మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
ఆళ్వార్లు జన్మ స్ధలాల యాత్ర - పన్నెండు ఆళ్వార్లు (దివ్యదేశాలు)
పేయాళ్వార్
మూలాళ్వారులలో మూడవ మహానీయుడ్ని పేయాళ్వార్ గా పిలుస్తారు. పేయాళ్వార్ జన్మ స్ధలం "తిరుమైలై". దీనిని మైలాపురి గా పిలుస్తారు. ఇది మద్రాసు లో ఒక ప్రాంతము. మైలాపుర్ నందలి ఒక బావిలోని కలువ పువ్వు నుంచి ఆళ్వార్ ఉద్భవించాడు. ఇతడు మహావిష్ణువు ఖడ్గం అంశగా చెప్పుతారు.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు 8 కీ.మీ దూరంలో మైలాపుర్ కలదు. ఇచ్చట శ్రీ కపాలేశ్వర్ స్వామి దేవాలయం ఉంది. ఇది ఖ్యాతి చెందిన శివాలయం. దేవాలయం నకు పశ్చిమ భాగంలో కోనేరు కలదు. సిటి బస్ సర్వీసులు కోనేరు వద్ధ ఆగుతాయి. శివాలయం ప్రవేశం తూర్పు ద్వారం నుంచి జరుగుతుంది. శివాలయం తూర్పు ద్వారం నకు దక్షిణ దిశగా (కుడి వైపు) 500 మీటర్లు దూరంలో శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ఆలయం ఉంటుంది. ఆలయ ముఖ మండపం నందు పేయాళ్వార్ కు ప్రత్యేక సన్నిధి కలదు.
రవణా సౌకర్యం: శ్రీ కపాలేశ్వర్ స్వామి దేవాలయం (శివాలయం) యొక్క తూర్పు ప్రవేశ ద్వారం కు ఎడమ వైపుకు (ఉత్తర-తూర్పు గా) 500 మీటర్లు దూరంలో రోడ్డుకు కుడి వైపున మైలాపుర్ post office ఉంది. రోడ్డుకు ఎడమ వైపుగా అరున్దలే స్ట్రీట్ ఉంటుంది. Arundale street లో కుడివైపున పేయాళ్వార్ జన్మ స్ధలం ఉంది. ఇచ్చట ఆళ్వార్ అవతార స్ధలం (బావి) మరియు ఒక మండపం మాత్రమే దర్శనమిస్తాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మైలాపుర్ కు సిటీ బస్ నెం. 21c, 21c Extn. కలవు.
ఆళ్వార్ దర్శనం: మైలాపూర్ బస్ స్టాండ్ నుంచి పేయాళ్వార్ జన్మ స్ధలం కు ఆటో లేదా నడక ప్రయాణం. సమాచారం కోసం దివ్యదేశాలు పుస్తకం పేజీ నెం. 127, 144 to 150 చూడగలరు.
చెన్నై లో చూడదగినవి: మెరీనా బీచ్, ట్రిప్లికేన్ - శ్రీ పార్ధసారధి దేవాలయం (దివ్యదేశం), మైలాపూర్ - శ్రీ కపాలేశ్వర్ స్వామి దేవాలయం (శివాలయం), తిరువార్మయూర్ - అష్టలక్ష్మీ దేవాలయం & etc. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతములుకు బస్సులు/టాక్సీలు/ఆటోలు దొరుకుతాయి.
రవణా సౌకర్యం: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు ఎడమ వైపున గల street లో లాడ్జి లు ఉన్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో కూడ మంచి వసతులు & టూర్జిం సెంటర్స్ ఉన్నాయి.
రవణా సౌకర్యం: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు ఎదురుగా road కు మరో side చెన్నై పార్కు టౌన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రిప్లికేన్ వైపు పోవు Local trains దొరుకుతాయి.
రవణా సౌకర్యం: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు కుడి వైపున Railway Reservation office ఉంది. ఇక్కడ నుంచి ఆర్కోణం వైపు పోవు Local Trains బయులుదేరుతాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ (Railway Reservation office) బయటTaxi సర్వీసులు దొరుకుతాయి.
రవణా సౌకర్యం: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ (Railway Reservation office) నుంచి చెన్నై పార్కు రైల్వే స్టేషన్ కు మార్గం (under sub-way) ఉంది. Sub-way సహాయంతో రోడ్డు దాటిన తరువాత చెన్నై పార్కు రైల్వే స్టేషన్ కు మార్గం ఉంటుంది. చెన్నై పార్కు రైల్వే స్టేషన్ నుంచి చెన్నై ఎగ్మోర్ వైపు పోవు Local Trains దొరుకుతాయి. చెన్నై పార్కు రైల్వే స్టేషన్ పోవు మార్గం నకు సమీపంలో తమిళనాడు టూర్జిం & Private టూర్జిం సెంటర్స్ ఉన్నాయి.
రవణా సౌకర్యం: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు ఎదురుగా (Road కు మరో side లో) కోయంబేడు వైపు పోవు బస్సులు ఆగుతాయి. చెన్నై Central (RS) to కోయంబేడు (Koyembedu) బస్ స్టాండ్ కు పోవు బస్సులు (City bus No. 15B) కలవు.
రవణా సౌకర్యం: చెన్నై లోని అన్ని ప్రాంతములు నుంచి కోయంబేడు కు City services ఉంటాయి. కోయంబేడు Bus complex చాల పెద్దది. ఇక్కడ నుంచి అన్ని దూర ప్రాంతములుకు bus service బయలు దేరుతాయి.
వసతి గృహము:
నిత్యాన్నదానం:
Temple Timings:
Official Website:
Map: