శివాలయాలు / Lord Shiva Temples
మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
శివాలయాలు / Lord Shiva Temples
పంచభూతలింగాలు
శ్రీ జంబుకేశ్వర స్వామి (జల లింగము)
తిరుచ్చి, తమిళనాడు
స్థల పూరణం:
ఆలయం: తమళనాడులోని తిరుచ్చికి 11 కి.మీ. దూరంలో పవిత్ర కావేరి నది ఒడ్డున తిరువనై కోవిల్ క్షేత్రం ఉంది. దీనినే జంబుకేశ్వరం అని కూడ పిలుస్తారు. పూర్వం జంబు వృక్షాలు (నేరేడు చెట్లు) ఉండటం చేత జంబుకేశ్వరం అని పేరు వచ్చిందంటారు. ఇచ్చట జల లింగమును దర్శించగలము. స్వామిని శ్రీ జంబుకేశ్వర, అమ్మ వారిని శ్రీ అఖిలాండేశ్వరి గా కొలుస్తారు. గర్భ గుడి లోని లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భాలయంలో ఉన్న లింగమును జంబుకేశ్వరుడు, అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్నాథర్ అని కూడా పిలుస్తారు. గర్భగుడిలో గవాక్షానికి "నవద్వార గవాక్షం" అని పేరు. గర్భాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. గర్భాలయం వెనుక భాగములో ఆగ్నేయం మూల జంబు వృక్షం ఉంటుంది. తమిళ పంగుణి మాసం (ఫాల్గుణ) బ్రహ్మోత్సవాలు మరియు నవరాత్రి పండుగ సందర్భమమగా10 రోజుల పాటు ఉత్సవాలు విస్తృతంగా జరుగుతుంది.
జంబుకేశ్వరుని గర్భాలయం ముందు భాగములో వాయువ్యం మూల శ్రీ అఖిలాండేశ్వరి సన్నిధి తూర్పు అభిముఖంగా ఉంటుంది. శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు, నాలుగు భుజాలలొ పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తంతో వరద ముద్ర తో ఉన్నారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్రంగా ఉండేవారుట! శంకరాచార్యులు ఈమె ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగ మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు శ్రీచక్రాన్ని ప్రతిస్టించారని , అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదిరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని చెప్పుచుంటారు. శ్రీ అఖిలాండేశ్వరి సన్నిధి ప్రక్కన అష్టా దశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచ భూత లింగాల చిత్రలేఖనం దర్శనమిస్తాయి.
ఇతిహాసం: శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తుంగా ఒకసారి శంభుడికి శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన కోరిక అయినా ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొనాడు. భోళా శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపములొ వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపం ఉండి నన్ను పూజించెదవు అని చెప్పి అంతనార్థం అవుతాడు. శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలొ ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి భక్తుల నమ్మకం. మరో ఇతిహాసం ప్రకారం స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పోటి పడి పూజిస్తుండేవి.
శ్రీ జంబుకేశ్వర దేవాలయం విశాలమై ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు కలవు. ఆలయం నందు ప్రధానాలయంతో పాటు అనేక ఉపాలయాలు, మండపాలు ఉన్నాయి. మొదటి ప్రాకారములో ప్రధానాలయం ఉంటుంది. ఐదోదాన్ని విభూది ప్రాకారంగా పిలుస్తారు. అయిదోవ ప్రాకారము సుమారు 25 అడుగల ఎత్తుగా, పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఈ ప్రాకారం బస్ స్టాప్ నుంచి కనబడుతుంది. భక్తులు దీని క్రింద నుంచి దేవాలయం లోనికి ప్రవేశించుతారు.
రవాణా సౌకర్యములు: చెన్నై ఎగ్మోర్ నుంచి తిరుచ్చిరాపల్లికి రెండు రైలు మార్గములున్నాయి. ఒక మార్గము (వయా) విల్లుపురం, వృద్ధాచలం, శ్రీరంగము మీదగా ఉండును. రెండువ మార్గము (వయా) విల్లుపురం, చిదంబరం, కుంభకోణం, తంజవూరు మీదగా ఉంటుంది. చెన్నై Central, చెన్నై ఎగ్మోర్, నుంచి తిరుచ్చిరాపల్లికి రైలు సర్వీసులున్నాయి. తిరుచ్చిరాపల్లి రైల్వే స్టేషన్ కు సుమారు ఒక కీ.మీ దూరంలో తిరుచ్చిరాపల్లి Bus complex ఉంటుంది.
చెన్నై (కోయంబేడు బస్ స్టాండ్) నుంచి తిరుచ్చిరాపల్లి,(Centra బస్ స్టాండ్) కు బస్సులు కలవు. తిరుచ్చి
బస్ స్టాండ్ నుంచి శ్రీ రంగం ఆలయం నకు City Bus Route No.1 (Via) తిరుచ్చి సత్రం బస్ స్టాండ్, తిరువనై కోవిల్ మీదగా ప్రతి 15 నిముషాలకు ఉంటాయి.
తిరుచ్చిరాపల్లి రైల్వే జంక్షన్ స్టేషన్ బయట శ్రీరంగం పోవు బస్సులు (City Bus No.1) దొరుకుతాయి. కావేరి నది దాటగానే తిరువనై కోవిల్ బస్ స్టాప్ వస్తుంది. తిరువనై కోవిల్ బస్ స్టాప్ కు సమీపంలోనే శ్రీ జంబుకేశ్వరాలయ ప్రవేశ గోపురం ఉంటుంది.
వసతి గృహము:
ఆలయం దర్శనం:
నిత్యాన్నదానం:
Official Website:
Google map: