Travel planning I యాత్రా ప్రణాళిక
మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
Travel planning I యాత్రా ప్రణాళిక
108 Janma Nakshatra Pada Shivlingalu Tour programme
108 జన్మ నక్షత్ర పాద శివలింగాలు పర్యటన కార్యక్రమం
108 జన్మ నక్షత్ర పాద శివలింగాలు, ద్రాక్షారామం
తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన ద్రాక్షరామ క్షేత్రం అనాదిగా గొప్ప శైవ క్షేత్రం. క్షేత్రం నందలి సప్త గోదావరులు (కొలను) ఒడ్డున స్వయంభూవుగా వెలసిన శ్రీ భీమేశ్వర స్వామి మరియు అష్టాదశ శక్తి పీఠాలల్లో ఒకటి అయిన శ్రీ మాణిక్యాంబ అమ్మవారి దర్శనం లభ్యమవుతుంది. ద్రాక్షరామ క్షేత్రంనకు ఎనిమిది దిక్కుల యందు 108 పాద శివలింగాలను కూడ దర్శించగలము. వీటిని జన్మ నక్షత్ర పాద శివలింగాలుగా పేర్కొనారు.
శిశువు జన్మించిన సమయంను బట్టి నక్షత్రం, పాదం, రాశి తెలుస్తుంది. వీటి వలన శిశువు జన్మించిన నక్షత్ర పాదం యొక్క దోషములు తెలుస్తాయి. ఆ దోషములు నివారించుటకు శాంతులు జరుపుతారు. జన్మించిన శిశువు యొక్క నక్షత్ర దోషములు నివారించుటకు భీమమండలములోని 108 జన్మ నక్షత్ర పాద శివలింగాలున్నాయి. ఆ శిశువు జన్మ నక్షత్ర పాదముకు సంబంధించిన లింగ ప్రతిష్టను దర్శించుట అవసరం. స్వామి దర్శనం తో వీరికి కొంత ఉపశమనం (ఊరట) దొరుకుతుంది. ఏ శాంతులు లేని వారు కూడ దర్శించుట మంచిది. ఆయా నక్షత్ర పాద లింగ ప్రతిష్ట నుంచి వారు ఆశ్వీరచనాలు పొందగలము.
శ్రీ భీమేశ్వర లింగమును సూర్య భగవానుడు ప్రతిష్టించినాడు. భీమేశ్వర లింగము యొక్క ఊష్మము (తాపము) నివారించుటకు, చంద్రభగవానుడు శ్రీ భీమేశ్వర లింగమునకు ఎనిమిది దిక్కుల యందు మరో ఎనిమిది శివాలింగాలును ప్రతిష్టించినట్లు స్ధల పురాణం తెల్పుతుంది. వీటిని అష్ట సోమేశ్వరాలయాలు అంటారు. ఇవి108 జన్మ నక్షత్ర పాద శివలింగాలలో ఒక భాగం. వీటితో పాటు12 రాశి లింగాలు ఉన్నాయి. ఇవి నక్షత్రం యొక్క పాద దోష నివారణ కోసం ప్రతిష్టించబడ్డాయి.12 రాశి లింగాలు ద్రాక్షారామం చుట్టు ప్రక్కల ఉంటాయి.
Janma Nakshatra Pada Shivlingalu Tour programme
జన్మ నక్షత్ర పాద శివలింగాలు పర్యటన కార్యక్రమం
(సమయం, ఖర్చు, సౌక్యం కోసం)
Route No.1
ద్రాక్షారామం (శ్రీ భీమేశ్వరాలయం)
హసనబాద (మిధున రాశి ఆలయం)
పాత వెల్ల (కర్కాటక & సింహ రాశి ఆలయం)
వెల్ల (ఉత్తర సోమేశ్వరం)
ఏరువల్లి (కన్య రాశి ఆలయం)
ఆదివారపు పేట (తుల & వృశ్చిక రాశి ఆలయం)
వేగాయమ్మపేట (మీన రాశి ఆలయం)
విలాస గంగవరం (మేష & వృషభ రాశి ఆలయం)
కుందాలమ్మ చెరువు (మకరం & కుంభ రాశి ఆలయం)
నెలపర్తిపాడు (ధనుస్సు రాశి ఆలయం)
పంచ తీర్ధములు (దక్షవాటిక)
ద్వాదశ లింగములు (దక్షవాటిక)
Route No. 2
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
వాడపాలెం (శ్రవణం, 3వ పాదం)
వానపల్లి (శ్రవణం, 1వ పాదం)
మడుపల్లి (శ్రవణం, 2వ పాదం)
వెలవలపల్లి (ధనిష్ట, 1వ పాదం)
అయినవిల్లి (ధనిష్ట, 2వ పాదం)
ముక్తీశ్వరం (పూర్వభాద్ర, 1వ పాదం)
వీరవల్లిపాలెం (శ్రవణం, 4వ పాదం)
తొత్తరముడి (శతభిషం, 3వ పాదం)
శానపల్లి లంక (పూర్వభాద్ర, 2వ పాదం)
ఠాణేలంక (పూర్వభాద్ర, 3వ పాదం)
* ఠాణేలంక - యానాం - ద్రాక్షారామం (Return)
ఠాణేలంక నుంచి యానాం పోవు మార్గములో మురమళ్ళ ఉంది. మురమళ్ళ కు సూమారు ఏడు కీలోమిటారు దూరం లో ఐలెండు పోలవరం ఉంటుంది. ఐలెండు పోలవరం - శ్రీ బాణేశ్వర స్వామి ఆలయం కలదు. ఇది పంచ రామ లింగ ప్రతిష్ట.
Route No.3
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
కుయ్యేరు (అశ్వని, 3వ పాదం)
ఉప్పుమిల్లి (అశ్వని, 2వ పాదం)
కోలంక (తూర్పు సోమేశ్వరం) (భరణి, 1వ పాదం)
పల్లిపాలెం (భరణి, 3వ పాదం)
ఉప్పంగల (భరణి, 4వ పాదం)
ఇంజరం (భరణి, 2వ పాదం)
కాపులపాలెం (రేవతి, 2వ పాదం)
నీలపల్లి (కృత్తిక, 1వ పాదం)
తాళ్ళరేవు (మృగశిర, 1వ పాదం)
గురజనాపల్లి (మృగశిర, 2వ పాదం)
* గురజనాపల్లి - నడకుదురు - ద్రాక్షారామం (Return)
తాళ్ళరేవు నుంచి కాజులూరు కు బ్రాంచి రోడ్డు ఉంది. ఈ మార్గములో ఆత్రేయ కాలువ పైన బ్రిడ్జి ఉంది. కాలువ గట్టు మీదగా పాత కోరంగి చేరగలము. పాత కోరంగి - శ్రీ కురంగేశ్వర సామి ఆలయం ఉంది. ఇది పంచ రామ లింగ ప్రతిష్ట.
గురజనాపల్లి నుంచి కాకినాడ రోడ్డులో తూరంగి ఉంది. ఇచ్చట తూరంగి - శ్రీ తూరంగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది పంచ రామ లింగ ప్రతిష్ట.
Route No.4
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
ఉండూరు (కృత్తిక, 4వ పాదం)
జగన్నాథ గిరి (మృగశిర, 4వ పాదం)
గొల్లపాలెం (ఆరుద్ర 2వ పాదం)
గొర్రిపూడి (భీమ లింగ పాడు) (పునర్వసు 1వ పాదం)
కరప (భోజనం) (పునర్వసు 2వ పాదం)
వేములవాడ (ఆరుద్ర 3వ పాదం)
వేలంగి (పుష్యమి 3వ పాదం)
ఓదురు (పుష్యమి 4వ పాదం)
నరసరావుపేట (ముఖ 1వ పాదం)
యనమదల (పునర్వసు 2వ పాదం)
* యనమదల - ద్రాక్షారామం (Return)
Route No. 5
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
బాలాంత్రం (రేవతి, 4వ పాదం)
దుగ్గుదుర్రు (అశ్వని, 4వ పాదం)
కాజులూరు (రోహిణి, 2వ పాదం) పంచ రామ లింగం, కాజులూరు లో 3 లింగ ఆలయాలు ఉన్నాయి. విశ్వేశ్వర స్వామి ఆలయం (99129 38872)
శీల (రోహిణి, 4వ పాదం)
అయితపూడి (రోహిణి, 3వ పాదం) పంచ రామ లింగం
పెనుమళ్ళ (ఈశాన్యం సోమేశ్వరం) (ఆరుద్ర 2వ పాదం)
తనుమళ్ళ (రోహిణి, 1వ పాదం)
అండ్రంగి (మృగశిర, 3వ పాదం)
వట్రపూడి (కృత్తిక, 3వ పాదం)
అద్దంపల్లి (కృత్తిక, 2వ పాదం)
ఎర్రపోతవరం (పూర్వభాద్ర, 4వ పాదం)
* ఎర్రపోతవరం - ద్రాక్షారామం (Return)
కాజులూరు నుంచి తాళ్ళరేవు కు బ్రాంచి రోడ్డు ఉంది. ఈ మార్గములో ఆత్రేయ కాలువ పైన బ్రిడ్జి ఉంది. కాలువ గట్టు మీదగా పాత కోరంగి చేరగలము.
పాత కోరంగి - శ్రీ కురంగేశ్వర సామి ఆలయం ఉంది. ఇది పంచ రామ లింగ ప్రతిష్ట.
Route No. 6
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
అరికిరేవుల (ముఖ, 3వ పాదం)
మేళ్లూరు (ముఖ, 2వ పాదం)
చింతపల్లి (పుబ్చ, 1వ పాదం)
గండ్రేడు (ఆశ్లేష, 3వ పాదం)
మామిడాడ (పాటిమీద) భోజనం (ఆశ్లేష, 4వ పాదం)
పెదపూడి (ఆశ్లేష, 2వ పాదం)
దోమాడ (ఆశ్లేష, 1వ పాదం)
అరట్లకట్ట (పునర్వసు, 4వ పాదం)
కూరాడ (ఆరుద్ర, 4వ పాదం)
సిరిపురం (పుష్యమి, 2వ పాదం)
కాపవరం (పుష్యమి,1వ పాదం)
చోడవరం (ఉత్తర, 2వ పాదం)
* చోడవరం - రామచంద్రపురం - ద్రాక్షారామం (Return)
Route No. 7
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
పసలపూడి (ఉత్తర, 4వ పాదం)
కొత్తూరు (ముఖ, 4వ పాదం)
నాదురుబాదు (ఉత్తర, 3వ పాదం)
ఎదురపాక (పుబ్చ, 2వ పాదం)
పందలపాక (ఉత్తర, 1వ పాదం)
తొస్సిపూడి (పుబ్చ, 3వ పాదం)
కొప్పవరం (చిత్త, 1వ పాదం)
పొలమూరు (పుబ్చ, 4వ పాదం)
పెడపర్తి (హస్త, 2వ పాదం)
సోమేశ్వరం (వాయువ్యం) (హస్త, 1వ పాదం)
* సోమేశ్వరం - రామచంద్రపురం - ద్రాక్షారామం (Return)
Route No.8
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
కుందూరు (ధనిష్ట, 4వ పాదం)
పాతకోట (శతభిషం, 4వ పాదం)
దంగేరు (ఆగ్నేయం సోమేశ్వరం) (ఉత్తరాబాద్ర, 1వ పాదం)
శివల (ఉత్తరాబాద్ర, 4వ పాదం)
గుడి గళ్ళ బాద (ఉత్తరాబాద్ర, 3వ పాదం)
పేకేరు (రేవతి, 3వ పాదం)
కూడుపూరు (ఉత్తరాబాద్ర, 2వ పాదం)
బట్లపాలిక (రేవతి, 1వ పాదం)
మసకపల్లి (ధనిష్ట, 3వ పాదం)
బ్రహ్మపురి (అశ్వని, 1వ పాదం)
* బ్రహ్మపురి - ఎర్రపోతవరం - ద్రాక్షారామం (Return)
Route No.9
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
ఆర్తమూరు (చిత్త, 2వ పాదం) పంచ అగస్త్యేశ్వర
పులగుర్త (హస్త, 3వ పాదం)
మండపేట (స్వాతి, 2వ పాదం) పంచ అగస్త్యేశ్వర
గుమ్మిలేరు (స్వాతి, 3వ పాదం)
దుళ్ళ (విశాఖ, 1వ పాదం)
నర్సిపూడి (విశాఖ, 2వ పాదం)
నవాబుపేట (విశాఖ, 3వ పాదం)
పినికేరు (అనురాధ, 1వ పాదం)
చింతలూరు (అనురాధ, 2వ పాదం)
తాతపూడి (ఉత్తరాషాడ, 1వ పాదం)
అంగర (పుర్వాషాడ, 1వ పాదం)
* అంగర - కె.గంగవరం - ద్రాక్షారామం (Return)
అంగర - మండపేట రోడ్డు మార్గములో వల్లూరు ఉంటుంది
వల్లూరు పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమిలో ఒకటి.
ఆర్తమూరు నుంచి తాపేశ్వరము నకు రోడ్డు మార్గము కలదు. తాపేశ్వరము పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమిలో ఒకటి.
Route No.10
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
కోటిపల్లి (దక్షిణ సోమేశ్వర) (శతభిషం, 1&2వ పాదం)
సుందరపల్లి (ఉత్తరాషాడ, 4వ పాదం)
కూళ్ళ (పుర్వాషాడ, 3వ పాదం)
వాకతిప్ప (పుర్వాషాడ, 4వ పాదం)
కోరుమిల్లి (నైఋతి సోమేశ్వర) (పుర్వాషాడ, 2వ పాదం)
మాచర (ఉత్తరాషాడ, 2వ పాదం)
టేకి (జ్యేష్ట, 4వ పాదం)
యండగండి (మూల, 1వ పాదం)
పామర్రు (మూల, 2వ పాదం)
అముజూరు (మూల, 3వ పాదం)
పాణింగపల్లి (మూల, 4వ పాదం)
సత్యవాడ (ఉత్తరాషాడ, 3వ పాదం)
* సత్యవాడ - కె.గంగవరం - ద్రాక్షారామం (Return)
Route No.11
ద్రాక్షారామం ప్రధాన కేంద్రం
మాచవరం (హస్త, 4వ పాదం)
వెంటూరు (పశ్చిమ సోమేశ్వర) (స్వాతి, 4వ పాదం)
కూర్మపురం (విశాఖ, 4వ పాదం)
చెల్లూరు (చిత్త, 3వ పాదం) పంచ అగస్త్యేశ్వర
వడ్లమూరు (జ్యేష్ట, 1వ పాదం)
కాలేరు (చిత్త, 4వ పాదం)
నల్లూరు (జ్యేష్ట, 2వ పాదం)
వెదురుముడి (జ్యేష్ట, 3వ పాదం)
పినపళ్ళ (అనురాధ, 3వ పాదం)
పెదపళ్ళ (అనురాధ, 4వ పాదం)
మారేడుబాకు (స్వాతి, 1వ పాదం)
* మారేడుబాకు - రామచంద్రపురం - ద్రాక్షారామం (Return)
గోదావరి జిల్లా ల్లో 108 నక్షత్ర పాద శివాలయాలు మరియు12 రాశి లింగాలు ఉన్నాయి. ఇవి నక్షత్రం యొక్క పాద దోష నివారణ కోసం ప్రతిష్టించబడ్డాయి. 12 రాశి లింగాలు ద్రాక్షారామం చుట్టు ప్రక్కల ఉంటాయి.
ద్వాదశ లింగములు ద్రాక్షారామం లోనే ఉంటాయి.
ద్వాదశ లింగములు బ్రహ్మసూత్రం కలిగియున్నాయి. బ్రహ్మసూత్రం అనేది లింగంపై కొన్ని రేఖల జాడ ఉంటాయి.
పంచ తీర్ధములు ద్రాక్షారామం లోనే ఉంటాయి.దక్షవాటిక నందలి తీర్ధరాజములల్లో అయిదు ప్రధానమైనవి. వీటిని పంచ తీర్ధములుగా పిలుస్తారు.
అష్ట సోమేశ్వరాలయాలు: ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. వీటి సందర్శనం వలన చంద్ర గ్రహ దోష నివృత్తి మరియు శివానుగ్రహం కలుగుతుంది. చంద్రుడిని సోముడు అని కూడ పిలుస్తారు. 'సోము ప్రతిష్ట' శివాలయాలను సోమేశ్వర ఆలయాలు అని అంటారు. కోలంక, పెనుమళ్ళ, వెల్ల, సోమేశ్వరం, వెంటూరు, కోరుమిల్లి, కోటిపల్లి & దంగేరు గ్రామాలలో సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి.
పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమి ద్రాక్షారామం చుట్టు ప్రక్కల ఉంటాయి. అగస్త్య మహర్షి వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించి, ఆ బ్రహ్మహత్య దోషంలనుండి పరిహరంచెంది, నివృత్తి వేసుకొనుటకై ఈశ్వర ప్రతిస్ట చేశాడు. తాపేశ్వరము, ఆర్తమూరు, మండపేట, వల్లూరు, చెల్లూరు గ్రామాలలోని శివాలయాలు పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమి లోనికి వస్తాయి.
పంచ రామ లింగ ప్రతిష్టలు. శ్రీరాముడు సంధించిన రామబాణం బంగారు మాయ లేడికి (మారీచుడు) తగిలి, దాని శరీర అవయవాలు అయిదు ప్రాంతాలల్లో పడ్డాయి. శ్రీ రాముడు ఆ అయిదు ప్రాంతాలల్లో అయిదు శివ లింగాలను ప్రతిష్టించి, ఆరాధించాడు. అవి తూరంగి - శ్రీ తూరంగేశ్వర స్వామి, పాత కోరంగి - శ్రీ కురంగేశ్వర సామి, కాజులూరు - శ్రీ రామలింగేశ్వర స్వామి, అయితపూడి - శ్రీ రామలింగేశ్వర స్వామి, ఐలెండు పోలవరం - శ్రీ బాణేశ్వర స్వామి (మురమళ్ళ కు సూమారు ఏడు కీలోమిటారు దూరం లో ఐలెండు పోలవరం ఉంటుంది).
మరికొంత సమాచారం కోసం:
శివశ్రీ తాళ్ల సాంబశివరావు, గురుస్వామి,
శ్రీ రాజ రాజేశ్వరి పీఠం,
Cell 83320 29544
ద్రాక్షారామ
Web site
http://www.srirajarajeswaripeetham.com
Social Media
Mana Sivayya Kadhalu (Youtube)
Yatra-Telugu (facebook)
రవాణా సౌకర్యములు
Sri A.Satesh Kumar,
Sri Saila Mallikarjuna Swamy Travels,
Ramachandrapuram, Old bus stand,
Cell: 99084 24976
వసతలు:
Draksharama
Devasthanam Cottages, Draksharama
Ph: 088572 52488.
Rooms rent: 1200/- (A/C) and 700/ (Non-A/C)
Rooms booking only Sri Bhimeswara temple's ticket counter.
Sree Bhimeswara Nivas (lodging), Draksharama, Cell: 63017 27110
Near to temple, Rooms rent: 1200/- (A/C) and
700/ (Non-A/C)
Ramachandrapuram
RR Grand, Rajagooal Centre, Ramachandrapuram
08851 - 242222 & 83338 35333
Rooms rent: 1400/- (A/C) and
900/ (Non-A/C)
Surya Inn, Old bus stand, Ramachandrapuram
96669 98488
Rooms rent: 1200/- (A/C) and
800/ (Non-A/C)
Sri Sai Datta Residence, Old bus stand, Ramachandrapuram
08857 - 246466 & 95734 16666
Rooms rent: 1200/- (A/C) and
700/ (Non-A/C)
ద్రాక్షారామం పరిసరాల్లో చూడ దగిన ఆలయాలు
1) కాకినాడ - శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరాలయం & రావణబ్రహ్మ శివాలయం (బీచ్)
2) చొలంగి - శ్రీ సంగమేశ్వరాలయం --->కాకినాడ - యానాం రోడ్డులో చొలంగి ఉంటుంది.
3) మురమళ్ళ - శ్రీ వీరేశ్వరాలయం --->యానాం - అమలాపురం రోడ్డులో మురమళ్ళ ఉంటుంది.
4) కుండలేశ్వరం - శ్రీ కుండలేశ్వరాలయం --->మురమళ్ళ - అమలాపురం రోడ్డులో ముమ్మిడివరం ఉంటుంది. ముమ్మిడివరం నుంచి కుండలేశ్వరం నకు రోడ్డు కలదు.
5) ముక్తీశ్వరం - శ్రీ క్షణ ముక్తీశ్వరాలయం --->ముమ్మిడివరం - రావులపాలెం రోడ్డులో ముక్తీశ్వరం ఉంటుంది.
6) పలివెల - శ్రీ కొపేశ్వరాలయం --->ముక్తీశ్వరం - రావులపాలెం రోడ్డులో కొత్తపేట ఉంటుంది. కొత్తపేట నుంచి పలివెల కు రోడ్డు కలదు.
7) మందపల్లి - శ్రీ మందేశ్వరాలయం --->కొత్తపేట - రావులపాలెం రోడ్డులో మందపల్లి ఉంటుంది.
8) కడలి - శ్రీ కపోతేశ్వరాలయం --->రావులపాలెం - రాజోలు రోడ్డులో జగ్గన్నపేట జంక్షన్ ఉంటుంది. జగ్గన్నపేట జంక్షన్ నుంచి కడలి కు రోడ్డు కలదు. Return to రావులపాలెం,
9) రాజమండ్రి - శ్రీ కోటిలింగేశ్వరాలయం, శ్రీ మార్కండేయ ఆలయం, శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం & etc.
10) బిక్కవోలు - శ్రీ గోలింగేశ్వరాలయం & స్వయంభూ వినాయక --->రాజమండ్రి - సామర్లకోట రోడ్డులో బిక్కవోలు ఉంటుంది.
11) 108 స్ధంబాల గుడి (శివాలయం) --->బిక్కవోలు - సామర్లకోట రోడ్డులో 108 స్ధంబాల గుడి జంక్షన్ ఉంటుంది.
12) సామర్లకోట - శ్రీ కుమార భీమేశ్వరాలయం --->బిక్కవోలు - సామర్లకోట రోడ్డులో ఉంటుంది.
13) పిఠాపురం - శ్రీ కుక్కటేశ్వరాలయం --->సామర్లకోట - పిఠాపురం రోడ్డులో ఉంటుంది.
Return పిఠాపురం - ద్రాక్షారామం (via) Kakinada
మంగళమ్