కడప జిల్లా వెల్లటూరు పోస్ట్, పెండ్లిమర్రి మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో  శ్రీ అభయాంజనేయ స్వామివారిదేవస్థానం వెలసినది. ఈ పవిత్రమైన ఆలయాన్ని స్థాపించే ఆలోచన  కీ.శే శ్రీ వెన్నపూస మల్లారెడ్డి గారు మరియు వారి సతీమణి శ్రీమతి వెన్నపూస జయమ్మ గారికి వచ్చింది.


భక్తుల హితార్థం, జన సముదాయానికి ధార్మిక చైతన్యాన్ని కలిగించే ఉద్దేశంతో, వారు 2002 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం విశిష్ట పండితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి, ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు.


భక్తుల భయాలను తొలగించి, సకల మంగళాలను ప్రసాదించడంలో ఇక్కడ వెలసిన  శ్రీ అభయాంజనేయ స్వామివారు ప్రసిద్ధి చెందారు. ఈ క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటే వారి ఆరాధనలు ఫలిస్తాయని  భక్తుల  ప్రఘాడ విశ్వాసం. ఈ దేవాలయం భక్తి శ్రద్ధలకు కేంద్రమవ్వడమే కాకుండా, గ్రామానికి ఆధ్యాత్మిక మహిమాన్వితాన్ని ప్రసాదిస్తోంది.


ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి శ్రీ వెన్నపూస మల్లారెడ్డిగారి సతీమణి శ్రీమతి వెన్నపూస జయమ్మగారు మరియు  కుమారుడు డా. వెన్నపూస మారుతి శంకర్ రెడ్డిగారు 2023లో పూనుకున్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణం 2024 వ సంవత్సరం ఆగష్టు  22వ తేదీన పునఃప్రతిష్టించారు. ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవం శ్రీ శరవణ స్వామిగారి ఆధ్వర్యంలో జరిగింది.