రాశి, నక్షత్ర పాద ఆలయాలు
(ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామం చుట్టూ)
12 రాశుల మరియు 27 నక్షత్రాల 108 పాదాలకు ఆలయాలు
గ్రహదోష నివారణ కోసం మొదట నక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించు కోవాలి (శ్రీనాధుని శ్రీభీమేశ్వర పురాణము).
చాళుక్యుల భీమ మండలము (తూర్పున సముద్రము, దక్షిణమున వృద్ధ గౌతమి, పడమటన గౌతమీ నది, ఉత్తరమున తుల్యభాగానది హద్దులు గాగల ప్రదేశము) లోని ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి దిగువ దిక్కులలో ఉన్నవి.
రాశికి ఆరాధించ వలసిన ఆలయాలు
మేష, వృషభ: తూర్పుగా విలాస గంగవరం లో శ్రీ పార్వతి సమేత గంగాధర స్వామి. మిధున: ఈశాన్యముగా హసనబాద లో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి. కర్కాటక, సింహ: ఉత్తరముగా వెల్ల లో శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వర స్వామి. కన్య: వాయవ్యముగా ఎరుపల్లె లో శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి. తుల, వృశ్చిక: పడమరగా ఆదివారపు పేట లో శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి. ధనుస్సు: నైఋతిగా నెలపర్తిపాడు లో శ్రీ అన్నపూర్నా సమేత కాశివిశ్వేశ్వర స్వామి. మకర, కుంభ: దక్షిణంగా కుందాలమ్మ చెరువు లో శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మార్కండేయ స్వామి.మీన: ఆగ్నేయంగా వేగయ్యమ్మపేట లో శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామి.నక్షిత్రపాదానికి ఆరాధించ వలసిన ఆలయాలు
1.అశ్విని
1-బ్రహ్మపురి--శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి
2-ఉప్పుమిల్లి - శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత భవానీశంకర స్వామి
3-కుయ్యేరు--శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మల్లేశ్వర స్వామి
4-దుగ్గుదుర్రు--శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
2.భరణి
1-కోలంక--శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి
2-ఇంజరం--శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి
3-పల్లిపాలెం--శ్రీ గంగా పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి
4-ఉప్పంగళ--శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
3.కృత్తిక
1-నీలపల్లి--శ్రీ మీనాక్షి దేవి సమేత నీలకంఠేశ్వర స్వామి.
2-అదంపల్లి--శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
3-వట్రపూడి--శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
4-ఉండూరు--శ్రీ ఉమా సమేత మార్కండేయ స్వామి
4.రోహిణీ
1-తనుమల్ల--శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి
2-కాజులూరు--శ్రీ సర్వ మంగళ సమేత అగస్తేశ్వర స్వామి
3-ఐతపూడి--శ్రీ అన్నపూర్ణా సమేత రామలింగేశ్వర స్వామి
4-శీల--శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
5.మృగశిర
1-తాళ్ళరేవు--శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి.
2-గురజనాపల్లి--శ్రీ భ్రమరాంబికా సమేత చెన్నమల్లీశ్వర స్వామి
3-అండంగి--శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
4-జగన్నాధగిరి--శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి
6.ఆరుద్ర
1-పెనుమళ్ల--శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
2-గొల్లపాలెం--శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి
3-వేములవాడ--శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి
4-కూరాడ--శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి
7.పునర్వసు
1-గొర్రిపూడి (భీమలింగపాడు)--శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి
2-కరప--శ్రీ పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి
3-ఆరట్లకట్ల--శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి
4-యనమదల--శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
8.పుష్యమి
1-కాపవరం--శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
2-సిరిపురం--శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
3-వేలంగి--శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత భవానీశంకర స్వామి
4-ఓడూరు--శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరస్వామి
9.ఆశ్లేష
1-దోమాడ--శ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామి
2-పెదపూడి--శ్రీ శ్యామలాంబా సమేత సోమేశ్వర స్వామి
3-గండ్రేడు--శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి
4-మామిడాడ--శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి
10.మఖ
1-నరసాపురపుపేట--శ్రీ పార్వతీ సమేత భవానీశంకర స్వామి
2-మెళ్ళూరు--శ్రీ విశాలాక్షీ సమేత విశ్వేశ్వర స్వామి
3-అరికిరేవుల--శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి
4-కొత్తూరు--శ్రీ పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి
11.పుబ్బ
1-చింతపల్లి--శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
2-వెదురుపాక--శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
3-తొస్సిపూడి--శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
4-పొలమూరు--శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి
12.ఉత్తర
1-పందలపాక--శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
2-చోడవరం--శ్రీ పార్వతీ సమేత అగస్త్తేశ్వర స్వామి
3-నదురుబాద--శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
4-పసలపూడి--శ్రీ మాణిక్యాంబా సమేత రాజరాజేశ్వర స్వామి
13.హస్త
1-సోమేశ్వరం--శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వర స్వామి
2-పెడపర్తి--శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
3-పులుగుర్త--శ్రీ ఉమా పార్వతీ సమేత అగస్త్తేశ్వర స్వామి
4-మాచవరం--శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
14.చిత్త
1-కొప్పవరం--శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
2-అర్థమూరు--శ్రీ ఉమా సమేత అగస్తేశ్వర స్వామి
3-చెల్లూరు--శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్తేశ్వర స్వామి
4-కాలేరు--శ్రీ రాజరాజేశ్వరీ సమేత మల్లేశ్వర స్వామి
15.స్వాతి
1-మారేడుబాక--శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
2-మండపేట--శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి
3-గుమ్మిలేరు--శ్రీ ఉమాసమేత రామలింగకోటేశ్వర స్వామి
4-వెంటూరు--శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
16.విశాఖ
1-దుళ్ల --శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్తేశ్వర స్వామి
2-నర్సిపూడి--శ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
3-నవాబుపేట--శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరస్వామి
4-కూర్మపురం--శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
17.అనూరాధా
1-పెనికేరు--శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఇష్టకాంతేశ్వర స్వామి
2-చింతలూరు--శ్రీ పార్వతీ సమేత పృధ్వీశ్వర స్వామి
3-పినపల్ల--శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
4-పెదపల్ల--శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
18.జ్యేష్టా
1-వడ్లమూరు--శ్రీ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి
2-నల్లూరు--శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి
3-వెదురుమూడి--శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
4-టేకి--శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
19.మూల
1-యండగండి--శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి
2-పామర్రు--శ్రీ ఉమాపార్వతీ సమేత సోమేశ్వర స్వామి
3-అముజూరు--శ్రీ ఉమాపార్వతీ సమేత సోమేశ్వర స్వామి
4-పానంగిపల్లి--శ్రీ లలితాంబికా సమేత ఉత్తరేశ్వర స్వామి
20.పూర్వాషాఢ
1-అంగర--శ్రీ పార్వతీసమేత ఖండేశ్వర స్వామి
2-కోరుమిల్లి--శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి
3-కుల్ల--శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
4-వాకతిప్ప--శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి
21.ఉత్తరాషాఢ
1-తాతపూడి--శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
2-మాచర--శ్రీ ఉమా పార్వతీ సమేత రాజలింగేశ్వర స్వామి
3-సత్యవాడ--శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
4-సుందరపల్లి--శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి
22.శ్రవణం
1-వానపల్లి--శ్రీ పార్వతీ బాలాత్రిపురసుందరీ సమేత వైధనాథేశ్వర స్వామి
2-మడుపల్లి--శ్రీ పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి
3-వాడపాలెం--శ్రీ ఉమా మాణిక్యాంబా సమేత వీరేశ్వర స్వామి
4-వీరవల్లిపాలెం--శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
23.ధనిష్ట
1-వెలవలపల్లి--శ్రీ మహిషాసురమర్ధనీ సమేత రాజరాజనరేంద్ర స్వామి
2-అయినవిల్లి--శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి
3-మసకపల్లి--శ్రీ పార్వతీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి
4-కుందూరు--శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి
24.శతబిషం
1-కోటిపల్లి--శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి
2-కోటిపల్లి--శ్రీ పార్వతీ సమేత కోటేశ్వర స్వామి
3-తొత్తరమూడి--శ్రీ భ్రమరాంబా సమేత మూల్లేశ్వర స్వామి
4-పాతకోట--శ్రీ లోపాముద్రా సమేత అగస్తేశ్వర స్వామి
25.పూర్వాభాద్ర
1-ముక్తేశ్వరం--శ్రీ రాజరాజేశ్వరీ సమేత ముక్తేశ్వర స్వామి
2-శాసనపల్లి లంక--శ్రీ భ్రమరాంబా సమేత చౌడేశ్వర స్వామి
3-ఠానెలంక--శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
4-ఎర్రపోతవరం--శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
26.ఉత్తరాభాద్ర
1-దంగేరు--శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి
2-కుడుపూరు--శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత నీలకంఠేశ్వర స్వామి
3-గుడిగళ్ళ--శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామి
4-శివల--శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత నీలకంఠ త్రిపురాంతక స్వామి
27.రేవతి
1-భట్లపాలిక--శ్రీ లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామి
2-కాపులపాలెం--శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
నవగ్రహా ఆలయాలు
(తమిళనాడు లోని కుంబకోణం దగ్గరలో)
సూర్యుడు (రవి): సూరియానార్కొయిల్ - శ్రీ సూర్యనార్ (15 km)
చంద్రుడు: తిన్గలూరు - శ్రీ కైలాశనాథర్ (32 km)
కుజుడు (అంగారకుడు): వైదీస్వరన్కొయిల్ - శ్రీ వైథీశ్వరర్ (51 km)
బుధుడు: తిరువేంగాడు - శ్రీ సువీతారణ్యేశ్వరర్ (60 km)
గురుడు (బృహస్పతి): ఆలంగుడి - శ్రీ అబత్సగాయేశ్వరర్ (19 km)
శుక్రుడు: కంజనూర్ - శ్రీ అగ్నీశ్వరర్ (18 km)
శని: తిరునల్లారు - శ్రీ దర్భరణ్యేశ్వరర్ (53 km)
రాహువు: తిరునాగేశ్వరమ్ - శ్రీ నాగనాథస్వామి (7 km)
కేతువు: కీలపెరుమ్పల్లం - శ్రీ నాగనాథస్వామి (60 km)
ఈ ఐదు శిఖరాలు శివుని నివాసాలు
కైలాస మానసరోవరం (టిబెట్): టిబెట్-చైనా యొక్క ప్రాంతంలోని నగరి ప్రిఫెక్చర్లో ఉంది.
ఆది కైలాస (ఉత్తరాఖండ్): కుమావున్ ప్రాంతంలో, కైలాస మానసరోవర్ నుండి దాదాపు 50 కి.మీ దూరంలో ఉన్న ఆది కైలాస పర్వతం కైలాస పర్వతం యొక్క ప్రతిరూపంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర శిఖరం వద్ద శివుడు ధ్యానం చేసి యోగాభ్యాసం చేశాడని నమ్ముతారు, అందుకే ఆయనకు ఆది యోగి అని పేరు వచ్చింది. కైలాస మానసరోవర్ నుండి ప్రారంభమైన శివుడు మరియు మాతా పార్వతి వివాహ ఊరేగింపు త్రియుగినారాయణ ఆలయం వైపు వెళ్లే ముందు ఇక్కడ ఆగింది. పార్వతి సరోవర్ సరస్సుతో పాటు శివుడు మరియు మాతా పార్వతికి అంకితం చేయబడిన ఆలయం ఆది కైలాస శిఖరం సమీపంలో ఉంది.
మణి మహేష్ (హిమాచల్ ప్రదేశ్): చంబా జిల్లాలో ఉన్న మణి మహేష్‌ను పార్వతితో వివాహం తర్వాత శివుడు సృష్టించాడని నమ్ముతారు. పర్వత శిఖరంపై ఉన్న ఒక రాతి నిర్మాణం శివలింగాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనిని శివుని స్వరూపంగా భావిస్తారు. శివుడు ఏడు వందల సంవత్సరాలుగా తపస్సు చేశాడని నమ్ముతారు.
కిన్నౌర్ కైలాస (హిమాచల్ ప్రదేశ్): కిన్నౌర్ జిల్లాలో ఉన్న కిన్నౌర్ కైలాసం శివుడు పార్వతిని కలిసిన ప్రదేశంగా నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం, శివుడు ప్రతి శీతాకాలంలో కిన్నర్ కైలాస శిఖరంపై హిందూ దేవతల సమావేశాన్ని నిర్వహించేవాడు. మహాభారతం ప్రకారం, అర్జునుడికి ఇక్కడ శివుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడని నమ్ముతారు. కిన్నర్ కైలాసంలోని ఈ శివలింగం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది, దీనిలో ఇది రోజంతా అనేకసార్లు రంగు మారుతుంది. సూర్యోదయానికి ముందు తెల్లగా; సూర్యోదయం తర్వాత పసుపు రంగులో; సూర్యాస్తమయం తర్వాత ఎరుపు రంగులో; మరియు రాత్రి నల్లగా ఉంటుంది.
శ్రీఖండ్ మహాదేవ్ (హిమాచల్ ప్రదేశ్): కులు జిల్లాలోని జౌన్ గ్రామంలో ఉంది మరియు శ్రావణ మాసంలో మాత్రమే యాత్రికులకు అందుబాటులో ఉంటుంది. శ్రీఖండ్ మహాదేవ్ వద్ద ఉన్న శివలింగం 75 అడుగుల ఎత్తులో ఉంది మరియు ఇది అతిపెద్ద శివలింగాలలో ఒకటి. శ్రీఖండ్ కైలాస శిఖరం సమీపంలో పార్వతి, గణేశుడు మరియు కార్తీక్ విగ్రహాలు కూడా ఉన్నాయి.
శిరోగయ -- శ్రీ విష్ణుపాద, మంగళగౌరి దేవి ఆలయాలు
పాదగయ -- శ్రీ కుక్కుటేశ్వర స్వామి, పురుహూతికా దేవి ఆలయాలు
గయా క్షేత్రాలు ప్రధానంగా పితృదేవతల తర్పణాలకు సంబంధించినవి. గయాసురుడు శరీరం పవిత్రమైనదిగా, విష్ణువు వరమివ్వడంతో ఈ ప్రాంతాలు పితృదేవతలను తరింపజేసే ప్రదేశాలుగా పరిగణించబడ్డాయి. ఇక్కడ పిండదానం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుందని నమ్ముతారు.
శ్రాద్ధ కర్మ: పిండ దానం ( ఆత్మకు శాంతి మరియు విముక్తిని పొందడానికి బియ్యం ముద్దలను సమర్పించడం) మరియు తర్పణం (పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నువ్వులు, బార్లీ మరియు దర్భ గడ్డి కలిపిన నీటిని సమర్పించడం), బ్రాహ్మణులకు ఆహారం మరియు దానధర్మాలు.
పృథ్వీ లింగం (కంచి): శ్రీ ఏకాంబరేశ్వర స్వామి-- పార్వతీదేవి ఇసుకతో శివలింగం తయారు చేసి అందులో ఐక్యం అయ్యిందనీ స్థలపురాణం చెబుతోంది. మట్టితో తయారయింది కాబట్టి ఈ లింగాన్ని నీటితో అభిషేకించరు. మల్లెపూలతో అర్చిస్తారు. ఇక్కడి అమ్మవారు కామాక్షీదేవి.
జల లింగం (జంబుకేశ్వరం): శ్రీ జంబుకేశ్వర స్వామి-- ఇక్కడి లింగం క్రిందిభాగం నుంచి నీరు ఊరుతుంటుంది. ఇక్కడి గర్భగుడి ముఖద్వారం ఎత్తు నాలుగే అడుగులు. ఈ క్షేత్రంలో అమ్మవారు అఖిలాండేశ్వరీ దేవి. ఇక్కడ శివుడు అమ్మవారికి జ్ఞానోపదేశం చేశాడంటారు. వారిరువురి మధ్య గురుశిష్య సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ శివపార్వతుల కల్యాణం జరగదు.
అగ్ని లింగం (అరుణాచలం): శ్రీ అరుణాచలేశ్వర స్వామి-- బ్రహ్మ, విష్ణువులు 'ఎవరుగొప్ప' అని వాదించుకుంటుండగా ఆ సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంగా వెలసింది ఇక్కడేనట. అలా వెలసినందుకే ఈ అరుణాచలం చుట్టూ ప్రదిక్షణలు చేస్తే సాక్షాత్తూ ఆ స్వామి ప్రదక్షిణ చేసినట్టే అంటారు. అరుణాచలం గురించి ఆలోచిస్తే చాలు మోక్షం లభిస్తుందట.
వాయు లింగం (శ్రీకాళహస్తి): శ్రీ కాళహస్తీశ్వర స్వామి-- లింగం నలుపలకలుగా తెల్లగా ఉంటుంది, ఎదురుగా ఉన్న దీపాలు గాలికి రెపరెపలాడుతుంటాయట. అభిషేకాలన్ని ఉత్సవమూర్తికే జరుగుతాయి.
ఆకాశ లింగం (చిదంబరం): శ్రీ చిదంబరేశ్వర స్వామి-- ఇక్కడ గర్భగుడిలో స్వామి మూడు రూపాలలో ఉంటాడట. సంపూర్ణ మానవరూపంతో ఉండే నటరాజస్వామి. స్పటిక రూపంలో ఉంటే చంద్రమౌళీశ్వర స్వామి. ఇక మూడోది నిరాకారం. ఇక్కడ స్వామి తన దేవేరితో కలసి నిత్యం ఆనందతాండవం చేస్తాడని చెబుతారు.
కనక సభ--ఆనంద తాండవం: శ్రీ నటరాజస్వామి ఆలయం
రజత సభ--సంధ్యా తాండవం: శ్రీ మీనాక్షి సుందరేశ్వర ఆలయం
తామ్ర సభ--ముని తాండవం: శ్రీ వేణు వననాదేశ్వర ఆలయం
రత్న సభ--కాలితాండవం: శ్రీ వదరణ్యేశ్వర ఆలయం
చిత్ర సభ--త్రిపుర తాండవం: శ్రీ కుట్రాలీశ్వర ఆలయం
ఈ సభలు శివుడి యొక్క విశ్వ నృత్యం యొక్క ఐదు దశలను సూచిస్తాయి, అవి సృష్టి, స్థితి, విధ్వంసం, నమూనాని తిరిగి సృష్టించడం మరియు విడుదల అని నమ్ముతారు. నటరాజ నృత్యం కేవలం ఒక నృత్యం కాదు, విశ్వం యొక్క చలనాన్ని సూచించే ఒక దివ్యమైన ప్రక్రియ.
చిదంబర ఆలయం లోని సభలు
చిత్ సభ: ప్రధాన మందిరం గర్భగుడిలో నటరాజ స్వామి విగ్రహం ఉంది.
కనక సభ: నటరాజ స్వామి నృత్యానికి వేదిక.
నృత్య సభ: నృత్యం, సంగీతం మరియు ఇతర కళలకు అంకితం చేయబడింది.
దేవ సభ: దేవతలు మరియు దేవతల నివాసానికి అంకితం చేయబడింది.
రాజ సభ: ఆలయం యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద రాజులు మరియు రాజప్రతినిధుల కోసం.
కేదార్నాథ్ (ఎద్దు మూపురం):
తుంగ నాథ్ (ఎద్దు కాళ్ళు):
రుద్ర నాథ్ (ఎద్దు ముఖం):
మధ్య మహేశ్వర్ (ఎద్దు నాభి భాగం):
కల్పేశ్వర్ (ఎద్దు జుట్టు): ఏడాది పొడవునా అందుబాటులో ఉన్న ఆలయం.
జ్యోతిర్లింగ స్త్రోత్రం
సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్, ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్, సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే, హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.
సోమనాథుడు - విరవల్ రేవు, ప్రభాస్ పటాన్, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్ - దీనిని ప్రభాస్ క్షేత్రం అంటారు. చంద్రునిచే ఈ లింగం ప్రతిష్ఠింపబడిందని స్థలపురాణం.
మల్లికార్జునుడు - శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ - ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటి. ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి.
మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్ - క్షిప్రానది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 84 సిద్ధ లింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి.
ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరం, మధ్య ప్రదేశ్ - నర్మద (రేవా) నదీతీరాన వెలసింది. ఇక్కడ ఒకే లింగం రెండు బాగాలుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతుంది. అమ్మవారు అన్నపూర్ణ.
వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవఘర్, బీహార్ - బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపంలో ఉంది. సహ్యాద్రి కొండల అంచునుంది. అమృతమధనానంతరం ధన్వంతరిని, అమృతాన్ని ఈ లింగంలో దాచిరనీ, సృశించిన భక్తులకు అమృతం లభించుననీ నమ్మకం.
భీమశంకరుడు - డాకిని, భువనగిరి జిల్లా, పూనే వద్ద, మహారాష్ట్ర - చంద్రభాగ (భీమ) నది ఒడ్డున, భీమశంకర పర్వతాలవద్ద - త్రిపురాపుర సంహారానంతరం మహాశివుడు విశ్రాంతి తీసికొన్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు కూడా యున్నవి. మోక్ష కుండము, జ్ఙాన కుండం ఉన్నాయి.
రామేశ్వరుడు - రామేశ్వరం, తమిళనాడు - శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం - కాశీ గంగా జలాన్ని రామేశ్వరంనకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.
నాగేశ్వరుడు (నాగనాథుడు)- (దారుకావనం) ద్వారక వద్ద, మహారాష్ట్ర - ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు.
విశ్వనాథుడు - వారణాసి, ఉత్తర ప్రదేశ్ - కాశీ అని కూడా ప్రసిద్ధం - వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానం - పరమపావన తీర్థం - ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి.
త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర - గౌతమీ తీరాన - ఇక్కడి లింగం చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగాలున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరం ఉంది. కుశావర్త తీర్థం, గంగాధార తీర్థం, వరాహ తీర్థం ముఖ్యమైనవి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థపర్వం పెద్ద పండుగ.
కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్వాల్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో- మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనానికి తెరచి ఉంటుంది.
ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర - (దేవగిరి లోనిదే జ్యోతిర్లింగమని కూడా చెప్పుదురు)
(ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామం చుట్టూ)
సూర్యునిచే ద్రాక్షారామములో శివలింగము ప్రతిష్టించినప్పుడు ఆ ప్రాంతపు ఉష్ణోగ్రత పెరగసాగింది, దీనిని అదుపు చేసేందుకు చంద్రుడు ద్రాక్షారామమునకు అష్టదిక్కులనా శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఇవే అష్ట సోమేశ్వరాలు, వీటితో ద్రాక్షారామమును కలిపి నవలింగాలని అంటారు . ఈ తొమ్మిదింటినీ ఒకే దినమున దర్శించిన పుణ్యము. తూర్పు: కోలంక లో శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామిఈశాన్యం: పెనుమళ్ల లో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఉత్తరం: వెల్ల లో శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వర స్వామి. వాయువ్యం: సోమేశ్వరం లో శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వర స్వామిపడమర: వెంటూరు లో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామినైఋతి: కోరుమిల్లి లో శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామిదక్షిణం: కోటిపల్లి లో శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామిఆగ్నేయం: దంగేరు లో శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి"విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడింది.
అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి కనుమరోజు దర్శనమిచ్చుచున్నారు.
విశ్వేశ్వరుడు- వ్యాఘ్రేశ్వరం (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి): ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివునిగా అవతరించెను.
మహాదేవుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి): విశ్వామిత్రుని తపోభంగము కొరకు ఇంద్రుడు మేనకను పంపగా వారికి శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు వెళ్ళలేక శివుని ప్రార్థించగా ఇచ్చిన శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెను.
త్ర్యంబకుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి): రావణ సంహారం తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయింది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించగా వారి పుష్పకవిమానము ముందుకు కదలెను.
త్రిపురాంతకుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి): తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్థించగా వారిని సంహరించి శివలింగరూపంలో ఆవిర్భవించెను.
త్రికాగ్నికాలుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి): మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడింది.
కాలాగ్నిరుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి): రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను. పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కథనము.
నీలకంఠుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ): దేవతలు, రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషమును ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తన కంఠము నందు నిక్షిప్తము చేసికొని నీలకంఠుడై లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.
మృత్యుంజయుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి): శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను.
సర్వేశ్వరుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి): దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున ప్రతిష్ఠింపబడెను.
సదాశివుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి): పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించివిష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగదారియైన సదాశివుడు ప్రతిష్ఠింపబడెను.
శ్రీమన్మహాదేవుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు): విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించగా సుదర్శన చక్రమును బహూకరించి లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము (పులి) అని అర్ధము. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.
ఏకాదశ రుద్రులు, వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు
1.అజపాదుడు- ధీదేవి
2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి
3.త్ర్యంబకుడు- ఆశనదేవి
4.వృషాకపి- ఉమాదేవి
5.శంభుడు- నియుత్ దేవి
6.కపాలి- సర్పిదేవి
7.దైవతుడు- ఇల దేవి
8.హరుడు- అంబికాదేవి
9.బహురూపుడు- ఇలావతీదేవి
10.ఉగ్రుడు- సుధాదేవి
11.విశ్వరూపుడు- దీక్షాదేవి
తిరువనంతపురం--సుందర మాధవ స్వామి
బద్రీ క్షేత్రంలో - సతోపంత్ నుండి ప్రారంభమై బద్రీనాథ్ నుండి 24 కి.మీ దూరంలో దక్షిణాన నందప్రయాగ వరకు ఉన్న ప్రాంతంలో ఐదు ఆలయాలు:
విశాల్ బదరీ (బద్రీనాథ్)
యోగధ్యాన బదరీ
భవిష్య బదరీ
వృద్ద బదరీ
ఆది బదరీ
లోలార్కాదిత్యుడు
ఉత్తరార్కాదిత్యుడు
సాంబాదిత్యుడు
ద్రౌపతాదిత్యుడు
మయూఖాదిత్యుడు
ఖఖోలకాదిత్యుడు
అరుణాదిత్యుడు
వృద్ధాదిత్యుడు
కేశవాదిత్యుడు
విమలాదిత్యుడు
గంగాదిత్యుడు
యమాదిత్యుడు
స్వయంభూగా వెలిసిన నవ నారసింహ క్షేత్రాలు
యాదగిరిగుట్ట : రుష్యశృంగుని కొడుకు యాద రుషి తపస్సు చేయగా, ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ ఉగ్రరూపం చూడలేక శాంతస్వరూపంతో కనిపించమని కోరగా స్వామి కరుణించి, లక్ష్మీసమేతుడై వెలిసిన ప్రదేశం.
ధర్మపురి : రాక్షసవధ అనంతరం స్వామి తపస్సు చేసి యోగానందుడిగా వెలిసిన ప్రదేశం.
అహోబిలం : నారాయణుడు ఉగ్రనారసింహుడై హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన ప్రాంతం.
సింహాద్రి : వరాహముఖం, మానవా కారం, సింహపుతోకతో వరాహ నరసింహమూర్తులు వెలసిన "సింహాద్రి అప్పన్న".
అంతర్వేది : హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుని సంహారానంతరం వశిష్ఠుడి కోరిక మేరకు లక్ష్మీనృసింహ స్వామిగా వెలిశాడనేది పౌరాణిక గాథ.
మంగళగిరి : కొండ కింద లక్ష్మీనరసింహస్వామి గానూ, కొండమీద ని పానకాల స్వామిగానూ పేర్కొంటారు.
వేదాద్రి : ఇక్కడ జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీనరసింహ, వీర నరసింహస్వామి అవతారాల్లో నరసింహస్వామిని దర్శించుకోవచ్చు.
మాల్యాద్రి : అగస్త్య మహాముని మాల్యాద్రిమీద తపమాచరించగా లక్ష్మీనారసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడు.
పెంచలకోన : హిరణ్యకశిపుని సంహారానంతరం శేషాచల కొండల్లో ఉగ్ర రూపంలో గర్జిస్తూ సంచరిస్తున్న స్వామి చెంచులక్ష్మి ధైర్యసాహసాలు, సౌందర్యానికీ ముగ్దుడై శాంతించాడట.
ఉత్తరాఖండ్‌లోని ఐదు పవిత్ర నదీ సంగమాలు
Manasa Sarovar,
Bindu Sarovar,
Narayana Sarovar,
Pampa Sarovar
Pushkara Sarovar
Ayodhya: The birthplace of Lord Rama.
Mathura: The birthplace of Lord Krishna.
Dwarka: The city where Lord Krishna spent his later years.
Haridwar: Ganges River emerges from the hills into the plains.
Varanasi: Also known as Kashi, the city is considered a sacred place for Hindus, particularly those who are devoted to Lord Shiva.
Kanchipuram: Often called the "city of temples" or "Kashi of the South," it is home to numerous Shaiva and Vaishnava temples.
Ujjain: The location of the Mahakaleshwar Jyotirlinga and the site of the Maha Kumbh Mela.
(తమిళనాడు లోని)
తిరుపరంకుండ్రం
తిరుచెందూర్
పళని
స్వామిమలై
తిరుత్తణి
పజముదిర్చోలై
Mayureshwar (Morgaon),
Siddhivinayak (Siddhatek),
Ballaleshwar (Pali),
Varadavinayak (Mahad),
Chintamani (Theur),
Girijatmaj (Lenyadri),
Vighneshwar (Ozar)
Mahaganapati (Ranjangaon).
తుల్యభాగానది (జమదగ్ని): ధవిళేశ్వరము నుండి చొల్లంగి వరకు
ఆత్రేయ (అత్రిముని): కపిలేశ్వరపురం నుండి కోరంగి వరకు
భరద్వాజ (భరద్వాజుడు): కపిలేశ్వరపురం నుండి తీర్ధాలమొండి వరకు
గౌతమి (గౌతముడు): త్రయంబకం నుండి బ్రహ్మసంవేద్యం (తీర్ధాలమొండి) వరకు
కాశ్యప/వృద్ధగౌతమి (కశ్యపుడు): ముక్తేశ్వరం నుండి తీర్ధాలమొండి వరకు
కౌశిక (విశ్వామిత్రుడు): మందపల్లి నుండి బెండమూర్లంక వరకు
వశిష్ట (వశిష్ఠుడు): విజ్జేశ్వరం నుండి అంతర్వేది వరకు
వైనతేయ (వైనతేయుడు): లంకలగన్నవరం నుండి గోగన్నమఠం వరకు