భావోద్వేగ నాడీ శాస్త్రం
పరిశోధనా దృష్టి
జీవిత అనుభవాలు మన మెదడుపై లోతైన ప్రభావం చూపుతాయి. అలాంటి తీవ్రమైన పరిణామాలు అర్థం చేసుకొనుటకు మా ప్రయోగశాల యందు మేము మిక్కిలి ఆసక్తి చూపే అంశాలు (1) భావోద్వేగం యొక్క న్యూరో సర్క్యూట్రీని అర్థం చేసుకోవడం (2) జీవితానుభవాలు మరియు మానసిక స్థితి మార్పునకు దోహదపడే మందులు న్యూరో సర్క్యూట్రీ మీద చూపు ప్రభావం అర్థం చేసుకోవడం (3) ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సంక్లిష్ట మానసిక రుగ్మతలకు కారణమయ్యే భావోద్వేగ న్యూరో సర్క్యూట్రీ యందు మార్పులను అర్థం చేసుకోవటం. ఆందోళన మరియు డిప్రెషన్ యొక్క జంతు నమూనాలను (వాటిలో కొన్ని ప్రారంభ జీవిత అనుభవాల యొక్క కలవరాలపై ఆధారపడి ఉన్నవి) ఉపయోగించి ప్రవర్తనలో దీర్ఘకాలిక మార్పులకు దోహదపడే పరమాణు, బాహ్యజన్యు, మరియు సెల్యులార్ మార్పులను మేము అధ్యయనం చేస్తాము.
జీవిత ప్రారంభ క్లిష్టమైన కాలాల వల్ల సైకోపాథాలజీకి కలుగు హాని లేదా స్థితిస్థాపకత ఏర్పరచుట వంటి మార్పులను మేము పర్యావరణ, ఫార్మకోలాజికల్, జెనటిక్ లేదా ఫార్మకోజెనిటిక్ (DREADDలు) కలవరాలను ఉపయోగించడం ద్వారా అన్వేషిస్తాము. ఒత్తిడిపై ఆధారపడి అభివృద్ధి చెందు న్యూరో సర్క్యూట్రీలో ఉత్పన్నమయ్యే మార్పులపై మాకు ఆసక్తి ఉంది. ఇలాంటి మార్పులు వయోజన ఒత్తిడి ప్రతిస్పందనలను నేరుగా ప్రభావితం చేస్తాయి అలాగే ఆందోళన మరియు డిప్రెషన్ వంటి రుగ్మతలకు హాని లేదా స్థితిస్థాపకత కోసం ఒక ఉపరితలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆందోళన మరియు డిప్రెషన్ యొక్క జంతు నమూనాలలో గమనించిన ప్రవర్తనా మార్పులు మరియు లింబిక్ న్యూరో సర్క్యూట్రీలో సెల్లులార్ మార్పులకు దోహదం చేసే సెరటోనిన్, సెరటోనిన్2ఎ గ్రాహకాలు మరియు Gq సిగ్నలింగ్ పాత్రపై మా అధ్యయనాలు దృష్టి సారించాయి. మానసికస్థితిని అదుపు చేయు న్యూరో సర్క్యూట్రీలో బయోఎనర్జీటిక్స్ యొక్క మార్పులను కూడా మేము అధ్యయనం చేస్తాము. ముఖ్యంగా మానసిక రుగ్మతలను కలుగ చేయుటలో అలాగే వాటి చికిత్సలో మైటోకాండ్రియల్ బయోజెనిసిస్ మరియు పనితీరును అధ్యయనం చేస్తాము. వేగవంతంగా పనిచేయు యాంటీడిప్రెసెంట్ థెరపీ అలాగే నిరంతర యాంటీడిప్రెసెంట్ చికిత్స నుండి ఉత్పన్నమయ్యే పరమాణు మరియు సెల్యులార్ అనుసరణలను మేము పరిశీలిస్తాము. అలాంటి అనుసరణల్లో ఒకటైనదే వయోజన నాడీ మూలకణాల నియంత్రణ. వయోజన న్యూరోజెనిసిస్ మరియు మానసికస్థితి సంబంధిత ప్రవర్తనకు దోహదపడే మార్గాలను పరిశీలించుటకు మాకు ఆసక్తి ఉంది. బేసల్ మరియు యాంటీడిప్రెసెంట్-ప్రేరిత హిప్పోకాంపల్ న్యూరోజెనిసిస్లను నియంత్రించడంలో నిర్దిష్ట మోనోఅమినెర్జిక్ గ్రాహకాలు మరియు న్యూరోహార్మోన్ థైరాయిడ్ పాత్రను అధ్యయనం చేయడంలో మేము దృష్టి సారించి ఉన్నాము. భావోద్వేగం యొక్క న్యూరో సర్క్యూట్రీని అర్థం చేసుకోవడానికి మేము ఫార్మకోలాజికల్ మరియు జన్యుపరమైన విధానాలను అలాగే పరమాణు, కనజీవ మరియు ప్రవర్తనా అధ్యయనాలను విస్తరించే సాధనలను ఉపయోగిస్తాము.
Credits: Dr. Neelesh Babu Thummadi