స్నాతకోత్తర తెలుగు శాఖ
స్నాతకోత్తర తెలుగుశాఖ గురించి
కొండా వెంకట రంగారెడ్డి, రాజా బహద్దూర్ వెంకట్రామా రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, , నాగులపల్లి కోదండ రామారావు, జె. వి.నర్సింగరావు వంటి మహామహుల భాషా సాంస్కృతిక స్వప్నాలకు సాకారం ఆంధ్ర విద్యాలయం. నిజాం నిరంకుశత్వాన్ని ప్రతిఘటించి , తెలుగు భాషా మాధ్యమంలో బోధించేందుకు 1944 లో పాఠశాల ప్రారంభమైంది. 1968 లో డిగ్రీ స్థాయి కోర్సులను, 1990 లో పి. జి. స్థాయి కోర్సులను, 1997లో స్నాతకోత్తర తెలుగుశాఖను ఏర్పాటుచేసింది. ఆనాటి నుంచి ఒక విలక్షణమైన మార్గంలో ముందుకు సాగుతుంది. సదస్సుల సంచికలను పుస్తకరూపంలో ప్రచురించి విద్యార్థుల ప్రయోజనాన్ని నెరవేర్చింది. సాహితీ వేత్తల ప్రశంసలందుకుంది.
ఆంధ్ర విద్యాలయ స్నాతకోత్తర తెలుగు శాఖ విద్యార్థులలో సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించటానికి, వివిధ సాహిత్య ప్రక్రియలపై అవగాహన కలిగించే అనేక కార్యక్రమాలను చేస్తుంది. సాహిత్య రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో స్నాతకోత్తర తెలుగు తమ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. స్నాతకోత్తర తెలుగుశాఖ ఏర్పడిన నాటి నుంచి ఈ కింది జాతీయ సదస్సులను నిర్వహించింది.
1. దువ్వూరి రామిరెడ్డి సాహిత్య సమాలోచన
2. అభ్యుదయ కవితావైతాళికుడు శ్రీ శ్రీ
3. ఆధునిక సాహిత్య విమర్శరీతులు
4. ఆధునిక సాహిత్య విమర్శకులు-ప్రస్థానాలు
5. తెలుగు నవల, కథ-విస్తృతి వికాసం వైవిధ్యం
6. దేవులపల్లి రామానుజరావు సాహిత్య సమాలోచన
7. కవితా కార్యశాల (15మార్చి, 2017)
8. తెలుగు సామెతలు- సమగ్ర సమాలోచన (6&7ఫిబ్రవరి, 2020)