Dept. Activities

1. 17-7-2018 నాడు ఆచార్య రావికంటి వసునందన్ గారు రాసిన ‘కవిత్వ కల్ప తరువు-విశ్వనాథ, ‘వనదేవతలు’ అనే రెండు పుస్తకాల ఆవిష్కరణను నిర్వహించాం.


27, 28 ఫిబ్రవరి, 2017 దేవులపల్లి రామానుజరావు-సాహిత్య సమాలోచన’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించాం.

1. స్నాతకోత్తర తెలుగు శాఖ, ఏ.వి. కళాశాల, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త నిర్వహణలో ‘కవితా కార్యశాల’ 15 మార్చి, 2018నాడు నిర్వహించింది.

1. తెలుగు భాష ప్రాచీనత- విశిష్టత” అనే అంశంపై ఆచార్య టి. గౌరీ శంకర్ గారిచే స్నాతకోత్తర తెలుగు శాఖ 27 నవంబర్, 2018 నాడు విస్తృతోపన్యాసాన్ని ఏర్పాటుచేసింది.

1. “తెలుగు వ్యాకరణ ప్రయోజనం- పద నిర్మాణం” అనే అంశంపై డా. వై. రామకృష్ణారావు గారిచే స్నాతకోత్తర తెలుగు శాఖ 04 డిసెంబర్, 2018 నాడు విస్తృతోపన్యాసాన్ని ఏర్పాటుచేసింది.

1. వట్టికోట ఆళ్వారు స్వామి- జీవితం, రచనలు” అనే అంశంపై డా. అమ్మంగి వేణుగోపాల్ గారిచే స్నాతకోత్తర తెలుగు శాఖ 30 అక్టోబర్, 2018నాడు విస్తృతోపన్యాసాన్ని ఏర్పాటుచేసింది.

ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా 18నవంబర్, 2017న పి. జి. సెంటర్‌లో అన్ని శాఖల విద్యార్థులను ఆహ్వానించి, వచన కవిత, పద్య పఠన పోటీలు నిర్వహించాం. పి. జి. సెంటర్ సంచాలకులు ఆచార్య పి. యాదగిరిరెడ్డి గారి చేతులమీదుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, యోగ్యతా పత్రాలను అందజేసాం.

1. జులై22, 2018 నాడు దాశరథి కృష్ణామాచార్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాం.

కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 9,2018 తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించాం. దీనిలో భాగంగా విద్యార్థులకు వకృత్వ, వ్యాస రచన పోటీలను నిర్వహించి బహుమతులు అందజేసాం

1. 21 ఫిబ్రవరి, 2018నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా ‘తెలుగు భాష వైశిష్ట్యం’ అనే అంశంపై వ్యాస, ఉపన్యాస, కవితా రచన పోటీని నిర్వహించాం. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, యోగ్యతా పత్రాలను అందజేసాం.