వ్యాధి తీవ్రమైనప్పుడు
వ్యాధిబారిన పడిన 20 శాతం మందికి షాక్ రావొచ్చు (అంటే, తలతిరగడం, నాడి హీనత, సొమ్మసిల్లి పడిపోవడం జరగవచ్చు). చాల వరకు నిమోనియా లక్షణాలు (ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, జ్వరం, దగ్గు, గొంతు పుండు) ఉన్న70 సంవత్సరాలు పైబడిన వారికి ఇది జరుగుతుంది. లేదా, ఎవరికైతే చికిత్స పొందినా తగ్గని ఇతర వ్యాధులు (హుద్రోగం, B.P., మధుమేహం) ఉన్నవారు అవ్వొచ్చు.
ఎవరికైనా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, అంబులెన్స్ ని పిలిపించి వీలైనంత త్వరగా ఆస్పత్రిలో చేర్పిస్తే, అనుభవం ఉన్న వైద్య నిపుణులు అవసరమైన చికిత్స - ఆస్పత్రిలోనే ఉంచటం, యాంటీ బయోటిక్స్ లేదా, అవసరమైతే ఆక్సిజెన్ ఇవ్వడం - చేస్తారు.
జాగ్రత్తల సూచిక 2 కొరోనా వైరస్ చేతులకి అంటకుండా ఎట్లా చేసుకోవాలంటే