శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి దేవస్థానం, ఉత్తనూరు
శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి దేవస్థానం, ఉత్తనూరు
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి మూల విరాట్
శ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు - 2024
జనమే జయ మహారాజు ( అర్జునుని మనవడు ) చే ప్రతిష్టమైన గణపతి అంశ సంభూతులైన గోపాలదాసుల వారిచే స్థుతించి, సేవించబడిన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఉత్తనూరు క్షేత్రం భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రంలోని, జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ మండలంలోని ఉత్తనూరు గ్రామంలో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా మాఘశుద్ధ తదియ నుంచి మాఘ శుద్ధ సప్తమి వరకు దేవస్థాన కమిటీ కనుల పండువగా నిర్వహిస్తోంది.
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాశస్త్యం..
ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని 5000 ఏళ్ల కిందట అర్జునుడి ముని మనవడు జనమేజయ మహారాజు నిర్మించినట్లు పురావస్తు శాఖ ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని మూల విరాట్‌కు ధన్వంతరి వేంకటేశ్వర స్వామి అనగా వైద్యులు అని అర్ధం. చరిత్ర ఆధారాలను బట్టి జనమేజయ మహారాజు తండ్రి పరిక్షిత్ మహారాజు శాప విమోచన కోసం ఈ ఆలయం నిర్మించారనే ఆధారాలు ఉన్నాయి. పరిక్షిత్ మహారాజు ఒక రోజు వేటకు వెళ్లిన సమయంలో దాహం తీర్చుకొనుటకు శమేక రుషి తపస్సు చేస్తున్న ప్రదేశానికి చేరుకుని దాహం తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడ మహారుషి ద్యానంలో ఉండగా పరిక్షిత్ మహారాజు రాకను గమనించలేదు. దీంతో కోపోద్రిక్తులైన మహారాజు ఆ ప్రాంతంలో సచ్చిపడి ఉన్న పామును తపస్సు చేస్తున్న రుషి మెడలో వేశాడట. అది తెలుసుకున్న చుట్టు ప్రక్కల వారు రుషి కుమారుడైన శృంగినికి తెలిపారట. దీంతో ఆ ప్రదేశానికి చేరుకున్న శృంగి తండ్రికి చేసిన అవమానికి పరిక్షిత్ మహారాజును శపిస్తాడట.
తపస్సు నుండి మేలుకున్న రుషి జరిగిన విషయాన్ని తెలుసుకుని పరిక్షితుడికి క్షమాపణ చెప్పాడట. పరిక్షిత్ మహారాజు రాకను గమనించకపోవడం మంచిది కాదని ఇంత మాత్రానికి శపించడం సబబుకాదని కుమారుడితో రుషి అన్నాడట. శాప విమోచనం కోసం రుషి భగవతాశ్రవణం చేస్తాడట. ఆయన ఏడు రోజులలో సర్పకాటుకు గురై మరణిస్తాడు. తండ్రికి జరిగిన కీడుకు జనమే జయుడు సృష్టిలో ఉన్న సర్పాలన్నీ అంతరించిపోవడానికి సర్పయాగం చేస్తాడట. దీంతో సృష్టిలో ఉన్న సర్పాలన్నీ యాగంలో వచ్చిపడి చనిపోతుండగా విషయం గమనించిన దేవతలు, రుషులు, సృష్టి వ్యతిరేక చర్యలు ఆపాలని జనమే జయుడును కోరతారట. దీంతో జ్ఞానోదయం కలిగిన తానింత వరకు చేసిన సర్పయాగ దోష నివారణకు రుషుల ఆదేశానుసారం అక్కడక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించి, విగ్రహాలను ప్రతిష్టించాలని కోరడంతో జనమే జయుడు వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించాడట. అందులో భాగంగానే ఉత్తనూరులో శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి పూజలు చేశాడనే చరిత్ర ఆధారాలు ఉన్నాయి..
మరో చరిత్ర ఏమంటే గణపతి అంశ సంభూతులైన శ్రీ గోపాలదాసులు ఈ ఆలయంలో భజన చేస్తుండగా సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి నాట్యం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయం నేడు దినదినాభివృద్ధి చెందుతూ జిల్లాలో ఒక పుణ్య క్షేత్రంగా వెలుగొందుతోంది..
Om Namo Venkatesaya.. ( ఓం నమో వేంకటేశాయ )
.
.
నారాయణతే నమో నమో ..
భవ నారద సన్నిధి నమో నమో ..
శ్రీ గోపాల దాసులవారు 1721వ సంవత్సరంలో రాయచూరు జిల్లాకు చెందిన 'మెసరకలు' అనే గ్రామంలో జన్మించారు. వీరికి 'భాగణ్ణ' అని నామకరణం అయినది. వీరి తండ్రి మురహరి రాయలు, తల్లిపేరు వెంకమ్మ, భగన్న దాసారు వారికి ముగ్గురు సహోదరులు ఉన్నారు. ఆరు దాసప్ప దాసరు, శ్రీనప్పు దాసరు, రంగప్ప దాసరు.. భాగన్నా దాసులవారి 8వ యేట వారి తండ్రి మురహరి రాయలు మరణించినారు. అప్పుడు తల్లి వెంకమ్మ నలుగురు కుమారులతో సంకాపురం గ్రామమునకు చేరుకొని అక్కడే ఊరిబైట ఆంజనేయుని దేవస్థానములో నివాసముండెడివారు. అయిజలో కూలి చేసి పిల్లలను తల్లి వెంకమ్మ పోషించినది. అక్కడే భాగం దాసుల వారికి ఉపనయనము జరిగినది. భాగణ్ణ దాసుల వారికి సంకాపురములోనే గాయత్రీ మంత్రం సిద్ధించినది. దాసుల వారికి వారి గురువయిన విజయదాసుల వారితో గోపాల వరల' అని ఆడవాని గ్రామంలో అంకిత ప్రధానమయినది. అప్పటినుండి వీరిపేరు "గోపాల దాసుల వారు" (అస్త్రోకర్ణాని) అని ప్రసిద్ధి అయినది.
ఆ తరువాత ఉత్తనూరు గ్రామానికి చేరుకొని అక్కడే నివాసమున్నారు. ఇక్కడ ధన్వంతరి వేంకటేశ్వరుని ఆలయంలో చేసుకుంటూ, 'గోపాల విరల' అనే అంకితములో అనేక కీర్తనలు రచించినారు. వారి గానంతో వేంకటేశ్వరున్ని మెప్పించేవారు. గోపాల దాసుల వారి శిష్యులయిన జగన్నాథ దాసులవారు కడుపు నొప్పితో వీరి దగ్గరికి రాగా వీరికి ఉన్న అపమృత్యువును తొలగించడానికి వీరికి వున్న 80 సంవత్సరముల ఆయుష్సులో 40 సంవత్సరాలు జగన్నాథ దాసుల వారికి ఆయుష్యు దానం చేసి అపమృత్యువును పారించినారు. గోపాల దాసుల వారికి మరియు వారి సహోదరులైన ముగ్గురు తమ్ముళ్ళలో ఇద్దరు వివాహం చేసుకోలేదు. చివరి తమ్ముడు దాసుల వారికి మాత్రం వివాహం జరిగినది శ్రీ దాసుల వారికి 40వ యేట ఆయుష్కు తీరటం వల్ల 1765వ సంవత్సరంలో చిత్రభాను నామ సంవత్సరం, పుష్యమాసం, కృష్ణాష్టమి, ఆదివారమునాడు వైకుంఠవాసులైనారు. శ్రీ దాసులవారు మళ్ళీ 200 సంవత్సరం తరువాత రంగప్ప దాసుల వంశంలో జన్మిస్తానని చెప్పారు. వారు జన్మించిన తరువాత 12 సంవత్సరాలకు ఉత్తనూరులో ఊరిబయట ఉన్న పేర్లబావిలోంచి వారి ఆస్థికలను వారే తీసుకుని కాశీలో కలిపి వస్తానని చెప్పారు. అంతే కాకుండా వారి వంశస్థులలో నిరుపేదరికం అనుభవించేటప్పుడు జన్మిస్తానని, తరువాత వారి ఇంట్లో భగతమై వున్న సాహిత్యం (బియ్యం) తీసి అన్న సంతర్పణ చేస్తానని చెప్పారు.
నాలుగు వందల సంవత్సరాల క్రితం శ్రీ గోపాల దాసుల వారు స్వహస్తాలతో లిఖించిన చిత్రపటములు (విశ్వ రూపములు) నాలుగు (ప్రపంచ సృష్టి గురించి) వున్నది. అప్రోక్ష జ్ఞానులలో భవిష్యత్ గురించి చెప్పిన మహా జ్ఞాని గోపాల దాసుల వారు పూజించిన విగ్రహములు ప్రతి సంవత్సరం మూడు రోజులు మాత్రమే భక్తుల దర్శనార్ధం బయటికి తీయడం ఉత్తమారు గ్రామ ఆచారంగా జరుగుతున్నది.