శివాలయాలు / Lord Shiva Temples
మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
శివాలయాలు / Lord Shiva Temples
పంచభూతలింగాలు
శ్రీ కాళహస్తీశ్వరాలయం (వాయులింగం)
శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా
స్థల పూరణం:
ఆలయం: శ్రీ కాళహస్తీశ్వరాలయం లోని లింగమే వాయులింగం అని అంటారు. గర్ఛాలయం నందలి వాయులింగం నుంచి నిత్యం మరియు నిరంతరము వాయువు (గాలి) ఉద్ఛవించుతుంది. శ్రీ కాళహస్తీశ్వర లింగము నకు రెండు వైపుల జ్యోతులు ఉంటాయి. రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇదే శ్రీకాళహస్తి యొక్క ప్రత్యేకత. శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగ జీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కధనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. అమ్మవారిని శ్రీ ఙ్ఞానప్రసూనాంబ దేవిగా కొలుస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి కలదు. ఇది మండల కేంద్రం. శ్రీకాళహస్తి పట్టణం మరియు శ్రీ కాళహస్తీశ్వరాలయం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉన్నాయి. శ్రీ కాళహస్తి దేవాలయము చాలా పెద్దది. దేవాలయమునకు సమీపములో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. ఒక రోజు స్వామి కండ్లు నుంచి నెత్తురు కారడం చూసిన ఆ వేటగాడు తన రెండు నేత్రములు స్వామికి అమర్చి, మోక్షం పొందుతాడు. అతని భక్తికి చిహ్నంగా కొండ పైన ఒక ఆలయ నిర్మాణం జరిగింది.
శ్రీ కాళహస్తి దేవాలయము చాల విశాలముగా ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, శ్రీ కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు.
క్షేత్రం నందు శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, దర్మరాజు ప్రతిష్ఠించిన లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు. క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల విగ్రహాలున్నాయి. ఆలయం నందు గల వివిధ మండపములు, స్ధంభాలు శిల్ప శోభతో మనోహరంగా ఉంటాయి.
గర్భాలయం నందలి వాయులింగం స్వయంభువు. స్వామి నవగ్రహ కవచం ధరించి ఉంటాడు. ప్రతి నిత్యం అభిషేకాలు, అర్చనలు విశేషముగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రికి జరుగుతాయి. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాల నుండి నివారణ కోసం శ్రీ కాళహస్తీశ్వర స్వామిని పూజిస్తారు. ఉత్తర గాలి గోపురం నుంచి ఆలయ ప్రాంగణ ప్రవేశం జరుగుతుంది.
పశ్చిమ గాలిగోపురం నుంచి స్వర్ణముఖి నదికి దారి ఉంది. ప్రధానాలయ ప్రవేశం దక్షిణ మహా ద్వారం నుంచి జరుగుతుంది. స్వామి వారి ప్రసాదములు దక్షిణ గాలి గోపురం వద్ద విక్రయించుతారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయముల కల్పించుటకు ఒక భవనం కలదు.
రవాణా సమాచారం : శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్, గుడూరు - రేణిగుంట బ్రాంచి రైలు మార్గములో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఉంటుంది. దీనికి సుమారు 2 Kms. దూరంలో శ్రీ కాళహస్తి దేవాలయము ఉంటుంది.
రైల్వే స్టేషన్ నుంచి రవాణా సౌకర్యములు దొరుకుతాయి.
శ్రీకాళహస్తి నుంచి జిల్లా లోని అన్ని ముఖ్య ప్రాంతములకు బస్సులు ఉంటాయి.
ముఖ్యముగా తిరుపతి పట్టణం నకు (వయా) రేణిగుంట మీదగా బస్సులు హెచ్చుగా ఉంటాయి.
తిరుపతి నుంచి కాంచీపురం నకు బస్సులు అధికముగా ఉంటాయి. వీటితో పాటు రైలు సర్వీసులు కూడ ఉంటాయి.
శ్రీకాళహస్తి నుంచి కాంచీపురం నకు బస్సులు పరిమితంగా ఉంటాయి. వీటి మద్య దూరం సుమారు 130 Kms. (వయా) రేణిగుంట, నగరి, తిరుత్తుణి, ఆర్కోణం.
వసతి గృహము: యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతి గృహాలు కూడ ఉన్నాయి.
ఆలయం దర్శనం:
నిత్యాన్నదానం:
Official Website:
Google map: