The Musical genius of Dr.Mangalampalli Balamurali Krishna has composed over 200 compositions in many rare ragas as well as on many obscure themes.
This page lists many of the compositions except Raganga Ravali and Tillanas.
అయ్యా గురువర్యా - అయ్యా గురువర్యా ||అయ్యా నీయానతితో పాడుచుంటిమయ్యా ||అయ్యా నీ మృదుపల్లవ వచోవికాసమే పల్లవిగా నీ అనుబంధమే అనుపల్లవిగా నీ చరణములే చరణముగా నీయాకృతియే మా కృతిగా నీయానతితో పాడుచుంటిమయ్యా ||అయ్యా
ayyA guruvaryA - ayyA guruvaryA ||ayyA nIyAnatitO pADuchuMTimayyA ||ayyA nI mRdupallava vachOvilAsamE pallavigA nI anubaMdhamE anupallavigA nI charaNamulE charaNamugA nI yAkRtiyE mA kRtigA nIyAnatitO pADuchuMTimayyA ||ayyA
Listen: Rama Varma
కమలదళాయత లోచనములవే కర్మలనెల్లా కనిపెట్టునవే ||కమల సమరస భావన – సమతా జీవన సాధు సుజన సంరక్షణ ||కమల సమ్మతముల స్వచ్ఛ రూపమై అ- సమ్మతముల అరుణ రూపమై ఇమ్మహి దినకర ఇందు రూపమై సమ్మోహన మురళీ గాన వశమౌ ||కమల
kamaladaLAyata lOchanamulavE karmalanellA kanipeTTunavE ||kamala samarasa bhAvana – samatA jIvana sAdhu sujana saMrakshaNa ||kamala sammatamula swachCha rUpamai a- sammatamula aruNa rUpamai immahi dinakara indu rUpamai sammOhana muraLI gAna vaSamou ||kamala
Listen: BMK | Pingali Prabhakara Rao
గమనశ్రమ: గానలోల నీ లీలలెన్నజాలరా – మురళీ ||గానలోల అహీర్ భైరవి: వంకలెన్నమాని నా వంక కానరా అకళంక విజిత రాకాశశాంక మోహనా – మురళీ ||గానలోల మాయామాళవ గౌళ: సప్తగిరులమీద నీవు గుప్తముగా దాగినావు తృప్తితో నిన్ను స్మరించి ఆప్తుడైతిరా – మురళీ ||గానలోల అభోగి: కేశములర్పించు భక్త క్లేశముల నశింపచేసి ఆశించిన ఫలములన్నీ కైసేయుమురా – మురళీ ||గానలోల ధన్యాసి: స్థాన బలిమి నీకు - నీయాస్థాన బలిమి నాకు - దేవ స్థానమాయె పృధివీ – అభయ దానమొసగితివి దేవ దేవా – దేవ దేవా – దేవ దేవా - మురళీ ||గానలోల
గానసుధారస పాన నిరతం గానం కరోమి సంతతం – సామ ||గాన శ్రీ నారదాంశజం - భారతీయ గాన లక్ష్య లక్షణ సంప్రదాయ సంస్కర్తారం - కృతికర్తారం ||గాన గాయకజన భుక్తిముక్తిప్రదం ధ్యాయామి దీనబాంధవం సరిగమపదనీ సప్తస్వర స్వరూపం - త్యాగబ్రహ్మం – మురళీ ||గాన
gamanaSrama: gAnalOla nee leelalennajAlarA – muraLI ||gAnalOla ahIr bhairavi: vankalennamAni nA vaMka kAnarA akaLamka vijita rAkASaSAMka mOhanA – muraLI ||gAnalOla mAyAmALava gouLa: saptagirulamIda nIvu guptamugA dAginAvu tRptitO ninnu smarinchi AptuDaitirA – muraLI ||gAnalOla abhOgi: kESamularpinchu bhakta klESamula naSimpachEsi ASinchina phalamulannI kaisEyumurA – muraLI ||gAnalOla dhanyAsi: sthAna balimi nIku - nIyAsthAna balimi nAku - dEva sthAnamAye pRdhivI – abhaya dAnamosagitivi dEva dEvA – dEva dEvA – dEva dEvA - muraLI ||gAnalOla
gAnasudhArasa pAna niratam gAnam karOmi santatam – sAma ||gAna SrI nAradAmSajam - bhAratIya gAna lakshya lakshaNa sampradAya samskartAram - kRtikartAram ||gAna gAyakajana bhuktimuktipradam dhyAyAmi dInabAndhavam sarigamapadanI saptaswara swarUpam - tyAgabrahmam – muraLI ||gAna
Listen: Abhishek Raghuram | Akshay Padmanabhan
గురుని స్మరింపుము మనసా సత్- ద్గురుని స్మరింపుము ||గురుని గురుతర భక్తితో జ్ఞానార్థివగుచు పరమ సుశీలుడౌ కరుణాకరుడౌ - సత్ ||గురుని సకలాగమ నిగమ సార సంయుత సంగీత సాధనతో సద్గతుడై సదమల ధర్మ నియమ సంయుతుడౌ సదా మురళీగాన విలోలుడౌ - సత్ ||గురుని
నవ మోహన మురారీ - వనమాల ధారీ నవ యవ్వనాంగ శౌరీ - సుమనోహరా - హే ||నవ రమణీయ స్మిత వదనా - కమనీయ జిత మదనా హరే - యమునా విహారీ - సుమనోహరా - హే ||నవ మురళీ ధర గాన లోలా - సురుచిర గోపీ లోలా తరుణారుణ పద యుగళా - కరుణామయ కంబు గళా హరే - ఘన నీలా - సుమనోహరా ||నవ
పాహి సమీర కుమార మాం పాహి రుద్రావతారా - మాం ||పాహి మోహన మురళీ గానవిలాసా పావన రామ నగర నివాసా ||పాహి పంచాననాంజనేయ సదయా - ఫాల విలసిత సిందూర తిలకా ప్రాగ్దిశే కపిముఖా సుముఖా - ప్రార్ధిత భక్త సుజన మందార దక్షిణ దిశే నారసింహా నత - రక్షణ నిరతావన సుఖదా ప్రతీచ్యే గరుడ రూప విషహర ఉత్తరే వరాహ వదనా - సర్వాధి వ్యాధి బాధా నివారణా ఊర్ధ్వే అశ్వానన పరిభ్రమరా - ఉన్నత పాండిత్య ప్రదాయకా ద్వాదశ భాను ప్రభాసమాన - ద్వాదశ మంత్ర మూర్తి పాపహారి త్రయోదశాక్షర మంత్రరూప విశ్వరుపా - సాంసార బంధ విదూర మకరీ మోక్షప్రదమాన మంత్ర మూర్తి - మహోన్నత మహిమాన్విత ఓం - ఆం - ఊం - ఐం - క్లీం ||పాహి
guruni smarimpumu manasA sat- dguruni smarimpumu ||guruni gurutara bhaktitO jnAnArthivaguchu parama suSIluDou karuNAkaruDou - sat ||guruni sakalAgama nigama sAra saMyuta sangIta sAdhanatO sadgatuDai sadamala dharma niyama saMyutuDou sadA muraLIgAna vilOluDou - sat ||guruni
nava mOhana murArI - vanamAla dhArI nava yavvanAnga SourI - sumanOharA - hE ||nava ramaNIya smita vadanA - kamanIya jita madanA harE - yamunA vihArI - sumanOharA - hE ||nava muraLI dhara gAna lOlA - suruchira gOpI lOlA taruNAruNa pada yugaLA - karuNAmaya kambu gaLA harE - ghana neelA - sumanOharA ||nava
pAhi samIra kumAra mAm pAhi rudrAvatArA - mAm ||pAhi mOhana muraLI gAnavilAsA pAvana rAma nagara nivAsA ||pAhi panchAnanAMjanEya sadayA - phAla vilasita sindUra tilakA prAgdiSE kapimukhA sumukhA - prArdhita bhakta sujana mandAra dakshiNa diSE nArasiMhA nata - rakshaNa niratAvana sukhadA pratIchyE garuDa rUpa vishahara uttarE varAha vadanA - sarvAdhi vyAdhi bAdhA nivAraNA UrdhvE aSwAnana paribhramarA - unnata pAMDitya pradAyakA dwAdaSa bhAnu prabhAsamAna - dwAdaSa mantra mUrti pApahAri trayOdaSAkshara mantrarUpa viSwarupA - sAMsAra bandha vidUra makarI mOkshapradamAna mantra mUrti - mahOnnata mahimAnvita Om - Am - Um - aim – kleem ||pAhi
Listen: Rama Varma
బంగారు మురళి - శృంగార రవళి డెందములు మరచి - కను విందారగించేము వచ్చేరా - మురిపెమిచ్చేరా ||బంగారు అంగనలు పొంగారు జవ్వనము తెచ్చేరు ముంగురులు నిమిరిరి - అనంగ మోహము తీరా వచ్చేరా - మురిపెమిచ్చేరా ||బంగారు నింగి రంగుల రేడు - ఖంగు మువ్వల జోడు చెంగు నడకల నాడు - మంగళాంగుల వాడు వచ్చేరా - మురిపెమిచ్చేరా ||బంగారు
భావమే మహాభాగ్యమురా అహం- భావరహిత నిర్మలమైన మనో ||భావమే భావ రాగ తాళ శృతీ స్వర స్వ- భావము తెలిపిన గురునిపై భక్తి ||భావమే గురువుల గురువుల గురువుల గురువే వరమైన త్యాగరాజు మాకు గురువుల గురువుల గురువే వేంకట వర సుబ్బయ్య మాకు పరమ గురువు దక్షిణామూర్తి మా గురువే రామకృష్ణ – మురళీ రవళీ రూపమనే సత్ ||భావమే
బృహదీశ్వర మహాదేవ! బ్రోవుము మహా ప్రభావా ||బృహదీశ్వర సహజ కారుణ్య వీక్షణ - సాధు సుజన సంరక్షణ ||బృహదీశ్వర మమత పాశముల తాళను - శమన వైరి! దయ లేకను కమనీయ మురళీ గాన సమ సంగీతము లేదను ||బృహదీశ్వర
bangAru muraLi - SRngAra ravaLi Dendamulu marachi - kanu vindAragincEmu vacchErA - muripemicchErA ||bangAru anganalu pongAru javvanamu teccEru mungurulu nimiriri - ananga mOhamu tIrA vacchErA - muripemicchErA ||bangAru ningi rangula rEDu - khangu muvvala jODu chengu naDakala nADu - mangaLAngula vADu vaccErA - muripemiccErA ||bangAru
bhAvamE mahAbhAgyamurA aham- bhAvarahita nirmalamaina manO ||bhAvamE bhAva rAga tALa SRtI swara swa- bhAvamu telipina gurunipai bhakti ||bhAvamE guruvula guruvula guruvula guruvE varamaina tyAgarAju mAku guruvula guruvula guruvE vEnkaTa vara subbayya mAku parama guruvu dakshiNAmUrti mA guruvE rAmakRshNa – muraLI ravaLI rUpamanE sat || bhAvamE
bRhadeeSwara mahAdEva! brOvumu mahA prabhAvA ||bRhadISwara sahaja kAruNya vIkshaNa - sAdhu sujana saMrakshaNa ||bRhadISwara mamata pASamula tALanu - Samana vairi! daya lEkanu kamaneeya muraLI gAna sama sangItamu lEdanu ||bRhadISwara
వేగమె కావ రావయ్యా భోగి శయన వైభోగ రంగయ్యా ||వేగమె జాగు సేయుట బాగుగ తోచెనా? ఏ గతి కానని నా గతి నీవే ||వేగమె చరణాశ్రిత జన పరిపక్వ భక్తిని పరీక్ష చేసే సరళి మానుమా మురళీ రవ సుధా పానము చేసెడి పావన మూర్తివి పండరినాధా ||వేగమె
శ్రీ సకల గణాధిప పాలయ మామనిశం వర సిద్ధి వినాయక - భక్త జనాళి పోష - వర చంద్రమౌళి సుత ||శ్రీ దాసార్చిత పాదా భాసురాంగ కరుణా సముద్ర - వర వాయుపుత్ర హనుమంత వరప్రద శ్రీ సకల శివంకర మారుతి మామవతు వర రామ సునామ సుధారస పాన ధీర - నిజ భక్త భయాపహ ||శ్రీ నంద నందన వందనమస్తుతే - కుందరదన ముకుంద మురహర మందరోద్ధర వందిత బుధజన - బృందహృదయ నివాస సుందర మంద హసిత వదనారవింద - మకరంద పాన - సంగీత సుధాకర శ్రీ సకల కళా పరిపూర్ణ దయాజలధే వరదాభయదాయక మామవ - మంగళాంగ మురళీరవ మోహన ||శ్రీ శ్రీ సకల కళా పరిపూర్ణ దయాశరథే శ్రీ సకల శివంకర మారుతి మామవతు శ్రీ సకల గణాధిప పాలయ మామనిశం
vEgame kAva rAvayyA bhOgi Sayana vaibhOga rangayyA ||vEgame jAgu sEyuTa bAguga tOcenA? E gati kAnani nA gati nIvE ||vEgame caraNASrita jana paripakva bhaktini parIksha cEsE saraLi mAnumA muraLI rava sudhA pAnamu cEseDi pAvana mUrtivi paMDarinAdhA ||vEgame
Sree sakala gaNAdhipa pAlaya mAmaniSam vara siddhi vinAyaka - bhakta janALi pOsha - vara chandramouLi suta ||Sree dAsArchita pAdA bhAsurAmga karuNA samudra - vara vAyuputra hanumanta varaprada Sree sakala Sivankara mAruti mAmavatu vara rAma sunAma sudhArasa pAna dhIra - nija bhakta bhayApaha ||Sree nanda nandana vandanamastutE - kundaradana mukunda murahara mandarOddhara vandita budhajana - bRndahRdaya nivAsa sundara manda hasita vadanAravinda - makaranda pAna - sangIta sudhAkara Sree sakala kaLA paripUrNa dayAjaladhE varadAbhayadAyaka mAmava - mamgaLAnga muraLIrava mOhana ||Sree Sree sakala kaLA paripUrNa dayASarathE Sree sakala Sivankara mAruti mAmavatu Sree sakala gaNAdhipa pAlaya mAmaniSam
Listen: BMK
సంగీతమే వర సుఖదాయీ స రి గ మ ప ద నీ - సుస్వర ||సంగీతమే మంగళదాయీ - మనసుకు హాయీ మంజుళ నవ మోహన మురళీ ||సంగీతమే రాగములో అనురాగము తానములో వర దానము త్యాగరాజాది గాన భారతులు వాగధిపతి సన్నిధి పొందిన ||సంగీతమే
sangeetamE vara sukhadAyee sa ri ga ma pa da nI - suswara ||sangeetamE mangaLadAyI - manasuku hAyee manjuLa nava mOhana muraLI ||sangeetamE rAgamulO anurAgamu tAnamulO vara dAnamu tyAgarAjAdi gAna bhAratulu vAgadhipati sannidhi pondina ||sangeetamE