మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
పన్నెండు ఆళ్వార్లు
ద్రావిడ ప్రాంతము నందు విష్ణు సేవకులుగా ప్రధమ స్ధానం పొందిన వారు పన్నెండు మంది ఆళ్వారులు. శ్రీవైష్ణువ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ ఆళ్వార్లు కు ఒక విశిష్టమైన స్ధానం ఉంది. వైష్ణువ భక్తి పారవశ్యంలో నిరంతరం నిమగ్నులైన వారిని ఆళ్వారులుగా పిలుస్తారు. వీరు భక్తాగ్రేసురులై భక్తి సాహిత్యం నందు మహావిష్ణువును స్ధుతిస్తూ పరవశించి పాడిన సంకీర్తనలను తమిళ భాషా నందు "పాశురాలు" అని అంటారు. మధుర భక్తి భరితమైన ఆళ్వార్లు యొక్క సాహిత్యాన్ని తమిళీయులు "ద్రావిడ వేదం" గా కొలుస్తారు. ఆళ్వార్లు రచించిన 4,000 పాశురాలు ను "నాలాయిర దివ్య ప్రబంధం". దీనినే ద్రావిడ వేదంగా కొలుస్తారు.
పొయిగై ఆళ్వార్ - ఇక్కడ నొక్కండి
పూదత్తాళ్వార్ - ఇక్కడ నొక్కండి
పేయాళ్వార్ - ఇక్కడ నొక్కండి
తిరుమళిశైయాళ్వార్ - ఇక్కడ నొక్కండి
నమ్మాళ్వార్ - ఇక్కడ నొక్కండి
మధురకవి ఆళ్వార్ - ఇక్కడ నొక్కండి
కులశేఖరాళ్వార్ - ఇక్కడ నొక్కండి
పెరియాళ్వార్ - ఇక్కడ నొక్కండి
ఆండాళ్ ఆళ్వార్ - ఇక్కడ నొక్కండి
తొండరడిప్పాడి ఆళ్వార్ - ఇక్కడ నొక్కండి
తిరుప్పాణాళ్వార్ - ఇక్కడ నొక్కండి
తిరుమంగైయాళ్వార్ - ఇక్కడ నొక్కండి
అను పన్నెండు మంది తమిళీయులు వివిధ వృత్తులు, కులం నుంచి భక్తి మార్గం నకు వచ్చి శ్రీమాన్నారాయణుని తమ పాశురాలుతో మెప్పించినారు. శ్రీవైష్ణవులు ఆళ్వార్లును దైవాంశ సంభూతులుగా భావించి ఆరాధించుతారు. ఆళ్వార్లు భూమి మీద గల 106 వైష్ణ్వాలయాలుకు మంగళాశాసనములు అందించినారు. వీటిని దివ్యదేశాలుగా పిలుస్తారు. ప్రతి వైష్ణ్వాలయాల్లో ఆళ్వార్లుకు ఒక విశిష్ట స్ధానం ఉంటుంది. ఆళ్వార్లు జన్మ నక్షత్రాలు సందర్భముగా తిరు నక్షత్ర ఉత్సవాలు నిర్వహించుతారు.