శివాలయాలు / Lord Shiva Temples
మీ జన్మ నక్షత్ర శివాలయ క్షేత్రాల పట్టిక కొరకు
శివాలయాలు / Lord Shiva Temples
పంచభూతలింగాలు
నటరాజస్వామి (ఆకాశ లింగం)
చిదంబరం, తమిళనాడు
స్థల పూరణం:
ఆలయం: తమిళనాడులోని చిదంబరం క్షేత్రం నందు ఆకాశ లింగమును దర్శించగలము. శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. శివుడికి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా మనుష్య రూపాన్ని ఆరోపించిన మూర్తితో శివుడిని నెలకొల్పిన అతికొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. నటరాజ స్వామి సన్నిధిని ' చిత్ సభ ' (పొన్నాంబలం) అని పిలుస్తారు. ' చిత్ ' అనగా ఆకాశం వేదిక అని చెప్పుచుంటారు. మందిరం పైకప్పు బంగారపు పలకలుతో కప్పబడినది. శ్రీ నటరాజస్వామి దక్షిణాభి ముఖంగా కొలువై ఉంటాడు. చిత్ సభ నందు స్వామి ఆనంద తాండవం చేస్తూ దర్శనమిస్తాడు. అమ్మ వారిని శ్రీ శివ కామ సుందరిగా ఆరాధించుతారు. తమిళ మార్గళి (మార్గశిరం) మాసం లో బ్రహ్మోత్సవాలు, ఆరుద్ర దర్శనం ఉత్సవాలు ఉంటాయి. తమిళ ఆని (జ్యేష్టం) మాసం లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
చిదంబర రహస్యం: శ్రీ నటరాజస్వామి వెనుక భాగములో ఒక విశిష్ట యంత్ర స్ధాపన జరిగింది. యంత్రం ముందు భాగాన గల తెరను తొలిగించి క్షణ కాలం చూపిస్తారు. పరమ శివుడు నిరాకార స్వరూపుడై సాక్షాత్కారిస్తాడు. తెర వెనుక వైపు గల చీకటి అజ్ఞానాన్ని సూచిస్తుంది. తెర ముందు వైపు గల వెలుతురు జ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞాన ప్రకాశమే చిదంబర రహస్యం అని చెప్పుచుంటారు.
చిదంబరం నగరం నడిబొడ్డున ఆలయాల సముదాయం వ్యాపించి ఉంది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం కలిగియుంది. ఆలయం నందు శైవులకు, వైష్ణవులకు ప్రత్యేక స్ధానం ఇవ్వబడింది. ప్రధాన దైవం శ్రీ నటరాజస్వామి (శివుడు). శ్రీ వైష్ణువులకు అత్యంత ప్రీతి మైన 108 దివ్య దేశాలలో ఒకటి అయిన శ్రీ గోవిందరాజ పెరుమాళ్ళు ను కూడ దర్శించగలము. నటరాజస్వామికి ఎదురుగా గల మండపం నుంచి ఒకే సమయం లో శ్రీ నటరాజస్వామిని మరియు శ్రీ గోవిందరాజ పెరుమాళ్ళు ను దర్శించగలము. చిదంబరం దేవాలయానికి 9 ద్వారాలు, 5 ప్రాకారాలు ఉన్నాయి. తొమ్మిది ద్వారాల్లో 4 పెద్ద గాలి గోపురాలు ( తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులలో) కలవు. నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి. తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో భరత నాట్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ సముదాయములో ఒక పెద్ద తటాకము (శివ గంగ) అనే పుష్కరిణి, ఐదు సభలు (వేదికలు) ఉన్నాయి. రాజ్యసభ ను1000 స్తంభాల మంటపంగా పిలుస్తారు. ఆలయ సముదాయములో గోవిందరాజ పెరుమాళ్, ఆయన దేవేరి పుండరీగవల్లి తాయర్ సన్నిధి కూడా ఉన్నాయి. గోవిందరాజ పెరుమాళ్ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూడమ్ అంటారు. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. చిదంబరం ఆలయ సముదాయములో విఘ్నేశ్వరు, కుమారస్వామి, పార్వతీ మొదలగు చిన్న ఆలయాలు/సన్నిధిలు కూడ ఉన్నాయి.
రవాణా సౌకర్యములు: చెన్నై ఎగ్మోర్ నుంచి తిరుచ్చిరాపల్లికి రెండు రైలు మార్గములున్నాయి. ఒక మార్గము (వయా) విల్లుపురం, వృద్ధాచలం, శ్రీరంగము మీదగా ఉండును. రెండువ మార్గము (వయా) విల్లుపురం, చిదంబరం, కుంభకోణం, తంజవూరు మీదగా ఉంటుంది. చెన్నై ఎగ్మోర్, తిరువణ్ణామలై నుంచి చిదంబరం నకు రైలు సర్వీసులున్నాయి. చిదంబరం రైల్వే స్టేషన్ కు సుమారు రెండు కీ.మీ దూరంలో ఆలయం ఉంటుంది.
చెన్నై, తిరువణ్ణామలై, విల్లుపురం మొదలగు ప్రాంతములు నుంచి చిదంబరం నకు బస్సులు కలవు. బస్ స్టాండ్ నుంచి ఆలయం నకు ఆటోలు దొరుకుతాయి.
చిదంబరం నుంచి తిరుచ్చిరాపల్లికి రైలు & బస్సులు కలవు.
చిదంబరం నుంచి తిరుచ్చిరాపల్లికి Direct బస్సులు పరిమితంగా ఉంటాయి. వీటి మద్య దూరం సుమారు 167 Kms. (వయా) వృద్ధాచలం.
వీటితో పాటు Link బస్సులు కూడ దొరుకుతాయి. చిదంబరం నుంచి కుంభకోణం(73 Kms.), కుంభకోణం నుంచి తంజవూరు (39 Kms.), తంజవూరు నుంచి తిరుచ్చిరాపల్లి (57 Kms.) దూరం ఉంటుంది.
తిరుచ్చిరాపల్లికి సుమారు 11 Kms. దూరంలో (శ్రీరంగం వైపు) జంబుకేశ్వరం (తిరువనై కోవిల్) కలదు.
వసతి గృహము:
ఆలయం దర్శనం:
నిత్యాన్నదానం:
Official Website:
Google map: