నాగుల ప్రాముఖ్యత 

సనాతన ధర్మంలో నాగుల ఆరాధనకు విశిష్ట ప్రాముఖ్యం కలదు. నాగులు సంతానానికి, వృద్ధికి, సంరక్షణకు మరియు జనన మరణ సూచికలుగా ఆరాధింపబడతాయి. ఇవి మన పురాణాలూ మరియు సంస్కృతికి సూచికలు మరియు ఇవి మనకు ప్రకృతితో ఉన్న అవినాభావ సంబంధానికి ప్రతీకలు.

మన పురాణాలలో నాగులు: 

రామాయణం, మహాభారతం వంటి పురాణాలలో నాగులకు పాతాళలోకం మరియు నీటిపై విశేష శక్తలు కలవిగా అభివర్ణించారు. మహావిష్ణువు సాయనమైన శేషనాగు విశ్వసంతులనానికి ఒక సూచిక. ఇంకా మన పురాణాలలో వాసుకి అనే నాగు సముద్రమథనానికి ఉపయోగపడే తాడులాగా మారి అమృతం ఉద్భవించడానికి కీలక పాత్ర పోషించారు. 

మహాభారతంలో: 

మహాభారతంలో భీముడిపై కౌరవులు విష ప్రయోగం జరిపి నదిలో విసిరిన ఘట్టంలో భీములవారిని రక్షించి వారికీ 8000ల ఏనుగుల బలాన్ని ప్రసాదించాయి నాగులు. 

అర్జునుడు నాగుల యువరాణి ఉలూపీని వివాహమాడతారు.

ఖాండవవన దహన ఘట్టంలో నాగుడైన తక్షకుడు శ్రీకృష్ణుని శరణుకోరి తన కుమారుడైన అశ్వసేనుని కాపాడుకుంటాడు. అశ్వసేనుని కాపాడుకోవడానికి అతని తల్లి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ ఘట్టంలో తల్లిని పోగొట్టుకున్న అశ్వసేనుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని హతమార్చడానికి కర్ణుడికి  విషపూరితమైన బాణాన్ని అందించాడు.

ఖాండవవన దహన సమయంలో తన బంధుమిత్రులను కోల్పోయిన తక్షకుడు ప్రతీకారవాంఛతో అర్జునుడి మనుమడైన పరీక్షుతుని హతమార్చాడు. దీనికి ప్రతీకారంగా జనమేజయుడు నాగులను అంతమొందించడానికి యజ్ఞాన్ని నిర్వహించాడు. 

రామాయణంలో

కంబ రామాయణంలో  దేవదానవులు సాగరమథన సమయంలో వాసుకి అనే నాగు తాడులా మారి సాగరమథనానికి సహకరించింది. వాసుకిని గరుడపక్షి తీసుకురావడంలో విఫలమవగా శివుడు తన చేతిని పాతాళలోకం వరకు చాపగా వాసుకి శివుని చేతిలో ఆభరణం వలే చుట్టుకుని సాగర మధనానికి వచ్చింది. 

బ్రహ్మపురాణంలో నాగులు 

బ్రాహ్ణమాపురాణం పాతాళలోకానికి రాజుగా ఆదిశేషుడి పాలనను విశదీకరిస్తుంది.