తెలుగులో సంధి అనగా : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధియనం బడు.
వివరణ :పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.
ఉదా : అతడిక్కడ= అతడు+ఇక్కడ ఇందులో అతడు పూర్వపదం. ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.
ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.
ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.
అతడిక్కడ
అతడు+ఇక్కడ (పూర్వపదం+పరపదం)
అతడ్+ఉ+ఇక్కడ (పూర్వస్వరం ఉ)
అతడ్+ఇక్కడ (పూర్వస్వరం లోపించింది)
అతడ్+ఇక్కడ (పరస్వరం మిగిలింది)
అతడి+క్కడ (పరస్వరం, పూర్వస్వరం స్థానంలో చేరింది)
అతడిక్కడ (పదాలు రెండూ పరస్వరంతో ఒకే పదంగా మారాయి)
ఇదే సంధి ప్రాథమిక సూత్రం.
సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.
ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చింది.
రాముడు + అతడు = రాముడతడు అయినది.
సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.
పూర్వ పర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు.
మరికొన్ని ఉదాహరణలు:
1.రామ+అయ్య=రామయ్య, 2.మేన+అత్త=మేనత్త.
వర్ణాలబట్టి సంధులు రెండు రకములు: 1.అచ్సంధి, 2.హల్సంధి.
భాషనిబట్టి సంధులు రెండు రకములు: 1.సంస్కృత సంధులు, 2.తెలుగు సంధులు.
సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.
ఉదా: భాను+ఉదయము=భానూదయము. భాను మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది/ దేవ + ఆలయము = దేవాలయము./
ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము./ దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు. / గుణ+ ఉన్నతుడు = గుణోన్నతుడు.
ఉదా: అతి+అంతము=అత్యంతము.
ఉదా: ఏక+ఏక=ఏకైక./ అష్ట + ఐశ్వర్యములు = అష్టైశ్వర్యములు.
ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము.
ఉదా: వాక్+ఈశ=వాగీశ.
ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి.
ఉదా: తత్+టీక=తట్టీక.
ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.
ఇవి అచ్చులకును, హల్లులకును చెందియున్నవి.
ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు.
ఉదా: వెల+ఆలు=వెలయాలు.
ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు .
ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి.
ఉదా: ఏమి+ఏమి=ఏమేమి./ చివర + చివర= చిట్టచివర. కడ + కడ = కట్టకడ
ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె (ఈ సంధి ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికం, అన్యవిధము అను నాలుగు ఉదాహరణములు కలిగి ఉండును)
ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు
ఉదా: సరసము+మాట=సరసపుమాట
ఉదా: నడు+ఇల్లు=నట్టిల్లు/ చిఱు + ఎలుక = చిట్టెలుక, /
ఉదా: పేరు+ఉరము=పేరుటురము/ నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము.
ఉదా: పేద+ఆలు=పేదరాలు
ఉదా: నీ+చెలిమి=నీదు చెలిమి
ఉదా: సొగసు+తనము=సొగసుందనము
ఉదా: భయము+పడె=భయపడె
త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విరుక్తంబు పరంబుగనగు.
ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబబబైన దీర్ఘంనకు హ్రస్వంబగు
ఉదా: అక్కడ = ఆ+కడ; ఇక్కడ 'ఆ' అనునది .త్రికము మరియు 'క' అనునది అసంయుక్త హల్లు. కనుక ద్విరుక్తంబు వచ్చి
ఆ+క్కడ ఐనది. ద్విరుక్తంబగు 'క్క' పరంబుగనప్పుడు 'ఆ' దీర్ఘం కాస్త హ్రస్వంబై 'అ' అవుతుంది = అక్కడ
ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.
ఉదా: అలరు+మేను=అలరుఁ బోడి.
ఉదా: క్రొత్త+గండి=క్రొగ్గండి.