ఆధ్యాత్మికత
వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ |
అమందానందసందోహం బంధురం సింధురాననం ||
వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ |
అమందానందసందోహం బంధురం సింధురాననం ||
చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికి, గొప్ప కీర్తి, మేరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికీ,
గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ,
గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
నీవు ఆరు అంగములలోను, నాలుగు వేదములలోను, పారంగతుడవైనా కాని, గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన గాని,
గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
నిన్ను విదేశములో గొప్పగా, స్వదేశములో ధనవంతునిగా, సదాచార వృత్తి గలిగి జీవించువాడవని పొగడబడినా,
గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
నీవు ఒక దేశానికి రాజువైనా, ఎందరో రాజులు, రారాజులు నీ పాదాలు సేవించినను,
గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినా, ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ,
గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము నందు నీవు శ్రద్ధ చూపనప్పటికీ,
గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
అడవిలో, ఇంటిలో ఉండాలని కోర్కెలేని వారైనా, ఏదైనా సాధించాలని గాని, తన వంటి మీద శ్రద్ధగాని లేని వారైన గాని,
గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైడూర్యాలు సదా అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా ,
గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
ఆది శంకరాచార్య విరచిత నిర్వాణ శటకం సంస్కృతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్లోకాలలో ఒకటి.
మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రె |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తము కూడా కాదు. నేను పంచేంద్రియాలైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా కాదు. నేను పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం కూడా కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
నచ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ||
కీలకమైన ప్రాణాన్ని నేను కాదు. పంచవాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానలు) నేను కాదు, సప్త ధాతువులు (రక్త, మాంస,మేదో,ఆస్థి,మజ్జా,రస,శుక్రములు) నేను కాదు. పంచకోశాలు (అన్నమయ,ప్రాణమయ,మనోమయ, విజ్ఞ్యానమయ, ఆనందమయ) నేను కాదు. కర్మేంద్రియాలు (వాక్కు,పాణి,పాద,పాయు,ఉపస్థ) నేను కాదు.నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాలో రాగద్వేషములు లేవు, లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న మే మృత్యు ర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న చ సంగతం నైవ ముక్తిర్ న మేయ:
చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను, నాకు మోక్షము లేదు, బంధము లేదు, నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని, నేను శివుడిని.
రుద్రాష్టకం
గోస్వామి తులసీదాసు రచించిన రుద్రాష్టకం ఒక భక్తి గీతం. రామ చరిత్ మానస్ యొక్క ఉత్తర కాండలో ఋషి లోమాషా తన శిష్యుడిని శివ శాపం నుండి విముక్తి చేయడానికి రచించాడు.
నమా మీశ మీశాన నిర్వాణ రూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం |
నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీగం
చిదాకాశ మాకాశవాసం భజేహం || ౧ ||
నిరాకారమోంకార మూలం తురీయం
గిరాజ్ఞాన గోతీ తమీశం గిరీశం |
కరాలం మహాకాలకాలం కృపాలం
గుణాగార సంసార పారం నతోహం || ౨ ||
తుషారాద్రిసంకాశ గౌరం గభీరం
మనో భూత కోటి ప్రభాసీ శరీరమ్ |
స్పురన్మౌళి కల్లోలినీ చారుగంగా
లసత్ బాల బాలేందు కంఠే భుజంగమ్ || ౩ ||
చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం
ప్రసన్ననాననం నీలకంఠం దయాళం |
మృగాదీశ చర్మాంబరం ముండమాలం
ప్రియం శంకరం సర్వనాథం భజామి || ౪ ||
ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేషామ్
అఖండం భజే భానుకోటి ప్రకాశం |
త్రయహశూల నిర్మూలనం శూలపాణిం
భజేయహం భవానీపతిం భావగమ్యం || ౫ ||
కళాతీత కళ్యాణ కల్పాంత కారి
సదా సజ్జనానంద దాతా పురారి |
చిదానంద సందోహ మోహాపహారి
ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారి || ౬ ||
న యావత్ ఉమానాథ పాదారవిందం
భజంతీహ లోకే పరే వా నరాణామ్ |
న తావత్సుఖం శాంతి సంతాపనాశం
ప్రసీద ప్రభో సర్వభూతాదివాసమ్ || ౭ ||
న జానామి యోగం జపం నైవ పూజాం
నతోహం సదా సర్వదా శంభుః తుభ్యమ్ |
జరా జన్మ దుఃఖౌ ఘతాతప్య మానం
ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో || ౮ ||
రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతుష్టయే
యే పఠంతి నరా భక్త్యాతేషాం శంభుః ప్రసీదతి
మధురాష్టకం వల్లభాచార్యచే స్వరపరచబడిన శ్రీకృష్ణుని భక్తి గీతం. శ్రీ కృష్ణుడు స్వయంగా ప్రత్యక్షమైనప్పుడు స్వామిని స్తుతిస్తూ రచించాడని ప్రతీతి.
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || ౧ ||
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్ |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || ౨ ||
వేణుర్మధురో రేణుర్మధురః
పాణిర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || ౩ ||
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || ౪ ||
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురమ్ |
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || ౫ ||
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || ౬ ||
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురమ్ |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || ౭ ||
గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || ౮ ||
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౧ ||
బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౨ ||
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౩ ||
నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౪ ||
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
మాయాశక్తివిలాసకల్పితమహావ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౫ ||
రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోzభూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౬ ||
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౭ ||
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౮ ||
భూరంభాంస్యనలోzనిలోzంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౯ ||
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్ || ౧౦ ||
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
రవి
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
(ప్రతి ఆదివారం సూర్య గాయత్రి 9 సార్లు జపించాలి)
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్
చంద్ర
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
(ప్రతి సోమవారం చంద్ర గాయత్రి 9 సార్లు జపించాలి)
ఓం అమృతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
కుజ
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
(ప్రతి మంగళవారం కుజ గాయత్రి 9 సార్లు జపించాలి)
ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.
బుధ
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
(ప్రతి బుధవారం బుధ గాయత్రి 9 సార్లు జపించాలి)
ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.
గురు
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
(ప్రతి గురువారం గురు గాయత్రి 9 సార్లు జపించాలి)
ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.
శుక్ర
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
(ప్రతి శుక్రవారం శుక్ర గాయత్రి 9 సార్లు జపించాలి)
ఓం భృగువాస జాతాయ విద్మహే శ్వేతవాహనాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.
శని
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
(ప్రతి శనివారం శని గాయత్రి 9 సార్లు జపించాలి)
ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.
రాహు
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
(ప్రతి రోజు రాహు గాయత్రి 9 సార్లు జపించాలి)
ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.
కేతు
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్
(ప్రతి రోజు కేతు గాయత్రి 9 సార్లు జపించాలి)
ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.
గ్రహాధిపతులు: సూర్యుడికి అగ్ని, చంద్రుడికి వరుణుడు, కుజుడికి కుమారస్వామి, బుధుడికి విష్ణువు, గురువుకు ఇంద్రుడు, శుక్రుడికి శచీదేవి, శనికి బ్రహ్మ.
రుచులకు అధిపతులు: సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరుకు.
హారతి
హో దేవి
అతి మహిమా యుతే భైరవీ
సదా రౌద్ర వదన యుత మూర్తే
స్వి కురుమం తవ నిసీమ కరుణా కటాక్షే
సవినయం తవ పావన మహాశక్తి రూపే సమర్పణమ్ ॥
స్తుతి
జై భైరవీ దేవి గురుబ్యో నమః శ్రీ
జై భైరవీ దేవి స్వయంభో నమః శ్రీ
జై భైరవీ దేవి స్వధారిణి నమః శ్రీ
జై భైరవి దేవి మహా కళ్యాణి నమః శ్రీ
జై భైరవి దేవి మహా బధ్రాణి నమః శ్రీ
జై భైరవీ దేవి మహేశ్వరి నమః శ్రీ
జై భైరవీ దేవి నాగేశ్వరి నమః శ్రీ
జై భైరవీ దేవి విశ్వేశ్వరి నమః శ్రీ
జై భైరవీ దేవి సోమేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి దుఃఖ సంహారీ నమః శ్రీ
జై భైరవీ దేవి హిరణ్య గర్భిణి నమః శ్రీ
జై భైరవీ దేవి అమృత వర్షిణి నమః శ్రీ
జై భైరవీ దేవి భక్త రక్షిణి నమః శ్రీ
జై భైరవీ దేవి సౌభాగ్య దాయిని నమః శ్రీ
జై భైరవీ దేవి సర్వ జననీ నమః శ్రీ
జై భైరవి దేవి గర్భ దాయిని నమః శ్రీ
జై భైరవి దేవి శూన్య వాసిని నమః శ్రీ
జై భైరవీ దేవి మహా నందిని నమః శ్రీ
జై భైరవీ దేవి వామేశ్వరి నమః శ్రీ
జై భైరవి దేవి కర్మ పాలిని నమః శ్రీ
జై భైరవీ దేవి యోనీశ్వరీ నమః శ్రీ
జై భైరవి దేవి లింగ రూపిణి నమః శ్రీ
జై భైరవి దేవి శ్యామ సుందరి నమః శ్రీ
జై భైరవీ దేవి త్రినేత్రీ నమః శ్రీ
జై భైరవి దేవి సర్వ మంగళి నమః శ్రీ
జై భైరవీ దేవి మహాయోగిని నమః శ్రీ
జై భైరవీ దేవి క్లేశ నాశిని నమః శ్రీ
జై భైరవి దేవి ఉగ్ర రూపిణి నమః శ్రీ
జై భైరవీ దేవి దివ్య కామిని నమః శ్రీ
జై భైరవీ దేవి కాల రూపిణి నమః శ్రీ
జై భైరవీ దేవి త్రిశూల ధారిణి నమః శ్రీ
జై భైరవి దేవి యక్ష కామిని నమః శ్రీ
జై భైరవీ దేవి ముక్తి దాయిని నమః శ్రీ
ఓం మహాదేవి లింగ భైరవి నమః శ్రీ
ఓం శ్రీ శాంభవి లింగ భైరవి నమః శ్రీ
ఓం మహా శక్తి లింగ భైరవి నమః శ్రీ
నమః శ్రీ నమః శ్రీ దేవీ నమః శ్రీ
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః