RKVBP Yuva Parishad, Telangana Meeting 7Jun2025@VIHE, RK Math, Hyd.
Yuva Parishad Special Committee elected
Yuva Parishad Special Committee elected
తెలంగాణ రాష్ట్ర శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులకు నమస్కరిస్తూ వ్రాయునది _
జూన్ 7వ తేదీ శనివారం హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నిర్వహించిన యువ విభాగ్ ప్రత్యేక సమావేశం బ్రహ్మచారి మహేంద్ర చైతన్య (రూపక్ మహారాజ్ )వారి భక్తిగీతాలతో ప్రారంభమై పూజ్య స్వామి బోధమయానంద మహారాజ్ మరియు స్వామి పూజనానంద మహారాజ్ గార్ల ప్రసంగాలతో, మార్గనిర్దేశకత్వంతో సుసంపన్నమైనది.
మరియు యువ విభాగ్ చేయవలసిన కార్యక్రమాల గురించి స్వామీజీ వివరించడం జరిగింది. యువ విభాగ్ ప్రత్యేక కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
1. యువ విభాగ్ సలహాదారులుగా పూజ్య స్వామి బోధమయానందజీ మహారాజ్ వారు
2.యువ విభాగ్ అధ్యక్షులుగా స్వామి పూజనానందజీ మహారాజ్ వారు
3.యువ విభాగ్ ఉపాధ్యక్షులుగా దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ
4. యుగ విభాగ్ రాష్ట్ర కన్వీనర్ గా విజయ్ కుమార్
5.యువ విభాగ జాయింట్ కన్వీనర్ గా పవన్ సాయి దేశముఖ్ గార్లను ఎన్నుకోవటమైనది. సేవా సమితులలో ఇంకా యువ విభాగ్ కమిటీలను ఏర్పాటు చేయనివారు దయచేసి త్వరగా ఏర్పాటు చేయవలసిందిగా మనవి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి యువ విభాగ్ ఉపాధ్యక్షులు లేదా రాష్ట్ర కన్వీనర్ లేదా జాయింట్ కన్వీనర్ గార్లను సంప్రదించగలరు. యువ విభాగ్ లను ఏర్పాటు చేసిన వారు దయచేసి స్వామీజీ సూచించిన విధముగా కార్యక్రమాలను చేయుటకు ప్రయత్నం చేయగలరు.
ఇట్లు దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ కన్వీనర్
తెలంగాణ రాష్ట్ర శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులకు నమస్కరిస్తూ తెలియజేయునది
పూజ్య స్వామి బోధమయానందజీ మహారాజ్ వారి మార్గదర్శకత్వంలో తెలంగాణలోని అన్ని సేవాసమితులలో సాధనా కార్యక్రమాలు, సత్సంగాలు ఏర్పాటు చేయుటకు సంకల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమాలలలో స్వామి తత్పదానందజీ మహారాజ్ వారిచే సాధనా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
మన సేవాసమితులకు ఇది ఒక మహత్తర అవకాశం.కావున మన సేవాసమితులలో ఈ కార్యక్రమాలను నిర్వహించుటకు ఆదివారాలు తప్ప మిగిలిన వారాలలో ఈ కార్యక్రమాలను చేయుటకు తేదీలు మీరు దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మకు గాని లేదా సూర్య ప్రకాష్ రావు గారికి తెలిపినట్లైతే మన సేవాసమితులలో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సదవకాశాన్ని
అన్ని సేవాసమితులు అందిపుచ్చుకుంటాయని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ సూర్యాపేట సేవాసమిత్రులలో సత్సంగాలు నిర్వహించబడ్డాయి
ఇట్లు దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ కన్వీనర్