శివాలయాలు / Lord Shiva Temples
మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
శివాలయాలు / Lord Shiva Temples
పంచభూతలింగాలు
అరుణాచలేశ్వర స్వామి (తేజోలింగం)
తిరువణ్ణామలై, తమిళనాడు
స్థల పూరణం:
ఆలయం: తమిళనాడులోని తిరువణ్ణామలై (అరుణాచలం)లో తేజోలింగం ఉన్నది. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్ధం, తమిళం వాళ్ళు తిరువణ్ణామలై అని పిలుస్తారు, తిరు అనగా శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్ధం, స్మరణ చేతనే ముక్తినొసగే క్షేత్రం అరుణాచలం. దీనిని అగ్ని క్షేత్రమంటారు. శివుడు అరుణాచల శిఖరాగ్రంపై ఒక అగ్నిశిఖగా ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు. స్వామిని శ్రీ అన్నామలైయర్ (అరుణాచలేశ్వరుడు). అమ్మవారి పేరు శ్రీ అపిత కుచళాంబికా (పార్వతీ దేవి) మరియు అరుణాచలేశ్వరి అని పిలుస్తారు.
తిరువణ్ణామలై పట్టణం నందు ఒక ఎత్తైన కొండ దర్శనమిస్తుంది. దీనినే అరుణాచలం మరియు తిరువణ్ణామలై గా పిలుస్తారు. అరుణాచలం (కొండ) పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. అరుణాచలేశ్వరాలయము అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితో ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి. నాగుగుదిక్కులు నాలుగు రాజగోపురములు ఉంటాయి. వెయ్యిస్తంభాల మండపము, దక్షిణగోపురము, తూర్పు రాజగోపురం, పెద్ద నంది, గర్భగుడి, గోపురం పైన చిలుక, బ్రహ్మ ప్రతిష్ఠింఛిన లింగం, అశ్వ మండపము, వివిధ దేవత మూర్తుల సన్నిధులు, బహ్మ తీర్ధం (పుష్కరిణి) మొదలగు అద్భుత శిల్ప సంపద కూడిన నిర్మాణములతో ఆలయ ప్రాంగణము శోభమయంగా ఉంటుంది.
బహ్మ తీర్ధం (పుష్కరిణి) సమీపంలో ప్రధానాలయ ఉంటుంది. గర్భగుడిలో పరమ పవిత్రమైన శ్రీ అరుణాచలేశ్వర స్వామి స్వయంభూ లింగము. అగ్ని లింగము సుందరమై, సర్వసిద్ది ప్రదమై , పానపట్ట్ముపై విరాజిల్లుతూ ఉంటుంది. దీనినే తేజోలింగం అని పిలుస్తారు. తేజోలింగం (అగ్ని) నుండి వెలుబడిన తేజము వలన గర్భగుడి కొంత ఉష్ణము కలిగి యుండును. స్వామి ఎడమ వైపున శ్రీ అపిత కుచళాంబికా (పార్వతీ దేవి) అమ్మవారి సన్నిధి ఉంటుంది. తమిళ కార్తికై (కార్తీక మాసం) నందు 10 రోజులు పాటు బ్రహ్మోత్సవం, కార్తీక దీపోత్సవం వైభవంగా జరుగుతాయి. ప్రతి పౌర్ణమి నాడు గిరి ప్రదక్షీణ ఉత్సవం ఉంటుంది.
గిరి ప్రదక్షణం: అరుణాచలం పైన కొలువుదీరిన పరమేశ్వరుడు జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన, కొండ చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. భక్తులు పాదచారులై, శివస్మరణ గవావిస్తూ, ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది. గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి. అనేక దేవతా మూర్తులు దర్శనం లభ్యమవుతుంది. గిరి ప్రదక్షణం 14 కి.మి గా ఉంటుంది. గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
రమణాశ్రమం: అరుణాచలేశ్వరాలయము నకు 2 కి.మి దూరం లో రమణాశ్రమం ఉంటుంది. ఇది రమణ మహర్షి నివాస స్థలం. ఇది నిర్మితమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రం. 1922 నుండి 1950 వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఇక్కడ నివసించారు. అరుణాచల పర్వతాల పాద ప్రాంతం లో ఉన్న అరుణాచలేశ్వరాలయము నకు
పడమర వైపుగా రమణాశ్రమం విస్తరించి ఉన్నది. 1950 లో మహర్షి స్వర్గస్తులయినప్పుడు అనేక వేల మంది భక్తులు అయన దర్శనార్ధమ వచ్చారు. ఆయన స్వర్గస్తులయిన తరవాత కూడా చాలా మంది భక్తులు మరియు ఆసక్తి గల సందర్శకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. మహర్షి తుది శ్వాస విడిచిన చోట ఒక కోవెల (సమాధి) నిర్మించారు. ప్రతీ సంవత్సరం ఆయన శిష్యులు ఆశ్రమాన్ని సందర్శించి , కొంత సమయం సామాజిక సేవలలో గడపటం చేస్తూవుంటారు. భక్తులుకు ఆశ్రమంలో వసతులు దొరుకుతాయి. ముందుగా బుక్ చేసుకొవాలి.
రవాణా సౌకర్యములు: కాట్పాడి రైల్వే జంక్షన్ నుంచి విల్లుపురం రైల్వే జంక్షన్ కు బ్రాంచి రైలు మార్గము కలదు. ఈ రైలు మార్గము లో తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ ఉంది. తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ కు సుమారు రెండు కీ.మీ దూరంలో అరుణాచలేశ్వరాలయము ఉంటుంది.
చెన్నై - బెంగుళూరు రైలు మార్గములో కాట్పాడి రైల్వే జంక్షన్ ఉంటుంది. కాట్పాడి నుంచి తిరువణ్ణామలై కు రైలు సర్వీసులున్నాయి.
చెన్నై ఎగ్మోర్ - తిరుచ్చిరా పల్లి రైలు మార్గములో విల్లుపురం రైల్వే జంక్షన్ ఉంటుంది. విల్లుపురం నుంచి తిరువణ్ణామలై కు రైలు సర్వీసులున్నాయి.
కాట్పాడి రైల్వే జంక్షన్ కు సుమారు 6 Kms. దూరములో రాయవెల్లూరు ఉంటుంది. రాయవెల్లూరు నుంచి తిరువణ్ణామలై కు బస్సులు ఉన్నాయి.
విల్లుపురం బస్ స్టాండ్ నుంచి తిరువణ్ణామలై కు బస్సులు ఉన్నాయి.
* తిరువణ్ణామలై నుంచి చిదంబరం నకు రైలు & బస్సులు కలవు.
తిరువణ్ణామలై నుంచి చిదంబరం నకు Direct బస్సులు పరిమితంగా ఉంటాయి. వీటితో పాటు Link బస్సులు కూడ దొరుకుతాయి. వీటి మద్య దూరం సుమారు 137 Kms. బస్సులు (వయా) తిరుకోయిలూరు, వృద్ధాచలం, భువన గిరి మీదగా ఉంటాయి.
పంచభూతలింగాలల్లో చిదంబరం ఒకటి.
వసతి గృహము:
ఆలయం దర్శనం:
నిత్యాన్నదానం:
Official Website:
Google map: