ద్వంద్వ సమాసము తెలుగు వ్యాకరణంలో ఒక సమాసము. ఇందులో సాధారణంగా రెండు పదాలుంటే ఆ రెండు పదాల అర్ధమూ ప్రధానమే అవుతుంది. చిన్నయసూరి దీని లక్షణాన్ని "ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం" అని వివరించారు.
ఉదాహరణలు
ఈ సమాసం ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం మరియు సమాహార ద్వంద్వ సమాసం అని రెండు రకాలుగా కనిపిస్తుంది.
ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం
ఒక పదం యొక్క అపేక్ష మరొక పదం కలిగివుండి - ఇలా అనేక పదాలు ఒకే క్రియా పదంతో అన్వయించడం ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం.
ఉదాహరణ : 'రామకృష్ణులు వచ్చారు' అన్నదానిలో రాముడూ వచ్చాడు కృష్ణుడూ వచ్చాడు అని 'వచ్చారు' అనే క్రియా పదం సమాసంలోని రెండు పదాలకూ ప్రాధాన్యతను ఇస్తూ అన్వయించబడినది.
సమాహార ద్వంద్వ సమాసం
సమాహారం అనగా సమూహం అని అర్ధం. విడివిడిగా ఉన్న వస్తువుల్ని ఒకటిగా చేయటం. రెండు లేక మూడు పదాలను కలిపి ఒకటిగా ఏకవచనంలో చెప్పడం సమాహార ద్వంద్వ సమాసం.
బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహుపద ద్వంద్వ సమాసమంటారు.
ఉదాహరణ :
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు.