ప) ఇక కావలసినదేమి మనసా? సుఖమున నుండవదేమి మనసా? || ఇక అ) అఖిలాండకోటి బ్రహ్మాండనాధుడు అంతరంగమున నెలకొని యుండగ || ఇక 1) ముందటి జన్మములను జేసిన అఘ- బృంద విపినముల కా- నందకందుడైన సీతాపతి నందకాయుధుడై యుండగ || ఇక 2) కామాది లోభ మోహ- స్తోమ తమమ్ములకును సోమసూర్య నేత్రుడైన శ్రీ- రామచంద్రుడే నీయందుండగ || ఇక 3) క్షేమాది శుభములను, త్యాగరాజ కామితార్ధ ఫలములను నేమముతో నిచ్చే దయానిధి రామభద్రుడే నీయందుండగ || ఇక
p) ika kAvalasinadEmi manasA? sukhamuna nunDavadEmi manasA? ||ika a) akhilAnDakOTi brahmAmDanAdhuDu amtaramgamuna nelakoni yunDaga ||ika 1) mundaTi janmamulanu jEsina agha- bRnda vipinamula kA- nandakanduDaina seetApati nandakAyudhuDai yunDaga ||ika 2) kAmAdi lObha mOha- stOma tamammulakunu sOmasUrya nEtruDaina SrI- rAmachandruDE neeyandunDaga || ika 3) kshEmAdi Subhamulanu, tyAgarAja kAmitArdha phalamulanu nEmamutO nicchE dayAnidhi rAmabhadruDE neeyandunDaga || ika
Listen: Malladi Brothers
ప) కరుణ ఏలాగంటే ఈ విధమే - కళ్యాణ సుందర రామా! నీ ||కరుణ అ) పరమాత్ముడు, జీవాత్ముడు ఒక్కడై పరగుచుండు భక్త పరాధీనుని || కరుణ 1) అనృతంబాడడు; అల్పుల వేడడు; సునృపుల కొలువడు; సూర్యుని మరువడు; || కరుణ 2) మాంసము ముట్టడు; మధువానడు; పర- హింసల సేయడు; ఎరుకను మరువడు; ||కరుణ 3) మూడీషణముల వాడడు; జీవన్- -ముక్తుడై తిరుగు; మదమును చూపడు; ||కరుణ 4) వంచన సేయడు; పరులతో బొంకడు; అ- -చంచల చిత్తుడౌ సౌఖ్యము విడువడు; ||కరుణ 5) సాక్షియని తెలిసి యందు లక్ష్యము విడువడు - కంజాక్షుడు, త్యాగరాజ రక్షకుడు ||కరుణ వివరణ: జీవాత్మ, పరమాత్మల సంగమమై, పరమ భక్తుల అధీనంలో వెలుగొందే కళ్యాణ సుందర రామునికి తన కరుణ పరింపూర్ణంగా సిద్ధించిన వారి గుణ గణాలు ఎలా ఉంటాయో త్యాగరాజ స్వామి యిలా వివరిస్తున్నారు: 1. అనృతంబాడడు - అసత్యం పలుకడు; 2. అల్పుల వేడడు - నీచమైన వారిని ఆశ్రయించడు; 3. సునృపుల కొలువడు - మంచి హృదయం కల రాజులను కూడా ఆశ్రయించడు; 4. సూర్యుని మరువడు - అర్ఘ్య పాద్యాదులకూ, త్రికాల సంధ్యావందనానికీ, శోత్రియ కర్మలకూ ప్రతీక అయిన సూర్య నారాయణుని సేవిస్తాడు; 5. మాంసము ముట్టడు - సాత్వికాహారం మాత్రమే భుజిస్తాడు; 6. మధువానడు - నిషిద్ధమైన మద్యపానం జోలికి పోడు; 7. పర హింసల సేయడు - ఇతరులను కష్ట పెట్టడు; 8. ఎరుకను మరువడు - జ్ఞానాన్ని కాపాడుకుంటాడు; 9. మూడీషణముల వాడడు - మూడు ఈషణములు - దారేషణ, పుత్రేషణ, ధనేషణ; అంటే సంసార సాగరంలో పడి భార్యా పుత్రులను పోషించటంలొనూ, డబ్బు కూడబెట్టటంలోనూ సదా నిమగ్నుడై యుండడు; 10. జీవన్ముక్తుడై తిరుగు - భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ, ముక్తి మార్గాన్ని అనుసరిస్తాడు; 11. మదమును చూపడు - అరిషడ్వర్గాలలో ఐదవదైన గర్వము, అహంకారములను ప్రదర్శించడు; 12. వంచన సేయడు - మోసం చేయడు; 13. పరులతో బొంకడు - ఇతరులతో అబద్ధమాడడు, పరుష వాక్య ప్రయోగము చేయడు; 14. అచంచల చిత్తుడౌ సౌఖ్యము విడువడు - పరమాత్మునిపై మనసు లగ్నం చేయటంలో ఉన్న సుఖాన్ని వదులుకోడు; 15. పద్మ నేత్రుడైన రామ చంద్ర మూర్తి ఈ సత్ప్రవర్తనకంతటికీ సాక్షి అని గ్రహించి తన లక్ష్యమును వదిలి పెట్టడు; [Rev.2]
"karuNa ElAganTE ee vidhamE" - varALi rAgam, Adi tALam
p) karuNa ElAganTE ee vidhamE - kaLyANa sundara rAmA! nee ||karuNa a) paramAtmuDu, jeevAtmuDu okkaDai paraguchunDu bhakta parAdheenuni || karuNa 1) anRtambADaDu; alpula vEDaDu; sunRpula koluvaDu; sUryuni maruvaDu; || karuNa 2) mAmsamu muTTaDu; madhuvAnaDu; para- himsala sEyaDu; erukanu maruvaDu; ||karuNa 3) mUDeeshaNamula vADaDu; jeevan- -muktuDai tirugu; madamunu chUpaDu; ||karuNa 4) vanchana sEyaDu; parulatO bonkaDu; a- -chanchala chittuDou soukhyamu viDuvaDu; ||karuNa 5) sAkshiyani telisi yandu lakshyamu viDuvaDu - kanjAkshuDu, tyAgarAja rakshakuDu ||karuNa
Listen:Semmangudi
ప) తులసీ దళములచే సంతోషముగా పూజింతు ||తులసీ అ) పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను ||తులసీ చ) సరసీరుహ, పున్నాగ, చంపక, పాటల, కురువక, కరవీర, మల్లిక సుగంధ రాజ సుమములు (సుమముల్) - ధరనివి యొక పర్యాయము - ధర్మాత్ముని, సాకేత పుర వాసుని శ్రీ రాముని, వర త్యాగరాజ నుతుని ||తులసీ
"tulasee daLamulachE" - mAyAmALava gouLa rAgam, rUpaka tALam
p) tulasee daLamulachE santOshamugA pUjintu ||tulasee a) palumAru chirakAlamu paramAtmuni pAdamulanu ||tulasee c) saraseeruha, punnAga, champaka, pATala, kuruvaka, karaveera, mallika sugandha rAja sumamulu (sumamul) - dharanivi yoka paryAyamu - dharmAtmuni, sAkEta pura vAsuni SrI rAmuni, vara tyAgarAja nutuni ||tulasee
Listen:Hyderabad brothers
"తెర తీయగరాదా!" - గౌళిపంతు రాగం, ఆది తాళం
ప) తెర తీయగరాదా! లోని తెర తీయగరాదా! నాలోని తిరుపతి వేంకట రమణ - మత్సరమను ||తెర అ) పరమ పురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచున్నది - నాలోని ||తెర 1) ఇరవొందగ భుజియించు సమయమున ఈగ తగులు రీతి యున్నది హరి ధ్యానము చేయు వేళ - చిత్తము అంత్యజు వాడకు పోయినట్లున్నది ||తెర 2) మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి యున్నది అచ్చమైన దీప సన్నిధిని మరు- గడ్డి పడి చెరచిన యట్లున్నది ||తెర 3) వాగురమని తెలియక - మృగ గణములు వచ్చి తగులు రీతి యున్నది వేగమె నీ మతమును అనుసరించిన త్యాగరాజ నుత - మద మత్సరమను ||తెర
"tera teeyagarAdA!" - gouLipantu rAgam, Adi tALam
p) tera teeyagarAdA! lOni tera teeyagarAdA! nAlOni tirupati vEnkaTa ramaNa - matsaramanu ||tera a) parama purusha dharmAdi mOkshamula pAradrOluchunnadi - nAlOni ||tera 1) iravondaga bhujiyinchu samayamuna eega tagulu reeti yunnadi hari dhyAnamu chEyu vELa - chittamu antyaju vADaku pOyinaTlunnadi ||tera 2) matsyamu Akaligoni gAlamuchE magnamaina reeti yunnadi acchamaina deepa sannidhini maru- gaDDi paDi cherachina yaTlunnadi ||tera 3) vAguramani teliyaka - mRga gaNamulu vacchi tagulu reeti yunnadi vEgame nee matamunu anusarinchina tyAgarAja nuta - mada matsaramanu ||tera
Listen: BMK
"తెలియలేరు రామ భక్తి మార్గమును"- ధేనుక రాగం, దేశాది తాళం
ప) తెలియలేరు రామ భక్తి మార్గమును || తెలియలేరు అ) ఇలనంతట తిరుగుచూ మరి (తిరుగుచును) కలువరించెరే గానీ || తెలియలేరు చ) వేగ లేచి నీట మునిగి భూతి (బూది) పూసి (పూచి), వ్రేళ్ళనెంచి (వేళనెంచి) వెలికి శ్లాఘనీయులై (వేషధారులై), బాగా పైకమార్జన లోలులైరే గాని - త్యాగరాజ వినుత! || తెలియలేరు
"teliyalEru rAma bhakti mArgamunu"- dhEnuka rAgam, dESAdi tALam
p) teliyalEru rAma bhakti mArgamunu || teliyalEru a) ilanantaTa tiruguchU mari (tiruguchunu) kaluvarincherE gAnee || teliyalEru c) vEga lEchi neeTa munigi bhooti (boodi) pUsi (pUchi), vrELLanenchi (vELanenchi) veliki SlAghaneeyulai (vEshadhArulai), bAgA paikamArjana lOlulairE gAni - tyAgarAja vinuta! || teliyalEru
Listen: BMK
"దుర్మార్గ చరాధములను" - రంజని రాగం, రూపక తాళం
ప) దుర్మార్గ చరాధములను దొర నీవనజాలరా! ||దుర్మార్గ అ) ధర్మాత్మక! ధన ధాన్యము, దైవము నీవై యుండగ ||దుర్మార్గ చ) పలుకుబోటిని సభలోన పతిత మానవులకొసగే ఖలులనెచ్చట పొగడను శ్రీ- కర త్యాగరాజ వినుత ||దుర్మార్గ వివరణ: పలుకుబోటి అంటే సరస్వతి దేవి. ఆ పలుకుల తల్లి స్వరూపమైన కావ్యాలను, కృతులనూ, గీతాలనూ రాజ సభలలో ప్రదర్శించి, నీచ మానవులకు అంకితం చేసే సాంప్రదాయాన్ని తీవ్రంగా ఖండించారు త్యాగరాజ స్వామి ఈ కీర్తనలో. వారి జీవిత కాలంలో ఎందరో మహారాజులు అయ్యవారిని తమ రాజాస్థానానికి వచ్చి, సంగీతాన్ని ప్రదర్శించి, సత్కారాలు పొందమని బలవంతం చేశారు. దానికి సరి సమాధానంగా పది కాలాలపాటు నిలిచి పోయే విధంగా వారి గళం నుంచి వెలువడిన కృతి ఇది. దుర్మార్గచరులు, అధములు, పతిత మానవులు, ఖలులు వంటి తీక్షణమైన పదజాలం వాడారంటే వారి మనసు ఎంత గాయపడి ఉంటుందో కదా!
"durmArga charAdhamulanu"- ranjani rAgam, rUpaka tALam
p) durmArga charAdhamulanu dora nIvanajAlarA! ||durmArga a) dharmAtmaka! dhana dhAnyamu, daivamu neevai yunDaga ||durmArga c) palukubOTini sabhalOna patita mAnavulakosagE khalulanecchaTa pogaDanu SrI- kara tyAgarAja vinuta ||durmArga
Listen: Rajkumar Bharathi
"నగుమోము కనలేని నా జాలి తెలిసి"- అభేరి రాగం, ఆది తాళం
ప) నగుమోము కనలేని నా జాలి తెలిసి నను బ్రోవ రారాదా శ్రీ రఘువరా? నీ ||నగుమోము అ) నగరాజధరా! నీదు పరివారులెల్ల ఒగి బోధలు (బోధన) చేసే వారలు కారే! ఇటులుందురే? (అటులుందురే?) నీ ||నగుమోము చ) ఖగరాజు నీయానతి విని వేగ చనలేదో! గగనానికి, ఇలకూ బహు దూరంబనినాడో! జగమేలే పరమాత్మా! ఎవరితో మొరలిడుదు? వగ చూపకు; (చూపగ) తాళను! నన్నేలుకోరా త్యాగరాజ నుత! నీ ||నగుమోము
"nagumOmu kanalEni nA jAli telisi"- abhEri rAgam, Adi tALam
p) nagumOmu kanalEni nA jAli telisi nanu brOva rArAdA SrI raghuvarA? nee || nagumOmu a) nagarAjadharA! needu parivArulella ogi bOdhalu (bOdhana) chEsE vAralu kArE! iTulundurE? (aTulundurE?) nee ||nagumOmu c) khagarAju neeyAnati vini vEga chanalEdO! gaganAniki, ilakU bahu doorambaninADO! jagamElE paramAtmA! evaritO moraliDudu? vaga chUpaku; (chUpaga) tALanu! nannElukOrA tyAgarAja nuta! nee || || nagumOmu
Listen:BMK
"నాదలోలుడై బ్రహ్మానందమందవే"- కళ్యాణ వసంత రాగం, రూపక తాళం
ప) నాదలోలుడై బ్రహ్మానందమందవే మనసా ||నాద అ) స్వాదు ఫలప్రద సప్తస్వర రాగ నిచయ సహిత ||నాద చ) హరిహరాత్మ భూసురపతి - శరజన్మ గణేశాది వర మౌనులు ఉపాసించెరె - ధర త్యాగరాజు తెలియు ||నాద
"nAdalOluDai brahmAnandamandavE"- kaLyANa vasanta rAgam, rUpaka tALam
p) nAdalOluDai brahmAnandamandavE manasA ||nAda a) swAdu phalaprada saptaswara rAga nichaya sahita ||nAda c) hariharAtma bhUsurapati - Sarajanma gaNESAdi vara mounulu upAsinchere - dhara tyAgarAju teliyu ||nAda
Listen:Rajkumar Bharathi
"పదవి నీ సద్భక్తియు కల్గుటే!" - సాళగ భైరవి రాగం, ఆది తాళం
ప) పదవి నీ సద్భక్తియు కల్గుటే! 1) చదివి వేద శాస్త్రోపనిషత్తుల సత్త తెలియలేనిది పదవా? 2) ధన దార సుతాగార సంపదలు, ధరణీశుల చెలిమి ఒక పదవా? 3) రాగలోభయుత యజ్ఞాదులచే బోగములబ్బుట - అది పదవా? 4) జపతపాది, అణిమాది సిద్ధులచే జగములనేచుట - అది పదవా? 5) త్యాగరాజనుతుడౌ శ్రీరాముని తత్వము తెలియనిదొక పదవా?
"padavi nee sadbhaktiyu kalguTE!" - sALaga bhairavi rAgam, Adi tALam
p) padavi nee sadbhaktiyu kalguTE! 1) chadivi vEda SAstrOpanishattula satta teliyalEnidi padavA? 2) dhana dAra sutAgAra sampadalu, dharaNeeSula chelimi oka padavA? 3) rAgalObhayuta yajnAdulachE bOgamulabbuTa - adi padavA? 4) japatapAdi, aNimAdi siddhulachE jagamulanEchuTa - adi padavA? 5) tyAgarAjanutuDou SrIrAmuni tatvamu teliyanidoka padavA?
Listen: G.Ravi Kiran
"రామా నీవే గాని" - నారాయణి రాగం, ఆది తాళం
ప) రామా నీవే గాని, నన్ను రక్షించేవారెవరురా? ||రామా అ) సోమ సూర్య లోచనా - సుందర వదనా శ్రీ ||రామా 1) తాతవచన పరిపాల - పురూహుతాద్యమర పారి- జాత! సౌమిత్రితో, సీతా రమణితో వెలసిన ||రామా 2) ధారా ధరాభ శరీర - భావజసుకు- మార సాకేత పుర విహార! నన్నేలుకోర ||రామా 3) నాగ శయనా ముని యాగ పాలన! భక్త భాగధేయ పావన - త్యాగరాజ వినుత ||రామా
"rAmA neevE gAni" - nArAyaNi rAgam, Adi tALam
p) rAmA neevE gAni, nannu rakshimchEvArevarurA? ||rAmA a) sOma sUrya lOchanA - sundara vadanA SrI ||rAmA 1) tAtavachana paripAla - purUhutAdyamara pAri- jAta! soumitritO, seetA ramaNitO velasina ||rAmA 2) dhArA dharAbha Sareera - bhAvajasuku- mAra sAkEta pura vihAra! nannElukOra ||rAmA 3) nAga SayanA muni yAga pAlana! bhakta bhAgadhEya pAvana - tyAgarAja vinuta ||rAmA
Listen: Dr.Pantula Rama
"శివ శివ శివయన రాదా?" - పంతువరాళి రాగం, ఆది తాళం
ప) శివ శివ శివయన రాదా? ఓరీ భవ భయ బాధలనణచుకోరాదా? ||శివ 1) కామాదుల తెగకోసి, పర భామల పరుల ధనముల రోసి, పామరత్వము నెడబాసి, అతి నేమముతో బిల్వార్చన చేసి ||శివ 2) సజ్జన గణముల గాంచి, ఓరీ ముజ్జగదీశ్వరులని మదినెంచి, లజ్జాదుల తొలగించి, తన హృజ్జలజమునను పూజించి ||శివ 3) ఆగముల నుతియించి, బహు బాగులేని భాషల చాలించి, భాగవతులను పోషించి, వర త్యాగరాజ సన్నుతుడని యెంచి ||శివ
"Siva Siva Sivayana rAdA?" - pantuvarALi rAgam, Adi tALam
p) Siva Siva Sivayana rAdA? OrI bhava bhaya bAdhalanaNachukOrAdA? ||Siva 1) kAmAdula tegakOsi, para bhAmala parula dhanamula rOsi, pAmaratvamu neDabAsi, ati nEmamutO bilvArchana chEsi ||Siva 2) sajjana gaNamula gAnchi, OrI mujjagadeeSwarulani madinenchi, lajjAdula tolaginchi, tana hRjjalajamunanu pUjinchi ||Siva 3) Agamula nutiyinchi, bahu bAgulEni bhAshala chAlinchi, bhAgavatulanu pOshinchi, vara tyAgarAja sannutuDani yenchi ||Siva
Listen: Raghavendra Raja
"శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా!" - జగన్మోహిని రాగం, రూపక తాళం
ప) శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా! || శోభిల్లు అ) నాభి, హృత్, కంఠ, రసన, నాసాదుల యందు || శోభిల్లు చ) ధర ఋక్సామాదులలో, వర గాయత్రీ హృదయమున, సుర భూసుర మానసమున, శుభ త్యాగరాజుని ఎద || శోభిల్లు
వివరణ: జగన్మోహిని రాగం15వ మేళకర్త మాయా మాళవ గౌళ జన్యం; ఔడవ షాడవం (సగమపనిస - సనిపమగరిస). ఈ రాగంలో దైవత స్వరం లేదు. ఆరోహణలో రిషభం కూడా వర్జితమే. "సప్త స్వర సుందరుల భజింపవే మనసా!"అని ప్రబోధించటానికి త్యాగయ్య గారు సప్త స్వరాలు సంపూర్ణంగా లేని రాగాన్ని ఎందుకు ఎంచుకున్నారో అంతు పట్టదు. అనుపల్లవిలో స్వరాల జననం బొడ్డు దగ్గర ప్రారంభమై హృదయము, గొంతు, నాలుక, ముక్కుల ద్వారా వెలువడి విరాజిల్లుతుందని అందంగా వివరించారు. వేదాలు స్వర భరితాలనే విషయం ప్రస్తావిస్తూ "ఋక్సామాదులు" అని వేదాలకు పర్యాయ పదంగా వాడారు. చరణం చివరలో దాదాపుగా విద్వాంసులందరూ "త్యాగరాజుని యెడ"అని పాడుతున్నరు. కానీ హృదయము, మానసము, ఎద అనేవి పర్యాయ పదాలు కాబట్టి "త్యాగరాజుని ఎద శోభిల్లు సప్త స్వర సుందరులను" అనటమే సమంజసమని నా అభిప్రాయం. సంగీతాన్ని ఉపాసింపమని మానవాళికి మనస్పూర్తిగా విజ్ఞప్తి చేశారు ఈ కీర్తనలో త్యాగరాజ స్వామి.
"SObhillu sapta swara sundarula bhajimpavE manasA! - jaganmOhini rAgam, rUpaka tALam
p) SObhillu sapta swara sundarula bhajimpavE manasA! || SObhillu a) nAbhi, hRt, kanTha, rasana, nAsAdula yandu || SObhillu c) dhara RksAmAdulalO, vara gAyatrI hRdayamuna, sura bhUsura mAnasamuna, Subha tyAgarAjuni eda || SObhillu
Listen: Mani Krishnaswami
"శ్రీ గణపతిని సేవింప రారే" - సౌరాష్ట్ర రాగం, ఆది తాళం
ప) శ్రీ గణపతిని సేవింప రారే శ్రిత మానవులారా సేవింప రారే ||శ్రీ అ) వాగధిపతి సుపూజల చేకొని బాగ నటింపుచును వెడలిన ||శ్రీ చ) పనస నారికేళాది జంబూ ఫలముల నారగించి ఘనతరంబుగను మహిపై పదములు ఘల్లు ఘల్లన నుంచి అనయము హరి చరణ యుగళము హృదయాంబుజమున నుంచి వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధీత్తళాంగుమని వెడలిన ||శ్రీ
"SrI gaNapatini sEvimpa rArE" - sourAshTra rAgam, Adi tALam
p) SrI gaNapatini sEvimpa rArE Srita mAnavulArA sEvimpa rArE ||SrI a) vAgadhipati supUjala chEkoni bAga naTimpuchunu veDalina ||SrI c) panasa nArikELAdi jambU phalamula nAraginchi ghanatarambuganu mahipai padamulu ghallu ghallana nunchi anayamu hari charaNa yugaLamu hRdayAmbujamuna nunchi vinayamunanu tyAgarAja vinutuDu vividha gatula dheettaLAngumani veDalina ||SrI
Listen: Jayasree
ప) జ్ఞానమొసగరాదా? గరుడ గమన [నాతో] వాదా? సుజ్ఞానమొసగరాదా? అ) నీ నామముచే నా మది నిర్మలమైనది (నిర్మలమై యున్నది) - సుజ్ఞానమొసగరాదా? || చ) పరమాత్ముడు, జీవాత్ముడు, పదునాలుగు లోకములు, నర, కిన్నర, కింపురుష, నారదాది మునులు - పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖ దాయకా! వర త్యాగరాజార్చిత! వారలు తాననే సుజ్ఞానమొసగరాదా? ||
p) jnAnamosagarAdA? garuDa gamana [nAtO] vAdA? sujnAnamosagarAdA? a) nI nAmamuchE nA madi nirmalamainadi (nirmalamai yunnadi) - sujnAnamosagarAdA? || c) paramAtmuDu, jeevAtmuDu, padunAlugu lOkamulu, nara, kinnara, kimpurusha, nAradAdi munulu - paripUrNa nishkaLanka niravadhi sukha dAyakA! vara tyAgarAjArchita! vAralu tAnanE sujnAnamosagarAdA? ||
Listen:Modumidi Sudhakar
This site is maintained by Kishore Meduri.