అనేకములగు అర్థములు వచ్చునట్లుగా వాక్యములందు శబ్దములను కూర్చుట శ్లేషాలంకారము అనబడును.
ఉదాహరణ: రాజు కువలయానందకరుడు.
వివరణ :-
రాజు = ప్రభువు, చంద్రుడు
కువలయము= భూమి, కలువ పూవు
ఈ పదములకు రెండు అర్ట్హములు ఉండుట వలన
రెండు అర్ట్హములు వస్తున్నాయి.'శ్లేష' సహాయంతో కవులు ద్వ్యర్థి, త్ర్యర్థి కావ్యాలు వ్రాసి నారు.
ప్రాచీన కవులలో శ్లేషాలంకారము ప్రయోగించిన వారిలో పింగళి సూరనామాత్యుడు, రామరాజభూషణుడు ప్రసిద్ధులు.
సాహితీవేత్తలు వాడుక భాషలో శ్లేషలు ప్రయోగించటం గురించి ఎన్నో కథనాలు వెలువడ్డాయి. మచ్చుకి ఒక ఉదాహరణ: ఒకసారి రైలు ప్రయాణంలో ఆరుద్ర స్నేహితుడు ఆయన్ను ఇలా అడిగాడు - మీకు ఈ ఊళ్ళో ఏమైనా భూములున్నాయా? అప్పుడే రైలుబండి శ్మశానం ప్రక్కగా పోసాగింది. అటు వైపుగా చూపిస్తూ ఆరుద్ర ఇచ్చిన సమాధానం - ఆ-రుద్ర భూములన్నీ నావే కదండీ!