మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
ఆలయం: విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి పట్టణం నకు వాయువ్యం దిశగా, 18 కీ.మీ. దూరంలో చోడవరం అను చిరు పట్టణం ఉంది. ఇచ్చట RTC బస్ స్టాండ్ కు దగ్గరలో శ్రీ విఘ్నేశ్వరాలయం కలదు. స్వామి స్వయంభూమూర్తి. గణపతి నడుం పై భాగం మత్రమే దర్శనమవుతుంది . స్వామి కార్య సిద్ధి గణపతి గా ఘనత కెక్కినాడు. ఆలయం నందు విఘ్నేశ్వర మూర్తికి నిత్యం సేవలు, అభిషేకాలు నిర్వహించుతారు. వినాయక చవితి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి. ఆలయ ప్రాంగణము నందు కళ్యాణ వేదిక, దేవతా వృక్షం మొదలగునవి కలవు.
రవణా సౌకర్యం: చెన్నై - హౌరా రైలు మార్గంలో అనకాపల్లి ఉంది. అన్ని ముఖ్య రైలు ఆగుతాయి. అనకాపల్లి నుంచి రూట్ బస్సులు, సిటీ సర్వీసులు, షేరింగ్ ఆటోలు చోడవరం కు ఉంటాయి. జిల్లా కేంద్రమైన విశాఖపట్నం నుంచి మాడుగుల, పాడేరు మొదలగు బస్సలు చోడవరం మీదగా ఉన్నాయి. వీటితో పాటు చోడవరం కు సిటీ బస్సులు (నెం. 300, 300 C) మొదలగునవి హెచ్చుగా కలవు.
వసతి గృహము:
నిత్యాన్నదానం:
Temple Timings:
Official Website:
Map: