✝️ CHRIST LIFE REVIVAL
మనలో క్రీస్తు జీవించాలి • మనం పరిపూర్ణంగా చనిపోవాలి.
❤️ మన హీరో — యేసుక్రీస్తు.
✝️ మన రోల్ మోడల్ — యేసుక్రీస్తు.
మన పోరాటం ఇతరులతో కాదు — మనలోని పాత, రోత, మనలోని పాప స్వభావాలతోనే.
ఇతరులను మార్చడం కాదు — ముందుగా మనమే మారాలి.
ఇతరులను విమర్శించడం కాదు — ముందుగా మనల్ని మనమే విమర్శించుకొని, పరిశీలించుకోవాలి.
కేవలం మాటలతో “నేను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాను” అని చెప్పడం మాత్రమే సరిపోదు.
మన మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, క్షమాపణలో, ఇతరులను ఆదరించే విధానంలో యేసుక్రీస్తు జీవితం కనిపించాలి.
మన పాత స్వభావాలకు మరణించి, క్రీస్తు స్వభావంలో జీవించడమే మన లక్ష్యం.
❤️ నా జీవిత సాక్ష్యం — ఒక జీవితం, రెండు భాషలు.
నా జీవితంలో దేవుని కృప ద్వారా జరిగిన మార్పును, నేను అనుభవించిన సంఘటనలను, ప్రార్థనలో నేర్చుకున్న సత్యాలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పూర్తి జీవిత సాక్ష్యంగా అందించడమే ఈ పరిచర్య ఉద్దేశం.
ఈ సాక్ష్యాన్ని చదివే ప్రతి ఒక్కరూ తమ జీవితాలను దేవుని సన్నిధిలో నిజాయితీగా పరిశీలించుకోవాలని నా ప్రార్థన.
మన జీవితాల్లో క్రీస్తు కనిపించాలి.
మన పాత స్వభావాలు తొలగిపోవాలి.
మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలగాలి.
🙏 మహిమ, ఘనత, స్తుతి నూటికి నూరు శాతం దేవునికే!