యాంశ్చ దదర్శ వల్లభాన్।
వ్యపోహ్య సూతస్సహితాన్ సమంతతః
సమృద్ధమంతఃపురమావివేశ హ॥
టీకః-
స్వలంకృతాన్ = చక్కగా అలంకరించబడినవారు; స = సహితముగ; అశ్వ = గుఱ్ఱములు పూన్చిన; రథాన్ = రథములతో ఉన్నవారు; స = సహితముగా; కుంజరాన్ = ఏనుగులతో ఉన్నవారు; అమాఖ్య = అమాత్యులను; ముఖ్యాః = ముఖ్యమైనవారిని; చ = మఱియు; దదర్శ = చూచెను; వల్లభాన్ = రాజుకు ఇష్టులను; వ్యపోహ్య = తొలగించుకొని; సూతః = సారథి; సహితాన్ = గుమిగూడియున్న; సమంతతః = నలుదిక్కుల; సమృద్ధమ్ = సమృద్ధిగ; అంతఃపురమ్ = అంతఃపురమును; ఆవివేశ హ = ప్రవేశించెను.
భావంః-
సుమంత్రుడు చక్కగా అలంకరించుకొని గుఱ్ఱములు పూన్చిన రథములతోను, ఏనుగులతోను వచ్చిన ముఖ్యమైన అమాత్యులను రామునికి ఇష్టులను చూచి, వారందరిని దాటుకొని, వైభవోపేతమైన శ్రీరాముని అంతఃపురమును ప్రవేశించెను.
2.15.49.
జగతి.
తతోఽ ద్రికూటాచలమేఘసన్నిభం
మహావిమానోపమవేశ్మసంయుతమ్।
అవార్యమాణః ప్రవివేశ సారథిః
ప్రభూతరత్నం మకరో యథార్ణవమ్॥
టీకః-
తతః = తరువాత; త్రికూటాచల = త్రికూటపర్వతముతోను; మేఘ = మేఘములతోను; సన్నిభమ్ = సమానమైనది; మహా = గొప్ప; విమాన = విమానములతో; ఉనోపమ = పోలునవి; వేశ్మ = భవనములు; సంయుతమ్ = కూడి ఉన్నది; అవార్యమాణః = అడ్డులేనివాడు; ప్రవివేశ = ప్రవేశించెను; సారథిః = సారథి; ప్రభూతరత్నం = రత్నభరితమైన; మకరః = మొసలి; యథా = వలె; అర్ణవమ్ = సముద్రము.
భావంః-
విమానముల వంటి భవనములు గలది త్రికూటపర్వతము వలెను, మేఘము వలె ఎత్తైన రాముని భవనమును, అడ్డును లేని సుమంత్రుడు, మొసలి రత్నభరితమైన సముద్రములోనికి ప్రవేశించినట్లుగ ప్రవేశించెను.
2.15.50.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే పంచదశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; పంచదశ [15] = పదిహేనవ; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [15] పదిహేనవ సర్గ సంపూర్ణము.
2.16.1.
అనుష్టుప్.
స తదంతఃపురద్వారమ్
సమతీత్య జనాకులమ్।
ప్రవివిక్తాం తతః కక్ష్యామ్
ఆససాద పురాణవిత్॥
టీకః-
సః = అతడు; తత్ = ఆ; అంతఃపుర = అంతఃపురముయొక్క; ద్వారమ్ = గమ్మము; సమతీత్య = దాటి; జనాకులమ్ = జనముతో నిండిన; ప్రవివిక్తాం = జనసమ్మర్దములేని; తతః = తరువాత; కక్ష్యామ్ = గదిని; ఆససాద = పొందెను; పురాణవిత్ = పురాణవేత్త.
భావంః-
పురాణవేత్త ఐన సుమంత్రుడు జనులతో నిండియున్న అంతఃపుర ద్వారమును దాటి, జనులెవ్వరును లేని తరువాత గదిని చేరెను.
2.16.2.
అనుష్టుప్.
ప్రాసకార్ముకబిభ్రద్భిః
యువభిర్మృష్టకుణ్డలైః।
అప్రమాదిభిరేకాగ్రైః
స్వనురక్తైరధిష్ఠితామ్॥
టీకః-
ప్రాస = ఈటె, ఆంధ్రశబ్దరత్నాకరము; కార్ముకృ = ధనుస్సులను; బిభ్రద్భిః = ధరించిన వారు; యువభిః = యువకులచే; మృష్ట = శుభ్రమైన; కుణ్డలైః = కుండలములు ధరించినవారు; అప్రమాదిభిః = అప్రమత్తులై యున్నవారు; ఏకాగ్రైః = ఏకాగ్ర చిత్తము గలవారు; స్వనురక్తైః = స్వామిభక్తిపరాయణులు; అధిష్టితామ్ = అధిష్టింపబడిన.
భావంః-
అక్కడ స్వామిభక్తిపరాయణులైన యువకులు కొందరు, చక్కని కుండలములు ధరించినవారు, డాలు ధనుస్సులను ధరించి అప్రమత్తులై రక్షకులుగా నుండిరి.
2.16.3.
అనుష్టుప్.
తత్ర కాషాయిణో వృద్ధాన్
వేత్రపాణీన్ స్వలంకృతాన్।
దదర్శ విష్ఠితాన్ ద్వారి
స్త్ర్యధ్యక్షాన్సుసమాహితాన్॥
టీకః-
తత్ర = అక్కడ; కాషాయిణః = కాషాయవస్త్రములు ధరించినవారు; వృద్ధాన్ = పెద్దలు; వేత్రపాణీన్ = బెత్తములు పట్టుకొనియున్నవారు; స్వలంకృతాన్ = చక్కగా అలంకరించుకొనినవారిని; దదర్శ = చూచెను; విష్టితాన్ = నియమింపబడినవారు; ద్వారి = ద్వారమువద్ద; స్త్ర్యధ్యక్షాన్ = అంతఃపురాధ్యక్షులును; సుసమాహితాన్ = జాగరూకులై యున్నవారు.
భావంః-
సుమంత్రుడు అక్కడ కాషాయాంబరులను, చక్కగా అలంకరించుకొని, బెత్తములు పట్టుకొని, ద్వారము వద్ద నియమింపబడి జాగరూకతతో ఉన్న పెద్దవారిని, అంతఃపురాధ్యక్షులను చూచెను.
2.16.4.
అనుష్టుప్.
తే సమీక్ష్య సమాయాంతమ్
రామప్రియచికీర్షవః।
సహసోత్పతితాః సర్వే
స్వాసనేభ్యః ససంభ్రమాః॥
టీకః-
తే = వారు; సమీక్ష్య = చూచి; సమాయాంతమ్ = వచ్చుచున్న అతనిని; రామప్రియచికీర్షవః = రామునకు ప్రియమును కూర్చువారు; సహసా = వెంటనే; ఉత్పతితాః = లేచిరి; సర్వే = అందరు; ఆసనేభ్యః = ఆసనములనుండి; ససంభ్రమాః = త్వరపడుచు.
భావంః-
రామునకు ప్రియమును చేకూర్చువాడైన, సుమంత్రుడు వచ్చుట చూడగానే, వారందరు త్వరపడుచు వారి వారి ఆసనముల నుండి లేచి నిలబడిరి.
2.16.5.
అనుష్టుప్.
తానువాచ వినీతాత్మా
సూతపుత్రః ప్రదక్షిణః।
క్షిప్రమాఖ్యాత రామాయ
”సుమంత్రో ద్వారి తిష్ఠతి”॥
టీకః-
తాన్ = వారిని గూర్చి; ఉవాచ = పలికెను; వినీతాత్మ = వినయశీలుడైన; సూతపుత్రః = సుమంత్రుడు; ప్రదక్షిణః = చాల దాక్షిణ్యము గల; క్షిప్రం = వేగముగా; ఆఖ్యాత = చెప్పుము; రామాయ = రాముని గూర్చి; సుమంత్రః = సుమంత్రుడు; ద్వారి = ద్వారమునందు; తిష్ఠతి = ఉన్నాడు.
భావంః-
వినయశీలుడైన సుమంత్రుడు, "సుమంత్రుడు ద్వారమువద్ద వేచి యున్నాడు" అని వెంటనే వెళ్ళి రామునికి తెలియజేయుడు.
2.16.6.
అనుష్టుప్.
తే రామముపసంగమ్య
భర్తుః ప్రియచికీర్షవః।
సహభార్యాయ రామాయ
క్షిప్రమేవాభిచక్షిరే॥
టీకః-
తే = వారు; రామమ్ = రాముని; ఉపసంగమ్య = చేరి; భర్తుః = ప్రభువునకు; ప్రియచికీర్షవః = ప్రియమును చేకూర్చువారు; సహ = కూడా ఉన్న; భార్యాయ = భార్యకలవాడు; రామాయ = రాముని గురించి; క్షిప్రమేవ = వెంటనే; అభిచక్షిరే = చెప్పిరి.
భావంః-
ప్రభువునకు ప్రియమును చేయగోరువారు, భార్యాసమేతుడై యున్న రాముని వద్దకు వెళ్ళి అతనికి సుమంత్రుని రాకను గురించి తెలియజేసిరి.
2.16.7.
అనుష్టుప్.
ప్రతివేదితమాజ్ఞాయ
సూతమభ్యంతరం పితుః।
తత్రైవానాయయామాస
రాఘవప్రియకామ్యయా॥
టీకః-
ప్రతివేదితం = తెలియజేయబడినవాడై; ఆజ్ఞాయ = తెలుసుకొని; సూతమ్ = సారథి యొక్క; అభ్యంతరం = ఆంతరంగికుడు; పితుః = తండ్రికి; తత్రైవ = అక్కడికే; ఆనాయయామాస = రప్పింపజేసెను; రాఘవః = రాముడు; ప్రియకామ్యయా = ప్రియము చేకూర్చవలెనను కోరికతో.
భావంః-
రాముడు, తన తండ్రి యొక్క ఆంతరంగికుడైన సుమంత్రుని రాక తెలిసి, అతనికి ప్రియమును చేకూర్చుటకై, అతనిని తనవద్దకు పిలువనంపెను.
2.16.8.
అనుష్టుప్.
తం వైశ్రవణసంకాశమ్
ఉపవిష్టం స్వలంకృతమ్।
దదర్శ సూతః పర్యంకే
సౌవర్ణే సోత్తరచ్ఛదే॥
టీకః-
తం = ఆ; వైశ్రవణ = కుబేరునితో; సంకాశమ్ = సమానుడైన; ఉపవిష్టం = కూర్చునియున్న స్వలంకృతమ్ = చక్కగా అలంకరింపబడిన; దదర్శ = చూచెను; సూతః = సారథి; పర్యంకే = పానుపుపైన, మంచముపైన; సౌవర్ణే = బంగారపు; స = కలిగిన; సా = కలది; ఉత్తరచ్ఛదే = దుప్పటికలది.
భావంః-
కుబేరునితో సమానుడైన రాముడు చక్కాగ అలంకారములు చేసుకుని, దుప్పటి పరచి యున్న బంగారపు మంచము పైన కూర్చొని యుండెను. అంత సుమంత్రుడు రాముని చూచెను.
2.16.9.
అనుష్టుప్.
వరాహరుధిరాభేణ
శుచినా చ సుగన్ధినా।
అనులిప్తం పరార్థ్యేన
చంద్రనేన పరంతపమ్॥
టీకః-
వరాహ = పంది; రుధిరాభేణ = రక్తమువలె; శుచినా = శుభ్రమైన; సుగన్ధినా = సువాసనాభరితమైన; అనులిప్తం = పూయబడిన; పరార్థ్యేన = శ్రేష్ఠమైన; చంద్రనేన = గంధముతో; పరంతపమ్ = శత్రువులను తపింపచేయగలవానిని.
భావంః-
శత్రువులను దునుమాడగల రాముడు, ఎఱ్ఱని సువాసనాభరితమైన గంధమును పూసుకొని యుండెను.
2.16.10.
అనుష్టుప్.
స్థితయా పార్శ్వతశ్చాపి
వాలవ్యజనహస్తయా।
ఉపేతం సీతయాభూయః
చిత్రయా శశినం యథా॥
టీకః-
స్థితయా = నిలబడియున్న; పార్శ్వతః = ప్రక్కన; చ = పాదపూరణము; అపి = కూడ; వాలవ్యజన = వింజామర; హస్తయా = చేతిలో ధరించినామెతో; ఉపేతం = కూడియున్నవాడు; సీతయా = సీతతో; భూయః = మరల; చిత్రయా = చిత్తా నక్షత్రముతో; శశినం = చంద్రుడు; యథా = ఎట్లో.
భావంః-
వింజామరను పట్టుకొని, ప్రక్కనే నిలబడియున్న సీతతో కూడియున్న రాముడు, చిత్తానక్షత్రముతో కూడియున్న చంద్రుని వలె నుండెను.
2.16.11.
అనుష్టుప్.
తం తపంతమివాదిత్యమ్
ఉపపన్నం స్వతేజసా।
వవందే వరదం వందీ
వినయజ్ఞో వినీతవత్॥
టీకః-
తం = ఆ; తపంతమ్ = ప్రకాశించుచున్న; ఇవ = వలె; ఆదిత్యమ్ = సూర్యుని; ఉపపన్నం = కూడియున్న; స్వతేజసా = తన తేజస్సుతో; వవందే = నమస్కరించెను; వరదం = కోరికలు ఇచ్చువాడు; వందీ = స్తుతించువాడు; వినయజ్ఞః = వినయము తెలిసిన; వినీతవత్ = వినీతుడై.
భావంః-
వినయమునెరిగినవాడును, స్తుతించువాడును ఐన సుమంత్రుడు, సూర్యుని వలె స్వయంతేజస్సుతో ప్రకాశించుచు, కోర్కెలను తీర్చెడి రామునికి నమస్కరించెను.
2.16.12.
అనుష్టుప్.
ప్రాంజలిః సుముఖం దృష్ట్వా
విహారశయనాసనే।
రాజపుత్రమువాచేదమ్
సుమంత్రో రాజసత్కృతః॥
టీకః-
ప్రాంజలిః = కట్టబడిన దోసిలి కలవాడై; సుముఖం = అనుకూలు డగుట; దృష్ట్వా = చూచి; విహార = విహార సమయములకైన; శయనాసనే = పాన్పుపై ఉన్న; రాజపుత్రమ్ = రాజకుమారుని గూర్చి; ఉవాచ = పలికెను; ఇదమ్ = ఈ; సుమంత్రః = సుమంత్రుడు; రాజసత్కృతః = రాజుచే సత్కరింపబడిన.
భావంః-
విహార సమయాలలో విశ్రాంతి తీసుకునే శయ్యపై ఉన్న రామునికి నమస్కరించి, అనుకూలముగా ఉండుట గ్రహించెను, దశరథునిచే సత్కారములు పొందు సుమంత్రుడు, రాకుమారుడు రామునితో ఇట్లు పలికెను.
2.16.13.
అనుష్టుప్.
“కౌసల్యాసుప్రజా రామ!
పితా త్వాం ద్రష్టుమిచ్ఛతి।
మహిష్యా సహ కైకేయ్యా
గమ్యతాం తత్ర మా చిరమ్”॥
టీకః-
కౌసల్యాః = కౌసల్యయొక్క; సుప్రజాః = సుపుత్రుడవైన; రామ = రామా; పితా = తండ్రి; త్వాం = నిన్ను; ద్రష్టుమ్ = చూడవలెనని; ఇచ్ఛతి = కోరుచున్నాడు; మహిష్యా = మహారాణి ఐన; సహ = కూడి; కైకేయ్యా = కైకేయితో; గమ్యతాం = వెళ్ళెదవు గాక; తత్ర = అక్కడకు; మా = వద్దు; చిరమ్ = ఆలస్యం.
భావంః-
”కౌసల్యనందనా! రామా! మీ తండ్రిగారైన దశరథుడు మరియు రాణి కైకేయి, నిన్ను చూడవలెనని కోరుచున్నారు. ఆలస్యము చేయక అక్కడికి వెళ్ళెదవుగాక.”
2.16.14.
అనుష్టుప్.
ఏవముక్తస్తు సంహృష్టో
నరసింహో మహాద్యుతిః।
తతస్సమ్మానయామాస
సీతామిదమువాచ హ॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తస్తు = పలుకబడిన; సంహృష్టః = సంతోషించినవాడై; నరసింహః = మానవోత్తముడు; మహాద్యుతిః = గొప్ప తేజోవంతుడైన; తతః = తరువాత; సమ్మానయామాస = గౌరవించెను; సీతామ్ = సీతను గూర్చి; ఇదమ్ = ఈ; ఉవాచ హ = పలికెను.
భావంః-
గొప్ప తేజోవంతుడైన ఆ మానవోత్తముడు, రాముడు, సుమంత్రుని యొక్క మాటలు విని, సంతోషించి, అతనిని, గౌరవించి, సీతతో ఇట్లు పలికెను.
2.16.15.
అనుష్టుప్.
దేవి! దేవశ్చ దేవీ చ
సమాగమ్య మదంతరే।
మంత్రయేతే ధ్రువం కించిత్
అభిషేచన సంహితమ్॥
టీకః-
దేవి = దేవీ సీతా; దేవశ్చ = రాజు; దేవీ = మహారాణి; చ = కూడ; సమాగమ్య = కలసి; మత్ = నన్ను; అంతరే = గూర్చి; మంత్రయేతే = ఆలోచన చేయుచున్నారు; ధ్రువం = నిశ్చయము; కించిత్ = ఏదో విషయమై; అభిషేచన = అభిషేకమునకు; సంహితమ్ = సంబంధించిన.
భావంః-
సీతా! మహారాజు మరియు రాణియు కలసి, నా అభిషేక విషయమై నిశ్చయముగా ఏదో ఆలోచన చేయుచున్నారు.
2.16.16.
అనుష్టుప్.
లక్షయిత్వా హ్యభిప్రాయమ్
ప్రియకామా సుదక్షిణా।
సంచోదయతి రాజానమ్
మదర్థమసితేక్షణా!॥
టీకః-
లక్షయిత్వా = ఊహించి; అభిప్రాయమ్ = అభిప్రాయమును; ప్రియకామా = ప్రియమును కోరునది; సుదక్షిణా = మంచి కార్యదక్షత కలిగియున్న; సంచోదయతి = ప్రోత్సహించుచున్నది; రాజానమ్ = రాజును; మత్ = నా; అర్థమ్ = కొరకై; అసితేక్షణా = నల్లనికన్నులు కలదానా.
భావంః-
నల్లనికన్నులు గల ఓ సీతా! కార్యదక్షురాలైన కైకేయి, దశరథుని అభిప్రాయము నెరిగి, అతనికి ప్రియమును చేయగోరి, నా కొరకై అతనిని ప్రోత్సహించుచున్నది.
2.16.17.
అనుష్టుప్.
సా ప్రహృష్టా మహారాజమ్
హితకామానువర్తినీ।
జననీ చార్థకామా మే
కేకయాధిపతేస్సుతా॥
టీకః-
సా = ఆమె; ప్రహృష్టా = సంతోషించినదై; మహారాజమ్ = మహారాజును; హితకామా = హితమును కోరుచున్నదై; అనువర్తినీ = అనుసరించుచు; జననీ చ = తల్లి ఐన; అర్థకామా = ప్రయోజనమును ఆశించుచున్నది; మే = నా యొక్క; కేకయాధిపతేః = కేకయరాజు యొక్క; సుతా = కుమార్తె.
భావంః-
నా తల్లి కైకేయి దశరథుని మనసునెరిగి అట్లే ప్రవర్తించుచు, సంతోషముగా నాకు ప్రయోజనమును చేకూర్చగోరుచున్నది.
2.16.18.
అనుష్టుప్.
దిష్ట్యా ఖలు మహారాజో
మహిష్యా ప్రియయా సహ।
సుమంత్రం ప్రాహిణోద్దూతమ్
అర్థకామకరం మమ॥
టీకః-
దిష్ట్యా = అదృష్టవశమున; ఖలు = యదార్థముగ; మహారాజః = మహారాజు; మహిష్యా = మహారాణి; ప్రియయా = భార్యతో; సహ = కూడ; సుమంత్రం = సుమంత్రుని; ప్రాహిణోత్ = పంపెను; దూతమ్ = దూతను; అర్థకామకరం = అవసరాలు అభీష్టాలు చేకూర్చువాడు; మమ = నాకు.
భావంః-
మహారాజు మహారాణి ఇరువురు, మన అదృష్టముకొలది, నాకు అవసరములు అభీష్టములు చేకూర్చు సుమంత్రుని దూతగా పంపినారు.
2.16.19.
అనుష్టుప్.
యాదృశీ పరిషత్తత్ర
తాదృశో దూత ఆగతః।
ధ్రువమద్యైవ మాం రాజా
యౌవరాజ్యేఽ భిషేక్ష్యతి॥
టీకః-
యాదృశీ = ఎట్టి; పరిషత్ = సభ నిర్వాహకుడు; తత్ర = అక్కడ; తాదృశః = అట్టి; దూతః = దూత; ఆగతః = వచ్చెను; ధ్రువమ్ = నిశ్చయముగ; అద్య ఏవ = నేడే; మామ్ = నన్ను; రాజా = రాజు; యౌవరాజ్యే = యౌవరాజ్యమునందు; అభిషేక్ష్యతి = అభిషిక్తుని చేయగలడు.
భావంః-
సీతా! అక్కడ సభానిర్వాహకుడైన సుమంత్రుడు దూతగా వచ్చినాడు. నేడే రాజు నన్ను నిశ్చయముగ యౌవరాజ్యాభిషిక్తుని చేయును.
2.16.20.
అనుష్టుప్.
హంత! శీఘ్రమితో గత్వా
ద్రక్ష్యామి చ మహీపతిమ్।
సహ త్వం పరివారేణ
సుఖమాస్వ రమస్వ చ॥
టీకః-
హంత = ఆహా, హర్ష, సర్వశబ్దలంబోధిని; శీఘ్రమ్ = వెంటనే; ఇతః = ఇక్కడినుండి; గత్వా = వెళ్ళి; ద్రక్ష్యామి = చూచెదను; మహీపతిమ్ = రాజును; సహ = కూడి; త్వం = నీవు; పరివారేణ = పరివారముతో; సుఖమ్ = సుఖముగ; ఆస్వ = ఉండుము; రమస్వ = విహరించుచుండుము; చ = పాదపూరణము.
భావంః-
ఆహా! నేను వెంటనే వెళ్ళి రాజును చూచెదను. నీవు నీ పరివారముతో విహరించుచు సుఖముగ నుండుము.
2.16.21.
అనుష్టుప్.
పతిసమ్మానితా సీతా
భర్తారమసితేక్షణా।
ఆద్వారమనువవ్రాజ
మంగళాన్యభిదధ్యుషీ॥
టీకః-
పతి = భర్తచే; సమ్మానితా = గౌరవింపబడినది; సీతా = సీత; భర్తారమ్ = భర్తను; అసితేక్షణా = నల్లనికన్నులు కలిగియున్నామె; ఆ ద్వారమ్ = ద్వారము వరకు; అనువవ్రాజ = అనుసరించి వెళ్ళెను; మంగళాని = మంగళములను; అభిదధ్యుషీ = తలచుకొనుచు, అభిత్+అద్యుషీ.
భావంః-
భర్తగౌరవముపొందు, నల్లని కన్నులు కలిగిన సీత, మంగళములు జరుగునని ఇలా భావించుకొనుచు, ద్వారమువరకు వచ్చి రామునికి వీడ్కోలు పలికెను.
2.16.22.
అనుష్టుప్.
“రాజ్యం ద్విజాతిభిర్జుష్టమ్
రాజసూయాభిషేచనమ్।
కర్తుమర్హతి తే రాజా
వాసవస్యేవ లోకకృత్॥
టీకః-
రాజ్యం = రాజ్యమును; ద్విజాతిభిః = బ్రాహ్మణులచే; జుష్టమ్ = సేవించబడిన; రాజసూయాభిషేచనమ్ = రాజసూయాభిషేకమును; కర్తుమ్ = చేయుటకు; అర్హతి = అర్హత కలిగియున్నాను; తే = నీకు; రాజా = రాజు; వాసవస్య = ఇంద్రునకు; ఇవ = వలె; లోకకృత్ = సృష్టికర్త ఐన బ్రహ్మ.
భావంః-
”సృష్టికర్త ఐన బ్రహ్మ, దేవేంద్రునకు ఇచ్చినట్లు, దశరథమహారాజు, రాజసూయాభిషేకమునకు అర్హత కలిగించు బ్రాహ్మణులచే సేవింపబడు రాజ్యమును నీకు ఇచ్చును.
2.16.23.
అనుష్టుప్.
దీక్షితం వ్రతసమ్పన్నమ్
వరాజినధరం శుచిమ్।
కురంగశృంగపాణిం చ
పశ్యన్తీ త్వాం భజామ్యహమ్॥
టీకః-
దీక్షితం = దీక్ష తీసుకొనినవాడు; వ్రతసమ్పన్నమ్ = వ్రతమును పూనినవాడు; వర అజినం ధరం = శ్రేష్ఠమైన నల్లజింక చర్మం ధరించినవానిని; శుచిమ్ = శుచిగానున్నవాని; కురంగశృంగపాణిం చ = జింక కొమ్మును పట్టుకొన్నవానిని; పశ్యన్తీ = చూచుచు; త్వాం = నిన్ను; భజామ్యహమ్ = సేవించెదను.
భావంః-
నీవు వ్రతదీక్షాపరుడవై, కృష్ణాజినమును ధరించి, జింకకొమ్మును చేబూని యుండగా నేను చూచి సేవించెదను.
2.16.24.
అనుష్టుప్.
పూర్వాం దిశం వజ్రధరో
దక్షిణాం పాతు తే యమః।
వరుణః పశ్చిమామాశామ్
ధనేశస్తూత్తరాం దిశమ్”॥
టీకః-
పూర్వాం దిశం = తూర్పుదిశను; వజ్రధరో = వజ్రాయుధమును ధరించిన ఇంద్రుడు; దక్షిణాం = దక్షిణదిశను; పాతు = రక్షించును; తే = నీ యొక్క; యమః = యమధర్మరాజు; వరుణః = వరుణ దేవుడు; పశ్చిమామాశామ్ = పశ్చిమదిక్కును; ధనేశః = కుబేరుడు; ఉత్తరాం దిశమ్ = ఉత్తరదిక్కును.
భావంః-
ఇంద్రుడు నీయొక్క తూర్పుదిక్కును, యముడు దక్షిణ పార్శ్వమును, వరుణదేవుడు పశ్చిమమును, కుబేరుడు నీ ఉత్తరదిశను రక్షింతురు గాక.”
2.16.25.
అనుష్టుప్.
అథ సీతామనుజ్ఞాప్య
కృతకౌతుకమంగలః।
నిశ్చక్రామ సుమన్త్రేణ
సహ రామో నివేశనాత్॥
టీకః-
అథ = తరువాత; సీతామ్ = సీతను; అనుజ్ఞాప్య = అనుజ్ఞ నొసంగునట్లుగా చేసి; కృతకౌతుకమంగలః = ఉత్సవవేళ ధరించు మంగళప్రదమైన అలంకారములు; నిశ్చక్రామ = బయలుదేరెను; సుమన్త్రేణ = సుమంత్రునితో; సుమన్త్రేణ = సుమంత్రునితో; రామః = రాముడు; నివేశనాత్ = నివాసమునుండి.
భావంః-
ఉత్సవవేళ ధరించు మంగళప్రదమైన అలంకారములను ధరించిన రాముడు, సీత అనుజ్ఞను గైకొని, సుమంత్రునితో కలసి, తన భవనము నుండి బయలుదేరెను.
2.16.26.
అనుష్టుప్.
పర్వతాదివ నిష్క్రమ్య
సింహో గిరిగుహాశయః।
లక్ష్మణం ద్వారిసోఽ పశ్యత్
ప్రహ్వాంజలిపుటం స్థితమ్॥
టీకః-
పర్వతాత్ = పర్వతమునుండి; ఇవ = వలె; నిష్క్రమ్య = బయలుదేరి; సింహః = సింహము; గిరిగుహాశయః = పర్వతగుహలో నివసించు; లక్ష్మణం = లక్ష్మణుని; ద్వారి = ద్వారమునందు; సః = అతడు; అపశ్యత్ = చూచెను; ప్రహ్వ = వంగి; అంజలిపుటం = దోసిలొగ్గి, నమస్కరించుచున్న; స్థితమ్ = ఉన్న.
భావంః-
పర్వతగుహలో నివసించు సింహము ఆ గుహనుండి బయటకు వచ్చినట్లుగ, తన భవనమునుండి బయటకు వచ్చిన రాముడు, వంగి నమస్కరించుచున్న లక్ష్మణుని చూచెను.
2.16.27.
అనుష్టుప్.
అథ మధ్యమకక్ష్యాయామ్
సమాగచ్ఛత్సుహృజ్జనైః।
స సర్వానర్థినో దృష్ట్వా
సమేత్య ప్రతినంద్య చ॥
టీకః-
అథ = తరువాత; మధ్యమకక్ష్యాయామ్ = మధ్యన ఉన్న వాకిలియందు; సమాగచ్ఛత్ = కలిసెను; సుహృజ్జనైః = స్నేహితులను; సః = అతడు; సర్వాన్ = సకల; అర్ధినః = కలుసుకొనగోరి వచ్చియున్న; దృష్ట్వా = చూచి; సమేత్య = సమీపించి; ప్రతినంద్య చ = అభినందించి.
భావంః-
తరువాత, రాముడు, తనను కలుసుకొనగోరి మధ్య వాకిలి వద్దకు వచ్చియున్న మిత్రులను కలిసి, వారిని అభినందించెను.
2.16.28.
అనుష్టుప్.
తతః పావకసంకాశమ్
ఆరురోహ రథోత్తమమ్।
వైయాఘ్రం పురుషవ్యాఘ్రో
రాజితం రాజనందనః॥
టీకః-
తతః = తరువాత; పావక = అగ్ని; సంకాశమ్ = వంటి; ఆరురోహ = ఎక్కెను; రథోత్తమమ్ = ఉత్తమమైన రథమును; వైయాఘ్రం = పులిచర్మము కప్పబడిన; పురుషవ్యాఘ్రః = పురుషోత్తముడు; రాజితం = మెరయుచున్న; రాజనందనః = రాకుమారుడు.
భావంః-
తరువాత పురుషోత్తముడైన రాముడు, అగ్నితో సమానమై, పులిచర్మము కప్పబడియున్న, ప్రకాశవంతమైన రథమును అధిరోహించెను.
2.16.29.
అనుష్టుప్.
మేఘనాదమసమ్బాధమ్
మణిహేమవిభూషితమ్।
ముష్ణంతమివ చక్షూంషి
ప్రభయా సూర్యవర్చసమ్॥
టీకః-
మేఘనాదమ్ = మేఘమువంటి ధ్వని కలది; అసమ్బాధమ్ = ఇరుకుగా లేనిది; మణి హేమ విభూషితమ్ = మణులతోనూ; బంగారముతోను; అలంకరింపబడినది; ముష్ణంతమ్ = అపహరించునట్లు; ఇవ = వలె; చక్షూంషి = నేత్రములను; ప్రభయా = కాంతిచే; సూర్యవర్చసమ్ = సూర్యునివంటి కాంతి కలిగి యున్న.
భావంః-
ఆ రథముయొక్క ధ్వని మేఘగర్జనవలె నుండెను. విశాలమైన ఆ రథము మణులతోను, బంగారముతోను అలంకరింపబడి, చూచుటకు సూర్యుని కాంతివలె మెరయుచు వెలుగుతో కన్నులను దొంగిలించునటుల నుండెను.
2.16.30.
అనుష్టుప్.
కరేణుశిశుకల్పైశ్చ
యుక్తం పరమవాజిభిః।
హరియుక్తం సహస్రాక్షో
రథమింద్ర ఇవాశుగమ్।
ప్రయయౌ తూర్ణమాస్థాయ
రాఘవో జ్వలితశ్శ్రియా॥
టీకః-
కరేణు = ఏనుగు; శిశు = గున్న; కల్పైః = వలె నున్న; యుక్తం = కలసి; పరమవాజిభిః = శ్రేష్ఠమైన గుఱ్రములతో; హరియుక్తం = గుఱ్రములు పూన్చబడిన; సహస్రాక్షః = వేయి కన్నులు కలిగి యున్న; ఇంద్ర = ఇంద్రుని; ఇవ = వలె; ఆశుగమ్ = వేగముగా వెళ్ళునది; ప్రయయౌ = వెళ్ళెను; తూర్ణమ్ = శీఘ్రముగా; ఆస్థాయ = ఎక్కి; రాఘవః = రాముడు; జ్వలితః = ప్రకాశించుచున్న; శ్రియా = శోభతో.
భావంః-
తేజోవంతుడైన రాముడు, గున్న ఏనుగులవంటి శ్రేష్ఠమైన గుఱ్ఱములతో పూన్చబడిన ఆ రథమును, ఇంద్రునివలె అధిరోహించిన గుఱ్ఱములను పూన్చిన రథమువలె, వేగముగా బయలుదేరెను.
2.16.31.
అనుష్టుప్.
స పర్జన్య ఇవాకాశే
స్వనవానభినాదయన్।
నికేతాన్నిర్యయౌ శ్రీమాన్
మహాభ్రాదివ చంద్రమాః॥
టీకః-
సః = ఆ రథము; పర్జన్య = మేఘము; ఇవ = వలె; ఆకాశే = ఆకాశము నందు; స్వనవాన్ = ధ్వని గలిగి; అభినాదయన్ = ధ్వనింప జేయుచు; నికేతాత్ = గృహమునుండి; నిర్యయౌ = బయలుదేరెను; శ్రీమాన్ = శోభాయమానమైన; మహా = గొప్ప; అభ్రాత్ = మేఘమునుండి; ఇవ = వలె; చంద్రమాః = చంద్రుడు.
భావంః-
శోభాయమానమైన ఆ రథము, మేఘగర్జన వలె శబ్దము చేయుచు, ఒక గొప్ప మేఘమునుండి చంద్రుడు బయల్వెడలినట్లు, శ్రీరాముని భవనమునుండి బయలుదేరెను.
2.16.32.
అనుష్టుప్.
ఛత్రచామరపాణిస్తు
లక్ష్మణో రాఘవానుజః।
జుగోప భ్రాతరం భ్రాతా
రథమాస్థాయ పృష్ఠతః॥
టీకః-
ఛత్ర = ఛత్రము; చామర = చామరములను; పాణిస్తు = చేతియందు ధరించి; లక్ష్మణః = లక్ష్మణుడు; రాఘవానుజః = రాముని తమ్ముడైన; జుగోప = రక్షించెను; భ్రాతరం = సోదరుని; భ్రాతా = సోదరుడు; రథమ్ = రథమును; ఆస్థాయ = ఎక్కి; పృష్టతః = వెనుక.
భావంః-
లక్ష్మణుడు ఛత్రచామరములను చేబూని, రథమును అధిరోహించి, రాముని వెనుక నుండి గాచుచుండెను.
2.16.33.
అనుష్టుప్.
తతో హలహలాశబ్దః
తుములస్సమజాయత।
తస్య నిష్క్రమమాణస్య
జనౌఘస్య సమంతతః॥
టీకః-
తతః = తరువాత; హలహలాశబ్దః = కలకలధ్వని; తుములః = వ్యాప్తిచెంది; సమజాయత = పుట్టెను; తస్య = ఆ; నిష్క్రమమాణస్య = బయలుదేరుచున్న; జనౌఘస్య = జనసముదాయముయొక్క; సమంతతః = నలుదిక్కుల.
భావంః-
తరువాత, నాలుగుదిక్కులనుండి, జనసమూహము బయలుదేరుటతో, పెద్ద కలకలధ్వని జనించెను.
2.16.34.
అనుష్టుప్.
తతో హయవరా ముఖ్యా
నాగాశ్చ గిరిసన్నిభాః।
అనుజగ్ముస్తదా రామమ్
శతశోఽ థ సహస్రశః॥
టీకః-
తతః = తరువాత; హచయవరా = శ్రేష్ఠమైన గుఱ్ఱపురౌతులు; మూఖ్యాః = ముఖ్యమైన; నాగాః = ఏనుగునెక్కినవారు; చ = మఱియు; గిరి = పర్వతముతో; సన్నిభాః = సమానమైన; అనుజగ్ముః = అనుసరించి వెళ్ళిరి; తదా = అప్పుడు; రామమ్ = రాముని; శతశః = వందలకొలది; అథ = తరువాత; సహస్రశః = వేలకొలది.
భావంః-
తరువాత వందలకొలది, వేలకొలది, ముఖ్యమైన అశ్వారూఢులు, గజారూఢులు, రాముని రథం వెంట అనుసరించిరి.
2.16.35.
అనుష్టుప్.
అగ్రతశ్చాస్య సన్నద్ధాః
చందనాగరుభూషితాః।
ఖడ్గచాపధరాశ్శూరా
జగ్మురాశంసవో జనాః॥
టీకః-
అగ్రతః = ఎదుట; చ = పాదపూరణము; అస్య = అతని యొక్క; సన్నద్ధాః = భటులు; చందనః = చందనము; అగరు = అగరులచే; భూషితాః = అలంకరింపబడినవారు; ఖడ్గ = కత్తులను; చాప = ధనుస్సులను; ధరాః = ధరించినవారు; శూరాః = శూరులు; జగ్ముః = వెళ్ళిరి; ఆశంసవః = రాకను ప్రకటించువారు; జనాః = జనులు.
భావంః-
ధనుర్ఖడ్గములను కవచములను ధరించి, సుగంధములతో అలంకరింపబడిన శూరులైన రాజభటులు రామునికి ముందరగా నడచుచు, అతని ఆగమనమును ఉచ్ఛస్వరముతో ప్రకటించుచుండిరి.
2.16.36.
అనుష్టుప్.
తతో వాదిత్రశబ్దాశ్చ
స్తుతిశబ్దాశ్చ వందినామ్।
సింహనాదాశ్చ శూరాణామ్
తదా శుశ్రువిరే పథి॥
టీకః-
తతః = తరువాత; వాదిత్రృ = వాద్యపరికరముల; శబ్దాః = శబ్దములు; చ = మఱియు; స్తుతిః = స్తోత్రముల; శబ్దాః = శబ్దములు; చ = మఱియు; వందినామ్ = వందిమాగధుల; సింహనాదాశ్చ = సింహనాదములు; చ = మఱియు;శూరాణామ్ = శూరులయొక్క; తదా = అప్పుడు; శుశ్రువిరే = వినబడెను; పథి = మార్గమున.
భావంః-
ఆ మార్గమున వాద్యపరికరములతో చేయు నాదములు, వందిమాగధులు చేయు స్తోత్రఘోషలు, శూరులు చేయు సింహగర్జనలు వినబడినవి.
2.16.37.
అనుష్టుప్.
హర్మ్యవాతాయనస్థాభిః
భూషితాభిః సమంతతః।
కీర్యమాణః సుపుష్పౌఘైః
యయౌ స్త్రీభిరరిందమః॥
టీకః-
హర్మ్య = మేడపైనుండు; వాతాయనస్థాభిః = గవాక్షములందున్న; భూషితాభిః = అలంకరింపబడిన; సమంతతః = నలువైపులా; కీర్యమాణః = చల్లబడుచు; సుపుష్పౌఘైః = మంచి పూలగుత్తులచే; యయౌ = వెళ్ళెను; స్త్రీభిః = స్త్రీలచే; అరందమః = శత్రువులను దునుమాడువాడు.
భావంః-
శత్రువులను మట్టుపెట్టు రాముడు రాచమార్గమున వెళ్ళుచుండెను. నలుపక్కలా చక్కగా అలంకృతులైన స్త్రీలు మేడలపై గవాక్షములందు ఉండి, మంచి సుగంధభరితమైన పూలు జల్లుచుండిరి.
2.16.38.
అనుష్టుప్.
రామం సర్వానవద్యాంగోః
రామపిప్రీషయా తతః।
వచోభిరగ్య్రైర్హర్మ్యస్థాః
క్షితిస్థాశ్చ వవందిరే॥
టీకః-
రామం = రాముని; సర్వానవద్యాంగోః = అత్యంతసుందరాంగులు; సర్వ = సమస్తమైన; అనవతా = బాగా వికసించిన; అంగః = దేహములు కలవారు; రామపిప్రీషయా = రాముని సంతోషింపజేయవలెనను కోరికతో; తతః = తరువాత; వచోభిః = మాటలతో; అగ్ర్యైః = శ్రేష్ఠమైన; హర్మ్యస్థాః = మేడలపైనున్న; క్షితిస్థాశ్చ = భూమిపైనున్న; వవందిరే = నమస్కరించిరి.
భావంః-
మేడలపైనను, క్రిందను ఉన్న సుందరీమణులు, రామునికి ప్రియమైన మాటలు పలుకుచు నమస్కరించిరి.
గమనికః-
సర్వానవద్యాంగ- సర్వ (సమస్తమైన), అనవతా (బాగా వికసించి నట్టి), అంగః (దేహములు కలవారు), అత్యంతసుందరాంగులు.
2.16.39.
అనుష్టుప్.
నూనం నందతి తే మాతా
కౌసల్యామాతృనందన।
పశ్యన్తీ సిద్ధయాత్రం త్వామ్
పిత్ర్యం రాజ్యమవస్థితమ్॥
టీకః-
నూనం = తప్పక; నందతి = సంతోషించుచున్నది; తే = నీ; మాతా = తల్లి; కౌసల్యా = కౌసల్య; మాతృనందన = తల్లికి సంతోషము కలిగించువాడా; పశ్యన్తీ = చూచుచున్నదై; సిద్ధ = సఫలమైన; యాత్రం = యాత్ర కలవాడవైన; త్వామ్ = నిన్ను; పిత్ర్యం = తండ్రియొక్క; రాజ్యమ్ = రాజ్యమును; అవస్థితమ్ = పొందనున్న.
భావంః-
తల్లికి ఆనందమును కలిగించు ఓ రామా! యాత్ర సఫలమై, పిత్రార్జితమైన రాజ్యమును పొందనున్న నిన్ను చూచి కౌసల్య తప్పక ఆనందించును.
2.16.40.
అనుష్టుప్.
సర్వసీమంతినీభ్యశ్చ
సీతాం సీమంతినీ వరామ్।
అమన్యంత హి తా నార్యో
రామస్య హృదయప్రియామ్॥
టీకః-
సర్వ = అందరు; సీమంతినీభ్యః = వివాహిత స్త్రీలకంటె; చ = కూడ; సీతామ్ = సీతను; సీమంతినీ = వివాహిత స్త్రీగా; వరామ్ = ఉత్తమ; అమన్యంత = తలచిరి; హి = పాదపూరణము; తాః = ఆ; నార్యః = స్త్రీలు; రామస్య = రామునియొక్క; హృదయప్రియామ్ = హృదయమునకు ప్రియమైనామె.
భావంః-
రాముని మనోహారిణి ఐన సీత, వివాహితలందరి యందును ఉత్తమమైన దని ఆ స్త్రీలు భావించిరి.
2.16.41.
అనుష్టుప్.
తయా సుచరితం దేవ్యా
పురా నూనం మహత్తపః।
రోహిణీవ శశాంకేన
రామసంయోగమాప యా॥
టీకః-
తయా = అటువంటి; సుచరితం = బాగుగా ఆచరింపబడెను; దేవ్యా = సీతాదేవిచే; పురా = పూర్వము; నూనం = తప్పక; మహ = గొప్ప; త్తపః = తపస్సు; రోహిణీ = రోహిణి; ఇవ = వలె; శశాంకేన = చంద్రునితో; రామ = రామునితో; సంయోగమ్ = సంబంధము; ఆప = పొందెనో; యా = ఏ సీతాదేవి.
భావంః-
రోహిణి చంద్రుని పొందినట్లుగ, పుణ్యచరిత ఐన సీత రాముని భర్తగా పొందుటకు తప్పక పూర్వము చాల గొప్ప తపము నాచరించియుండును.
2.16.42.
అనుష్టుప్.
ఇతి ప్రాసాదశృంగేషు
ప్రమదాభిః నరోత్తమః।
శుశ్రావ రాజమార్గస్థః
ప్రియావాచ ఉదాహృతాః॥
టీకః-
ఇతి = అని; ప్రాసాదశృంగేషు = భవనముల, మేడల; శృంగేషు = పైభాగమున (పై అంతస్తున) ఉన్న; ప్రమదాభిః = స్త్రీలచే; నరోత్తమః = మానవోత్తముడైన; శుశ్రావ = వినెను; రాజమార్గస్థః = రాజమార్గమునందున్న; ప్రియా = ప్రియ మైన; వాచః = మాటలను; ఉదాహృతాః = పలుకబడిన.
భావంః-
ఇలా, మేడలపైనున్న స్త్రీలు, పలుకుతున్న ప్రియమైన మాటలను, రాజమార్గము గుండా పోవుచున్న రాముడు వినెను.
2.16.43.త్రిష్టుప్
స రాఘవస్తత్ర కథాప్రపంచాన్
శుశ్రావ లోకస్య సమాగతస్య।
ఆత్మాధికారా వివిధాశ్చ వాచః
ప్రహృష్టరూపస్య పురోజనస్య॥
టీకః-
సః = ఆ; రాఘవః = రాముడు; తత్ర = అక్కడ; కథాప్రపంచాన్ = స్తుతివాక్యములను; శుశ్రావ = వినెను; లోకస్య = లోకముయొక్క; సమాగతస్య = గుమికూడిన; ఆత్మ = తనయొక్క; అధికారాః = ప్రకృయలను; వివిధాశ్చ = అనేకములైన; వాచః = మాటలను; ప్రహృష్టృ = చాల సంతోషించిన; రూపస్య = విధముగ; పురోజనస్య = పురజనులయొక్క.
భావంః-
అప్పుడు రాముడు, అక్కడ చేరియున్న పురజనులు, తనను గురించి అనేక స్తుతివాక్యములను, తనకు జరుగు పట్టాభిషేకప్రక్రియలను గురించి సంతోషముగ పలుకుటను వినెను.
2.16.44.త్రిష్టుప్
ఏష శ్రియం గచ్ఛతి రాఘవోఽ ద్య
రాజప్రసాదాద్విపులాం గమిష్యన్।
ఏతే వయం సర్వసమృద్ధకామా
యేషామయం నో భవితా ప్రశాస్తా॥
టీకః-
ఏషః = ఈ; శ్రియం = ఐశ్వర్యమును; గచ్ఛతి = పొందనున్నాడు; రాఘవః = రాముడు; అద్య = ఇపుడు; రాజ = దశరథుని; ప్రసాదాత్ = అనుగ్రహమ వలన; విపులాం = భూమిని; గమిష్యన్ = పొందనున్న; ఏతే = అటువంటి; వయం = మనము; సర్వ = అన్ని; సమృద్ధ= సమృద్ధిగా తీరిన; కామాః = కోరికలు కలవారము; ఏషామ్ = ఏ; అయం = ఇతడు; నః = మనకు; భవితా = కానున్నాడో; ప్రశాస్తా = రాజుగా.
భావంః-
ఈ రాముడు, ఇపుడు, దశరథుని అనుగ్రహవశమున భూమినీ, రాజ్యమును పొందనున్నాడు. ఇటువంటి రాముడు మనకు రాజు కానున్నాడు, కావున మన కోరికలన్నియు తీరనున్నవి. భవిష్యత్తులో గొప్ప రాజు కాగలడు.
2.16.45.త్రిష్టుప్
లాభో జనస్యాస్య యదేష సర్వం
ప్రపత్స్యతే రాష్ట్రమిదం చిరాయ।
న హ్యప్రియం కించన జాతు కశ్చి-
త్పశ్యేన్న దుఃఖం మనుజాధిపేఽ స్మిన్॥
టీకః-
లాభః = లాభము; జనస్య = ప్రజలయొక్క; అస్య = ఈ; యత్ = ఎందువలన; ఏషః = ఈతడు; సర్వం = సమస్తము; ప్రపత్స్యతే = పొందనున్నాడో; రాష్ట్రమ్ = రాష్ట్రమును; ఇదం = ఈ; చిరాయ = చాలకాలము; నహి = చూడరు; అప్రియం = అప్రియమైన; కించన = కొంచమైనను; జాతు = కలుగుట; కశ్చిత్ = ఎవ్వరును; న = జరుగదు; పశ్యేత్ = చూచుట; హి = నిశ్చయార్థకము; దుఃఖం = దుఃఖమును; మనుజాధిపే = రాజు; అస్మిన్ = ఈతడు.
భావంః-
ఈ రాముడు ఈ దేశమును చాలకాలము పరిపాలించుట ప్రజలకు లాభదాయకము. ఈతడు రాజైనచో ఎవ్వరును ఎప్పటికిని అప్రియమును గాని, దుఃఖమును గాని చూడరు.
2.16.46.
జగతి.
స ఘోషవద్భిశ్చ మతంగాజైర్హయైః
పురస్సరై స్స్వస్తికసూతమాగధైః।
మహీయమానః ప్రవరైశ్చ వాదకై-
రభిష్టుతో వైశ్రవణో యథా యయౌ॥
టీకః-
సః = ఆతడు; ఘోషవద్భిః = ఏనుగు ఘీంకార, గుఱ్ఱపు సకిలింత ధ్వనులు కలిగియున్న; చ = మఱియు; మతంగాజైః = మదపుటేనుగులతో; హయైః = గుఱ్ఱములతో; పురస్సరైః = ముందువైపు నడచుచున్న; స్వస్తిక = శుభకరమైన వాక్యములను పలుకు; సూతః = సూతులు, పురాణాది శుభ వాక్యములు చెప్పువారు; మాగధైః = మాగధులు, వంశ ప్రవరలను ఉటంకిచుతూ స్తుతించువారు; మహీయమానః = గొప్పగా గౌరవింపబడు; ప్రవరైః = శ్రేష్ఠములైన; చ = పాదపూరణము; వాదకైః = చెప్పెడివారిచే; అభీష్టుతః = మిక్కిలి స్తుతింపబడుచు; వైశ్రవణః = కుబేరుడు; యథా = వలె; యయౌ = వెళ్ళెను.
భావంః-
బేరుని వలె శ్రీరాముడు బయల్వెడలుచుండగా, రథమునకు ముందర గట్టిగా ఘీంకరిస్తున్న మదపుటేనుగులు, సకిలించుచున్న గుఱ్ఱములు నడచుచున్నవి. శుభప్రదమగ స్వస్తివాక్యములను పలుకుచున్నారు. సూతులు, వంశ ప్రవరలను కీర్తించు మాగధులు పొగుడుచున్నారు. వాయిద్యములు మ్రోగుచుండెను.
2.16.47.
జగతి.
కరేణుమాతంగరథాశ్వసంకులం
మహాజనౌఘ ప్రతిపూర్ణచత్వరమ్।
ప్రభూతరత్నం బహుపణ్యసంచయం
దదర్శ రామో రుచిరం మహాపథమ్॥
టీకః-
కరేణృ = ఆడ ఏనుగులయొక్క; మాతంగ = మగ ఏనుగులయొక్క; రథ = రథముులుయొక్క; అశ్వ = అశ్వములయొక్క; సంకులం = కిక్కిరిసిన గుంపులతో; మహా = గొప్ప; జనాః = జనుల; ఓఘ = సందోహముతో; ప్రతిపూర్ణ = నిండిపోయియున్న; చత్వరమ్ = నాలుగురోడ్ల కూడలిని; ప్రభూత = శ్రేష్ఠమైన; రత్నం = రత్నములు కలిగియున్న; బహు = అనేక; పణ్యః = అంగళ్ళ, దుకాణముల; సంచయం = సమూహమును; దదర్శ = చూచెను; రామః = రాముడు; రుచిరం = మనోహరమైన; మహాపథమ్ = రాచబాటయందు.
భావంః-
ఆ రాజమార్గములో కూడలిలో ఏనుగులు, గుఱ్ఱములు, రథములతో క్రిక్కిరిసి యుండెను. జనసందోహముతో నిండియుండెను. శ్రేష్ఠమైన రత్నములను విక్రయించు అనేక అంగడి వీధులు ఉన్నవి. వాటన్నింటిని వీక్షించుచు శ్రీరాముడు రాజాస్థానానికి సాగుచుండెను
2.16.48.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే షోడశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; పంచదశః [16] = పదహారు; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [16] పదిహారవ సర్గ సంపూర్ణము.
2.17.1.
అనుష్టుప్.
స రామో రథమాస్థాయ
సంప్రహృష్టసుహృజ్జనః।
పతాకాధ్వజసమ్పన్నమ్
మహార్హాగరుధూపితమ్॥
టీకః-
సః = ఆః రామః = రాముడు; రథమ్ = రథమును; ఆస్థాయ = అధిరోహించి; సంప్రహృష్ట = మిక్కిలి సంతోషించిన; సుహృజ్జనః = మంచి స్నేహితులనులు; పతాక = జెండాలతో; ధ్వజ = ధ్వజములతో; సమ్పన్నమ్ = సుసంపన్నమైన; మహార్హ = గొప్పదైన; అగరు ధూపితమ్ = సుగంధముతో కూడిన
భావంః-
సంతోషించుచున్న మిత్రులతో కూడిన శ్రీమంతుడైన రాముడు రథమును అధిరోహించి, పతాకములతోను, ధ్వజములతోను, అలంకరింపబడినదియును, ఉత్తమమైన అగరుచే ధూపము వేయబడినదియును.
2.17.2.
అనుష్టుప్.
అపశ్యన్నగరం శ్రీమాన్
నానాజనసమాకులమ్।
స గృహైరభ్రసంకాశైః
పాండురైరుపశోభితమ్॥
టీకః-
అపశ్యత్ = చూచెను; నగరమ్ = మహానగరమును; శ్రీమాన్ = శ్రీమంతుడు; నానాజన = చాలామంది ప్రజలతో; సమాకులమ్ = నిండినది; సః = అతడు; గృహైః = గృహములతో; అభ్ర = మేఘము; సంకాశైః = మేఘము వలె; పాండురైః = తెల్లనిరంగులో ఉన్న; ఉపశోభితమ్ = ప్రకాశించుచున్న
భావంః-
చాలామంది జనులతో నిండిన నగరమును చూచుచు, అగరుధూపితమైన రాజమార్గము మధ్యనుండి ప్రయాణము చేసెను. ఆ రాజమార్గము మేఘము వలె ఉన్నతమైన తెల్లని భవనములతో ప్రకాశించుచుండెను.
2.17.3.
అనుష్టుప్.
రాజమార్గం యయౌ రామో
మధ్యేనాగరుధూపితమ్।
చందనానాం చ ముఖ్యానామ్
అగరూణాం చ సంచయైః॥
టీకః-
రాజమార్గం = రాజమార్గమునకు; యయౌ = వెళ్లెను; రామః = రాముడు; మధ్యేన = మధ్యగా; అగరుధూపితమ్ = అగరుపొగలతో; చందనానామ్ = చందనము మరియు; చ = మఱియు; ముఖ్యానామ్ = ముఖ్యమైన; అగరూణాం = అగరులయొక్క; చ = మఱియు; సంచౖయెః = సంచయముతో
భావంః-
రాముడు చందనములు, శ్రేష్ఠమైన అగురు, ఉత్తమసుగంధ ద్రవ్యముల రాశుల మధ్యగా రాజమార్గములో వెళ్లెను.
2.17.4.
అనుష్టుప్.
ఉత్తమానాం చ గంథానామ్
క్షౌమకోశామ్బరస్య చ।
అవిద్ధాభిశ్చ ముక్తాభిః
ఉత్తమైస్స్ఫాటికైరపి॥
టీకః-
ఉత్తమానామ్ = ఉత్తమమైనవియును; చ = మఱియు; గంథానామ్ = సువాసనలు వెదజల్లే గంధము; క్షౌమకోశ = పట్టు మరియు నేత; అమ్బరస్య చ = వస్త్రములు = మఱియు; ఆవిద్దాభిశ్చ = రంధ్రము చేయని మరియు; ముక్తాభిః = ముత్యములు; ఉత్తమైః = ఉత్తమమైనవి; స్ఫాటికైః = స్ఫటిక నిర్మితములైనవి; అపి = ఇంకను
భావంః-
శ్రేష్ఠమైన సువాసనలు వెదజల్లే గంధము, తెల్లని నేతవస్త్రములు, పట్టు వస్త్రములు, రంధ్రము చేయని ఉత్తమమైన ముత్యములు, స్ఫటికనిర్మిత వస్తువులు,
2.17.5.
అనుష్టుప్.
శోభమానమసంబాధైః
తం రాజపథముత్తమమ్।
సంవృతం వివిధైఃపుష్పైః
భక్ష్యైరుచ్చావచైరపి॥
టీకః-
శోభమానమ్ = శోభాయమానంగా; అసంబాధైః = ఇరుకుకానటువంటి; తం = అటువంటి; రాజపథమ్ = రాజమార్గమును; ఉత్తమమ్ = శ్రేష్ఠమైన; సంవృతం = కూడిఉన్న; వివిధైః = రకరకముల; పుషైః = పువ్వులతోను; భక్షితః = భుజింపదగిన పదార్థములతో; ఉచ్చావచైః = వివిధ రకములైన; అపి = మరియు
భావంః-
అనేకవిధముల పుష్పములు, భక్ష్యములు మొదలగువాటితో ప్రకాశించుచున్నది, విశాలమైన ఆ ప్రథాన రాజమార్గమును ప్రవేశించెను.
2.17.6.
అనుష్టుప్.
దదర్శ తం రాజపథమ్
దివి దేవపథం యథా।
దధ్యక్షతహవిర్లాజైః
ధూపైరగరుచందనైః।
నానామాల్యోపగంధైశ్చ
నానామాల్యోపగంధైశ్చ
టీకః-
దదర్శ = చూచి (రాముని); తం = ఆ రాజ; రాజపథమ్ = రాజ మార్గమును; దివి = స్వర్గములో; దేవపథమ్ = దేవమార్గము; యథా = వలె; దధి = పెరుగుతోను; అక్షత = అక్షతలతోను; హవిః = హవిస్సులతోను; లాజైః = లాజలతోను; ధూపైః = ధూపముతోను; అగరు = అగరు; చందనైః = చందనముతోను; నానా = రకరకములైన; మాల్య = మాలలు; ఉపగంధైః = పరిమళ ద్రవ్యాలతో; చ = మఱియు; సదా = నిరంతరం; అభ్యర్చిత = అలంకరింపబడిన; చత్వరమ్ = ముంగిళ్ళు గలదానిని.
భావంః-
రాముడు చూచిన ఆ రాజమార్గము స్వర్గమునందు దేవమార్గము వలె ఉండెను. అక్కడనున్న ముంగిళ్ళు అన్నియు పెరుగు, అక్షతలు, హవిస్సు, పేలాలు, ధూపములు, అగురు, చందనము, అనేక విధములగు మాల్యములు సుగంధ ద్రవ్యములతో సర్వదా అలంకరింపబడుచుండెను.
2.17.7.
అనుష్టుప్.
అశీర్వాదాన్ బహూన్ శృణ్వన్
సుహృద్భిః సముదీరితాన్।
యథార్హం చాపి సంపూజ్య
సర్వానేవ నరాన్ యయౌ॥
టీకః-
ఆశీర్వాదాన్ = ఆశీర్వాదములను; బహూన్ = రకరకముల; శృణ్వన్ = వినుచు; సుహృద్భిః = స్నేహితులచేత; సముదీరితాన్ = పలుకబడిన; యథార్హం చ = అర్హతను అనుసరించి; చ = మఱియు; అపి = కూడా; సంపూజ్య = సత్కరించి; సర్వాన్ = అందరు; ఏవ = నిశ్చయార్థకము; నరాన్ = జనులను; యయౌ = వెళ్లెను
భావంః-
రాముడు శ్రేయోభిలాషులు పలుకుచున్న ఆశీర్వాద వాక్యములు అన్నీ వినుచు, అక్కడనున్న వారలందరిని తగు విధముగా గౌరవించుచు వెళ్లెను.
2.17.8.
అనుష్టుప్.
“పితామహైరాచరితమ్
తథైవ ప్రపితామహైః।
అద్యోపాదాయ తం మార్గమ్
అభిషిక్తోఽనుపాలయ”॥
టీకః-
పితామహైః = తాతగారిచేత; ఆచరితమ్ = ఆచరించబడిన; తౖథైవ = అదేవిధముగా; ప్రపితామహైః = ప్రపితామహులచేత; అద్య = నేడు; ఉపాదాయ = తీసుకుని; తం మార్గమ్ = ఆ మార్గమును; అభిషిక్తః = పట్టాభిషేక్తుడవై; అనుపాలయా = పాలింపుము.
భావంః-
”ఓ రామా! నేడు రాజ్యాభిషిక్తుడవై నీ తాతలును, ముత్తాతలును అనుసరించిన మార్గమును అనుసరించుచు రాజ్యమును పాలింతువు గాక.”
2.17.9.
అనుష్టుప్.
యథాస్మ పోషితాః పిత్రా
యథా సర్వైః పితామహైః।
తతస్సుఖతరం రామే
వత్స్యామస్సతి రాజని॥
టీకః-
యథా = ఏ విధముగా; స్మ = మేము; పోషితాః = పరిపాలించబడితిమో; పిత్రా = తండ్రిచేత; యథా = ఆ విధముగా; సర్వైః = మొత్తము; పితామహైః = తాతలచేతను; తతః = అంత కంటె; సుఖతరం = ఎక్కువ సుఖముగా; రామే = రామునియందు; వత్సాయమః = వత్సములుగా నుండుట; సతి = దానం, శబ్దకల్పదృమం; రాజని = రాజు
భావంః-
రాముడు రాజైనచో అతని తండ్రి పరిపాలించినప్పటి కంటెను అతని తాతలు పాలించినప్పటి కంటెను, ఎక్కువ సుఖముగా ఉండగలము. రాముని పాలనలో ఆయన వత్సములగ నుండు బహుమానం పొందెదము.
గమనికః-
సుఖం- సుఖతరం- సుఖతమం
2.17.10.
అనుష్టుప్.
అలమద్య హి భుక్తేన
పరమార్థైరలం చ నః।
యది పశ్యామ నిర్యాన్తమ్
రామం రాజ్యే ప్రతిష్ఠితమ్॥
టీకః-
అలం = సరిపోవును; అద్య = నేడు; హి = నిశ్చయార్థకము; భుక్తేన = భోజనముతో; పరమార్థః =ఇతర పరమప్రయోజనము గల విషయములతో; అలం = చాలును; చ= పాదపూరణము; నః = మనము; యది = ఒకవేళ; పశ్యామ = చూడగలిగినచో; నిర్యాన్తమ్ = నగరములో ప్రవేశించిన; రామమ్ = రాముని; రాజ్యే = రాజ్యమునందు; ప్రతిష్ఠితమ్ = ప్రతిష్ఠించబడినవాడై
భావంః-
మనము నేడు రాజ్యాభిషిక్తుడై ఊరేగుచున్న రాముని చూడగలిగినచో మనకు భోజనముతో గాని ఇతర కార్యక్రమముతో గాని పని లేదు.
2.17.11.
అనుష్టుప్.
అతో హి నః ప్రియతరమ్
నాన్యత్కించిద్భవిష్యతి।
యథాఽభిషేకో రామస్య
రాజ్యేనామితతేజసః॥
టీకః-
అతోహి = అంత కంటె; నః = మనకు; ప్రియతరమ్ = అత్యంత ప్రీతికరమైనది; న = కాదు; అన్యత్ = ఇతరము; కించిత్ = ఏదియు; భవిష్యతి = జరుగబోవునది; యథా = అదే విధముగా; అభిషేకః = పట్టాభిషేకము; రామస్య = రాముని యొక్క; రాజ్యేన = రాజ్యమునందు; అమిత తేజసః = సాటిలేని తేజస్సు కలిగిన
భావంః-
మనకు మహా తేజశ్శాలిౖయెన రామునియొక్క రాజ్యాభిషేకమునకు మించిన ప్రియమైనది ఏదియు ఉండదు.
గమనికః-
ప్రియం- ప్రియతరం- ప్రియతమం
2.17.12.
అనుష్టుప్.
ఏతాశ్చాన్యాశ్చ సుహృదామ్
ఉదాసీనః కథాశ్శుభాః।
ఆత్మసంపూజనీః శృణ్వన్
యయౌ రామో మహాపథమ్॥
టీకః-
ఏతాః = ఈ; చ = మరియు; అన్యః = ఇతరములు; చ = మరియు; సుహృదామ్ = స్నేహితుల; ఉదాసీనః = నిరాసక్తుడై; కథాః = చెప్పుట, వావిళ్ళ నిఘంటువు; శుభాః = శుభములైన; ఆత్మ = తనను; సంపూజనీః = ప్రశంసించుచున్న; శృణ్వన్ = వినినవాడై; యయౌ = పొందెను; రామః = రాముడు; మహాపథమ్ = రాజవీధిని
భావంః-
రాముడు తన మిత్రులు తనను ప్రశంసించుచు పలుకుచున్న ఆ చక్కని మాటలు విన్నను సంతోషమును ప్రకటింపక రాజమార్గమునందు వెళ్లెను.
2.17.13.
అనుష్టుప్.
న హి తస్మాన్మనః కశ్చిత్
చక్షుషీ వా నరోత్తమాత్।
నర శ్శక్నోత్యపాక్రష్టుమ్
అతిక్రాన్తేఽపి రాఘవే॥
టీకః-
న = కాలేదు; హి = కూడా; తస్మాత్ = అతని యొక్క; మనః = మనస్సును; కశ్చిత్ = ఎటువంటి; చక్షుసీ = కనులను; వా = కానీ; నరోత్తమాత్ = మానవులలో శ్రేష్ఠుడైన వానినుండి; నరః = మానవుడు; శక్నోతి = సాధ్యము; అపాక్రష్టుమ్ = వెనుకకు మరలించుటకు; అతిక్రాన్తే అపి = దూరముగా వెళ్లుచున్నప్పటికీ; రాఘవే = రాముడు
భావంః-
దూరమైపోయినను ఏ ఒక్కడును, తన మనస్సును, దృష్టిని, ఆ నరశ్రేష్ఠుని నుండి వెనుకకు మరలింపలేకపోయెను.
2.17.14.
అనుష్టుప్.
* యశ్చ రామం న పశ్యేత్తు
యం చ రామో న పశ్యతి।
నిందితః సర్వలోకేషు
స్వాత్మాఽప్యేనం విగర్హతే॥
టీకః-
యః = ఎవడు; చ = మఱియు; రామం = రాముని; న పశ్యేత్తు = చూడడో; యం = ఎవనిని; చ = మఱియు; రామః = రాముడు; న పశ్యతి = చూడడో; నిందితః = నిందింపబడును; సర్వ = సమస్తమైన; లోకేషు = జనులందు; స్వ = అతని; ఆత్మా = మనసు; అపి = కూడా; ఏనమ్ = వీనిని; విగర్హతే = నిందించును.
భావంః-
రాముని చూడనివానిని, రామునిచే చూడబడనివానిని, లోకులందరును నిందింతురు. అట్టివాడు తనను తానే నిందించుకొనును.
గమనికః-
ఇక్కడ రాముని భగవంతునిగా నిరూపింపబడెను. పోతన తెలుగు భాగవతము 7-167-మ.॥ తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా। ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం। బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స। జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!॥ సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం అని నవవిధభక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలు. వీటన్నింటిలోనూ అంతస్సూత్రముగా నిరంతరము భగవంతుని ధ్యానించువాడు తప్పక భగవదనుగ్రమమునకు తద్వారా ముక్తికి పాత్రు డగును. అట్లుకాక, దైవచింతనకు దూరమైన వాడు “ఆత్మఘాతి” అనబడును. రాముడు సాక్షాత్ నారాయణుడే కనుక, రామకటాక్షము లేనివాడు లోకనింద్యుడగును అని చెప్పబడెను.
2.17.15.
అనుష్టుప్.
సర్వేషు హి స ధర్మాత్మా
వర్ణానాం కురుతే దయామ్।
చతుర్ణాం హి వయః స్థానామ్
తేన తే తమనువ్రతాః॥
టీకః-
సర్వేషు = అందరియందు; హి = కూడ; సః = ఆతడు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; వర్ణానాం = వర్ణములయందును; కురుతే = చేయును; దయామ్ = జాలిని; చతుర్ణాం = నాలుగు రకములైన; హి = కూడ; వయస్థానామ్ = వయోవృద్ధులందును; తేన = ఆ విధముగా; తే = వారు; తమ్ = అతనిని; అనువ్రతే = అనుసరించెదరు
భావంః-
ధర్మాత్ముడైన ఆ రాముడు నాలుగు వర్ణములకు చెందిన సర్వజనులందును, వయో వృద్ధులందును దయ చూపును. కావుననే వారందరు అతనిపై ప్రేమ కలిగి అనుసరించెదరు.
2.17.16.
అనుష్టుప్.
చతుష్పథాన్ దేవపథాన్
చైత్యాన్యాయతనాని చ।
ప్రదక్షిణం పరిహరన్
జగామ నృపతేస్సుతః॥
టీకః-
చతుష్పధాన్ = నాలుగు మార్గముల కూడలులను; దేవపథాన్ = దేవాలయములను; చైత్యాని = పవిత్రమైన చైత్యములను; అయతాని = దేవాలయములను; చ = మరియు; ప్రదక్షిణం = తన కుడి ప్రక్కకు వచ్చునట్లుగా; పరిహరన్ = దాటుచు; జగామ = వెళ్లెను; నృపతేః సుతః = రాజకుమారుడైన రాముడు
భావంః-
చతుష్పథములు, దేవాలయములు, చైత్యములు, దేవాలయములు, తనకు కుడి ప్రక్కకు వచ్చునట్లుగా, వాటిని దాటుచు వెళ్లెను.
2.17.17.
అనుష్టుప్.
స రాజకులమాసాద్య
మేఘసంఘోపమైః శుభైః।
ప్రాసాదశృంగైః వివిధైః
కైలాస శిఖరోపమైః॥
టీకః-
సః = అతడు; రాజకులమ్ = రాచనగరు; ఆసాద్య = = సమీపించి; మేఘః = మేఘ; సంఘః = సముదాయముల; ఉపమః = వలె ఉన్న; శుభైః = పరిశుభ్రమైన; ప్రాసాద శృంగైః = ప్రాసాద శిఖరములను; వివిధైః = రకరకములైన; కైలాస శిఖరోపమైః = కైలాస పర్వతమును పోలిన
భావంః-
రాచనగరు మేఘముల వలె, కైలాస శిఖరముల వలె ఉన్న ప్రవేశించి భవనముల శృంగములు
2.17.18.
అనుష్టుప్.
ఆవారయద్భిర్గగనమ్
విమానైరివ పాండురైః।
వర్ధమానగృహైశ్చాపి
రత్నజాలపరిష్కృతైః॥
టీకః-
ఆవారయద్భిః = కప్పివేయుచున్న; గగనమ్ = ఆకాశమును; విమానైః = విమానములు; ఇవ = వలె; పాణ్ఢురైః = తెల్లని వర్ణములో; వర్ధమానః = రాజగృహ రచనా విశేషము; గృహైః = రాజభవనములు; చ = పాదపూరణము; అపి = కూడ; రత్నజాల = రత్నముల సమూహములతో; పరిష్కృతైః = పొదగబడిన
భావంః-
తెల్లని విమానముల వలె, ఆకాశమును అంటుచున్న అనేక విధములైన ప్రాసాద శృంగములును, రత్నాలంకృతములైన రాజార్హములైన వర్థమాన గృహములును ఉన్న.
2.17.19.
అనుష్టుప్.
తత్పృథివ్యాం గృహవరమ్
మహేంద్రసదనోపమమ్।
రాజపుత్రః పితుర్వేశ్మ
ప్రవివేశ శ్రియా జ్వలన్॥
టీకః-
తత్ = ఆ; పృధివ్యాం = భూలోకమునందున్న; గృహ = గృహము; వరమ్ = శ్రేష్ఠమైనదానిని; మహేంద్ర = దేవేంద్రుని; సదనః = భవనమును; ఉపమమ్ = పోలిన; రాజపుత్రః = రాజకుమారుడు; పితుః = తండ్రిగారి; వేశ్మ = గృహమును; ప్రవివేశ = ప్రవేశించెను; శ్రియా = కాంతితో; జ్వలన్ = ప్రకాశించుచున్న.
భావంః-
భూలోకమునందున్న దేవేంద్రుని భవనము వలె, సర్వ గృహశ్రేష్ఠమైన తండ్రి గృహము ప్రవేశించెను.
2.17.20.
అనుష్టుప్.
స కక్ష్యా ధన్విభిర్గుప్తాః
తిస్రోఽతిక్రమ్య వాజిభిః।
పదాతిరపరే కక్ష్యే
ద్వే జగామ నరోత్తమః॥
టీకః-
సః = ఆ, రాముడు; కక్ష్యాః = ఆవరణలను; ధన్విభిః = ధనుస్సులు ధరించినవారిచే; గుప్తాః = రక్షించబడిన; తిస్రః = మూడు; అతిక్రమ్య = దాటుకొని; వాజిభిః = గుఱ్ఱములతో; పదాతిః = పాదచారియై; అపరే = ఇతర; కక్షేయ = ఆవరణలను; ద్వే = రెండు; జగామ = వెళ్లెను; నరోత్తమః = మానవులలో శ్రేష్ఠుడు
భావంః-
ఆ నరశ్రేష్ఠుడు ధనుర్ధరులు రక్షించుచున్న మూడు ఆవరణలను, గుఱ్ఱములతో దాటి, మిగిలిన రెండు ఆవరణలను పాదచారిౖయె దాటి వెళ్లెను.
2.17.21.
అనుష్టుప్.
స సర్వా స్సమతిక్రమ్య
కక్ష్యా దశరథాత్మజః।
సన్నివర్త్య జనం సర్వమ్
శుద్ధాంతః పురమభ్యగాత్॥
టీకః-
సః = ఆ; సర్వాః = = అన్నిటిని; సమతిక్రమ్య = దాటుకుని వెళ్లి; కక్ష్యాః = వాకిళ్ళను; దశరథాత్మజః = దశరథుని కుమారుడైన రాముడు; సన్నివర్త్య = వెనుకకు పంపి; జనం = ప్రజలను; సర్వమ్ = అందరిని; శుద్ధాంతఃపురమ్ = అంతఃపురమును; అభ్యగాత్ = చేరెను
భావంః-
ఆ వాకిళ్లన్నియు దాటి, ఆ దాశరథి తన పరివారమును వెనుకకు పంపించి అంతఃపురములోనికి ప్రవేశించెను.
2.17.22.
జగతి.
తస్మిన్ ప్రవిష్టే పితురంతికం తదా
జన స్స సర్వో ముదితో నృపాత్మజే।
ప్రతీక్షతే తస్య పునశ్చ నిర్గమం
యథోదయం చంద్రమసః సరిత్పతిః॥
టీకః-
తస్మిన్ = ఆ ; ప్రవిష్టే = ప్రవేశించగా; పితుః = తండ్రియొక్క; అంతికం = సమీపమును; తదా = అప్పుడు; జనః = ప్రజలు; సః = వారు; సర్వః = అందరూ; ముదితః = సంతోషించినవారై; నృపాత్మజే = రాజకుమారుడైన శ్రీరాముడు; ప్రతీక్షతే = నిరీక్షించిరి; తస్య = అతని యొక్క; పునః = మరల; చ = మఱి; నిర్గమమ్ = బయట రాకను; యథా = ఆ విధముగ; ఉదయమ్ = ఉదయమును; చంద్రమస = చంద్రునియొక్క; సరిత్పతిః = సరిత్ + పతిః, సముద్రుడు
భావంః-
అపుడు రాముడు తండ్రి సమీపమునకు వెళ్లగా అక్కడ ఉన్న జనులందరు సంతోషించుచు, సముద్రుడు చంద్రోదయమునకై వేచియున్నట్లు అతడు తిరిగి బయటకు వచ్చుటకై వేచియుండిరి.
2.17.23.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే సప్తదశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; సప్తదశః [17] = పదహేడవ; సర్గః = సర్గ.
భావంః-
ఇది వాల్మీకి రచించిన ఆదికావ్యమైన తెలుగు రామాయణమునందలి అయోధ్యాకాండలోని పదిహేడవ సర్గ సమాప్తము.
2.18.1.
అనుష్టుప్.
స దదర్శాసనే రామో
నిషణ్ణం పితరం శుభే।
కైకేయీసహితం దీనమ్
ముఖేన పరిశుష్యతా॥
టీకః-
సః = అతడు; దదర్శ = చూచెను; ఆసనే = ఆసనమునందు; రామః = శ్రీరామచంద్రుడు; నిషణ్ణం = కూర్చునియున్న; పితరం = నాన్నగారిని; శుభే = శుభకరమైన; కైకేయీ = కైకాదేవితో; సహితం = కూడియున్నవానిని; దీనమ్ = దీనముగానున్న; ముఖేన = మోముతో; పరిశుష్యతా = శుష్కించిన.
భావంః-
శ్రీరామచంద్రమూర్తి శుభకరమైన ఆసనముపై కైకాదేవితో కూర్చొనియున్న తన తండ్రిని గాంచెను. ఆ సమయమున దశరథుడు శుష్కించిన మోముతో దీనముగా యుండెను.
2.18.2.
అనుష్టుప్.
స పితుశ్చరణౌ పూర్వమ్
అభివాద్య వినీతవత్।
తతో వవన్దే చరణౌ
కైకేయ్యా స్సుసమాహితః॥
టీకః-
సః = అతడు; పితృః = నాన్నగారి; చరణౌ = పాదద్వయము; పూర్వమ్ = ముందుగా; అభివాద్య = నమస్కరించి; వినీతవత్ = వినయముగా; తతః = తరువాత; వవన్దే = నమస్కరించెను; చరణౌ = పాదద్వయమును; కైకేయ్యాః = కైక యొక్క; సుసమాహితః = సావధానచిత్తుడు అయిన.
భావంః-
శ్రీరామచంద్రమూర్తి సావధానచిత్తముతో ముందుగా నాన్నగారి పాదములకు వినమ్రతతో నమస్కరించెను. తదుపరి తల్లి కైక పాదములకు ప్రణమిల్లెను.
2.18.3.
అనుష్టుప్.
రామేత్యుక్త్వా తు వచనమ్
బాష్పపర్యాకులేక్షణః।
శశాక నృపతిర్దీనో
నేక్షితుం నాభిభాషితుమ్॥
టీకః-
రామ = ఓ రామ!; ఇతి = అని; ఉక్త్వా = నుడివి; తు = అంతనే; వచనమ్ = మాటను; బాష్పపర్యాకులేక్షణః = కన్నీటితో కలతబడిన కన్నులు గలవాడై; శశాక = సమర్థుడు; నృపతిః = రాజు; దీనః = దీనుడు; న = లేదు; ఈక్షితుం = చూచుటకు; న = లేదు; అభిభాషితుమ్ = ప్రేమగా మాట్లాడుటకు.
భావంః-
దశరథమహారాజు “ఓ, రామ!” అనెడి మాట మాత్రమే పలికి దుఃఖముతో కన్నులనిండా నీరు నిండినవాడై, దీనముగా ఉండిపోయెను. చూచుటకు గాని మరొకమాట పలుకుటకు గాని, తనకు శక్యము కాకుండెను.
2.18.4.
అనుష్టుప్.
తదపూర్వం నరపతేః
దృష్ట్వా రూపం భయావహమ్।
రామోఽ పి భయమాపన్నః
పదా స్పృష్ట్వేవ పన్నగమ్॥
టీకః-
తత్ = ఆ యొక్క; అపూర్వం = ఇదివఱకెన్నడులేని; నరపతేః = రాజుయొక్క; దృష్ట్వా = చూచి; రూపం = రూపమును; భయావహమ్ = దిగులుకలిగించెడి; రామః = శ్రీరామచంద్రుడు; అపి = కూడ; భయమాపన్నః = కలతచెందెను; పదా = పాదముతో; స్పృష్ట్వ = తాకిన; ఇవ = వలె; పన్నగమ్ = పామును.
భావంః-
ఇదివరలో ఎన్నడును దశరథుని ఇంత భయంకరమైన దీనస్థితిలో చూడలేదు, శ్రీరామచంద్రమూర్తి కూడ పామును కాలితో త్రొక్కినవాని వలె భయపడెను.
2.18.5.
అనుష్టుప్.
ఇంద్రియైరప్రహృష్టైస్తమ్
శోకసంతాపకర్శితమ్।
నిశ్శ్వసన్తం మహారాజమ్
వ్యథితాకులచేతసమ్॥
టీకః-
ఇంద్రియైః = ఇంద్రియములతో; అప్రహృష్టైః = సంతోషములేని; తమ్ = ఆ; శోకసంతాపః = మిక్కిలి దుఃఖముతో; కర్శితమ్ = కృశించినవాడు; నిశ్శ్వసన్తం = నిట్టూర్చుచున్నవాడు; మహారాజమ్ = మహారాజును; వ్యథితః = ఆందోళనతో; ఆకుల = వ్యాకులమైన; చేతసమ్ = చిత్తము కలవానిని.
భావంః-
ఆ సమయములో దశరథునికి ఎట్టి సంతోషములేని, శోకపరితాప ఆందోళనలతో మిక్కిలి వ్యాకులచిత్తుడై కృశించి నిట్టూర్చుచుండెను.
2.18.6.
అనుష్టుప్.
ఊర్మిమాలినమక్షోభ్యమ్
క్షుభ్యన్తమివ సాగరమ్।
ఉపప్లుతమివాదిత్యమ్
ఉక్తానృతమృషిం యథా॥
టీకః-
ఊర్మి = తరంగముల; మాలినమ్ = మాలలు కలది, పంక్తులు కలది; అక్షోభ్యమ్ = క్షోభించని; క్షుభ్యన్తమ్ = క్షోభించిన; ఇవ = వలె; సాగరమ్ = సముద్రము; ఉపప్లుతమ్ = గ్రహణము పట్టిన; ఇవ = వలె; ఆదిత్యమ్ = సూర్యుని; ఉక్త = చెప్పబడిన; అనృతమ్ = అసత్యము కల; ఋషిమ్ = ఋషిని; యథా = పోలినవానిని
భావంః-
ఆ సమయములో దశరథుడు, పెద్దపెద్ద కెరటములతో అల్లకల్లో మైన ప్రశాంతముగా ఉండే సముద్రము వలె, గ్రహణము పట్టిన సూర్యుని వలె, ఆడినమాట తప్పిన ఋషివలె ఉండెను.
2.18.7.
అనుష్టుప్.
అచిన్త్యకల్పం హి పితుః
తం శోకముపధారయన్।
బభూవ సంరబ్ధతర
స్సముద్ర ఇవ పర్వణి॥
టీకః-
అచిన్త్యకల్పం = ఊహకు అందని; హి = నిశ్చయార్థకము; పితుః = నాన్నగారి; తం = ఆ; శోకమ్ = బాధనుగూర్చి; ఉపధారయన్ = విచారించుచు; బభూవ = అయ్యెను; సంరబ్ధతరః = మిక్కిలి కలవరపడిన వాడుగ; సముద్ర = సముద్రము; ఇవ = వలె; పర్వణి = పర్వకాలమందు (పూర్ణిమయందు).
భావంః-
ఊహకు అందని నాన్నగారి శోకస్థితికి కారణమునుగూర్చి ఆలోచించుచు పూర్ణిమనాటి సముద్రునివలె శ్రీరామచంద్రుడు కలవరపడెను.
గమనికః-
సంరబ్ధము- సంరబ్ధతరము- సంరబ్ధతమము.
2.18.8.
అనుష్టుప్.
చిన్తయామాస చ తదా
రామః పితృహితే రతః।
“కిం స్విదద్యైవ నృపతిః
న మాం ప్రత్యభినందతి॥
టీకః-
చిన్తయామాస = ఆలోచించెను; చ = మఱియు; తదా = ఆవిధముగా; రామః = శ్రీరామచంద్రుడు; పితృ = తన తండ్రి; హితే = మేలునందు; రతః = ఇష్టము కలవాడు; కిం = ఏమి? స్విత్ = కారణముచే; అద్యైవ = ఈ దినమున; నృపతిః = మహారాజు; న = లేదు; మాం = నన్ను; ప్రత్యభినందతి = సంతోషముగా పలుకరించుట.
భావంః-
ఎల్లప్పుడు నాన్నగారి హితమును కోరు శ్రీరామచంద్రుడు ఇట్లు ఆలోచింపసాగెను. “ఈ దివసమున నాన్నగారు నన్నుచూచి పలుకరించుటలేదు, దానికి గల కారణము ఏమయ్యుండును.
అనుష్టుప్.
2.18.9.
అనుష్టుప్.
అన్యదా మాం పితా దృష్ట్వా
కుపితోఽ పి ప్రసీదతి।
తస్య మామద్య సంప్రేక్ష్య
కిమాయాసః ప్రవర్తతే”॥
టీకః-
అన్యదా = మఱంప్పుడైనా; మాం = నన్ను; పితా = నాన్నగారు; దృష్ట్వా = చూచినంతనే; కుపితః = కోపముగానున్నవాడు; అపి = కూడ; ప్రసీదతి = ప్రసన్నుడగుచుండెడివాడు; తస్య = అటువంటి వానికి; మామ్ = నన్ను; అద్య = ఈ దినము; సంప్రేక్ష్య = చూచి; కిమ్ = ఎందుకు?; ఆయాసః = బాధ; ప్రవర్తతే = వాటిల్లుచున్నది.
భావంః-
ఎల్లప్పుడు నన్ను చూచిన వెంటనె నాతండ్రి కోపముగానున్నను సంతోషమునే ప్రకటించు చుండెను ఈ దినమున నన్ను చూచి కూడ ఎందుకు మనోవ్యథచెంది ఉండెను?”
2.18.10.
అనుష్టుప్.
స దీన ఇవ శోకార్తో
విషణ్ణవదనద్యుతిః।
కైకేయీమభివాద్యైవ
రామో వచనమబ్రవీత్॥
టీకః-
సః = అతడు; దీన = దీనుని; ఇవ = వలె; శోకాః = దుఃఖముతో; ఆర్తః = మనోవ్యధ చెందిన వాడు; విషణ్ణ = విషాదముతో కూడిన; వదన = ముఖ; ద్యుతిః = కాంతి కలవాడై; కైకేయీమ్ = కైకేయిని గూర్చి; అభివాద్య = నమస్కరించి; ఇవ = వలె; రామః = శ్రీరామచంద్రుడు; వచనమ్ = మాటను; అబ్రవీత్ = నుడివెను.
భావంః-
శ్రీరామచంద్రుడు, పాలిపోయిన ముఖముతో తల్లి కైకకు నమస్కరించి దీనునివలె ఇట్లు అడిగెను.
2.18.11.
అనుష్టుప్.
కచ్చిన్మయా నాపరాద్ధమ్
అజ్ఞానాద్యేన మే పితా।
కుపితస్తన్మమాచక్ష్వ
త్వం చైవైనం ప్రసాదయ॥
టీకః-
కచ్చిత్ = ఏదయినా; మయా = నాచేత; న = జరుగలేదు కదా; అపరాద్ధమ్ = అపరాధము; అజ్ఞానాత్ = అజ్ఞనమువలన; యేన = దేనిచే; మే = నాయెడల; పితా = నాన్నగారు; కుపితః = కోపముగానున్నారు; తత్ = దానిని; మమ = నాకు; ఆచక్ష్వ = తెలుపుము; త్వం = నీవు; చ = మఱియు; ఏవ = మాత్రమే; ఏనం = వీరిని; ప్రసాదయ = ప్రసన్నునిగా చేయుగలవు.
భావంః-
అమ్మా! అజ్ఞానముచే నావలన ఏ అపరాధము జరుగలేదు కదా! నాన్నగారు నామీద ఎందులకు కోపముగా ఉన్నారో దయతో తెలుపుము. నీవే వారిని నా యెడల ప్రసన్నుని చేయుము.
2.18.12.
అనుష్టుప్.
అప్రసన్నమనాః కిన్ను
సదా మాం ప్రతి వత్సలః।
వివర్ణవదనో దీనో
న హి మామభిభాషతే॥
టీకః-
అప్రసన్న = సంతోషరహితమైన; మనాః = మనస్సు కలవాడు; కిన్ను = ఎందుకు అయ్యెను?; సదా = ఎల్లప్పుడు; మాం = నన్ను; ప్రతి = గూర్చి; వత్సలః = వాత్సల్యము గలవాడు; వివర్ణవదనః = వెలవెలబోవుచున్న మోము గలవాడు; దీనః = దీనుడు; న = లేదు; హి = నిశ్చయార్థకము; మామ్ = నన్నుగూర్చి; అభిభాషతే = మాటలాడుట.
భావంః-
నాన్నగారు ఎల్లప్పుడు నా ఎడల పుత్రవాత్సల్యము చూపించే వారు కదీ. ఎందుచే ఇప్పుడు అప్రసన్నముగా ఉన్నారు? వెలవెలబోయిన మోముతో దీనముగా ఎందుకు ఉన్నారు? కనీసము నాతో ఎందుకని మాట్లాడుట లేదు?
2.18.13.
అనుష్టుప్.
శరీరో మానసో వాపి
కచ్చిదేనం న బాధతే।
సంతాపోవాఽ భితాపో వా
దుర్లభం హి సదా సుఖమ్॥
టీకః-
శరీరః = శారీరిక; మానసః = మానసిక; వా = కాని; అపి = కూడ; కచ్చిత్ = ఏదయినా; ఏనం = ఈయనను; న = లేదు కదా; బాధతే = బాధించుట; సంతాపః = సంతాపము; వా = లేదా; అభితాపః = బాధ; వా = లేదా!; దుర్లభం = అరుదుగా లభించునది; హి = నిశ్చరార్థకము; సదా = ఎల్లప్పుడు; సుఖమ్ = సుఖము.
భావంః-
శారీరకముగా గాని, మానసికముగా గాని వారికి ఎట్టిబాధ కలుగలేదు కదా! సుఖము అన్నివేళల లభించదు కదా?
2.18.14.
అనుష్టుప్.
కచ్చిన్న కించిద్భరతే
కుమారే ప్రియదర్శనే।
శత్రుఘ్నే వా మహాసత్త్వే
మా తౄణాం వా మమాశుభమ్॥
టీకః-
కచ్చిత్ = ఏదైనా; న = లేదు కదా!; కించిత్ = కొద్దిగానైనా; భరతే = భరతుని విషయములో; కుమారే = కుమారుడైన; ప్రియదర్శనే = చూచుటకు ఆనందము కలిగించు; శత్రుఘ్నే = శత్రుఘ్నుని విషయములో; వా = కాని; మహాసత్త్వే = గొప్ప బలముగల; మాతౄణాం = మాతృమూర్తులకు; వా = గాని; మమ = నా యొక్క; అశుభమ్ = అమంగళము జరుగుట॥
భావంః-
ప్రియదర్శనుడైన భరతునకు గాని, గొప్పబలశాలి అయిన శత్రుఘ్నునకు గాని, లేదా నా తల్లులకు గాని ఏ అమంగళము కలుగలేదుకదా!
2.18.15.
అనుష్టుప్.
అతోషయన్మహారాజమ్
అకుర్వన్వా పితుర్వచః।
ముహూర్తమపి నేచ్ఛేయమ్
జీవితుం కుపితే నృపే॥
టీకః-
అతోషయన్ = ఆనందింపజేయని; మహారాజమ్ = మహారాజుని; అకుర్వన్ = చేయనివాడుగ; వా = కాని; పితుః = తండ్రిగారి; వచః = వచనమును; ముహూర్తమ్ = మూహుర్తకాలము; అపి = అయినను; న = చేయను; ఇచ్ఛేయమ్ = కోరుట; జీవితుం = జీవించుటకు; కుపితే = కోపగించగా; నృపే = రాజు.
భావంః-
తండ్రిగారిని సంతోషపెట్టకుండా కాని, లేక వారి మాటను జవదాటి కాని, వారికి కినుక కలిగించి నేను ముహూర్తకాలము కూడ జీవించదలుచట లేదు.
2.18.16.
అనుష్టుప్.
యతోమూలం నరః పశ్యేత్
ప్రాదుర్భావమిహాత్మనః।
కథం తస్మిన్నవర్తేత
ప్రత్యక్షే సతి దైవతే॥
టీకః-
యతః = ఎవడు; మూలం = మూలమయిన; నరః = మానవుడు; పశ్యేత్ = చూచునో; ప్రాదుర్భావమ్ = జన్మను; ఇహ = ఈ లోకమున; ఆత్మనః = తనయొక్క; కథం = ఎట్లు; తస్మిన్ = అట్టివాడు; న వర్తేత = వర్తించడు; ప్రత్యక్షే = ప్రత్యక్షమయిన; సతి = ఉండగ; దైవతే = దేవుడు.
భావంః-
మానవునకు జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవము. అట్టి తండ్రి సజీవుడై యుండగా ఆయనకు అనుకూలముగా జీవించుటయే మానవుని కర్తవ్యము. అట్లు కాక ఎవరయినను ఎట్లు మసల గలరు?
2.18.17.
అనుష్టుప్.
కచ్చిత్తే పరుషం కించిత్
అభిమానాత్పితా మమ।
ఉక్తో భవత్యా కోపేన
యత్రాస్య లులితం మనః॥
టీకః-
కచ్చిత్ = ఏదయిన; తే = నీయొక్క; పరుషం = కఠినమైన; కించిత్ = కొంచెమయినను; అభిమానాత్ = అభిమానము వలన; పితా = నాన్నగారు; మమ = నాయొక్క; ఉక్తః = చెప్పబడినాడా; భవత్యా = నీచేత; కోపేన = కోపముతో; యత్ర = ఎందైన; అస్య = ఈతని; లులితం = పీడింపబడినదో; మనః = మనస్సు.
భావంః-
మాతా! నీవు గర్వముతోగాని, కోపముతోగాని ఏదయినను పరుషముగా మాటలాడి మానాన్నగారి మనస్సును బాధించ లేదు గదా!
2.18.18.
అనుష్టుప్.
ఏతదాచక్ష్వ మే దేవి
తత్త్వేన పరిపృచ్ఛతః।
కిం నిమిత్తమపూర్వోయమ్
వికారో మనుజాధిపే”॥
టీకః-
ఏతత్ = ఈ విషయమును; ఆచక్ష్వ = చెప్పుము; మే = నాకు; దేవి = ఓ! దేవీ; తత్త్వేన = ఉన్నది ఉన్నట్టుగా; పరిపృచ్ఛతః = ప్రశ్నించుచున్న; కిమ్ = ఏ?; నిమిత్తమ్ = కారణమువలన; అపూర్వః = ఇంతకమునుపు ఎన్నడు లేనటువంటి; అయమ్ = ఈ; వికారః = వికారము; మనుజాధిపే = మహారాజుగారి యందు.
భావంః-
ఓ మహారాణి కైక! ఇంతకు మున్నెన్నడు లేని ఈ వికారము మహారాజుగారిలో కలుగుటకు కారణమేమిటో అడుగుచుంటిని. ఉన్నది ఉన్నట్లుగా నాకు తెలియజేయుము.”
2.18.19.
అనుష్టుప్.
ఏవముక్తా తు కైకేయీ
రాఘవేణ మహాత్మనా।
ఉవాచేదం సునిర్లజ్జా
ధృష్టమాత్మహితం వచః॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా = చెప్పబడిన; తు = అయినా; కైకేయీ = కైక; రాఘవేణ = శ్రీరామచంద్రునితో; మహాత్మనా = మహాత్ముడైన; ఉవాచ = నుడివెను; ఇదమ్ = ఈ; సునిర్లజ్జా = ఏమియు సిగ్గులేకుండగ; ధృష్టమ్ = తప్పుచేసియూ బూకరించే ఆమెచేత; ఆత్మ = తనకు; హితమ్ = హితకరమైన; వచః = వచనమును.
భావంః-
మహాత్ముడైన శ్రీరామచంద్రమూర్తి ఇట్లు ప్రశ్నించగా, దుష్టబుద్ది పట్టిన కైక తన తప్పును కప్పిపుచ్చుకొనుచు సిగ్గులేకుండగ, తన స్వార్థపూరిత మైన మాటలతో ఇట్లు చెప్పదొడగెను.
2.18.20.
అనుష్టుప్.
“న రాజా కుపితో రామ
వ్యసనం నాస్య కించన।
కిం చిన్మనోగతంత్వస్య
త్వద్భయాన్నాభిభాషతే॥
టీకః-
న = కాడు; రాజా = రాజు; కుపితః = కుపితుడు; రామ = రామచంద్ర; వ్యసనం = కష్టము; న = లేదు; అస్య = వీరికి; కించన = కొంచెమైనను; కించిత్ = కొంచెము; మనోగతమ్ = మనసులోనున్నది; తు = కాని; అస్య = వీరికి; త్వత్ = నీ నుండి; భయాత్ = భయమువలన; న = లేదు; అభిభాషతే = చెప్పుట.
భావంః-
“రామచంద్ర! రాజుగారికి నీయెడల ఎట్టి కోపము లేదు. వారికి ఎట్టి కష్టము లేదు. కాని వారి మనస్సులో ఉన్న విషయమును నీకు చెప్పుటకు, నీవు ఏమనుకుంటావో అని, సందేహంతో సంకోచించుంటిరి.
2.18.21.
అనుష్టుప్.
ప్రియం త్వామప్రియం వక్తుమ్
వాణీ నాస్యోపవర్తతే।
తదవశ్యం త్వయా కార్యమ్
యదనేనాశ్రుతం మమ॥
టీకః-
ప్రియమ్ = ప్రియమైన; త్వామ్ = నిన్ను; అప్రియమ్ = అప్రియమైనది; వక్తుమ్ = చెప్పుటకు; వాణీ = వాక్కు; న = లేదు; అస్య = వీరియొక్క; ఉపవర్తతే = ప్రవర్తించుట; తత్ = అది; అవశ్యమ్ = తప్పక; త్వయా = నీచేత; కార్యమ్ = చేయవలసినది; యత్ = ఏది; అనేన = వీనిచే; ఆశ్రుతమ్ = ప్రమాణము చేయబడినదో; మమ = నాకు.
భావంః-
వారికి నీవు ప్రియమైన పుత్రుడవు, అట్టి నీతో అప్రియమైన వాక్యములు చెప్పుటకు వారి నోరు రావటం లేదు. ప్రతిజ్ఞా పూర్వకముగా వారు ఇచ్చిన వాగ్దానమును నీవే నెరవేర్చవలెను.
2.18.22.
అనుష్టుప్.
ఏష మహ్యం వరం దత్త్వా
పురా మామభిపూజ్య చ।
స పశ్చాత్తప్యతే రాజా
యథాఽ న్యః ప్రాకృతస్తథా॥
టీకః-
ఏషమ్ = ఈ; అహ్యం = చెప్పినవాడు; వరం = వరమును; దత్త్వా = ఇచ్చి; పురా = ఇంతకుపూర్వము; మామ్ = నన్ను; అభిపూజ్య = గౌరవించి; చ = మఱియు; సః = అతడు; పశ్చాతః = పశ్చాత్తాపముచేత; తప్యతే = తపించుచున్నాడు; రాజా = రాజు; యథా = ఏవిధముగా; అన్యః = ఇతరుడు; ప్రాకృతః = సామాన్యుడు; తథా = ఆవిధముగా.
భావంః-
మహారాజు లోగడ ఆదారాభిమానములతో ఒక వరమును ఇస్తానని మాటిచ్చి నన్ను గౌరవించి యుండెను. ఇప్పుడు అందులకు ఒక సామన్యునివలె పశ్చాత్తాపపడి తపించుచుండెను.
2.18.23.
అనుష్టుప్.
అతిసృజ్య దదానీతి
వరం మమ విశాంపతిః।
స నిరర్ధం గతజలే
సేతుం బంధితుమిచ్ఛతి॥
టీకః-
అతిసృజ్య = ప్రతిజ్ఞ చేసి; దదాని = ఇచ్చెదను; ఇతి = అని; వరం = వరమును; మమ = నాకు; విశాంపతిః = మహారాజు; సః = అతడు; నిరర్ధం = వ్యర్థముగా; గతజలే = పోయిన నీరు గల ప్రదేశములో; సేతుమ్ = వారధిని; బంధితుమ్ = కట్టుటకు; ఇచ్ఛతి = ఇష్టపడుచున్నాడు.
భావంః-
నీరు లేనిచోట వంతెన నిర్మించుట ఎట్లు వ్యర్థమో, ప్రమాణము చేసిన తరువాత దానిని పరిహరించుట కూడ వ్యర్థము, అయినప్పటికి ఈ మహారాజు అటుల కావించుటకు ప్రయత్నించుచున్నారు.
గమనికః-
విశాంపతి- వ్యు, విశ (ప్రజ) లకు పతి (అధిపతి), రాజు.
2.18.24.
అనుష్టుప్.
ధర్మమూలమిదం రామ
విదితం చ సతామపి।
తత్సత్యం న త్యజేద్రాజా
కుపితస్త్వత్కృతే యథా॥
టీకః-
ధర్మమూలమ్ = ధర్మమునకు మూలము; ఇదం = ఇది; రామ = రామచంద్ర!; విదితం = తెలుపబడినది; చ = మఱియు; సతామ్ = సత్పురుషులకు; అపి = కూడ; తత్ = ఆ; సత్యం = సత్యమును; న త్యజేత్ = వదిలిపెట్టబడకుండు గాక; రాజా = రాజు; కుపితః = కోపించిన; త్వత్కృతే = నీ నిమిత్తము; యథా = ఏ విధముగా.
భావంః-
రామచంద్ర! ఈ జగత్తునకు సత్యమే ధర్మమూలము, ఇది సత్పురుషులు అందఱు తెలియపఱచిన వాస్తవము. అటువంటి సత్యపాలనను క్రుద్ధుడైన ఈ మహారాజు నీ వలన విడవకుండ చూడుము.
2.18.25.
అనుష్టుప్.
యది తద్వక్ష్యతే రాజా
శుభం వా యది వాఽ శుభమ్।
కరిష్యసి తతస్సర్వమ్
ఆఖ్యాస్యామి పునస్త్వహమ్॥
టీకః-
యది = అది; తత్ = దానిని; వక్ష్యతే = చెప్పగలడు; రాజా = మహారాజు; శుభం = శుభము; వా = అయినను, యది = అది; వా = అయినను; అశుభమ్ = అశుభము; రిష్యసి = చేసినచో; తతః = తరువాత; సర్వమ్ = అంతయును; ఆఖ్యాస్యామి = చెప్పెదను; పునః = మఱల; తు = పాదపూరణము; అహమ్ = నేను.
భావంః-
మహారాజుగారి వాగ్దానము నీకు శుభమైనను,అశుభమైనను నీవు చేయదలిచినచో ఆ విషయము(వరములను) మఱల నేను నీకు తెలిపెదను.
2.18.26.
అనుష్టుప్.
యది త్వభిహితం రాజ్ఞా
త్వయి తన్న విపత్స్యతే।
తతోఽ హమభిధాస్యామి
న హ్యేష త్వయి వక్ష్యతి”॥
టీకః-
యది = ఏదయితే; తు = అది; అభిహితం = చెప్పబడిన; రాజ్ఞా = మహారాజుచేత; త్వయి = నీయందు; తత్ = అది; న విపత్స్యతే = ఆపద చెందదో (నిష్ఫలము కాదో); తతః = పిమ్మట; అహమ్ = నేను; అభిధాస్యామి = చెప్పెదను; న = లేదు; హి = తప్పక; ఏషః = ఇతను; త్వయి = నీయందు; వక్ష్యతి = చెప్పుట.
భావంః-
మహారాజు నాకు ఇచ్చిన వాగ్దానము నీవు పాటించుటకు సిద్ధమైనచో ఆ విషయమును నేనే నీకు తెలిపెదను. అతను దానిని నీతో స్వయముగా చెప్పజాలకున్నాడు.”
2.18.27.
అనుష్టుప్.
ఏతత్తు వచనం శ్రుత్వా
కైకేయ్యా సముదాహృతమ్।
ఉవాచ వ్యథితో రామః
తాం దేవీం నృపసన్నిధౌ॥
టీకః-
ఏతత్ = ఆ విధముగా;తు; వచనం = మాటలను; శ్రుత్వా = విని; కైకేయ్యా = కైకచేత; సముదాహృతమ్ = పలుకబడిన; ఉవాచ = నుడివెను; వ్యథితః = వ్యథచెందినవాడు; రామః = శ్రీరామచంద్రుడు; తాం = ఆ; దేవీం = దేవినిగూర్చి; నృపసన్నిధౌ = మహారాజు సన్నిధిలో.
భావంః-
కైక ఆ విధముగా చెప్పగా వినినట్టి శ్రీరామచంద్రమూర్తి ఎంతో బాధపడుచు దశరథమహీపతి సమక్షములో తిరిగి ఇట్లు నుడివెను.
2.18.28.
అనుష్టుప్.
“అహో ధిఙ్నార్హసే దేవి
వక్తుం మామీదృశం వచః।
అహం హి వచనాద్రాజ్ఞః
పతేయమపి పావకే॥
టీకః-
అహో = అయ్యో!; ధిక్ = ఛీ!; న = లేదు; అర్హసే = తగదు; దేవి = ఓ దేవి; వక్తుం = పలుకటకు; మామ్ = నాగురించి; ఈదృశం = ఇట్లు; వచః = వచనములు; అహం = నేను; హి = నిశ్చయార్థకము; వచనాత్ = మాటవలన; రాజ్ఞః = రాజు; పతేయమ్ = దూకెదను; అపి = కూడ; పావకే = అగ్నిలోనికి.
భావంః-
“ఛీ! ఎంత సిగ్గుచేటు. అమ్మా! నీవు నాగురించి ఇట్లు మాట్లాడుట సమంజసముకాదు. ఎల్లప్పుడు నా హితముకోరే గౌరవనీయు లైన తండ్రిగారు ఆదేశిస్తే అగ్నిలోనికైనా దూకెదను,
2.18.29.
అనుష్టుప్.
భక్ష్యయేయం విషం తీక్ష్ణమ్
మజ్జేయమపి చార్ణవే।
నియుక్తో గురుణా పిత్రా
నృపేణ చ హితేన చ॥
టీకః-
భక్ష్యయేయం = భక్షించెదను; విషం = గరళమును; తీక్ష్ణమ్ = తీవ్రమైన; మజ్జేయమ్ = మునిగెదను; అపి = కూడ; చ = మఱియు; అర్ణవే = సాగరమునందు; నియుక్తః = ఆజ్ఞాపించ బడినవాడనై; గురుణా = గురువైన; పిత్రా = తండ్రిచే; నృపేణ = రాజుచే; చ = మఱియు; హితేన = హితుడైన; చ = మఱియు.
భావంః-
ఎంత ఘోరమైన గరళమునైనా మ్రింగెదను, ఇంకా అగాధమైన సముద్రములోనైనను మునిగెదను.
2.18.30.
అనుష్టుప్.
తద్బ్రూహి వచనం దేవి
రాజ్ఞో యదభికాంక్షితమ్।
కరిష్యే ప్రతిజానే చ
రామో ద్విర్నాభిభాషతే”॥
టీకః-
తత్ = అది; బ్రూహి = తెలుపుము; వచనం = పలుకును; దేవి = ఓ,దేవి!; రాజ్ఞః = రాజు; యత్ = ఏది; అభికాంక్షితమ్ = కోరుచుండెనో; కరిష్యే = చేసెదను; ప్రతిజానే = ప్రతిజ్ఞ చేస్తున్నాను; చ = మఱియు; రామః = రాముడు; ద్విః = రెండు విధముల; న = చేయడు; అభిభాషతే = పలుకుట.
భావంః-
కనుక ఓ తల్లీ! రాజుగారి కోరికను నాకు తెలుపుము తప్పక దానిని చేసెదను, అని ప్రతిజ్ఞ కూడ చేయుచున్నాను. ఈ రాముడు రెండు రకములుగా మాట్లాడడు”
2.18.31.
అనుష్టుప్.
తమార్జవసమాయుక్తమ్
అనార్యా సత్యవాదినమ్।
ఉవాచ రామం కైకేయీ
వచనం భృశదారుణమ్॥
టీకః-
తమ్ = ఆ; ఆర్జవః = ఋజువర్తన; సమాయుక్తమ్ = గలవాడును; అనార్యా = దుష్టురాలు; సత్యవాదినమ్ = సత్యము పలికెడివాడును; ఉవాచ = నుడివెను; రామం = శ్రీరామునిగూర్చి; కైకేయీ = కైకేయి; వచనం = మాటను; భృశ = మిక్కిలి; దారుణమ్ = దారుణమైనదానిని.
భావంః-
ఋజువర్తనుడు, సత్యమునకు కట్టుబడువాడును అయిన శ్రీరామచంద్రునితో, దుష్టురాలైన కైకేయి మిక్కిలి దారుణమైన వచనమును ఇట్లు పలికెను.
2.18.32.
అనుష్టుప్.
“పురా దైవాసురే యుద్ధే
పిత్రా తే మమ రాఘవ।
రక్షితేన వరౌ దత్తౌ
సశల్యేన మహారణే॥
టీకః-
పురా = ఇంతకు పూర్వము; దైవాసురే యుద్ధే = దేవ దానవుల యుద్ధమునందు; పిత్రా = తండ్రిచేత; తే = నీయొక్క; మమ = నాకు; రాఘవ = ఓ రాఘవ; రక్షితేన = (నాచే) రక్షింపబడినవాడును; వరౌ = రెండు వరములు; దత్తౌ = ఇవ్వబడెను; సశల్యేన = బాణములతో నిండినవాడు; మహారణే = గొప్పయుద్ధమందు.
భావంః-
“రామచంద్ర! పూర్వము దేవ దానవుల మధ్య జరిగిన గొప్ప రణమునందు మీతండ్రి శత్రువుల బాణములు దేహమంతట గుచ్చుకుని బాధపడుచున్నప్పుడు నేను వారిని రక్షించితిని. అప్పుడు నాకు వారు రెండు వరములు ఇచ్చియున్నారు.
2.18.33.
అనుష్టుప్.
తత్ర మే యాచితో రాజా
భరతస్యాభిషేచనమ్।
గమనం దండకారణ్యే
తవ చాద్యైవ రాఘవ॥
టీకః-
తత్ర = వాటిగూర్చి; మే = నాచేత; యాచితః = కోరబడినాడు; రాజా = రాజు; భరతస్య = భరతునియొక్క; అభిషేచనమ్ = పట్టాభిషేకము; గమనం = పోకయును; దండకారణ్యే = దండకవనములోనికి; తవ = నీయొక్క; చ = మఱియు; అద్యైవ = ఇప్పుడే; రాఘవ = ఓ రాఘవ.
భావంః-
రామ! భరతుని పట్టాభిషేకమును, నీవు ఇప్పుడే వనవాసమునకు పోవలెనని వరములుగా నేను రాజును కోరితిని.
2.18.34.
అనుష్టుప్.
యది సత్యప్రతిజ్ఞం త్వమ్
పితరం కర్తుమిచ్ఛసి।
ఆత్మానం చ నరశ్రేష్ఠ
మమ వాక్యమిదం శృణు॥
టీకః-
యది = అయినచో; సత్యప్రతిజ్ఞమ్ = మాటనిలబెట్టుకొను వారినిగా; త్వమ్ = నీవు; పితరమ్ = తండ్రిని; కర్తుమ్ = చేయుటకు; ఇచ్ఛసి = ఇచ్చగించెడివాడవు; ఆత్మానమ్ = తనను; చ = మఱియు; నరశ్రేష్ఠ = నరులలో గొప్పవాడవైన రామ; మమ = నాయొక్క; వాక్యమ్ = మాటను; ఇదమ్ = ఈ; శృణు = వినుము.
భావంః-
నరామచంద్ర! నరులలో గొప్పవాడవైన నీవు, మీ తండ్రిగారి మాటను, నీమాటను నిలబెట్టుకోవలెనన్నచో నీవు నేను చెప్పినటుల చేయుము.
2.18.35.
అనుష్టుప్.
సన్నిదేశే పితుస్తిష్ఠ
యథా తేన ప్రతిశ్రుతమ్।
త్వయాఽ రణ్యం ప్రవేష్టవ్యమ్
నవ వర్షాణి పంచ చ॥
టీకః-
సన్నిదేశే = ఆజ్ఞయందు; పితుః = నాన్నగారి; తిష్ఠ = ఉండుము; యథా = ఏ విధముగా; తేన = వేనిచే; ప్రతిశ్రుతమ్ = ప్రతిజ్ఞ చేయబడినదో; త్వయా = నీచేత; అరణ్యం = అడవి; ప్రవేష్టవ్యమ్ = ప్రవేశింపదగినది; నవ = తొమ్మిది; వర్షాణి = సంవత్సరములు; పంచ = ఐదు; చ = మఱియు.
భావంః-
మీ నాన్నగారి ఆజ్ఞను పాలింపుము. వారు నాకిచ్చిన మాటప్రకారము నీవు పదునాలుగేండ్లు వనవాసము చేయవలెను.
2.18.36.
అనుష్టుప్.
భరతస్త్వభిషిచ్యేత
యదేతదభిషేచనమ్।
త్వదర్థే విహితం రాజ్ఞా
తేన సర్వేణ రాఘవ॥
టీకః-
భరతః = భరతుడు;తు; అభిషిచ్యేత = అభిషేకింపబడవలెను; యత్ = ఏ; ఏతత్ = వీటితో; అభిషేచనమ్ = అభిషేక సామాగ్రితో; త్వదర్థే = నీకొఱకు; విహితం = సమకూర్చబడినవో; రాజ్ఞా = రాజుచేత; తేన = వాటి; సర్వేణ = అన్నిటితో; రాఘవ = ఓ రాఘవ.
భావంః-
రఘురామ! నీ కొఱకు సమకూర్చబడిన ఈ సమస్త అభిషేక సామాగ్రితో భరతునకు పట్టాభిషేకము జరుపబడవలెను.
2.18.37.
అనుష్టుప్.
సప్త సప్త చ వర్షాణి
దండకారణ్యమాశ్రితః।
అభిషేకమిమం త్యక్త్వా
జటాజినధరో వస॥
టీకః-
సప్తసప్త = ఏడు+ ఏడు; చ = మఱియు; వర్షాణి = సంవత్సరములు; దండకారణ్యమ్ = దండకవనమును; ఆశ్రితః = ఆశ్రయించుము; అభిషేకమ్ = పట్టాభిషేకమును; ఇమమ్ = ఈ; త్యక్త్వా = విడిచి; జటాజినధరః = జటాజినములను ధరించినవాడు; వస = నివసించుము.
భావంః-
నీవు ఈ పట్టాభిషేకమును త్యజించి జటావల్కములను ధరించి దండకారణ్యము చేరి పదునాలుగు సంవత్సరములు అందు నివసింపుము.
2.18.38.
అనుష్టుప్.
భరతః కోసలపురే
ప్రశాస్తు వసుధామిమామ్।
నానారత్న సమాకీర్ణామ్
సవాజిరథకుంజరామ్॥
టీకః-
భరతః = భరతుడు; కోసలపురే = కోసలదేశపు పురమునందు; ప్రశాస్తు = పరిపాలించును గాక; వసుధామ్ = రాజ్యమును; ఇమామ్ = ఈ; నానా = వివిధమైన; రత్న = రత్నసంపదలతో; సమాకీర్ణామ్ = కూడియున్నదీ; స = తో సహితముగా; వాజిః = అశ్వములు; రథః = రథములు; కుంజరామ్ = గజములతో యున్నది.
భావంః-
వివిధరత్నసంపదలతోడను, చతురంగబలములతోడను విలసిల్లుచున్న ఈ కోసలరాజ్యమును భరతుడు అయోధ్యలో వసించుచు పరిపాలించును గాక.
2.18.39.
అనుష్టుప్.
ఏతేన త్వాం నరేంద్రోఽ యమ్
కారుణ్యేన సమాప్లుతః।
శోకసంక్లిష్ట వదనో
న శక్నోతి నిరీక్షితుమ్॥
టీకః-
ఏతేన = ఇందుచేత; త్వాం = నిన్ను; నరేంద్రః = రాజు; అయమ్ = ఈ; కారుణ్యేన = జాలితో; సమాప్లుతః = నిండినవాడై; శోక = దుఃఖముతో; సంక్లిష్ట = క్లేశము పొందిన; వదనః = మోము కలవాడు; న = అగుటలేదు; శక్నోతి = సమర్థుడు; నిరీక్షితుమ్ = చూచుటకు.
భావంః-
ఇందువలన మహారాజు నీమీద జాలితోనూ, శోకముతోమూ కుమిలిపోవుచు, మోము వాడినవాడై నిన్ను చూడజాలక ఉన్నాడు.
2.18.40.
అనుష్టుప్.
ఏతత్కురు నరేంద్రస్య
వచనం రఘునందన।
సత్యేన మహతా రామ
తారయస్వ నరేశ్వరమ్”॥
టీకః-
ఏతత్ = ఈ; కురు = చేయుము; నరేంద్రస్య = రాజుయొక్క; వచనం = మాటను; రఘునందన = ఓ రఘునందన।; సత్యేన = సత్యముచేత; మహతా = గొప్ప; రామ = శ్రీరామచంద్ర!; తారయస్వ = తరింపజేయుము; నరేశ్వరమ్ = రాజును.
భావంః-
ఓ రఘురామా! మహారాజుగారి ఈ వాగ్దానమును నిలబెట్టుము. మీ తండ్రిగారి సత్యవచనమును నిలిపి వారిని తరింపజేయుము”.
2.18.41.త్రిష్టుప్
ఇతీవ తస్యాం పరుషం వదన్త్యాం
న చైవ రామః ప్రవివేశ శోకమ్।
ప్రవివ్యథే చాపి మహానుభావో
రాజా తు పుత్రవ్యసనాభితప్తః॥
టీకః-
ఇతీవ = ఈ విధముగా; తస్యాం = ఆమె; పరుషమ్ = కఠినమైన (వాక్యములు); వదన్త్యాం = వదరుచుండ; న = లేదు; చ = మఱియు; ఏవ = మాత్రము; రామః = రాముడు; ప్రవివేశ = ప్రవేశించుట; శోకమ్ = దుఃఖమును; ప్రవివ్యథే = చాలా బాధపడెను; చ = మఱియు; అపి = కూడ; మహానుభావః = మహానుభావుడైన; రాజా = రాజు; తు = పాదపూరణము; పుత్రః = కుమారునకు కలుగుతున్న; వ్యసనాః = ఆపదలచేత; అభితప్తః = మిక్కిలి తాపముపొందినవాడై.
భావంః-
ఈ విధముగా కైక పరుషమైన మాటలను పలుకుచున్నను శ్రీరామచంద్రునకు ఏ మాత్రము శోకము కలుగలేదు. ఆ రామచంద్రుని ముఖకాంతి తగ్గలేదు. ఎట్టి వికారమునకు లోనుకాలేదు. కాని మహానుభావుడైన దశరథమహీపతి పుత్రునకు కలుగనున్న ఆపదలను తలచుకుని శోకముతో కుమిలిపోసాగెను.
2.18.42.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే అష్టాదశ సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; అష్టాదశ [18] = పద్దెనిమిదవ; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [18] పద్దెనిమిదవ సర్గ సంపూర్ణము.
2.19.1.
అనుష్టుప్.
తదప్రియమమిత్రఘ్నో
వచనం మరణోపమమ్।
శ్రుత్వా న వివ్యథే రామః
కైకేయీం చేదమబ్రవీత్॥
టీకః-
తత్ = ఆ; అప్రియమ్ = ప్రియముకానిది; అమిత్రఘ్నః = శత్రువును దునుమాడగల; వచనం = మాటను; మరణ = మరణముతో; ఉపమమ్ = సమానమైన; శ్రుత్వా = విని; నవివ్యథే = బాధపడలేదు; రామః = రాముడు; కైకేయీం = కైకేయిని గూర్చి; చ = పాదపూరణము; ఇదం = దీనిని; అబ్రవీత్ = పలికెను.
భావంః-
శత్రువులను దునుమాడగల రాముడు, మరణశిక్ష వంటిదైన ఆ అప్రియపు మాటలు వినియు. వ్యథనొందక కైకేయితో ఇట్లు పలికెను.
2.19.2.
అనుష్టుప్.
“ఏవమస్తు గమిష్యామి
వనం వస్తుమహం త్వితః।
జటాజినధరో రాజ్ఞః
ప్రతిజ్ఞామనుపాలయన్॥
టీకః-
ఏవమ్ = అట్లే; అస్తు = అగుగాక; గమిష్యామి = వెళ్ళెదను; వనం = వనమును గూర్చి; వస్తుమ్ = నివసించుటకు; అహం = నేను; ఇతః = ఇక్కడనుండి; జటా = జడలు కట్టిన కేశములతో; అజిన = జింకచర్మము; ధరః = ధరించినవాడనై; రాజ్ఞః = రాజుయొక్క; ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను, ఇచ్చినమాటను; అనుపాలయన్ = పాటించి.
భావంః-
”అట్లే అగునుగాక. నేను రాజుగారి మాటను శిరసావహించి అరణ్యమునకు వెళ్ళి జటాజినధారినై నివసించెదను.
2.19.3.
అనుష్టుప్.
ఇదం తు జ్ఞాతుమిచ్ఛామి
కిమర్థం మాం మహీపతిః।
నాభినందతి దుర్ధర్షో
యథాపూర్వమరిందమః॥
టీకః-
ఇదం = ఈ విషయమును; తు = పాదపూరణము; జ్ఞాతుమ్ = తెలుసుకొనుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; కిమర్థం = ఎందుచే; మాం = నన్ను; మహీపతిః = రాజు; న = లేదు; న అభినందతి = అభినందించుట; దుర్దర్షః = ఎదురించుటకు శక్యము కానివాడు; యథాపూర్వమ్ = మునుపటి వలె; అరిందమః = శత్రుసంహారకుడు.
భావంః-
ఎదురు లేనివాడు, శత్రుసంహారకుడును ఐన రాజు, మునుపటివలె, ఈ విషయమున ఎందుచే నన్ను అభినందించుటలేదో తెలియగోరుచున్నాను.
2.19.4.
అనుష్టుప్.
మన్యుర్న చ త్వయా కార్యో
దేవి! బ్రూమి తవాగ్రతః।
యాస్యామి భవ సుప్రీతా
వనం చీరజటాధరః॥
టీకః-
మన్యుః = దుఃఖము; న = కాదు; చ = పాదపూరణము; త్వయా = నీ; కార్యః = తగినపని; దేవి = దేవీ; బ్రూమి = చెప్పుచున్నాను; తవ అగ్రతః = నీ ఎదుట; యాస్యామి = వెళ్ళెదను; భవ = అగుము; సుప్రీతా = సంతోషించినదానవు; వనం = అరణ్యమును గూర్చి; చీరజటాధరః = నారచీరలను జటలను ధరించిన వాడనై.
భావంః-
ఓ దేవీ! నీవు దుఃఖింపకుము. నీ ఎదుటనే చెప్పుచున్నాను. నేను నారచీరలను, జటలను ధరించినవాడనై అడవికి పోయెదను. నీవు సంతసింపుము.
2.19.5.
అనుష్టుప్.
హితేన గురుణా పిత్రా
కృతజ్ఞేన నృపేణ చ।
నియుజ్యమానో విస్రబ్ధః
కిం న కుర్యామహం ప్రియమ్॥
టీకః-
హితేన = మేలుకోరువాడును; గురుణా = పూజ్యుడును; పిత్రా = తండ్రిచే; కృతజ్ఞేన = కృతజ్ఞుడును; నృపేణ = రాజుచే ఐనది; చ = కూడ; నియుజ్యమానః = ఆదేశింపబడినవాడనై; విస్రబ్దః = విశ్వాసవంతుడనై; కిం = ఎందువలన; నకుర్యామ్ = చేయకుందును; అహం = నేను; ప్రియమ్ = ప్రియమును.
భావంః-
నాకు మేలు కోరువాడును, గురుతుల్యుడును, రాజు కూడా ఐన నా తండ్రి ఆదేశింపగా, అతని పట్ల కృతజ్ఞుడును, విశ్వాసపాత్రుడను ఐన నేను అతనికి ప్రియమును చేకూర్చక ఎట్లుందును.
2.19.6.
అనుష్టుప్.
అలీకం మానసం త్వేకమ్
హృదయం దహతీవ మే।
స్వయం యన్నాహ మాం రాజా
భరతస్యాభిషేచనమ్॥
టీకః-
అలీకం = ఇంతకుముందులేనిది; మానసం = మానసిక; తు = పాదపూరణము; ఏకం = ఒకటి; హృదయం = హృదయమును; దహతి = దహింపజేయుచున్నది; ఇవ = వలె; మే = నా యొక్క; స్వయం = స్వయముగ; యన్నాహ = యత్ నాహ, తెలియజేయలేదు; మాం = నన్ను గూర్చి; రాజా = రాజు; భరతస్య = భరతునియొక్క; అభిషేచనమ్ = పట్టాభిషేకమును గూర్చి.
భావంః-
రాజుగారు ఎప్పుడూలేనిది, భరతుని పట్టాభిషేకమును గురించి నాకు స్వయముగ తెలియజేయలేదను మనోవ్యథ ఒక్కటే నా హృదయమును దహించుచున్నది.
2.19.7.
అనుష్టుప్.
అహం హి సీతాం రాజ్యం చ
ప్రాణానిష్టాన్ ధనాని చ।
హృష్టో భ్రాత్రే స్వయం దద్యామ్
భరతాయాప్రచోదితః॥
టీకః-
అహంహి = నేనే; సీతాం = సీతను; రాజ్యం చ = రాజ్యమును; చ = కూడ; ప్రాణాన్ = ప్రాణములను; ఇష్టాన్ = ఇష్టజనులను; ధనాని = ధనమును; చ = కూడ; హృష్టః = సంతోషించినవాడనై; భ్రాత్రే = సోదరుడైన; స్వయం = స్వయముగ; దద్యాం = ఇచ్చెదను; భరతాయ = భరతునకు; అప్రచోదితః = ఎవరి ప్రోద్బలము లేకుండగనే.
భావంః-
ఎవ్వరి ప్రోద్బలము లేకుండగనే, స్వయముగ నేనే, సోదరుడైన భరతునికి, సీత బాధ్యతను అప్పజెప్పి, రాజ్యమును, ప్రాణములను, ఇష్టజనులను, ధనమును ఇచ్చి, వెళ్ళెడివాడను.
2.19.8.
అనుష్టుప్.
కిం? పునర్మనుజేంద్రేణ
స్వయం పిత్రా ప్రచోదితః।
తవ చ ప్రియకామార్థమ్
ప్రతిజ్ఞామనుపాలయన్॥
టీకః-
కిం = ఏమి; పునః = మరల; మనుజేంద్రేణ = రాజుచే; స్వయం = స్వయముగ; పిత్రా = తండ్రి ఐన; ప్రచోదితః = ప్రేరేపింపబడినవాడనై; తవ = నీ యొక్క; చ = కూడ; ప్రియకామార్థమ్ = ప్రియమును చేయగోరి; ప్రతిజ్ఞన్ = ప్రతిజ్ఞను; అనుపాలయన్ = పాలించుచు.
భావంః-
అమ్మా! తండ్రి ఐన దశరథమహారాజు నీ కోరికను తీర్చవలెనని చేసిన ప్రతిజ్ఞను, నేను స్వయముగ పాటించెదనని మరల వేరే చెప్పవలెనా?
2.19.9.
అనుష్టుప్.
తదాశ్వాసయ హీమం త్వమ్
కిన్విదం యన్మహీపతిః।
వసుధాసక్తనయనో
మందమశ్రూణి ముంచతి॥
టీకః-
తత్ = ఆ; ఆశ్వాసయ = ఓదార్చుము; హి = పాదపూరణము; ఇమం = వీరిని; త్వమ్ = నీవు; కిం ను = ఎందుచే; ఇదం = ఇది; యత్ = అటువంటి; మహీపతిః = రాజు; వసుధా = నేలవైపు; సక్త= లగ్నమైన; నయనః = చూపులు చూచుచుండెను; మందమ్ = మెల్లగా; అశ్రూణి = కన్నీటిని; ముంచతి = విడచుచున్నాడు.
భావంః-
నీవు వీరిని స్వాంతనపరచుము. ఎందువలన రాజు నేలచూపులు చూచుచు కన్నీరు కార్చుచున్నాడు?
2.19.10.
అనుష్టుప్.
గచ్ఛంతు చైవానయితుమ్
దూతాశ్శ్రీఘ్రజవైర్హయైః।
భరతం మాతులకులాత్
అద్యైవ నృపశాసనాత్॥
టీకః-
గచ్ఛంతు చ ఏవ = వెళ్ళెదరుగాక; ఆనయితుమ్ = తోడ్కొనివచ్చుటకు; దూతాః = దూతలు; శ్రీఘ్రజవైః = శీఘ్ర వేగముగల; హయైః = గుఱ్ఱములతో; భరతం = భరతుని; మాతులకులాత్ = మేనమామ యింటినుండి; అద్య ఏవ = ఇప్పుడే; నృపశాసనాత్ = రాజాజ్ఞచే.
భావంః-
రాజాజ్ఞను గైకొని, మేనమామ యింటినుండి భరతుని తోడ్కొని వచ్చుటకు, దూతలు ఇప్పుడే, వేగముగల గుఱ్ఱములతో వెళ్ళెదరుగాక.
2.19.11.
అనుష్టుప్.
దండకారణ్యమేషోఽ హమ్
ఇతో గచ్ఛామి సత్వరః।
అవిచార్య పితుర్వాక్యమ్
సమా వస్తుం చతుర్దశ”॥
టీకః-
దండకారణ్యమ్ = దండకారణ్యమును గూర్చి; ఏషః = ఈ; అహమ్ = నేను; ఇతః = ఇక్కడనుండి; గచ్ఛామి = వెళ్ళెదను; సత్వరః = త్వరగా; అవిచార్యః = ఆలోచనచేయకనే; పితుః = తండ్రియొక్క; వాక్యమ్ = ఆజ్ఞను; సమాః = సంవత్సరములు; వస్తుం = నివసించుటకు; చతుర్దశ = పదునాలుగు.
భావంః-
నేను తండ్రి యొక్క ఆజ్ఞను మరింకే ఆలోచన చేయక, దండకారణ్యములో పదునాలుగు సంవత్సరములు నివసించుటకు త్వరగా బయలుదేరెదను.”
2.19.12.
అనుష్టుప్.
సా హృష్టా తస్య తద్వాక్యమ్
శ్రుత్వా రామస్య కైకయీ।
ప్రస్థానం శ్రద్ధధానా హి
త్వరయామాస రాఘవమ్॥
టీకః-
సా = ఆమె; హృష్టా = సంతోషించి; తస్య = అతనియొక్క; తత్ = ఆ; వాక్యమ్ = మాటను; శ్రుత్వా = విని; రామస్య = రామునియొక్క; కైకయీ = కైకేయి; ప్రస్థానం = ప్రయాణమును; శ్రద్ధధానా హి = విశ్వసించుచున్నదై; త్వరయామాస = త్వరపరచెను; రాఘవమ్ = రాముని.
భావంః-
రాముని మాటను విన్న కైకేయి, అతడు తప్పక వెళ్ళగలడని సంతోషించి, అతని ప్రయాణమును త్వరపరచెను.
2.19.13.
అనుష్టుప్.
“ఏవం భవతు యాస్యన్తి
దూతా శ్శీఘ్రజవైర్హయైః।
భరతం మాతులకులాత్
ఉపావర్తయితుం నరాః॥
టీకః-
ఏవం = ఇట్లు; భవతు = అగుగాక; యాస్యన్తి = వెళ్ళగలరు; దూతాః = దూతలు; శీఘ్రజవైః = వేగముతో కూడిన; హయైః = గుఱ్ఱములచే; భరతం = భరతుని; మాతులకులాత్ = మేనమామ ఇంటినుండి; ఉపావర్తయితుం = తోడ్కొని వచ్చుటకు; నరాః = మనుష్యులు.
భావంః-
”అట్లే అగునుగాక. భరతుని, అతని మేనమామ ఇంటి నుండి తోడ్కొనివచ్చుటకు మనుష్యులు, వేగముగా పోగల గుఱ్ఱములపై పోయెదరు.
2.19.14.
అనుష్టుప్.
తవ త్వహం క్షమం మన్యే
నోత్సుకస్య విలమ్బనమ్।
రామ! తస్మాదిత శ్శీఘ్రమ్
వనం త్వం గంతుమర్హసి॥
టీకః-
తవ = నీ యొక్క; తు = కాని; అహం = నేను; క్షమం = తగినది; మన్యే న = తలంచను; ఉత్సుకస్య = ఉత్సాహముగల; విలమ్బనమ్ = ఆలస్యమును; రామ = రామా; తస్మాత్ = అందువలన; ఇతః = ఇక్కడనుండి; శీఘ్రమ్ = త్వరగా; వనం = వనమునుగూర్చి; గంతుమ్ = వెళ్ళుటకు; అర్హసి = తగుదువు;
భావంః-
రామా! కాని, అరణ్యమునకు పోవుటయందు ఉత్సాహము కలిగియున్న నీవు, ఆలస్యము చేయుట తగునని నేను తలపను. అందువలన నీవు వెంటనే అడవికి బయలుదేరుము.
2.19.15.
అనుష్టుప్.
వ్రీడాన్విత స్స్వయం యచ్చ
నృపస్త్వాం నాభిభాషతే।
నైతత్కించన్నరశ్రేష్ఠ
మన్యురేషోఽ పనీయతామ్॥
టీకః-
వ్రీడాన్వితః = సిగ్గుతో; స్వయం = స్వయముగ; యత్ = అటువంటి; చ = పాదపూరణము; నృపః = రాజు; న = లేదు; అభిభాషతే = చెప్పుట అనెడి; న = కాదు; ఏతత్ = ఇది; కించత్ = ఏమియు; నరశ్రేష్ఠ = మానవోత్తమా; మన్యుః = దుఃఖము; ఏషః = ఈ; అపనీయతామ్ = తొలగింపబడుగాక.
భావంః-
రాజు సిగ్గుచే, స్వయముగా నీతో చెప్పుటలేదు అను విషయము ముఖ్యము కాదు. మానవోత్తమా రామా! ఈ విషయమై నీవు దుఃఖపడ నవసరములేదు.
2.19.16.
అనుష్టుప్.
యావత్త్వం న వనం యాతః
పురాదస్మాదభిత్వరన్।
పితా తావన్న తే రామ
స్నాస్యతే భోక్ష్యతేఽ పి వా”॥
టీకః-
యావత్ = ఎప్పటి వరకు; త్వం = నీవు; న = చేయవో; వనం = అరణ్యమును గూర్చి; యాతః = వెడలుట; పురాత్ = పురమునుండి; అస్మాత్ = ఈ; అభిత్వరన్ = త్వరగ; పితా = తండ్రి; తావత్ = అప్పటి వరకు; న = చేయడు; తే = నీ; రామ = రామా; స్నాస్యతే = స్నానముచేయుట; భోక్ష్యతే = భోజనము చేయుట; అపి = కూడ; వా = లేదా.
భావంః-
రామా! నీవు అయోధ్య విడిచి పోనంతవరకు, నీ తండ్రి, స్నానము గాని, భోజనము గాని చేయడు.”
2.19.17.
అనుష్టుప్.
“ధిక్కష్టమితి” నిఃశ్వస్య
రాజా శోకపరిప్లుతః।
మూర్ఛితో న్యపతత్తస్మిన్
పర్యంకే హేమభూషితే॥
టీకః-
ధిక్ = ఛీ; కష్టమ్ = కష్టము; ఇతి = ఇది; నిఃశ్వస్య = నిట్టూర్చి; రాజా = రాజు; శోక = దుఃఖమున; పరిప్లుతః = మునిగినవాడై; మూర్ఛితః = మూర్ఛవచ్చి; న్యపతత్ = పడిపోయెను; తస్మిన్ = ఆ; పర్యంకే = మంచముపై, పాన్పుపై; హేమభూషితే = బంగారముతో అలంకరింపబడిన.
భావంః-
అది విని దశరథుడు, "ఛీ ఎంత కష్టము సంభవించినది" అని దుఃఖముతో నిట్టూర్చి, మూర్ఛవచ్చి, స్వర్ణాలంకృతశయ్యపై పడిపోయెను.
2.19.18.
అనుష్టుప్.
రామోఽ ప్యుత్థాప్య రాజానమ్
కైకేయ్యాభిప్రచోదితః।
కశయేవాహతో వాజీ
వనం గన్తుం కృతత్వరః॥
టీకః-
రామః = రాముడు; అపి = కూడ; ఉత్థాప్య = లేవనెత్తి; రాజానమ్ = రాజును; కైకేయ్యా = కైకేయిచే; అభిప్రచోదితః = ప్రేరేపింపబడిన; కశయా = కొరడాతో; ఆహతః = కొట్టబడిన; వాజి = గుఱ్ఱము; ఇవ = వలె; వనం = వనమును గూర్చి; గన్తుం = వెళ్ళుటకు; కృతత్వరః = తొందరపెట్టబడినవాడు.
భావంః-
రాముడు కైకేయిచే ప్రేరేపింపబడినవాడై దశరథుని లేవనెత్తి, కొరడాతో కొట్టబడిన గుఱ్ఱము వలె అడవికి పోవుటకు త్వరపడెను.
2.19.19.
అనుష్టుప్.
తదప్రియమనార్యాయా
వచనం దారుణోదయమ్।
శ్రుత్వా గతవ్యథో రామః
కైకేయీం వాక్యమబ్రవీత్॥
టీకః-
తత్ = ఆ; అప్రియమ్ = అప్రియమైన; అనార్యాయాః = దుష్టురాలైన; వచనం = మాటను; దారుణోదయమ్ = దారుణమైన; శ్రుత్వా = విని; గత = తొలగిన; వ్యథః = వ్యథ కలవాడై; రామః = రాముడు; కైకేయీం = కైకేయిని గూర్చి; వాక్యం = మాటను; అబ్రవీత్ = పలికెను.
భావంః-
దారుణమైన ఆ దుష్టురాలి అప్రియమైన మాటను విని, రాముడు బాధపడక ఆమెతో ఇట్లనెను.
2.19.20.
అనుష్టుప్.
“నాహమర్థపరో దేవి!
లోకమావస్తుముత్సహే।
విద్ధిమామృషిభిస్తుల్యమ్
కేవలం ధర్మమాస్థితమ్॥
టీకః-
న = కాను; అహమ్ = నేను; అర్థవరః = ధనమునందు ఆసక్తిగలవాడను; దేవి = దేవీ; లోకమ్ = లోకమును; ఆవస్తుమ్ = నివసించుటకు; ఉత్సహే = కోరుచున్నాను; విద్ది = తెలుసుకొనుము; మామ్ = నన్ను; ఋషిభిః = ఋషులతో; తుల్యమ్ = సమానముగ; కేవలం = కేవలము; ధర్మమ్ = ధర్మమును; ఆస్థితమ్ = అవలంబించియున్న.
భావంః-
దేవీ! నేను ధనాపేక్ష గలవాడను కాను. లౌకికముగ నివసించవలెనని మాత్రమే కోరుచున్నాను. కేవలము ధర్మమును మాత్రమే పాటించుచున్న నేను ఋషితుల్యుడనని ఎరుగుము.
2.19.21.
అనుష్టుప్.
యదత్ర భవతః కించిత్
శక్యం కర్తుం ప్రియం మయా।
ప్రాణానపి పరిత్యజ్య
సర్వథా కృతమేవ తత్॥
టీకః-
యత్ = దానిని; అత్రభవతః = పూజనీయుడైన; కించిత్ = ఏదైనను; శక్యం = వీలగునో; కర్తుం = చేయుటకు; ప్రియం = ప్రియమైనది; మయా = నాచే; ప్రాణాన్ అపి = ప్రాణములను కూడ; పరిత్యజ్య = విడిచి; సర్వథా = అన్ని విధములుగా; కృతమేవ = చేయబడినట్లు; తత్ = అది.
భావంః-
పూజనీయుడైన మా తండ్రికి ప్రియమైనది ఏదైనను నా ప్రాణములను పణముగ పెట్టైనా చేసెదను.
2.19.22.
అనుష్టుప్.
న హ్యతో ధర్మచరణమ్
కించదస్తి మహత్తరమ్।
యథా పితరిశుశ్రూషా
తస్య వా వచనక్రియా॥
టీకః-
న = లేదు; హి = కదా; అతః = దీనికన్న; ధర్మచరణమ్ = అనుసరించవలసిన ధర్మము; కించత్ = ఏదియు; అస్తి = ఉండుట; మహత్తరమ్ = గొప్పది; యథా = ఎట్లో; పితరి = తండ్రికి; శుశ్రూష = సేవ; తస్య = అతనియొక్క; వా = గాని; వచనక్రియా = ఆజ్ఞాపాలన.
భావంః-
తండ్రికి శుశ్రూష చేయుటకన్నను, ఆతని ఆజ్ఞను పాటించుటకన్నను మించిన ధర్మానుష్ఠానము వేరేదియు ఉండదు కదా.
2.19.23.
అనుష్టుప్.
అనుక్తోఽ ప్యత్రభవతా
భవత్యా వచనాదహమ్।
వనే వత్స్యామి విజనే
వర్షాణీహ చతుర్దశ॥
టీకః-
అనుక్తః = చెప్పబడకపోయిన; అపి = కూడ; అత్రభవతా = పూజనీయుడైన ఈయనచే; భవత్యాః = నీ యొక్క; వచనాత్ = మాటననుసరించి; అహమ్ = నేను; వనే = అరణ్యమునందు; వత్స్యామి = నివసించెదను; విజనే = జనులు లేని; వర్షాణి = సంవత్సరములు; ఇహ = ఇప్పుడు; చతుర్దశ = పదునాలుగు.
భావంః-
పూజనీయుడైన మా తండ్రి చెప్పకపోయినను, నీ మాటననుసరించి, నిర్మానుష్యమైన అడవిలో పదునాలుగు సంవత్సరములు నివసించెదను.
2.19.24.
అనుష్టుప్.
న నూనం మయి కైకేయి!
కించదాశంససే గుణమ్।
యద్రాజానమ్ అవోచస్త్వమ్
మమేశ్వరతరా సతీ!॥
టీకః-
న = లేదు; నూనం = కచ్చితముగ; మయి = నా యందు; కైకేయి = ఓ కైకేయి; కించత్ = కొంచెమైనను; ఆశంససే = చూచుటలేదు; గుణమ్ = గుణమును; యత్ = దేనివలననైతే; రాజానమ్ = రాజునుగూర్చి; అవోచః = పలికితివో; త్వమ్ = నీవు; మమ = నా విషయమున; ఈశ్వరతరా = మిక్కిలి అధికారముగలది; సతీ = మతితనము గలదానా, సంస్కృత ఆంధ్ర నిఘంటువు.
భావంః-
కైకేయీ! నా పై అధికారము గలదానివై యుండికూడ, యౌవరాజ్యపట్టాభిషేక విషయమై నాతో చెప్పక, ఎందువలననో దశరథునితో చెప్పినావు. దీనినిబట్టి నా స్వభావముపై నీకు నమ్మిక లేదని కచ్చితముగ తెలియుచున్నది.
2.19.25.
అనుష్టుప్.
యావన్మాతరమాపృచ్ఛే
సీతాం చానునయామ్యహమ్।
తతోఽ ద్యైవ గమిష్యామి
దండకానాం మహద్వనమ్॥
టీకః-
యావత్ = అంతవరకు; మాతరమ్ = తల్లిని గూర్చి; ఆపృచ్ఛే = సెలవు పలికి; సీతాం చ = సీతను; చ = కూడ; అనునయామి = ఓదార్చెదను; అహమ్ = నేను; తతః = తరువాత; అద్య ఏవ = నేడే; గమిష్యామి = వెళ్ళెదను; దండకానాం = దండకారణ్యమను; మహద్వనమ్ = గొప్ప అరణ్యమును గూర్చి.
భావంః-
నేను మా తల్లి దగ్గర సెలవు గైకొని, సీతను స్వాంతనపరచి, నేడే భీకరమైన ఆ దండకారణ్యమునకు పోయెదను.
గమనికః-
దండకారణ్యము- ఇక్ష్వాకునికి నూరుగురు (100 మంది) కొడుకులలో వికుక్షి (1), నిమి (2), దండకుడు / దండుడు (3) ముగ్గురు ముఖ్యులు. అందు వికుక్షి వంశము రాముడు. సీతీదేవిది నిమి వంశము. మూడవ వాడైన దండుడు దుష్టుడు. దానితో తండ్రి వింద్యపర్వతమునకు దక్షిణమునకు వెడలగొట్టెను. అతడు అక్కడ “మధుమంతము” అను పురము నిర్మించుకుని ఉండెను. శుక్రాచార్యుని శిష్యుడు ఆయెను. పిమ్మట శుక్రాచార్యుని కూతురు “అరజ”ను కామాతురుడై బలవంతముగా రమించెను. శుక్రాచార్యుడు ఇతని పురము చుట్టును నూరు (100) యోజనములు మేర మట్టి వర్షించునట్లు శపించెను. అట్లు మధుమంతము మట్టిపాలగుటచే ఆ ప్రదేశము అరణ్యముగా మారి, అతని పేర “దండకారణ్యము” అని ప్రసిద్ధమాయెను. సౌజన్యము గీతా ప్రెస్ వారి రామాయణము.
2.19.26.
అనుష్టుప్.
భరతః పాలయేద్రాజ్యమ్
శుశ్రూషేచ్చ పితుర్యథా।
తథా భవత్యా కర్తవ్యమ్
స హి ధర్మ స్సనాతనః”॥
టీకః-
భరతః = భరతుడు; పాలయత్ = పాలించుచు; రాజ్యం = రాజ్యమును; శుశ్రూష = సేవ చేయుటందు; ఇచ్ఛ = ఇష్టము; పితుః = తండ్రికి; యథా = ఏ విధముగానైతే; తథా = ఆ విధముగ; భవత్యా = నీ చే; కర్తవ్యమ్ = చేయదగినది; సః = అది; హి ధర్మః = ధర్మము కదా; సనాతనః = ప్రాచీనమైన.
భావంః-
భరతుడు రాజ్యపాలన చేయుచు, తండ్రికి శుశ్రూష చేయునట్లు, చూచుట నీ కర్తవ్యము. అది సనాతన ధర్మము కదా.”
2.19.27.
అనుష్టుప్.
స రామస్య వచశ్శ్రుత్వా
భృశం దుఃఖహతః పితా।
శోకాదశక్నువన్వక్తుమ్
ప్రరురోద మహాస్వనమ్॥
టీకః-
సః = అతడు; రామస్య = రాముని యొక్క; వచః = మాటలను; శ్రుత్వా = విని; భృశం = చాల; దుఃఖహతః = దుఃఖితుడై; పితా = తండ్రి ఐన; శోకాత్ = శోకమువలన; అశక్నువన్ = అశక్తుడై; వక్తుమ్ = మాటలాడుటకు; ప్రరురోద = ఏడ్చెను; మహాస్వనమ్ = పెద్ద ధ్వని కలుగునట్లు.
భావంః-
తండ్రియైన దశరథుడు కొడుకు రాముని మాటలు వినిన, మిక్కిలి దుఃఖితుడై, మారు మాటలాడుటకు అశక్తుడై, బిగ్గరగా రోదించెను.
2.19.28.
అనుష్టుప్.
వందిత్వా చరణౌ రామో
విసంజ్ఞస్య పితుస్తథా।
కైకేయ్యాశ్చాప్యనార్యాయాః
నిష్పపాత మహాద్యుతిః॥
టీకః-
వందిత్వా = నమస్కరించి; చరణౌ = పాదములను; రామః = రాముడు; విసంజ్ఞస్య = మూర్ఛచెందియున్న; పితుః = తండ్రియొక్క; తథా = అట్లు; కైకేయాశ్చ అపి = కైకేయివి; అపి = కూడ; అనార్యాయాః = దుష్టురాలైన; నిష్పపాత = బయటకు వెళ్ళెను; మహా = గొప్ప; ద్యుతిః = తేజశ్శాలి.
భావంః-
గొప్ప తేజశ్శాలి ఐన రాముడు, మూర్ఛనొందియున్న తన తండ్రి పాదములకును, దుష్టురాలైన కైకేయి పాదములకు కూడ, నమస్కరించి బయటకు వెళ్ళెను.
2.19.29.
అనుష్టుప్.
స రామః పితరం కృత్వా
కైకేయీం చ ప్రదక్షిణమ్।
నిష్క్రమ్యాంతఃపురాత్తస్మాత్
స్వం దదర్శ సుహృజ్జనమ్॥
టీకః-
సః = ఆ; రామః = రాముడు; పితరం = తండ్రిని; కృత్వా = చేసి; కైకేయీం = కైకేయికిని; చ = కూడ; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము; నిష్క్రమ్య = బయటకు వెళ్ళి; అంతఃపురాత్ = అంతఃపురమునుండి; తస్మాత్ = ఆ; స్వం = తనయొక్క; దదర్శ = చూచెను; సుహృజ్జనమ్ = మిత్రులను.
భావంః-
తరువాత రాముడు, తండ్రికిని, కైకేయికిని ప్రదక్షిణపూర్వక నమస్కారము చేసి, అంతఃపురము నుండి బయటకు వచ్చి, తన మిత్రులను కలిసెను.
2.19.30.
అనుష్టుప్.
తం బాష్పపరిపూర్ణాక్షః
పృష్ఠతోఽ నుజగామ హ।
లక్ష్మణః పరమక్క్రుద్ధః
సుమిత్రానందవర్ధనః॥
టీకః-
తం = అతనిని; బాష్ప పరిపూర్ణ అక్షః = కన్నీరు నిండిన కన్నులు కలవాడై; పృష్టతః = వెనుక; అనుజగామ = అనుసరించి వెళ్ళెను; హ = పాదపూరణము; పరమః = అత్యంత; కృద్ధః = కోపము చెందినవాడై; సుమిత్ర ఆనంద వర్ధనః = సుమిత్ర యొక్క ఆనందమును వృద్ధినొందించువాడు.
భావంః-
సుమిత్రానందన వర్ధనుడైన లక్ష్మణునికి, అత్యంత క్రోధము కలిగెను. కన్నీరు నిండిన కన్నులతో రాముని అనుసరించి వెళ్ళెను.
2.19.31.
అనుష్టుప్.
అభిషేచనికం భాండమ్
కృత్వా రామః ప్రదక్షిణమ్।
శనైర్జగామ సాపేక్షో
దృష్టిం తత్రావిచాలయన్॥
టీకః-
అభిషేచనికం = పట్టాభిషేకమునకు సంబంధించిన; భాండమ్ = పెద్ద పాత్ర; కృత్వా = చేసి; రామః = రాముడు; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము; శనైః = మెల్లగా; జగామ = వెళ్ళెను; సాపేక్షః = స+ఆపేక్షః, ఆదరముతో; దృష్టిం = దృష్టిని; తత్ర = అక్కడ; అవిచాలయన్ = మరల్చకుండ.
భావంః-
రాముడు అక్కడి అభిషేకపు భాండమునకు ఆదరపూర్వకముగా ప్రదక్షిణ చేసి దృష్టి మరల్చకుండ చూచుచు మెల్లగా వెళ్ళెను.
2.19.32.
అనుష్టుప్.
న చాస్య మహతీం లక్ష్మీమ్
రాజ్యనాశోఽ పకర్షతి।
లోకకాంతస్య కాంతత్వాత్
శీతరశ్మేరివ క్షపా॥
టీకః-
న = లేదు; చ = పాదపూరణము; అస్య = ఇతనియొక్క; మహతీం = గొప్ప; లక్ష్మీమ్ = శోభను; రాజ్య = రాజ్యాధికారము యొక్క; నాశః = వినాశము; అపకర్షతిః = తగ్గించుట; లోకకాంతస్య = లోకమనోహరుడైన; కాంతత్వాత్ = సౌందర్యవంతుడగుటచే; శీతరశ్మేః = చంద్రుని శోభను; ఇవ = వలె; క్షపా = రాత్రి.
భావంః-
రాత్రి (చీకటి) చంద్రుని కాంతిని తగ్గించలేనట్లు, రాజ్యమును కోల్పోవుట కూడ లోకమనోహరుడు గొప్ప సుందరాకారుడు ఐన రాముని శోభను తగ్గింపజాలకపోయెను.
గమనికః-
లోకకాంతః- విష్ణువు. వ్యు. లోకస్య కాంతః, ష.త., సర్వజన సమ్మతుడు / భర్త. రాముడు విష్ణువు అవతారము, ప్రజలందరికి సమ్మతుడు. కోసలరాజ్యానికి రాజుగా ప్రజలందరిచేత అంగీకరింపబడినవాడు. రామునికి కోవలము కోసల సింహాసనం ప్రత్యక్షముగా లేకపోయినను వచ్చెడి లోడు ఏమియు ఉండదు.
2.19.33.
అనుష్టుప్.
న వనం గంతుకామస్య
త్యజతశ్చ వసుంధరామ్।
సర్వలోకాతిగస్యేవ
లక్ష్యతే చిత్తవిక్రియా॥
టీకః-
న = లేదు; వనం = అరణ్యమును గూర్చి; గంతుకామస్య = వెళ్ళుటకు నిశ్చయించుకొనినవాడు; త్యజతశ్చ = విడిచినవాడు; వసుంధరామ్ = భూమిని; సర్వ = సకల; లోకా = లౌకిక విషయములకు; అతిగస్యః = అతీతుడు; ఇవ = వలె; లక్ష్యతే = చూచుట; చిత్త విక్రియా = చిత్తవికారము.
భావంః-
రాజ్యమును త్యజించి, అరణ్యమునకు పోవుచున్న రామునిలో, లౌకిక సుఖదుఃఖములకు అతీతుడైయున్న యోగియందు వలె, దైన్యము కనబడలేదు.
గమనికః-
విష్ణుస్వరూపుడైన రాముని ముఖశోభకి పట్టాభిషేక నిర్ణయానికి పెరగనూ పెరగదు, వనవాస క్లేసములకు తరుగనూ తరుగదు.
2.19.34.
అనుష్టుప్.
ప్రతిషిధ్య శుభం ఛత్రమ్
వ్యజనే చ స్వలంకృతే।
విసర్జయిత్వా స్వజనమ్
రథం పౌరాంస్తథా జనాన్॥
టీకః-
ప్రతిషిధ్య = నిషేధించి; శుభం = శుభకరమైన; ఛత్రమ్ = ఛత్రమును; వ్యజనే చ = వింజామరలను; చ = కూడ; స్వలంకృతే = మంచిగ అలంకరింపబడిన; విసర్జయిత్వా = విడిచి; స్వజనమ్ = తన వారిని; రథం = రథమును; పౌరాన్ = పౌరులను; తథా = మఱియు; జనాన్ = ప్రజలను.
భావంః-
మంచిగా అలంకరింపబడిన శుభప్రదమైన ఛత్రచామరములను త్యజించి, తన వారిని, రథమును, పౌరులను తదితర ప్రజలను విడిచిపెట్టెను.
గమనికః-
రాజచిహ్నములు- పంచరాజచిహ్నములు- 1) ఛత్రము, 2) చామరము, 3) సింహాసనము, 4) మకుటము, 5) రాజదంము. ఛత్రచామరములు అనగా ఈ పంచ రాజచిహ్నములు అని సంకేతము.
2.19.35.
అనుష్టుప్.
ధారయన్ మనసా దుఃఖమ్
ఇంద్రియాణి నిగృహ్య చ।
ప్రవివేశాత్మవాన్వేశ్మ
మాతురప్రియశంసివాన్॥
టీకః-
ధారయన్ = ధరించి; మనసా = మనస్సుచేత; దుఃఖమ్ = దుఃఖమును; ఇంద్రియాణి = ఇంద్రియములను; నిగృహ్య చ = నిగ్రహించుకొని; చ = మఱియు; ప్రవివేశ = ప్రవేశించెను; ఆత్మవాన్ = మనోధైర్యము గల; వేశ్మ = గృహమును; మాతుః = తల్లి యొక్క; అప్రియ = అయిష్టము; శంసివాన్ = చెప్పువాడై.
భావంః-
మనోధైర్యముగల రాముడు, దుఃఖమును మనసునందే నిలుపుకొని, ఇంద్రియనిగ్రహముతో విననిష్టపడని వార్త తెలియజేయుటకై మాతృ గృహమునకు వెళ్ళెను.
2.19.36.
అనుష్టుప్.
సర్వోహ్యభిజనశ్శ్రీమాన్
శ్రీమతస్సత్యవాదినః।
నాలక్షయత రామస్య
కించదాకారమాననే॥
టీకః-
సర్వః = సమస్తమైన; అభిజనః = చుట్టియున్న ప్రజలు; శ్రీమాన్ = శోభాయమానమైన; శ్రీమతః = శ్రీమంతుడు; సత్యవాదినః = సత్యమునే మాటలాడువాడు; నా = లేదు; లక్షయత = కనుగొనబడుట; రామస్య = రాముని యొక్క; కించత్ = కొంచెమైనను; ఆకారమ్ = మార్పు; ఆననే = ముఖమునందు.
భావంః-
రాముని పరివేష్టించియున్నవారికి, గొప్పతేజోవంతుడు, సత్యసంధుడు ఐన రాముని ముఖములో, ఎటువంటి మార్పు కనపడలేదు.
2.19.37.
అనుష్టుప్.
ఉచితం చ మహాబాహుః
నజహౌహర్షమాత్మనః।
శారద స్సముదీర్ణాంశుః
చంద్రస్తేజ ఇవాత్మజమ్॥
టీకః-
ఉచితం = సహజమైన; చ =పాదపూరణము; మహాబాహుః = గొప్ప భుజ బలముగలవాడు; న = లేదు; జహౌ = విడుచుట; హర్షమ్ = సంతోషమును; ఆత్మనః = తనకు; శారదః = శరదృతువు నందలి; సమ= మిక్కిలి; ఉదీర్ణః = విస్తృతమైన; అంశుః = కిరణములు గల; చంద్రః = చంద్రుని యొక్క; తేజః = కాంతిని; ఇవ = వలె; ఆత్మజమ్ = తన సహజమైన.
భావంః-
శరదృతువు నందలి చంద్రుడు తన విస్ఫారమైన గొప్పకాంతిని విడువకుండునట్లు, రాముడు తన ముఖములో నిత్యము సహజముగ కనుపించు ఆనందమును కోల్పొలేదు.
2.19.38.
అనుష్టుప్.
వాచా మధురయా రామః
సర్వం సమ్మానయన్ జనమ్।
మాతుస్సమీపం ధీరాత్మా
ప్రవివేశ మహాయశాః॥
టీకః-
వాచా = మాటలయందు; మధురయా = మధురమైన; రామః = రాముడు; సర్వం = అందఱిని; సమ్మానయన్ = గౌరవించుచు; జనమ్ = ప్రజలను; మాతుః = తల్లియొక్క; సమీపం = సమీపమును; ధీరాత్మా = ధైర్యవంతుడైన; ప్రవివేశ = వెళ్ళెను; మహాయశాః = గొప్పకీర్తిమంతుడు.
భావంః-
ఆ జనులు అందరు మధురంగా మాట్లాడే రాముని గురవించుచుండిరి. ఈ ధైర్యవంతుడును, గొప్ప కీర్తిమంతుడును ఐన రాముడు తల్లి దగ్గరకు వెళ్ళెను.
2.19.39.
అనుష్టుప్.
తం గుణైస్సమతాం ప్రాప్తో
భ్రాతా విపులవిక్రమః।
సౌమిత్రిరనువవ్రాజ
ధారయన్దుఃఖమాత్మజమ్॥
టీకః-
తం = ఆ; గుణైః = గుణములచే; సమతాం = సమానత్వమును; ప్రాప్తః = పొంది; భ్రాతా = సోదరుడు; విపుల = అమిత; విక్రమః = పరాక్రమవంతుడైన; సౌమిత్రిః = సుమిత్ర పుత్రుడైన లక్ష్మణుడు; అనువవ్రాజ = అనుసరించి వెళ్ళెను; ధారయన్ = నిగ్రహించుకొనుచు; దుఃఖమ్ = దుఃఖమును; ఆత్మజమ్ = మనస్సులో జనించిన.
భావంః-
అమితపరాక్రమవంతుడును, రాముని గుణములవంటి సమానమైన గుణములు కలవాడును,ఆయన సోదరుడును అగు లక్ష్మణుడు, తన మనసులోని బాధను నిగ్రహించుకొనుచు, రాముని అనుసరించి వెళ్ళెను.
2.19.40.
జగతి.
ప్రవిశ్య వేశ్మాతిభృశం ముదాఽ న్వితం
సమీక్ష్య తాం చార్థవిపత్తిమాగతామ్।
న చైవ రామోఽ త్రజగామవిక్రియాం
సుహృజ్జనస్యాత్మవిపత్తిశంకయా॥
టీకః-
ప్రవిశ్య = ప్రవేశించి; వేశ్మ = గృహమును; అతి = మిక్కిలి; భృశం = అధికముగ; ముదా = ఆనందముతో; అన్వితం = కూడిన; సమీక్ష్య = చూచి; తాం = ఆ; చ = పాదపూరణము; అర్ధవిపత్తిమ్ = కార్యనాశనము; ఆగతామ్ = వచ్చిన; న = లేదు; చైవ = పాదపూరణము; రామః = రాముడు; అత్ర = అక్కడ; జగామ = పొందుట; విక్రియాం = వికారమును; సుహృజ్జనస్య = మిత్రులకు; ఆత్మవిపత్తి = ఆత్మకు (మనస్సుకు) ఆపద కలుగునేమో అను; శంకయా = అనుమానముచే.
భావంః-
రాముడు తన తల్లి గృహములోనికి ప్రవేశించిన సమయమున, అక్కడ అంతయు ఆనందభరితముగ నుండెను. రాముడు అటువంటి సమయమున తనకు కలిగిన కార్యవినాశనమును గూర్చి తెలియజేసినచో అక్కడి వారికి ప్రాణసంకటమేర్పడునేమో యను శంకతో తానేమియు వికారము వ్యక్త పరచలేదు.
2.19.41.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే ఏకోనవింశస్సర్గః॥
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; ఏకోనవింశః [19] = పంతొమ్మిదవ; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [19] పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము.
2.20.1.
అనుష్టుప్.
తస్మింస్తు పురుషవ్యాఘ్రే
నిష్క్రామతి కృతాంజలౌ।
ఆర్తశబ్దో మహాన్ జజ్ఞే
స్త్రీణామంతఃపురే తదా॥
టీకః-
తస్మిన్ = ఆ; పురుషవ్యాఘ్రే = పురుషోత్తముడైన; నిష్క్రామతి = బయలుదేరుచుండగా; కృతాంజలౌ = చేయబడిన దోసిలి కలవాడై; ఆర్తశబ్దః = ఏడ్పుల రొదలతో; మహాన్ = పెద్దగ; జజ్ఞే = కలిగెను; స్త్రీణామ్ = స్త్రీలయొక్క; అంతఃపురే = అంతఃపురమునందు; తదా = అప్పుడు.
భావంః-
అప్పుడు రాముడు తండ్రికి అంజలి ఘటించి నమస్కరించి బయలుదేరుచుండగా, అంతఃపుర స్త్రీలు బిగ్గరగా విలపించిరి.
2.20.2.
అనుష్టుప్.
కృత్యేష్వచోదితః పిత్రా
సర్వస్యాంతఃపురస్య చ।
గతిర్యశ్శరణం చాపి
స రామోఽ ద్య ప్రవత్స్యతి॥
టీకః-
కృత్యేషు = కార్యములను చేయుటలో; అచోదితః = ప్రేరేరేపించబడ కున్నను; పిత్రా = తండ్రిచే; సర్వస్య = సమస్తమైన; అంతఃపురస్య = అంతఃపురమునకు; చ = మఱియు; గతిః = ఆధారపడతగిన వాడు; యః = ఏ; శరణం = రక్షకుడు గాను; ఆసీత్ = అయ్యెనో; సః రామః = ఆ రాముడు; అద్య = ఇప్పుడు; ప్రవత్స్యతి = ప్రవాసము పోవుచున్నాడు.
భావంః-
తండ్రి చెప్పకపోయినను, సకల కార్యములు చేసెడివాడునూ, అంతఃపురము నంతటికిని ఆధారపడతగినవానిగానూ, రక్షకుడిగాను ఉండెడి వాడునూ. అట్టి రాముడు, ఇప్పుడు అరణ్యవాసమునకు వెళ్ళిపోవుచున్నాడు.
2.20.3.
అనుష్టుప్.
కౌసల్యాయాం యథా యుక్తో
జనన్యాం వర్తతే సదా।
తథైవ వర్తతేఽ స్మాసు
జన్మప్రభృతి రాఘవః॥
టీకః-
కౌసల్యాయాం = కౌసల్య యందు; యథా = ఏట్లైతే; యుక్తః = కలిగి ఉండుట; జనన్యాం = తల్లి ఐన; వర్తతే = ప్రవర్తించుచున్నాడో; సదా = ఎప్పుడును; తథా ఏవ = అట్లనే; వర్తతే = ప్రవర్తించుచున్నాడు; అస్మాసు = మన విషయమునందు కూడ; జన్మప్రభృతి = పుట్టినది మొదలుగ; రాఘవః = రాముడు.
భావంః-
రాముడు జన్మించినప్పటినుండి, తన తల్లి ఐన కౌసల్యతో ఎంత భక్తిశ్రద్ధలతో ప్రవర్తించుచున్నాడో, మన విషయమున కూడ అట్లే ప్రవర్తించుచున్నాడు.
2.20.4.
అనుష్టుప్.
న క్రుధ్యత్యభిశప్తోఽ పి
క్రోధనీయాని వర్జయన్।
క్రుద్ధాన్ప్రసాదయన్సర్వాన్
స ఇతోఽ ద్య ప్రవత్స్యతి॥
టీకః-
న = లేదు; క్రుధ్యతి = కోపగించుట; అభిశస్తః అపి = నిందింపబడిన కూడ; క్రోధనీయాని = కోపము కలిగించు పనులు; వర్జయన్ = వదలివేయుచు; క్రుద్ధాన్ = కోపగించినచో; ప్రసాదయన్ = ప్రసన్నము చేసికొనుచు; సర్వాన్ = అందరిని; సః = అటువంటి; ఇతః = ఇక్కడనుండి; అద్య = నేడు; ప్రవత్స్యతి = ప్రవాసమునకు పోవుచున్నాడు.
భావంః-
కోపము కలిగించు పనులను చేయక, కోపము కలిగినవారిని శాంతపరచుచు, తనను నిందించువారిని కూడ కోపగింపక ఉండెడివాడు. అటువంటి రాముడు నేడు అరణ్యవాసమునకు వెళ్ళిపోవుచున్నాడు.
2.20.5.
అనుష్టుప్.
అబుద్ధిర్బత నో రాజా
జీవలోకం చరత్యయమ్।
యో గతిం సర్వభూతానామ్
పరిత్యజతి రాఘవమ్॥
టీకః-
అబుద్ధిః = బుద్ధిలేనివాడు; నః = మన; రాజా = రాజు; జీవలోకం = జీవులు నివసించియుండు లోకమును; చరతి = నశింపజేయుచున్నాడు; అయమ్ = ఈ; యః = ఏ దశరథమహారాజు; గతిం = రక్షకుడు ఐన; సర్వభూతానాం = సమస్తప్రాణులకు; పరిత్యజతి = విడుచుచున్నాడో; రాఘవమ్ = రాముని.
భావంః-
బుద్ధిలేని మన దశరథమహారాజు, సమస్తప్రాణులకు రక్షకుడైన రాముని వదిలివేసి, సకలప్రాణులను నశింప చేయుచున్నాడు.
2.20.6.
అనుష్టుప్.
ఇతి సర్వా మహిష్యస్తా
వివత్సా ఇవ ధేనవః।
పతిమాచుక్రుశుశ్చైవ
సస్వరం చాపి చుక్రుశుః॥
టీకః-
ఇతి = ఈ విధముగ; సర్వాః = సకల; మహిష్యః =పట్టపురాణులు; తాః = ఆ; వివత్సాః = దూడలను కోల్పోయిన; ఇవ = వలె; ధేనవః = ఆవులు; పతిమ్ = భర్తను; ఆచుక్రుశుశ్చ = నిందజేసిరి; ఏవ = కూడ; సస్వరం = బిగ్గరగా; చ = పాదపూరణము; అపి = కూడ; చుక్రుశుః = ఏడ్చిరి.
భావంః-
ఆ దశరథమహారాజు భార్యలు ఇట్లు దూడలను కోల్పోయిన ఆవులవలె, బిగ్గరగా విలపించుచు, తమ భర్తను నిందించిరి.
2.20.7.
అనుష్టుప్.
స హి చాంతఃపురే ఘోరమ్
ఆర్తశబ్దం మహీపతిః।
పుత్రశోకాభిసంతప్తః
శ్రుత్వా వ్యాలీయతాఽ సనే॥
టీకః-
సః = అతడు; అంతఃపురే = అంతఃపురమునందు; ఘోరమ్ = ఘోరమైన; ఆర్తశబ్దం = బిగ్గరగా విలపిస్తున్న ధ్వనిని; మహీపతిః = రాజు; పుత్రశోకాః = పుత్రశోకముతో; అభిసంతప్తః = మిక్కిలి పీడితుడై; శ్రుత్వా = విని; వ్యాలీయత = కూలబడిపోయెను; ఆసనే = ఆసనమునందు.
భావంః-
దశరథ మహారాజు, అంతఃపురములో వెలువడిన ఆ ఘోరమైన ఆర్తనాదమును విని, పుత్రశోకముతో పీడితుడై ఆసనముపై కూలబడిపోయెను.
2.20.8.
అనుష్టుప్.
రామస్తు భృశమాయస్తో
నిశ్శ్వసన్నివ కుంజరః।
జగామ సహితో భ్రాత్రా
మాతురంతఃపురం వశీ॥
టీకః-
రామస్తు = రాముడైతే; భృశమ్ = చాల; ఆయస్తః = దుఃఖితుడై; నిశ్శ్వసన్ = నిట్టూర్చుచు; ఇవ = వలె; కుంజరః = ఏనుగు; జగామ = వెళ్ళెను; సహితః = కూడి; భ్రాత్రా = సోదరునితో; మాతుః = తల్లి యొక్క; అంతఃపురం = అంతఃపురమును గూర్చి; వశీ = ఇంద్రియములను నిగ్రహించువాడు.
భావంః-
దుఃఖభరితుడైన రాముడు, ఏనుగువలె నిట్టూర్చుచు, ఇంద్రియనిగ్రహముతో, లక్ష్మణసమేతుడై తన తల్లి అంతఃపురమునకు వెళ్ళెను.
2.20.9.
అనుష్టుప్.
సోఽ పశ్యత్పురుషం తత్ర
వృద్ధం పరమపూజితమ్।
ఉపవిష్టం గృహద్వారి
తిష్ఠతశ్చాపరాన్బహూన్॥
టీకః-
సః = అతడు; ఆపశ్యత్ = చూచెను; పురుషం = పురుషుని; తత్ర = అక్కడ; వృద్ధం = వృద్ధుడైన; పరమపూజితమ్ = చాలా పూజింపబడిన; ఉపవిష్టం = కూర్చునియున్న; గృహద్వారి = గృహద్వారమువద్ద; తిష్ఠతః = నిలబడియున్న; అపరాన్ = ఇతరులను; బహూన్ = అనేకమైన.
భావంః-
రాముడు ఆ గృహద్వార సమీపమున కూర్చొనియున్న పూజనీయుడైన వృద్ధపురుషుని అక్కడనే నిలబడియున్న మరికొందరిని చూచెను.
2.20.10.
అనుష్టుప్.
దృష్ట్వైవ తు తదా రామమ్
తే సర్వే సహసోత్థితాః।
జయేన జయతాం శ్రేష్ఠమ్
వర్ధయంతి స్మ రాఘవమ్॥
టీకః-
దృష్ట్వైవ = చూచినంతనే; తదా = అప్పుడు; రామమ్ = రాముని; తే సర్వే = వారందరును; సహసా = వెంటనే; ఉత్థితాః = లేచినవారై; జయేన = జయముచే; జయతాం = జయించువారిలో; శ్రేష్ఠమ్ = శ్రేష్ఠుడైన; వర్ధయంతి స్మ = వృద్ధిపొందించిరి; రాఘవమ్ = రాముని.
భావంః-
రాముని చూచిన వెంటనే వారందరు లేచి, విజేయులలో శ్రేష్ఠుడైన అతనిని "నీకు జయమగుగాక" అని శుభాభినందనలను తెలిపిరి.
2.20.11.
అనుష్టుప్.
ప్రవిశ్య ప్రథమాం కక్ష్యామ్
ద్వితీయాయాం దదర్శ సః।
బ్రాహ్మణాన్వేదసమ్పన్నాన్
వృద్ధాన్రాజ్ఞాఽ భిసత్కృతాన్॥
టీకః-
ప్రవిశ్య = ప్రవేశించి; ప్రథమాం = మొదటి; కక్ష్యామ్ = ద్వారమును; ద్వితీయాయాం = రెండవద్వారమునందు; దదర్శ = చూసెను; సః = అతడు; బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను; వేదసంపన్నాన్ = వేదశాస్త్రమును బాగా ఎరిగిన వారు; వృద్ధాన్ = పెద్దలు; రాజ్ఞా = రాజుచేత; అభిసత్కృతాన్ = సత్కరింపబడిన వారు.
భావంః-
రాముడు మొదటి ద్వారమును దాటి, రెండవద్వారములో ప్రవేశించి అక్కడ, రాజసత్కారము బడసిన వేదవిదులైన వృద్ధ బ్రాహ్మణులను చూసెను.
2.20.12.
అనుష్టుప్.
ప్రణమ్య రామస్తాన్విప్రాన్
తృతీయాయాం దదర్శ సః।
స్త్రియో వృద్ధాస్తథా బాలా
ద్వారరక్షణతత్పరాః॥
టీకః-
ప్రణమ్య = నమస్కరించి; రామః = రాముడు; తాన్ = ఆ; విప్రాన్ = బ్రాహ్మణులను; తృతీయాయాం = మూడవ ద్వారము వద్ద; దదర్శ = చూసెను; సః = అతడు; స్త్రియః = స్త్రీలను; వృద్ధాః = వృద్ధులైన; తథా = మరియు; బాలాః = బాలలను; ద్వారరక్షణతత్పరాః = ద్వారపాలన చేయుట యందు ఆసక్తి కలవారు.
భావంః-
రాముడు ఆ బ్రాహ్మణులకు ప్రణమిల్లి, మూడవ ద్వారమువద్ద, ద్వారమును రక్షించు వృద్ధ స్త్రీలను, బాలలను చూసెను.
2.20.13.
అనుష్టుప్.
వర్ధయిత్వా ప్రహృష్టాస్తాః
ప్రవిశ్య చ గృహం స్త్రియః।
న్యవేదయంత త్వరితా
రామమాతుః ప్రియం తదా॥
టీకః-
వర్ధయిత్వా = జయజయధ్వానములతో వర్ధింపజేసి; ప్రహృష్టాః = సంతోషించినవారై; తాః = ఆ; ప్రవిశ్య = ప్రవేశించి; గృహం = గృహమును; స్త్రియః = స్త్రీలు; న్యవేదయంత = తెలియజేసిరి; త్వరితాః = శీఘ్రముగా వెళ్ళిన వారై; రామమాతుః = రాముని తల్లి ఐన కౌసల్యకు; ప్రియం = ప్రియమును; తదా = అప్పుడు.
భావంః-
ఆ వృద్ధస్త్రీలు సంతోషముగ, రాముని జయజయధ్వానములతో కీర్తించి, వేగముగా కౌసల్య గృహములోనికి ప్రవేశించి, రాముని రాకను కౌసల్యకు తెలియజేసిరి.
2.20.14.
అనుష్టుప్.
కౌసల్యాపి తదా దేవీ
రాత్రిం స్థిత్వా సమాహితా।
ప్రభాతే త్వకరోత్పూజామ్
విష్ణోః పుత్రహితైషిణీ॥
టీకః-
కౌసల్యా = కౌసల్య; అపి = కూడ; తదా = అప్పుడు; దేవీ = దేవీ; రాత్రిం = రాత్రి సమయమున; స్థిత్వా = ఉండి; సమాహితా = నియమముగా; ప్రభాతే = ప్రొద్దున; అకరోత్ = చేసెను; పూజాం = పూజను; విష్ణోః = విష్ణువుయొక్క; పుత్రహితైషిణీ = పుత్రుని క్షేమము కోరుచు.
భావంః-
కౌసల్య రాత్రి అంతయు నియమముగ ఉండి, మరుసటి ప్రాతఃసమయమున, రాముని క్షేమము కోరుచు విష్ణువును పూజించినది.
2.20.15.
అనుష్టుప్.
సా క్షౌమవసనా హృష్టా
నిత్యం వ్రతపరాయణా।
అగ్నిం జుహోతి స్మ తదా
మంత్రవత్కృతమంగళా॥
టీకః-
సా = ఆమె; క్షౌమవసనా = తెల్లని పట్టుచీర ధరించి; హృష్టా = సంతోషముగ; నిత్యం = ఎల్లప్పుడు; వ్రతపరాయణా = వ్రతములాచరించుట యందు ఆసక్తిగల; అగ్నిం = అగ్మిని; జుహోతి = హోమము చేయుచుండుట యందు; స్మ = గడుపుచుండెను; తదా = అప్పుడు; మంత్రవత్ = మంత్రపూర్వకముగ; కృతమంగళా = మంగళకరముగ.
భావంః-
అప్పుడు నిత్యము వ్రతములు చేయుట యందాసక్తి కలిగియున్న కౌసల్య, తెల్లని పట్టుచీర ధరించి, సంతోషముగా మంత్రసహితముగ హోమము చేయించుచుండెను.
2.20.16.
అనుష్టుప్.
ప్రవిశ్య చ తదా రామో
మాతురంతఃపురం శుభమ్।
దదర్శ మాతరం తత్ర
హావయంతీం హుతాశనమ్॥
టీకః-
ప్రవిశ్య = ప్రవేశించి; తదా = అప్పుడు; రామః = రాముడు; మాతుః = తల్లియొక్క; అంతఃపురం = అంతఃపురమును; శుభమ్ = శుభకరమైన; దదర్శ = చూసెను; మాతరం = తల్లిని; తత్ర = అక్కడ; హావయంతీం = హవనము చేయించుచున్న; హుతాశనమ్ = అగ్నిని.
భావంః-
రాముడు, శుభకరమైన తల్లి అంతఃపురములో ప్రవేశించి, అక్కడ తనతల్లి కౌసల్య హోమము చేయించుట చూసెను.
2.20.17.
అనుష్టుప్.
దేవకార్యనిమిత్తం చ
తత్రాపశ్యత్సముద్యతమ్।
దధ్యక్షతం ఘృతం చైవ
మోదకాన్హవిషస్తథా॥
టీకః-
దేవకార్య = దేవకార్యము; నిమిత్తం = కొఱకై; చ = పాదపూరణము; తత్ర = అక్కడ; అపశ్యత్ = చూచెను; సముద్యతమ్ = సిద్ధముగా ఉంచబడిన ద్రవ్యములను; దధి = పెరుగు; అక్షతం = అక్షతలను; ఘృతం = నెయ్యిని; మోదకాన్ = ఉండ్రాళ్ళను; హవిషః = హవిస్సులను; తదా = అప్పుడు.
భావంః-
రాముడు అప్పుడు దైవకార్యార్థమై సిద్ధపరచబడి ఉంచిన పెరుగును, అక్షతలను, నెయ్యిని, మోదకములను, హవిస్సులను చూచెను.
2.20.18.
అనుష్టుప్.
లాజాన్మాల్యాని శుక్లాని
పాయసం కృసరం తథా।
సమిధః పూర్ణకుమ్భాంశ్చ
దదర్శ రఘునందనః॥
టీకః-
లాజాన్ = పేలాలను; మాల్యాని = పూలదండలను; శుక్లాని = తెల్లని; పాయసం = పాయసమును; కృసరం = పులగమును; తథా = మరియు; సమిధః = హోమాగ్నిలో వేయబడు రావి, మోదుగ ఇత్యాది చిన్నచిన్న కఱ్రముక్కలు; పూర్ణకుంభాశ్చ = పూర్ణకుంభములను; దదర్శ = చూసెను; రఘునందనః = రాముడు.
భావంః-
రాముడు మరియు పేలాలను, తెల్లని పూలమాలలను, పాయసమును, హరిద్రాన్నమును, సమిధలను, పూర్ణకుంభములను చూసెను.
2.20.19.
అనుష్టుప్.
తాం శుక్లక్షౌమసంవీతామ్
వ్రతయోగేన కర్శితామ్।
తర్పయంతీం దదర్శాద్భిః
దేవతాం దేవవర్ణినీమ్॥
టీకః-
తాం = ఆమెను; శుక్ల = తెల్లని; క్షౌమ = పట్టుచీర; సంవీతామ్ = ధరించినదియును; వ్రత = వ్రతము; యోగేన = ఆచరించుటచేత; కర్శితామ్ = అలసినదియును; తర్పయంతీం = తృప్తిచెందినదియును; దదర్శ = చూచెను; అద్భిః = జలముతో; దేవతాం = దేవతలను; దేవ = దేవతలవలె; వర్ణినీమ్ = పచ్చని పసుపు వర్ణము కలామెను.
భావంః-
తెల్లనిపట్టుచీర ధరించి దేవత వలె పచ్చని పసుపుఛాయతో మెఱసిపోతున్న కౌసల్యాదేవి దేవతలకు తర్పణములిచ్చి, తృప్తిగా వ్రతములు చేసి అలసటతో ఉండెను. అట్లున్న తల్లి కౌసల్యాదేవిని రాముడు చూచెను.
2.20.20.
అనుష్టుప్.
సా చిరస్యాత్మజం దృష్ట్వా
మాతృనందనమాగతమ్।
అభిచక్రామ సంహృష్టా
కిశోరం బడబా యథా॥
టీకః-
సా = ఆమె; చిరస్య = చాలకాలము తరువాత; ఆత్మజం = తన కుమారుని; దృష్ట్వా = చూసి; మాతృనందనమ్ = తల్లికి ఆనందము కలుగజేయు; ఆగతమ్ = వచ్చియున్న; అభిచక్రామ = ఎదురుగా వెళ్ళెను; సంహృష్టా = సంతోషముగ; కిశోరం = తనపిల్లను, పుత్రుని; బడబా = ఆడగుఱ్రము; యథా = వలె.
భావంః-
తల్లికి ఆనందమును చేకూర్చు రాముడు, చాలకాలమునకు వచ్చినందులకు కౌసల్య సంతోషముగ రామునికెదురేగి, ఒక ఆడగుఱ్రము తన పిల్లను సమీపించినట్లు, తన పుత్రుని సమీపించెను.
2.20.21.
అనుష్టుప్.
స మాతరమభిక్రాంతామ్
ఉపసంగృహ్య రాఘవః।
పరిష్వక్తశ్చ బాహుభ్యామ్
ఉపాఘ్రాతశ్చ మూర్ధని॥
టీకః-
సః = ఆ; మాతరమ్ = తల్లిని; అభిక్రాంతమ్ = దగ్గరకు వచ్చిన; ఉపసంగృహ్య = పాదాభివందనముచేసి; రాఘవః = రాముడు; పరిష్వక్తః = కౌలిగింపబడెను; బాహుభ్యామ్ = బాహువులచే; ఉపాఘ్రాతశ్చ = వాసన చూడబడెను; మూర్ధని = శిరస్సుయందు.
భావంః-
శ్రీరాముడు ఎదురు వచ్చిన తల్లికి పాదాభివందనము చేసెను. అపుడు కౌసల్య తన తనయుని ఆలింగనము చేసుకొని అతని శిరసును ముద్దాడెను.
2.20.22.
అనుష్టుప్.
తమువాచ దురాధర్షమ్
రాఘవం సుతమాత్మనః।
కౌసల్యా పుత్రవాత్సల్యాత్
ఇదం ప్రియహితం వచః॥
టీకః-
తమ్ = ఆ; ఉవాచ = పలికెను; దురాధర్షమ్ = ఎదురింపబడరాని వానిని; రాఘవం = రామునిగూర్చి; సుతమ్ = పుత్రుడైన; ఆత్మనః = తన యొక్క; పుత్రవాత్సల్యాత్ = పుత్రునిపై ఉన్న అభిమానముతో; ఇదం = ఈ; ప్రియహితం = ప్రియమైనవి మరియు హితము చేకూర్చునవి; వచః = మాటలను.
భావంః-
కౌసల్య, ఎదురింపబడరాని తన పుత్రుడైన రామునితో, పుత్రాభిమానముతో ప్రియమును, హితమును కలిగించు మాటలను పలికెను.
2.20.23.
అనుష్టుప్.
“వృద్ధానాం ధర్మశీలానామ్
రాజర్షీణాం మహాత్మనామ్।
ప్రాప్నుహ్యాయుశ్చ కీర్తిం చ
ధర్మం చోపహితం కులే॥
టీకః-
వృద్ధానాం = వృద్ధులను; ధర్మశీలానాం = ధర్మపరాయణులను; రాజర్షీణాం = రాజర్షులయొక్క; మహాత్మానామ్ = మహాత్ములను; ప్రాప్నుహి = పొందుము; ఆయుః = ఆయుర్దాయమును; మఱియు; కీర్తిం = కీర్తిని; చ = మఱియు; ధర్మం = ధర్మమును; మఱియు; ఉపహితం = చాల కాలమునుండి ఉన్న; కులే = వంశమునందు.
భావంః-
”నీవు వృద్ధులు, ధర్మపరాయణులు, మహాత్ములును ఐన రాజర్షులకు ఉండెడి దీర్ఘాయువును కీర్తిని పొందియుందువుగాక.
2.20.24.
అనుష్టుప్.
సత్యప్రతిజ్ఞం పితరమ్
రాజానం పశ్య రాఘవ।
అద్యైవ హి త్వాం ధర్మాత్మా
యౌవరాజ్యేఽ భిషేక్ష్యతి”॥
టీకః-
సత్యప్రతిజ్ఞం = చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టువానిని; పితరమ్ = తండ్రియైన; రాజానం = రాజును; పశ్య = చూడుము; రాఘవ = రామా; అద్య ఏవ హి = ఈనాడే; త్వాం = నిన్ను; ధర్మాత్మా = ధర్మాత్ముడు; యౌవరాజ్యే = యౌవరాజ్యమున; అభిషేక్ష్యతి = అభిషిక్తుని చేయగలడు.
భావంః-
రామా! నీ తండ్రి ఐన దశరథమహారాజు చేసిన చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకొనుట పాటించును. నిన్ను నేడే యౌవరాజ్యమునందు అభిషిక్తుని చేయును, చూడుము.”
2.20.25.
అనుష్టుప్.
దత్తమాసనమాలభ్య
భోజనేన నిమంత్రితః।
మాతరం రాఘవః కించిత్
ప్రసార్యాంజలిమబ్రవీత్॥
టీకః-
దత్తమ్ = ఇవ్వబడిన; ఆసనమ్ = ఆసనమును; ఆలభ్య = జేర్లాపడి; భోజనేన = భోజనముచే; నిమంత్రితః = పిలువబడిన; మాతరం = తల్లిని గూర్చి; రాఘవః = రాముడు; కించిత్ = కొంచెము; ప్రాసార్య = పైకి ఎత్తి; అంజలిమ్ = దోసిలిని; అబ్రవీత్ = పలికెను.
భావంః-
ఇట్లు కౌసల్య పలుకుచు, రాముని భోజనమునకు ఆహ్వానింపగా, రాముడు తల్లి ఒసగిన ఆసనమును జేర్లాపడి నిలబడి, ఆమెకు చేతులు కొద్దిగా ఎత్తి నమస్కరించుచు ఇట్లు పలికెను.
2.20.26.
అనుష్టుప్.
స స్వభావవినీతశ్చ
గౌరవాచ్చ తదా నతః।
ప్రస్థితో దండకారణ్యమ్
ఆప్రష్టుముపచక్రమే॥
టీకః-
సః = అతను; స్వభావ = సహజముగ; వినీతశ్చ = వినయశీలుడు; గౌరవాత్ = గౌరవమువలన; తదా = అప్పుడు; నతః = వినమ్రతతో వంగినవాడు; ప్రస్థితః = ప్రయాణమైనవాడు; దండకారణ్యమ్ = దండకారణ్యమును గూర్చి; ఆప్రష్టుమ్ = అనుమతి తీసుకొనుటకు; ఉపచక్రమే = ఆరంభించెను.
భావంః-
సహజముగ వినయశీలుడైన శ్రీరాముడు, దండకారణ్యమునకు ప్రయాణమగుటకై ఆమె అనుమతి కొరకై వినమ్రుడై ప్రార్థించెను.
2.20.27.
అనుష్టుప్.
“దేవి! నూనం న జానీషే
మహద్భయముపస్థితమ్।
ఇదం తవ చ దుఃఖాయ
వైదేహ్యా లక్ష్మణస్య చ॥
టీకః-
దేవి = అమ్మా; నూనం = నిశ్చయముగ; న = లేదు; జానీషే = తెలియుట; మహత్ = పెను; భయమ్ = భయంకరమును; ఉపస్థితమ్ = వచ్చిన; ఇదం = ఇది; తవ = నీకు; దుఃఖాయ = దుఃఖము కలిగించుటకొఱకు; వైదేహ్యా = సీతకు; లక్ష్మణస్య = లక్ష్మణునకు; చ = కూడ.
భావంః-
అమ్మా! నీకును, సీతకును, లక్ష్మణునకును దుఃఖము కలిగింప వచ్చిన పెద్ద ఆపదను నీవు ఎరుగకున్నావు.
2.20.28.
అనుష్టుప్.
గమిష్యే దండకారణ్యమ్
కిమనేనాసనేన మే।
విష్టరాసనయోగ్యో హి
కాలోఽ యం మాముపస్థితః॥
టీకః-
గమిష్యే = వెళ్ళనున్నాను; దండకారణ్యమ్ = దండకారణ్యమును గూర్చి; కిమ్ = ఏమి; అనేన = దీనితో; ఆసనేన = ఆసనముతో; మే = నాకు; విష్టరాసన = దర్భాసనమునకు; యోగ్యః = తగిన; కాలః = సమయము; అయమ్ = ఈ; మామ్ = నేను; ఉపస్థితః = ఆసన్నమైనది.
భావంః-
నేను దండకారణ్యమునకు వెళ్ళనున్నాను. నాకు ఈ ఆసనమెందులకు? నేను దర్భాసనముపై కూర్చుండవలసిన సమయమాసన్నమైనది.
గమనికః-
విష్టరాసనము- గోవిందరాజీయవ్యాఖ్య “పంచాశద్భిర్భవేద్భ్రహ్మాతదర్ధేన తు విష్టరము” ఇతిస్మృతేః. 25 దర్భలతో ఏర్పరచబడునది విష్టరాసనము. 50 దర్భలతో సిద్దము చేయబడునది ధర్మాసనము- బ్రహ్మాసనము. సౌజన్యము పుల్లెల వారి రామాయణము.
2.20.29.
అనుష్టుప్.
చతుర్దశ హి వర్షాణి
వత్స్యామి విజనే వనే।
మధుమూలఫలైర్జీవన్
హిత్వా మునివదామిషమ్॥
టీకః-
చతుర్దశ = పదునాలుగు; వర్షాణి = సంవత్సరములు; వత్స్యామి = నివసించెదను; విజనే = నిర్మానుష్యమైన; వనే = అరణ్యమునందు; మధు మూల ఫలైః = తేనె; దుంపలు; పండ్లతో; జీవన్ = జీవించుచు; హిత్వా = విడిచి; మునివత్ = మునుల వలె; ఆమిషమ్ = మాంసమును.
భావంః-
నేను రాజభోగములైన మాంసాహారాదులు త్యజించి, తేనె, కందమూలములు, పండ్లను తినుచు, నిర్మానుష్యమైన అడవిలో మునుల వలె నివసింపబోవనున్నాను.
గమనికః-
అమిషం హిత్వా- రాజభోగములను త్యజించి అనుట.
2.20.30.
అనుష్టుప్.
భరతాయ మహారాజో
యౌవరాజ్యం ప్రయచ్ఛతి।
మాం పునర్దండకారణ్యే
వివాసయతి తాపసమ్॥
టీకః-
భరతాయ = భరతునకు; మహారాజః = మహారాజు; యౌవరాజ్యం = యౌవరాజ్యమును; ప్రయచ్ఛతి = ఇవ్వనున్నాడు; మాం = నన్ను; పునః = మరల; దండకారణ్యే = దండకారణ్యమునందు; వివాసయతి = దూరముగా నివసింప జేయుచున్నాడు; తాపసమ్ = మునివలె.
భావంః-
మహారాజు, యౌవరాజ్యమును భరతునకు ఇచ్చి, నన్ను మునివలె దండకారణ్యమున నివసించునట్లు చేయుచున్నాడు.
2.20.31.
అనుష్టుప్.
స షట్చాష్టౌ చ వర్షాణి
వత్స్యామి విజనే వనే।
ఆసేవమానో వన్యాని
ఫలమూలైశ్చ వర్తయన్”॥
టీకః-
సః = నేను; షట్ చ అష్టౌ చ = పదునాలుగు; వర్షాణి = సంవత్సరములు; వత్స్యామి = నివసించెదను; విజనే = నిర్మానుష్యమైన; వనే = అరణ్యమునందు; ఆసేవమానః = సేవించుచు; వన్యాని = అరణ్యమున లభించు వాటిని; ఫల = పండ్లు; మూలైః = కందమూలములతోను; చ = కూడ; వర్తయన్ = జీవనము చేయుచు.
భావంః-
నేను అరణ్యమున లభించు పండ్లు, కందమూలములను సేవించుచు, పదునాలుగు సంవత్సరములు జీవించవలెను.”
2.20.32.
అనుష్టుప్.
సా నికృత్తేవ సాలస్య
యష్టిః పరశునా వనే।
పపాత సహసా దేవీ!
దేవతేవ దివశ్చ్యుతా॥
టీకః-
సా = ఆ; నికృత్త = ఖండింపబడిన; ఏవ = అట్టిది; సాలస్య = సాలవృక్షముయొక్క; యష్టిః = బోదె; పరశునా = గొడ్డలిచే; వనే = వనమునందు; పపాత = పడెను; సహసా = వెంటనే; దేవీ = కౌసల్యాదేవి; దేవత = దేవత; ఇవ = వలె; దివః = స్వర్గమునుండి; చ్యుత = జారిన.
భావంః-
కౌసల్యా దేవి, రాముడు చెప్పిన మాటలు విని, గొడ్డలిచే నఱకబడిన మద్దిచెట్టుబోదెవలె, దివినుండి భువిపైకి జారిన దేవతవలె, నేలపై పడిపోయెను.
2.20.33.
అనుష్టుప్.
తామదుఃఖోచితాం దృష్ట్వా
పతితాం కదలీమివ।
రామస్తూత్థాపయామాస
మాతరం గతచేతసమ్॥
టీకః-
తామ్ = ఆ; అదుఃఖోచితాం = దుఃఖించుటకు తగనిది; దృష్ట్వా = చూసి; పతితా = పడియున్న; కదళీం = అరటిబోదె; ఇవ = వలె; రామః = రాముడు; ఉత్థాపయామాస = పైకి లేవనెత్తెను; మాతరం = తల్లిని; గతచేతసమ్ = స్పృహ కోల్పోయిన.
భావంః-
స్పృహ కోల్పోయి అరటిచెట్టు వలె నేలపై పడియున్న తల్లిని చూచి, ఆమె దుఃఖించుటకు తగదని భావించి, ఆమెను పైకి లేవనెత్తెను.
2.20.34.
అనుష్టుప్.
ఉపావృత్త్యోత్థితాం దీనామ్
బడబామివ వాహితామ్।
పాంసుకుంఠితసర్వాంగీమ్
విమమర్శ చ పాణినా॥
టీకః-
ఉప ఆవృత్య = దొర్లి; ఉత్థితాం = లేచినది; దీనామ్ = దీనురాలును; బడబామ్ = ఆడుగుఱ్రము; ఇవ = వలె; వాహితామ్ = బరువు మోయింప జేసిన; పాంసు = దుమ్ము; కుంఠిత = అంటిన; సర్వ = సకల; అంగీమ్ = అవయవములు కలది; విమమర్శ = తాకెను; చ = పాదపూరణము; పాణినా = చేతితో.
భావంః-
బరువుమోయలేని ఆడుగుఱ్రము, నేలపై బడి, దొరలి, దుమ్ము కొట్టుకు పోయిమ అవయవములతో లేచినట్లు, దీనముగా ఉన్న కౌసల్యను రాముడు చేతితో తాకెను.
2.20.35.
అనుష్టుప్.
సా రాఘవముపాసీనమ్
అసుఖార్తా సుఖోచితా।
ఉవాచ పురుషవ్యాఘ్రమ్
ఉపశృణ్వతి లక్ష్మణే॥
టీకః-
సా = ఆమె; రాఘవమ్ = రామునిగూర్చి; ఉపాసీనమ్ = చెంతన కూర్చొని యున్న; అసుఖాః = దుఃఖముచే; ఆర్తా = పీడితురాలై; సుఖః = సుఖపడుటకు; ఉచితా = తగినది; ఉవాచ = పలికెను; పురుషవ్యాఘ్రమ్ = పురుషోత్తముడైన ( పురుషులలో ఉత్తముడైన); ఉపశృణ్వతి = వినుచుండగ; లక్ష్మణే = లక్ష్మణుడు.
భావంః-
సుఖపడబోవునదై యుండి, దుఃఖితురాలైన కౌసల్య, లక్ష్మణుడు వినుచుండగ, తన చెంతనే కూర్చొని యున్న పురుషశ్రేష్ఠుడైన రామునితో ఇట్లు పలికెను.
2.20.36.
అనుష్టుప్.
“యది పుత్ర న జాయేథా
మమ శోకాయ రాఘవ!।
న స్మ దుఃఖమతో భూయః
పశ్యేయమహమప్రజాః॥
టీకః-
యది = ఒకవేళ; పుత్ర = కుమారా; నజాయేథాః = జన్మించక పోయినచో; మమ = నాకు; శోకాయ = దుఃఖము కలిగించుటకై; రాఘవ = రామా; న = కాను; స్మ = ఉండెడి దానను; దుఃఖమ్ = దుఃఖమును; అతః = దీనికన్న; భూయః = ఎక్కువ; పశ్యేయమ్ = చూచి; అహమ్ = నేను; అప్రజాః = సంతానము లేక.
భావంః-
”రామా! నీవు జన్మించకపోయినచో నాకు ఇంత దుఃఖముండెడిది కాదు. నాకు దుఃఖమును కలిగించుటకే నీవు జన్మించినావు.
2.20.37.
అనుష్టుప్.
ఏక ఏవ హి వంధ్యాయా
శ్శోకో భవతి మానసః।
అప్రజాఽ స్మీతి సంతాపో
న హ్యన్యః పుత్ర! విద్యతే॥
టీకః-
ఏకః = ఒక్క; ఏవ = మాత్రమే; హి = కదా; వంధ్యాయాః = గొడ్రాలికి; శోకః = శోకము; భవతి = ఉండును; మానసః = మానసిక; అప్రజాః = సంతానములేనిదానను; అస్మి = ఐ ఉన్నాను; ఇతి = అని; సంతాపః = సంతాపము; న = ఉండదు; అన్యః = మరి యొకటి; పుత్ర = కుమారా; విద్యతే = కలుగుట.
భావంః-
కుమారా! తనకు సంతానము లేదను మానసికవ్యధ తప్ప గొడ్రాలికి మరియొక చింత ఉండదుకదా.
2.20.38.
అనుష్టుప్.
న దృష్టపూర్వం కల్యాణమ్
సుఖం వా పతిపౌరుషే।
అపి పుత్రేఽ పి పశ్యేయమ్
ఇతి రామాఽ స్థితం మయా॥
టీకః-
న = లేదు; దృష్ట = చూడబడి; పూర్వం = పూర్వ మెన్నడును; కల్యాణమ్ = మంగళమును; సుఖం = సుఖమును; వా = గాని; పతి = భర్త; పౌరుషే = అధికారములో నుండగా; అపి = అందైననూ; పుత్రే = కొడుకు నందు; అపి = ఐన; పశ్యేయమ్ = చూచెదను; ఇతి = అని; రామః = రామా; అస్థితం = కోరబడినది; మయా = నాచే.
భావంః-
రామా! పూర్వము నా భర్త అధికారములో నున్నపుడు శుభమునుగాని, సుఖమునుగాని అనుభవించి ఎరుగను. పుత్రుని అధికారమునందైన చూచెదనని ఆశించితిని.
2.20.39.
అనుష్టుప్.
సా బహూన్యమనోజ్ఞాని
వాక్యాని హృదయచ్ఛిదామ్।
అహం శ్రోష్యే సపత్నీనామ్
అవరాణాం వరా సతీ॥
టీకః-
సా = అటువంటి; బహూని = అనేక; అమనోజ్ఞాని = దుఃఖప్రదములైన; వాక్యాని = మాటలను; హృదయత్ = హృదయమును; ఛిదామ్ = ఛేదించెడివారు; అహం = నేను; శ్రోష్యే = వినగలను; సపత్నీనామ్ = సవతులయొక్క; అవరాణాం = తక్కువైన; వరా = శ్రేష్ఠమైన; సతీ = భార్యల.
భావంః-
అటువంటి నేను, పట్టమహిషినైయుండి, మాటలచే మనోవ్యధను కలిగించువారు, నాకన్న తక్కువ వారైన నా సవతులు పలికిన దుర్భాషలెన్నియో వినవలసి యుండెను.
2.20.40.
అనుష్టుప్.
అతో దుఃఖతరం కిం ను
ప్రమదానాం భవిష్యతి।
మమ శోకో విలాపశ్చ
యాదృశోఽ యమనంతకః॥
టీకః-
అతః = దీనికన్న; దుఃఖతరం = అధిక దుఃఖకరమైనదానిని; కిం ను = ఏది; ప్రమదానాం = స్త్రీలకు; భవిష్యతి = ఉండగలదు; మమ = నాకు; శోకః = దుఃఖము; విలాపః = ఏడుపు; చ = పాదపూరణము; యాదృశః = ఎట్టిదైన; అయమ్ = ఈ; అనంతకః = అంతము లేనటువంటిది.
భావంః-
నాకు కలిగిన ఈ అనంత దుఃఖముకన్న మించిన దుఃఖము, విలాపము స్త్రీలకు మరేమి యుండును?
2.20.41.
అనుష్టుప్.
త్వయి సన్నిహితేఽ ప్యేవమ్
అహమాసం నిరాకృతా।
కిం పునః ప్రోషితే తాత
ధ్రువం మరణమేవ మే॥
టీకః-
త్వయి = నీవు; సన్నిహితే = దగ్గర ఉన్నపుడు; అపి = ఐనను; ఏవమ్ = ఇట్లు; అహమ్ = నేను; నిరాకృతా = నిరాకరింపబడినదాననై; ఆసం = ఉంటిని; కిం పునః = మరల ఏల చెప్పవలెను; ప్రోషితే = ప్రవాసమునకు వెళ్ళినపుడు; తాతః = తండ్రి; ధ్రువం = నిశ్చయము; మరణం = మరణము; ఏవ = మాత్రమే; మే = నాకు.
భావంః-
నాయనా! నీవు నా చెంత నున్నపుడే నన్నిట్లు నిరాకరించుచున్నారు. ఇక నీవు ప్రవాసమునకు వెళ్ళినపుడు చెప్పవలెనా. నాకు మరణము సంభవించుట నిశ్చయము.
2.20.42.
అనుష్టుప్.
అత్యంతనిగృహీతాస్మి
భర్తుర్నిత్యమతంత్రితా।
పరివారేణ కైకేయ్యా
స్సమా వాప్యథవాఽ వరా॥
టీకః-
అత్యంత = చాలా; నిగృహీతా = నిగ్రహింపబడి; అస్మి = ఉన్నాను; భర్తుః = భర్తచే; నిత్యమ్ = నిత్యము; అతంత్రితా = అస్వతంత్రురాలినిగా; పరివారేణ = దాసదాసీలతో; కైకేయ్యాః = కైకేయి యొక్క; సమా వా = సమానురాలినిగా గాని; అపి = మరియు; అథవా = లేక; అవరా = తక్కువదానినిగా గాని.
భావంః-
నా భర్త నన్ను కైకేయి యొక్క, దాసీలతో సమానురాలిగానో, అంతకన్న తక్కువదానిగానో చూచుచు, అస్వతంత్రురాలిని చేసి, చాల నియంత్రించెను.
2.20.43.
అనుష్టుప్.
యోఽ హి మాం సేవతే కశ్చిత్
అథవాప్యనువర్తతే।
కైకేయ్యాః పుత్రమన్వీక్ష్య
స జనో నాభిభాషతే॥
టీకః-
యః = ఏ; హి = కదా; మాం = నన్ను; సేవతే = సేవించుచున్నారో; కశ్చిత్ = ఎవరైనను; అథవా = లేక; అపి = కూడ; అనువర్తతే = అనుసరించుచున్నారో; కైకేయ్యాః = కైకేయి యొక్క; పుత్రమ్ = పుత్రుని; అన్వీక్ష్య = చూచి; సః = ఆ; జనః = మనిషులు; నాభిభాషతే = పలుకరించడు.
భావంః-
నన్ను సేవించువారు, అనుసరించువారు కూడ, ఇటుపై భరతుని చూచి, నన్ను పలుకరించరు కదా!
2.20.44.
అనుష్టుప్.
నిత్యక్రోధతయా తస్యాః
కథం ను ఖరవాదితత్।
కైకేయ్యా వదనం ద్రష్టుమ్
పుత్ర శక్ష్యామి దుర్గతా॥
టీకః-
నిత్యః = ఎల్లప్పుడును; క్రోధతయా = చాలా కోపము కలిగియుండు; తస్యాః = ఆమె యొక్క; కథం ను = ఏ విధముగ; ఖరవాది = పరుషముగ మాటలాడునది; తత్ = ఆ; కైకేయ్యాః = కైకేయి; వదనం = ముఖమును; ద్రష్టుమ్ = చూచుటకు; పుత్ర = కుమారా; శక్ష్యామి = శక్తురాలనగుదును; దుర్గతా = కష్టమునందున్న.
భావంః-
కైకేయి ఎల్లప్పుడును కోపముతో రుసరుసలాడుచుండును. కష్టములందున్న నేను, పరుషముగా మాటలాడు ఆమె ముఖము నెట్లు చూడగలను?
2.20.45.
అనుష్టుప్.
దశ సప్త చ వర్షాణి
జాతస్య తవ రాఘవ।
అసితాని ప్రకాంక్షంత్యా
మయా దుఃఖపరిక్షయమ్॥
టీకః-
దశ సప్త చ వర్షాణి = పదునేడు సంవత్సరములు; తవ = నీ యొక్క; జాతస్య = జన్మించిన పిమ్మట; రాఘవ = రామా; అసితాని = గడపబడినవి; ప్రకాంక్షంత్యా = దృఢముగ కోరుచున్న; మయా = నాచే; దుఃఖ పరిక్షయమ్ = దుఃఖము నశించుట.
భావంః-
రామా! నీవు జన్మించిన అనంతరము పదునేడు సంవత్సరముల నుండి, నా దుఃఖము నశించునను కోరికతో, నిరీక్షించుచున్నాను.
గమనికః-
ద్విజులకు (బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలకు) బ్రహ్మోపదేశ కారణమున రెండవజన్మ. విశ్వామిత్రుడు దశరథునికడకు వచ్చునాటికి, శ్రీరాముడు ఊనషోడశవర్షప్రాయుడు. అనగా పదహారు సంవత్సరముల లోపు వయసు వాడు. గర్భైకాదశేషు రాదన్యమ్. అనునది ఉపనయన శాస్త్రోక్తి. అనగా క్షత్రియునకు శిశువు తల్లి గర్భమున పడినది మొదలుకొనిన, పదునొకండవ సంవత్సరమున ఉపనయనము చేయవలెను. కావున, శ్రీరామునకు యువరాజ్యాభిషేకము జరుపవలెనను సంకల్పము (మాతృగర్భస్థ కాలమును తగ్గించిన పిమ్మట) ఆయన 27వ యేట జరిగినది- అనగా ఆయన ఉపనయనానంతరము 17 సంవత్సరములకు యువరాజు పట్టాభిషేకము నిర్వహించుటకు నిర్ణయము జరిగినదన్నమాట. అందువలననే కౌసల్యాదేవి “దశ సప్త చ వర్షాణి తవ జాతస్య రాఘవ” అని అన్నది. సౌజన్యము గీతాప్రెస్ వారి రామాయణము.
2.20.46.
అనుష్టుప్.
తదక్షయం మహద్దుఃఖమ్
నోత్సహే సహితుం చిరమ్।
విప్రకారం సపత్నీనామ్
ఏవం జీర్ణాఽ పి రాఘవ॥
టీకః-
తత్ = ఆ; అక్షయం = అంతములేని; మహత్ = గొప్ప; దుఃఖమ్ = దుఃఖమును; న = లేదు; ఉత్సాహే = కోరుట; సహితుం = సహించుటకు; చిరమ్ = చిరకాలము; విప్రకారం = అవమానమును; సపత్నీనామ్ = సవతుల; ఏవం = ఇట్లు; జీర్ణాపి = ముసలిదాననై కూడ; రాఘవ = రామ.
భావంః-
ఈ కారణముచే రామా! సవతులు చేయు అవమానమును, ఈ పెద్దదుఃఖమును, నా యీ వృద్ధాప్యంలో నేను ఎంతో కాలము భరించజాలను.
2.20.47.
అనుష్టుప్.
అపశ్యంతీ తవ ముఖమ్
పరిపూర్ణశశిప్రభమ్।
కృపణా వర్తయిష్యామి
కథం కృపణజీవికామ్॥
టీకః-
అపశ్యంతీ = చూడనిదాననై; తవ = నీ; ముఖమ్ = ముఖమును; పరిపూర్ణశశి = పూర్ణచంద్రుని యొక్క; ప్రభమ్ = కాంతి గలదానిని; కృపణా = దీనురాలను; వర్తయిష్యామి = చేయగలను; కథం = ఏ విధముగ; కృపణ = దైన్యమైన; జీవికామ్ = జీవనమును.
భావంః-
పూర్ణచంద్రుని వంటి నీ ముఖమును చూడకుండగ, దీనురాలనై దైన్యముతో నిండిన జీవనము నెట్లు గడుపగలను.
2.20.48.
అనుష్టుప్.
ఉపవాసైశ్చ యోగైశ్చ
బహుభిశ్చ పరిశ్రమైః।
దుఃఖం సంవర్ధితో మోఘమ్
త్వం హి దుర్గతయా మయా॥
టీకః-
ఉపవాసైః = ఉపవాసములతోను; చ = మఱియు; యోగైః = యోగసాధనలతోను; చ = మఱియు; బహుభిః = వివిధములైన; చ = మఱియు; పరిశ్రమైః = శ్రమలతోకూడుకొనియున్న; దుఃఖం = కష్టముగా; సంవర్ధితః = పెంచబడితివి; మోఘమ్ = వ్యర్థముగ; త్వం = నీవు; హి = కదా; దుర్గతయా = దురదృష్టవంతురాలనైన; మయా = నాచే.
భావంః-
దురదృష్టవంతురాలనగు నేను, ఎన్నియో ఉపవాసములు, దైవకార్యములు చేసి, చాల కష్టపడి నిన్ను పెంచినాను. అవి అన్నియు వ్యర్థమైపోయినవి కదా.
2.20.49.
అనుష్టుప్.
స్థిరం తు హృదయం మన్యే
మమేదం యన్న దీర్యతే।
ప్రావృషీవ మహానద్యా
స్పృష్టం కూలం నవామ్భసా॥
టీకః-
స్థిరం = బలమైనదిగా; తు = పాదపూరణము; హృదయం = హృదయము; మన్యే = అనుకొనుచున్నాను; మమ = నా యొక్క; ఇదం = ఈ; యత్ = ఏకారణముచే; న = లేదో; దీర్యతే = బ్రద్దలు చేయబడుట; ప్రావృషీ = వర్షాకాలమునందు; ఇవ = వలె; మహానద్యాః = మహానదియొక్క; స్పృష్టం = తాకబడిన; కూలం = ఒడ్డు; నవామ్భసా = క్రొత్త నీటిచే.
భావంః-
పిడుగువంటి ఈ వార్త వినిన పిమ్మటకూడ, వర్షాకాలములో క్రొత్తనీటిచే కొట్టబడిన మహానది ఒడ్డు బ్రద్దలగునట్లు, ఏ కారణముచేతనో నా గుండె బ్రద్దలగుటలేదు. అందుచే ఇది చాలా గట్టిదని తలచుచున్నాను.
2.20.50.
జగతి.
మమైవ నూనం మరణం న విద్యతే
న చావకాఽ శోస్తి యమక్షయేఽ మమ।
యదంతకోఽ ద్యైవ న మాం జిహీర్షతి
ప్రసహ్య సింహో రుదతీం మృగీమివ॥
టీకః-
మమ = నాకు; ఏవ = మాత్రము; నూనం = కచ్చితముగ; మరణం = మరణము; న = లేదు; నవిద్యతే = కలుగదు; నృ = లేదు; చ = ఐన; అవకాశః = అవకాశము; అస్తి = ఉండుట; యమక్షయే = యమలోకములో; మమ = నాకు; యత్ = ఎందువలన; అంతకః = యముడు; అద్య ఏవ = ఇపుడే; న = లేదు; మాం = నన్ను; జిహీర్షతి = సంహరించుటకు; ప్రసహ్య = బలాత్కారముగ; సింహః = సింహము; రుదతీం = విలపించుచున్న; మృగీమ్ = ఆడజింకను; ఇవ = వలె.
భావంః-
నాకు నిజముగ మరణమే లేదు. యమలోకములో ఉండుటకు అవకాశము లేదు. అందువలనే, రోదించుచున్న ఆడుజింకను, సింహము బలవంతముగ లాగికొనిపోవునట్లు, యముడు నన్ను గొనిపోవుటలేదు.
2.20.51.
జగతి.
స్థిరం హి నూనం హృదయం మమాయసం
న భిద్యతే యద్భువి నావదీర్యతే।
అనేన దుఃఖేన చ దేహమర్పితం
ధ్రువం హ్యకాలే మరణం న విద్యతే॥
టీకః-
స్థిరం = గట్టిది; హి = కదా; నూనం = నిజముగ; హృదయం = హృదయము; మమ = నాయొక్క; ఆయసం = ఇనుముతో చేయబడినది; న భిద్యతే = భిన్నమగుటలేదు; యత్ = ఎందువలననో; భువి = నేలపై; న అవదీర్యతే = ముక్కలైపోవుటలేదు; అనేన = ఈ; దుఃఖేన = దుఃఖముచే; దేహమ్ = శరీరము; అర్పితం = అర్పింపబడినది; ధ్రువం = నిశ్చయము; హి = కదా; అకాలే = సమయము కాని సమయములో; నవిద్యతే = ఉండదు.
భావంః-
నా దేహము ఈ దుఃఖముతో నిండియున్నది. నా హృదయము ముక్కలు కాక దృఢముగా నున్నది. ఇది లోహముతో చేయబడినది. అకాల మరణము కలుగుట అసంభవము. ఇది నిశ్చయము.॥॥
2.20.52.
జగతి.
ఇదం హి దుఃఖం యదనర్థకాని మే
వ్రతాని దానాని చ సమ్యమాశ్చ హి।
తపశ్చ తప్తం యదపత్యకారణా-
త్సునిష్ఫలం బీజమివోప్తమూషరే॥
టీకః-
ఇదం = ఇది; హి = మాత్రమే; దుఃఖం = దుఃఖము; యత్ = ఏదైతే; అనర్థకాని = వ్యర్థమైనది; మే = నా యొక్క; వ్రతాని = వ్రతములు; దానాని = దానములు; చ = మఱియు; సంయమాః = నియమములు కదా; చ హి = నియమములు కదా; చ = నియమములు కదా; చ హి = నియమములు చ = నియమములు కదా; చ హి = నియమములు కదా; తపః చ = తపస్సును; తప్తం = చేయబడిన; యత్ = ఏదైతే; అపత్యకారణాత్ = సంతానముకొరకై; సునిష్ఫలం = పూర్తిగ వృధా ఐనది; బీజమ్ = విత్తనము; ఇవ = వలె; ఉప్తమ్ = నాటబడిన; ఊషరే = చవుటినేలయందు
భావంః-
నా వ్రతములు, దానములు, వ్రతనియమములు వృధా ఐనవని దుఃఖము కలుగుచున్నది. సంతానము కలుగవలెనని చేసిన తపస్సు చవుటినేలలో నాటిన విత్తనము వలె నిష్ఫలమైనది.
2.20.53.
జగతి.
యది హ్యకాలే మరణం స్వయేచ్ఛయా
లభేత కశ్చిద్గురుదుఃఖకర్శితః।
గతాహమద్యైవ పరేతసంసదం
వినా త్వయా ధేనురివాత్మజేన వై॥
టీకః-
యది = అయినచో, అకాలే = అకాలమునందు, మరణం = చావును, స్వయా = తనయొక్క, ఇచ్ఛయా = ఇష్టప్రకారము, లభేత్ = పొందగలుగుట, కశ్చిత్ = ఎవరైన, గురు దుఃఖ కర్శితః = అధిక దుఃఖముచే బాధపడిన, గతా = పొందెడుదానిని, అహమ్ = నేను, అద్య ఏవ = ఇప్పుడే, పరేత సంసదం = యమలోకమును, వినా = లేని, త్వయా = నీవు, ధేనుః = ఆవు, ఇవ = వలె, ఆత్మజేన = దూడ.
భావంః-
పెనుదుఃఖముతో బాధపడువాడు, అకాలమున కూడ, తన ఇష్టప్రకారము చనిపోవగలిగినచో, నీవు లేని నేను, దూడ లేని ఆవు వలె, ఇప్పుడే యమలోకమునకు పోయి యుండెడిదానను.
2.20.54.
జగతి.
అథాపి కిం జీవితమద్య మే వృథా
త్వయా వినా చంద్రనిభాననప్రభ।
అనువ్రజిష్యామి వనం త్వయైవ గౌః
సుదుర్బలా వత్సమివానుకాంక్షయా॥
టీకః-
అథాపి = ఐనాకూడ; కిం = ఏమి; జీవితమ్ = జీవితము; అద్య = ఇప్పుడు; మే = నా యొక్క; వృథా = వ్యర్ధమైనది; త్వయా = నీవు; వినా = లేక; చంద్రనిభాననప్రభా = చంద్రకాంతి వంటి ప్రకాశవంతమైన ముఖముకలవాడా; అనువ్రజిష్యామి = అనుసరించి వెళ్ళగలను; వనం = అరణ్యమునుగూర్చి; త్వయైన = నీతోడనే; గౌః = ఆవు; సుదుర్బలా = చాల బలహీనమైన; వత్సమ్ = లేగదూడను; ఇవ = వలె; అనుకాంక్షయా = వాత్సల్యముతో.
భావంః-
ఐననూ, ఈ జీవితముతో ప్రయోజనమేమి యున్నది. రామచంద్రా! నీవు లేని నా జీవితము వ్యర్థము. బలహీనమైన ఆవు, దూడవెంట వెళ్ళినట్లు, నేను వాత్సల్యముతో నీ తోడనే అరణ్యమునకు వచ్చెదను.
2.20.55.
జగతి.
భృశమసుఖమమర్షితా తదా
బహు విలలాప సమీక్ష్య రాఘవమ్।
వ్యసనముపనిశామ్య సా మహత్
సుతమివ బద్ధమవేక్ష్య కిన్నరీ॥
టీకః-
భృశమ్ = ఎక్కువగ; అసుఖమ్ = దుఃఖముతో; అమర్షితా = కోపముతో ఉన్న; తదా = అప్పుడు; బహు = చాల విధములుగా; విలలాప = విలపించెను; సమీక్ష్య = చూసి; రాఘవమ్ = రాముని; వ్యసనమ్ = దుఃఖమును; ఉపనిశామ్య = చూసి; సా = ఆమె; మహత్ = గొప్ప; సుతమ్ = పుత్రుని; ఇవ = వలె; బద్ధమ్ = బంధింపబడిన; అవేక్ష్య = చూసి; కిన్నరీ = కిన్నరస్త్రీ.
భావంః-
అప్పుడు ఆ కౌసల్య, రామునికి కలిగిన పెనుకష్టమును గూర్చి ఆలోచించి, దుఃఖము, క్రోధములతో నిండియున్న తన తనయుని చూచి, కిన్నరస్త్రీ వలె విలపించెను.
2.20.56.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే వింశః సర్గః॥
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; వింశ [20] = ఇరవైయవ; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని లోని [20] ఇరవైయవ సర్గ సంపూర్ణము.
2.21.1.
అనుష్టుప్.
తథా తు విలపన్తీం తామ్
కౌసల్యాం రామమాతరమ్।
ఉవాచ లక్ష్మణో దీనః
తత్కాలసదృశం వచః॥
టీకః-
తథా తు = అట్లు; తు = విశేషముగా; విలపన్తీమ్ = విలపించుచున్న; తామ్ = ఆ; కౌసల్యాం = కౌసల్యను గూర్చి; రామమాతరమ్ = రాముని తల్లి ఐన; ఉవాచ = పలికెను; లక్ష్మణః = లక్ష్మణుడు; దీనః = దీనుడై; తత్కాలసదృశం = ఆ సందర్భమునకు తగినట్లు; వచః = మాటను.
భావంః-
అట్లు విలపించుచున్న కౌసల్యతో లక్ష్మణుడు దీనుడై సందర్భమునకు తగినట్లు ఈ విధముగా పలికెను.
2.21.2.
అనుష్టుప్.
న రోచతే మమాప్యేతత్
ఆర్యే యద్రాఘవో వనమ్।
త్యక్త్వా రాజ్యశ్రియం గచ్ఛేత్
స్త్రియా వాక్యవశం గతః॥
టీకః-
న = కాదు; రోచతే = ఇష్టము; మమ = నాకు; అపి = కూడ; ఏతత్ = ఇది; ఆర్యే = పూజనీయురాలా; యత్ = ఏది; రాఘవః = రాముడు; వనమ్ = వనమును గూర్చి; త్యక్త్వా = విడిచి; రాజ్యశ్రియం = రాజ్యలక్ష్మిని; గచ్ఛేత్ = వెళ్ళవలెను; స్త్రియాః = స్త్రీ యొక్క; వాక్యవశం = మాటలకు లొంగి; గతః = పోయిన.
భావంః-
పూజనీయురాలా! శ్రీరాముడు ఒక స్త్రీ మాటలకు లొంగి, రాజ్యమును త్యజించి అరణ్యవాసమునకు వెళ్ళవలెనన్నది నాకు కూడ ఇష్టము కాదు.
2.21.3.
అనుష్టుప్.
విపరీతశ్చ వృద్ధశ్చ
విషయైశ్చ ప్రధర్షితః।
నృపః కిమివ న బ్రూయాత్
చోద్యమానస్సమన్మథః॥
టీకః-
విపరీతశ్చ = విపరీత బుద్ధి కలవాడు; వృద్ధశ్చ = వృద్ధుడు; విషయైః = ఇంద్రియ భోగములచే; ప్రధర్షితః = వశముచేసుకొనబడినవాడు; నృపః = రాజు; కిమివ = దేనిని; న = లేదు; బ్రూయాత్ = పలుకుట; చోద్యమానః = ప్రేరేపింపబడినవాడు; సమన్మథః = కామమునకు లోనైనవాడు.
భావంః-
విపరీతబుద్ధి కలవాడు, వృద్ధుడు, భోగలాలసుడు, కామపీడితుడు, కైకేయిచే ప్రేరేపింపబడిన వాడును ఐన దశరథుడు ఏమైనను మాటలాడ గలడు.
2.21.4.
అనుష్టుప్.
నాస్యాపరాధం పశ్యామి
నాపి దోషం తథావిధమ్।
యేన నిర్వాస్యతే రాష్ట్రాత్
వనవాసాయ రాఘవః॥
టీకః-
న = లేదు; అస్య = అతనియొక్క; అపరాధం = అపరాధమును; పశ్యామి = చూచుట; న = లేదు; అపి = కూడ; దోషం = దోషము; తథావిధమ్ = అటువంటి; యేన = దేనిచే; నిర్వాస్యతే = పంపించవేయబడుచున్నాడో; రాష్ట్రాత్ = రాజ్యము నుండి; వనవాసాయ = వనవాసముకొరకు; రాఘవః = రాముడు.
భావంః-
రామునిలో, రాష్ట్రమునుండి పంపించి వేయవలసినంత అపరాధముగాని, దోషముగాని నాకు కనబడుటలేదు.
2.21.5.
అనుష్టుప్.
న తం పశ్యామ్యహం లోకే
పరోక్షమపి యో నరః।
స్వమిత్రోఽ పి నిరస్తోఽ పి
యోఽ స్య దోషముదాహరేత్॥
టీకః-
న = లేదు; తం = అటువంటి; పశ్యామి = చూచుట; అహం = నేను; లోకే = లోకములో; పరోక్షమ్ = పరోక్షముగా; అపి = కూడ; యః = ఏ; నరః = మానవుడు; స్వమిత్రః = శత్రువు; అపి = కూడ; నిరస్తః = తిరస్కరింపబడినవాడు; అపి = కూడ; యః = ఏ; అస్య = అతని యొక్క; దోషమ్ = దోషమును; ఉదాహరేత్ = చెప్పుట.
భావంః-
శత్రువైనను, తిరస్కరింపబడినవాడైనను, ఏ ఒక్కడును, పరోక్షముగానైన రాముని గురించి చెడుగా చెప్పగా, నేను ఈ లోకములో చూడలేదు.
2.21.6.
అనుష్టుప్.
దేవకల్పమృజుం దాన్తమ్
రిపూణామపి వత్సలమ్।
అవేక్షమాణః కో ధర్మమ్
త్యజేత్పుత్రమకారణాత్॥
టీకః-
దేవకల్పమ్ = దైవసమానుడు; ఋజుం = కపటము లేనివాడు; దాన్తమ్ = ఇంద్రియ నిగ్రహము కలవాడు; రిపూణామ్ = శత్రువుల పట్ల; అపి = కూడ; వత్సలమ్ = వాత్సల్యము కలవాడు; అవేక్షమాణః = చూచుట; కః = ఎవడు; ధర్మమ్ = ధర్మమును; త్యజేత్ = విడుచును; పుత్రమ్ = పుత్రుని; అకారణాత్ = కారణము లేకుండగ.
భావంః-
ధర్మాత్ముడు ఎవరైనను, నిష్కారణముగా, దైవ సమానుడును, నిష్కపటియు, జితేంద్రియుడును, శత్రువుల పట్ల కూడ వాత్సల్యము నెరపువాడును ఐన పుత్రుని త్యజించునా?
2.21.7.
అనుష్టుప్.
తదిదం వచనం రాజ్ఞః
పునర్బాల్యముపేయుషః।
పుత్రః కో హృదయే కుర్యాత్
రాజవృత్తమనుస్మరన్॥
టీకః-
తత్ = అటువంటి; ఇదం = ఈ; వచనం = మాటను; రాజ్ఞః = రాజుయొక్క; పునః = మరల; బాల్యమ్ = బాల్యమును; ఉపేయుషః = పొందిన; పుత్రః = పుత్రుడు; కః = ఎవరు; హృదయే = హృదయమునందు; కుర్యాత్ = చేయును; రాజవృత్తమ్ = రాజ ధర్మమును; అనుస్మరన్ = స్మరించు.
భావంః-
బాల్యమును మరల పొందిన వానివలె ప్రవర్తించుచున్న ఈ రాజు మాటలను, రాజధర్మము నెరిగిన పుత్రుడు ఎవరైనను అంగీకరించునా?
గమనికః-
లక్ష్మణస్వామి శ్రీరామునిపై గల ప్రేమకారణముగా ఆవేశపరుడై పలుకుబోవుచున్నది తప్ప ఆయన మాట్లాడవలసిన తీరు తెలియని వాడు గాని, ధర్మము నెఱుగని వాడు గాని, తండ్రిపైనను భరతుని ఎడలను ఆదరాభిమానములు లేనివాడు గాని కాడు. సౌజన్యము. గీతాప్రెస్ వారి రామాయణము.
2.21.8.
అనుష్టుప్.
యావదేవ న జానాతి
కశ్చిదర్థమిమం నరః।
తావదేవ మయా సార్ధమ్
ఆత్మస్థం కురు శాసనమ్॥
టీకః-
యావత్ ఏవ = ఎంతలో; న = లేదు; జానాతి = తెలుసుకొనుట; కశ్చిత్ = ఎవరైనను; అర్థమ్ = విషయమును; ఇమం = ఈ; నరః = మానవుడు; తావత్ ఏవ = అంతలో; మయా = నాతో; సార్ధమ్ = కలసి; ఆత్మస్థం = చెందినదిగా; కురు = చేయుము; శాసనమ్ = అధికారమును.
భావంః-
ఇతరులు ఎవరైనను ఈ విషయమును తెలుసుకొనునంతలో నీవు నా సహాయముతో రాజ్యాధికారమును చేజిక్కించుకొనుము.
2.21.9.
అనుష్టుప్.
మయా పార్శ్వే సధనుషా
తవ గుప్తస్య రాఘవ।
క స్సమర్థోఽ ధికం కర్తుమ్
కృతాన్తస్యేవ తిష్ఠతః॥
టీకః-
మయా = నా చేత; పార్శ్వే = ప్రక్కన; సధనుషా = ధనుస్సుతో కూడిన; తవ = నీ యొక్క; గుప్తస్య = రక్షింపబడిన వాడవై; రాఘవ = రామా; కః = ఎవరు; సమర్థః = సమర్థుడు; అధికం = ఎక్కువ; కర్తుమ్ = చేయుటకు; కృతాన్తః = యమధర్మరాజు; ఇవ = వలె; తిష్ఠతః = నిలిచి ఉన్న.
భావంః-
రామా! నేను ధనుస్సును ధరించి రక్షణగా నీ ప్రక్కన నిలచియుండగా, యమధర్మరాజు వలె ఉన్న నీకు హెచ్చుతగ్గులు చేయగలవారెవరైనను ఉందురా?
2.21.10.
అనుష్టుప్.
నిర్మనుష్యామిమాం కృత్స్నామ్
అయోధ్యాం మనుజర్షభ।
కరిష్యామి శరైస్తీక్ష్ణైః
యది స్థాస్యతి విప్రియే॥
టీకః-
నిర్మనుష్యామ్ = నిర్జన ప్రదేశముగా; ఇమాం = ఈ; కృత్స్నామ్ = సమస్తమును; అయోధ్యాం = అయోధ్యను; మనుజర్షభ = మానవశ్రేష్ఠా; కరిష్యామి = చేసెదను; శరైః = బాణములతో; తీక్ష్ణైః = వాడియైన; యది స్థాస్యతి = నిలచినట్లయితే; విప్రియే = విరుద్ధముగా.
భావంః-
ఓ మానవశ్రేష్ఠా! నీకు విరుద్ధముగా ఈ అయోధ్యా నగరమునందు ఎవరైనను ఉన్నచో, దీనిని నా వాడియైన బాణములతో నిర్జనప్రదేశముగా చేసెదను.
2.21.11.
అనుష్టుప్.
భరతస్యాథ పక్ష్యో వా
యో వాఽ స్య హితమిచ్ఛతి।
సర్వానేతాన్వధిష్యామి
మృదుర్హి పరిభూయతే॥
టీకః-
భరతస్య = భరతునియొక్క; అథ = మరియు; పక్ష్యః వా = పక్షమునకు చెందిన; యః వా = ఎవడు; అస్య = ఇతని యొక్క; హితమ్ = హితమును; ఇచ్ఛతి = కోరుచున్నాడో; సర్వాన్ = అందరిని; ఏతాన్ = వారిని; వధిష్యామి = వధించెదను; మృదుః = మెత్తనివాడు; హి = కదా; పరిభూయతే = తిరస్కరింపబడును.
భావంః-
భరతుని పక్షమునకు చెందినవారిని, అతని మేలుకోరువారిని, అందరిని వధియించెదను. లోకమునందు మెత్తనివారిని జనులు తిరస్కరింతురు కదా.
2.21.12.
అనుష్టుప్.
ప్రోత్సాహితోఽ యం కైకేయ్యా
స దుష్టో యది నః పితా।
అమిత్రభూతో నిస్సఙ్గమ్
వధ్యతాం బధ్యతామపి॥
టీకః-
ప్రోత్సాహితః = ప్రోత్సహింపబడినవాడై; అయం = ఈతడు; కైకేయ్యా = కైకేయిచే; సః = అటువంటి; దుష్టః = దుష్టుడైన; యది = ఐనచో; నః పితా = మనతండ్రి; అమిత్రభూతః = శత్రువైన; నిస్సఙ్గమ్ = ప్రేమ లేక; వధ్యతాం = వధింపబడుగాక; బధ్యతామ్ = బంధింపబడి; అపి = కూడ.
భావంః-
దుష్టుడైన మనతండ్రి కైకేయి ప్రోత్సాహము వలన మనకు శత్రువైనచో, అతని పట్ల ఎట్టి ప్రేమయు చూపక అతనిని బంధించెదను, వధించెదను కూడ.
2.21.13.
అనుష్టుప్.
గురోరప్యవలిప్తస్య
కార్యాకార్యమజానతః।
ఉత్పథం ప్రతిపన్నస్య
కార్యం భవతి శాసనమ్॥
టీకః-
గురుః అపి = గురువైనను; అవలిప్తస్య = అహంకారి; కార్యాకార్యమ్ = కార్యాకార్యములను; అజానతః = తెలియనివాడు; ఉత్పథం = దుర్మార్గమును (తప్పుదారిని); ప్రతిపన్నస్య = అవలంబంచినవాడు; కార్యం = చేయదగినది; భవతి = అగును; శాసనమ్ = శాసనము.
భావంః-
గురువైనను, అహంకారియై దుర్మార్గమును అవలంబించినచో అతనిని శాసించతగును.
2.21.14.
అనుష్టుప్.
బలమేష కిమాశ్రిత్య
హేతుం వా పురుషర్షభ।
దాతుమిచ్ఛతి కైకేయ్యై
రాజ్యం స్థితమిదం తవ॥
టీకః-
బలమ్ = బలము; ఏషః = ఇతడు; కిం = దేనిని; ఆశ్రిత్య = ఆశ్రయించి; హేతుం వా = కారణముచే; పురుషర్షభ = మానవోత్తమ; దాతుమ్ = ఇచ్చుటకు; ఇచ్ఛతి = కోరుచున్నాడు; కైకేయ్యై = కైకేయికొరకు; రాజ్యం = రాజ్యమును; స్థితమ్ = ఉన్న; ఇదం = ఈ; తవ = నీయొక్క.
భావంః-
మానవోత్తమా రామా! ఇతడు ఏ బలముతో ఏ కారణముచే నీకు చెందిన ఈ రాజ్యమును కైకేయికి ఇవ్వదలచుకొన్నాడు.
2.21.15.
అనుష్టుప్.
త్వయా చైవ మయా చైవ
కృత్వా వైరమనుత్తమమ్।
కాఽ స్య శక్తిశ్శ్రియం దాతుమ్
భరతాయారిశాసన॥
టీకః-
త్వయా చైవ = నీతోను; మయా చైవ = నాతోడను; కృత్వా = చేసి; వైరమ్ = శత్రుత్వము; అనుత్తమమ్ = గొప్ప; కా = ఏమి; అస్య = ఇతనికి; శక్తిః = శక్తి; శ్రియం = ఐశ్వర్యమును; దాతుమ్ = ఇచ్చుటకు; భరతాయ = భరతునికొరకు; అరిశాసన = శత్రువులను శాసించగలవాడా.
భావంః-
శత్రువులను శాసించగల ఓ రామా! నీతోను, నాతోడను గొప్ప వైరము పెట్టుకొని, రాజ్యమును భరతునికి కట్టబెట్టగల శక్తి, ఐశ్వర్యము ఇతనికి ఎక్కడిది?
2.21.16.
అనుష్టుప్.
అనురక్తోఽ స్మి భావేన
భ్రాతరం దేవి తత్త్వతః।
సత్యేన ధనుషా చైవ
దత్తేనేష్టేన తే శపే॥
టీకః-
అనురక్తః = ప్రేమ గలిగినవాడు; అస్మి = ఉంటిని; భావేన = భావముతో; భ్రాతరం = సోదరునిగూర్చి; దేవి = దేవీ; తత్త్వతః = యథార్థముగా; సత్యేన = సత్యముగా; ధనుషా చైవ = ధనుస్సు చేతను; దత్తేన = దానము చేతను; ఇష్టేన = యాగము చేతను; తే = నీకు; శపే = శపథము చేయుచున్నాను.
భావంః-
తల్లీ! యథార్థముగా నేను నా అన్నయైన శ్రీరామునిపై మనస్ఫూర్తిగా ప్రేమ కలిగి యున్నాను. సత్యముగను, ధనస్సుపైనను, దానముపైనను, యాగముపైనను శపథము చేసి నీకు చెప్పుచున్నాను.
2.21.17.
అనుష్టుప్.
దీప్తమగ్నిమరణ్యం వా
యది రామః ప్రవేక్ష్యతి।
ప్రవిష్టం తత్ర మాం దేవి
త్వం పూర్వమవధారయ॥
టీకః-
దీప్తమ్ = మండుచున్న; అగ్నిమ్ = అగ్నిని; అరణ్యం వా = అరుణ్యమును గాని; యది = ఐనచో; రామః = రాముడు; ప్రవేక్ష్యతి = ప్రవేశింపగలవాడు; ప్రవిష్టం = ప్రవేశించిన వానిగా; తత్ర = అక్కడ; మాం = నన్ను; దేవి = దేవీ; త్వం = నీవు; పూర్వమ్ = ముందుగానే; అవధారయ = నిశ్చయించుకొనుము.
భావంః-
ఓ తల్లీ! రాముడు మండుచున్న అగ్నియందు గాని, అరణ్యమునందు గాని ప్రవేశించు పరిస్థితి ఏర్పడినచో, అక్కడ ముందుగనే నేను దానియందు ప్రవేశించెదనని నిశ్చయముగ గ్రహింపుము.
2.21.18.
అనుష్టుప్.
హరామి వీర్యాద్దుఃఖం తే
తమ స్సూర్య ఇవోదితః।
దేవీ పశ్యతు మే వీర్యమ్
రాఘవశ్చైవ పశ్యతు॥
టీకః-
హరామి = హరించెదను; వీర్యాత్ = పరాక్రమమువలన; దుఃఖం = దుఃఖమును; తే = నీ యొక్క; తమః = చీకటిని; సూర్యః = సూర్యుడు; ఇవ = వలె; ఉదితః = ఉదయించిన; దేవీ = దేవీ; పశ్యతు = చూచెదవుగాక; మే = నాయొక్క; వీర్యమ్ = పరాక్రమమును; రాఘవశ్చైవ = రాముడు కూడ; పశ్యతు = చూచును గాక.
భావంః-
ఉదయించిన సూర్యుని వలన చీకటి తొలగిపోయినట్లు, నా పరాక్రమముచే నీ దుఃఖమును తొలగించెదను. నీవును రాముడును నా పరాక్రమమును చూచెదరుగాక.
2.21.19.
అనుష్టుప్.
ఏతత్తు వచనం శ్రుత్వా
లక్ష్మణస్య మహాత్మనః।
ఉవాచ రామం కౌసల్యా
రుదన్తీ శోకలాలసా॥
టీకః-
ఏతత్ తు = ఈ; వచనం = మాటను; శ్రుత్వా = విని; లక్ష్మణస్య = లక్ష్మణునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన; ఉవాచ = పలికెను; రామం = రాముని గూర్చి; కౌసల్యా = కౌసల్య; రుదన్తీ = రోదించుచు; శోకలాలసా = శోకములో మునిగినదై.
భావంః-
మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని కౌసల్య శోకముతో రోదించుచు రామునితో ఇట్లు పలికెను.
2.21.20.
అనుష్టుప్.
భ్రాతుస్తే వదతః పుత్ర
లక్ష్మణస్య శ్రుతం త్వయా।
యదత్రానన్తరం కార్యమ్
కురుష్వ యది రోచతే॥
టీకః-
భ్రాతుః = సోదరుడైన; తే = నీ యొక్క; వదతః = మాటలాడుచుండగా; పుత్ర = కుమార; లక్ష్మణస్య = లక్ష్మణుని యొక్క; శ్రుతం = వినబడినది; త్వయా = నీచే; యత్ = ఏది; అత్ర = ఈ విషయమై; అనన్తరం = తరువాత; కార్యమ్ = చేయదగినది; కురుష్వ = చేయుము; యది = ఐనచో; రోచతే = ఇష్టము.
భావంః-
కుమారా రామా! లక్ష్మణుని మాటలు వింటివి కదా. నీకు ఇష్టమైనచో ఈ విషయమై చేయదగిన తదుపరి కార్యములను చేయుము.
2.21.21.
అనుష్టుప్.
న చాధర్మ్యం వచశ్శ్రుత్వా
సపత్న్యా మమ భాషితమ్।
విహాయ శోకసన్తప్తామ్
గన్తుమర్హసి మామితః॥
టీకః-
న చ = కాదు; అధర్మ్యం = ధర్మ వ్యతిరేకమైన; వచః = మాటలు; శృత్వా = విని; సపత్న్యా = సవతి యొక్క; మమ = నా యొక్క; భాషితమ్ = పలుకబడిన; విహాయ = విడిచి; శోకసన్తప్తామ్ = దుఃఖముతో బాధపడుతున్న; గన్తుమ్ = వెళ్ళుటకు; అర్హసి = తగినవాడవు; మామ్ = నన్ను; ఇతః = ఇచటనుండి.
భావంః-
రామా! ధర్మ వ్యతిరేకమైన నా సవతి మాటలు విని, శోకతప్తురాలైన నన్ను విడిచి వెళ్ళిపోవుట నీకు తగదు.
2.21.22.
అనుష్టుప్.
ధర్మజ్ఞ యది ధర్మిష్ఠో!
ధర్మం చరితుమిచ్ఛసి।
శుశ్రూష మామిహస్థస్త్వమ్
చర ధర్మమనుత్తమమ్॥
టీకః-
ధర్మజ్ఞ = ధర్మము నెరిగినవాడా; యది = ఐనచో; ధర్మిష్ఠః = ధార్మికుడవై; ధర్మం = ధర్మమును; చరితుమ్ = ఆచరించుటకు; ఇచ్ఛసి = కోరుచున్నవాడవు; శుశ్రూష = సేవింపుము; మామ్ = నన్ను; ఇహస్థః = ఇక్కడనే ఉండి; త్వమ్ = నీవు; చర = ఆచరించుము; ధర్మమ్ = ధర్మమును; అనుత్తమమ్ = ఉత్తమమైన.
భావంః-
రామా! నీవు ధర్మము నెరిగినవాడవు. ధార్మికుడవై ధర్మము నాచరించవలెనను కోరిక ఉన్నచో, నా పట్ల మాతృసేవ అను అత్యుత్తమమైన ధర్మమును ఆచరించుచు ఇక్కడనే ఉండుము.
గమనికః-
ధర్మమనుత్తమమ్- “ఏభ్యోమాతాగరీయసీ”, లోకములో అందఱికంటెను తల్లియే పూజ్యురాలు. కనుక, తల్లిని సేవించుట అత్యుత్తమ ధర్మము. (సౌజన్యము, గీతాప్రెస్ వారి రామాయణము)
2.21.23.
అనుష్టుప్.
శుశ్రూషుర్జననీం పుత్ర
స్వగృహే నియతో వసన్।
పరేణ తపసా యుక్తః
కాశ్యపస్త్రిదివం గతః॥
టీకః-
శుశ్రూషుః = సేవించుచు; జననీం = తల్లిని; పుత్ర = కుమారా; స్వగృహే = తన గృహమునందు; నియతః = నియమముగా; వసన్ = నివసించుచు; పరేణ = గొప్ప; తపసా = తపస్సుతో; యుక్తః = కూడినవాడై; కాశ్యపః = కాశ్యపుడు; త్రిదివం = స్వర్గమును గూర్చి; గతః = వెళ్లెను.
భావంః-
పుత్రా! పూర్వము కశ్యపుడు తను గృహమునందే నియమముగా మాతృసేవ చేయుచు శ్రేష్ఠమైన తపస్సుతో స్వర్గమునకు వెళ్లెను.
2.21.24.
అనుష్టుప్.
యథైవ రాజా పూజ్యస్తే
గౌరవేణ తథాఽ స్మ్యహమ్।
త్వాం నాహమనుజానామి
న గన్తవ్యమితో వనమ్॥
టీకః-
యథైవ = ఏ విధముగా; రాజా = రాజు; పూజ్యః = పూజార్హుడో; తే = నీకు; గౌరవేణ = గౌరవముగా; తథాః = అట్లే; అహమ్ = నేను; త్వాం = నిన్ను; న = లేదు; అహమ్ = నేను; అనుజానామి = అనుమతించుట; న = లేదు; గన్తవ్యమ్ = వెళ్ళుటను; ఇతః = ఇక్కడి నుండి; వనమ్ = వనమును గూర్చి.
భావంః-
నీకు తండ్రి ఏ విధముగా పూజ్యుడో, అట్లే తల్లి నైన నేను కూడ నీకు పూజ్యురాలను. అరణ్యమునకు వెళ్ళుటకు నేను నిన్ను అనుమతించుటలేదు.
2.21.25.
అనుష్టుప్.
త్వద్వియోగాన్న మే కార్యమ్
జీవితేన సుఖేన వా।
త్వయా సహ మమ శ్రేయః
తృణానామపి భక్షణమ్॥
టీకః-
త్వత్ = నీ యొక్క; వియోగాత్ = వియోగము వలన; న = లేదు; మే = నాకు; కార్యమ్ = కార్యము; జీవితేన = జీవితముచేత; సుఖేన వా = సుఖముచేత గాని; త్వయా = నీతో; సహ = కూడి; మమ = నాకు; శ్రేయః = మంచిది; తృణానాం = గడ్డి; అపి = కూడ; భక్షణమ్ = తిండి.
భావంః-
నీవు నాకు దూరమైన తరువాత ఈ జీవితముతో గాని, సుఖములతో గాని పని లేదు. నీ తోడనే ఉండి గడ్డి తినుచు గడిపినను నాకు మంచిదే.
2.21.26.
అనుష్టుప్.
యది త్వం యాస్యసి వనమ్
త్యక్త్వా మాం శోకలాలసామ్।
అహం ప్రాయమిహాసిష్యే
న హి శక్ష్యామి జీవితుమ్॥
టీకః-
యది = ఐనచో; త్వం = నీవు; యాస్యసి = వెళ్ళుట; వనమ్ = వనమును గూర్చి; త్యక్త్వా = విడిచి; మాం = నన్ను; శోకలాలసామ్ = దుఃఖితురాలై యున్న; అహం = నేను; ప్రాయమ్ = ఆహార పానీయములు; ఇహ = ఇక్కడ; అసిష్యే = వదిలివేయుదును; న = లేదు; హి = కదా; శక్ష్యామి = సమర్థురాలను; జీవితుమ్ = జీవించుటకు.
భావంః-
దుఃఖితురాలనైయున్న నన్ను విడిచి నీవు అరణ్యమునకు వెళ్ళినచో నేను ఇక్కడనే ప్రాయోపవేశము చేసెదను.
2.21.27.
అనుష్టుప్.
తతస్త్వం ప్రాప్స్యసే పుత్ర
నిరయం లోకవిశ్రుతమ్।
బ్రహ్మహత్యామివాధర్మాత్
సముద్ర స్సరితాం పతిః॥
టీకః-
తతః = తరువాత; త్వం = నీవు; ప్రాప్స్యసే = పొంద గలవు; పుత్ర = పుత్రా; నిరయం = దుర్గతిని; లోకవిశ్రుతమ్ = లోక ప్రసిద్ధమైన; బ్రహ్మహత్యామ్ = బ్రహ్మహత్యను; ఇవ = వలె; అధర్మాత్ = అధర్మము వలన; సముద్రః = సముద్రుడు; సరితాం = నదులకు; పతిః = భర్త.
భావంః-
ఆ తరువాత, రామా! పూర్వము నదులకు పతియైన సముద్రుడు అధర్మముగా ఒక బ్రాహ్మణుని వధించినందున బ్రహ్మహత్యాపాతకము పొందినట్లుగా నీవు సహితము దుర్గతి పాలయ్యెదవు.
గమనికః-
గీతా ప్రెస్ వారి రామాయణము 376వ పుట. ఒకానొక కల్పమునందు సముద్రుడు తనతల్లిని దుఃఖములపాలుచేసెను. అతడు ఈ అధర్మకార్యము ఆచరించినందువలన పిప్పలాదుడు అను మహర్షి సముద్రుని శిక్షించుటకై అతనిపై ఒక కృత్యను ప్రయోగించెను. దానివలన సముద్రుడు నరకయాతనలను అనుభవించవలసి వచ్చెను.
2.21.28.
అనుష్టుప్.
విలపన్తీం తథా దీనామ్
కౌసల్యాం జననీం తతః।
ఉవాచ రామో ధర్మాత్మా
వచనం ధర్మసంహితమ్॥
టీకః-
విలపన్తీం = విలపించుచున్న; తథా = అట్లు; దీనామ్ = దీనముగా; కౌసల్యాం = కౌసల్యను గూర్చి; జననీం = తల్లియైన; తతః = తరువాత; ఉవాచ = పలికెను; రామః = రాముడు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; వచనం = మాటను; ధర్మసంహితమ్ = ధర్మబద్ధమైన.
భావంః-
దీనురాలై అట్లు దుఃఖించుచున్న తన తల్లి ఐన కౌసల్యతో, రాముడు ధర్మ సమ్మతమైన మాటను ఇట్లు పలికెను.
2.21.29.
అనుష్టుప్.
నాస్తి శక్తిః పితుర్వాక్యమ్
సమతిక్రమితుం మమ।
ప్రసాదయే త్వాం శిరసా
గన్తుమిచ్ఛామ్యహం వనమ్॥
టీకః-
నాస్తి = లేదు; శక్తిః = శక్తి; పితుః = తండ్రి యొక్క; వాక్యమ్ = మాటను; సమతిక్రమితుం = అతిక్రమించుటకు; మమ = నాకు; ప్రసాదయే = వేడుకొనుచున్నాను; త్వాం = నిన్ను; శిరసా = శిరస్సుతో; గన్తుమ్ = వెళ్ళుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; అహం = నేను; వనమ్ = వనమును గూర్చి.
భావంః-
తండ్రి మాటను అతిక్రమించు సామర్థ్యము నాకు లేదు. నేను శిరస్సు వంచి నిన్ను వేడుకొనుచున్నాను. నేను అరణ్యమునకు వెళ్ళుటకు కోరుచున్నాను.
2.21.30.
అనుష్టుప్.
ఋషిణా చ పితుర్వాక్యమ్
కుర్వతా వ్రతచారిణా।
గౌర్హతా జానతా ధర్మమ్
కండునాఽ పి విపశ్చితా॥
టీకః-
ఋషిణా = ఋషియు; పితుః = తండ్రి యొక్క; వాక్యమ్ = మాటను; కుర్వతా = చేయుచు; వ్రతచారిణా = వ్రతము నాచరించువాడు; గౌః = ఆవు; హతా = చంపబడినది; జానతా = ఎరిగినవాడు; ధర్మమ్ = ధర్మమును; కండునా = కండువుచే; అపి = కూడ; విపశ్చితా = పండితుడైన.
భావంః-
ధర్మము నెరిగిన వాడును, వ్రతముల నాచరించువాడును, పండితుడును ఐన కండు మహర్షి, తండ్రియాజ్ఞను పాటించి, గోవధ కూడ చేసినాడు.
2.21.31.
అనుష్టుప్.
అస్మాకం చ కులే పూర్వమ్
సగరస్యాజ్ఞయా పితుః।
ఖనద్భిస్సాగరైర్భూమిమ్
అవాప్తస్సుమహాన్వధః॥
టీకః-
అస్మాకం = మన యొక్క; కులే = కులమునందు; పూర్వమ్ = పూర్వము; సగరస్య = సగర చక్రవర్తి యొక్క; ఆజ్ఞయా = ఆజ్ఞచే; పితుః = తండ్రియైన; ఖనద్భిః = త్రవ్వుచున్న; సాగరైః = సగరకుమారులచే; భూమిమ్ = భూమిని; అవాప్తః = పొందబడినది; సుమహాన్ = చాలా గొప్పదైన; వధః = మరణము.
భావంః-
మన వంశమునందే జన్మించిన సగర చక్రవర్తి యొక్క కుమారులు, పూర్వము తండ్రియాజ్ఞచే భూమిని త్రవ్వుచు భయంకరమైన మరణము పొందిరి.
2.21.32.
అనుష్టుప్.
జామదగ్న్యేన రామేణ
రేణుకా జననీ స్వయమ్।
కృత్తా పరశునాఽ రణ్యే
పితుర్వచనకారిణా॥
టీకః-
జామదగ్న్యేన = జమదగ్ని కుమారుడైన; రామేణ = రామునిచే; రేణుకా = రేణుక; జననీ = తల్లి ఐన; స్వయమ్ = స్వయముగా; కృత్తా = వధింపబడినది; పరశునా = గొడ్డలిచే; అరణ్యే = అరణ్యమునందు; పితుః = తండ్రి యొక్క; వచన = మాట; కారిణా = కారణమున.
భావంః-
జమదగ్ని కుమారుడైన పరశురాముడు, తండ్రి ఆజ్ఞను పాలించి, అరణ్యమునందు, గొడ్డలిచే తన తల్లియైన రేణుక యొక్క కంఠము నుత్తరించెను.
2.21.33.
అనుష్టుప్.
ఏతైరన్యైశ్చ బహుభిః
దేవి దేవసమైః కృతమ్।
పితుర్వచనమక్లీబమ్
కరిష్యామి పితుర్హితమ్॥
టీకః-
ఏతైః = వీరి వలనను; అన్యైశ్చ = ఇతరుల చేతను; బహుభిః = అనేకులచే; దేవి = దేవీ; దేవసమైః = దైవ సమానులైన; కృతమ్ = చేయబడినది; పితుః = తండ్రి యొక్క; వచనమ్ = వచనము; అక్లీబమ్ = వ్యర్థము కానట్లుగా; కరిష్యామి = చేసెదను; పితుః = తండ్రి యొక్క; హితమ్ = హితమును.
భావంః-
తల్లీ! వీరును మరియు దైవసమానులైన ఇతరులు ఎందరో కూడ తమ తండ్రి ఆజ్ఞను పాటించిరి. అట్లే నేను కూడ నా తండ్రికి ఇష్టమైన కార్యమును చేసెదను.
2.21.34.
అనుష్టుప్.
న ఖల్వేతన్మయైకేన
క్రియతే పితృశాసనమ్।
ఏతైరపి కృతం దేవి
యే మయా తవ కీర్తితాః॥
టీకః-
న = లేదు; ఖలు = నిశ్చయముగా; ఏతత్ = ఈ; మయా = నాచే; ఏకేన = ఒక్కనివలన; క్రియతే = చేయబడుట; పితృశాసనమ్ = తండ్రి ఆజ్ఞను; ఏతైః = వీరిచే; అపి = కూడా; కృతం = చేయబడినది; దేవి = దేవీ; యే = ఎవరు; మయా = నాచే; తవ = నీకు; కీర్తితాః = చెప్పబడినారో.
భావంః-
దేవీ! తండ్రి ఆజ్ఞను నేనొక్కడినే పాలించుటలేదు. నాచే పేర్కొనబడిన వీరందరు తండ్రి ఆజ్ఞను పాలించిన వారే.
2.21.35.
అనుష్టుప్.
నాహం ధర్మమపూర్వం తే
ప్రతికూలం ప్రవర్తయే।
పూర్వైరయమభిప్రేతో
గతో మార్గోఽ నుగమ్యతే॥
టీకః-
న = లేదు; అహం = నేను; ధర్మమ్ = ధర్మమును; అపూర్వం = క్రొత్తది; తే = నీ కొరకై; ప్రతికూలం = వ్యతిరేకమైనది; ప్రవర్తయే = ప్రవర్తించుట; పూర్వైః = పూర్వీకులచే; అయమ్ = ఈ; అభిప్రేతః = అంగీకరింపబడిన; గతః = పాత; మార్గః = మార్గము; అనుగమ్యతే = అనుసరింపబడుచున్నది.
భావంః-
నేను పూర్వాచారమునకు వ్యతిరేకముగా క్రొత్తగా దేనినీ నీ కొరకై చెప్పుటలేదు. పూర్వీకులందరు అంగీకరించి, అనుసరించిన మార్గమునే నేను అనుసరించుచున్నాను.
2.21.36.
అనుష్టుప్.
తదేతత్తు మయా కార్యమ్
క్రియతే భువి నాన్యథా।
పితుర్హి వచనం కుర్వన్
న కశ్చిన్నామ హీయతే॥
టీకః-
తత్ ఏతత్ = అటువంటి ఈ; మయా = నాచేత; కార్యమ్ = కార్యము; క్రియతే = చేయబడుట; భువి = భూలోకమునందు; న = లేదు; అన్యథా = మరియొక విధముగా; పితుః = తండ్రి యొక్క; హి = కదా; వచనం = వచనమును; కుర్వన్ = చేయు; న = లేదు; కశ్చిత్ = ఎవ్వడు; నామ = పేరు; హీయతే = నాశనము.
భావంః-
భూలోకమునందు తండ్రి యొక్క ఆజ్ఞకు విరుద్ధముగ ఏమియు చేయజాలను. తండ్రి ఆజ్ఞను పాటించిన వానికి అపకీర్తి కలుగదు.
2.21.37.
అనుష్టుప్.
తామేవముక్త్వా జననీమ్
లక్ష్మణం పునరబ్రవీత్।
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః
శ్రేష్ఠస్సర్వధనుష్మతామ్॥
టీకః-
తామ్ = ఆ; ఏవమ్ = ఈ; ఉక్త్వా = పలికి; జననీమ్ = తల్లిని గూర్చి; లక్ష్మణం = లక్ష్మణుని గూర్చి; పునః = మరల; అబ్రవీత్ = పలికెను; వాక్యం = మాటలు; వాక్యవిదాం = మాటల నేర్పరి; శ్రేష్ఠః = గొప్ప; శ్రేష్ఠః = శ్రేష్టుడు; సర్వధనుష్మతామ్ = ధనుస్సును ధరించిన వారందరిలో.
భావంః-
మాటలాడుట యందు నేర్పరియు, ధనుస్సును ధరించిన వారందరిలో శ్రేష్ఠుడును ఐన రాముడు తల్లితో ఇట్లు పలికి, తరువాత లక్ష్మణునితో ఇట్లనెను.
2.21.38.
అనుష్టుప్.
తవ లక్ష్మణ జానామి
మయి స్నేహమనుత్తమమ్।
విక్రమం చైవ సత్త్వం చ
తేజశ్చ సుదురాసదమ్॥
టీకః-
తవ = నీయొక్క; లక్ష్మణ = లక్ష్మణా; జానామి = తెలియుదును; మయి = నాయందున్న; స్నేహమ్ = స్నేహమును; అనుత్తమమ్ = ఉత్తమమైనది; విక్రమం చైవ = పరాక్రమము కూడ; సత్త్వం = బలమును; తేజశ్చ = తేజస్సును; సుదురాసదమ్ = ఎదుర్కొనజాలని.
భావంః-
లక్ష్మణా! నీకు నాపై నున్న గొప్ప ప్రేమను, నీ పరాక్రమమును, బలమును, ఎదుర్కొనబడలేని నీ తేజస్సును కూడ నేనెరుగుదును.
2.21.39.
అనుష్టుప్.
మమ మాతుర్మహద్దుఃఖమ్
అతులం శుభలక్షణ।
అభిప్రాయమవిజ్ఞాయ
సత్యస్య చ శమస్య చ॥
టీకః-
మమ = నా యొక్క; మాతుః = తల్లికి; మహత్ దుఃఖమ్ = గొప్ప దుఃఖము; అతులం = సాటిలేని; శుభలక్షణ = మంచి లక్షణములు గల; అభిప్రాయమ్ = రహస్యము; అవిజ్ఞాయ = తెలియక; సత్యస్య = సత్యము యొక్క; శమస్య = శాంతి యొక్క.
భావంః-
మంచి లక్షణములు గల లక్ష్మణా! మా తల్లి సత్యముయొక్కయు, శాంతియొక్కయు, రహస్యము తెలియకపోవుటచే, అనంతమైన దుఃఖమును అనుభవించుచున్నది.
2.21.40.
అనుష్టుప్.
ధర్మో హి పరమో లోకే
ధర్మే సత్యం ప్రతిష్ఠితమ్।
ధర్మసంశ్రితమేతచ్చ
పితుర్వచనముత్తమమ్॥
టీకః-
ధర్మః = ధర్మమే; హి = కదా; పరమః = శ్రేష్ఠమైనది; లోకే = లోకము నందు; ధర్మే = ధర్మము నందు; సత్యం = సత్యము; ప్రతిష్ఠితమ్ = నిలిచియున్నది; ధర్మసంశ్రితమ్ = ధర్మమును ఆశ్రయించి ఉన్నది; ఏతత్ = ఈ; పితుః = తండ్రి యొక్క; వచనమ్ = మాట; ఉత్తమమ్ = ఉత్తమమైనది.
భావంః-
లోకమునందు అన్నిటికంటెను ధర్మమే శ్రేష్ఠమైనది. ధర్మమునందే సత్యము నిలిచి యున్నది. ఉత్తమమైన మన తండ్రి ఆజ్ఞ కూడ ధర్మమునే ఆశ్రయించి ఉన్నది.
2.21.41.
అనుష్టుప్.
సంశ్రుత్య చ పితుర్వాక్యమ్
మాతుర్వా బ్రాహ్మణస్య వా।
న కర్తవ్యం వృథా వీర
ధర్మమాశ్రిత్య తిష్ఠతా॥
టీకః-
సంశ్రుత్య = శపథము చేసి; పితుః = తండ్రికి; వాక్యమ్ = మాటను; మాతుః వా = తల్లికి గాని; బ్రాహ్మణస్య వా = బ్రాహ్మణునకు గాని; న = తగదు; కర్తవ్యం = చేయదగినది; వృథా = వ్యర్థము; వీర = వీరా; ధర్మమ్ = ధర్మమును; ఆశ్రిత్య = ఆశ్రయించి; తిష్ఠతా = ఉన్న.
భావంః-
ధర్మమును ఆశ్రయించినవాడు, తండ్రికి గాని, తల్లికి గాని, బ్రాహ్మణునకు గాని, ఇచ్చిన మాటను వృథా చేయుట తగదు.
2.21.42.
అనుష్టుప్.
సోఽ హం న శక్ష్యామి పితుః
నియోగమతివర్తితుమ్।
పితుర్హివచనాద్వీర
కైకేయ్యాఽ హం ప్రచోదితః॥
టీకః-
సః = అటువంటి; అహం = నేను; న = లేను; శక్ష్యామి = సమర్థుడను; పితుః = తండ్రి యొక్క; నియోగమ్ = ఆజ్ఞను; అతివర్తితుమ్ = అతిక్రమించుటకు; పితుః = తండ్రి యొక్క; హి = కదా; వచనాత్ = మాటల వలన; వీర = వీరా; కైకేయ్యా = కైకేయిచే; అహం = నేను; ప్రచోదితః = ప్రేరేపింపబడితిని.
భావంః-
లక్ష్మణా! నేను తండ్రి మాటను జవదాటజాలను. కైకేయి కూడ తండ్రి మాట ప్రకారమే నన్ను అరణ్యమునకు వెళ్ళుటకు ప్రేరేపించినది కదా.
2.21.43.
అనుష్టుప్.
తదేతాం విసృజానార్యామ్
క్షత్రధర్మాశ్రితాం మతిమ్।
ధర్మమాశ్రయ మా తైక్ష్ణ్యమ్
మద్బుద్ధిరనుగమ్యతామ్॥
టీకః-
తత్ = ఆ; ఏతామ్ = దానిని; విసృజ = వదులుము; అనార్యామ్ = చెడ్డదైన; క్షత్రధర్మ = క్షత్రియ ధర్మమును; ఆశ్రితాం = ఆశ్రయించిన; మతిమ్ = బుద్ధిని; ధర్మమ్ = ధర్మమును; ఆశ్రయ = ఆశ్రయించుము; మా = వలదు; తైక్ష్ణ్యమ్ = కోపము; మత్ = నా యొక్క; బుద్ధిః = బుద్ధి; అనుగమ్యతామ్ = అనుసరించుము.
భావంః-
కావున లక్ష్మణా! క్షత్రియ ధర్మమునకు సంబంధించినది ఐనను, ఈ ఆలోచనను మానుము. ధర్మమును ఆశ్రయింపుము. కోపమును విడువుము. నా ఆలోచనను అనుసరించుము.
2.21.44.
అనుష్టుప్.
తమేవముక్త్వా సౌహార్దాత్
భ్రాతరం లక్ష్మణాగ్రజః।
ఉవాచ భూయః కౌసల్యామ్
ప్రాఞ్జలిశ్శిరసానతః॥
టీకః-
తమ్ = ఆ; ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; సౌహార్దాత్ = స్నేహము వలన; భ్రాతరం = సోదరుని గూర్చి; లక్ష్మణాగ్రజః = లక్ష్మణుని యొక్క అన్న; ఉవాచ = పలికెను; భూయః = మరల; కౌసల్యామ్ = కౌసల్యను గూర్చి; ప్రాఞ్జలిః = చేతులు జోడించి; శిరసా = శిరస్సు; నతః = వంచి.
భావంః-
రాముడు సహృదయముగా తమ్మునితో ఇట్లు పలికి, శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించుచు కౌసల్యతో మరల ఇట్లు పలికెను.
2.21.45.
అనుష్టుప్.
అనుమన్యస్వ మాం దేవి
గమిష్యన్తమితో వనమ్।
శాపితాఽ సి మమ ప్రాణైః
కురు స్వస్త్యయనాని మే॥
టీకః-
అనుమన్యస్వ = అనుమతింపుము; మాం = నన్ను; దేవి = దేవీ; గమిష్యన్తమ్ = వెళ్లనున్న; ఇతః = ఇచటనుండి; వనమ్ = అరణ్యమునుగూర్చి; శాపితా = శపథము చేసి; అసి = ఉన్న; మమ = నా యొక్క; ప్రాణైః = ప్రాణములచే; కురు = చేయుము; స్వస్త్యయనాని = మంగళకరమగునవి; మే = నాకు.
భావంః-
అమ్మా! నా ప్రాణములపై ఒట్టు పెట్టుచున్నాను. అరణ్యమునకు పోవుటకు నాకు అనుమతినిమ్ము. నాకు మంగళము చేకూర్చు పనులను చేయుము.
2.21.46.
అనుష్టుప్.
తీర్ణప్రతిజ్ఞశ్చ వనాత్
పునరేష్యామ్యహం పురీమ్।
యయాతిరివ రాజర్షిః
పురా హిత్వా పునర్దివమ్॥
టీకః-
తీర్ణప్రతిజ్ఞశ్చ = ప్రతిజ్ఞను పాటించి; వనాత్ = వనమునుండి; పునః = మరల; ఏష్యామి = వచ్చెదను; అహం = నేను; పురీమ్ = పట్టణమునకు; యయాతిః = యయాతి; ఇవ = వలె; రాజర్షిః = రాజర్షి; పురా = పూర్వము; హిత్వా = వదలి; పునః = మరల; దివమ్ = స్వర్గమును.
భావంః-
పూర్వము రాజర్షియైన యయాతి ఒక పర్యాయము స్వర్గమును విడిచి వచ్చి, తిరిగి స్వర్గమునకు పోయినట్లు, నేను ప్రతిజ్ఞను పూర్తి చేసుకొని అరణ్యమునుండి తిరిగి పట్టణమునకు వచ్చెదను.
2.21.47.
అనుష్టుప్.
శోకస్సన్ధార్యతాం మాతః
హృదయే సాధు మా శుచః।
వనవాసాదిహైష్యామి
పునః కృత్వా పితుర్వచః॥
టీకః-
శోకః = దుఃఖము; సన్ధార్యతాం = అణచబడుగాక; మాతః = తల్లీ; హృదయే = హృదయమునందు; సాధు = బాగుగ; మా శుచః = దుఃఖింప వలదు; వనవాసాత్ = వనవాసమునుండి; ఇహ = ఇటకు; ఏష్యామి = వచ్చెదను; పునః = మరల; కృత్వా = చేసి; పితుః = తండ్రి యొక్క; వచః = మాటను.
భావంః-
తల్లీ! నీవు దుఃఖింపవలదు. దుఃఖమును నీ హృదయమునందే అణచివేసుకొనుము. తండ్రి ఆజ్ఞను పాటించి నేను వనవాసమునుండి తిరిగి ఇక్కడకు వచ్చెదను.
2.21.48.
అనుష్టుప్.
త్వయా మయా చ వైదేహ్యా
లక్ష్మణేన సుమిత్రయా।
పితుర్నియోగే స్థాతవ్యమ్
ఏష ధర్మస్సనాతనః॥
టీకః-
త్వయా = నీచేతను; మయా = నాచేతను; వైదేహ్యా = సీతచేతను; లక్ష్మణేన = లక్ష్మణునిచేతను; సుమిత్రయా = సుమిత్రచేతను; పితుః = తండ్రియొక్క; నియోగే = ఆజ్ఞయందు; స్థాతవ్యమ్ = ఉండవలెను; ఏషః = ఇది; ధర్మః = ధర్మము ;సనాతనః = సనాతనమైన.
భావంః-
నీవు, నేను, సీత, లక్ష్మణుడు మరియు సుమిత్ర మనమందరమును, మా తండ్రిగారి మాటను అనుసరించి ఉండవలెను. ఇది సనాతనమైన ధర్మము.
2.21.49.
అనుష్టుప్.
అమ్బ సంహృత్య సమ్భారాన్
దుఃఖం హృది నిగృహ్య చ।
వనవాసకృతా బుద్ధిః
మమ ధర్మ్యాఽ ను వర్త్యతామ్॥
టీకః-
అమ్బ = తల్లీ; సంహృత్య = తొలగించి; సమ్భారాన్ = అభిషేక సంభారములను; దుఃఖం = దుఃఖమును; హృది = హృదయమునందు; నిగృహ్య చ = నిగ్రహించుకొని; వనవాసకృతా = వనవాసము చేయుటకు సంబంధించిన; బుద్ధిః = బుద్ధి; మమ = నా యొక్క; ధర్మ్యా = ధర్మ సంబంధమైన; అనువర్త్యతామ్ = అనుసరింపబడుగాక.
భావంః-
తల్లీ! అభిషేక సంభారములన్నిటిని తొలగించి, దుఃఖమును మనసునందే నిగ్రహించుకొని, వనవాసమునకు వెళ్ళవలెనను నా ధర్మసమ్మతమైన ఆలోచనను నీవు అంగీకరింపుము.
2.21.50.త్రిష్టుప్
ఏతద్వచస్తస్య నిశమ్య మాతా
సుధర్మ్యమవ్యగ్రమవిక్లబం చ।
మృతేవ సంజ్ఞాం ప్రతిలభ్య దేవీ
సమీక్ష్య రామం పునరిత్యువాచ॥
టీకః-
ఏతత్ = ఈ; వచః = వచనము; తస్య = అతనియొక్క; నిశమ్య = విని; మాతా = తల్లి ఐన; సుధర్మ్యమ్ = ధర్మసమ్మతమైన; అవ్యగ్రమ్ = తొందరపాటులేని; అవిక్లబం చ = వైకల్యములేని; మృత = మరణించిన; ఇవ = వలె; సంజ్ఞాం = సంజ్ఞను; ప్రతిలభ్య = పొంది; దేవీ = దేవీ; సమీక్ష్య = చూచి; రామం = రాముని; పునః = మరల; ఇతి = ఇట్లు; ఉవాచ = పలికెను.
భావంః-
మరణించి మరల బ్రతికినట్లుగా కౌసల్య తేరుకొని, తొందరపడక, ధర్మమునకు ఆటంకము కలుగకుండునట్లు, రాముని చూచి తిరిగి ఇట్లు పలికెను.॥॥
2.21.51.త్రిష్టుప్
యథైవ తే పుత్ర! పితా తథాఽ హం
గురు స్స్వధర్మేణ సుహృత్తయా చ।
న త్వాఽ నుజానామి న మాం విహాయ
సుదుఃఖితామర్హసి గన్తుమేవమ్॥
టీకః-
యథైవ = ఎట్లో; తే = నీకు; పుత్ర = పుత్రా; పితా = తండ్రి; తథా = అట్లే; అహం = నేను; గురుః = గురువును; స్వధర్మేణ = స్వధర్మముచే; సుహృత్తయా = సహృదయముతో; న = లేదు; త్వా = నిన్ను; అనుజానామి = అనుమతించుట; న = కాదు; మాం = నన్ను; విహాయ = విడిచి; సుదుఃఖితామ్ = చాల దుఃఖించుచున్న; అర్హసి = తగువాడవు; గన్తుమ్ = వెళ్ళుటకు; ఏవమ్ = ఇట్లు.
భావంః-
పుత్రా! స్వధర్మముచేతను, సహృదయముతోడను నీ తండ్రి నీకు ఎట్లు గురువగునో, అట్లే నేను కూడా నీకు గురువు నగుదును. నిన్ను అనుమతించుటలేదు. దుఃఖమునందున్న నన్ను విడిచి వెళ్ళుట నీకు తగదు.
2.21.52.త్రిష్టుప్
కిం జీవితేనేహ వినా త్వయా మే
లోకేన వా కిం స్వధయాఽ మృతేన।
శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం
మమేహ కృత్స్నాదపి జీవలోకాత్॥
టీకః-
కిం = ఏమి; జీవితేన = జీవితముచే; ఇహ = ఇక్కడ; వినా = కాక; త్వయా = నీవు; మే = నాకు; లోకేన వా = లోకమునందు గాని; కిం = ఏమి; స్వధయా = పితృతర్పణముచేత గాని; అమృతేన = అమృతముచేత గాని; శ్రేయః = శ్రేష్ఠము; ముహూర్తం = క్షణమైనను; తవ = నీయొక్క; సన్నిధానం = సాన్నిధ్యము; మమ = నాకు; ఇహ = ఇక్కడ; కృత్స్నాత్ = సమస్తమైన; అపి = కూడ; జీవలోకాత్ = ప్రాణులకన్న.
భావంః-
నిన్ను విడిచి నేను ఈ లోకములో జీవించలేను. పితృదేవతలకు అర్పించబడు తర్పణముగాని, దేవతలకు లభించు అమృతముగాని నాకు ఎందులకు? అనుక్షణము నీవు నా దగ్గర ఉండుటయే, కోటి ప్రాణులు ఉండుటకన్న సుఖప్రదము.
2.21.53.త్రిష్టుప్
నరైరివోల్కాభిరపోహ్యమానో
మహాగజోఽ ధ్వానమనుప్రవిష్టః।
భూయః ప్రజజ్వాల విలాపమేవం
నిశమ్య రామః కరుణం జనన్యాః॥
టీకః-
నరైః = మనుష్యులచేత; ఇవ = వలె; ఉల్కాభిః = కొరవులతో; అపోహ్యమానః = నిలువరింపబడుచున్న; మహాగజః = పెద్ద ఏనుగు; అధ్వానమ్ = మార్గమును; అనుప్రవిష్టః = ప్రవేశించినది; భూయః = మరల; ప్రజజ్వాల = పరితపించెను; విలాపమ్ = విలాపమును; ఏవం = ఈ విధముగ; నిశమ్య = విని; రామః = రాముడు; కరుణం = జాలిగొలుపు; జనన్యాః = తల్లి యొక్క.
భావంః-
రాముడు తల్లి దీనాలాపములను విని, దారిలో నడచివచ్చు మదపుటేనుగు మనుజులచే కొరవులతో అడ్డగింపబడినట్లు మిగుల పరితపించెను.
2.21.54.త్రిష్టుప్
స మాతరం చైవ విసంజ్ఞకల్పా
మార్తం చ సౌమిత్రిమభిప్రతప్తమ్।
ధర్మే స్థితో ధర్మ్యమువాచ వాక్యం
యథా స ఏవార్హతి తత్ర వక్తుమ్॥
టీకః-
సః = అతడు; మాతరం = తల్లిని గూర్చి; ఇవ = వలె; విసంజ్ఞకల్పామ్ = స్పృహ కోల్పోయిన; ఆర్తం చ = పీడితుడు; సౌమిత్రి = లక్ష్మణుడు; అభిప్రతప్తమ్ = పరితపించుచున్న; ధర్మే = ధర్మమునందు; స్థితః = ఉన్న; ధర్మ్యమ్ = ధర్మ సంబద్ధమైన; ఉవాచ = పలికెను; వాక్యం = మాటలు; యథా = అట్లు; సః = అతడు; ఏవ = మాత్రమే; అర్హతి = తగును; తత్ర = అక్కడ; వక్తుమ్ = పలుకుటకు.
భావంః-
ధర్మమునందు స్థిరచిత్తముగల రాముడు, స్పృహ కోల్పోయినట్లున్న తల్లితోను, దుఃఖించుచున్న లక్ష్మణునితోను ధర్మబద్ధముగ పలికెను. అటువంటి సమయమున అట్లు పలుకుటకు రాముడు మాత్రమే సమర్ధుడు.
2.21.55.త్రిష్టుప్
అహం హి తే లక్ష్మణ! నిత్యమేవ
జానామి భక్తిం చ పరాక్రమం చ।
మమ త్వభిప్రాయమసన్నిరీక్ష్య
మాత్రా సహాభ్యర్దసి మాం సుదుఃఖమ్॥
టీకః-
అహం = నేను; హి = కదా; తే = నీ యొక్క; లక్ష్మణ = లక్ష్మణా; నిత్యమ్ = నిత్యము; ఇవ = వలె; జానామి = ఎరుగుదును; భక్తిం చ = భక్తిని; పరాక్రమం చ = పరాక్రమమును; మమ = నా యొక్క; తు = కాని; అభిప్రాయమ్ = అభిప్రాయమును; అసన్నిరీక్ష్య = చూడకనె; మాత్రా సహా = తల్లితో కూడి; అభ్యర్దసి = పీడించుచుంటివి; మాం = నన్ను; సుదుఃఖమ్ = చాల దుఃఖముతో.
భావంః-
లక్ష్మణా! నిత్యము నీకు నాయందున్న భక్తిని పరాక్రమమును నేనెరుగుదును. కాని, నీ విపుడు నా అభిప్రాయమును తెలుసుకొనకనే, తల్లితో కూడి నాకు బాధ కలుగునట్లు ప్రవర్తించుచున్నావు.
2.21.56.త్రిష్టుప్
ధర్మార్థకామాః ఖలు తాత లోకే
సమీక్షితా ధర్మఫలోదయేషు।
తే తత్ర సర్వే స్యురసంశయం మే
భార్యేవ వశ్యాఽ భిమతా సుపుత్రా॥
టీకః-
ధర్మ = ధర్మము; అర్థ = ధనము; కామాః = కోరికలు; ఖలు = నిశ్చయముగా; తాత = తండ్రి; లోకే = లోకము నందు; సమీక్షితాః = చూడబడినవి; ధర్మఫలోదయేషు = ధర్మమువలన కలుగు లాభమున; తే = అవి; తత్ర = ఆ; సర్వే = అన్నియు; స్యుః = ఉండును; అసంశయం = నిస్సంశయముగా; మే = నాకు; భార్య = భార్య; ఇవ = వలె; వశ్యా = వశము; అభిమతా = ప్రియము; సుపుత్రా = సత్సంతానవతి.
భావంః-
నాయనా లక్ష్మణా! ధర్మార్థకామములు ధర్మ ఫలమునే ఇచ్చును. సహధర్మచారిణియు సత్సంతానవతియు నైన భార్య వలె ధర్మము ధర్మార్థకామములన్నిటిని కలిగియుండును. ఈ విషయము నందు నాకెట్టి సందేహము లేదు.
2.21.57.త్రిష్టుప్
యస్మింస్తు సర్వే స్యురసన్నివిష్టా
ధర్మో యత స్స్యాత్తదుపక్రమేత।
ద్వేష్యో భవత్యర్థపరో హి లోకే
కామాత్మతా ఖల్వపి న ప్రశస్తా॥
టీకః-
యస్మిన్ = దేనియందు; అస్తు = ఉన్నది; సర్వే = అన్నియు; స్యుః = ఉన్నవో; అసన్నివిష్టాః = కలసి; ధర్మః = ధర్మము; యతః = దేనివలన; స్యాత్ = కలుగునో; తత్ = దానిని; ఉపక్రమేత = ప్రారంభించవలెను; ద్వేష్యః = ద్వేషింప తగినవాడు; భవతి = అగును; అర్థపరః = ధనాపేక్ష గలవాడు; హి = కదా; లోకే = లోకమునందు; కామాత్మతా = కోరిక వలన; ఖలు = నిశ్చయము; అపి = కూడ; న = కాదు; ప్రశస్తా = ప్రశస్తము.
భావంః-
ధర్మార్థ కామములన్నియు కలిగి ఉన్న ధర్మబద్ధమైన కార్యమునే చేపట్టవలెను. ధనాపేక్ష కలవానిని లోకము ద్వేషించును. కేవలము కామపరమైన పని కూడ మంచిది కాదు.
2.21.58.త్రిష్టుప్
గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః
క్రోధాత్ప్రహర్షాద్యది వాఽ పి కామాత్।
యద్వ్యాదిశేత్కార్యమవేక్ష్య ధర్మం
కస్తన్న కుర్యాదనృశంసవృత్తిః॥
టీకః-
గురుశ్చ = పూజ్యుడు; రాజా చ = రాజు; పితా చ = తండ్రి; వృద్ధః = వృద్ధుడు; క్రోధాత్ = క్రోధమువలన; ప్రహర్షాత్ = సంతోషమువలన; యది వా = లేక; అపి = కూడ; కామాత్ = కామమువలన; యత్ = ఏ; వ్యాదిశేత్ = నిర్దేశించునో; కార్యమ్ = కార్యమును; అవేక్ష్య = చూచి; ధర్మం = ధర్మమును; కః = ఎవడు; తత్ = దానిని; న = లేడు; కుర్యాత్ = చేయుటకు; అనృశంసవృత్తిః = క్రూరమైన ప్రవృత్తిలేనివాడు.
భావంః-
పూజ్యుడును, రాజు, వృద్ధుడును ఐన తండ్రి, కోపమువలన గాని, సంతోషమువలన గాని, కామమువలన గాని, ఒక కార్యమును చేయుమని నిర్దేశించినపుడు, దానిని ధర్మపరాయణుడు చేయకుండగ ఉండునా. క్రూరప్రవృత్తి కలవాడు మాత్రమే అట్టి కార్యమును చేయకుండును.॥॥॥
2.21.59.త్రిష్టుప్
స వై న శక్నోమి పితుః ప్రతిజ్ఞా
మిమామకర్తుం సకలాం యథావత్।
స హ్యావయోస్తాత! గురుర్నియోగే
దేవ్యాశ్చ భర్తా స గతి స్సధర్మః॥
టీకః-
సః = అటువంటి నేను; న = కాను; శక్నోమి = సమర్థుడను; పితుః = తండ్రియొక్క; ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను; ఇమామ్ = ఈ; అకర్తుం = చేయకుండుటకు; సకలాం = సమస్తమైన; యథావత్ = సరిగా; సః = అతడు; హి = కదా; ఆవయోః = మన ఇద్దరకు; తాత = తండ్రి; గురుః = గురువు; నియోగే = ఆజ్ఞాపించిన; దేవ్యాశ్చ = తల్లికి కూడ; భర్తా = భర్త; సః = అతడు; గతిః = గతి; సః = అతడు; ధర్మః = ధర్మము.
భావంః-
తండ్రి ఆజ్ఞను యథావిధిగా నిర్వర్తింపకుండగ నేను ఉండజాలను. తండ్రి మన ఇద్దరిని ఆజ్ఞాపించగల గురువు. తల్లికి కూడ ఆయనే భర్త, గతి. ఆయనే ధర్మము.
2.21.60.త్రిష్టుప్
తస్మిన్పునర్జీవతి ధర్మరాజే
విశేషతస్స్వే పథి వర్తమానే।
దేవీ మయా సార్ధమితోఽ పగచ్ఛేత్
కథం స్విదన్యా విధవేవ నారీ॥
టీకః-
తస్మిన్ = అతడు; పునర్జీవతి = జీవించి ఉండగా; ధర్మరాజే = ధర్మమునకు అధిపతి ఐన; విశేషతః = విశేషముగ; స్వే = తన యొక్క; పథి = మార్గమునందు; వర్తమానే = ప్రవర్తించుచుండగా; దేవీ = తల్లీ; మయాసార్ధమ్ = నాతో కూడి; ఇతః = ఇక్కడి నుండి; అపగచ్ఛేత్ = వెడలిపోవుట; కథంస్విత్ = ఎట్లు; అన్యా = ఇతర; విధవా = భర్త లేని; ఇవ = వలె; నారీ = స్త్రీ.
భావంః-
ధర్మాధికారి ఐన దశరథ మహారాజు, ధర్మ మార్గమున ప్రవర్తించుచు జీవించి యుండగా, తల్లి కౌసల్య భర్త లేని స్త్రీ వలె ఇక్కడనుండి నాతో ఎట్లు రాగలదు?
2.21.61.త్రిష్టుప్
సా మాఽ నుమన్యస్వ వనం వ్రజన్తం
కురుష్వ న స్స్వస్త్యయనాని దేవి!।
యథా సమాప్తే పునరావ్రజేయం
యథా హి సత్యేన పునర్యయాతిః॥
టీకః-
సా = అటువంటి నీవు; మా = నన్ను; అనుమన్యస్వ = అనుమతింపుము; వనం = వనమును గూర్చి; వ్రజన్తం = పోవుచున్నట్లు; కురుష్వ = చేయుము; స్వస్త్యయనాని = మంగళకరమగు పూర్ణకుంభములు; దేవి = తల్లీ; యథా = అట్లు; సమాప్తే = ముగిసిన పిమ్మట; పునః = మరల; ఆవ్రజేయం = వచ్చెదను; యథా = అట్లు; హి = కదా; సత్యేన = సత్యవ్రతము వలన; పునః = మరల; యయాతిః = యయాతి మహారాజు.
భావంః-
తల్లీ నేను అడవికి పోవుటకు అనుమతించుము. సత్యవ్రత బలము వలన యయాతి మహారాజు ఏ విధముగా తిరిగి స్వర్గమునకు వెళ్ళినాడో, అట్లే నేను కూడ వనవాసము ముగిసిన పిమ్మట తిరిగి వచ్చునట్లు మంగళకరముగ నన్నాశీర్వదించుము. మంగళకరమగు పూర్ణకుంభములను చేయుము.
2.21.62.త్రిష్టుప్
యశో హ్యహం కేవలరాజ్యకారణా
న్న పృష్ఠతః కర్తుమలం మహోదయమ్।
అదీర్ఘకాలే న తు దేవి జీవితే
వృణేఽ వరామద్య మహీమధర్మతః॥
టీకః-
యశః హి = కీర్తిని; అహం = నేను; కేవల = కేవలము; రాజ్యకారణాత్ = రాజ్యకారణమువలన; న = కాను; పృష్ఠతః = వెనుక; కర్తుమ్ = చేయుటకు; అలం = సమర్థుడను; మహోదయమ్ = గొప్పలాభము గల; అదీర్ఘకాలే = అనిత్యము; న = లేను; దేవి = తల్లీ; జీవితే = జీవితమునందు; వృణే = కోరిక; అవరామ్ = తుచ్ఛమైన; అద్య = ఇప్పుడు; మహీమ్ = భూమిని; అధర్మతః = అధర్మముగా.
భావంః-
తల్లీ! కేవలము రాజ్యముకొరకై గొప్ప సత్ఫలములనిచ్చు కీర్తిని నేను విడువజాలను. అనిత్యమైన ఈ జీవితముకొరకై, తుచ్ఛమైన రాజ్యమును అధర్మముగా పొందుటకు ఇచ్చగించను.
2.21.63.
జగతి.
ప్రసాదయన్నరవృషభ స్సమాతరం
పరాక్రమాజ్జిగమిషురేవ దణ్డకాన్।
అథానుజం భృశమనుశాస్య దర్శనం
చకార తాం హృది జననీం ప్రదక్షిణమ్॥
టీకః-
ప్రసాదయన్ = ఓదార్చుచు; నరవృషభః = మానవోత్తముడు; సః = అతడు; మాతరం = తల్లిని; పరాక్రమాత్ = పరాక్రమమువలన; జిగమిషురేవ = వెళ్ళవలెనను కోరిక కలవాడై; దణ్డకాన్ = దండకారణ్యమునుగూర్చి; అథ = తరువాత; అనుజం = తమ్ముని; భృశమ్ = ఎక్కువగా; అనుశాస్య = బోధించి; దర్శనం = మంచి ఆలోచనలు; చకార = చేసెను; తాం = తనయొక్క; హృది = మనసునందు; జననీం = తల్లికి; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము.
భావంః-
మానవశ్రేష్ఠుడైన రాముడు పరాక్రమముగా దండకారణ్యమునకు వెళ్ళ వలెనని నిశ్చయించుకొని, తల్లిని సాంత్వనపరచి, తమ్మునికి సద్బోధలు చేసి, మనసా తల్లికి ప్రదక్షిణము చేసెను.
2.21.64.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే ఏకవింశః సర్గః॥
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; ద్వావింశః = ఇరవైరెండవ [22]; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని [22] ఇరవై రెండవ సర్గ సంపూర్ణము.
2.22.1.
అనుష్టుప్.
అథ తం వ్యథయా దీనమ్
సవిశేషమమర్షితమ్।
శ్వసంతమివ నాగేంద్రమ్
రోషవిస్ఫారితేక్షణమ్॥
టీకః-
అథ = తరువాత; తం = మీకు; వ్యథయా = బాధపడుచు; దీనమ్ = దీనముగా; సవిశేషమ్ = మిక్కిలి; అమర్షితమ్ = కోపముతో; శ్వసంతమ్ = బుసలు కొడుతు; ఇవ = వలె; నాగేంద్రమ్ = నాగేంద్రుని; రోష = కోపముతో; విస్ఫారిత = పెద్దవిగా చేయబడిన; ఈక్షణమ్ = చూపులతో
భావంః-
పిదప దృఢచిత్తుడైన ఆ రాముడు, ధైర్యముతో తన మనోభావములను అణుచుకొనుచు, మానసిక దుఃఖముచే దీనుడు, ఎక్కువ కోపగించినవాడు, కోపముతో పెద్దవైన నేత్రములు కలవాడై, నాగేంద్రుని వలె బుసలు కొట్టుచున్నవాడు.
2.22.2.
అనుష్టుప్.
ఆసాద్య రామస్సౌమిత్రిమ్
సుహృదం భ్రాతరం ప్రియమ్।
ఉవాచేదం స ధైర్యేణ
ధారయన్సత్త్వమాత్మవాన్॥
టీకః-
ఆసాద్య = సమీపించిన; రామః = రాముడు; సౌమిత్రిమ్ = లక్ష్మణుని; సుహృదమ్ = మంచి హృదయము కలవాడు; భ్రాతరమ్ = సోదరుని; ప్రియమ్ = ప్రియమైన; ఉవాచ = పలికెను; ఇదమ్ = ఈ మాటలు; సః = అతడు; ధైర్యేణ = ధైర్యముతో; ధారయన్ = నియంత్రించుటచేత; సత్త్వమ్ = మనస్సు; ఆత్మవాన్ = స్వయముగా కూర్చబడిన
భావంః-
రాముడు మంచి హృదయము కలవాడు, ప్రియ సోదరుడు అయిన లక్ష్మణుని సమీపించి, తన మనస్సు కూడగట్టుకొని ఇట్లు పలికెను.
2.22.3.
అనుష్టుప్.
నిగృహ్య రోషం శోకం చ
ధైర్యమాశ్రిత్య కేవలమ్।
అవమానం నిరస్యేమమ్
గృహీత్వా హర్షముత్తమమ్॥
టీకః-
ఆశ్రిత్య = ఆశ్రయించి; కేవలమ్ = మాత్రమే; అవమానం = అవమానమును; నిరస్యః = బహిష్కరింపబడిన వాడవై; ఇయమ్ = దీనిని; గృహీత్వా = స్వీకరించుము; హర్షమ్ = ఆనందము; ఉత్తమమ్ = గొప్పది
భావంః-
లక్ష్మణా! నీవు రోషమును, శోకమును విడిచిపెట్టుము. కేవలము ధైర్యమును ఆశ్రయించి ఈ అవమానమును మరచిపొమ్ము, గొప్ప ఆనందమును పొందుము.
2.22.4.
అనుష్టుప్.
ఉపక్లుప్తం హి యత్కించిత్
అభిషేకార్థమద్య మే।
సర్వం విసర్జయ క్షిప్రమ్
కురు కార్యం నిరత్యయమ్॥
టీకః-
ఉపక్లుప్తమ్ = అమర్చిన; హి = కూడా; యత్ + కించిత్ = అనగా; అభిషేకార్థమ్ = పట్టాభిషేకమునకు; అద్య = నేడు; మే = నా యొక్క; సర్వం = అన్నిటిని; విసర్జయ = విడిచిపెట్టుము; క్షిప్రమ్ = వెంటనే; కురు = చేయుము; కార్యం = చర్య; నిరత్యయమ్ = దోషరహితమానది, ఆంధ్రశబ్ద రత్నాకరము.
భావంః-
ఈనాడు, నా అభిషేకము కొరకై చేసిన దానినంతను విడచి, దోషరహితమగు కార్యమును వెంటనే చేయుము.
2.22.5.
అనుష్టుప్.
“సౌమిత్రే! యోఽభిషేకార్థే
మమ సమ్భార సమ్భ్రమః।
అభిషేకనివృత్త్యర్థే
సోఽస్తు సంభారసమ్భ్రమః॥
టీకః-
సౌమిత్రే = ఓ లక్ష్మణా!; యోః = ఏది; అభిషేకార్థే = పట్టాభిషేకము కొరకు; మమ = నా కొరకు; సమ్భార = సన్నాహాలు; సంభ్రమః = ఉత్సాహంతో; అభిషేక = పట్టాభిషేకమును; నివృత్యార్థే = ముగించుట కొరకు; సః = అది; అస్తు = ఉండును; సంభార = సన్నాహములు; సంభ్రమః = సంతోషముతో
భావంః-
“లక్ష్మణ! నా రాజ్యాభిషేకము కొరకై ఇంతవరకు సంభారసంసాదన యందు చూపిన ఉత్సాహమును, నా అభిషేకము జరుగకుండుటకై చూపుము. ఆ సంభారములను తొలగించుటకు ఉత్సాహమును చూపుము.
2.22.6.
అనుష్టుప్.
యస్యా మదభిషేకార్థే
మానసం పరితప్యతే।
మాతా మే సా యథా న స్యాత్
సవిశంకా తథా కురు॥
టీకః-
యస్యా = ఎవని యొక్క; మత్= నా; అభిషేకః = పట్టాభిషేకము; అర్థే = గురించి; మానసం = మనస్సునకు; పరితప్యతే = బాధపడుతున్నదో; మాతా = తల్లి; మే = నా యొక్క; సా = అటువంటి; యథా = ఏ విధముగా; న = రాదు; స్యాత్ = జరుగుట; స = కలిగిన; విశంకా = భయము; తథా = ఆ విధముగా; కురు = చేయుము.
భావంః-
నా అభిషేకము విషయమున, మనస్సులో బాధపడుచున్న నా తల్లికి, సంశయము ఏమియు కలుగకుండునట్లు ప్రవర్తించుము.
గమనికః-
(1) తల్లి కైకేయిదేవికి, రాముడు తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి యుండునో లేదో అని సంశయము, భరతునికి పట్టాభిషేకము జరుగదేమో అని దుఃఖము, ఆమెకు ఈ శంకాదుఃఖములకు చోటులేకుండా చేయిము. (2) కొసల్యాదేవికి భరతుడు యువరాజైనచో తన గతి ఏమగునో యని సంశయము. పుత్రుని వనవాసమున పడబోవు కష్టములను తలచి దుఃఖము. ఆమెకు ఆ శంకాదుఃఖములు లేకుండా చేయుము. (1) (2) సౌజన్యము గీతా ప్రెస్. (3) సుమిత్రాదేవికి రామవనవాస విషయమున లక్ష్మణునిపై ఏమి ప్రభావము పడునో యని సంశయము, రాముని అనుసరించి కష్టాలపాలగునేమో యని దుఃఖము, ఆమెకు ఆ శంకా దుఖములు లేకుండా చూడుము
2.22.7.
అనుష్టుప్.
తస్యాశ్శంకామయం దుఃఖమ్
ముహూర్తమపి నోత్సహే।
మనసి ప్రతిసంజాతమ్
సౌమిత్రేఽహముపేక్షితుమ్॥
టీకః-
తస్యాత్ = ఆమెకు; శంకాః = అనుమానమృ; మయం = నిండిన, రూపమగు; దుఃఖమ్ = బాధ; ముహూర్తమ్ = ఒక్క క్షణం; అపి = కూడా; న = వద్దు; ఉత్సహే = కోరుకొనుట; మనసి = మనస్సులో; ప్రతిసంజాతమ్ = సృష్టంచబడిన; సౌమిత్రి = లక్ష్మణా; అహమ్ = నేను; ఉపేక్షితుమ్ = నిర్లక్ష్యము చేయుటను
భావంః-
లక్ష్మణా! ఆమె మనస్సులో, క్షణకాలము పాటైనను, శంకారూపమగు దుఃఖము కలుగుటకు నేను అంగీకరించను.
2.22.8.
అనుష్టుప్.
న బుద్ధిపూర్వం నాబుద్ధమ్
స్మరామీహ కదాచన।
మాతౄణాం వా పితుర్వాఽహమ్
కృతమల్పం చ విప్రియమ్॥
టీకః-
న = లేదు; బుద్ధిపూర్వమ్ = ఉద్దేశ్యపూర్వకముగా; న = లేదు; అబుద్ధమ్ = తెలియక కాని; స్మరామి = జ్ఞాపకము; ఇహ = ఇక్కడ; కదాచన = ఎప్పుడైనా; మాతృణామ్ = తల్లులకు; వా = లేదా; పితుర్వా = తండ్రులకు; అహమ్ = నేను;
భావంః-
నేను తెలిసి కాని, తెలియక గాని, ఎన్నడును, తల్లులకు గాని తండ్రికి గాని కొంచెమైనను అప్రియము చేసినట్లు నాకు గుర్తు లేదు.
2.22.9.
అనుష్టుప్.
సత్యస్సత్యాభిసన్ధశ్చ
నిత్యం సత్యపరాక్రమః।
పరలోకభయాద్భీతో
నిర్భయోఽస్తు పితా మమ॥
టీకః-
సత్యః = నిజమునే మాట్లాడువాడు; సత్యాభిసన్థః = నిజమైన వాగ్దానము; చ = మఱియు; నిత్యం = ఎల్లప్పుడు; సత్యపరాక్రమః = సత్యమే పరాక్రమముగా గల వాడు; పరలోక = పరలోకపు; భయాత్ = భయము చేత; భీతః = భయపడువారు; నిర్భయః = భయపడకుండువారు; అస్తు = ఉండనీయుము; పితా = తండ్రి; మమ = నా యొక్క
భావంః-
సత్యమే మాట్లాడువాడును, సత్యమైన పరాక్రమము కలవాడును, పరలోక భీతి కలవాడును అయిన నా తండ్రి చేసిన ప్రతిజ్ఞ సత్యమగుగాక. అతనికి ఎట్టి భయము లేకుండుగాక.
2.22.10.
అనుష్టుప్.
తస్యాఽపి హి భవేదస్మిన్
కర్మణ్యప్రతిసంహృతే।
సత్యం నేతి మనస్తాపః
తస్య తాపస్తపేచ్చ మామ్॥
టీకః-
తస్యా = అతనికి; అపి = కూడా; హి = లేకున్నచో; భవేత్ = ఉదయించును; అస్మిన్ = నాకొఱకైన; కర్మణి = కార్యక్రమములు; ప్రతిసంహృతే = విరమించుకోకుంటే; సత్యం = వాస్తవము; న = కాదు; ఇతి = అది; మనస్తాపః = వేదన; తస్య = అతని; తాపఁ = తపించిపోవు; ఇచ్ఛః = కోరుటను; మామ్ = నన్ను
భావంః-
ఈ పట్టాభిషేకము మానకున్నచో, ‘నా మాట అసత్యమైనది కదా!’ అని మన తండ్రికి మనస్తాపము కలుగును. ఆయనకు కలిగిన మనస్తాపము నాకు బాధ కల్గించును.
2.22.11.
అనుష్టుప్.
అభిషేకవిధానం తు
తస్మాత్సంహృత్య లక్ష్మణ!।
అన్వగేవాహమిచ్ఛామి
వనం గంతుమితఃపునః॥
టీకః-
అభిషేక = పట్టాభిషేకపు; విధానమ్ = ఏర్పాట్లను; తు = తప్పక; తస్మాత్ = అందుచేత; సంహృత్య = ఉపసంహరించుకొనుట ద్వారా; లక్ష్మణ = ఓ లక్ష్మణా; అన్వగేవః = వెంటనే; అహమ్ = నేను; ఇచ్ఛామి = తలచుచున్నాను; వనమ్ = వనములకు; గంతుమ్ = వెళ్లుటకు; ఇతః = ఇచ్చటి నుండియే; పునః = మరల
భావంః-
ఆ కారణముచే ఈ అభిషేకమును నిలిపివేసి, నేను వెంటనే ఇచట నుండియే వనములకు వెళ్లవలెనని తలచుచున్నాను.
2.22.12.
అనుష్టుప్.
మమ ప్రవ్రాజనాదద్య
కృతకృత్యా నృపాత్మజా।
సుతం భరతమవ్యగ్రమ్
అభిషేచయితా తతః॥
టీకః-
మమ = నా యొక్క; ప్రవ్రాజనాద = వనవాసము వలన; అద్య = ఇప్పుడు; కృతకృత్యా = కృతకృత్యురాలైl; నృపాత్మజా = రాకుమారికయొక్క; సుతం = కుమారుడైన; భరతమ్ = భరతునికి; అవ్యగ్రమ్ = చల్లగా; అభిషేయచితా = అభిషిక్తుడగును; తతః = అటు పిమ్మట
భావంః-
నేను ఇపుడు అరణ్యమునకు వెళ్లినవెంటనే కైకేయి కృతకృత్యురాలై నిర్భయముగా, తన కుమారునకు రాజ్యాభిషేకము చేయించగలదు.
2.22.13.
అనుష్టుప్.
మయి చీరాజినధరే
జటామణ్డలధారిణి।
గతేఽరణ్యం చ కైకేయ్యా
భవిష్యతి మనస్సుఖమ్॥
టీకః-
మయి = నా చేత; చీరాః = నార వస్త్రములను; అజినః = జింక చర్మము లను; ధరే = ధరించి; జటామణ్డల = జటలను చుట్టలుగా చుట్టిన; ధారిణి = ధరించి; గతః = వెళ్లినట్లయితే; అరణ్యం = అరణ్యము గుఱించి; కైకేయ్యాః = కైకేయి; భవిష్యతి = కలుగును; మనః =మనస్సునకు; సుఖమ్ =సౌఖ్యము.
భావంః-
నేను నారచీరలను, కృష్ణాజినమును, జటలను ధరించి, అరణ్యమునకు వెళ్లినచో కైకేయికి మనశ్శాంతి కలుగును.
2.22.14.
అనుష్టుప్.
బుద్ధిః ప్రణీతా యేనేయమ్
మనశ్చ సుసమాహితమ్।
తం తు నార్హామి సంక్లేష్టుమ్
ప్రవ్రజిష్యామి మా చిరమ్॥
టీకః-
బుద్ధిః = నిర్ణయము; ప్రణీతా = స్వీకరించెను; యేన = ఎవని చేత; అయమ్= ఇటువంటి; మనః = మనసు; చ = మఱియు; సుసమాహితమ్ = గట్టిపఱచుకొని; తమ్ = అటువంటి తండ్రి; తు = ఐతే; న = లేదు; అర్హామి = కలిగించు అర్హత; సంక్లేష్టుమ్ = క్లేశమును కలిగించుటకు; ప్రవ్రజిష్యామి = దేశంవిడిచిపోయెదను; మా = వద్దు; చిరమ్ = ఆలస్యము.
భావంః-
మనస్సు గట్టిపరచుకొని, నిర్ణయము తీసుకున్న తండ్రిగారికి క్లేశమును కల్గించరాదు. అందుచే ఆలస్యము చేయకుండా వెంటనే అడవికి వెళ్లెదను.
2.22.15.
అనుష్టుప్.
కృతాంతస్త్వేవ సౌమిత్రే!
ద్రష్టవ్యో మత్ప్రవాసనే।
రాజ్యస్య చ వితీర్ణస్య
పునరేవ నివర్తనే॥
టీకః-
కృతాంతః = భాగ్య్యము, వావిళ్ళ నిఘంటువు; త్వ = ప్రకృతార్థముకంటె వేఱైనది, వావిళ్ళ నిఘంటువు; ఏవ = మాత్రమే; సౌమిత్రే = ఓ లక్ష్మణా; ద్రష్టవ్యః = తెలుసుకొనుము; మత్ = నా; ప్రవాసనే = బహిష్కరణందును; రాజ్యస్య = రాజ్యము నుండి; చ = మఱియు; వితీర్ణస్య = ఇవ్వబడినదానిని; పునరేవ = మరల; నివర్తనే = వెనుకకు తీసుకొనుటయందును
భావంః-
ఓ లక్ష్మణ! ఇచ్చిన రాజ్యమును వెనుకకు తీసుకొని నన్ను అరణ్యమునకు పంపుటకు దైవమే కారణమని తెలుసుకొనుము.
2.22.16.
అనుష్టుప్.
కైకేయ్యాః ప్రతిపత్తిర్హి
కథం స్యాన్మమ పీడనే।
యది భావో న దైవోఽయమ్
కృతాంతవిహితో భవేత్॥
టీకః-
కైకేయ్యాః = కైకేయికి; ప్రతిపత్తిః = స్పష్టత, తెలివిడి; హి = కూడా; కథం = ఏ విధంగా; స్యాత్ = కలిగును; మమ = నాకు; పీడనే = పీడించు; యది = అటువంటి; భావః = ఆలోచనలు; న = లేదు; దైవః = దైవము; అయమ్ = ఇటువంటి; కృతాంత = కాగలకార్యం; విహితః = నిశ్చయింపబడినది; భవేత్ = జరుగవలసిన కార్యము.
భావంః-
దైవమే కైకేయికి ఈ భావమును కల్గింపకున్నచో. నాకు బాధ కల్గింపవలెనని ఆమెకు బుద్ధి ఎట్లు కలుగును?
2.22.17.
అనుష్టుప్.
జానాసి హి యథా సౌమ్య!
న మాతృషు మమాంతరమ్।
భూతపూర్వం విశేషో వా
తస్యా మయి సుతేఽపి వా॥
టీకః-
జానాసి = నీకు తెలియును; హి = కదా; యథా = ఏ విధముగా; సౌమ్య = సౌమ్యస్వభావము కలవాడా; న = లేదు; మాతృషు = తల్లులయందు; మమ = నాకు; అంతరమ్ = బేధము; భూత పూర్వమ్ = ఇంతకుపూర్వము; విశేషః = ప్రత్యేకించి; వా = లేదంటే; తస్యా = వారి యొక్క; మయి = నాలో; సుతే = కుమారుని యందు వలె; అపి = కూడా; వా = లేక.
భావంః-
ఇంతకు పూర్వము ఎన్నడును తల్లుల విషయమున నాకు భేదబుద్ధి ఏమియు లేదను అంశమును, తల్లలులకు ముఖ్యముగ కైకేయికి నాయందు కాని, తన కుమారుడైన భరతుని యందు కాని ఎట్టి భేదబుద్ధియు లేదను అంశమును నీవు ఎరుగుదువు కదా!
2.22.18.
అనుష్టుప్.
సోఽభిషేకనివృత్త్యర్థైః
ప్రవాసార్థైశ్చ దుర్వచైః।
ఉగ్రైర్వాక్యైరహం తస్యా
నాన్యద్దైవాత్సమర్థయే॥
టీకః-
సః = అతడు; అభిషేక = పట్టాభిషేకమును; నివృత్తః = అడ్డుకొనుటకు; అర్థైః = కొఱకు; ప్రవాసాః = అరణ్యవాసమునకు పంపవలెనను; అర్థః = కోరికతో; చ = మఱియు; దుర్వచైః = చెడుమాటలు; ఉగ్రైః = కోపముతో కూడిన; వాక్యైః = మాటలు; అహం = నేను; తస్యా = ఆమెయొక్క; న = లేదు; అన్యత్ = ఇతరులు; దైవాత్ = దైవ వశమున, విధినిర్ణయమున; సమర్థయే = హేతువు.
భావంః-
కైకేయి నా అభిషేకమును నిలిపివేయవలెననియు, నన్ను ప్రవాసమునకు పంపవలననియు, పలుకరాని ఉగ్రమైన మాటలు పలికినదన్నచో దానికి దైవము తప్ప మరొక హేతువు ఏదియు నాకు అగపడుటలేదు. ఇందుకు దైవమే కారణము. ఇద విధి నిర్ణయము
గమనికః-
అధ్యాత్మరామాయణము- 6-6.- సుఖస్య దుఃఖస్య న కో పీ దాతాః పరో దదాతీతి కుబుద్ధి రేషా। అహం కరోమితి వృథాభిమానః స్వకర్మసూత్రగ్రథితో హి లోకః॥ జనులకు కలిగెడి సుఖదుఃఖములకు ఇతరులు ఎవ్వరును కారకులు కారు. అవి పరుల వలన కలుగుచున్న వనుకొను జనులు బుద్ది తక్కువవారు. జనులకు ఈ సుఖదుఃఖములను కలిగించుచున్నది నేనే అని గర్వించువారు దురహంకారులే. తాము చేయు దృష్కృతముల వలననే అవి వారికి ప్రాప్తించుచున్నవి.
2.22.19.
అనుష్టుప్.
కథం ప్రకృతిసమ్పన్నా
రాజపుత్రీ తథాగుణా।
బ్రూయాత్సా ప్రాకృతేవ స్త్రీ
మత్పీడాం భర్తృసన్నిధౌ॥
టీకః-
కథమ్ = ఏ విధముగా; ప్రకృతి = స్వభావములో; సమ్పన్నా = సంపన్నురాలు; రాజపుత్రీ = రాకుమారి; తథానుగుణాః = వాటికి అనుగుణంగా; బ్రూయాత్ = మాట్లాడెను; సా = ఆమె; ప్రాకృతి = సాధారణమైనదాని; ఇవ = వలె; స్త్రీ = వనితలలో; మత్ = నా యొక్క; పీడామ్ = కష్టములకోసం; భర్తః = భర్త యొక్క; సన్నిధౌ = సమక్షములో.
భావంః-
విధినిర్ణయము కాకున్నచో మిక్కిలి ఉత్తమ స్వభావము కలది, రాజ వంశ సంభూతురాలు అయిన ఆ కైకేయి ఒక సామాన్య స్త్రీవలె తన భర్త యెదుట నాకు బాధ కలిగించు మాటలు ఎట్లు పలుకును?
గమనికః-
ప్రకృతి- సహజసిద్ధమైన ప్రవర్తన, స్వభావము- అంతఃప్రకృతి
2.22.20.
అనుష్టుప్.
యదచిన్త్యంతు తద్దైవమ్
భూతేష్వపి న హన్యతే।
వ్యక్తం మయి చ తస్యాం చ
పతితో హి విపర్యయః॥
టీకః-
యత్ = ఏదైతే; అచిన్త్యంతు = ఊహించలేనిది; తత్ = అది; దైవమ్ = దైవ వశముగా; భూతేష్వపి = ఏదో ఒక ప్రాణి కారణంగా; న = లేదు; న హన్యతే = అడ్డగించ; వ్యక్తం = స్పష్టము; మయి = నాచే; చ = మఱియు; తస్యాం = ఆమెచేతను; చ = మఱియు; పతితః = పడిపోయినది; హి = అయినప్పటికీ; విపర్యయః = దురదృష్టము.
భావంః-
విధి ఊహింప శక్యము కానిది. దానిని ఎవరును అడ్డుకొన లేరు. ఇపుడు నాయందును కైకేయి యందును విధివైపరీత్యము వచ్చిపడినది. ఈ విషయము స్పష్టము.
2.22.21.
అనుష్టుప్.
కశ్చిద్దైవేన సౌమిత్రే
యోద్ధుముత్సహతే పుమాన్।
యస్య న గ్రహణం కించిత్
కర్మణోఽన్యత్ర దృశ్యతే॥
టీకః-
కశ్చిత్ = ఏది కలదో; దైవేన = విధినిర్ణయము చేత; సామిత్రే = ఓ లక్ష్మణా; యోద్ధుమ్ = తలపడుటకు; ఉత్సహతే = లభించును; పుమాన్ = ఎవరైతే; యస్య = ఎవని చేత; నః = లేదు; గ్రహణం = నిగ్రహించుటకు ; కించిత్ = ఏదైతో కలదో; కర్మణః = కర్మ చేత; అన్యత్ర = ఇతరమైనది; దృశ్యతే = చూడబడెను
భావంః-
ఓ లక్ష్మణా! విధి నడిపించునట్లు నడచుట తప్ప మరొకదారి లేదు. అట్టి విధిని ఎవడు ఎదుర్కొనగలడు?
2.22.22.
అనుష్టుప్.
సుఖదుఃఖే భయక్రోధౌ
లాభాలాభౌ భవాభవౌ।
యచ్చ కించిత్తథాభూతమ్
నను దైవస్య కర్మ తత్॥
టీకః-
సుఖదుఃఖః = సుఖదుఋఖములు, ఆనందము మఱియు బాధ; భయః = భయము; క్రోధః = క్రోధము; లాభః = లాభము; అలాభః = నష్టము; భవః = జననము; అభవః = మరణము; యత్ = ఏదైతే; తత్ = అది; కించిత్ = ఎంత చిన్నదైనా; తథా = అటువంటి; భూతమ్ = జరుగునవి; నను = మాత్రమే; దైవస్య = విధి యొక్క; కర్మ = నిర్ణయము చేత; తత్ = ఆ
భావంః-
సుఖదుఃఖములు, భయక్రోధములు, లాభనష్టములు, ఉత్పత్తి వినాశములు ఈ విధమైనవన్నియు విధిచేష్టితములు మాత్రమే.
2.22.23.
అనుష్టుప్.
ఋషయోఽప్యుగ్రతపసో
దైవేనాభిప్రపీడితాః।
ఉత్సృజ్య నియమాంస్తీవ్రాన్
భ్రశ్యన్తే కామమన్యుభిః॥
టీకః-
ఋషయః = ఋషులు; అపి = సైతము; ఉగ్ర = కఠోరమైన; తపసః = తపస్సుతో; దైవేన = విధి ద్వారా; అభిప్రపీడితాః = పీడితులై; ఉత్సృజ్య = ప్రక్కన వదలబడిన; నియమామ్ = నియమములను; తీవ్రాన్ = భయంకరమైన; భ్రశ్యన్తః = భ్రష్టులు; కామమ్ = కామము చేత; అన్యుభిః = నాశనము
భావంః-
ఉగ్రమైన తపస్సు గల ఋషీశ్వరులు కూడా విధిపీడితులై తీవ్రమైన నియమములను విడిచి కామక్రోధములచే భ్రష్టులగుచుందురు.
2.22.24.
అనుష్టుప్.
* అసంకల్పితమేవేహ
యదకస్మాత్ప్రవర్తతే।
నివర్త్యారంభమారబ్ధమ్
నను దైవస్య కర్మ తత్॥
టీకః-
అసంకల్పితమ్ = అనుకోకుండా; ఏవ = ఐతే; ఇహ = ఈ ప్రపంచములో; యత్ = ఏది; అకస్మాత్ = హఠాత్తుగా; ప్రవర్తతే = జరుగునో; నివర్త్య = విపర్యయము; ఆరంభమ్ = ప్రయత్నమునందు; ఆరబ్ధమ్ = చేపట్టిన; నను = నిశ్చయముగా; దైవస్య = విధియొక్క; కర్మ = పని; తత్ = అది.
భావంః-
అకస్మాత్తుగా ఏదైనా జరిగిపోయినవి అనినను, చేపట్టిన ప్రయత్నము లందు విపర్యములు కలిగినవి అనిన నిశ్చయముగ, అది విధి విలసితమే.
2.22.25.
అనుష్టుప్.
ఏతయా తత్త్వయా బుద్ధ్యా
సంస్తభ్యాత్మానమాత్మనా।
వ్యాహతేఽప్యభిషేకే మే
పరితాపో న విద్యతే॥
టీకః-
ఏతయా = అటువంటి; తత్త్వయా = సహజస్వభావమైన; బుద్ధ్యా = బుద్ధితో; సంస్థభ్యమ్ = నిగ్రహించుకొను; ఆత్మానమ్ = మనస్సులో; ఆత్మనా = నా యొక్క; వ్యాహతే = ఆటంకము; అపి = అయినప్పటికీ; అభిషేకే = పట్టాభిషేకమునకు; మే = నాకు; పరితాపః = దుఃఖము; న విద్యతే = ఏమియు లేదు
భావంః-
నా పట్టాభిషేకమునకు అడ్డముగా వచ్చినను ఈ యథార్థ బుద్ధితో నన్ను నేనే నిగ్రహించుకొనుటచే నాకు మనస్సులో దుఃఖమేమియు లేదు.
2.22.26.
అనుష్టుప్.
తస్మాదపరితాపస్సన్
త్వమప్యనువిధాయ మామ్।
ప్రతిసంహారయ క్షిప్రమ్
ఆభిషేచనికీం క్రియామ్॥
టీకః-
తస్మాత్ = అందుచేత; అపరితాప్సన్ = దుఃఖము విడిచి; త్వమ్ = నీవు; అపి = కూడా; అనువిధాయ = విధేయతలో; మామ్ = నాకు; ప్రతిసంహారయ = ఉపసంహరించుకోండి; క్షిప్రమ్ = వెంటనే; ఆభిషేచనికీమ్ = పట్టాభిషేకమునకు సంబంధించిన; క్రియామ్ = పనులను.
భావంః-
అందుచే నీవు కూడ నా వలె పరితాపము విడిచి వెంటనే అభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్లను నిలిపివేయుము.
2.22.27.
అనుష్టుప్.
ఏభిరేవ ఘటై స్సర్వైః
అభిషేచనసంభృతైః।
మమ లక్ష్మణ! తాపస్యే
వ్రతస్నానం భవిష్యతి॥
టీకః-
ఏభిః = ఏవి; ఏవ = ఐతే; ఘటైః = ఘటములు; సర్వైః = అన్నియును; అభిషేచన = రాజ్యాభిషేకము కొరకు; సంభృతైః = ఏర్పాటుచేయబడిన; మమ = నా కొరకు; లక్ష్మణ = ఓ లక్ష్మణా; తాపస్యః = తపోధనులు; వ్రతస్నానం = వ్రతస్నానమునకు; భవిష్యతి = ఉపయోగించగలరు
భావంః-
ఓ లక్ష్మణా! పట్టాభిషేకము కొరకు ఏర్పరచిన ఈ ఘటోదకము తపోధనుల వ్రతస్నానమునకు ఉపయోగించమను.
గమనికః-
రాముని రాజ్యాభిషేకమునకై ఏర్పరచిన కలశములలోని నీరు తాను తాపస వ్రత స్నానము లాచరించినను, ‘రాజ్యకాంక్షతో ఆచరించుచుండెను’ అను శంక కైకేయికి కలుగవచ్చును. ఆ సందేహమునకును తావులేకుండా ఆ జలములు వాడలేదు.
2.22.28.
అనుష్టుప్.
అథవా కిం మమైతేన
రాజద్రవ్యమయేన తు।
ఉద్ధృతం మే స్వయం తోయమ్
వ్రతాదేశం కరిష్యతి॥
టీకః-
అథవా = అంతేకాక; కిం = ఏమి ప్రయోజనము; మమ = నాకు; ఏతేన = అవి, కుండలలోని ఈ నీరు; రాజద్రవ్యమ = రాచసంపత్తియే; యేన = ఐనను; తు = పాదపూరణము; ఉద్ధృతం = తోడబడిన; మే = నా చేత; స్వయం = స్వయముగా; తోయమ్ = నీటిని; వ్రతః = వ్రతములకు; ఆదేశం = వాడమని ఆదేశించుట; కరిష్యతి = చేయుము.
భావంః-
అంతేకాక, నేనే స్వయముగా తోడినట్టి నీరు రాచసంపత్తే ఐనప్పటికీ ఈ నీరు వ్రతములకు ఉపయోగించమని చెప్పుము.
2.22.29.
అనుష్టుప్.
మా చ లక్ష్మణ! సంతాపమ్
కార్షీర్లక్ష్మ్యా విపర్యయే।
రాజ్యం వా వనవాసో వా
వనవాసో మహోదయః॥
టీకః-
మా = వలదు; చ = మఱియు; లక్ష్మణ = ఓ లక్ష్మణా; సంతాపమ్ = విచారించుట; కార్షీః = లాగేసుకొనబడినది; లక్ష్మ్యా = (రాజ్య) లక్ష్మిని; అవిపర్యయే = దౌర్భాగ్యము, వావిళ్ళ నిఘంటువు; రాజ్యం = రాజ్యపాలనయా; వా = లే దంటే; వనవాసో = వనవాసమా; వా = లేదంటే; వనవాసో = వనవాసమే; మహోదయః = గొప్పఫలముకలది.
భావంః-
లక్ష్మణా! విచారించవలదు. ఈ దౌర్భాగయ్ వశమైన లాగేసుకొనబడుటకు, సంతాపము చెందకుము. రాజ్యమా? వనమాసమా? అన్నచో వనవాసమే ఉత్తమ ఫలప్రదము.
2.22.30.త్రిష్టుప్
న లక్ష్మణాస్మిన్ఖలు కర్మవిఘ్నే
మాతా యవీయస్యతిశంకనీయా।
దైవాభిపన్నా హి వదత్యనిష్టం
జానాసి దైవం చ తథా ప్రభావమ్॥
టీకః-
న = కాదు; లక్ష్మణాః = ఓ లక్ష్మణా; అస్మిన్ = నా యొక్క; ఖలు = మాత్రమే; కర్మ = ఈ వేడుకకు; విఘ్నః = ఆటంకమునకు; మాతా యవీయస్యతి = మా చిన్నమ్మను; శంకనీయా = అనుమానించుటకు; దైవ = విధిచే; అభిపన్నా = ఆక్రమింపబడిన దాని; హి = చేత; వదత్ = మాట్లాడుచున్నది; అనిష్టం = అప్రియమైన; జానాసి = ఎఱుగుదువు; దైవం = విధితో; చ = మఱియు; తథా = ఆ విధమైన; ప్రభావమ్ = ప్రభావముచేత
భావంః-
అభిషేకమునకు విఘ్నము కలిగినందులకు మన తల్లిని దూషింపరాదు. ఆమె దైవముచే ప్రేరితురాలై ఈ విధముగా అనిష్టవాక్యములను పలుకుచున్నది. దైవమునకు ఎంతటి ప్రభావమున్నదో నీకు తెలియును కదా!
2.22.31.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే ద్వావింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; ద్వావింశః = ఇరవైరెండవ [22]; సర్గః = సర్గ.
భావంః-
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యా కాండలోని [22] ఇరవై రెండవ సర్గ సంపూర్ణము.
2.23.1.
అనుష్టుప్.
ఇతి బ్రువతి రామే తు
లక్ష్మణోఽ ధశ్శిరా ముహుః।
శృత్వా మధ్యం జగామేవ
మనసా దుఃఖహర్షయోః॥
టీకః-
ఇతి = ఇట్లు; బ్రువతి = పలుకుచుండగా; రామే = రాముడు; తు = పాదపూరణము; లక్ష్మణః = లక్ష్మణుడు; అధః = క్రిందకు; శిరాః = తల; ముహుః = మాటిమాటికి; శృత్వా = విని; మధ్యం = మధ్యన; జగామేవ = పొందినట్లుండెను; మనసా = మనస్సుతో; దుఃఖహర్షయోః = సుఖదుఃఖములయొక్క.
భావంః-
రాముడు ఇట్లు అనుచుండగా, లక్ష్మణుడు విని తల దించుకొని మాటిమాటికిని మనస్సుతో సుఖదుఃఖముల మధ్య ఊగీసలాడుచు ఉన్నట్లుండెను.
2.23.2.
అనుష్టుప్.
తదా తు బద్ధ్వా భ్రుకుటీమ్
భ్రువోర్మధ్యే నరర్షభః।
నిశశ్వాస మహాసర్పో
బిలస్థ ఇవ రోషితః॥
టీకః-
తదా = అప్పుడు; తు = పాదపూరణకము; బద్ధ్వా = బంధించి; భ్రుకుటీం = బొమముడిని; భ్రువోః = కనుబొమలయొక్క; మధ్యే = మధ్యన; నరర్షభః = మానవశ్రేష్ఠుడు; నిశశ్వాస = నిట్టూర్పెను; మహాసర్పః = మహాసర్పము; బిలస్థ = పుట్టయందున్న; ఇవ = వలె; రోషితః = కోపించిన.
భావంః-
లక్ష్మణుడు అపుడు, నొసలు చిట్లించి, కనుబొమలు ముడిచి, పుట్టలోనున్న కోపించిన మహాసర్పము వలె నిట్టూర్పులు విడిచెను.
2.23.3.
అనుష్టుప్.
తస్య దుష్ప్రతివీక్షం తత్
భృకుటీసహితం తదా।
బభౌ క్రుద్ధస్య సింహస్య
ముఖస్య సదృశం ముఖమ్॥
టీకః-
తస్య = అతని యొక్క; దుష్ప్రతివీక్షం = చూచుటకు శక్యము కాని; తత్ = ఆ; భృకుటీ = భృకుటితో; సహితమ్ = కూడిన; తదా = అప్పుడు; బభౌ = ప్రకాశించెను; క్రుద్ధస్య = కోపముగానున్న; సింహస్య = సింహమునకు; ముఖస్య = ముఖమునకు; సదృశం = పోలినట్లు; ముఖమ్ = ముఖము.
భావంః-
కనుబొమలు చిట్లించి, చూచుటకు భయంకరముగా నున్న అతని ముఖము, ఉగ్రముగా నున్న సింహపు ముఖము వలె నుండెను.
2.23.4.
అనుష్టుప్.
అగ్రహస్తం విధూన్వంస్తు
హస్తీ హస్తమివాత్మనః।
తిర్యగూర్ధ్వం శరీరే చ
పాతయిత్వా శిరోధరామ్॥
టీకః-
అగ్రహస్తం = చేతి పైభాగమును; విధూన్వన్ = కదల్చుచు; హస్తీ = ఏనుగు; హస్తమ్ ఇవ = తొండము వలె; ఆత్మనః = తన యొక్క; తిర్యక్ = అడ్డముగ; ఊర్ధ్వం = పైకి; శరీరే చ = శరీరమునందు; పాతయిత్వా = పడవేసి; శిరోధరామ్ = కంఠమును.
భావంః-
లక్ష్మణుడు ఏనుగు తొండము వలె తన చేతిని, తలను, అడ్డముగను, నిలువుగను ఊపుచుండెను.
2.23.5.
అనుష్టుప్.
అగ్రాక్ష్ణా వీక్షమాణస్తు
తిర్యగ్భ్రాతరమబ్రవీత్।
అస్థానే సమ్భ్రమో యస్య
జాతో వై సుమహానయమ్॥
టీకః-
అగ్రాక్ష్ణా = కంటికొనలతో; వీక్షమాణః = చూచుచు; తిర్యక్ = అడ్డముగ; భ్రాతరమ్ = సోదరుని; అబ్రవీత్ = పలికెను; అస్థానే = సరియైన సమయము కాని వేళ; సమ్భ్రమం = తొందరపాటు; యస్య = ఐన నీకు; జాతః వై = పుట్టినదో; సుమహాన్ = మిక్కిలి గొప్పదైన; అయమ్ = ఈ.
భావంః-
లక్ష్మణుడు క్రీగంట రాముని చూచుచు, ఇట్లు పలికెను. “నీకు కలిగిన ఈ మిక్కిలి తొందరపాటు అసందర్భమైనది.
గమనికః-
అగ్రాక్షి- క్రేగన్ను, అపాంగము, వ్యుత్పత్తి- అగ్రమ్ + అక్షః(ఏకాదేశ సంధి), వ్యాకరణ వివరణ. స్వాంగపరమైనది అగుటచే అగ్రాక్షి పదముమీఁద సమాసాంతమైనను అచ్చురాలేదు.
2.23.6.
అనుష్టుప్.
ధర్మదోష ప్రసంగేన
లోకస్యానతిశంకయా।
కథంహ్యేతదసంభ్రాంతః
త్వద్విధో వక్తుమర్హతి॥
టీకః-
ధర్మః = ధర్మమునకు; దోషః = భంగము కలుగునను; ప్రసంగేన = సంశయము వలన; లోకస్య = లోకముయొక్క; అనతిశంకయా = శంక లేకుండుట వలనను; కథమ్ = ఎట్లు; హి = పాదపూరణము;ఏతత్ = దీనిని; అసంభ్రాంతః = బెదురులేని వాడవై, సంస్కృతాంధ్ర నిఘంటువు; త్వత్ = అట్టి; విధః = విధముగ; వక్తుమ్ = చెప్పుటకు; అర్హతి = తగియున్నావు.
భావంః-
తండ్రి మాటను పాలింపకపోవుట అధర్మమగునను భయముచేతను, లోకము విషయమై సంశయము లేకపోవుట వలనను, నీవు ఎట్టి బెదురు లేకుండా ఈ విధముగా పలుకుచుంటివి.
2.23.7.
అనుష్టుప్.
యథా దైవమశౌణ్డీరమ్
శౌణ్డీర క్షత్రియర్షభ।
కిన్నామ కృపణం దైవమ్
అశక్తమభిశంససి॥
టీకః-
యథా = ఏ విధముగా; దైవమ్ = దైవమును గూర్చి; అశౌణ్డీరమ్ = అశక్తుడైన; శౌణ్డీర = శక్తియుతులైన; క్షత్రియర్షభ = క్షత్రియశ్రేష్ఠుడా; కిం నామ = ఎందువలన; కృపణం = దీనమైన; దైవమ్ = దైవమును; అశక్తమ్ = అసమర్థమైన; అభిశంససి = పొగడుచున్నావు.
భావంః-
శూరులైన క్షత్రియులలో శ్రేష్ఠుడా! నీ వంటివాడు శక్తిహీనమైన దైవమును గూర్చి, దైవమే బలీయమైనదని పలుకునా? దుర్బలము, దీనమైన దైవమును గూర్చి నీవు ఎందులకిట్లు పలుకుచున్నావు?
2.23.8.
అనుష్టుప్.
పాపయోస్తే కథం నామ
తయోశ్శంకా న విద్యతే।
సన్తి ధర్మోపధా శ్లక్ష్ణాః
ధర్మాత్మన్కిం న బుధ్యసే॥
టీకః-
పాపయోః = పాపాత్ములైన; తే = నీకు; కథం నామ = ఎందువలన; తయోః = వారిద్దరియందు; శంకా = సందేహము; న విద్యతే = కలుగుటలేదు; సన్తి = ఉన్నవి; ధర్మోపధా = ధర్మమే ననిపించు మోసములు; శ్లక్ష్ణాః = మెత్తనైన; ధర్మాత్మన్ = ధర్మాత్మా; కిం = ఎందువలన; న బుధ్యసే = ఎరుగలేకున్నావు.
భావంః-
ధర్మాత్మా! వారిద్దరి (కైకేయి దశరథుల) విషయములో నీకు ఎందువలన అనుమానము కలుగటలేదు. వారు మృదువుగా నయవంచన చేయుచున్నారని నీవు ఎందువలన ఎరుగలేకున్నావు.
2.23.9.
అనుష్టుప్.
తయోస్సుచరితం స్వార్థమ్
శాఠ్యాత్పరిజిహీర్షతోః।
యది నైవం వ్యవసితమ్
స్యాద్ధి ప్రాగేవ రాఘవ॥
టీకః-
తయోః = వారిద్దరియొక్క; సుచరితం = సత్ప్రవర్తన; స్వార్థం = స్వలాభాపేక్ష; శాఠ్యాత్ = రహస్యమైన కుటిలబుద్ధి వలన; పరిజిహీర్షతోః = పరిహరింపగోరుచున్న; యది = ఒక వేళ; న ఏవమ్ = ఈ విధముగ కాక; వ్యవసితం = నిర్ణయము; స్యాత్ యది = అయినచో; ప్రాగేవ = ముందుగానే; రాఘవ = రామా.
భావంః-
రామా వారిద్దరి స్వలాభాపేక్షకై, నీ సత్ప్రవర్తనను పరిహరింపవలెనని, ముందుగనే రహస్యముగ కుట్రపన్నినారు.
2.23.10.
అనుష్టుప్.
తయోః ప్రాగేవ దత్తశ్చ
స్యాద్వరః ప్రకృతశ్చ సః।
లోకవిద్విష్టమారబ్ధమ్
త్వదన్యస్యాభిషేచనమ్॥
టీకః-
తయోః = వారిద్దరియొక్క; ప్రాగేవ = పూర్వమే; దత్తః చ = ఇవ్వబడిన; చ = ఇంకను; స్యాత్ = అయ్యుండెడిది; వరః = వరములు; ప్రకృతః = ప్రకృతమైన; చ = ఇంకను; సః = ఆ; లోకవిద్విష్టమ్ = లోకముచే దూషింపబడు;ఆరబ్ధమ్ = ప్రారంభించబడిన; త్వదన్యస్య = నీకన్న ఇతరుని యొక్క; అభిషేచనమ్ = రాజ్యాభిషేకమును.
భావంః-
అట్లుకానిచో దశరథుడు ఆ వరములను పూర్వమే తీర్చి యుండెడివాడు. ప్రారంభించినట్లు నీకు తప్ప ఇతరులకు రాజ్యాభిషేకము చేయుట లోకవిరుద్ధము.
గమనికః-
అన్నకు అరణ్యవాస కష్టములను తలచుచున్న లక్ష్మణును భావోద్వేగమునందలి ఆలోచనలు ఇటుల సాగుచుండనోపు. ‘భరతునకు రాజ్యము కట్టబెట్టవలెనని’ కైకేయీ దశరథుల స్వార్థ లక్ష్యము కావలెను. కాని జ్యేష్ఠుని తప్పించిన లోకము సమ్మతింపదు అని భావించి, ఇటుల వరముల పన్నగము పన్ని ఉండవచ్చును.
2.23.11.
అనుష్టుప్.
నోత్సహే సహితుం వీర
తత్ర మే క్షన్తుమర్హసి।
యేనేయ మాగతా ద్వైధమ్
తవ బుద్ధిర్మహామతే॥
టీకః-
న = లేదు; ఉత్సహే = మనసు అంగీకరించుట; సహితుమ్ = సహించుటకు; వీర = వీరుడా; తత్ర = అక్కడ; మే = నాకు; క్షన్తుమ్ = క్షమించుటకు; అర్హసి = తగుదువు; యేన = దేనిచే; ఇయమ్ = ఈ; ఆగతా = పొందినదో; ద్వైధమ్ = భేదము; తవ = నీ యొక్క; బుద్ధిః = బుద్ధి; మహామతే = గొప్ప బుద్ధిమంతుడా.
భావంః-
గొప్ప బుద్ధిమంతుడవైన రామా! దీనిని నేను సహింపలేక పోవుచుంటిని. ఇందు నిమిత్తమై నన్ను క్షమింపుము. నీ ఆలోచన ఎందువలన విరుద్ధంగా నున్నదో కదా?
2.23.12.
అనుష్టుప్.
స హి ధర్మో మమ ద్వేష్యః
ప్రసంగాద్యస్య ముహ్యసి।
కథం త్వం కర్మణా శక్తః
కైకేయీవశవర్తినః॥
టీకః-
స = ఆ; ధర్మః = ధర్మము; మమ = నాకు; ద్వేష్యః = విరోధించుటకు తగినది; ప్రసంగాత్ = ప్రసంగము వలన; యస్య = దేనియొక్క; ముహ్యసి = మోహితుడవైతివో; కథం = ఎట్లు; త్వం = నీవు; కర్మణా = కర్మలచే; శక్తః = సమర్థుడవైన; కైకేయి వశ వర్తినః = కైకేయికి వశుడవై.
భావంః-
నేను ఈ ధర్మమును విరోధించుచున్నాను. నీవు ఏవో చెప్పుడు మాటలకు మోహితుడవై ఈ అధర్మమును ఎదుర్కొన గలిగియుండి కూడ, ఏలనో కైకకు వశుడవై ప్రవర్తించుచున్నావు.
2.23.13.
అనుష్టుప్.
కరిష్యసి పితుర్వాక్యమ్
అధర్మిష్ఠం విగర్హితమ్।
యద్యయం కిల్బిషాద్భేదః
కృతోఽ ప్యేవం న గృహ్యతే॥
టీకః-
కరిష్యసి = చేయగలవు; పితుః వాక్యమ్ = తండ్రి యొక్క మాటను; అధర్మిష్ఠం = ధర్మవిరుద్ధమైన; విగర్హితమ్ = నిందార్హమైన; యది = ఒకవేళ; అయం = ఈ; కిల్బిషాత్ = పాపబుద్ధి వలన; భేదః = కుట్ర; కృతః అపి = చేయబడినది; అపి = ఐనను; ఏవమ్ = ఇట్లు; న = లేకున్నది; గృహ్యతే = గ్రహింపబడుట.
భావంః-
ధర్మవిరుద్ధము, నిందార్హము ఐన తండ్రిమాటను నీవు పాలించుట సరికాదు. వారు దురాలోచనతో పన్నిన ఈ కుట్రను నీవు గ్రహించుటలేదు.
2.23.14.
అనుష్టుప్.
జాయతే తత్ర మే దుఃఖమ్
ధర్మసంగశ్చ గర్హితః।
మనసాఽ పి కథం కామమ్
కుర్యాస్త్వం కామవృత్తయోః॥
టీకః-
జాయతే = కలుగుచున్నది; తత్ర = అక్కడ; మే = నాకు; దుఃఖమ్ = దుఃఖము; ధర్మసఙ్గః చ = ధర్మాచరణము; గర్హితః = నిందార్హము; మనసా అపి = మనసుతోనైన; కథం = ఎట్లు; కామం = కోరికను; కుర్యాః = చేసెదవు; త్వం = నీవు; కామవృత్తయోః = స్వతంత్రప్రవర్తనులై.
భావంః-
ఇట్టి నిందార్హమైన ధర్మమును నీవు ఆచరించుట నాకు ఖేదము కలిగించుచున్నది. వారివురును కావాలని ఇలా ప్రవర్తించుచున్నారు. వారి మాటను నీవు ఎట్లు పాటింతువు?
2.23.15.
అనుష్టుప్.
తయోస్త్వహితయోర్నిత్యమ్
శత్ర్వోః పిత్రభిధానయోః।
యద్యపి ప్రతిపత్తిస్తే
దైవీ చాపి తయోర్మతమ్॥
టీకః-
తయోః = వారు; తు; అహితయోః = హితము కోరనివారు; నిత్యమ్ = నిత్యము; శత్ర్వోః = శత్రువులయొక్క; పిత్రభిదానయోః = తల్లితండ్రులు అను పేరుగల; యత్ అపి = ఐనను; ప్రతిపత్తిః = బుద్ది; దైవీ = దైవసంకల్పమైన; తయోః మతమ్ = వారి అభిప్రాయము.
భావంః-
వారు నీ హితము కోరుటలేదు. వారు తల్లిదండ్రుల రూపములో నున్న శత్రువులు. వారికి కలిగిన ఈ ఆలోచన దైవసంకల్పమని నీ అభిప్రాయమై ఉండవచ్చును.
2.23.16.
అనుష్టుప్.
తథాప్యుపేక్షణీయం తే
న మే తదపి రోచతే।
విక్లబో వీర్యహీనో యః
స దైవమనువర్తతే॥
టీకః-
తథా అపి = అట్లైనను; ఉపేక్షణీయం = ఉపేక్షింపతగినది; తే = నీకు; న = కాదు; మే = నాకు; తత్ అపి = అది కూడ; రోచతే = ఇష్టము; విక్లబః = మనోదౌర్బల్యము; వీర్యహీనః = పిరికివాడు; యః = ఎవడు; సః = వాడు; దైవమ్ = దైవమును; అనువర్తతే = అనుసరించును.
భావంః-
ఐనను నీవు దీనిని ఉపేక్షించుట నాకు ఇష్టము లేదు. మనోదౌర్బల్యము కలవాడు, పిరికివాడు మాత్రమే దైవమును అనుసరించును.
2.23.17.
అనుష్టుప్.
వీరాస్సమ్భావితాత్మానో
న దైవం పర్యుపాసతే।
దైవం పురుషకారేణ
యః సమర్థః ప్రబాధితుమ్॥
టీకః-
వీరాః = వీరులు; సంభావితాత్మానః = గౌరవింపబడిన ఆత్మాభిమానము కలవారు; న = చేయరు; దైవం = దైవమును; పర్యుపాసతే = సేవించుట; దైవం = దైవమును; పురుషకారేణ = పురుషప్రయత్నముతో; యః = ఎవడు; సమర్థః = సమర్థుడు; ప్రబాధితుమ్ = బాధపెట్టుటకు.
భావంః-
ఆత్మాభిమానము కలిగియున్నవారు దైవమును ఆశ్రయించరు. ఎవడు పురుషప్రయత్నముచే దైవమునైనను బాధించగలడో,
2.23.18.
అనుష్టుప్.
న దైవేన విపన్నార్థః
పురుషస్సోఽ వసీదతి।
ద్రక్ష్యన్తి త్వద్య దైవస్య
పౌరుషం పురుషస్య చ॥
టీకః-
న = కాడు; దైవేన = దైవముచే; విపన్నార్థః = నిష్ప్రయోజకుడై; పురుషః = పురుషుడు; సః = అతడు; అవసీదతి = దుఃఖించడు; ద్రక్ష్యన్తి; తు = చూడగలరు; అద్య = నేడు; దైవస్య = దైవముయొక్క; పౌరుషం = పౌరుషమును; పురుషస్య; చ = పురుషునియొక్కయు.
భావంః-
అట్టివానిని దైవము కూడ బాధింపజాలడు. దైవశక్తిని మరియు పురుషుని సమర్థతను నేడు చూడ గలరు.
2.23.19.
అనుష్టుప్.
దైవమానుషయోరద్య
వ్యక్తా వ్యక్తిర్భవిష్యతి।
అద్య మత్పౌరుషహతమ్
దైవం ద్రక్ష్యన్తి వై జనాః॥
టీకః-
దైవమ్ మానుషయోః = దైవము యొక్కయు మానవుని యొక్కయు; అద్య = ఇపుడు; వ్యక్తా = స్పష్టమైన; వ్యక్తిః = భేదము; భవిష్యతి = కలుగును అద్య = నేడు; మత్పౌరుష హతం = నా పౌరుషముచే కొట్టబడిన; దైవం = దైవమును; ద్రక్ష్యన్తి వై = చూడగలరు; జనాః = ప్రజలు.
భావంః-
దైవశక్తికి మానవపౌరుషమునకు ఉన్న భేదము ఈ నాడు స్పష్టము కాగలదు. నేడు నా పౌరుషముచే ప్రతిఘటింపబడిన దైవమును ప్రజలు చూతురుగాక.
2.23.20.
అనుష్టుప్.
యద్దైవాదాహతం తేఽ ద్య
దృష్టం రాజ్యాభిషేచనమ్।
అత్యఙ్కుశమివోద్దామమ్
గజం మదబలోద్ధతమ్॥
టీకః-
యద్దైవాత్ = ఏ దైవముచే; ఆహతం = కొట్టబడినట్లు; తే = నీ యొక్క; అద్య = నేడు; దృష్టం = చూడబడినదో; రాజ్యాభిషేచనమ్ = రాజ్యాభిషేకము; అత్యఙ్కుశమ్ = అంకుశమును లెక్క చేయనిది; ఇవ = వలె; ఉద్ధామమ్ = బంధనమును తెంచుకొనిన; గజం = ఏనుగు; మదబలోద్ధతమ్ = మదబలములచే విర్రవీగుచున్న.
భావంః-
ఏ దైవము నీ రాజ్యాభిషేకమును అడ్డుకొనినదో, అట్టి దైవమునే నేను ప్రతిఘటించెదను. దైవము, అంకుశఘాతమును, బంధనమును లెక్కచేయని మదించిన ఏనుగువలె నున్నది.
2.23.21.
అనుష్టుప్.
ప్రధావితమహం దైవమ్
పౌరుషేణ నివర్తయే।
లోకపాలాస్సమస్తా స్తే
నాద్య రామాభిషేచనమ్॥
టీకః-
ప్రధావితమ్ = పరుగిడుచున్న; అహం = నేను; దైవమ్ = దైవమును; పౌరుషేణ = పౌరుషముచే; నివర్తయే = వెనుకకు మరలించెదను; లోకపాలాః = లోకపాలురు; సమస్తాః = సకలురు; తే = ఆ; న = చేయజాలరు; అద్య = నేడు; రామాభిషేచనమ్ = రామునియొక్క రాజ్యాభిషేకమును.
భావంః-
అట్లు పరుగిడుచున్న దైవమును నేను పౌరుషముతో మరలించెదను. సకల లోకపాలురు రాముని రాజ్యాభిషేకమును అడ్డుకొనజాలరు.
2.23.22.
అనుష్టుప్.
న చ కృత్స్నాస్త్రయో లోకా
విహన్యుః కిం పునః పితా।
యైర్నివాసస్తవారణ్యే
మిథో రాజన్సమర్థితః॥
టీకః-
న = చాలరు; చ = పాదపూరణము; కృత్స్నాః = సకల; త్రయః లోకాః = ముల్లోకములును; విహన్యుః = అడ్డుకొనుట; కిం పునః = మరల చెప్పనేల; పితా = తండ్రి; యైః = ఎవరిచే; నివాసః = నివాసము; తవ = నీ యొక్క; అరణ్యే = అరణ్యమునందు; మిథః = రహస్యముగ; రాజన్ = రాజా; సమర్థితః = కోరబడినదో.
భావంః-
రామా! ముల్లోకములు కూడ అడ్డుకొనజాలవు. ఇక తండ్రి మాట చెప్పనేల. నీవు అరణ్యమునందు నివసింపవలెనని ఎవరు రహస్యముగ నిర్ణయించినారో.
2.23.23.
అనుష్టుప్.
అరణ్యే తే నివత్స్యన్తి
చతుర్దశ సమాస్తథా।
అహం తదాశాం ఛేత్స్యామి
పితుస్తస్యాశ్చ యా తవ॥
టీకః-
అరణ్యే = అరణ్యమునందు; తే = వారు; నివత్స్యన్తి = నివసించెదరు; చతుర్దశ సమాః = పదునాలుగు వత్సరములు; తథా = ఆ విధముగ; అహం = నేను; తత్ = అందుచే; ఆశాం = ఆశను; చేత్స్యామి = ఛేదించెదను; పితుః = తండ్రి యొక్క; తస్యాశ్చ = ఆమె యొక్క; యా = ఏ; తవ = నీ యొక్క.
భావంః-
వారే అరణ్యములో పదునాలుగు వత్సరములు నివసించెదరు. అందువలన, తండ్రి ఆశను, ఆమె యొక్క ఆశను భగ్నము చేసెదను.
2.23.24.
అనుష్టుప్.
అభిషేకవిఘాతేన
పుత్రరాజ్యాయ వర్తతే।
మద్బలేన విరుద్ధాయ
న స్యాద్దైవబలం తథా॥
టీకః-
అభిషేక విఘాతేన = అభిషేకమునకు విఘ్నము కలిగించుటవలన; పుత్రరాజ్యాయ = కుమారుని రాజ్యము కొరకై; వర్తతే = ప్రయత్నించుచున్న; మద్బలేన = నా బలముతో; విరుద్ధాయ = విరుద్ధముగ; న స్యాత్ = కాజాలదు; దైవబలం = దైవబలము; తథా = అట్లు.
భావంః-
పుత్రునికై రాజ్యమును కోరుచున్న ఆమె ఆశను వమ్ము చేసెదను. నా శక్తిని దైవము కూడ ఎదుర్కొనజాలదు.
2.23.25.
అనుష్టుప్.
ప్రభవిష్యతి దుఃఖాయ
యథోగ్రం పౌరుషం మమ।
ఊర్ధ్వం వర్షసహస్రాన్తే
ప్రజాపాల్యమనన్తరమ్॥
టీకః-
ప్రభవిష్యతి = సమర్థమగునో; దుఃఖాయ = దుఃఖమునకు; యథా = ఎట్లైతే; ఉగ్రమ్ = భీకరమైన; పౌరుషం = పౌరుషము; మమ = నా యొక్క; ఊర్ధ్వం = ఆ పైన; వర్ష సహస్రాన్తే = వేయి సంవత్సరములు అయిన తరువాత; ప్రజాపాల్యమ్ = ప్రజాపాలనము చేసిన; అనన్తరమ్ = తరువాత.
భావంః-
భీకరమైన నా పౌరుషము వారికి అంత దుఃఖమును కలుగజేయును. నీవు వేయి వత్సరములు ప్రజాపాలన చేసెదవు.ఆ తరువాత,
2.23.26.
అనుష్టుప్.
ఆర్యపుత్రాః కరిష్యన్తి
వనవాసం గతే త్వయి।
పూర్వం రాజర్షివృత్త్యా హి
వనవాసో విధీయతే॥
టీకః-
ఆర్యపుత్రాః = పూజ్యుడవైన నీ కుమారులు; కరిష్యన్తి = చేసెదరు; వనవాసం = వనవాసమును గూర్చి; గతే = వెళ్ళినపుడు; త్వయి = నీవు; పూర్వ = పూర్వము; రాజర్షి = రాజర్షులు; వృత్యా = వృత్తిగా; హి = కదా; వనవాసః = వనవాసము; విధీయతే = విధింపబడినది.
భావంః-
నీవు వానప్రస్థము స్వీకరించనపుడు, నీ కుమారులు రాజ్యపాలన చేసెదరు. పూర్వము రాజర్షులకు అట్లు విధింపబడినది కదా.
2.23.27.
అనుష్టుప్.
ప్రజా నిక్షిప్య పుత్రేషు
పుత్రవత్పరిపాలనే।
స చేద్రాజన్యనేకాగ్రే
రాజ్యవిభ్రమశంకయా॥
టీకః-
ప్రజాః = ప్రజలను; నిక్షిప్య = ఉంచి; పుత్రేషు = పుత్రులయందు; పుత్రవత్ = పుత్రులవలె; పరిపాలనే = పరిపాలించుటలో; స = ఆ; చేత్ = అట్లైన; రాజని = రాజు; అనేకాగ్రే = స్థిర చిత్తము లేనప్పుడు; రాజ్యవిభ్రమ శంకయా = రాజ్యమునందు భేదభావము లేర్పడునను శంకచే.
భావంః-
ప్రజలను పుత్రులవలె పాలించవలెనని, రాజ్యమును తమ పుత్రులకు అప్పగించి వెళ్ళునపుడు, చిత్తము స్థిరముగ లేని రాజునకు, రాజ్యమునందు భేదాభిప్రాయము లేర్పడునేమో శంక కలుగును.
2.23.28.
అనుష్టుప్.
నైవమిచ్ఛసి ధర్మాత్మన్
రాజ్యం రామ త్వమాత్మని।
ప్రతిజానే చ తే వీర
మాఽ భూవం వీరలోకభాక్॥
టీకః-
న = లేదు; ఏవమ్ = ఇట్లు; ఇచ్ఛసి = ఇష్టపడుట; ధర్మాత్మన్ = ధర్మాత్మా; రాజ్యం = రాజ్యమును; రామ = రామా; త్వం = నీవు; ఆత్మని = తనయందు; ప్రతిజానే చ = ప్రమాణము చేయుచున్నాను; తే = నీకు; వీర = వీరా; మా అభూవం = కాకుండెదనుగాక; వీరలోకభాక్ = వీరలోకమును పొందువాడను.
భావంః-
అయినను నీవు అట్లు ఇష్టపడక, రాజ్యమును నీకు వలదనుకొనినచో, నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. “నేను వీరలోకమును పొందువాడను కాను,
2.23.29.
అనుష్టుప్.
రాజ్యం చ తవ రక్షేయమ్
అహం వేలేవ సాగరమ్।
మంగలైరభిషిఞ్చస్వ
తత్ర త్వం వ్యాపృతో భవ॥
టీకః-
రాజ్యం = రాజ్యమును; తవ = నీ యొక్క; రక్షేయమ్ = రక్షించెదను; అహం = నేను; వేలా = సముద్రతీరము; ఇవ = వలె; సాగరమ్ = సముద్రమును; మంగలైః = మంగళద్రవ్యములతో; అభిషిఞ్చస్వ = అభిషేకము చేసుకొనుము; తత్ర = అక్కడ; త్వం = నీవు; వ్యాపృతః = వ్యాపకుడవు; భవ = అగుము.
భావంః-
చెలియలికట్ట సముద్రమును కాచుచుండునట్లు నేను రాజ్యమును రక్షించుచుందును. నీవు మంగళకరద్రవ్యములతో రాజ్యాభిషేకము చేసుకొను విషయమై కార్యోన్ముఖుడవగుము.
2.23.30.
అనుష్టుప్.
అహమేకో మహీపాలాన్
అలం వారయితుం బలాత్।
న శోభార్థావిమౌ బాహూ
న ధనుర్భూషణాయ మే॥
టీకః-
అహమ్ = నేను; ఏకః = ఒక్కడినే; మహీపాలాన్ = రాజులను; అలం = సమర్థుడను; వారయితుం = అడ్డుకొనుటకు; బలాత్ = బలమువలన; న = కాదు; శోభార్థౌ = అందముకొరకు; ఇమౌ = ఈ; బాహూః = భుజములు; ధనుః = ధనుస్సు; భూషణాయ = అలంకారముకొరకు; మే = నా యొక్క.
భావంః-
నేనొక్కడినే రాజులను సమర్థవంతముగ అడ్డుకొనగలను. నా భుజదండములు కేవలము అందమునకు కాదు. నా ధనుస్సు కేవలము అలంకారమునకు కాదు.
2.23.31.
అనుష్టుప్.
నాఽ సిరాబన్థనార్థాయ
న శరాస్తమ్భహేతవః।
అమిత్రదమనార్థం మే
సర్వమేతచ్చతుష్టయమ్॥
టీకః-
న = కాదు; అసిః = ఖడ్గము; అబన్ధనార్థాయ = కట్టిఉంచుకొనుటకు; న = కాదు; శరాః = బాణములు; స్తమ్భహేతవః = స్థిరముగనుండుటకు; అమిత్రదమనార్థం = శత్రువులను అణచియుంచుటకు; మే = నా యొక్క; సర్వమ్ = అన్నియు; ఏతత్ = ఈ; చతుష్టయమ్ = నాలుగును.
భావంః-
నా ఖడ్గము నడుమునకు కట్టిఉంచుకొనుటకు కాదు. బాణములు స్థిరముగ ఉంచుటకు కాదు. ఈ నాలుగు శత్రువులను నిలువరించుటకే నియుక్తమై యున్నవి.
2.23.32.
అనుష్టుప్.
న చాహం కామయేఽ త్యర్థమ్
యస్స్యాచ్ఛత్రుర్మతో మమ।
అసినా తీక్ష్ణధారేణ
విద్యుచ్చలితవర్చసా।
టీకః-
నాకు శత్రువైన వానిని సహించుటకు ఇచ్చగించను. పదునైన అంచుతో, మెఱుపువలె ప్రకాశవంతమై కదలుచున్న నా ఖడ్గమును చేతబట్టి, ఇంద్రుడే శత్రువైనను లెక్కచేయను.
భావంః-
వజ్రిణం వా న కల్పయే॥
2.23.33.
అనుష్టుప్.
ఖడ్గనిష్పేషనిష్పిష్టైః
గహనా దుశ్చరా చ మే।
హస్త్యశ్వనరహస్తోరు
శిరోభిర్భవితా మహీ॥
టీకః-
ఖడ్గ నిష్పేష నిష్పిష్టైః = ఖడ్గముచే ఖండింపబడి చూర్ణమై; గహనా = ప్రవేశించుటకు వీలులేనిది; దుః చరా చ = సంచరించుటకు వీలులేనిది; మే = నా యొక్క; హస్తి అశ్వ నర హస్త ఊరు శిరోభిః = ఏనుగుల; గుఱ్రముల; మానవుల; చేతులతోను; తొడలతోను; శిరస్సులతోను; భవితా = కాగలదు; మహీ = భూమి.
భావంః-
నా ఖడ్గముచే ఖండింపబడి తునుకలైన ఏనుగుల, గుఱ్రముల, మానవుల చేతులు, తొడలు, తలలతో ఈ భూమి అంతయు నిండి, నడచుటకు వీలుకానట్లుండును గాక.
2.23.34.
అనుష్టుప్.
ఖడ్గధారాహతా మేఽ ద్య
దీప్యమానా ఇవాద్రయః।
పతిష్యన్తి ద్విపా భూమౌ
మేఘా ఇవ సవిద్యుతః॥
టీకః-
ఖడ్గధారాహతాః = ఖడ్గపు అంచుచే కొట్టబడినవై; మే = నా యొక్క; అద్య = ఇప్పుడు; దీప్యమానా = మండుచున్న; ఇవ = వలె; అద్రయః = పర్వతములు; పతిష్యన్తి = పడగలవు; ద్విపాః = ఏనుగులు; భూమౌ = భూమిపై; మేఘా ఇవ = మేఘములవలె; సవిద్యుతః = మెరుపులతో కూడిన.
భావంః-
ఇప్పుడు ఏనుగులు నా ఖడ్గధాటిచే తెగి మండుచున్న పర్వతముల వలె, మెరయుచున్న మేఘముల వలె భూమిపై పడగలవు.
2.23.35.
అనుష్టుప్.
బద్ధగోధాంగులిత్రాణే
ప్రగృహీతశరాసనే।
కథం పురుషమానీ స్యాత్
పురుషాణాం మయి స్థితే॥
టీకః-
బద్ధ గోధాంగుళి త్రాణే = ఉడుము చర్మముతో చేసిన అంగుళి కవచములను కట్టుకొని, ప్రగృహీత = గ్రహించబడిన, శరాసనే = ధనుస్సు కలవాడనై, కథం = ఎట్లు, పురుషమానీ = పురుషుడను అని చెప్పుకొనువాడుగా, స్యాత్ = ఉండును, పురుషాణాం = పురుషులలో, మయి = నేను, స్థితే = నిలిచి ఉండగా.
భావంః-
వ్రేళ్ళ రక్షణమునకై ఉడుము చర్మముతో చేసిన అంగుళి త్రాణములను ధరించి, ధనుస్సును చేబూని నేను పురుషులమధ్య నిలిచి ఉండగా, తానే పురుషుడనని ఎవడు నా ఎదుట నిలువగలడు?
2.23.36.
అనుష్టుప్.
బహుభిశ్చైకమత్యస్యన్
ఏకేన చ బహూన్జనాన్।
వినియోక్ష్యామ్యహం బాణాన్
నృవాజిగజమర్మసు॥
టీకః-
బహుభిః = అనేక; ఏకమ్ = ఒకనిని; అత్యస్యన్ = కొట్టి దూరముగా పడవేయుచు; ఏకేన = ఒక్కదానితో; బహూన్ = చాలామంది; జనాన్ = జనులను; వినియోక్ష్యామి = ప్రయోగించెదను; అహం = నేను; బాణాన్ = బాణములను; నృ వాజి గజ మర్మసు = మనుష్యుల; గుర్రముల; ఏనుగుల మర్మస్థానములందు.
భావంః-
నేను ఒక్క బలవంతుని అనేక బాణములతో పడగొట్టుచు, ఒక్క బాణముతో అనేకులను చంపుచు, నా బాణములను మనుష్య అశ్వ గజముల మర్మస్థానములందు ప్రయోగించెదను.
2.23.37.
అనుష్టుప్.
అద్య మేఽ స్త్రప్రభావస్య
ప్రభావః ప్రభవిష్యతి।
రాజ్ఞశ్చాప్రభుతాం కర్తుమ్
ప్రభుత్వం తవ చ ప్రభో॥
టీకః-
అద్య = నేడు; మే = నా యొక్క; అస్త్ర ప్రభావస్య = అస్త్రముల ప్రభావము యొక్క; ప్రభావః = శక్తి; ప్రభవిష్యతి = ప్రకాశము కాగలదు; రాజ్ఞః = రాజునకు; అప్రభృతాం = ప్రభుత్వము లేకుండటను; కర్తుం = చేయుటకును; ప్రభుత్వం = ప్రభుత్వమును; తవ = నీకు; ప్రభోః = ఓ రాజా.
భావంః-
ఓ రామా! నేడు నా అస్త్రప్రభావముచే రాజైన దశరథుని, అధికారమునుండి తొలగించి, నీకు రాజ్యాధికారమును చేకూర్చగలను.
2.23.38.
అనుష్టుప్.
అద్య చందనసారస్య
కేయూరామోక్షణస్య చ।
వసూనాం చ విమోక్షస్య
సుహృదాం పాలనస్య చ॥
టీకః-
అద్య = నేడు; చందన సారస్య = గంధము యొక్క సారమునకు; కేయూరా మోక్షణస్య చ = కేయూరములను ధరించుటకు; వసూనాం = సంపదల యొక్క; విమోక్షస్య = దానమునకు; సుహృదాం = స్నేహితుల యొక్క; పాలనస్య చ = పాలనమునకును.
భావంః-
సుగంధమునకును, కేయూరములను ధరించుటకును, సంపదలను దానము చేయుటకు స్నేహితులను పాలించుటకును...
2.23.39.
అనుష్టుప్.
అనురూపావిమౌ బాహూ
రామ కర్మ కరిష్యతః।
అభిషేచనవిఘ్నస్య
కర్తౄణాం తే నివారణే॥
టీకః-
అనురూపౌ = తగిన; ఇమౌ = ఈ; బాహూ = బాహువులు; రామ = రామా; కర్మ = కర్మను; కరిష్యతః = చేయగలవు; అభిషేచన్ = అభిషేకమునకు; విఘ్నస్య = విఘ్నమును; కర్తౄణాం = చేసెడి వారి; తే = నీ యొక్క; నివారణే = నివారించుటయందు.
భావంః-
నా యీ బాహువులు నీ అభిషేకమునకు విఘ్నములు కల్పించెడివారిని నివారించుటకు తగినపని చేయగలవు.
2.23.40.
జగతి.
బ్రవీహి కోఽ ద్యైవ మయా వియుజ్యతామ్
తవా సుహృత్ప్రాణయశస్సుహృజ్జనైః।
యథా తవేయం వసుధా వశే భవే
త్తథైవ మాం శాధి తవాస్మి కింకరః॥
టీకః-
బ్రవీహి = చెప్పుము; కః = ఎవడు; అద్య ఏవ = ఇప్పుడే; మయా = నాచే; వియుజ్యతామ్ = దూరము చేయబడవలెనో; తవా = నీ యొక్క; అసుహృత్ = శత్రువైన; ప్రాణ యశస్ సుహృజ్జనైః = ప్రాణములతోను; కీర్తితోను; మిత్రులతోను; యథా = ఎట్లు; తవ = నీ యొక్క; ఇయం = ఈ; వసుధా = భూమి; వశే = వశమునందు; భవేత్ = అగునో; తథైవ = అట్లు; మాం = నన్ను; శాధి = ఆజ్ఞాపింపుము; తవ = నీకు; అస్మి = ఉన్నాను; కింకరః = దాసుడనై.
భావంః-
నీ శత్రువు ఎవనిని ప్రాణములనుండి, కీర్తినుండి, మిత్రులనుండి, దూరము చేయవలయునో చెప్పుము. నేను ఇప్పుడే అట్లు చేసెదను. ఈ భూమి నీకు వశమగుటకు నేనేమి చేయవలయునో అట్లు నన్నాజ్ఞాపింపుము. నేను నీ దాసుడనై యుంటిని.
2.23.41.
జగతి.
విమృజ్య బాష్పం పరిసాన్త్వ్యచాసకృత్
స లక్ష్మణం రాఘవవంశవర్ధనః।
ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం
నిబోధ మామేష హి సౌమ్య సత్పథః॥
టీకః-
విమృజ్య = తుడిచి; బాష్పం = కన్నీటిని; పరిసాన్త్వ్య చ = సాంత్వనపరచి; అసకృత్ = మాటిమాటికి; లక్ష్మణం = లక్ష్మణుని గూర్చి; రాఘవవంశ వర్ధనః = రఘువంశమును ఉద్ధరించువాడైన రాముడు; ఉవాచ = పలికెను; పిత్ర్యే = తండ్రికి సంబంధించిన; వచనే = మాటయందు; వ్యవస్థితం = కట్టుబడినవానిగ; నిబోధ = ఎరుగుము; మామ్ = నన్ను; ఏషః = ఇది; హి = కదా; సౌమ్య = సౌమ్యుడా; సత్పథః = ఉత్తమమార్గము.
భావంః-
అప్పుడు రాముడు లక్ష్మణుని కన్నీరు తుడిచి, మాటిమాటికి అతనిని సాంత్వనపరచుచు లక్ష్మణునితో ఇట్లనెను, ’ఓ లక్ష్మణా నేను తండ్రి మాటకు కట్టుబడి ఉన్నాను. ఇదియే ఉత్తమమైన మార్గము కదా’.
2.23.42.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే త్రయోవింశః సర్గః॥
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; త్రయోవింశః [23] = ఇరవైమూడవ; సర్గః = సర్గ.
భావంః-
ఇది ఆదికావ్యమైన వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణాంతర్గత అయోధ్యా కాండలోని ఇరువదిమూడవ (23) సర్గ సుసంపూర్ణము.
2.24.1.
అనుష్టుప్.
తం సమీక్ష్య త్వవహితమ్
పితుర్నిర్దేశ పాలనే।
కౌసల్యా బాష్పసంరుద్ధా
వచో ధర్మిష్ఠమబ్రవీత్॥
టీకః-
తం = అతనిని; సమీక్ష్య = చూచి; తు = పాదపూరణము; అవహితమ్ = దృఢమైన మనస్సు కలవానిగ; పితుః = తండ్రియొక్క; నిర్దేశ పాలనే = ఆజ్ఞను పాలించుటలో; కౌసల్యా = కౌసల్య; బాష్ప = కన్నీటితో; సంరుద్ధా = అడ్డబడిన స్వరము గలదై; వచః = మాటలు; ధర్మిష్ఠమ్ = ధర్మము కలిగిన; అబ్రవీత్ = పలికెను
భావంః-
రాముడు, తండ్రి ఆజ్ఞనే పరిపాలింపవలెనను దృఢ నిశ్చయముతో ఉన్నట్లు చూచి కౌసల్య డగ్గుత్తికతో అస్పష్టముగా మాట్లాడుచు, ధర్మయుక్తములైన ఈ వాక్యమును పలికెను.
2.24.2.
అనుష్టుప్.
“అదృష్టదుఃఖో ధర్మాత్మా
సర్వభూతప్రియంవదః।
మయి జాతో దశరథాత్
కథముంఛేన వర్తయేత్॥
టీకః-
అదృష్ట = చూడబడని; దుఃఖః = దుఃఖములు గలవాడు; ధర్మాత్మా = నీతిమంతుడు; సర్వ = సమస్త; భూత = ప్రాణులతోను; ప్రియంవదః = ప్రేమగా మాట్లాడువాడు; మయి = నాయందు; జాతః = పుట్టిన రాముడు; దశరథాత్ = దశరథుని వలన; కథమ్ = ఏ విధముగా; ఉంఛేన = నేల మీద పడిన గింజలను సేకరించుటచే; వర్తయేత్ = జీవించగలడు
భావంః-
మా కౌసల్యాదశరథుల కుమారుడు ఈ రాముడు. ధర్మాత్ముడు. అన్ని భూతములకును ప్రియమునే కోరువాడు. ఎన్నడును దుఃఖములను అనుభవించి ఎరుగడు. అట్టి ఈ రాముడు ఉంఛవృత్తితో ఎట్లు జీవించును?
గమనికః-
ఉంఛవృత్తి- చతురాశ్రమములలో ఒక ఉపవృత్తి, శిలోంఛనము. యజమాని పంట ఊడ్చుకుని పట్టుకొని వెళ్ళిన ప్పుడు కొన్ని గింజలు నేపై పడును, వాటిని జీవికకై ఏరుకొనువాడు. చతురాశ్రమముల వివరణలకొఱకు ఇక్కడ నొక్కి తెలుగుభాగవతం.ఆర్గ్ జాలికలోని వివరణలు విభాగములో పారిభాషిక పదములు ఉపవిభాగమున 10వ శీర్షిక యందు చూడగలరు
2.24.3.
అనుష్టుప్.
యస్య భృత్యాశ్చ దాసాశ్చ
మృష్టాన్యన్నాని భుంజతే।
కథం స భోక్ష్యతేఽనాథో
వనే మూలఫలాన్యయమ్॥
టీకః-
యస్య = ఎవని యొక్క; భృత్యాశ్చ = ఆశ్రితులు మఱియు; దాసాశ్చ = సేవకులు మఱియు; మృష్టాని = స్వచ్ఛమైన; అన్నాని = భోజనమును; భుంజతే = తినుచుందురో; కథం = ఏ విధముగా; స = ఆ రాముడు; భోక్ష్యతే = తినగలడు; నాథః = ప్రభువు;వనే = అరణ్యమునందు; మూల = దుంపలను; ఫలాని = ఫలములను; అయమ్ = అటువంటి
భావంః-
ప్రభువైన ఈ రాముని భృత్యులు, దాసులు కూడా ఉత్తమమైన ఆహారమును భుజించుచుందురు కదా! ఈత డిపుడు వనమునందు.. దుంపలను, ఫలములను ఎట్లు తిని జీవించును?
2.24.4.
అనుష్టుప్.
కః ఏతచ్ఛ్రద్దధేచ్ఛ్రుత్వా
కస్య వా న భవేద్భయమ్।
గుణవాన్ దయితో రాజ్ఞా
రాఘవో యద్వివాస్యతే॥
టీకః-
కః = ఎవరు; ఏతత్ = అది; శ్రద్దధేత్ = నమ్ముదురు!; శ్రుత్వా = వినిl; కస్య = ఎవరికి; వా = లేదు; న = లేదు కదా?; భవేత్ = కలుగుట; భయమ్ = భయము; గుణవాన్ = సద్గుణవంతుడు; దయితః = ప్రియమైనవాడు; రాజ్ఞా = రాజుచే; రాఘవః = రాఘవ రాముడు; యత్ = ఏ విధముగా; వివాస్యతే = ప్రవాసమునకు పంపబడుచున్నాడు.
భావంః-
తనకు ప్రియుడు సద్గుణవంతుడు అయిన రాముడినే రాజు ప్రవాసమునకు పంపుచున్నాడన్నచో ఇది విని ఎవ్వరు నమ్ముదురు? ఎవరికి భయము కలుగకుండును?
2.24.5.
అనుష్టుప్.
నూనం తు బలవాన్ లోకే
కృతాన్తస్సర్వమాదిశన్।
లోకే రామాభిరామస్త్వమ్
వనం యత్ర గమిష్యసి॥
టీకః-
నూనం = కచ్చితముగ; తు = ఇంకను; బలవాన్ = బలము కలది; లోకే =ప్రపంచమునందు; కృతాన్తః = విధి; సర్వమ్ = అంతయును; ఆదిశన్ = ఆజ్ఞాపించుచున్న; లోకే = లోకమునందు; రామః = రాముడు; అభిరామః = మనోహరమైనవాడు; త్వమ్ = నీవు; వనం = వనములగూర్చి; యత్ర గమిష్యసి = వెళ్లుచున్నావు అని.
భావంః-
లోకాభిరాముడవైన నీవు కూడ అరణ్యమునకు వెళ్లవలసివచ్చినది అన్నచో లోకములో కార్యములను నడిపించుచున్న దైవమే బలవత్తరమని నిశ్చితముగా చెప్పవలసి యున్నది.
2.24.6.
అనుష్టుప్.
అయం తు మామాత్మభవ
స్తవాదర్శనమారుతః।
విలాపదుఃఖసమిధో
రుదితాశ్రుహుతాహుతిః॥
టీకః-
అయం తు = ఈ యొక్క; మామ్ = నన్ను; ఆత్మభవః = శరీరములో ఉద్భవించునది; తవ = నీ యొక్క; అదర్శన = కనపడని; మారుతః = గాలి; విలాప = శోకము; దుఃఖ = దుఃఖము; సమిధః = సమిధలు; రుదిత = ఏడుపుచే కలిగిన; అశ్రు = కన్నీళ్లు; హుతాహుతిః = అర్పణము చేసిన.
భావంః-
కుమారా! నీవు దూరముగా వెళ్లిపోయిన వెంటనే నా శరీరమునందు సాటిలేని గొప్ప శోకాగ్ని పుట్టును. నీవు కనబడకుండుటయే దీనిని ప్రజ్వలింపచేయు వాయువు. విలాప దుఃఖములే సమిధలు, ఏడ్చుటవలన కలుగు కన్నీళ్లే హోమము చేసిన ఆహుతి.
2.24.7.
అనుష్టుప్.
చిన్తాబాష్పమహాధూమః
తవాగమనచిత్తజః।
కర్శయిత్వా భృశం పుత్ర
నిశ్వాసాయాససమ్భవః॥
టీకః-
చిన్తా బాష్పః = చింత వలన ఏర్పడిన కన్నీరు; మహాధూమః = గొప్ప పొగ; తవ = నీ యొక్క; ఆగమన = తిరిగి వచ్చు; చిత్తజః = ఆలోచన; కర్శయిత్వా = కృశింపచేసి; భృశం = అధికముగా; పుత్ర = కుమార; నిశ్వాస = నిట్టూర్పువలన; ఆయాస = అలసటవలన; సమ్భవః = పుట్టుచుండును
భావంః-
కుమారా రామ! చింత వలన కలుగు బాష్పము అను దట్టమైన పొగ ఆవరించును. నీవు ఎప్పుడు వచ్చెదవా అను చింత వలన కలుగు ఆ పొగపెట్టుట వలన నిట్టార్పులు, అలసట, కృశించుట పుట్టును.
2.24.8.
అనుష్టుప్.
త్వయా విహీనామిహ మామ్
శోకాగ్నిరతులో మహాన్।
ప్రధక్ష్యతి యథా కక్షమ్
చిత్రభానుర్హిమాత్యయే॥
టీకః-
త్వయా = నీతో; విహీనామ్ = లేనిదానను; ఇహ = ఇక్కడ; మామ్ = నన్ను; శోకాగ్నిః = శోకము అనెడి అగ్ని; అతులః = అధికముగా; మహాన్ = పెద్దదైన; ప్రధక్ష్యతి = దహించగలదు; యథా = వలె; కక్షమ్ = ఎండుపొద; చిత్రభానుః = అగ్ని; హిమాత్యయే = గ్రీష్మమునందు
భావంః-
ఈ శోకాగ్ని నన్ను పూర్తిగా కృశింపచేసి గ్రీష్మమునందు అగ్ని డొంకలను కాల్చివేసినట్లు కాల్చివేయును.
2.24.9.
అనుష్టుప్.
కథం హి ధేనుః స్వం వత్సమ్
గచ్ఛన్తం నానుగచ్ఛతి।
అహం త్వానుగమిష్యామి
యత్ర పుత్ర గమిష్యసి॥
టీకః-
కథమ్ = ఏ విధముగా; హి = నిశ్చయంగా; ధేనుః = ధేనువు; స్వమ్ = తన; వత్సమ్ = దూడను; గచ్ఛన్తం = వెళ్లుచున్న; నానుగచ్ఛతి = న+అనుగచ్చంత్, అనుసరించక ఉండును; అహం = నేను; త్వాన్ = నిన్ను; అనుగమిష్యామి = అనుసరించెదను; యత్ర = ఎచటకు; పుత్ర = కుమారా; గమిష్యసి = వెళ్లెదవో.
భావంః-
లేగదూడ పోవుచుండగా దాని తల్లి దాని వెనుకనే వెళ్లకుండునా? అట్లే నీవు ఎక్కడి పోయెదవో నేను అక్కడికే వచ్చెదను అని పలికెను.”
2.24.10.
అనుష్టుప్.
తథా నిగదితం మాత్రా
తద్వాక్యం పురుషర్షభః।
శ్రుత్వా రామోఽబ్రవీద్వాక్యమ్
మాతరం భృశదుఃఖితామ్॥
టీకః-
తథా = ఆ విధముగాః నిగదితమ్ = స్పష్టముగా చెప్పబడిన; మాత్రా = తల్లిచే; తత్ = ఆ; వాక్యమ్ = మాటను; పురుషర్షభః = పురుషోత్తముడైన; శ్రుత్వా = విని; రామః = రాముడు; అబ్రవీత్ = పలికెను; వాక్యమ్ = మాటలు; మాతరమ్ = తల్లి చేత; భృశ = మిక్కిలి; దుఃఖితామ్ = దుఃఖించిన.
భావంః-
రాముడు తల్లినోటివెంట వెలువడిన ఆ మాటలు విని, మిక్కిలి దుఃఖించుచున్న ఆమెతో ఇట్లు అనెను.
2.24.11.
అనుష్టుప్.
“కైకేయ్యా వంచితో రాజా
మయి చారణ్యమాశ్రితే।
భవత్యా చ పరిత్యక్తో
న నూనం వర్తయిష్యతి॥
టీకః-
కైకేయ్యా = కైక చేత; వంచితః = మోసగింపబడిన; రాజా = దశరథ మహారాజు; మయి చ = నేను; చ = మఱియు; అరణ్యమ్ = అడవులను; ఆశ్రితే = ఆశ్రయించగా; భవత్యా = నీ చేత; చ = కూడా; పరిత్యక్తః = విడువబడినవాడై; న = లేడు; నూనం = తప్పక; వర్తయిష్యతి = జీవించ.
భావంః-
““తల్లీ! కైకేయి రాజును పూర్వమే వంచించియున్నది. నేను అరణ్యమునకు వెళ్లి, నీవు కూడా అతనిని పరిత్యజించినచో అతడు జీవింపజాలడు. ఇది నిశ్చయము.
2.24.12.
అనుష్టుప్.
భర్తుః కిల పరిత్యాగో
నృశంసః కేవలం స్త్రియాః।
స భవత్యా న కర్తవ్యో
మనసాఽపి విగర్హితః॥
టీకః-
భర్తుః = భర్త యొక్క; కిల = తిరస్కారము; పరిత్యాగః = పరిత్యాగము (విడిచిపెట్టుట); నృశంసః = క్రూరమైన చర్య; కేవలం = పూర్తిగా; స్త్రియాః = స్త్రీలకు; సః=అది; భవత్యా = నీ చేత; న = రానిది; కర్తవ్యః = చేయ; మనసా = మనసుతో; అపి = కూడా; విగర్హితః = నింద్యమైనది.
భావంః-
స్త్రీ భర్తను పరిత్యజించుట చాలా క్రూరమైన కార్యము. నీవు మనసు చేత కూడా నిందితమైన ఈ కార్యమును చేయరాదు.
2.24.13.
అనుష్టుప్.
యావజ్జీవతి కాకుత్స్థః
పితా మే జగతీపతిః।
శుశ్రూషా క్రియతాం తావత్
సహి ధర్మస్సనాతనః”॥
టీకః-
యావత్ = ఏ సమయము వరకు; జీవతి = సజీవముగా; కాకుత్స్థః = దశరథ మహారాజు; పితా = తండ్రి; మే = నాకు; జగతీపతిః = ఈ ప్రపంచమునకు అధిపతి; శుశ్రూషా = సేవ; క్రియతాం = చేయబడును గాక; తావత్ = అంతవరకు; సః = అది; హి = నిశ్చయార్థకము; ధర్మః = ధర్మము; సనాతనః = శాశ్వతమైన ధర్మము.
భావంః-
“నా తండ్రియు మహారాజును అయిన దశరథుడు జీవించియున్నంత వరకు నీవు అతని సేవ చేయవలెను. ఇదియే సనాతనమైన ధర్మము” అని పలికెను.”
2.24.14.
అనుష్టుప్.
ఏవముక్తా తు రామేణ
కౌసల్యా శుభదర్శనా।
తథేత్యువాచ సుప్రీతా
రామమక్లిష్టకారిణమ్॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా తు = చెప్పబడిన; తు = పిమ్మట; రామేణ = రాముని చేత; కౌసల్యా = కౌసల్యాదేవి; శుభదర్శనా = మంగళకరమైన రూపముగల; తథేతి = అటులనే; ఉవాచ = పలికెను; సుప్రీతా = మిక్కిలి సంతసించినదై; రామమ్ = రామునికి; అక్లిష్ట = దోషములులేని పలుకులు; కారిణమ్ = చేయువాడు, పలుకువాడు.
భావంః-
రాముడిట్లు చెప్పగ మిక్కిలి సంతోషించి, దోషరహితముగా మాట్లాడువాడు, ఐన ఆతనితో సమ్మతించి శుభదర్శనము గల కౌసల్యాదేవి “అటులనే చేసెదను” అని రామునితో పలికెను.
2.24.15.
అనుష్టుప్.
ఏవముక్తస్తు వచనమ్
రామో ధర్మభృతాం వరః।
భూయస్తామబ్రవీద్వాక్యమ్
మాతరం భృశదుఃఖితామ్॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగ; ఉక్తస్తు = పలుకబడిన; వచనమ్ = మాటలు; రామః = రాముడు; ధర్మభృతాం = ధర్మములను అనుసరించుటలో; వరః = శ్రేష్ఠుడు; భూయః = మరల; తామ్ = ఆ; అబ్రవీత్ = పలికిన; వాక్యమ్ = వచనమును; మాతరం = తల్లినిగూర్చి; భృశ దుఃఖితామ్ = మిక్కిలి దుఃఖితురాలైన.
భావంః-
ధర్మసంరక్షకులలో శ్రేష్ఠుడైన ఆ రాముడు మిక్కిలి బాధలో ఉన్న తల్లి మాటలు విని, ఆమెతో మరల ఇట్లు పలికెను.
2.24.16.
అనుష్టుప్.
“మయా చైవ భవత్యా చ
కర్తవ్యం వచనం పితుః।
రాజా భర్తా గురు శ్శ్రేష్ఠః
సర్వేషామీశ్వరః ప్రభుః॥
టీకః-
మయాచైవ = నా చేత; చైవ = ఐనను; భవత్యా = నీ చేతను; చ = మఱియు; కర్తవ్యం = చేయుటకు తగినది; వచనం = మాటలు; పితుః = తండ్రియొక్క; రాజా = రాజు; భర్తా = పోషించువాడు; గురుః = పూజ్యుడు; శ్శేష్ఠః = ఉత్తమ పురుషుడు; సర్వేషామ్ = అందరికీ; ఈశ్వరః = శాశింపదగినవాడు; ప్రభుః = పాలకుడు
భావంః-
““నీవు నేను కూడ తండ్రి మాటను ఆచరింపవలెను. అతడే అందరికిని రాజు; పోషకుడు; పూజ్యుడు; శ్రేష్ఠుడు; అధిపతి; ఆజ్ఞాపించు అధికారము కలవాడు.
2.24.17.
అనుష్టుప్.
ఇమాని తు మహారణ్యే
విహృత్య నవ పంచ చ।
వర్షాణి పరమప్రీతః
స్థాస్యామి వచనే తవ”॥
టీకః-
ఇమాని = ఈః తు = యొక్కః మహారణ్యే = గొప్ప అరణ్యములో; విహృత్య = సంచరించిన పిదప; నవపంచ = 9+5, పద్నాలుగు; చ = మఱియు; వర్షాణి = సంవత్సరములు; పరమ = మిక్కిలి; ప్రీతః = ఆనందముగా; స్థాస్యామి = నిలబడగలను; వచనే = మాటలయందు; తవ = మీ యొక్క
భావంః-
పదునాలుగు సంవత్సరములు మహారణ్యములో విహరించి వచ్చి ఆనందపూర్వకముగా నీ ఆజ్ఞను అనుసరించెదను” అనెను.
2.24.18.
అనుష్టుప్.
ఏవముక్తా ప్రియం పుత్రమ్
బాష్పపూర్ణాననా తదా।
ఉవాచ పరమార్తా తు
కౌసల్యా పుత్రవత్సలా॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా = పలుకబడిన; ప్రియమ్ = ప్రియ మైన; పుత్రమ్ = కుమారుని గూర్చి; బాష్ప = కన్నీటితో; పూర్ణాః = నిండిన; ఆననా = ముఖముతో; తదా = అప్పుడు; ఉవాచ = పలికెను; పరమ = అత్యంత; ఆర్తాః = ఆర్తికలది; తు = పాదపూరణము; కౌసల్యా = కౌసల్య; పుత్ర = కుమారుని ఎడల; వత్సలా = వాత్యల్యముగల, మిక్కిలి ఆప్యాయత గల
భావంః-
అపుడు పుత్రవత్సలయైన కౌసల్య రాముని మాటలు విని, మిక్కిలి దుఃఖించుచు, కన్నీటితో నిండిన ముఖము కలదై ప్రియపుత్రుడైన రామునితో ఇట్లనెను
2.24.19.
అనుష్టుప్.
“ఆసాం రామ సపత్నీనామ్
వస్తుం మధ్యే న మే క్షమమ్।
నయ మామపి కాకుత్స్థ
వనం వన్యాం మృగీం యథా।
యది తే గమనే బుద్ధిః
కృతా పితురపేక్షయా”॥
టీకః-
ఆసాం = ఈ; రామ = రామా!; సపత్నీనామ్ = సవతుల; వస్తుమ్ = నివసించుటకు; మధ్యే = మధ్యలో; న = లేదు; మే = నాకు; క్షమమ్ = సామర్థ్యముః నయ= తీసుకొని వెళ్ళుము; మామపి = నన్ను కూడా; కాకుత్స్థ = దశరథ మహారాజు; వనమ్ = అరణ్యముగూర్చి; వన్యామ్ = అడవియందు; మృగీమ్ = ఆడలేడి; యథా = వలె; యది = అయినచో; తే = నీ; గమనే = మార్గములో; బుద్ధిః = ఆలోచన; కృతా = చేయబడినది; పితుః = తండ్రి; అపేక్షయా = కోరికచే
భావంః-
‘‘రామా! నేను ఈ సవతుల మధ్య నివసింపజాలను. తండ్రి మాట ప్రకారము అరణ్యమునకు వెళ్లవలెననియే నీవు నిశ్చయించుకునినచో, అడవిలోనికి లేడిని తీసుకొని వెళ్లినట్లు నన్ను కూడ అరణ్యమునకు తీసుకొని వెళ్లుము.’’
2.24.20.
అనుష్టుప్.
తాం తథా రుదతీం రామో
రుదన్వచనమబ్రవీత్।
“జీవన్త్యా హి స్త్రియా భర్తా
దైవతం ప్రభురేవ చ॥
టీకః-
తాం = ఆమెగూర్చి; తథా = ఆ విధముగా; రుదతీం = ఏడ్చుచున్న; రామః = రాముడు; రుదత్ = విలపించుచు; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను; జీవన్త్యా హిః = జీవించియున్న; హిః = నిశ్చయముగ; స్త్రియా = స్త్రీకి; భర్తా = భర్త; దైవతమ్ = దేవుడు; ప్రభుః = ప్రభువు; ఏవ = నిశ్చయముగ; చ = కూడా.
భావంః-
ఆ విధముగా ఏడ్చుచున్న కౌసల్యతో రాముడు తాను కూడా ఏడ్చుచు, ““స్త్రీ జీవించియున్నంత వరకును భర్తయే ఆమెకు దైవము, అతడే ప్రభువు” అని పలికెను.
2.24.21.
అనుష్టుప్.
భవత్యా మమ చైవాద్య
రాజా ప్రభవతి ప్రభుః।
న హ్యనాథా వయం రాజ్ఞా
లోకనాథేన ధీమతా॥
టీకః-
భవత్యా = మీకును; మమ = నాకు; చైవ = సహితము; అద్య = ఇప్పుడు; రాజా = రాజు; ప్రభవతి = అధికారము కలవాడు; ప్రభుః = పరిపాలకుడు, సర్వోన్నత అధికారి; న హి అనాథా = యజమాని లేనివారము కాము; వయం = మనము; రాజ్ఞా = రాజుచే; లోకనాథేన = భూమికి ప్రభువైన; ధీమతా = బుద్ధిశాలియైన.
భావంః-
అధికార సంపన్నుడైన దశరథ మహారాజునకు నీపైనను, నాపైనను కూడా అధికారమున్నది. లోకమునకంతకు ప్రభువైన, బుద్ధిశాలిౖయెన ఆ రాజు ఉండగా మనము, నాథుడు లేనివారము ఎట్లగుదము?
2.24.22.
అనుష్టుప్.
భరతశ్చాపి ధర్మాత్మా
సర్వభూతప్రియంవదః।
భవతీమనువర్తేత
స హి ధర్మరతస్సదా॥
టీకః-
భరతః = భరతుడు; చాపి = కూడా; ధర్మాత్మా = ధర్మము అనుసరించువాడు; సర్వ = సకల; భూత = ప్రాణులతో; ప్రియమ్ = ప్రేమతో; వదః = మాట్లాడువాడు; భవతీమ్ = నిన్ను; అనువర్తేత = అనుసరించి ఉండును; సః = అతడు; హి = కూడా; ధర్మరతః = ధర్మమునందు ఆసక్తి కలిగినవాడు; సదా = నిత్యము.
భావంః-
ధర్మాత్ముడు, సకల ప్రాణులకు ప్రియమును గూర్చువాడు అయిన భరతుడు కూడ నీకు అనుకూలముగానే ఉండును. అతడు సర్వదా ధర్మమునందే ఆసక్తి కలవాడు.
2.24.23.
అనుష్టుప్.
యథా మయి తు నిష్క్రాన్తే
పుత్రశోకేన పార్థివః।
శ్రమం నావాప్నుయాత్కించిత్
అప్రమత్తా తథా కురు॥
టీకః-
యథా = ఏ విధముగా; మయి = నేను; తు = ఐతే; నిష్క్రాన్తే =నిష్క్రమించినవాడను అగుచుండ; పుత్రశోకేన = పుత్ర శోకము చేత; పార్థివః = రాజు; శ్రమమ్ = కష్టమును; న = జరుగకుండా; అవాప్నుయాత్ = పొందుట; కించిత్ = కొంచెము కూడా; అప్రమత్తా = ఏమరుపాటులేనిదానవై; తథా = ఆ విధముగా; కురు = చేయుము.
భావంః-
నీవు సావధానచిత్తురాలవై, నేను వెళ్లిన పిమ్మట, పుత్రశోకమువలన రాజునకు ఎట్టి కష్టము కలుగకుండునట్లు చేయుము.
2.24.24.
అనుష్టుప్.
దారుణశ్చాప్యయం శోకో
యథైనం న వినాశయేత్।
రాజ్ఞో వృద్ధస్య సతతమ్
హితం చర సమాహితా॥
టీకః-
దారుణః = భయంకరమైనది; చ = మఱియు; అపి = ఇంకను; అయం = ఆ; శోకః = దుఃఖము; యథా=ఎట్లు; ఏనమ్ = ఇతనిని; న వినాశయేత్ = నాశనము చేయకుండునో; రాజ్ఞః = రాజునకు; వృద్ధస్య = వృద్ధుడు; సతతమ్ = ఎల్లప్పుడును; హితం =క్షేమము; చర = ఆచరింపుము; సమాహితా = సావధానముగ.
భావంః-
వృద్ధుడైన రాజును భయంకరమైన ఈ శోకము నశింపచేయకుండు నట్లు చూచుచు సర్వదా అతనికి హితము చేకూర్చుము.
2.24.25.
అనుష్టుప్.
వ్రతోపవాసనిరతా
యా నారీ పరమోత్తమా।
భర్తారం నానువర్తేత
సా తు పాపగతిర్భవేత్॥
టీకః-
వ్రతః = వ్రతములు; ఉపవాసః = ఉపవాసములు; నిరతాః = చేయుట యందు నిష్టకలది; యా = ఎవరాతే; స్త్రీ = స్త్రీ; పరమ = మిక్కిలి; ఉత్తమా = ఉత్తమురాలై; భర్తారం = భర్తను; న = లేదో; అనువర్తేత = అనుసరించుట; సా = అటువంటి ఆమె; తు = తప్పక; పాపగతిః = పాపగతి గలది (నరకము); భవేత్ = అగును
భావంః-
వ్రతములు ఉపవాసములు చేయుచు మిక్కిలి ఉత్తమురాలైనను, భర్తను అనుసరించని స్త్రీ నరకమును పొందును.
2.24.26.
అనుష్టుప్.
భర్తుశ్శుశ్రూషయా నారీ
లభతే స్వర్గముత్తమమ్।
అపి యా నిర్నమస్కారా
నివృత్తా దేవపూజనాత్॥
టీకః-
భర్తుః = భర్తకు; శుశ్రూషయా = సేవ చేయుచు; నారీ = స్త్రీ; లభతే = పొందును; స్వర్గమ్ = స్వర్గమును; ఉత్తమమ్ = ఉత్తమమైన; అపి = కూడా; యా = ఏ; నిర్నమస్కారా = నమస్కరించక; నివృత్తా = తొలగినదో; దేవపూజనాత్ = దేవుని పూజించుటనుండి
భావంః-
దేవతాదులకు నమస్కారము చేయకున్నను, దేవతలను పూజింపకున్నను, భర్త సేవ మాత్రమే చేయు స్త్రీ ఉత్తమమైన స్వర్గమును పొందును.
2.24.27.
అనుష్టుప్.
శుశ్రూషామేవ కుర్వీత
భర్తుః ప్రియహితే రతా।
ఏష ధర్మః పురా దృష్టో
లోకే వేదే శ్రుతః స్మృతః॥
టీకః-
శుశ్రూషామ్ = సేవలు; ఏవమ్ = మాత్రమే; కుర్వీత = చేయవలసినవి; భర్తుః = భర్తకు; ప్రియహితే = ప్రియమునందు మఱియు హితమునందు; రతే=ఆసక్తి గలదై; ఏష = ఇది; ధర్మః = ధర్మము; పురా దృష్టః = బహుకాలము నుండి చూడబడినది; లోకే = లోకమునందు; వేదే = వేదములయందు; శ్రుతః = వినబడినది; స్మృతః = స్మృతులయందు
భావంః-
భర్తకు ప్రియమును, హితమును కోరుచు అతనికి సేవయే చేయవలెను. ఇదియే పూర్వము నుండియు లోకములో ఉన్న, వేదములందు వినబడిన, స్మృతులందు చెప్పబడిన ధర్మము.
2.24.28.
అనుష్టుప్.
అగ్నికార్యేషు చ సదా
సుమనోభిశ్చ దేవతాః।
పూజ్యాస్తే మత్కృతే దేవి
బ్రాహ్మణాశ్చైవ సువ్రతాః॥
టీకః-
అగ్నికార్యేషు = హోమములయందు; చ = మఱియు; సదా = నిరంతరము; సుమనోభిః = పుష్పములతో; చ = మఱియు; దేవతాః = దేవతలు; పూజ్యాః = పూజింపదగినవారు; తే = నీకు; మత్కృతే = నా కొరకు; దేవి = తల్లీ; బ్రాహ్మణాః = బ్రాహ్మణులును; చ = కూడా; ఏవ = తప్పక; సువ్రతాః = ఉత్తమ వ్రతములు గల
భావంః-
తల్లీ! నా నిమిత్తమై నీవు ఎల్లపుడును దేవతలను హోమముల చేతను పుష్పముల చేతను పూజించుచుండుము. ఉత్తమ వ్రతములు గల బ్రాహ్మణులను కూడా పూజించుచుండుము.
2.24.29.
అనుష్టుప్.
ఏవం కాలం ప్రతీక్షస్వ
మమాగమనకాంక్షిణీ।
నియతా నియతాహారా
భర్తృశుశ్రూషణే రతా॥
టీకః-
ఏవం = ఈ విధముగా; కాలం = సమయమును; ప్రతీక్షస్వ = నిరీక్షించుచుండుము; మమ = నా యొక్క; ఆగమన = రాకయందు; కాంక్షిణీ = కోరుచు; నియతా = నియమానుసారముగ; నియతాహారా = నియమిత ఆహారము తీసుకొనుచు; భర్తృః = భర్తకు; శుశ్రూషణే = సేవచేయుటలలో; రతా = నిష్టకలవాడవై.
భావంః-
ఈ విధముగా నియమవంతురాలవై, ఆహారనియమములు పాటించుచు, నిష్టగా భర్త సేవ చేయుచు, నేను వచ్చే సమయమును ఎదురుచూచుచుండుము.
2.24.30.
అనుష్టుప్.
ప్రాప్స్యసే పరమం కామమ్
మయి ప్రత్యాగతే సతి।
యది ధర్మభృతాం శ్రేష్ఠో
ధారయిష్యతి జీవితమ్”॥
టీకః-
ప్రాప్స్యసే = పొందెదవు; పరమమ్ = ఉత్తమమైన; కామమ్ = కామ్యమును, కోరినదానిని; మయి = నేను; ప్రతి = వెనుకకు, తిరిగి; ఆగతే = వచ్చినవాడ నగుచుండ; సతి = తల్లీ; యది = అయినట్లయితే; ధర్మభృతాం = ధర్మమును రక్షించుటయందు; శ్రేష్ఠః = ఉత్తముడైన; ధారయిష్యతి = ధరించినట్లు; జీవితమ్ = ప్రాణమును.
భావంః-
నేను తిరిగి వచ్చినప్పటికి, ధర్మ సంరక్షకులలో శ్రేష్ఠుడైన మా తండ్రి జీవించి ఉన్నచో, నీవు కోరిన ఉత్తమమైనది పొందెదవు.”
2.24.31.
అనుష్టుప్.
ఏవముక్తా తు రామేణ
బాష్పపర్యాకులేక్షణా।
కౌసల్యా పుత్రశోకార్తా
రామం వచనమబ్రవీత్॥
టీకః-
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా = పలుకబడినది; తు = అయి; రామేణ = రాముని చేత; బాష్ప= అశ్రువులతో; పర్యాకుల = వ్యాకులమైన; ఈక్షణా = కన్నులు గలదై; కౌసల్యా = కౌసల్య; పుత్రశోకః = పుత్ర శోకముతో; ఆర్తా = ఆర్తిపొందినదై; రామం = రామునిగూర్చి; వచనమ్ = మాటలు; అబ్రవీత్ = పలికెను
భావంః-
పుత్ర శోకముతో బాధపడుచున్న కౌసల్య రాముని మాటలు విని కన్నీటితో వ్యాకులమైన నేత్రములు కలదై, రామునితో ఇట్లు పలికెను.
2.24.32.
అనుష్టుప్.
“గమనే సుకృతాం బుద్ధిమ్
న తే శక్నోమి పుత్రక।
వినివర్తయితుం వీర
నూనం కాలో దురత్యయః॥
టీకః-
గమనే = వెళ్లుటలో; సుకృతాం = నిశ్చయముగ చేయబడిన; బుద్ధిమ్ = ఆలోచనను; న = కాను; తే = నీయొక్క; శక్నోమి = శక్తురాలను; పుత్రక = కుమారా!; వినివర్తయితుం = మరల్చుటకు; వీర = వీరుడైన; నూనం = నిశ్చయము; కాలః = కాలమును; దురత్యయః = దాటుటకు సాధ్యము కాదు.
భావంః-
“పరాక్రమశాలివైన ఓ కుమారా! “వెళ్లవలెను” అను నీ దృఢ నిశ్చయమును నేను మార్చజాలను. కాలమును ఎవ్వడును దాటజాలడు కదా.
2.24.33.
అనుష్టుప్.
గచ్ఛ పుత్ర త్వమేకాగ్రో
భద్రం తేఽస్తు సదా విభో।
పునస్త్వయి నివృత్తే తు
భవిష్యామి గతవ్యథా॥
టీకః-
గచ్ఛ = వెళ్లుముః పుత్ర = కుమారా; త్వమ్ = నీవు; ఏకాగ్రః = జాగరూకతతో; భద్రం = మంగళము; తే = నీకు; అస్తు = అగుగాక; సదా = నిరంతరము; విభో = మహానుభావుడా; పునః = మరల; త్వయి = నీవు; నివృత్తే = తిరిగి వచ్చినవాడవు అగుచుండ; తు = తప్పక; భవిష్యామి = కాగలను; గతః = పోయిన; వ్యథా = బాధ గలదానను
భావంః-
నీవు జాగరూకుడవై వెళ్లుము. నీకు ఎల్లప్పుడు క్షేమమగుగాక. నీవు మరలివచ్చునప్పుడు నా దుఃఖములన్నియు తొలగిపోవును.
2.24.34.
అనుష్టుప్.
ప్రత్యాగతే మహాభాగే
కృతార్థే చరితవ్రతే।
పితురానృణ్యతాం ప్రాప్తే
త్వయి లప్స్యే పరం సుఖమ్॥
టీకః-
ప్రత్యాగతే = మరల వచ్చినవాడ వగుచుండ; మహాభాగే = మహానుభావుడ; కృతార్థే = కృతకృత్యుడవై; చరిత = ఆచరించిన; చరితవ్రతే = గలవాడవై; పితుః = తండ్రికి; అనృణ్యతామ్ = ఋణవిముక్తుడవై; ప్రాప్తే = పొంది; త్వయి = నీవు; లప్సే్య = పొందగలను; పరం= గొప్ప; సుఖమ్ = సుఖమును.
భావంః-
నీవు తిరిగి వచ్చిన పిమ్మట నా దుఃఖములన్నియు తొలగిపోవును. నీవు కృతకృత్యుడవై, నీ నియమము ఆచరించినవాడవై, తండ్రి ఋణమును తీర్చి, తిరిగి వచ్చిన పిమ్మట నేను గొప్ప సౌఖ్యమును పొందగలను.
2.24.35.
అనుష్టుప్.
కృతాన్తస్య గతిః పుత్ర
దుర్విభావ్యా సదా భువి।
యస్త్వాం సంచోదయతి మే
వచ ఆచ్ఛిద్య రాఘవ॥
టీకః-
కృతాన్తస్య = భాగ్యము లేక విధి యొక్క; గతిః = మార్గము; పుత్ర =ఓ కుమారా; దుర్విభావ్యాః = ఊహింపజాలనిది; సదా = ఎల్లప్పుడు; భువి = భూమి మీద; యః = ఏ గమ్యము; త్వామ్ = నిన్ను; సంచోదయతి = ప్రేరేపించుచున్నదో; మే = నా; వచః = మాటలు; ఆచ్ఛిద్య = నాశనము చేసి; రాఘవ = రాఘవా!
భావంః-
నా మాట కాదని నిన్ను అరణ్యమునకు వెళ్లుటకు ప్రేరేపించుచున్న విధియొక్క గతిని ఈ లోకములో ఎవ్వరును ఎన్నడును అర్థము చేసుకొనజాలరు.
2.24.36.
అనుష్టుప్.
గచ్ఛేదానీం మహాబాహో
క్షేమేణ పునరాగతః।
నందయిష్యసి మాం పుత్ర
సామ్నా వాక్యేన చారుణా॥
టీకః-
గచ్ఛ = వెళ్లుము; ఇదానీమ్ = ఇప్పుడు; మహాబాహో = గొప్ప భుజశక్తి కలిగిన రామా; క్షేమేణ = సురక్షితముగా; పునరాగతః = మరల తిరిగి వచ్చినప్పుడు; నందయిష్యసి = సంతోషింపజేసెదవు; మాం = నన్ను; పుత్ర = కుమారా; సామ్నా = సమ్ముఖమున; వాక్యేన = మాటలతో; చ = మఱియు; చారుణా = సుందరమైన;
భావంః-
భుజపరాక్రమవంతుడా! రామా! ఇపుడు వెళ్లి, క్షేమముగా నా కట్టెదుటకు వచ్చి మంచి మాటలతో, నన్ను సంతోషింపచేయగలవు.
2.24.37.
అనుష్టుప్.
అపీదానీం స కాలస్స్యాత్
వనాత్ప్రత్యాగతం పునః।
యత్త్వాం పుత్రక పశ్యేయమ్
జటావల్కలధారిణమ్॥
టీకః-
అపి = కూడా; ఇదానీం = ఇప్పుడే; సః = ఆ; కాలః = సమయము; స్యాత్ = అయినచో; వనాత్ = అడవి నుండి; ప్రత్యాగతం = తిరిగి వచ్చిన; పునః = మళ్లీ; యత్ = ఎప్పుడు; త్వాం = మీరు; పుత్రక = ఓ కుమారా; పశ్యేయమ్ = చూచెదనో; జటాఋ = జటలను; వల్కల = నార వస్త్రములను; ధారిణమ్ = ధరించినవారిని.
భావంః-
నీవు జటావల్కలములను ధరించి, వనము నుంచి తిరిగి వచ్చుటను ఎప్పడు చూచెదనో? ఆ దివసము నేడే అయినచో ఎంత బాగుండెడిది!”
2.24.38.
జగతి.
తథా హి రామం వనవాసనిశ్చితం
సమీక్ష్య దేవీ పరమేణ చేతసా।
ఉవాచ రామం శుభలక్షణం వచో
బభూవ చ స్వస్త్యయనాభికాంక్షిణీ॥
టీకః-
తథా = ఈ విధముగా; హి = నిశ్చయాత్మకము; రామమ్ = రాముని; వనవాస = అరణ్యములలో నివసించుటను; నిశ్చితమ్ = నిశ్చయించుకున్న; సమీక్ష్య = తెలుసుకొని; దేవీ = రాణి అయిన కౌసల్య; పరమేణ = అత్యంత శ్రేష్ఠమైన; చేతసా = మనస్సుతో; ఉవాచ = పలికెను; రామం = రామునిగూర్చి; శుభ లక్షణం = శుభ లక్షణములు కలిగిన; వచః = మాటలు; బభూవ = అయ్యెను; చ = మఱియు; స్వస్త్యాయన = మంచి జరుగవలెనని; అభికాంక్షిణీ = కోరునది.
భావంః-
రాముడు ఆ విధముగా వనవాసమునకు వెళ్లుటకు నిశ్చయించుకొని నట్లు తెలుసుకొని, శుభలక్షణములు గల ఆ రామునితో, కౌసల్య ఉత్తమమైన మనస్సుతో ఈ విధముగా పలికి అతనికి శుభములు చేయుటను అభిలషించెను.
2.24.39.
గద్యం.
ఇత్యార్షే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే అయోధ్యాకాండే చతుర్వింశః సర్గః.
టీకః-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యాకాండే = అయోధ్యా కాండ లోని; చతుర్శంశః [24] = ఇరవైనాలుగవ; సర్గః = సర్గ.
భావంః-
ఇది ఆదికావ్యమైన వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణాంతర్గత అయోధ్యా కాండలోని ఇరువైనాలుగవ (24) సర్గ సుసంపూర్ణము