VAIKUNTHA EKADASHI ( వైకుంఠ ఏకాదశి 2023 )
VAIKUNTHA EKADASHI ( వైకుంఠ ఏకాదశి 2023 )
వైకుంఠ ఏకాదశి
వైకుంఠ ఏకాదశి శుభసందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం ఉత్తనూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి వేడుకలు
• అర్జునుడి మునిమనవడు జనమే జయమహారాజు గారిచే ప్రతిష్టింపబడిన శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వరుడిని ఉత్తరద్వారం గుండ దర్శించెందుకు పోటెత్తిన భకజనులు
• అంగరంగ వైభవంగా... కమనీయంగా జరిగిన శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ వైభోగం
• కల్యాణం అనంతరం ఘనంగా సాగిన స్వామి వారి రథోత్సవం
• దర్శించుకున్న 25వేల పైచీలుకు భక్తాదులు
• దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, పులకుర్తి తిరుమల్ రెడ్డి గారి అభిమానులు
• భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్న దేవస్థాన కమిటీ
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.
అందరు ఆహ్వానితులే....
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం... ( జనవరి, 02 -- ఉదయం 4.30 గంటలకు )
శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం... ( గోగుల ప్రకాష్ రెడ్డి, శిరీష దంపతులు ) - మధ్యాహ్నం 12.00 గంటలకు
వైకుంఠ ద్వార బంధనం ( రాత్రి 10.00 గంటలకు )
Note :
1. దయచేసి మాస్క్‌లను సరిగ్గా ధరించండి
2. దయచేసి కరోనా జాగ్రత్తలు పాటించండి
3. దయచేసి సామాజిక దూరం పాటించండి
4. శానిటైజర్ ఉపయోగించండి
5. క్యూ లైన్ లో జాగ్రతలు పటించండి
అర్జునుడి మునిమనువడైనా జనమేజయ మహారాజు గారిచే ప్రతిష్టింపబడి, పేరు ప్రఖ్యాతలను పొందిన పుణ్యక్షేత్రం... గోపాల దాసరు వారి గోపాల విఠల సంకీర్తనముతో ధన్వంతరి వేంకటేశ్వరుడు నాట్యమాడి, పరవశించిన పుణ్యస్థలం... ధన్వంతరి అంటే వైద్యం, ఆరోగ్యం... ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు ప్రసాదించే గొప్ప మహిమలు కలిగున్న కలియుగ వైకుంఠవాసి, అడుగడుగుదండాలవాడు, ఆపదమొక్కులవాడు, ఈ అనంతరక్షకుడు ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారు.....
భారతదేశంలో ఉన్న ఏకైక ధన్వంతరి వెంకటేశ్వర స్వామి దేవాలయం
Location: Uttanuru Village, Ieeja Mandal, Jogulamba Gadwal District, Telangana state - 509127
ఆహ్వానం ...
దయచేసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తనూరు ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించండి. ఉత్తరద్వార దర్శన భాగ్యం పొందండి.... ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని స్వీకరించండి... శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వరుడి చెంత చేరి అంగరంగ వైభవంగా జరగబోయె కమనీయమైన కళ్యాణాన్ని కనులారా వీక్షించండి....
• తెల్లవారుజామున 4.30 గంటలకు తెరుచుకోనున్న ఉత్తర ద్వారం... కొలువుదీరానున్న 33 కోట్ల దేవతలు
• మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం
• రాత్రి 10.00 గంటలకు ఉత్తర ద్వార బంధనం
ఓం నమో వేంకటేశాయ.... ఓం నమో నారాయణః