శివాలయాలు / Lord Shiva Temples
మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
శివాలయాలు / Lord Shiva Temples
శ్రీ పాతాళేశ్వర లింగము (పంచ బలరామ ప్రతిష్టలు)
పైకపాడు
స్థల పూరణం:
ఆలయం: ఒడిశా రాష్ట్రంలోని రాయగడ పట్టణం నకు ఉత్తరం దిశగా సుమారు 20 Kms. దూరములో తెరువలి (Therubali) అను పట్టణం ఉంది. తెరువలి పట్టణం నకు సుమారు 02 Kms. లోపలికి తెరువలి (Therubali) రైల్వే స్టేషన్ ఉంటుంది. దీనికి సుమారు 02 Kms. పశ్చిమ వైపుకు పైకపాడ (Paikapada) గ్రామం ఉంటుంది. ఇచ్చట పావన నాగవళి నదీ తీరం నకు సమీపంలో శ్రీ పాతాళేశ్వర ఆలయం పశ్చిమాభి ముఖముగా ఉంటుంది. శ్రీ పాతాళేశ్వర్ శివాలయం చాల ప్రాచీనమైనది. ఆలయ ప్రాంగణము చాల విశాలముగా ఉంటుంది. ఆలయం ప్రాంగణములో భగవతి, కాళీమాత, నంది మండపములు ఉన్నాయి. ఆలయం లోని శ్రీ పాతాళేశ్వర శివలింగము ప్రాచీనమైనది. గర్భాలయంలో పాతాళేశ్వర శివలింగముతో పాటు ఉమామహేశ్వర స్వామి, నీలకంఠేశ్వర స్వామి కలరు. ముఖ మండపం నందు గణపతి, మహాలక్ష్మీ, బలభద్ర-జగన్నాధ-సుభద్రల మూర్తులు చూడగలము. మహాశివ రాత్రి సందర్భముగా అయిదు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి.శ్రీ పాతాళేశ్వర ఆలయం నకు దక్షిణ వైపున శ్రీ జగన్నాధాలయం కలదు. రెండు ఆలయాలకు మధ్యన అనేక శివలింగాలు కలవు.
తెరువలి (Therubali) పట్టణం నందు శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం కలదు. ఆలయం బహు సుందముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో శ్రీ సీతారామచంద్ర మూర్తి, శ్రీ రాధకృష్ట ఆలయాలు కూడ ఉన్నాయి. వీటితో పాటు శివాలయం, కాళీమాత మందిరం చూడగలము. ఆలయ ఉద్యానవనం మనోహరంగా ఉంటుంది.
రవాణా సమాచారం : విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, రాయగడ నుంచి తెరువలి రైల్వే స్టేషన్ కు రైలు సర్వీసులు దొరుకుతాయి.
తెరువలి (Therubali) రైల్వే స్టేషన్ నుంచి శ్రీ పాతాళేశ్వర్ శివాలయం నకు ఆటోలు దొరుకుతాయి. ఆటోలు రాను-పోను ఏర్పాట్టు చేసుకోవాలి.
రాయగడ పట్టణం నుంచి టాక్సీ సర్వీసులు దొరుకుతాయి.
శ్రీకాకుళం నుంచి టూర్ సర్వీసులు దొరుకుతాయి.
వసతి గృహము:
ఆలయం దర్శనం:
నిత్యాన్నదానం:
Official Website:
Google map: https://goo.gl/maps/kLZjwhZzCiBYBHoA8