ఆలయ వ్యవస్థాపకులు
కీ.శే. శ్రీ వెన్నపూస మల్లా రెడ్డిగారు:
అనేక ఆంధ్రప్రదేశ్ సహకార చెక్కర కర్మాగారాల్లో మేనేజింగ్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన సామాజిక కార్యకర్త, వ్యవసాయవేత్త మరియు విద్యావేత్త అయిన శ్రీ వెన్నపూస మల్లా రెడ్డిగారు (1942-2014) శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయాన్ని మన రెడ్డిపల్లె గ్రామంలో 2002వ సంవత్సరంలో స్థాపించారు. స్వతహాగా ఆంజనేయస్వామి భక్తులైన వీరు శ్రీ కొప్పోలు నరసింహా రెడ్డిగారి సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ధర్మకర్తలు
శ్రీమతి వెన్నపూస జయమ్మగారు:
వెన్నపూస మల్లా రెడ్డిగారి సతీమణి అయిన శ్రీమతి వెన్నపూస జయమ్మగారు కూడా ఈ ఆలయ నిర్మాణంలో తనవంతు పాత్రను పోషించారు. ఆలయం జీర్ణావస్థలో ఉన్నప్పుడు దీనిని పునర్నిర్మించే మహత్కార్యాన్ని అహర్నిశలూ కష్టపడి ఆలయ పునర్నిర్మాణాన్ని 2024వ సంవత్సరంలో గావించి ఈ ఆలయంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారిని 2024వ సంవత్సరం ఆగష్టు మాసంలో పునఃప్రతిష్టించారు.
డా|| వెన్నపూస మారుతీ శంకర్ రెడ్డిగారు:
శ్రీ వెన్నపూస మల్లా రెడ్డి మరియు శ్రీమతి వెన్నపూస జయమ్మ దంపతుల కొడుకైన డా|| వెన్నపూస మారుతీ శంకర్ రెడ్డిగారు వృత్తి రీత్యా కాన్సర్ సర్జన్ అయినా , ఆంజనేయస్వామిపై భక్తిని తన తల్లిదండ్రుల నుండి పుణికిపుచ్చుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం చేయాలని భావించిన ఈయన విరాళానిని అందించారు మరియు దాతల నుండి విరాళాలను సేకరించారు. ఈ ఆలయ పునర్నిర్మాణం కొరకు అహర్నిశలు శ్రమించారు.