వీర హనుమాన్ in Chandamama of the mid 1970s

Qk.ly: http://bit.ly/gssxCmVH

This serial in the Chandamama of the 1970s inspired me at the right age. The cover paintings by Sri వడ్డాది పాపయ్య గారు still evoke fond memories. Recently, ran into the Telugu archives of Chandamama and felt that this lovely serial (వీర హనుమాన్) should be shared. The work was done completely in my Samsung Chromebook.

Please click the images to open the relevant issue in a new tab/window. The serial starts around page 50. So you could jump to that page and hunt around.

ఏడాది

1974

1975

1976

1977

1978

జనవరి

ఫిబ్రవరి

మార్చి

ఎప్రిల్

మే

జూన్

జూలై

ఆగస్టు

సెప్టెంబర్

ప్రారంభం

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

JAN.1975
FEB.1975
MAR.1975
APR.1975
MAY.1975
JUN.1975
JUL.1975
AUG.1975
SEP.1975

సమాప్తం

Please click the images to open the relevant issue in a new tab/window. The serial starts around page 50. So you could jump to that page and hunt around.

శ్రీ ఆంజనేయ దండకం (Sri Anjaneya Dandakam)

Download the MP3 (sung by Sri SP Balu గారు),

which follows the text below to a large extent

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే

రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ

సంకీర్తనల్ జేసి, నీరూపు వర్ణించి, నీమీదనున్ దండకం బొక్కటిన్ జేయనూహించి,

నీమూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి, నీదాసదాసుండనయ్, రామభక్తుండనై, నిన్ను

నేగొల్చెదన్, నీకటాక్షంబునన్ జూపుమా!, వేడుకల్ జేయుమా!, నామొరాలించుమా!,

నన్ను రక్షించుమా!, అంజనాదేవి గర్బాన్వయా! దేవ!‌ నిన్నెంచ నేనంతవాడన్

దయాశాలివై జూడుమా!, దాతవయ్ బ్రోవుమా!, దగ్గరన్నిల్వుమా!, తొల్లి సుగ్రీవుకున్

మంత్రివయ్, స్వామికార్యర్థివైయుండి, శ్రీరామ సౌమిత్రులం జూచి, వారిన్విచారించి,

సర్వేశు పూజించి, యబ్భానుజన్ బంటుగావించి, యవ్వాలిన్జంపి, కాకుత్థ్స తిలకున్

దయా దృష్టి వీక్షించి, కిష్కింధకేతెంచి, శ్రీరామకార్యార్థివై లంకకేతెంచియున్, లంకిణిన్

జంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, నాయుంగ

రంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి సంతోషమున్ గూర్చి, సుగ్రీవుడున్

అంగదజాంబవంతాది నీలాదులన్ గూడి, యాసేతువున్ దాటి, వానరానీకముల్ మూక

పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా, రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై, బోరి,

బ్రహ్మాండమైనట్టి యాశక్తియున్ వేసి, యాలక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడేబోయి

సంజీవియున్ దెచ్చి, సౌమిత్రికిన్నిచ్చి, ప్రాణంబు రక్షించగా, కుంభకర్ణాది వీరాళితోపోరి

చండాడి, శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా, నంతలోకంబు

లానందమైయుండ యవ్వేళలన్ యవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు

జేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతోజేర్చి, నంత నయోధ్యకున్ వచ్చి,

పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ కూర్మిలేరంచు మన్నించినన్

శ్రీరామభక్తి ప్రశస్తంబుగానిన్ను నీనామ సంకీర్తనల్ జేసితే పాపముల్ బాయవే?

భయములున్ దీరవే? భాగ్యముల్ గల్గవే? సకల సామ్రాజ్యముల్ సర్వ సంపత్తులున్

గల్గవే? యోవానరాకార! యో భక్తమందార! యో పుణ్యసంచార! యో ధీర! యో

వీర! యో శూర! నీవేసమస్తంబు నీవే మహాఫలమ్ముగా వెలసి, యా తారకబ్రహ్మ

మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి శ్రీరామయంచున్

మనఃపూతమై నెల్లప్పుడున్ తప్పకన్ దలతు నాజిహ్వయందుండుమా! వాత, పిత్త,

కఫ, హ్రుద్రోగాదిమహావ్యాధులన్, చోరాది దుందగులభయంబునుం బావుమా!

నీదీర్ఘదేహన త్రెలోక్య సంచారివై రామనామాంకితధ్యానివై, బ్రహ్మవై, బ్రహ్మతేజంబునన్

రౌద్రనిజ్వాల కల్లోల హా వీర హనుమంత ఓంకార, హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేత

పిశాచ శాకినీ ఢాకినీ మోహినీగాలి దయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి

నేలంబడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్

ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై మసలుమా! బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్యతేజంబునుం

జూపుమా! రా! రా! నా ముద్దు హనుమంత! యంచున్, నిను బిలుతు దయాదృష్టి

వీక్షించి నన్నేలు నా స్వామి! నమస్తే సదా బ్రహ్మచారీ! నమస్తే ప్రపూర్ణార్తిహారీ!‌ నమో

వాయుపుత్రా! నమస్తే, నమస్తే, నమస్తే, నమః