ఏ. వి. కళాశాల మార్చి 5&6 తేదీల్లో ‘ఆవిష్కార్ 2020’ పేరుతో నిర్వహించిన పోటీలలో శాఖ విద్యార్థులు పాల్గొన్నారు. అసు కవిత, స్టోరీ టెల్లింగ్, మోనోలాగ్, మిమిక్రీ వంటి పోటీల్లో నాగరాజు (ఎం.ఏ. ద్వితీయ సంవత్సరం) అనే విద్యార్థి వరుసగా ప్రథమ, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి బహుమతులను గెలుచుకున్నారు.
గీతమ్ విశ్వవిద్యాలయంవారు ‘స్ట్రెస్ మేనేజ్మెంటు’ (ISMA Conferance) శీర్షికతో నవంబర్ 29&30న నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో 25 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
Batukamma celebrations on 01 October-2019 by Cultural committee, A.V. College. Departmen of telugu won best batukamma prize.
1. 19మే, 2018 నాడు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ మరియు ఇండియా యూత్ ఫర్ సొసైటీ వారు ఏ.వి. కళాశాలలో “A work shop on plastic pollution free city” అనే అంశంపై నిర్వహించిన కార్యశాలలో మా విద్యార్థులు పాల్గొన్నారు.
వారం వారం సాహిత్య పుటల సమీక్షలో భాగంగా ఎం.ఏ. ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రతీ సోమవారం దినపత్రికల్లో వచ్చే సాహిత్య పుటలను సమీక్షిస్తారు.
విద్యార్థులకు జాతీయ సదస్సులు నిర్వహించే పద్ధతులను పరిచయం చేసే క్రమంలో విద్యార్థులే నిర్వాహకులుగానూ, పత్ర సమర్పకులుగానూ పాల్గొన్నారు.
1. 11మే, 2018 నాడు జరిగిన కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో తెలుగు శాఖ విద్యార్థులు పాల్గొని, బహుమతులు గెలుచుకున్నారు.
1. స్నాతకోత్తర తెలుగు శాఖ విద్యార్థులు 25 ఫిబ్రవరి, 2018 నాడు ‘అక్షర సైన్యం’ కవయిత్రుల కవి సమ్మేళనంలో ‘గోడలు’ అనే అంశంపై కవిత్వాన్ని వినిపించారు.
1. కావ్య పరీమళం పేరుతో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రతి నెల రెండవ శుక్రవారం నిర్వహించే ప్రాచీన కావ్య పరిచయ సమావేశాలకు అధ్యాపకులు, విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.
5 సెప్టెంబర్,2018నాడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు శాఖ ముందుగల ఆవరణంలో మొక్కలు నాటి పరిసరాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ధారు.
1. 18 నవంబర్, 2018 నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరబాదులో జరిగిన తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలకు హాజరయ్యారు.
1. 21-7-2018 నాడు మూసీ పత్రిక ప్రతి నెలా మొదటి శనివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సాహిత్య కార్యక్రమంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎమ్. అలివేణి పాల్గొని ‘గంగమ్మ’ అనే కవితను చదివారు.
31 ఆగస్టు, 2019 నాడు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు ఓయూ సాహిత్య వేదిక నిర్వహించిన సిద్ధాంత గ్రంథ రచన మెలకువలు అనే అంశంపై మాట్లాడిన సదస్సులో పాల్గొన్నారు.
21, 22 ఆగస్టు, 2019 నాడు బి.ఎస్. రాములు-సాహితీ సమాలోచన అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న తెలుగు శాఖ విద్యార్థులు.
21, 22 ఆగస్టు, 2019 నాడు బి.ఎస్. రాములు-సాహితీ సమాలోచన అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న తెలుగు శాఖ విద్యార్థులు.
. తెలంగాణ ప్రభుత్వం 15-19 డిసెంబర్, 2017న ఐదు రోజులపాటు నిర్వహించిన ‘ప్రపంచ తెలుగు మహాసభ’ల్లో పాల్గొన్నాం. తెలుగు శాఖ విద్యార్థులు ‘స్వచ్ఛంద కార్యకర్తలు’గా పాల్గొని, నిర్వాహకులచేత మన్ననలు పొందారు. పాల్గొన్నందుకుగానూ నిర్వాహకులు విద్యార్థులకు ద్రువీకరణ పత్రాలను అంజేసారు.
Batukamma celebrations in October-2018 by Cultural committee, A.V. College. Departmen of telugu won best batukamma prize.
తెలుగు శాఖ విద్యార్థులు తాము రాసిన కవితలను "కాలం కిటికీలోంచి..." అనే కవితా సంకలనంగా ఏ.వి. విద్యాసంస్థ వజ్రోత్సవ సందర్భంగా వెలువరించారు.