ఉపమాలంకారం ఉపమానానికి, ఉపమేయానికి సామ్యమైన సాదృశాన్ని చెప్పే అలంకారం లేదా ఉపమేయంతో ఉపమానాన్ని పోల్చడం. ఇది అర్థాలంకారాల్లో ఒకటి.
ఉపమాలంకారాన్ని అర్థంచేసుకునేందుకు ఉపకరించే సాంకేతిక పదాలు, వాటి అర్థాలు ఇవి:
ఉపమానం
దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం
ఉపమేయం
దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం
సమానధర్మం
ఉపమానానికి, ఉపమేయానికి మధ్యనున్న పోలిక
ఉపమావాచకం
ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చడానికి వాడే పదం