శివాలయాలు / Lord Shiva Temples
మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
శివాలయాలు / Lord Shiva Temples
పంచభూతలింగాలు
శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం (పృథ్విలింగం)
కాంచీపురము, తమిళనాడు
స్థల పూరణం:
ఆలయం: తమిళనాడులోని కంచి క్షేత్రము నందు పృథ్వి లింగాన్ని దర్శించగలము. కాంచీపురం నందు శైవులుకు, వైష్ణవులుకు, శాక్తేయులు, భౌద్ధులు, జైన మతస్థులకు పెక్కు ఆలయాలున్నాయి. ఒకప్పుడు కాంచీపురములో 1,000 ఆలయాలు ఉండేవి. కంచి పట్నం ను " సిటీ ఆఫ్ ధౌజండ్ టెంపుల్స్ " అని పిలిచేవారు. భారత దేశములో సప్త పురములున్నాయి. అనాది నుంచి సప్త పురములు మోక్షదాయకమైనవిగా ఖ్యాతి పొందినాయి. వీటిలో కంచి క్షేత్రం ఒకటి. పృథ్వి అనగా భూమి అని అర్ధం. ఇది మట్టిలింగం. పురాణలు ప్రకారము పార్వతీదేవిచే ప్రతిష్టించబడినది. పృథ్విలింగమును శ్రీ ఏకాంబరేశ్వర స్వామి అని అంటారు. ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కైంద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని (పృథ్వి) సూచిస్తాడు.
శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం చాల విశాలముగా ఉంటుంది. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు ఎత్తైన గాలి గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రవేశం దక్షిణ ముఖ గాలి గోపురం నుంచి జరుగుతుంది. ప్రధానాలయం నకు ఈశాన్యం మూల పుష్కరిణి ఉంటుంది. ప్రధానాలయం చాల విశాలముగా, నాలుగు ప్రాకారములు కలిగి యుండును. ప్రధానాలయం నందు వాహన మండపం, నవరాత్రి మండపం, వెయ్యి స్తంభాల మండపం, నటరాజ మండపం, శిల్ప సంపదతో కూడిన రాతి స్తంభాలు, వినాయక మరియు మురుగన్ మందిరాలు, 63 నయన్మార్ల, సహస్ర లింగం, 1,008 శివ లింగాలు, వివిధ దేవతా మూర్తులు, సుమారు 3,500 సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షం మొదలగునవి దర్శించగలము. మొదటి ప్రాకారములో గర్భాలయం, ముఖమండపం విశాలముగా ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ ఏకాంబరేశ్వర లింగము కొంత పెద్ధదిగా ఉంటుంది. భక్తులు పృథ్విలింగం గా కొలుస్తారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు తమిళ ఫాల్గుణ మాసములో 13 రోజులు పాటు వైభవంగా జరుగుతాయి. మొదటి ప్రాకారములో గల శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ముఖమండపం నకు ఈశాన్యం దిశగా, గోడ గూటిలో శ్రీ మహావిష్ణువును దర్శించగలము. శ్రీ వైష్ణువులు "నిలాత్తింగల్ తుండన్" పెరుమాళ్ గా సేవించుతారు. ఆళ్వార్లు 108 దివ్య దేశాలలో ఒకటిగా మంగళాశాసనం అందించినారు.
రెండవ ప్రాకారములో గొప్ప మహిమ గల మామిడి చెట్టు ఉంది. పార్వతి దేవి మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నికి అహుతి చేసాడుని స్ధల పురాణం చెప్పుచున్నాది. అప్పుడు పార్వతి దేవి తన సోదరుడైన విష్ణువు ను ప్రార్థించగా, విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు మామిడి వృక్షం పైన ప్రసరింపజేస్తాడు. దానితో మామిడి వృక్షం నకు ఉపశయనం కలుగుతుంది. పిమ్మట శ్రీ మహావిష్ణువు సమక్షములో శివ పార్వతీ కళ్మాణం జరుగుతుంది. మామిడి వృక్షం క్రింద తపో కామాక్షి దేవిని దర్శించగలము.
రవాణా సమాచారం : కాంచీపురము రైల్వే స్టేషన్, ఆర్కోణం - చెంగల్ పట్టు బ్రాంచి రైలు మార్గములో కాంచీపురము రైల్వే స్టేషన్ ఉంటుంది. చెన్నై - కాట్పాడి మెయిన్ రైలు మార్గములో ఆర్కోణం రైల్వే జంక్షన్ మరియు చెన్నై - విల్లుపురం మెయిన్ రైలు మార్గములో చెంగల్ పట్టు రైల్వే జంక్షన్ ఉంటాయి. ఆర్కోణం - చెంగల్ పట్టు మద్యన కాంచీపురము బ్రాంచి రైలు మార్గము ఉంటుంది. ఆర్కోణం - చెంగల్ పట్టు మద్యన Local Train service ఉంటాయి. వీటితో పాటు Daily & Weekly express Train services కూడ ఉంటాయి. కాంచీపురము రైల్వే స్టేషన్ నకు సుమారు 2 Kms. దూరంలో కాంచీపురము పట్టణం ఉంది. రైల్వే స్టేషన్ నుంచి రవాణా సౌకర్యములు దొరుకుతాయి. తిరుపతి, రేణిగుంట, ఆర్కోణం, చెంగల్ పట్టు నుంచి కాంచీపురము నకు రైలు సర్వీసులు దొరుకుతాయి.
తిరుపతి, రేణిగుంట, ఆర్కోణం, చెంగల్ పట్టు, చెన్నై (కోయంబేడు బస్ స్టాండ్) నుంచి కాంచీపురము నకు బస్సులు ఉంటాయి. ముఖ్యముగా తిరుపతి పట్టణం నుంచి కాంచీపురము (వయా) రేణిగుంట మీదగా బస్సులు హెచ్చుగా ఉంటాయి. ఆర్కోణం & చెంగల్ పట్టు నుంచి కాంచీపురము కు బస్సులు అధికముగా ఉంటాయి.
కాంచీపురము బస్ స్టాండ్ నుంచి శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం నకు ఆటోలు దొరుకుతాయి. శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం నుంచి చిన్న కంచి లోని శ్రీ వరదరాజన్ దేవాలయం నకు బస్ సర్వీసులు, ఆటోలు దొరుకుతాయి. పెద్ద కంచి లోని శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం నకు సుమారు 300 meters దూరం లో శ్రీ కామాక్షి అమ్మ వారి ఆలయం కలదు. ప్రతి నిత్యం శ్రీ కామాక్షి పీఠం వారు భక్తులుకు అన్నదానము జరుపుతారు. శ్రీ కామాక్షి అమ్మ వారి ఆలయం నకు సమీపంలో యాత్ర నివాస్ ఉంది. యాత్రికులకు మంచి వసతులు ఉంటాయి. శ్రీ కామాక్షి అమ్మ వారి ఆలయం నకు సుమారు 200 meters దూరం లో కాంచీపురము బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ In gate వద్ద శక్తి గణపతి హోటల్ కలదు. ఇచ్చట పలహారం & భోజనం రుచిగా ఉంటాయి.
కాంచీపురం నుంచి తిరువణామలై (అరుణాచలం) నకు Direct బస్సులు పరిమితంగా ఉంటాయి. వీటితో పాటు Link బస్సులు కూడ దొరుకుతాయి. బస్సులు (వయా) వందవాసి, చెట్ పేట, అవలూరు పేట మీదగా ఉంటాయి. వీటి మద్య దూరం సుమారు 115 Kms. పంచభూతలింగాలల్లో తిరువణామలై ఒకటి.
వసతి గృహము:
ఆలయం దర్శనం:
నిత్యాన్నదానం:
Official Website:
Google map: