మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న"
ద్రాక్షరామ క్షేత్రం: కోనసీమ జిల్లా, జిల్లా కేంద్రమైన రాజమండ్రి పట్టణం నకు ఆగ్నేయం దిశగా, సుమారు 50 కీ.మీ దూరంలో ద్రాక్షారామం అను చిరుపట్టణం కలదు. ద్రాక్షరామ క్షేత్రం అనాదిగా గొప్ప శైవ క్షేత్రం. దక్ష యాగం సమయంలో సతీదేవి యోగాగ్నిలోకి దూకిన ప్రదేశం ఇది. హిమవంతుడు శివ దీక్షను స్వీకరించి, తపస్సు ఆచారించిన స్ధలం. ఇచ్చట విష్ణువు సుదర్శన చక్రం కోసం శివార్చన చేసాడు. విష్ణువు తెచ్చిన వెయ్యి కమలముల నుండి ఒక దానిని శివుడు అదృశ్యము చేస్తాడు. మహా విష్ణువు కమలము వంటి తన నేత్రమును తీసి భగవంతుడికి సమర్పించుకుంటాడు. శివానుగ్రహంతో కమలాక్షుడు అయ్యాడు. అగస్యుడు దక్షిణ కాశీ క్షేత్రంగా కీర్తించాడు. క్షేత్రం నందలి సప్త గోదావరులు (కొలను) ఒడ్డున స్వయంభూవుగా వెలసిన శ్రీ భీమేశ్వర స్వామి మరియు అష్టాదశ శక్తి పీఠాలల్లో ఒకటి అయిన శ్రీ మాణిక్యాంబ అమ్మవారి దర్శనం లభ్యమవుతుంది. క్షేత్ర పాలకడు శ్రీ లక్ష్మీ నారాయణడు. పూర్వం తెలుగు ప్రాంతమును త్రిలింగ దేశంగా పిలిచేవారు. త్రిలింగలల్లో శ్రీ భీమేశ్వర లింగము ఒకటిగా వర్ధిల్లుతుంది. శ్రీ భీమేశ్వర క్షేత్రం పంచారామాలలో ఒకటిగా ప్రతీతి.
ఒక సందర్భములో కాశీ అన్నపూర్ణా దేవి వ్యాసునికి కాశీ బహిష్కరణ విధించుతుంది. శాపగ్రస్తుడైన వ్యాసుడు మిక్కిలి దుఖించుతాడు. కాశీ విశ్వేశ్వరుడు ఆదేశముతో వ్యాసుడు దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచిన దాక్షారామ క్షేత్రానికి పది వేల శిష్యలతో బయలు దేరుతాడు. ద్రాక్షారామ క్షేత్రం లోని శ్రీ భీమేశ్వర స్వామిని సేవించాడు. అగస్త్యుడు (మహర్షి), భీమమండలము లోని ద్రాక్షారామ పరిసర ప్రాంతాలను వ్యాసుడుకి పరిచయం చేస్తాడు. వ్యాసుడు ఆకాశ మార్గము నుంచి సమస్త భీమ మండలమును సందర్శించినాడు. కవి శ్రీనాథుడు భీమేశ్వరపురాణం నందు వ్యాసుని భీమమండల యాత్ర వర్ణించాడు.
శ్రీనాథ మహాకవి రచించిన "భీమఖండం" అను కావ్యం ద్రాక్షారామానికి సంబంధించినది. ఈ కావ్యాం నందు భీమమండలం ప్రాశస్త్యం, ఫలశృతి మొదలగునవి ఉంటాయి. భీమమండలములో గల 108 పాద శివ క్షేత్రాలు అంతరిక్షము నుంచి చూసిన ఒక పద్మాకారములో ఇమిడిపోయి దర్శనమిస్తాయి.
ద్రాక్షారామ క్షేత్రం అనాదిగా గొప్ప శైవులుకు నిలయంగా ఖ్యాతి పొందింది. 12వ శతాబ్ధము నాటి ద్రాక్షారామ భీమేశ్వరాలయం యొక్క ప్రధాన అర్చకులైన భీమన పండితులు మరియు గౌరాంబలకు శ్రీమల్లికార్జున పండితారాధ్యులు 1120 సంవత్సరంలో పుట్టారు. శ్రీమల్లికార్జున పండితారాధ్యులు వీర శైవాచార్యులుగా, వీర శైవ కవీశ్వరులుగా ప్రసిద్ధి చెందినారు. శైవ కవిత్రయంలో ఒకరుగా ఖ్యాతి గాంచినారు.
దక్షరామ క్షేత్ర దర్శనముతో సర్వ పాపములు నశించి, సకల శుభములు కలగును. శివానుగ్రహం కోసం భక్తులు అర్చనలు, అభిషేకాలు, అన్నదానం నిర్వహించుతారు.
రవాణా సమాచారం : కాకినాడ నుంచి కోటిపల్లి మీదగా నర్సాపూర్ కు రైలు మార్గం పనులు జరుగుచున్నాయి(2022). ప్రస్తుతం కాకినాడ టౌన్ నుంచి కోటిపల్లి (వయా) ద్రాక్షారామం మధ్య రైల్వే బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ద్రాక్షారామం రైల్వే స్టేషన్ నుంచి శ్రీ భీమేశ్వరాలయం మధ్య దూరం సుమారు 2 కీల్లో మీటర్లగా ఉంటుంది.
వసతి గృహము: ద్రాక్షారామం - కోటిపల్లి రోడ్డులో దేవస్థానం వారి వసతి గృహము కలదు. Devasthanam Cottages నందు రుసంతో కూడిన వసతలు దొరుకుతాయి. Devasthanam Cottages, Ph: 088572 52488. (Rooms booking only Sri Bhimeswara temple's ticket counter. Temple to Cottages distance Approx half KM.)
ద్రాక్షారామం నందు యాత్రికులకు కావాల్సినంత వసతలు, భోజనం, రవాణా సౌకర్యములు కలవు. దేవస్ధానం వారి వసతి గృహం, నిత్యాన్నదానం పాటు పైండా వారి సత్రం, శ్రీ రాజరాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం, Private Lodges, Hotels, Bus services (APSRTC Bus stand) and Taxi services మొదలగు వసతలు దొరుకుతాయి.
నిత్యాన్నదానం: శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం లోపల వాయువ్యం దిక్కులో సోమవారం మండపం కలదు. ఇచ్చట యాత్రికులకు నిత్యాన్నదానం జరుగుతుంది. భక్తులు ముందుగా అన్నప్రాసాదం coupons తీసుకోవాలి.
ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దక్షిణ ప్రవేశ ద్వారం వద్ద పైండా వారిచే నిర్మించబడిన అన్నసత్రం కలదు. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం సంప్రాదించాలి. వీరు coupons (అన్నప్రాసాదం కోసం) ముందుగా ఇస్తారు.
ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి. వీరి Cell 83320 29544. వీరు వాహనములు కూడ ఏర్పాట్టు చేస్తారు.
ఆలయం నకు సమీపంలో (bus stop) Taxi stand ఉంది. ఇక్కడ టాక్సీలు & ఆటోలు ఉంటాయి.
"సర్వే జనా సుఖినోభవంతు"
108 జన్మ నక్షత్ర పాద శివలింగాలు పర్యటన కార్యక్రమ వివరాల కోసం - ఇక్కడ నొక్కండి
మీ నక్షత్రం, రాశి, పదం తెలియనివారు లింక్ ను క్లిక్ చేయండి --- ఇక్కడ నొక్కండి
Click the link if you don't know your Nakshatra, Rasi, Padam --- Click Here
ఆటో & టాక్సీ సేవలు: దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచిన ద్రాక్షారామం క్షేత్రం చుట్టు ప్రక్కల అనేక శైవ & వైష్ణవ ఆలయాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశ లింగములు, తీర్ధరాజములు, గ్రహాలు రీత్యా లింగాలు, 12 రాశి ఆలయాలు, 8 శక్తి ఆలయాలు ద్రాక్షారామం సమీపములో ఉన్నాయి. 108 నక్షత్ర రీత్యా శివలింగాలు, అష్ట సోమేశ్వరాలయాలు, అగస్త్య మహర్షి ప్రతిష్టించిన పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమి (అర్తమూరు, మండపేట, తాపేశ్వరం, చెల్లూరు, వల్లూరు) మరియు నవ జనార్ధ ఆలయాలు మొదలగునవి ద్రాక్షారామం చుట్టు ప్రక్కల ఉన్నాయి. వీటిని యాత్రికులు సమయాన్ని బట్టి తప్పక దర్శించవలెను. ద్రాక్షారామం నుంచి రవాణా సౌకర్యములు దొరుకుతాయి. శ్రీ అడ్డాల సతీష్ కుమార్ (Auto & Taxi Owner) కి మంచి అనుభవం ఉంది. మంచి వ్యక్తి. వీరి Cell No. 9908424926 సంప్రదించగలరు.
Auto & Taxi Services: Famous as Dakshina Kashi, there are many Shaivite & Vaishnava temples around Draksharamam Kshetra. Among these are Dwadasha Lingams, Tirdharajas, Graha Ritya Lingams, 12 Rasi Temples and 8 Shakti Temples near Draksharam. There are 108 constellation Shiva Lingams, Ashta Someswara Temples, Pancha Agastyeswara Temple Cluster (Arthamuru, Mandapeta, Tapeswaram, Chelluru, Vallur) and Nava Janardha Temples enshrined by Sage Agastya around Draksharamam.Pilgrims must visit these according to time. Transport facilities are available from Draksharam. Mr. Addala Satish Kumar (Auto & Taxi Owner) has good experience. good person Their Cell No. 9908424926 can be contacted.