బహువ్రీహి సమాసము ఒక రకమైన సమాసము.
అన్యపదార్థము ప్రధానంగా కలిగినది బహువ్రీహి సమాసం. ఇది విశేష్యమునకు సంబంధించినదై ఉంటుంది. సమాసంలో ఉన్న పదాలు కాక వాటిచేత సూచింపబడే వేరొక పదం యొక్క అర్థం కలిగివుండటం అన్యపదార్థం.
ఉదాహరణ :
పీతాంబరుడు అనేది విష్ణువు అనే మరొక వ్యక్తిని సూచిస్తుంది. కావున ఇది అన్యపద ప్రధానం.